ఇప్పటికే కరోనా వైరస్‌తో సతమతమవుతున్న ప్రజలపై మరో వైరస్ దాడి మొదలైంది. వైద్యులకే అంతుచిక్కని కొత్త వైరస్ ఆందోళనకు గురిచేస్తోంది. ఈ కొత్త వైరస్ కారణంగా ఇప్పటికే ముగ్గురు మృతిచెందడం కలకలం సృష్టించింది. కాగా, ఈ వైరస్ ఆఫ్రికాలో వ్యాప్తిచెందుతోంది.
వివరాల ప్రకారం.. ఆఫ్రికా ఖండంలోని బురుండి దేశంలో ఉన్న బజిరోలో ప్రాంతంలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తున్నది. అంతుచిక్కని ఈ వైరస్ కారణంగా 24 గంటల్లోనే ముగ్గురు మృతిచెందారు. అయితే, ఈ వైరస్ బారినపడిన వారికి జ్వరం, వాంతులు, తలనొప్పి వంటి లక్షణాలు ఉన్నట్టు అక్కడి వైద్యులు నిర్దారించారు.
ఇదే సమయంలో వైరస్ సోకిన వారికి ముక్కు నుంచి రక్తస్రావం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇది ఆందోళన కలిగించే విషయమని చెప్పారు. కొత్త వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బురుండి దేశ ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
దీంతో, రంగంలోకి దిగిన అధికారులు బజిరో పట్టణాన్ని క్వారంటైన్ చేశారు. ఇదిలా ఉండగా, కొత్త వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) సమీప దేశాలను హెచ్చరించింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, ఇటీవలే బురుండి పక్క దేశమైన టాంజానియాలో మార్‌బర్గ్ అనే వైరస్ వ్యాప్తి జరిగింది. దీంతో, ఇదే వైరస్ కూడా బురుండిలో వ్యాప్తి చెందిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, బురుండిలో ఎబోలా, మార్‌బర్గ్ వ్యాప్తి చెందే అవకాశంలేదని ఆరోగ్యశాఖ అధికారులు కొట్టిపారేస్తున్నారు.
Deadlier than Covid19: Africa sees new virus that kills within 24 hours, claims three in Burundi
— Oh My India (@OhMyIndiaNews) March 31, 2023
A unidentified disease, anticipated as a virus that causes nosebleed and reportedly kills the infected person within 24 hours#indianews #india #newsindia #dailynews #ohmyindia pic.twitter.com/DyjgVdQrTC
Comments
Please login to add a commentAdd a comment