గిటేగా : బురుండీ అధ్యక్షుడు ఎన్‌కురుంజిజా(55) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో దేశ అధ్యక్షుడు మృతిచెందారని బురుండీ ప్రభుత్వం వెల్లడించింది. ఆరోగ్యం సరిగాలేకపోవడంతో శనివారం ఎన్‌కురుంజిజా ఆసుపత్రిలో చేరారు. తర్వాత కోలుకున్నా సోమవారం ఒక్కసారిగా గుండెపోటురావడంతో, ఆయన్ను రక్షించడానికి డాక్టర్లు తీవ్రంగా కృషి చేసినా ఫలితంలేకుండా పోయిందని అధికారులు తెలిపారు.
ఇటీవలే ఎన్‌కురుంజిజా సతీమణి డెనిస్ ఎన్‌కురుంజిజాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమె కెన్యాలో అగాఖాన్ యూనివర్సిటీ ఆసుపత్రిలో కరోనా చికిత్స తీసుకుంటున్నారు. దీంతో అధ్యక్షుడు ఎన్‌కురుంజిజా కూడా కరోనా కారణంగానే మృతిచెంది ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Burundi President Pierre Nkurunziza is dead. The government says it was a heart attack. But was it COVID-19? pic.twitter.com/aTu3umC4m9
— Prof Makau Mutua (@makaumutua) June 9, 2020
The big question here is whether Burundi’s outgoing president died from Covid-19 (and whether authorities will admit it if he did). Burundi has basically ignored the virus, even expelling WHO representatives. Nkurunziza’s wife was reported to be Covid-19 positive. https://t.co/Idht1FPVj4
— Simon Allison (@simonallison) June 9, 2020
Comments
Please login to add a commentAdd a comment