పవర్‌గ్రిడ్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ సక్సెస్ | PowerGrid follow-on public offering subscribed 7 times | Sakshi
Sakshi News home page

పవర్‌గ్రిడ్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ సక్సెస్

Published Sat, Dec 7 2013 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 1:20 AM

PowerGrid follow-on public offering subscribed 7 times

న్యూఢిల్లీ: విద్యుత్ రంగ దిగ్గజం పవర్‌గ్రిడ్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీవో) చివరి రోజుకి ఇన్వెస్టర్ల నుంచి 6.7 రెట్లు అధికంగా బిడ్స్ లభించాయి. కంపెనీ 78.70 కోట్ల షేర్ల(17% వాటా)ను అమ్మకానికి పెట్టగా, 530 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు దాఖలయ్యాయి. షేరుకి రూ. 85-90 ధరను నిర్ణయించగా, ఉద్యోగులు, రిటైలర్లకు ధరలో 5%(రూ. 4.50) డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 13% వాటాకు సమానమైన 60.18 కోట్ల షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ప్రభుత్వం 18.51 కోట్ల షేర్లను(4% వాటా) విక్రయానికి పెట్టింది. తద్వారా కంపెనీ రూ. 5,416 కోట్లు, ప్రభుత్వం రూ. 1,666 కోట్లను అందుకోనున్నాయి. కాగా, బీఎస్‌ఈలో శుక్రవారం షేరు ధర దాదాపు 3% లాభపడి రూ. 99 వద్ద ముగిసింది. ఇష్యూ కారణంగా కంపెనీలో ప్రభుత్వ వాటా 69.42% నుంచి 57.89%కు తగ్గనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement