సాక్షి,ముంబై: అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలతో అతలాకుతలమవుతున్న వేళ అదానీకి భారీ ఊరట లభించింది. ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవో)కి వచ్చిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో అబుదాబి కంపెనీ భారీ పెట్టుబడులను ప్రకటించింది. రూ. 20వేల కోట్ల ఎఫ్‌పీవోలో 16 శాతం సబ్‌స్క్రిప్షన్‌ను ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (ఐహెచ్‌సీ) ఇక్కిందిచుకుంది 2023లో ఐరోపా, ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికాలో దృష్టితోపాటు, స్థానిక, అంతర్జాతీయ పెట్టుబడుల్లో ఈ ఏడాది ఇదే తమ తొలి పెట్టుబడి అని కంపెనీ పేర్కొంది. (అదానీ గ్రూప్ దేశ భవిష్యత్తును వెనక్కి లాగుతోంది:అదానీకి హిండెన్‌బర్గ్ కౌంటర్)
అబుదాబి కంపెనీ ఐహెచ్‌సీకి చెందిన అనుబంధ సంస్థ గ్రీన్ ట్రాన్స్‌మిషన్ ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్ ద్వారా అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఎఫ్‌పీవోలో 400 మిలియన్ డాలర్లు (రూ. 3,200 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు సోమవారం తెలిపింది. అదానీ గ్రూప్‌పై తమ ఆసక్తి, అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ ఫండమెంటల్స్‌పై నమ్మకంతో, బలమైన వృద్ధిని తన వాటాదారులను అదనపు విలువును ఆశిస్తున్నామని ఐహెచ్‌సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సయ్యద్ బాసర్ షుబ్ అన్నారు. క్లీన్ ఎనర్జీ , ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో 2023లో గ్లోబల్ అక్విజిషన్‌ను 70శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఎఫ్‌పీవో రెండో రోజు కేవలం 3 శాతం సబ్‌స్క్రైబ్ అయింది. ఈక్విటీ షేర్‌కు రూ. 3,112 ,రూ. 3,276 ప్రీమియం ప్రైస్ బ్యాండ్ వద్ద ఇష్యూ మంగళవారం ముగియనుంది. (రానున్న బడ్జెట్ సెషన్‌లో అదానీ గ్రూప్ vs హిండెన్‌బర్గ్ సునామీ?)
కాగా అదానీ గ్రూప్‌లో ఐహెచ్‌సీకి రెండో పెట్టుబడి ఒప్పందం. గత సంవత్సరం అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్ , అదానీ ఎంటర్‌ప్రైజెస్‌తో సహా అదానీ గ్రూప్‌లోని మూడు గ్రీన్ ఫోకస్డ్ కంపెనీలలో 2 బిలియన్ల డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. పెట్టుబడి పెట్టింది. ఈ మూడు సంస్థలు బీఎస్‌సీ,ఎన్‌ఎస్‌సీలలో లిస్ట్ అయిన సంగతి తెలిసిందే.
(చైనా సరిహద్దు ఉద్రిక్తత: ఈ సారి కూడా రక్షణ రంగానికి ప్రాధాన్యత?)
Comments
Please login to add a commentAdd a comment