గణపవరం, న్యూస్‌లైన్ :
విఘ్నేశ్వరునిపై భక్తి శ్రద్ధలతో ఆఫ్రికా ఖండంలోని ఐవరీకోస్ట్ దేశం ప్రత్యేక నాణెం ముద్రించడం విశేషం. ఈ నాణేన్ని స్టాంపులు, నాణేలు, కరెన్సీ నోట్ల సేకరణ అభిరుచి ఉన్న గణపవరానికి చెందిన రుద్రరాజు ఫౌండేషన్ చైర్మన్ ఆర్‌వీఎస్ రాజు సేకరించారు. ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ వివిధ దేశాల నాణాలు, స్టాంపుల సేకరణ హాబీ ఉన్న తాను ఇంటర్‌నెట్‌లో ఈ నాణెం గురించి తెలుసుకుని ఉత్తర ప్రత్యుత్తరాలు సేకరించారన్నారు. నాణెం 25 గ్రాముల బరువు, 38.61 మిల్లీమీటర్ల వ్యాసం ఉందన్నారు. నాణేనికి ఒక వైపు ఆ దేశ రాజముద్ర, నాణెం విలువ, రెండో వైపు రావిఆకులతో రూపొందించిన విఘ్నేశ్వరుడి చిత్రం ముద్రించి ఉన్నాయన్నారు.
గిఫ్టు బాక్సును వినాయకుని మూషిక వాహనం నమూనాలో రూపొందించి, అందులో ఈ స్మారక వెండి నాణేన్ని ఉంచి పార్శిల్ ద్వారా పంపారన్నారు. ఆ దేశ కరె న్సీ ప్రకారం ఈ నాణెం విలువ 1001 ఫ్రాంక్‌లని తెలిపారు. దీని సేకరణకు తనకు రూ.8 వేలు ఖర్చయిందని రాజు చెప్పారు. వివిధ దేశాల నాణేలు, స్టాంపులు, కరెన్సీ నోట్లు సేకరిస్తున్నానని, వాటి సేకరణకు ఇప్పటి వరకు రూ. 8 లక్షలు ఖర్చు చేశానన్నారు.
విదేశీ నాణెంపై విఘ్నేశ్వరుడు
Published Sat, Sep 7 2013 12:46 AM | Last Updated on Fri, Sep 1 2017 10:30 PM
Advertisement
Advertisement