నైరోబీ: ఇథియోపియాలోని కల్లోలిత అంహారా ప్రాంతంలోని ఓ పట్టణ కూడలిలో జరిగిన వైమానిక దాడిలో 26 మంది మరణించారు. మరో 55 మంది గాయాలపాలయ్యారు. ఈ మేరకు ఆ దేశానికి చెందిన సీనియర్ వైద్యాధికారి సోమవారం వెల్లడించారు. స్థానిక మిలీషియా ముఠాలను నిర్వీర్యం చేసేందుకు దేశ ఆర్మీ ప్రయత్నాలు చేస్తోంది. ఇదే క్రమంలో ఫినోట్ సెలామ్‌లోని కమ్యూనిటీ సెంటర్‌పై ఆదివారం ఉదయం వైమానిక దాడి జరిపింది.
ఇదిలా ఉండగా గతవారం అమ్హారా ప్రాంతంలోని కీలక పట్టణాలను సైనిక చర్య ద్వారా ఇథియోపియా సైన్యం స్వాధీనం చేసుకుంది. ఉగ్రవాదులకు ఆహారం అందించి ఓ ట్రక్కుపై వెనక్కు వస్తున్న కొందరు వ్యక్తులను లక్ష్యంగా వైమానిక దాడులు జరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు.
చదవండి: పాక్ ఆపద్ధర్మ ప్రధానిగా కకర్ ప్రమాణం
Comments
Please login to add a commentAdd a comment