అంతర్జాతీయ టీ20ల్లో అత్యల్ప స్కోర్‌.. కేవలం 7 పరుగులకే ఆలౌట్‌ | Ivory Coast Made History By Recording The Lowest Ever T20I Total In A Mens T20I Match, During Their Game Against Nigeria | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ టీ20ల్లో అత్యల్ప స్కోర్‌.. కేవలం 7 పరుగులకే ఆలౌట్‌

Published Mon, Nov 25 2024 12:44 PM | Last Updated on Mon, Nov 25 2024 1:22 PM

Ivory Coast Made History By Recording The Lowest Ever T20I Total In A Mens T20I Match, During Their Game Against Nigeria

అంతర్జాతీయ టీ20ల్లో అత్యల్ప స్కోర్‌ నమోదైంది. టీ20 వరల్డ్‌కప్‌ 2026 ఆఫ్రికా సబ్‌ రీజియనల్‌ క్వాలిఫయర్‌ పోటీల్లో భాగంగా నైజీరియాతో జరిగిన మ్యాచ్‌లో ఐవరీ కోస్ట్‌ కేవలం​ 7 పరుగులకే ఆలౌటైంది. అంతర్జాతీయ టీ20ల్లో ఇదే అత్యల్ప స్కోర్‌. దీనికి ముందు టీ20 అత్యల్ప స్కోర్‌ రికార్డు ఐసిల్‌ ఆఫ్‌ మ్యాచ్‌, మంగోలియా జట్ల పేరిట ఉండేది. ఈ రెండు జట్లు గతంలో 10 పరుగులకే ఆలౌటయ్యాయి.

నైజీరియా-ఐవరీ కోస్ట్‌ మధ్య మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నైజీరియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 271 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. వికెట్‌కీపర్‌ సెలిమ్‌ సలౌ విధ్వంసకర శతకం (53 బంతుల్లో 112 రిటైర్డ్‌ ఔట్‌; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) బాది నైజీరియా భారీ స్కోర్‌ చేసేందుకు దోహదపడ్డాడు. 

నైజీరియా ఇన్నింగ్స్‌లో ఐసక్‌ ఓక్పే (23 బంతుల్లో 65 నాటౌట్‌; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), సులేమాన్‌ (29 బంతుల్లో 50; 8 ఫోర్లు) మెరుపు అర్ద శతకాలు బాదారు.  ఐవరీ కోస్ట్‌ బౌలర్లలో పంబా దిమిత్రి, విల్‌ఫ్రైడ్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఐవరీ కోస్ట్‌.. 7.3 ఓవర్లలో 7 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా నైజీరియా 264 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఐవరీ కోస్ట్‌ ఇన్నింగ్స్‌లో ఆరుగురు డకౌట్లు కాగా.. ముగ్గురు బ్యాటర్లు ఒక్కో పరుగు చేశారు. ఓపెనర్‌ మొహమ్మద్‌ చేసిన నాలుగు పరుగులే టాప్‌ స్కోర్‌గా నిలిచాయి. ఈ జట్టు ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండరీ కూడా లేదు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement