Burundi
-
మిస్టరీగా మారిన కొత్త వైరస్.. 24 గంటల్లో ముగ్గురు మృతి!
ఇప్పటికే కరోనా వైరస్‌తో సతమతమవుతున్న ప్రజలపై మరో వైరస్ దాడి మొదలైంది. వైద్యులకే అంతుచిక్కని కొత్త వైరస్ ఆందోళనకు గురిచేస్తోంది. ఈ కొత్త వైరస్ కారణంగా ఇప్పటికే ముగ్గురు మృతిచెందడం కలకలం సృష్టించింది. కాగా, ఈ వైరస్ ఆఫ్రికాలో వ్యాప్తిచెందుతోంది. వివరాల ప్రకారం.. ఆఫ్రికా ఖండంలోని బురుండి దేశంలో ఉన్న బజిరోలో ప్రాంతంలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తున్నది. అంతుచిక్కని ఈ వైరస్ కారణంగా 24 గంటల్లోనే ముగ్గురు మృతిచెందారు. అయితే, ఈ వైరస్ బారినపడిన వారికి జ్వరం, వాంతులు, తలనొప్పి వంటి లక్షణాలు ఉన్నట్టు అక్కడి వైద్యులు నిర్దారించారు. ఇదే సమయంలో వైరస్ సోకిన వారికి ముక్కు నుంచి రక్తస్రావం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇది ఆందోళన కలిగించే విషయమని చెప్పారు. కొత్త వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బురుండి దేశ ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో, రంగంలోకి దిగిన అధికారులు బజిరో పట్టణాన్ని క్వారంటైన్ చేశారు. ఇదిలా ఉండగా, కొత్త వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) సమీప దేశాలను హెచ్చరించింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, ఇటీవలే బురుండి పక్క దేశమైన టాంజానియాలో మార్బర్గ్ అనే వైరస్ వ్యాప్తి జరిగింది. దీంతో, ఇదే వైరస్ కూడా బురుండిలో వ్యాప్తి చెందిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, బురుండిలో ఎబోలా, మార్బర్గ్ వ్యాప్తి చెందే అవకాశంలేదని ఆరోగ్యశాఖ అధికారులు కొట్టిపారేస్తున్నారు. Deadlier than Covid19: Africa sees new virus that kills within 24 hours, claims three in Burundi A unidentified disease, anticipated as a virus that causes nosebleed and reportedly kills the infected person within 24 hours#indianews #india #newsindia #dailynews #ohmyindia pic.twitter.com/DyjgVdQrTC — Oh My India (@OhMyIndiaNews) March 31, 2023 -
గర్భం దాల్చే విషయంలో వారి నిర్ణయం కూడా..
న్యూఢిల్లీ: వెనుకబడిన దేశాల్లోని మహిళలకు మొబైల్ ఫోన్లు అందించడం ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవచ్చని మెక్‌గిల్ యూనివర్సిటీ(కెనడా), యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్(ఇంగ్లండ్), బొకోని యూనివర్సిటీ(ఇటలీ) పరిశోధకులు అభిప్రాయపడ్డారు. స్మార్ట్ఫోన్ల వాడకం మహిళా సాధికారికతకు దోహదపడుతుందని.. సొంతంగా నిర్ణయాలు తీసుకునేలా వారిని ప్రోత్సహిస్తుందని వెల్లడించారు. లింగ వివక్ష, వ్యక్తిగత శుభ్రత, గర్భనిరోధక విధానాలు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అభివృద్ధి పరంగా వెనుకబడిన దేశాలైన అంగోలా, బురుండి, ఇథియోపియా, మలావీ, టాంజానియా, ఉగాండ, జింబాబ్వే తదితర దేశాల్లో దాదాపు లక్ష మంది మహిళల అభిప్రాయాలను సేకరించి ఈ మేరకు విశ్లేషించినట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన విషయాలను ప్రఖ్యాత ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ ది సైన్సెస్’ జర్నల్‌లో పొందుపరిచారు. ఈ మార్పు హర్షణీయం ఈ నేపథ్యంలో ఉప సహారా దేశాల్లోని ఫోన్ వాడుతున్న మహిళలు మిగతా మహిళలతో పోలిస్తే, గర్భం దాల్చే విషయంలో భాగస్వామితో చర్చించి.. నిర్ణయం తీసుకునే అవకాశం 1 శాతం ఎక్కువగా ఉందని తేలిందన్నారు. అదే విధంగా 2 శాతం మంది అవాంఛిత గర్భనిరోధక విధానాలు, 3 శాతం మంది హెచ్ఐవీ టెస్టు ఎలా చేయించుకోవాలన్న విషయాలపై ఫోన్ల వాడకం ద్వారా అవగాహన పొందుతున్నారని తెలిపారు. అదే విధంగా కుటుంబ వ్యవహారాల్లో కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.(మీ ముద్దు మాకొద్దు) ముఖ్యంగా ఐసోలేటెడ్ ఏరియాల్లో నివసిస్తున్న పేద మహిళల్లో ఈ మేరకు మార్పు రావడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇక విషయం గురించి పరిశోధక బృందంలో ఒకరైన ప్రొఫెసర్ లుకా మారియా పెసాండో మాట్లాడుతూ.. ‘‘విద్యా సంస్థల స్థాపన- విస్తరణ, ఆర్థిక పురోగతికై చర్యలు తదితర అంశాలతో పాటుగా వెనుక బడిన దేశాల్లో మొబైల్ ఫోన్లు, సాంకేతికతను అభివృద్ధి చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చని మా పరిశోధనలో తేలిందని పేర్కొన్నారు. ఆ విషయంలో కాస్త వెనుకబడే ఉన్నారు ఇదిలా ఉండగా.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మొబైల్ నెట్‌వర్క్‌ల విస్తరణ పెరుగుతున్పప్పటికీ పురుషులతో పోలిస్తే.. సొంతంగా ఫోన్లు కలిగి ఉన్న మహిళలు తక్కువ మందే ఉన్నారని పరిశోధన బృందం పేర్కొంది. కొంతమంది మహిళల చేతిలో ఫోన్ ఉన్నా దానిని ఎలా వినియోగించాలో తెలియక తికమక పడుతున్నారని, మగవారితో పోలిస్తే కమ్యూనికేషన్ స్కిల్స్, సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో కాస్త వెనుకబడి ఉన్నారని అభిప్రాయపడింది. -
బురుండీ అధ్యక్షుడి హఠాన్మరణం
గిటేగా : బురుండీ అధ్యక్షుడు ఎన్‌కురుంజిజా(55) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో దేశ అధ్యక్షుడు మృతిచెందారని బురుండీ ప్రభుత్వం వెల్లడించింది. ఆరోగ్యం సరిగాలేకపోవడంతో శనివారం ఎన్‌కురుంజిజా ఆసుపత్రిలో చేరారు. తర్వాత కోలుకున్నా సోమవారం ఒక్కసారిగా గుండెపోటురావడంతో, ఆయన్ను రక్షించడానికి డాక్టర్లు తీవ్రంగా కృషి చేసినా ఫలితంలేకుండా పోయిందని అధికారులు తెలిపారు. ఇటీవలే ఎన్‌కురుంజిజా సతీమణి డెనిస్ ఎన్‌కురుంజిజాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమె కెన్యాలో అగాఖాన్ యూనివర్సిటీ ఆసుపత్రిలో కరోనా చికిత్స తీసుకుంటున్నారు. దీంతో అధ్యక్షుడు ఎన్‌కురుంజిజా కూడా కరోనా కారణంగానే మృతిచెంది ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. Burundi President Pierre Nkurunziza is dead. The government says it was a heart attack. But was it COVID-19? pic.twitter.com/aTu3umC4m9 — Prof Makau Mutua (@makaumutua) June 9, 2020 The big question here is whether Burundi’s outgoing president died from Covid-19 (and whether authorities will admit it if he did). Burundi has basically ignored the virus, even expelling WHO representatives. Nkurunziza’s wife was reported to be Covid-19 positive. https://t.co/Idht1FPVj4 — Simon Allison (@simonallison) June 9, 2020 -
72 మందిని చంపడం కళ్లారా చూసి..
అది ఆఫ్రికాలోని బురండీ దేశం.. అక్టోబర్ 21, 1993. దేశంలో అంతర్యుద్ధం మొదలైంది. ఎటుచూసినా హింస రాజ్యమేలుతోంది. ఒకరినొకరు చంపుకుంటున్నారు. అంతటా భీతావహ వాతావరణం. టుట్సీ, హుతు వర్గాలకు మధ్య మొదలైన ఘర్షణ.. ఏకంగా 12 ఏళ్ల పాటు సాగింది. అత్యంత హింసాత్మకంగా సాగిన ఈ అంతర్యుద్ధంలో దాదాపు 3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ అంతర్యుద్ధం జరుగుతున్న సమయంలో అడుగు బయటపెట్టడానికే భయపడే పరిస్థితుల్లో టుట్సీ వర్గానికి చెందిన ఓ 59 ఏళ్ల మహిళ మాత్రం అత్యంత ధైర్యాన్ని ప్రదర్శించింది. అంతర్యుద్ధంలో తల్లిదండ్రులు, ఆప్తులను కోల్పోయి అభాగ్యులుగా ఉన్న పిల్లలను అక్కున చేర్చుకుంది. చిన్నారులకు ఎలాంటి ఆపదా రాకుండా తానే రక్షణ కవచమై నిలిచింది. ఇందుకోసం ఎన్నోసార్లు ఆమె తన ప్రాణాన్ని పణంగా పెట్టింది. అలా దాదాపు 30 వేల మంది పిల్లలను కాపాడింది. చిన్నారులనే కాదు.. ఎంతోమంది శరణార్ధులకు కూడా ఆ మహిళ అండగా నిలిచింది. ఆమే మార్గురైట్ బరాంకిట్సే. అంతర్యుద్ధం సమయంలో ఓ రోజు తన కళ్ల ముందు హుతు వర్గానికి చెందిన 72 మంది వ్యక్తులను చంపేయడం ఆమెను తీవ్రంగా కలిచి వేసింది. ఈ హింసను తాను ఆపలేకపోయినా ..అభాగ్యులకు, చిన్నారులకు బాసటగా నిలవాలని ఆమె అప్పుడే నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి ఎందరినో చేరదీశారు. అలా అప్పుడు మార్గురైట్స్ చూపిన ఔదార్యానికి ఇన్నేళ్ల తర్వాత గుర్తింపు లభించింది. ఆమెలోని మానవత్వానికి పురస్కారం దక్కింది. అభాగ్యుల కోసం జీవితాన్ని ధారపోసే వ్యక్తులకు ఇచ్చే 'అరోరా పురస్కారం' ను మార్గురైట్ కు ప్రదానం చేశారు. హాలీవుడ్ నటడు జార్జ్ క్లూనీ చేతుల మీదుగా గత ఏప్రిల్ లో ఆమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అన్నట్టు ఈ పురస్కారం కింద ఆమెకు లభించిన 10 లక్షల డాలర్లను కూడా ఛారిటీ కార్యక్రమాలకే ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. బురుండీలో అంతర్యుద్ధం ముగిసిన మూడేళ్ల తర్వాత.. అంటే 2008 లో ఓ ఆస్పత్రి ప్రారంభించిన మార్గురైట్ ఇప్పటివరకు దాదాపు 80 వేల మందికి వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం ర్వండాలో ఉంటున్న ఆమె.. బురుండియా శరణార్ధుల కోసం సరిహద్దు వ్యాప్తంగా శిబిరాలు నిర్వహిస్తున్నారు. -
బురుండీలో అంతటా ఒబామా ఫీవర్