
లక్నో:ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో శుక్రవారం(అక్టోబర్4) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వారణాసి ప్రయాగ్‌రాజ్ హైవేపై కట్కా గ్రామం సమీపంలో ట్రాక్టర్‌ను ట్రక్కు వేగంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ట్రాక్టర్ ట్రాలీ ఏకంగా పక్కనున్న కాలువలో ఎగిరిపడింది. దీంతో ట్రాలీలో ఉన్న 10 మంది కూలీలు మృతిచెందారు.
ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని వారణాసి ట్రామా సెంటర్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు.ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ట్రక్కు ట్రాక్టర్‌ను వెనుక నుంచి వేగంగా ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసు ఉన్నతాధికారి అభినందన్ తెలిపారు.ట్రక్కు డ్రైవర్ ఘటనాస్థలి నుంచి పారిపోయాడని చెప్పారు.
ఇదీ చదవండి: వైవాహిక అత్యాచారం నేరం కాదు
Comments
Please login to add a commentAdd a comment