
అబుజాన్: ఐవరీకోస్ట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు మినీ బస్సులు వేగంగా వచ్చి ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. రెండు బస్సులు ఢీకొట్టుకోవడంతో మంటలు లేచాయి. ఈ ప్రమాదంలో మొత్తం 26 మంది దుర్మరణం పాలవ్వగా 28 మంది దాకా గాయపడ్డారు. బ్రొకోవా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై దేశ రవాణాశాఖ మంత్రి స్పందించారు.
రోడ్లపై ప్రజలంతా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. రోడ్లు శిథిలావస్థకు చేరుకోవడంతో ఐవరీకోస్ట్‌లో ప్రమాదాలు సర్వసాధారణమైపోయాయి. ఇక్కడ రోడ్డు ప్రమాదాల్లో ఏటా వెయ్యి మంది మరణిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
గత నెలలోనే దేశంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 21 మంది మరణించారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన మరో ఘోర ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు.
ఇదీ చదవండి: స్నేహితుల మధ్య గొడవ.. కెనడాలో భారత విద్యార్థి హత్య