africa continent
-
Zambia: నిరుపేద దేశం...సమున్నత లక్ష్యం!
జాంబియా. ఆఫ్రికా ఖండ దక్షిణ భాగంలో ఉండే అత్యంత నిరుపేద దేశం. మూడేళ్ల క్రితం ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అదే... బాల బాలికలందరికీ ఉచిత విద్య. అందులో భాగంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయి దాకా విద్యా వ్యయమంతటినీ ప్రభుత్వమే భరిస్తుంది. జాంబియా వంటి దేశానికి ఇది ఒకరకంగా తలకు మించిన భారమే. మిగతా రంగాల మాదిరిగానే జాంబియాలో విద్యా రంగాన్ని కూడా మౌలిక సదుపాయాల తీవ్ర లేమి పట్టి పీడిస్తోంది. మరోవైపు కాసులకు కటకట. అయినా ఉచిత విద్యా పథకం అమలు విషయంలో అక్కడి ప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదు. పదో తరగతి స్థాయిని దాటినా సజావుగా చదువను, రాయను రాని దుస్థితి నుంచి తమ కాబోయే పౌరులను బయట పడేసి తీరాలని కృతనిశ్చయంతో ఉంది. ఆ లక్ష్యసాధన కోసం గత మూడేళ్లలో విద్యా రంగంపై ఏకంగా 100 కోట్ల డాలర్లకు పైగా వెచి్చంచింది!సమయం ఇంకా ఉదయం ఏడు గంటలే. పైగా చలికాలపు ఈదురుగాలులు ఈడ్చి కొడుతున్నాయి. అయినా సరే, ఆ విద్యార్థులంతా అప్పటికే స్కూలుకు చేరుకున్నారు. తమ క్లాసురూముల వైపు పరుగులు తీస్తున్నారు. అవును మరి. ఏమాత్రం ఆలస్యమైనా బెంచీలపై కూర్చోవడానికి చోటు దొరకదు. రోజంతా చల్లటి చలిలో కింద కూర్చోవాల్సిందే! జాంబియా రాజధాని లుసాకాకు 60 కి.మీ దూరంలోని చన్యన్యా ప్రభుత్వ ప్రైమరీ, సెకండరీ స్కూల్లో మూడేళ్లుగా రోజూ ఇదే దృశ్యం. ఉచిత విద్యా పథకం మొదలై నాటినుంచీ దేశంలో స్కూళ్లన్నీ విద్యార్థులతో కిటకిటలాడిపోతున్నాయి. గరిష్టంగా 40 మంది ఉండాల్సిన క్లాసురూముల్లో కనీసం 90 నుంచి 100 మందికి పైగా కని్పస్తున్నారు. 30 మంది మాత్రమే పట్టే ఒక క్లాస్‌రూములోనైతే ఏకంగా 75 మంది బాలలు, 85 మంది బాలికలు కిక్కిరిసిపోయారు! ఈ మూడేళ్లలో దేశవ్యాప్తంగా ఏకంగా 20 లక్షల మందికి పైగా విద్యార్థులు కొత్తగా బడిబాట పట్టారు మరి! మంచి సమస్యే! ఇంతమందికి విద్యార్థులకు తగిన స్థాయిలో దేవుడెరుగు, కనీస స్థాయిలో కూడా మౌలిక వసతులు లేకపోవడం జాంబియా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. 2019లో ఒక్కో క్లాసులో 40 మంది పిల్లల కంటే ఉండేవారు కాదని, ఇప్పుడు మాత్రం కనీసం 100కు పైగానే ఉంటున్నారని క్లియోపాత్రా జులు అనే టీచర్ వాపోయారు. వీళ్లు చాలరన్నట్టు దాదాపు రోజూ కొత్త విద్యార్థులు జాయినవుతున్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వమిచ్చే ఒక్కో పుస్తకాల సెట్టు కోసం కనీసం ఆరేడు మంది పిల్లలు కొట్టుకునే పరిస్థితి! అయితే ఇవన్నీ ‘మంచి సమస్య’లేనంటారు దేశ విద్యా మంత్రి డగ్లస్ స్యకలిమా. ‘‘క్లాసురూముల్లో ఇరుక్కుని కూర్చునైనా సరే, ఈ బాలలంతా మూడేళ్లుగా తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటున్నారు. వారంతా మరో దిక్కు లేక నిస్సహాయంగా వీధులపాలైన రోజులతో పోలిస్తే ఇదెంతో మెరుగు కదా’’ అన్నది ఆయన పాయింటు. ‘‘మౌలిక సదుపాయాలు కూడా త్వరలో మెరుగవుతాయి. ఎందుకంటే విద్యా రంగంపై చేసే పెట్టుబడి నిజానికి అత్యుత్తమ పెట్టుబడి’’ అని వివరించారు. ఆయన వాదన నిజమేనని 18 ఏళ్ల మరియానా చిర్వా వంటి ఎందరో విద్యార్థుల అనుభవం చెబుతోంది. ‘‘2016లో నాలుగో తరగతిలో ఉండగా స్కూలు మానేశాను. ఉచిత విద్యా పథకం పుణ్యాన మూడేళ్లుగా మళ్లీ చదువుకోగలుగుతున్నా. మా అమ్మానాన్నా ఏ పనీ చేయకుండా ఇంట్లోనే ఉంటారు. ఉచిత పథకం లేకుంటే స్కూలు ఫీజు కట్టడం అసాధ్యం మాకు’’ అని చెప్పుకొచి్చందామె. 2026 నాటికి కనీసం 55 వేల మంది కొత్త టీచర్ల నియామకం చేపట్టాలన్నది లక్ష్యం కాగా ఇప్పటికే 37 వేల మంది నియామకం జరిగిపోయింది. తమకిచ్చిన ప్రభుత్వ నివాసాల్లో అత్యంత దుర్భరమైన పరిస్థితులున్నాయని టీచర్లు వాపోతున్న నేపథ్యంలో ఆ సమస్యపైనా దృష్టి సారించారు. దీనికి తోడు దేశవ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన కనీసం మరో 170 స్కూళ్లు నిర్మించనున్నారు. 2020లో రుణ ఊబిలో చిక్కి దివాళా తీసిన దేశానికి ఇది నిజంగా గొప్ప ఘనతేనని ఐరాస బాల సంస్థ యునిసెఫ్ కూడా ప్రశంసిస్తోంది. చదువు అందని ద్రాక్షే ఆఫ్రికాలో జాంబియా వంటి సబ్ సహారా ప్రాంత దేశాల్లో అందరికీ విద్య ఇప్పటికీ అందని ద్రాక్షే. అక్కడి దేశాల్లో సగటున ప్రతి 10 మంది విద్యార్థుల్లో ఏకంగా 9 మందికి నాలుగు ముక్కలు తప్పుల్లేకుండా చదవడం, అర్థం చేసుకోవడం ఇప్పటికీ తలకు మించిన వ్యవహారమేనని ఐరాస బాల సంస్థ యునిసెఫ్ అధ్యయనం చెబుతోంది. అయితే కొంతకాలంగా ఆ దేశాలన్నీ జాంబియా బాటలోనే నాణ్యమైన విద్యపై దృష్టి సారిస్తుండటం హర్షణీయమంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
నైజీరియాలో కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థ
అబూజా: ఆఫ్రికా ఖండంలో అత్యధిక జనాభా కలిగిన దేశమైన నైజీరియాలో గురువారం గాఢాంధకారం అలుముకుంది. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థ కుప్పకూలడంతో దేశమంతటా కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఉదయం విద్యుత్ ఉత్పత్తి సున్నా మెగావాట్లుగా నమోదైంది. ఆ తర్వాత క్రమంగా కరెంటు సరఫరాను పునరుద్ధరించారు. నైజీరియాలో కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడడం మామూలే. 2022లో ఏకంగా నాలుగు సార్లు గ్రిడ్ కుప్పకూలింది. అయితే, సాంకేతిక కారణాల వల్లే ఈ సమస్య తలెత్తుతోందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, రెండు విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను అనుసంధానించే లైన్ అగ్నిప్రమాదానికి గురైందని, అందుకే గ్రిడ్ విఫలమైందని నైజీరియా విద్యుత్ శాఖ మంత్రి అడెబయో అడెలాబూ చెప్పారు. -
మిస్టరీగా మారిన కొత్త వైరస్.. 24 గంటల్లో ముగ్గురు మృతి!
ఇప్పటికే కరోనా వైరస్‌తో సతమతమవుతున్న ప్రజలపై మరో వైరస్ దాడి మొదలైంది. వైద్యులకే అంతుచిక్కని కొత్త వైరస్ ఆందోళనకు గురిచేస్తోంది. ఈ కొత్త వైరస్ కారణంగా ఇప్పటికే ముగ్గురు మృతిచెందడం కలకలం సృష్టించింది. కాగా, ఈ వైరస్ ఆఫ్రికాలో వ్యాప్తిచెందుతోంది. వివరాల ప్రకారం.. ఆఫ్రికా ఖండంలోని బురుండి దేశంలో ఉన్న బజిరోలో ప్రాంతంలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తున్నది. అంతుచిక్కని ఈ వైరస్ కారణంగా 24 గంటల్లోనే ముగ్గురు మృతిచెందారు. అయితే, ఈ వైరస్ బారినపడిన వారికి జ్వరం, వాంతులు, తలనొప్పి వంటి లక్షణాలు ఉన్నట్టు అక్కడి వైద్యులు నిర్దారించారు. ఇదే సమయంలో వైరస్ సోకిన వారికి ముక్కు నుంచి రక్తస్రావం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇది ఆందోళన కలిగించే విషయమని చెప్పారు. కొత్త వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బురుండి దేశ ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో, రంగంలోకి దిగిన అధికారులు బజిరో పట్టణాన్ని క్వారంటైన్ చేశారు. ఇదిలా ఉండగా, కొత్త వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) సమీప దేశాలను హెచ్చరించింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, ఇటీవలే బురుండి పక్క దేశమైన టాంజానియాలో మార్బర్గ్ అనే వైరస్ వ్యాప్తి జరిగింది. దీంతో, ఇదే వైరస్ కూడా బురుండిలో వ్యాప్తి చెందిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, బురుండిలో ఎబోలా, మార్బర్గ్ వ్యాప్తి చెందే అవకాశంలేదని ఆరోగ్యశాఖ అధికారులు కొట్టిపారేస్తున్నారు. Deadlier than Covid19: Africa sees new virus that kills within 24 hours, claims three in Burundi A unidentified disease, anticipated as a virus that causes nosebleed and reportedly kills the infected person within 24 hours#indianews #india #newsindia #dailynews #ohmyindia pic.twitter.com/DyjgVdQrTC — Oh My India (@OhMyIndiaNews) March 31, 2023 -
రెండు ముక్కలుకానున్న ఆఫ్రికా ఖండం..??
సాక్షి, వెబ్ డెస్క్ : ప్రపంచంలో రెండో అతిపెద్ద ఖండమైన ఆఫ్రికా రెండుగా చీలిపోనుందా..? ఆఫ్రికా వాసుల మెదళ్లను ప్రస్తుతం తొలుస్తున్న ప్రశ్న ఇదే. కెన్యా రాజధాని నైరోబికి చేరువలోని హైవేపై ఏర్పడిన పగులు ఈ ఆందోళనలకు కేంద్ర బిందువు అయింది. టెక్టోనిక్ ప్లేట్లలో నైరుబీ వద్ద వస్తున్న కదలికలు ఆఫ్రికా రెండుగా విడిపోతుందనే నమ్మకాన్ని బలపరుస్తున్నాయి. నైరుతీ కెన్యాలో గల రిఫ్ట్ వ్యాలీ వద్ద భారీ పగులు ఏర్పడింది. కొన్ని మైళ్ల పాటు విస్తరించిన ఈ పగులు కారణంగా నైరోబీ-నరోక్ హైవే కూడా దెబ్బతింది. అంతేకాదు కొన్ని ఇళ్లు సగానికి చీలిపోయాయి కూడా. ఈ పగులు కారణంగా భవిష్యత్‌లో ఆఫ్రికా రెండు ముక్కలు అవుంతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే ఇందుకు కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుందని చెప్పారు. నుబియన్ ప్లేట్ నుంచి సోమాలి టెక్టానిక్ ప్లేట్ విడిపోయే క్రమంలో ఈ చీలిక జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అతి నెమ్మదిగా జరిగే ఈ ప్రక్రియ కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత పూర్తవుతుందని వివరించారు. ప్రకృతి బద్దంగా జరిగే ఈ ప్రక్రియను అడ్డుకోవడం అసాధ్యమని పేర్కొన్నారు. విడిపోయే ముక్కలో ఉండే సోమాలియా, కెన్యా, ఇథియోపియాలు హిందూ మహాసముద్రంలో ద్వీపాలుగా మారుతాయని చెప్పారు. దీనివల్ల ఆఫ్రికా ఖండం చిన్నగా మారుతుందన్నారు. -
విదేశీ నాణెంపై విఘ్నేశ్వరుడు
గణపవరం, న్యూస్‌లైన్ : విఘ్నేశ్వరునిపై భక్తి శ్రద్ధలతో ఆఫ్రికా ఖండంలోని ఐవరీకోస్ట్ దేశం ప్రత్యేక నాణెం ముద్రించడం విశేషం. ఈ నాణేన్ని స్టాంపులు, నాణేలు, కరెన్సీ నోట్ల సేకరణ అభిరుచి ఉన్న గణపవరానికి చెందిన రుద్రరాజు ఫౌండేషన్ చైర్మన్ ఆర్వీఎస్ రాజు సేకరించారు. ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ వివిధ దేశాల నాణాలు, స్టాంపుల సేకరణ హాబీ ఉన్న తాను ఇంటర్నెట్లో ఈ నాణెం గురించి తెలుసుకుని ఉత్తర ప్రత్యుత్తరాలు సేకరించారన్నారు. నాణెం 25 గ్రాముల బరువు, 38.61 మిల్లీమీటర్ల వ్యాసం ఉందన్నారు. నాణేనికి ఒక వైపు ఆ దేశ రాజముద్ర, నాణెం విలువ, రెండో వైపు రావిఆకులతో రూపొందించిన విఘ్నేశ్వరుడి చిత్రం ముద్రించి ఉన్నాయన్నారు. గిఫ్టు బాక్సును వినాయకుని మూషిక వాహనం నమూనాలో రూపొందించి, అందులో ఈ స్మారక వెండి నాణేన్ని ఉంచి పార్శిల్ ద్వారా పంపారన్నారు. ఆ దేశ కరె న్సీ ప్రకారం ఈ నాణెం విలువ 1001 ఫ్రాంక్‌లని తెలిపారు. దీని సేకరణకు తనకు రూ.8 వేలు ఖర్చయిందని రాజు చెప్పారు. వివిధ దేశాల నాణేలు, స్టాంపులు, కరెన్సీ నోట్లు సేకరిస్తున్నానని, వాటి సేకరణకు ఇప్పటి వరకు రూ. 8 లక్షలు ఖర్చు చేశానన్నారు.