ఇథియెఫియాలో చిక్కుకున్న తెలుగు ప్రొఫెసర్లు | telugu professors trapped in ethiopia madawalabu university | Sakshi
Sakshi News home page

ఇథియెఫియాలో చిక్కుకున్న తెలుగు ప్రొఫెసర్లు

Published Mon, Oct 10 2016 11:26 PM | Last Updated on Mon, Sep 4 2017 4:54 PM

telugu professors trapped in ethiopia madawalabu university

ఆఫ్రికా: తూర్పు ఆఫ్రికాలోని ఇథియెఫియాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రొఫెసర్లు చిక్కుకున్నారు. బాలేరోబో సిటీలోని మడవలబు యూనివర్సిటీలో చిక్కుకున్న వారిలో 30 మంది తెలుగు ప్రొఫెసర్లు ఉన్నారు. పాలన, ప్రజాస్వామ్యంలో హక్కుల కోసం అక్కడి ప్రజలు ఇథియోపియాలో రహదారిని దిగ్బంధించడంతో వీరు చిక్కుకుపోయారు. దీంతో వారం రోజులుగా ప్రొఫెసర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తెలుగు ప్రొఫెసర్లు క్షేమంగా ఉన్నట్లు భారత రాయబార కార్యాలయం సోమవారం తెలిపింది. వారిని సురక్షితంగా భారత్ రప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు చెప్పారు. దీనిపై ఇథియోపియా ఎంపసీ అధికారులతో మాట్లాడుతున్నామన్నారు. ప్రొఫెసర్ల కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. వారిని క్షేమంగా తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని వారి కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement