FPO
-
రైతులే ఎగుమతి దారులు! పంట ఎగుమతిలో రైతన్నలకు స్వేచ్ఛ!
సాక్షి, అమరావతి: అన్నదాతలను ఎగుమతిదారులుగా తీర్చిదిద్దే దిశగా వైఎస్ జగన్ ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ కార్యరూపం దాలుస్తోంది. తాము పండించిన పంట ఉత్పత్తులను ప్రపంచంలో ఎక్కడికైనా నేరుగా ఎగుమతి చేసుకునేలా రైతులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పంటల ఆధారంగా రైతు ఉత్పత్తి దారుల సంఘాల (ఎఫ్‌పీవో)ను ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఎఫ్‌పీవోల ఏర్పాటుకు గతంలోనే శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో 200కు పైగా ఎఫ్పీవోలుండగా, వాటిలో 80 శాతం ఎఫ్‌పీవోలు తగిన ప్రోత్సాహం లేక నామమాత్రంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. వీటిని బలోపేతం చేయడంతో పాటు డివిజన్కొకటి చొప్పున కొత్తగా ఎఫ్‌పీవోలను కంపెనీల చట్టం కింద ఏర్పాటు చేయాలని సంకల్పించారు.4 ఏజెన్సీల ద్వారా మార్కెటింగ్, క్రెడిట్ లింకేజ్రైతులు పండించిన పంటలను ఎగుమతిదారులతో ప్రమేయం లేకుండా ప్రపంచంలో తమకు గిట్టుబాటు ధర లభించే ఏ దేశానికైనా నేరుగా ఎగుమతి చేసుకునేలా తీర్చిదిద్దడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఈ ప్రాజెక్టు కోసం 2020లోనే వైఎస్ జగన్ ప్రభుత్వం విధివిధానాలు రూపొందించింది. కంపెనీల చట్టం కింద ఏర్పాటయ్యే ఈ ఎఫ్‌పీవోలకు గరిష్టంగా ఐదేళ్ల పాటు రూ.25 లక్షల వరకు ఆర్థిక చేయూతనిచ్చేలా ప్రణాళిక రూపొందించారు.వ్యవసాయ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్టుకు అవసరమైన మార్కెట్, క్రెడిట్ లింకేజ్ కల్పించేందుకు ఎస్‌ఎఫ్‌ఏసీ (చిన్న రైతుల వ్యవసాయ వాణిజ్య కన్సార్టియం), నాబార్డు (జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్), ఎన్సీడీసీ (జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్), ఎన్‌ఎఫ్‌ఈడీ (జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య)లను భాగస్వామ్యం చేశారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ సారథ్యంలో రాష్ట్రస్థాయి, కలెక్టర్ల నేతృత్వంలో జిల్లాస్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఏ ఏ ఉత్పత్తులకు ఏ దేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. మంచి ధర రావాలంటే ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. ఎగుమతి కోసంæ ఎలాంటి అనుమతులు అవసరం వంటి అంశాలపై అవసరమైన సహకారం అందిస్తున్నారు.కంపెనీలుగా 450 ఎఫ్‌పీవోలు ఏర్పాటు..కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలో కంపెనీల చట్టం కింద 450 ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించగా, ఆమేరకు 100 శాతం ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవతో వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా మరో 811 ఎఫ్‌పీవోలు ఏర్పాటు చేశారు. ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన స్టేట్ నోడల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఎస్ఎన్టీఐ) ద్వారా ఎఫ్‌పీవోల్లోని రైతులకు శిక్షణ ఇచ్చి ఆ తర్వాత ఇన్పుట్ లైసెన్సులు, మండి, జీఎస్టీ, ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులు జారీ చేస్తారు. 450 ఎఫ్‌పీవోల్లో ఇప్పటికే 75 ఎఫ్‌పీవోలకు సీడ్ లైసెన్స్,100 ఎఫ్‌పీవోలకు ఫెర్టిలైజర్స్ లైసెన్సులు, 103 ఎఫ్‌పీవోలకు పురుగుల మందుల లైసెన్సులు జారీ చేశారు. మరొక వైపు పొలంబడులు, ఉద్యాన, పట్టు, మత్స్య సాగు బడులతో దిగుబడుల్లో నాణ్యత పెంచడంతో పాటు వాటికి గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ (గ్యాప్), ఆర్గానిక్ సర్టిఫికేషన్ జారీ చేస్తూ ఎగుమతులను ప్రోత్సహిస్తున్నారు.పురోగతిని వేగవంతం చేయండి..కేంద్రప్రాయోజిత పథకమైన ఎఫ్‌పీవోల ఏర్పాటును ప్రోత్సహించడంతో పాటు వాటికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ ఆదేశించారు. సంఘాల ఏర్పాటు, పురోగతిపై 8వ ఎస్ఎల్సీసీ రాష్ట్ర స్థాయి కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశం మంగళగిరిలో మంగళవారం జరిగింది.ఇక నుంచి నోడల్ అధికారిగా మార్క్‌ఫెడ్ ఎండీ వ్యవహరించనున్నట్లు ప్రకటించారు. ఎఫ్‌పీవోలకు ఎరువులు, పురుగుల మందుల వ్యాపారం నిర్వహణలో జరుగుతున్న జాప్యం నివారణకు సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. -
Vodafone Idea: 6 నెలల్లో 5జీ సేవల విస్తరణ
ముంబై: టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐ) ప్రతిపాదిత రూ. 18,000 కోట్ల ఎఫ్‌పీవో ద్వారా నిధులు సమీకరణ అనంతరం 6–9 నెలల్లోగా 5జీ సరీ్వసులు విస్తరించే యోచనలో ఉంది. నిధుల కొరత వల్లే ఇప్పటివరకు సర్వీసులను ప్రారంభించలేకపోయామని సంస్థ సీఈవో అక్షయ ముంద్రా తెలిపారు. రాబోయే 24–30 నెలల్లో తమ మొత్తం ఆదాయంలో 5జీ వాటా 40 శాతం వరకు ఉండగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎఫ్‌పీవో ద్వారా సేకరించే నిధుల్లో రూ. 5,720 కోట్ల మొత్తాన్ని 5జీ సరీ్వసులకు వినియోగించనున్నట్లు ముంద్రా వివరించారు. వొడా–ఐడియా ఫాలో ఆన్ ఆఫర్ (ఎఫ్‌పీవో) ఏప్రిల్ 18న ప్రారంభమై 22తో ముగియనుంది. ఇందుకోసం ధర శ్రేణిని షేరుకు రూ. 10–11గా నిర్ణయించారు. ఫాలో ఆన్ ఆఫర్ ద్వారా సేకరించే రూ. 18,000 కోట్లలో రూ. 15,000 కోట్ల మొత్తాన్ని 5జీ సేవల విస్తరణ, ఇతరత్రా పెట్టుబడుల కోసం వినియోగించుకోనున్నట్లు ముంద్రా వివరించారు. ప్రధానంగా కస్టమర్లు చేజారి పోకుండా చూసుకోవడం, యూజరుపై సగటు ఆదాయాన్ని (ఆర్పూ) పెంచుకోవడం, నెట్‌వర్క్‌పై పెట్టుబడులు పెట్టడం తమకు ప్రాధాన్యతాంశాలుగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. 2జీ యూజర్లు ఎక్కువగా ఉన్నందున తమ ఆర్పూ మొత్తం పరిశ్రమలోనే తక్కువగా ఉంటుందని చెప్పారు. అయితే, ప్రస్తుతం తమ 21.5 కోట్ల యూజర్లలో కేవలం 2జీనే వినియోగించే వారి సంఖ్య 42 శాతంగా ఉంటుందని, వీరంతా 4జీకి అప్‌గ్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నందున ఆర్పూ మెరుగుపడేందుకు ఆస్కారం ఉందన్నారు. -
వొడాఫోన్ భారీ ఎఫ్‌పీవో
న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న టెలికం సంస్థ వొడాఫోన్–ఐడియా (వీఐ) భారీ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవో)కి తెరతీయనుంది. దీని ద్వారా రూ. 18,000 కోట్లు సమీకరించనుంది. ఏప్రిల్ 18–22 మధ్య ఎఫ్‌పీవో ఉండనుంది. ఇందుకోసం షేరు ధర రూ. 10–11 శ్రేణిలో ఉంటుంది. ఇటీవల ప్రమోటరు సంస్థకు ప్రిఫరెన్షియల్ షేర్ల కేటాయింపునకు సంబంధించి నిర్ణయించిన రూ. 14.87 రేటుతో పోలిస్తే ఇది సుమారు 26 శాతం తక్కువ. కనీసం 1,298 షేర్లకు బిడ్ చేయాల్సి ఉంటుంది. ఎఫ్‌పీవో ద్వారా సేకరించిన నిధులను 4జీ నెట్వర్క్ విస్తరణ, 5జీ నెట్‌వర్క్‌ల ఏర్పాటుతో పాటు పన్నులు, బాకీలు చెల్లించడానికి వొడాఫోన్ ఐడియా వినియోగించుకోనుంది. 2020లో యస్ బ్యాంక్ రూ. 15,000 కోట్ల ఫాలో ఆన్ తర్వాత ఇదే అతి పెద్ద ఎఫ్‌పీవో కానుంది. బ్రిటన్ టెలికం సంస్థ వొడాఫోన్ గ్రూప్ భారత్‌లో తన వ్యాపారాన్ని ఐడియా సెల్యులార్తో విలీనం చేయడం ద్వారా 2018లో వొడాఫోన్ ఐడియా ఏర్పడింది. ప్రస్తుతం రూ. 2.1 లక్షల కోట్ల రుణభారంతో మనుగడ కోసం సతమతమవుతోంది. శుక్రవారం వొడాఫోన్–ఐడియా షేరు రూ. 12.96 వద్ద క్లోజయ్యింది. జీక్యూజీ, ఎస్బీఐ ఎంఎఫ్ ఆసక్తి.. ఈ ఎఫ్‌పీవోలో దాదాపు 800 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 6,500 కోట్లు) వరకు ఇన్వెస్ట్ చేయాలని జీక్యూజీ పార్ట్నర్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్ఆర్ఐ రాజీవ్ జైన్ సారథ్యంలోని అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ జీక్యూజీ పార్ట్నర్స్ 500 మిలియన్ డాలర్లు, ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్ 200–300 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
ఎఫ్‌పీఐ పెట్టుబడుల విలువ డౌన్
న్యూఢిల్లీ: దేశీ ఈక్విటీలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడుల విలువ 2022 డిసెంబర్‌కల్లా 11 శాతం క్షీణించింది. మార్నింగ్‌స్టార్ నివేదిక ప్రకారం 584 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. ఈ విలువ 2021 డిసెంబర్లో 654 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇందుకు ప్రధానంగా దేశీ స్టాక్ మార్కెట్ల రిటర్నులు నీరసించడం, ఈక్విటీల నుంచి విదేశీ పెట్టుబడులు వెనక్కి మళ్లడం వంటి అంశాలు ప్రభావం చూపాయి. అయితే త్రైమాసికవారీగా చూస్తే ఎఫ్‌పీఐల పెట్టుబడులు 3 శాతం బలపడ్డాయి. 2022 సెప్టెంబర్‌కల్లా 566 బిలియన్ డాలర్లుగా నమోదుకాగా.. డిసెంబర్‌కల్లా 584 బిలియన్ డాలర్లకు పుంజుకున్నాయి. కాగా.. దేశీ ఈక్విటీ మార్కెట్లో ఎఫ్‌పీఐ పెట్టుబడుల వాటా సెప్టెంబర్‌తో పోలిస్తే డిసెంబర్‌కల్లా 16.97 శాతం నుంచి 17.12 శాతానికి మెరుగుపడింది. 2020, 2021 కేలండర్ ఏడాదుల్లో వృద్ధి చూపిన గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లు 2022లో కుదుపులు చవిచూసిన విషయం విదితమే. దీంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు పలు సవాళ్లను ఎదుర్కొన్నాయి. ఈ బాటలో దేశీయంగానూ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూశాయి. అయినప్పటికీ ప్రపంచంలోనే దేశీ మార్కెట్లు సానుకూల రిటర్నులు ఇచ్చిన జాబితాలో నిలవడం గమనార్హం! 4.5 శాతం ప్లస్ బీఎస్ఈ సెన్సెక్స్ 4.5 శాతం లాభపడగా.. మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.4 శాతం పుంజుకుంది. అయితే స్మాల్ క్యాప్ 1.8% నష్టపోయింది. 2022లో పలు ప్రతికూలతల నడుమ దేశీ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు భారీగా తరలిపోయాయి. -
అదానీ షేర్ల బ్లడ్ బాత్: ఆరు రోజుల నష్టం, ఆ దేశాల జీడీపీతో సమానం!
సాక్షి,ముంబై: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన పరిశోధన నివేదిక సునామీతో అదానీ గ్రూప్ షేర్లన్నీ పతనం వరుసగా కొనసాగుతోంది. కంపెనీకి చెందిన 10 స్టాక్‌లు భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. దీంతో ఆసియా కుబేరుడుగా నిలిచిన అదానీ చైర్మన్ గౌతం అదానీ, ప్రపంచ బిలియనీర్ల ర్యాంకు నుంచి 16 స్థానానికి పడిపోయారు. అదానీ నికర విలువ ఒక వారంలో దాదాపు సగానికి పడిపోయింది. కేవలం ఆరు ట్రేడింగ్ సెషన్ల వ్యవధిలో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్లో రూ. 8.76 లక్షల కోట్లు (107 బిలియన్ డాలర్లు) నష్టపోయాయి. ఇది (రూపాయి-డాలర్ మార్పిడి రేటు 81.80 వద్ద) ఇథియోపియా లేదా కెన్యా జీడీపీతో సమానమట. వీటి వార్షిక జీడీపీ 110-111 బిలియన్ల డాలర్లు (ప్రపంచ బ్యాంకు). అదానీ టోటల్ గ్యాస్ 6 రోజుల రూట్లో 29 బిలియన్ల డాలర్లు పైగా నష్టపోయింది. మార్కెట్ విలువలో 26.17బిలియన్ల డాలర్లను కోల్పోయింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం,గత సంవత్సరం సెప్టెంబర్‌లో గరిష్టంగా 150 బిలియన్ల డాలర్లున్న అదానీ వ్యక్తిగత సంపద హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల తరువాత ( జనవరి 24 నాటికి) 119 బిలియన్ల డాలర్లకు పడిపోయింది. కాగా ఫోర్బ్స్ అదానీ సంపదను 64.6 బిలియన్ డాలర్లుగా గురువారం అంచనా వేసింది. దీని ప్రకారం అదానీ వ్యక్తిగత సంపద 85 బిలియన్ డాలర్లు పతనం. ఇది బల్గేరియా వార్షిక జీడీపీకి సమానం! అదానీ పోర్ట్స్ మార్కెట్ క్యాప్ రూ. 65,000 కోట్లకు పైగా క్షీణించగా, అదానీ ఎంటర్ప్రైజెస్ గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో రూ. 2.1 లక్షల కోట్లు హుష్ కాకి అయిపోయాయి. గత సంవత్సరం అదానీ కొనుగోలు చేసిన అంబుజా సిమెంట్స్, దాని m-క్యాప్ దాదాపు రూ. 29,000 కోట్లు పడిపోయింది, ఇది 29శాతం పతనం. అదానీ గ్రీన్ ఎనర్జీ (16.95 బిలియన్ డాలర్లు క్షీణత) అదానీ ట్రాన్స్మిషన్ (16.36 బిలియన్ డాలర్లు కోల్పోయింది) విలువపరంగా భారీ పెట్టుబడిదారుల సంపదను కోల్పోయిన అదానీ గ్రూప్ స్టాక్‌లు. ఇంకా అదానీ పోర్ట్స్ & SEZ (7.89 బిలియన్ డాలర్లు), అంబుజా సిమెంట్స్ (3.55 బిలియన్ డాలర్లు ) అదానీ విల్మార్ (2.4బిలియన్ డాలర్లు ) ఏసీసీ (1.13 బిలియన్ డాలర్లు) కోల్పోయాయి. ఇక ఎఫ్‌పీవో ఉపహసంహరణ తరువాత అదానీ షేర్లను కొనేవాళ్లకు లేక చాలా వరకు లోయర్ సర్క్యూట్ కావడం గమనార్హం. గురువారం అదానీ షేర్ల తీరు ఇలా అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్‌పీవో ఉపసంహరణ తరువాత ఈ స్టాక్ గురువారం రెండవ వరుస సెషన్లో 30శాతం క్రాష్ అయ్యింది. 1,494.75 వద్ద కొత్త 52 వారాల కనిష్ట స్థాయిని నమోదు చేసింది అదానీ టోటల్ గ్యాస్ 10 శాతం పడి, రూ. 1,707లోయర్ సర్క్యూట్ అదానీ గ్రీన్ ఎనర్జీ 10 శాతం కుప్పకూలి కొత్త 52 వారాల కనిష్టాన్ని తాకింది. అదానీ ట్రాన్స్మిషన్ కొత్త 52 వారాల కనిష్ట స్థాయి, 10శాతం నష్టంతో లోయర్ సర్క్యూట్‌ను అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ 14.35 కుప్పకూలి , 52 వారాల కనిష్ట స్థాయి అదానీ పవర్ 5శాతం నష్టంతో లోయర్ సర్క్యూట్ అదానీ విల్మార్ 5శాతం నష్టంతో లోయర్ సర్క్యూట్‌ను తాకింది. -
షాకింగ్ డెసిషన్‌పై మౌనం వీడిన గౌతం అదానీ: వీడియో
సాక్షి,ముంబై: అదానీ గ్రూపు, హిండెన్‌బర్గ్ వివాద సునామీలో అదానీ ఎంటర్ ప్రైజెస్ ఎప్‌ఫీవో కచ్చితంగా ఉండి తీరుతుందని ప్రకటించింది అదానీ. ఈ మేరకు ఎఫ్‌పీవో పూర్తిగా సబ్‌స్క్రైబ్ తరువాత కూడా అనూహ్యంగా అదానీ ఎంటర్ ప్రైజెస్ ఎఫ్‌పీవో విషయంలో అదానీ గ్రూప్ వెనక్కి తగ్గింది. అతిపెద్ద 20000 కోట్ల మలి విడత పబ్లిక్ ఆఫర్‌ను ఉపసంహరించుకున్నామంటూ అందరికీ షాకిచ్చింది. అయితే ఇన్వెస్టర్ల సొమ్మును తిరిగి ఇచ్చేస్తామని అదానీ గ్రూపు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ తొలిసారి స్పందించారు. తాము తీసుకున్న నిర్ణయంపై స్వయంగా క్లారిటీ ఇచ్చారు. మార్కెట్ వోలటాలీటీనేతమ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలిపారు. ఇన్వెస్టర్లు నష్టాలకు గురి కాకూడదనే షేర్ల విక్రయానికి పిలుపునివ్వాలని గ్రూప్ నిర్ణయించినట్లు అదానీ గురువారం తెలిపారు. బుధవారం నాటి మార్కెట్ అస్థిరతను పరిగణనలోకి తీసుకుంటే, ఎఫ్‌పిఓతో కొనసాగడం నైతికంగా సరైనది కాదని బోర్డు గట్టిగా భావించిందని అదానీ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఇది అదానీ గ్రూప్ సంస్థల ప్రస్తుత కార్యకలాపాలు లేదా భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగానూ ప్రభావితం చేయదంటూ ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చారు. తమ బ్యాలెన్స్ షీట్ బలంగానే ఉందని, సంస్థ రుణ బాధ్యతలను నెరవేర్చటంలో సంస్థకున్న ట్రాక్ రికార్డు కూడా బాగుందంటూ ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చే ప్రయత్నం చేశారు. Chairman @gautam_adani's address to investors after withdrawal of the fully subscribed AEL FPO#GrowthWithGoodness #NationBuilding #AdaniGroup pic.twitter.com/f9yaYrxCzx — Adani Group (@AdaniOnline) February 2, 2023 -
సరైన సమయం కాదు.. అందుకే రూ. 20,000 కోట్ల ఎఫ్‌పీవోను వెనక్కి ఇస్తున్నాం: అదానీ గ్రూప్
ముంబై: ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవో) పూర్తిగా సబ్స్క్రయిబ్ అయినప్పటికీ ఇష్యూను ఉపసంహరించుకోవాలని అదానీ గ్రూప్ నిర్ణయించింది. ప్రస్తుతం అసాధారణ పరిస్థితులు, మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు నెలకొన్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. ఎఫ్‌పీవో ద్వారా సేకరించిన నిధులను ఇన్వెస్టర్లకు తిరిగి ఇవ్వనున్నట్లు సంస్థ చైర్మన్ గౌతమ్ అదానీ తెలిపారు. తమ బ్యాలెన్స్ షీట్ పటిష్టంగానే ఉందని, రుణాల తిరిగి చెల్లింపుల్లో మంచి ట్రాక్ రికార్డు ఉందని పేర్కొన్నారు. అదానీ ఎంటర్ప్రైజెస్ రూ. 20,000 కోట్ల ఎఫ్‌పీవో జనవరి 31న ముగిసిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్ ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్టుతో బుధవారం కూడా గ్రూప్ సంస్థల షేర్లు భారీగా నష్టపోయిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. చదవండి: Union Budget 2023: ఇళ్ల కొనుగోలుదారులకు శుభవార్త.. ఆ పథకానికి భారీగా నిధులు పెంపు! -
అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్‌పీఓ ఓకే
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ ఎంటర్ప్రైజెస్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీఓ) విజయవంతమైంది. మంగళవారం(31) చివరిరోజుకల్లా పూర్తిస్థాయిలో బిడ్స్ దాఖలయ్యాయి. కంపెనీ 4.55 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. స్టాక్ ఎక్సే్ఛంజీల గణాంకాల ప్రకారం 5.08 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు లభించాయి. నాన్రిటైల్ ఇన్వెస్టర్లు ప్రధానంగా భారీ సంఖ్యలో బిడ్స్ దాఖలు చేయడం ఇందుకు సహకరించింది. నాన్‌ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 96.16 లక్షల షేర్లను రిజర్వ్ చేయగా.. మూడు రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. ఇక అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 1.28 కోట్ల షేర్లు ఆఫర్ చేయగా.. 1.2 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. అయితే రిటైల్ ఇన్వెస్టర్లు, కంపెనీ ఉద్యోగుల నుంచి అంతంతమాత్ర స్పందనే లభించినట్లు బీఎస్ఈ గణాంకాలు వెల్లడించాయి. రిటైలర్లకు 2.29 కోట్ల షేర్లు కేటాయించగా.. 12 శాతానికే దరఖాస్తులు వచ్చాయి. ఉద్యోగులకు పక్కనపెట్టిన 1.62 లక్షల షేర్లకుగాను 55 శాతానికే స్పందన లభించింది. ఎఫ్పీవోకింద కంపెనీ మొత్తం 6.14 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. యాంకర్ ఇన్వెస్టర్లుసహా ఇతరుల నుంచి 6.45 కోట్ల షేర్లకు డిమాండ్ నమోదైంది. షేరు అప్ ఎఫ్‌పీవో ధరల శ్రేణి రూ. 3,112–3,276కాగా.. ఇష్యూ ముగింపు నేపథ్యంలో అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు బీఎస్ఈలో 3.35 శాతం బలపడి రూ. 2,975 వద్ద ముగిసింది. గత వారం కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 5,985 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. మొత్తం 33 ఫండ్స్‌కు 1.82 కోట్ల షేర్లను కేటాయించింది. షేరుకి రూ. 3,276 ధరలో జారీ చేసింది. షేర్లను కొనుగోలు చేసిన విదేశీ ఇన్వెస్టర్ల జారబితాలో అబు ధాబి ఇన్వెస్ట్మెంట్ అధారిటీ, బీఎన్పీ పరిబాస్ ఆర్బిట్రేజ్, సొసైటీ జనరాలి, గోల్డ్‌మన్ శాక్స్ ఇన్వెస్ట్మెంట్ (మారిషస్), మోర్గాన్ స్టాన్లీ ఏషియా(సింగపూర్), నోమురా సింగపూర్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ మారిషన్ తదితరాలున్నాయి. యాంకర్బుక్లో దేశీ దిగ్గజాలు ఎల్ఐసీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ ఎంప్లాయీ పెన్షన్ ఫండ్ తదితరాలున్నాయి. ఎఫ్‌పీవో నిధుల్లో రూ. 10,689 కోట్లను గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు, ప్రస్తుత ఎయిర్‌పోర్టుల పనులు, గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం తదితరాలకు వినియోగించనుంది. -
వివాదాల నడుమ అదానీకి భారీ ఊరట: వేల కోట్ల లైఫ్‌లైన్
సాక్షి,ముంబై: అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలతో అతలాకుతలమవుతున్న వేళ అదానీకి భారీ ఊరట లభించింది. ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవో)కి వచ్చిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో అబుదాబి కంపెనీ భారీ పెట్టుబడులను ప్రకటించింది. రూ. 20వేల కోట్ల ఎఫ్‌పీవోలో 16 శాతం సబ్‌స్క్రిప్షన్‌ను ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (ఐహెచ్సీ) ఇక్కిందిచుకుంది 2023లో ఐరోపా, ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికాలో దృష్టితోపాటు, స్థానిక, అంతర్జాతీయ పెట్టుబడుల్లో ఈ ఏడాది ఇదే తమ తొలి పెట్టుబడి అని కంపెనీ పేర్కొంది. (అదానీ గ్రూప్ దేశ భవిష్యత్తును వెనక్కి లాగుతోంది:అదానీకి హిండెన్‌బర్గ్ కౌంటర్) అబుదాబి కంపెనీ ఐహెచ్‌సీకి చెందిన అనుబంధ సంస్థ గ్రీన్ ట్రాన్స్మిషన్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ ద్వారా అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్‌పీవోలో 400 మిలియన్ డాలర్లు (రూ. 3,200 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు సోమవారం తెలిపింది. అదానీ గ్రూప్‌పై తమ ఆసక్తి, అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఫండమెంటల్స్‌పై నమ్మకంతో, బలమైన వృద్ధిని తన వాటాదారులను అదనపు విలువును ఆశిస్తున్నామని ఐహెచ్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సయ్యద్ బాసర్ షుబ్ అన్నారు. క్లీన్ ఎనర్జీ , ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో 2023లో గ్లోబల్ అక్విజిషన్ను 70శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్‌పీవో రెండో రోజు కేవలం 3 శాతం సబ్‌స్క్రైబ్ అయింది. ఈక్విటీ షేర్‌కు రూ. 3,112 ,రూ. 3,276 ప్రీమియం ప్రైస్ బ్యాండ్ వద్ద ఇష్యూ మంగళవారం ముగియనుంది. (రానున్న బడ్జెట్ సెషన్లో అదానీ గ్రూప్ vs హిండెన్‌బర్గ్ సునామీ?) కాగా అదానీ గ్రూప్‌లో ఐహెచ్‌సీకి రెండో పెట్టుబడి ఒప్పందం. గత సంవత్సరం అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్ , అదానీ ఎంటర్‌ప్రైజెస్‌తో సహా అదానీ గ్రూప్‌లోని మూడు గ్రీన్ ఫోకస్డ్ కంపెనీలలో 2 బిలియన్ల డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. పెట్టుబడి పెట్టింది. ఈ మూడు సంస్థలు బీఎస్సీ,ఎన్ఎస్సీలలో లిస్ట్ అయిన సంగతి తెలిసిందే. (చైనా సరిహద్దు ఉద్రిక్తత: ఈ సారి కూడా రక్షణ రంగానికి ప్రాధాన్యత?) -
ఎఫ్‌పీవోకు అదానీ ఎంటర్ప్రైజెస్ సై
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ ఎంటర్ప్రైజెస్(ఏఈఎల్) ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీవో)కు రంగం సిద్ధం చేసింది. ఇందుకు రూ. 3,112 నుంచి రూ. 3,276 ధరల శ్రేణిని నిర్ణయించింది. ఇది తాజా ధరతో పోలిస్తే 10–15 శాతం తక్కువ. రిటైల్ ఇన్వెస్టర్లకు షేరుకి రూ. 64 డిస్కౌంట్ ప్రకటించింది. రిటైలర్లు కనీసం 4 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఆపై ఇదే గుణిజాల్లో దరఖాస్తు చేయవచ్చు. ఇష్యూ ద్వారా రూ. 20,000 కోట్లు సమకూర్చుకోవాలని కంపెనీ భావిస్తోంది. వెరసి దేశీయంగా అతిపెద్ద ఎఫ్‌పీవోగా నిలవనుంది. ఆఫర్ ఈ నెల 27న ప్రారంభమై 31న ముగియనుంది. నిధుల వినియోగమిలా: ఎఫ్‌పీవో నిధుల్లో రూ. 10,869 కోట్లను గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు, ప్రస్తుత విమానాశ్రయాలు, గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణాలపై అదానీ ఎంటర్ప్రైజెస్ వెచ్చించనుంది. మరో రూ.4,165 కోట్లను ఎయిర్‌పోర్టులు, రోడ్, సోలార్ ప్రాజెక్టు సంబంధ అనుబంధ సంస్థల రుణ చెల్లింపులకు వినియోగించనుంది. గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీ ప్రస్తుతం గ్రీన్ హైడ్రోజన్ ఎకోసిస్టమ్, డేటా సెంటర్లు, ఎయిర్‌పోర్టులు, రహదారుల అభివృద్ధి, ఫుడ్, ఎఫ్ఎంసీజీ, డిజిటల్, మైనింగ్ డిఫెన్స్, తదితర విభాగాలలో కార్యకలాపాలు విస్తరించిన సంగతి తెలిసిందే. 7 విమానాశ్రయాలు ఏఈఎల్ ప్రస్తుతం నవీముంబైలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్టుసహా ముంబై, అహ్మదాబాద్, లక్నో, మంగళూరు, జైపూర్, గువాహటి, తిరువనంతపురంలలో ఎయిర్‌పోర్టులను నిర్వహిస్తోంది. రహదారులు తదితర మౌలిక ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. రానున్న దశాబ్ద కాలంలో గ్రీన్ హైడ్రోజన్ ఎకోసిస్టమ్‌పై 50 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసే ప్రణాళికలు ప్రకటించింది. 2022 సెప్టెంబర్ 30కల్లా కంపెనీ రూ. 40,023 కోట్లకుపైగా రుణ భారాన్ని కలిగి ఉంది. ఎఫ్‌పీవో వార్తల నేపథ్యంలో అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు 1.5% నీరసించి రూ. 3,585 వద్ద ముగిసింది. -
ఈ కేంద్ర పథకం గురించి మీకు తెలుసా.. ఇలా చేస్తే రూ.15 లక్షలు వస్తాయ్!
రైతుల పరిస్థితిని మెరుగుపరిచేందుకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలతో పాటు అనేక విధానాలను అనుసరిస్తున్నాయి. మోదీ సర్కార్ ఇప్పటికే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన, ఉచిత రేషన్ వంటివి అందిస్తూ రైతులకు ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఈ తరహాలోనే కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ (FPOల) పేరుతో మరో పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా రైతులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అనగా రైతులకు ప్రధానమంత్రి ఎఫ్పిఓ పథకం కింద రూ. 15 లక్షల వరకు సహాయం అందిస్తారు. తద్వారా వారు వ్యవసాయ పరిశ్రమలో ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అయితే రైతులు వ్యవసాయం, వ్యాపారం చేసేందుకు సహకరించే ఈ పథకం గురించి చాలా మందికి తెలియకపోవచ్చు కూడా. దీని కింద రైతులకు అందించే డబ్బులను వ్యవసాయ పనిముట్లు, ఎరువులు సహా ఇతరాత్రా సాగు సంబంధ వ్యాపార అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. అయితే ఇందుకోసం, 11 మంది రైతులు కలిసి ఒక సంస్థని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం రూ.15 లక్షలు వరకు గ్రాంట్ ఆఫ్ మ్యాచింగ్ ఈక్విటీ ఇస్తుంది. అందుకోసం ప్రభుత్వ వెబ్సైట్ ఈనాం (ENAM) లో నమోదు కావాల్సి ఉంటుంది. చదవండి: Double Toll Tax Rate: వాహనదారులకు భారీ ఊరట?..ఫాస్టాగ్‌పై కోర్టులో పిటిషన్..అదే జరిగితే.. -
ఫ్లిప్‌కార్ట్‌లో సెర్ప్ ఉత్పత్తులు
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫుడ్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్(ఎఫ్‌పీవోలు), స్వయం సహాయక సంఘాల పంట ఉత్పత్తుల విక్రయానికి సంబంధించి ఆన్లైన్ సంస్థ ఫ్లిప్‌కార్ట్, రాష్ట్ర ప్రభుత్వ సంస్థ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ(సెర్ప్) మధ్య ఒక ఒప్పందం కుదిరింది. శనివారం ఇక్కడి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో జరిగిన ఈ కార్యక్రమానికి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దయాకర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ తెలంగాణ పంట ఉత్పత్తు లను ఇన్నాళ్లూ ఇక్కడే అమ్ముకోవాల్సి వచ్చేదని, తాజా ఒప్పందం వల్ల అవి ఇప్పుడు దేశంలోని 40కోట్ల మంది ఫ్లిప్‌కార్ట్ వినియోగ దారులకు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఎఫ్‌పీవోలు రైతుల నుంచి నేరుగా ఉత్పత్తులు కొనుగోలు చేసి ఫ్లిప్‌కార్ట్‌కు అమ్ముతుండటం వల్ల దళారీ వ్యవస్థ అనేది లేకుండా పోతుందని, రైతులకు తగిన ధర లభించడంతోపాటు వినియోగదారుడికీ చౌకగా ఉత్పత్తులు అందుతాయని అన్నారు. 130 రకాల వస్తువు లను ఈ ఒప్పందంలో భాగంగా మహిళా సంఘాలు విక్రయిస్తా యని చెప్పారు. ఈ ఒప్పందం మహిళల సాధికారతకు ముందడుగు అని ఫ్లిప్‌కార్ట్ గ్రాసరీ విభాగపు వైస్ ప్రెసిడెంట్ స్మృతి రవిచంద్రన్ అన్నారు. ఫ్లిప్‌కార్ట్ అవసరాలకు తగ్గట్టు నాణ్యమైన సర కులు అందించగలమన్న ధీమాను స్వయం సహాయక సంఘాల మహిళలు వ్యక్తం చేశారని, రాష్ట్రమంతా తిరిగి చర్చలు జరిపిన తర్వాతే ఈ ఒప్పందం సిద్ధమైందని చెప్పారు. పంట ఉత్పత్తుల నాణ్యతను కాపాడుతూ వాటిని వినియోగదారులకు అందించేం దుకు ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే దాదాపు పదివేల మంది రైతులకు శిక్షణ ఇచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో పీఆర్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సెర్ప్ సీఓఓ రజిత నార్దెల్ల పాల్గొన్నారు. -
రుచీ సోయా ఎఫ్‌పీవో ఓకే, కేటుగాళ్లకు చెక్‌పెట్టిన సెబీ!
న్యూఢిల్లీ: వంట నూనెల దిగ్గజం రుచీ సోయా ఇండస్ట్రీస్ ఎఫ్‌పీవో పూర్తయ్యింది. ఇష్యూకి రూ. 650 ధరను ఖరారు చేసింది. అయితే 97 లక్షల బిడ్స్ ఉపసంహరణకు లోనయ్యాయి. షేరుకి రూ. 615–650 ధరలో రూ. 4,300 కోట్ల సమీకరణకు కంపెనీ ఎఫ్‌పీవో చేపట్టింది. అయితే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అవసరమైతే ఇన్వెస్టర్లు బిడ్స్‌ను ఉపసంహరించేందుకు వీలు కల్పించమని కంపెనీని ఆదేశించింది. షేర్ల విక్రయంపై అయాచిత ఎస్ఎంఎస్లు సర్క్యులేట్కావడంతో సెబీ అనూహ్యంగా స్పందించింది. దీంతో ఈ నెల 28న ముగిసిన ఇష్యూలో భాగంగా 30వరకూ బిడ్స్ ఉపసంహరణకు రుచీ సోయా అవకాశమిచ్చింది. బాబా రామ్‌దేవ్ ఆధ్వర్యంలోని రుచీ సోయా ఎఫ్‌పీవో కోసం 4.89 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. 17.6 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. కాగా.. యాంకర్ ఇన్వెస్టర్లకు సైతం రూ. 650 ధరను ఖరారు చేసింది. గత వారం ఈ సంస్థలకు 1.98 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా రూ. 1,290 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. మహాకోష్, సన్‌రిచ్, రుచీ గోల్డ్, న్యూట్రెలా బ్రాండ్లు పతంజలి గ్రూప్‌నకు చెందిన రుచీ సోయా సొంతం. రుచీ సోయా షేరు ఎన్ఎస్ఈలో 2.2 శాతం క్షీణించి రూ. 937 వద్ద ముగిసింది. -
ఎఫ్‌పీవోలో రాందేవ్‌బాబా ప్రభంజనం!.. రంగంలోకి దిగిన మోసగాళ్లు?
న్యూఢిల్లీ: దివాలా ప్రక్రియలో భాగంగా 2019లో వేలానికి వచ్చిన రుచి సోయాను బాబా రామ్‌దేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద్ రూ. 4,350 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి రుచి సోయా బ్రాండ్‌పై పతంజలి తనదైన ముద్రను వేయగలిగింది. తాజాగా రుచి సోయా బ్రాండ్ విస్తరణలో భాగంగా ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్‌కు వస్తోంది రుచి సోయా. ఫుల్ డిమాండ్ దాదాపు రూ. 4,300 కోట్లు సమీకరించేందుకు రుచి సోయా ఇండస్ట్రీస్ తలపెట్టిన ఫాలో అన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవో) మార్చి 24న ప్రారంభమైంది. ఈ ఎఫ్‌పీవో రికార్డు స్థాయింలో 3.60 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.1,290 కోట్లు సమీకరించింది. బీఎస్ఈ గణాంకాల ప్రకారం 4.89 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా 17.60 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయర్స్ (క్యూఐబీ) కోటా 2.20 రెట్లు, సంస్థగతయేతర ఇన్వెస్టర్ల కోటా 11.75 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది. రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 90 శాతం సబ్స్క్రయిబ్ అయ్యింది. ఎఫ్‌పీవో కింద షేరు ధర శ్రేణి రూ. 615–650గా ఉంది. ఏమార్చే ప్రయత్నం పతంజలి బ్రాండ్‌కు ఉన్న విలువ, బాబారాందేవ్ మీద నమ్మకంతో రిటైల్ ఇన్వెస్టర్లు కూడా ఈ షేర్ల కోసం ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో రుచి సోయా షేర్లను మార్కెట్ ధరకే తక్కువగా దాదాపు 30 శాతం డిస్కౌంట్‌తో అందిస్తామంటూ పర్సనల్ నంబర్లకు, సోషల్ మీడియాలో మెసేజ్‌లు భారీ ఎత్తున తిరుగుతున్నాయి. ఈ షేర్లు సొంతం చేసుకోవాలంటే మీ యూపీఐ, బ్యాంక్ ఖాతా, డిమ్యాట్ ఖాతా, బ్రోకర్ ద్వారా దరఖాస్తు చేసుకోండంటూ ఆయా మెసేజ్‌లలో కోరుతున్నారు. హరిద్వార్‌లో ఫిర్యాదు డిస్కౌంట్ ధరకే రుచి సోయా షేర్లు అందిస్తామంటూ చక్కర్లు కొడుతున్న మెసేజ్‌లపై పతంజలి గ్రూపు స్పందించింది. డిస్కౌంట్ ధరలో రుచి సోయా షేర్ల పేరుతో వస్తున్న మెసేజ్‌కి పతంజలి గ్రూపు డైరెక్టర్లు, ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్‌కి సంబంధం లేదని.. ఈ ఫేక్ మెసేజ్‌లపై దర్యాప్తు జరిపి తగు చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖని కోరింది పతంజలి గ్రూపు. ఈ మేరకు 2022 మార్చి 27న హరిద్వార్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు 0188 నంబరుతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అప్రమత్తమైన సెబీ రుచి సోయా పేరుతో చక్కర్లు కొడుతున్న మెసేజ్‌పై సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) అప్రమత్తమైంది. ఫేక్ మెసేజ్‌పై ప్రజలను అప్రమత్తం చేసేందుకు పత్రికా ప్రకటనలు ఇవ్వాలంటూ రుచి సోయా ప్రమోటర్లకు సెబీ సూచించింది. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. మరోవైపు ఎఫ్‌పీవోలో ఈ షేర్ల కొనుగోలు విషయంలో పునరాలోచన చేసుకునే అవకాశాన్నివ ఇన్వెస్టర్లకు కల్పించింది. బంపర్ హిట్ మంగళవారం మార్కెట్లో రుచి సోయా షేరు ధర దూసుకుపోయింది. ఉదయం 11 గంటల సమయంలో 102 పాయింట్లు లాభపడి 915 దగ్గర ట్రేడవుతోంది. -
ఎఫ్‌పీవోల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రోత్సాహం: తోమర్
న్యూఢిల్లీ: దేశంలోని చిన్న, సన్నకారు రైతుల ఆదాయం పెంపులో భాగంగా మరిన్ని ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్(ఎఫ్‌పీవో) ఏర్పాటు ను ప్రోత్సహిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు. సోమవారం సీఐఐ–ఎన్సీడీఈఎక్స్ ఎఫ్‌పీవో సమ్మిట్ నిర్వహించిన సదస్సులో మంత్రి ఈ విషయం వెల్లడించారు. రూ.6,865 కోట్ల పెట్టుబడితో 10వేల ఎఫ్‌పీవోల ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని చెప్పారు. ఇవి పనిచేయడం ప్రారంభిస్తే క్లస్టర్ ఆధారంగా ఒక్కో జిల్లా ఒక్కో వ్యవసాయ ఉత్పత్తిలో ప్రత్యేకత సాధిస్తుందన్నారు. -
స్వయం సమృద్ధిని సాధించేందుకు కార్పొరేట్ సంస్థలతో..!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) రాష్ట్రంలోని రైతు ఉత్పత్తుల సంస్థలు (ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్) స్వయం సమృద్ధిని సాధించేందుకు కార్పొరేట్ సంస్థలతో కలిసి మార్కెటింగ్ అవకాశాల కల్పన, ఇతరత్రా మెరుగైన వ్యవస్థ ఏర్పాటు విషయంలో కీలక భూమికను పోషించనున్నట్టు నాబార్డ్ రాష్ట్ర సీజీఎం వైకే రావు తెలిపారు. చిన్న, సన్నకారు రైతుల వ్యవసాయ ఆదాయాన్ని పెంచేందుకు ఎఫ్‌పీవోలు ఒక్కటే మార్గమని, అందువల్లే వాటిని మరింత ప్రోత్సహించేందుకు తమ సంస్థ చర్యలు తీసుకుంటోందన్నారు. గత నాలుగేళ్లలో రాష్ట్రంలోని 330 ఎఫ్‌పీవోలకు అవసరమైన సహకారాన్ని అందించి ముందుకు తీసుకెళుతున్నట్టు, 2020–21లో నవకిసాన్ ద్వారా 57 ఎఫ్‌పీవోలకు నాబార్డ్ క్రెడిట్ లింకేజీని ఇచ్చిందన్నారు. బంగారు తెలంగాణ కోసం ప్రభుత్వానికి అవసర మైన సహాయ సహకారాలను నాబార్డ్ అందిస్తుందని చెప్పారు. మొత్తంగాచూస్తే 2020–21 ఆర్థిక సంవత్సరంలో వివిధ రూపాల్లో నాబార్డ్ రాష్ట్రానికి రూ.20,549 కోట్ల మేర సహకారాన్ని, మద్దతును అందించినట్టు, ఇది 2019–20తో పోల్చితే 25.09 శాతం ఎక్కువని ఒక ప్రకటనలో తెలిపారు. 2020–21లో బ్యాంకులకు రూ. 13,915.22 కోట్ల పంటరుణాలు, టర్మ్లోన్ల కింద అందజేసినట్లు, అందులో రూ.వందకోట్లు నాబార్డ్ మద్దతు అందించిన వాటర్‌షెడ్ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు అందజేసినట్టు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్రానికి రూ. 6,633 కోట్లు, కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్కింద మల్లన్నసాగర్ రిజర్వాయర్ కోసం రూ. 4,600 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్‌కు రూ. 2,500 కోట్లు క్యాష్ క్రెడిట్ కింద మంజూరు చేసి పంపిణీ చేసినట్టు వైకేరావు వెల్లడించారు. చదవండి: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో నూతనోత్సాహం -
ఎఫ్‌పీఓ సీసీపై టీడీపీ నేత దాడి
ముదిగుబ్బ(అనంతపురం జిల్లా): రైతు ఉత్పత్తి సంఘాలలో తీసుకున్న రుణాలపై రికవరీకి వెళ్లిన ఎఫ్‌పీఓ సీసీ శివయ్యపై టీడీపీ నాయకుడు దాడి చేశాడు. బాధితుడు తెలిపిన మేరకు... రైతు ఉత్పత్తి సంఘాలలో షిర్డీసాయి రైతు ఉత్పత్తి సంఘం ద్వారా నాగారెడ్డిపల్లికి చెందిన పది మంది రైతులు 2019లో రూ.1.05 లక్షల రుణం తీసుకున్నారు. ఈ రుణం రికవరీ కోసం సీసీ శివయ్య బుధవారం నాగారెడ్డిపల్లికి వెళ్లారు. ఆరు నెలలుగా రుణం కంతు చెల్లించని విషయాన్ని రైతు సంఘం అధ్యక్షుడు నీలకంఠారెడ్డి వద్ద చర్చిస్తుండగా సంఘం సభ్యుడైన టీడీపీ మండల మాజీ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి ముఖ్య అనుచరుడు దేవేంద్రరెడ్డి కలగజేసుకుని గొడవకు దిగాడు. అప్పు కట్టేది లేదని, ఎవరితోనైనా చెప్పుకోపో అంటూ సీసీపై దాడి చేశాడు. అంతటితే ఆగకుండా ఇక్కడే విద్యుత్ స్తంభానికి కట్టేస్తే ఎవడు వచ్చి విడిపించుకుపోతాడో చూస్తామంటూ బెదిరించాడు. అతడి వద్దనున్న సెల్‌ఫోన్‌ను లాక్కుని పంపించాడు. అనంతరం బాధిత ఎఫ్‌పీఓ సీసీ శివయ్య పట్నం పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ నగేష్ బాబు కేసు నమోదు చేసి నిందితుడు దేవేంద్రరెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. -
ఆగని యస్‌బ్యాంక్ పతనం
యస్‌బ్యాంక్ షేరు పతనం ఆగట్లేదు. గత కొన్నిరోజుల వరుస పతనాన్ని కొనసాగిస్తూ మంగళవారం మరో 3శాతం నష్టపోయింది. ఈ క్రమంలో ఇటీవల బ్యాంక్ జారీ చేసిన ఫాలో ఆన్ పబ్లిక్(ఎఫ్ఓపీ)ఆఫర్ ఇష్యూ ధర రూ.12 కంటే దిగువకు చేరుకుంది. బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు 9.75శాతం నష్టంతో రూ.11.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో షేరు మార్కెట్ ముగిసే సరికి రూ.3.25శాతం నష్టంతో రూ.11.95వద్ద స్థిరపడింది. యస్‌బ్యాంక్ షేరు వారం రోజుల్లో 41శాతం, నెలలో 57శాతం, ఏడాదిలో 75శాతం నష్టాన్ని చవిచూశాయి. యస్‌బ్యాంక్‌లో తగ్గిన ఎస్బీఐ వాటా యస్‌బ్యాంక్ ఎఫ్‌పీఓ ఇష్యూ తర్వాత బ్యాంక్‌లో తమ వాటా తగ్గినట్లు ఎస్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. యస్ బ్యాంక్ ఫాలోఆన్పబ్లిక్ ఆఫర్ ఇష్యూ ఈ జూలై 17న ముగిసింది. ఈ ఇష్యూ ద్వారా బ్యాంక్ మొత్తం రూ.15వేల కోట్లను సమీకరించింది. ఈ ఇష్యూలో జారీ చేయబడిన షేరు ఈ సోమవారం నుంచి ట్రేడ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో యస్‌బ్యాంక్‌లో ఎస్బీఐ వాటా మొత్తం వాటా 48.21శాతం నుంచి 30శాతానికి పరిమితమైంది. -
ఐసీఐసీఐ -యస్ బ్యాంక్ షేర్ల పతనం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి క్వార్టర్లో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించినప్పటికీ ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 5.5 శాతం పతనమై రూ. 361 దిగువన ట్రేడవుతోంది. క్యూ1(ఏప్రిల్-జూన్)లో ఐసీఐసీఐ నికర లాభం 36 శాతం పెరిగి రూ. 2599 కోట్లను అధిగమించింది. ప్రధానంగా జనరల్, లైఫ్ ఇన్సూరెన్స్ అనుబంధ సంస్థల పనితీరు ఇందుకు సహకరించినట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే కోవిడ్-19 సంబంధ ప్రొవిజన్లు రూ. 5,550 కోట్లు అదనంగా నమోదుకావడం ప్రతికూల అంశమని తెలియజేశారు. క్యూ1లో నికర వడ్డీ ఆదాయం 20 శాతం పుంజుకుని రూ. 9280 కోట్లను తాకింది. యస్ బ్యాంక్ ఈ నెల 15-17 మధ్య ఫాలోఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీవో) చేపట్టిన ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్ కౌంటర్లో ఒక్కసారిగా అమ్మకాలు ఊపందుకున్నాయి. కొనేవాళ్లు కరువుకావడంతో ఎన్ఎస్ఈలో 10 శాతం డౌన్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 12.30 వద్ద ఫ్రీజయ్యింది. తద్వారా ఎఫ్‌పీవో ధర రూ. 12 సమీపానికి చేరింది. కాగా.. ఎఫ్‌పీవో ద్వారా బ్యాంకు రూ. 14,272 కోట్లను సమీకరించింది. ఎఫ్‌పీవోలో భాగంగా బ్యాంక్ షేర్ల అలాట్మెంట్ను పూర్తిచేయడంతో ఇవి ట్రేడింగ్‌కు అందుబాటులోకి వచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కౌంటర్లో సుమారు 4.2 కోట్ల షేర్ల సెల్ ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 10న ఎఫ్‌పీవోకు రూ. 12 ధరను ఖరారు చేశాక యస్ బ్యాంక్ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నట్లు నిపుణులు తెలియజేశారు. వెరసి వారాంతానికల్లా యస్ బ్యాంక్ షేరు 55 శాతం దిగజారినట్లు వివరించారు. -
మళ్లీ కుప్పకూలిన యస్ బ్యాంక్ షేరు
ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీవో)కు ధరను నిర్ణయించే ముందురోజు అంటే ఈ నెల 9న యస్ బ్యాంక్ కౌంటర్లో భారీ అమ్మకాలు చోటు చేసుకున్నాయి. దీంతో షేరు 10 శాతం పతనమైంది. ఇదే రోజు కొంతమంది ఇన్వెస్టర్లు నెల రోజులకుగాను ఎస్ఎల్బీఎం(షేర్లను అరువు తెచ్చుకోవడం)ద్వారా దాదాపు 96 లక్షల యస్ బ్యాంక్ షేర్లను తీసుకున్నట్లు తెలుస్తోంది. షేరుకి రూ. 7 వడ్డీ రేటులో తీసుకున్న వీటి విలువ రూ. 5.9 కోట్లుకాగా.. ఆగస్ట్ 6న సెటిల్మెంట్ గడువు ముగియనుంది. మరుసటి రోజు బ్యాంక్ బోర్డు ఎఫ్‌పీవోకు రూ. 12 ధర(ఫ్లోర్ ప్రైస్)ను నిర్ణయించింది. ఈ నేపథ్యంలో యస్ బ్యాంక్ కౌంటర్లో నమోదైన ఎస్ఎల్బీఎం లావాదేవీలపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి పెట్టనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. వెరసి శుక్రవారం(10న) సైతం నేలచూపులతో ముగిసిన యస్ బ్యాంక్ కౌంటర్లో మరోసారి అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో యస్ బ్యాంక్ షేరు 11 శాతంపైగా కుప్పకూలి రూ. 22.7 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 21 వరకూ జారింది. గత రెండు రోజుల్లోనూ ఈ షేరు 15 శాతం పతనంకావడం గమనార్హం! ఈడీ దర్యాప్తు యస్ బ్యాంక్ మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రెండో ప్రాసెక్యూషన్ ఫిర్యాదును నేడు(13న) దాఖలు చేయవచ్చని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు కపిల్, ధీరజ్ వాధ్వాన్‌లతోపాటు.. 13 సంస్థలు, వ్యక్తులపై ఈడీ కంప్లయింట్ దాఖలు చేసే అవకాశమున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. డీహెచ్ఎఫ్ఎల్ నియంత్రణలోని బిలీఫ్ రియల్టర్ ప్రయివేట్ లిమిటెడ్‌కు గతంలో యస్ బ్యాంక్ రూ. 750 కోట్ల రుణం మంజూరు చేసినట్లు ఈ సందర్భంగా తెలియజేశాయి. కాగా.. పలు ప్రతికూల వార్తలతో ఇటీవల కొంతకాలంగా యస్ బ్యాంక్ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. దీంతో గత ఆరు నెలల్లో యస్ బ్యాంక్ షేరు 49 శాతం దిగజారింది. -
ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఈ వారంలో 3 ఇష్యూలు
ఈ వారం మూడు ఇష్యూలతో ప్రైమరీ, సెండరీ మార్కెట్లు సందడి చేయనున్నాయి. నేటి నుంచి స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ రోజారీ బయోటెక్ పబ్లిక్ ఇష్యూ ప్రారంభంకానుంది. ఐపీవోకు ధరల శ్రేణి రూ. 423-425కాగా.. ఇష్యూ బుధవారం(15న) ముగియనుంది. తద్వారా రూ. 496 కోట్లు సమకూర్చుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఇక మంగళవారం(14) నుంచి భారత్ బాండ్ ఈటీఎఫ్ రెండో దశ మొదలుకానుంది. పీఎస్‌యూ కంపెనీల బాండ్లలో ప్రధానంగా పెట్టుబడులుంటాయి. ప్రభుత్వం తరఫున ఎడిల్వీజ్ మ్యూచువల్ ఫండ్ వీటిని చేపడుతోంది. 17న ముగియనున్న ఇష్యూ ద్వారా కనిష్టంగా(బేస్ పరిమాణం) రూ. 3,000 కోట్లు సమీకరించనుంది. రూ. 11,000 కోట్లవరకూ గ్రీన్‌షూ ఆప్షన్ ఉంది. అంటే ఇష్యూకి అధిక స్పందన వస్తే.. ఇందుకు వీలుగా యూనిట్లను విక్రయించనుంది. ఇంతక్రితం 2019 డిసెంబర్లో తొలిసారి ప్రభుత్వం వీటిని ప్రవేశపెట్టింది. ఇక మరోవైపు ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ 15న ప్రారంభమై 17న ముగియనుంది. యస్ బ్యాంక్ షేరు పతనం మార్కెట్ ధరతో పోలిస్తే ఎఫ్‌పీవోకు యస్ బ్యాంక్ షేరుకి రూ. 12 ధరను నిర్ణయించింది. ఇది 55 శాతం తక్కువకావడంతో వరుసగా రెండో రోజు యస్ బ్యాంక్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో యస్ బ్యాంక్ షేరు 11 శాతం కుప్పకూలి రూ. 22.7 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ఈ వారం మార్కెట్లలో ఇన్వెస్టర్లకు లభిస్తున్న పెట్టుబడి మార్గాలు మూడూ విభిన్నమైనవని విశ్లేషకులు చెబుతున్నారు. రోజారీ బయోటెక్ పబ్లిక్ ఇష్యూకాగా.. భారత్ బాండ్ ఈటీఎఫ్‌లు స్థిరపెట్టుబడి మార్గమని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇక యస్ బ్యాంక్ ఎఫ్‌పీవో ధర ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ భవిష్యత్ కార్యకలాపాలపట్ల కొంతమేర ఆందోళనలున్నట్లు తెలియజేశారు. భారత్ బాండ్ భేష్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న మూడు ఆప్షన్లలోనూ ఒక పెట్టుబడి మార్గాన్నే ఎంచుకోవలసి వస్తే భారత్ బాండ్ ఈటీఎఫ్ మేలని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను పరిగణిస్తే..దీర్ఘకాలిక దృష్టితో భారత్ బాండ్ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయడం లాభించగలదని రెలిగేర్ బ్రోకింగ్ వైస్‌ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా పేర్కొంటున్నారు. వీటిలో పెట్టుబడులపై రిటర్నులను అంచనా వేసేందుకు వీలుంటుందని చెబుతున్నారు. తొలి దశలో వచ్చిన బాండ్లు వార్షికంగా 14-18 శాతం రిటర్నులను అందించినట్లు తెలియజేశారు. దీనికితోడు భారత్ బాండ్ ఈటీఎఫ్నకు ఉత్తమ క్రెడిట్ రేటింగ్ ఉన్నట్లు తెలియజేశారు. రుణ మార్కెట్లో పెట్టుబడులకు ఇవి వీలుకల్పిస్తున్నట్లు వివరించారు. ప్రీమియంలో.. పలు ప్రొడక్టులతో పటిష్ట పోర్ట్‌ఫోలియోను కలిగిన రోజారీ బయోటెక్ డైవర్సిఫైడ్ కంపెనీగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు మిశ్రా పేర్కొన్నారు. అయితే ప్రీమియం ధరలో కంపెనీ ఐపీవో చేపడుతున్నట్లు అభిప్రాయపడ్డారు. దీంతో తొలి రెండు రోజులూ ఇష్యూకి స్పందన ఎలా ఉందన్న అంశాన్ని గమనించడం మేలు చేయగలదని ఇన్వెస్టర్లకు సూచిస్తున్నారు. తద్వారా ఇష్యూకి కనిపిస్తున్న డిమాండ్ ఆధారంగా నిర్ణయం తీసుకునేందుకు వీలుంటుందని తెలియజేశారు. ఇక యస్ బ్యాంక్ ఎఫ్‌పీవో ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ.. గత సమస్యలు బ్యాంక్‌కు భవిష్యత్‌లో సవాళ్లు విసరవచ్చన్న ఆందోళనలున్నట్లు తెలియజేశారు. ఇదే అభిప్రాయాన్ని పిక్రైట్ టెక్నాలజీస్ కీలక వ్యూహాల అధికారి(సీఎస్‌వో) సిద్ధార్ధ్ పంజ్వానీ కూడా వ్యక్తం చేశారు. ఇక ప్రత్యర్ధి సంస్థలు వినతీ, అతుల్, ఫైన్ ఆర్గానిక్స్‌తో పోలిస్తే ఐపీవో ద్వారా రోజారీ బయోటెక్ కొంతమేర ప్రీమియంను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఆదాయం, నికర లాభాల్లో వృద్ధిరీత్యా ఇది కొంతమేర సమంజసమేనని అభిప్రాయపడ్డారు. భారత్ బాండ్ ఈటీఎఫ్‌లో పెట్టుబడులు అంటే బాండ్లలో ఇన్వెస్ట్ చేయడమేనని.. ఒకస్థాయి దాటి రిటర్నులు అందుకునే వీలుండదని వివరించారు. రిస్క్ తక్కువ పెట్టుబడులుగా వీటిని భావించవచ్చని తెలియజేశారు. దాదాపు ఇలాంటి అభిప్రాయాలనే శామ్కో సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ నిపుణులు నీరాలీ షా సైతం వెల్లడించడం గమనార్హం! అధిక రిస్క్‌ను తీసుకోవడం ద్వారా దీర్ఘకాలంలో అధిక రిటర్నులు ఆశించే ఇన్వెస్టర్లు రోజారీ బయోటెక్ లేదా.. యస్ బ్యాంక్ ఇష్యూవైపు దృష్టిసారించవచ్చని మరికొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యస్ బ్యాంక్ కౌంటర్ భవిష్యత్‌లో పలు ఆటుపోట్లను చవిచూసే వీలున్నదని భావిస్తున్నారు. -
యస్ బ్యాంక్ ఎఫ్‌పీవో ధర రూ. 12
ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీవో)కు ఫ్లోర్ ధరను రూ. 12గా నిర్ణయించింది. ఇది గురువారం ముగింపు ధర రూ. 26.6తో పోలిస్తే 55 శాతం తక్కువ కావడం గమనార్హం! ఎఫ్‌పీవో ఈ నెల 15న ప్రారంభమై 17న ముగియనుంది. తద్వారా రూ. 15,000 కోట్లవరకూ సమీకరించాలని యస్ బ్యాంక్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో యస్ బ్యాంక్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 5 శాతం పతనమై రూ. 25 వద్ద ట్రేడవుతోంది. రూ. 1 డిస్కౌంట్ అర్హతగల ఉద్యోగులకు యస్ బ్యాంక్ ఎఫ్‌పీవో ధరలో రూ.1 డిస్కౌంట్ ప్రకటించింది. ఎఫ్‌పీవోలో భాగంగా 1,000 షేర్లను ఒకలాట్‌గా కేటాయించనుంది. దీంతో ఇన్వెస్టర్లు కనీసం 1,000 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. వెరసి రూ. 12,000 కనీస పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. యస్ బ్యాంకులో అతిపెద్ద వాటాదారు ఎస్బీఐ రూ. 1760 కోట్లవరకూ ఈ ఎఫ్‌పీవోలో ఇన్వెస్ట్ చేయనుంది. ఇందుకు ఎస్బీఐ బోర్డు గ్రీన్సిగ్నల్ఇచ్చిన విషయం విదితమే. ఈ బాటలో ఇతర సంస్థలు టిల్డెన్ పార్క్, ఎల్ఐసీ, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్ తదితరాలు సైతం ఇన్వెస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. -
ఫాలో ఆన్ ఇష్యూకి ఐఓబీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (ఐఓబీ) వచ్చే ఆర్థిక సంవత్సరం ఫాలో ఆన్ ఇష్యూకు (ఎఫ్‌పీవో) రానుంది. ఈ నిర్ణయం ఇంకా బోర్డ్ పరిధిలోనే ఉందని, అది పూర్తయ్యాక.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), సెబీ అనుమతుల కోసం వెళతామని.. కచ్చితంగా 2020–21 ఆర్థిక సంవత్సరం రెండు లేదా మూడో త్రైమాసికంలో ఎఫ్‌పీవోకి రావాలని నిర్ణయించామని బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు అజయ్ కుమార్ శ్రీవాస్తవ చెప్పారు. అయితే ఎఫ్‌పీఓ ద్వారా ఎంత వాటాను కేటాయించాలి? ఎన్ని నిధులు సమీకరించాలి? అనేది బోర్డ్ నిర్ణయం తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. సోమవారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 50 వేల కోట్లకు ఎంఎస్ఎంఈ రుణాలు.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్లుగా ఐఓబీ ఆథరైజ్డ్ క్యాపిటల్‌ను రూ.25 వేల కోట్లకు పెంచిన విషయం తెలిసిందే. దీంతో పాటు బ్యాంక్‌లకు మూలధన పునరుద్ధరణలో భాగంగా ఐఓబీకి రూ.4,360 కోట్లు క్యాపిటల్‌ను కేటాయించింది కూడా. ప్రస్తుతం ఐఓబీ నికర వడ్డీ మార్జిన్స్‌ను (ఎన్ఐఎం) మెరుగుపర్చుకునే స్థితిలో ఉందని.. ప్రస్తుతం 1.94 శాతంగా ఉన్న ఎన్ఐఎం ఈ త్రైమాసికంలో 2 శాతానికి చేరుతుందని.. 3–4 త్రైమాసికాల్లో 3 శాతానికి చేరడం ఖాయమని శ్రీవాస్తవ ధీమా వ్యక్తం చేశారు. ఎంఎస్ఎంఈ రుణాల మీద ప్రత్యేక దృష్టి సారించామని.. ప్రస్తుతం రూ.31 వేల కోట్లుగా ఉన్న ఎంఎస్ఎంఈ రుణ వ్యాపారం.. వచ్చే 18–24 నెలల్లో రూ.50 వేల కోట్లకు చేరుతుందని తెలిపారు. -
ఐపీవో, ఎఫ్‌పీవో, ఈసాప్‌లకు ఎల్టీసీజీ రాయితీ
న్యూఢిల్లీ: ఐపీవోలు, బోనస్, రైట్స్ ఇష్యూలు, ఈసాప్‌ల విషయంలో కేంద్రం ఇన్వెస్టర్లకు కాస్తంత వెసులుబాటు ఇచ్చింది. వీటిపై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ) చెల్లించకపోయినప్పటికీ రాయితీతో కూడిన 10 శాతం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్టీసీజీ)కు అర్హత కల్పించింది. 2018–19 బడ్జెట్లో ప్రభుత్వం రాయితీతో కూడిన 10 శాతం ఎల్‌టీసీజీని షేర్ల అమ్మకంపై ప్రవేశపెట్టింది. లాభం రూ.లక్ష మించితే 10 శాతం ఎల్టీసీజీ పన్ను పడుతుంది. అయితే, కొనుగోలు సమయంలో ఎస్టీటీ చెల్లించాలన్న నిబంధన ఉంది. ఎస్టీటీ చెల్లింపు కింద తాజాగా వీటికి మినహాయింపు కల్పిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్ఆర్ఐలు, క్యూఐబీలు, వెంచర్ క్యాపిటలిస్ట్‌లు సైతం ఎస్టీటీ చెల్లించకపోయినా సరే 10 శాతం రేటుకు అర్హులవుతారు. ఎస్టీటీ చెల్లించకపోయి, లావాదేవీలు మినహాయింపు జాబితాలో లేకపోతే అప్పుడు షేర్ల విక్రయంపై 20 శాతం ఎల్టీసీజీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక స్వల్ప కాలం క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కింద 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. -
భారత్–22 ఈటీఎఫ్‌కు రూ.12,500 కోట్ల బిడ్లు
న్యూఢిల్లీ: భారత్–22 ఈటీఎఫ్( ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్) ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీఓ)కు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. ఈ ఆఫర్ ద్వారా రూ.6,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బిడ్లు ఎక్కువగా వస్తే, అదనంగా రూ.2,400 కోట్ల మేర నిధులను అట్టేపెట్టుకోవాలని (గ్రీన్ షూ ఆప్షన్) కూడా భావించింది. ఈ నెల 19న ప్రారంభమైన ఈ ఈటీఎఫ్ ఎఫ్‌పీఓ శుక్రవారం ముగిసింది. ఈ ఎఫ్‌పీఓ రెండు రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. రూ.6,000 కోట్లకు గాను రూ.12,500 కోట్లకు బిడ్లు వచ్చాయి. యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 3.44 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. ఈ ఎఫ్‌పీఓను ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ నిర్వహించింది. భారత్–22 ఈటీఎఫ్‌లో మొత్తం 22 కంపెనీలున్నాయి. ఓఎన్జీసీ, ఐఓసీ, ఎస్బీఐ, బీపీసీఎల్, కోల్ ఇండియా, నాల్కో, ఎన్బీసీసీ, ఎన్టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ, గెయిల్, ఎన్ఎల్సీ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ తదితర షేర్లు ఈ ఈటీఎఫ్‌లో ఉన్నాయి. 67 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయిన రీట్స్ ఐపీఓ న్యూఢిల్లీ: రైల్వే కన్సల్టెన్సీ సంస్థ ‘రీట్స్’ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. శుక్రవారం ముగిసిన ఈ ఐపీఓ 67 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. ఈ ఐపీఓలో భాగంగా కంపెనీ 2.52 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తోంది. 167 కోట్ల షేర్లకు గాను బిడ్లు వచ్చాయి. రూ.180–185 ప్రైస్‌బ్యాండ్‌తో ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ. 466కోట్లు సమీకరించనున్నదని అంచనా. ఈ ఆర్థిక సంవత్సరంలో ఐపీఓకు వచ్చిన తొలి ప్రభుత్వ రంగ కంపెనీ ఇది. వచ్చే నెల 2న ఈ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి.