
ఓస్లో(నార్వే) : ఇథియోపియా ప్రధాన మంత్రి అబీ అహ్మద్ అలీకు(43) అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది గానూ నోబెల్ శాంతి పురస్కారం ఆయనను వరించింది. ఆయనకు నోబెల్ శాంతి పురస్కారం అందజేయనున్నట్టు నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. ముఖ్యంగా తమ పక్క దేశమైన ఎరిట్రియాతో ఉన్న శత్రుత్వాన్ని పరిష్కరించడానికి అలీ చేసిన కృషికి గానూ ఆయనను నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపిక చేసినట్టు జ్యూరీ సభ్యులు తెలిపారు. డిసెంబర్ 10న జరిగే కార్యక్రమంలో అలీ శాంతి పురస్కారాన్ని అందుకోనున్నారు.
2018 ఏప్రిల్‌లో ఇథియోపియా ప్రధానిగా భాద్యతలు చేపట్టిన అహ్మద్.. సరిహద్దు దేశాలతో ఉన్న సమస్యలను పరిష్కరించడమే.. కాకుండా తన దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే విధానాలను అవలంభించారు. కేవలం ఆరు నెలల్లోనే చాలా ఏళ్ల పాటు ఇథియోపియాకు శత్రు దేశంగా ఉన్న ఎరిట్రియాతో శాంతి కుదిరేలా చేశారు.