సాక్షి,ముంబై: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన పరిశోధన నివేదిక సునామీతో అదానీ గ్రూప్ షేర్లన్నీ పతనం వరుసగా కొనసాగుతోంది. కంపెనీకి చెందిన 10 స్టాక్‌లు భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. దీంతో ఆసియా కుబేరుడుగా నిలిచిన అదానీ చైర్మన్ గౌతం అదానీ, ప్రపంచ బిలియనీర్ల ర్యాంకు నుంచి 16 స్థానానికి పడిపోయారు. అదానీ నికర విలువ ఒక వారంలో దాదాపు సగానికి పడిపోయింది. కేవలం ఆరు ట్రేడింగ్ సెషన్‌ల వ్యవధిలో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో రూ. 8.76 లక్షల కోట్లు (107 బిలియన్ డాలర్లు) నష్టపోయాయి. ఇది (రూపాయి-డాలర్ మార్పిడి రేటు 81.80 వద్ద) ఇథియోపియా లేదా కెన్యా జీడీపీతో సమానమట. వీటి వార్షిక జీడీపీ 110-111 బిలియన్ల డాలర్లు (ప్రపంచ బ్యాంకు).
అదానీ టోటల్ గ్యాస్ 6 రోజుల రూట్‌లో 29 బిలియన్ల డాలర్లు పైగా నష్టపోయింది. మార్కెట్ విలువలో 26.17బిలియన్ల డాలర్లను కోల్పోయింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం,గత సంవత్సరం సెప్టెంబర్‌లో గరిష్టంగా 150 బిలియన్ల డాలర్లున్న అదానీ వ్యక్తిగత సంపద హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల తరువాత ( జనవరి 24 నాటికి) 119 బిలియన్ల డాలర్లకు పడిపోయింది. కాగా ఫోర్బ్స్ అదానీ సంపదను 64.6 బిలియన్ డాలర్లుగా గురువారం అంచనా వేసింది. దీని ప్రకారం అదానీ వ్యక్తిగత సంపద 85 బిలియన్ డాలర్లు పతనం. ఇది బల్గేరియా వార్షిక జీడీపీకి సమానం!
అదానీ పోర్ట్స్ మార్కెట్ క్యాప్ రూ. 65,000 కోట్లకు పైగా క్షీణించగా, అదానీ ఎంటర్‌ప్రైజెస్ గత ఆరు ట్రేడింగ్ సెషన్‌లలో రూ. 2.1 లక్షల కోట్లు హుష్ కాకి అయిపోయాయి. గత సంవత్సరం అదానీ కొనుగోలు చేసిన అంబుజా సిమెంట్స్, దాని m-క్యాప్ దాదాపు రూ. 29,000 కోట్లు పడిపోయింది, ఇది 29శాతం పతనం. అదానీ గ్రీన్ ఎనర్జీ (16.95 బిలియన్ డాలర్లు క్షీణత) అదానీ ట్రాన్స్‌మిషన్ (16.36 బిలియన్ డాలర్లు కోల్పోయింది) విలువపరంగా భారీ పెట్టుబడిదారుల సంపదను కోల్పోయిన అదానీ గ్రూప్ స్టాక్‌లు. ఇంకా అదానీ పోర్ట్స్ & SEZ (7.89 బిలియన్ డాలర్లు), అంబుజా సిమెంట్స్ (3.55 బిలియన్ డాలర్లు ) అదానీ విల్మార్ (2.4బిలియన్ డాలర్లు ) ఏసీసీ (1.13 బిలియన్ డాలర్లు) కోల్పోయాయి. ఇక ఎఫ్‌పీవో ఉపహసంహరణ తరువాత అదానీ షేర్లను కొనేవాళ్లకు లేక చాలా వరకు లోయర్ సర్క్యూట్ కావడం గమనార్హం.
గురువారం అదానీ షేర్ల తీరు ఇలా
అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఎఫ్‌పీవో ఉపసంహరణ తరువాత ఈ స్టాక్ గురువారం రెండవ వరుస సెషన్‌లో 30శాతం క్రాష్ అయ్యింది. 1,494.75 వద్ద కొత్త 52 వారాల కనిష్ట స్థాయిని నమోదు చేసింది
అదానీ టోటల్ గ్యాస్ 10 శాతం పడి, రూ. 1,707లోయర్ సర్క్యూట్
అదానీ గ్రీన్ ఎనర్జీ 10 శాతం కుప్పకూలి కొత్త 52 వారాల కనిష్టాన్ని తాకింది.
అదానీ ట్రాన్స్‌మిషన్ కొత్త 52 వారాల కనిష్ట స్థాయి, 10శాతం నష్టంతో లోయర్ సర్క్యూట్‌ను
అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ 14.35 కుప్పకూలి , 52 వారాల కనిష్ట స్థాయి
అదానీ పవర్ 5శాతం నష్టంతో లోయర్ సర్క్యూట్
అదానీ విల్మార్ 5శాతం నష్టంతో లోయర్ సర్క్యూట్‌ను తాకింది.
Comments
Please login to add a commentAdd a comment