POWERGRID
-
ఉక్రెయిన్ పవర్‌గ్రిడ్‌పై రష్యా దాడులు.. టార్గెట్ అదేనా..?
కీవ్:ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు ప్రాంతాలపై ఆదివారం(నవంబర్ 17) రష్యా భారీ దాడులు చేసింది. శీతాకాలం వస్తుండడంతో ఉక్రెయిన్‌కు కీలకమైన పవర్ గ్రిడ్‌ను లక్ష్యంగా చేసుకొని క్షిపణులతో దాడులు చేసింది. ఉక్రెయిన్‌పై ఆగస్టు నుంచి ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం. ఈ దాడిలో ఉక్రెయిన్ పవర్‌గ్రిడ్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. దీంతో కీవ్ సహా పలు జిల్లాలు,నగరాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దేశ విద్యుత్తు సరఫరా,ఉత్పత్తి వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని ఉక్రెయిన్ ఎనర్జీ మంత్రి గెర్మన్ వెల్లడించారు. మరోవైపు రాజధాని కీవ్‌లో భారీగా పేలుళ్లు జరిగాయి.ఇక్కడి సిటీ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఆస్తి ప్రాణ నష్ట వివరాలు ఇంకా తెలియరాలేదు. చాలా రోజుల తర్వాత రష్యా తాజాగా ఉక్రెయిన్‌పై భారీ దాడులకు దిగడంతో సరిహద్దుల్లోని పోలండ్ పూర్తిగా అప్రమత్తమైంది. రష్యా, ఉక్రెయిన్లలో శీతాకాలం అత్యంత తీవ్రంగా ఉంటుంది.ఈ సీజన్లో ఇళ్లలో వేడి కోసం విద్యుత్తు,గ్యాస్ వంటి వాటిని వాడతారు.విద్యుత్ సరఫరాలో గనుక అంతరాయం ఏర్పడితే చలికి తట్టుకోలేక ఉక్రెయిన్‌లో చాలా మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే రష్యా పవర్‌గ్రిడ్‌ను లక్ష్యంగా చేసుకుందనే అనుమానాలున్నాయి. -
ఖజానాకు అంచనాలను మించి డివిడెండ్లు
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల (సీపీఎస్ఈ) నుంచి ఖజానాకు బడ్జెట్ అంచనాలను మించిన స్థాయిలో డివిడెండ్లు అందాయి. 2023–24లో కోల్ ఇండియా, ఓఎన్జీసీ, పవర్‌గ్రిడ్, గెయిల్ వంటి దిగ్గజాలు ఏకంగా రూ. 63,000 కోట్లు చెల్లించాయి. సవరించిన బడ్జెట్ అంచనాలకన్నా ఇది 26 శాతం అధికం. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం 2023–24లో సీపీఎస్ఈల నుంచి రూ. 50,000 కోట్ల డివిడెండ్లు రావొచ్చని అంచనాలను సవరించారు. అయితే, పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం దీపమ్ వెబ్సైటు ప్రకారం కేంద్రానికి మొత్తం రూ. 62,929.27 కోట్లు వచ్చాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో (2022–23)లో డివిడెండ్ వసూళ్లు రూ. 59,952.84 కోట్లకు పరిమితమయ్యాయి. మార్చి నెలలో ఓఎన్జీసీ రూ. 2,964 కోట్లు, కోల్ ఇండియా రూ. 2,043 కోట్లు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూ. 2,149 కోట్లు, ఎన్ఎండీసీ రూ. 1,024 కోట్లు, హెచ్ఏఎల్ రూ. 1,054 కోట్లు, గెయిల్ రూ. 1,863 కోట్లు చెల్లించాయి. సీపీఎస్ఈలు అధిక మొత్తంలో డివిడెండ్ల చెల్లించడమనేది వాటి పటిష్టమైన పనితీరును ప్రతిబింబిస్తుంది. ఇది రిటైల్, సంస్థాగత వాటాదారులకు లబ్ధి చేకూర్చడంతో పాటు ఆయా సంస్థల షేర్లపై ఆసక్తిని పెంచేందుకు కూడా ఉపయోగపడగలదు. -
ఏపీ గ్రిడ్‌తో ‘సెంబ్‌కార్ప్’ అనుసంధానం
సాక్షి, అమరావతి: విద్యుత్ వృథాకు అడ్డుకట్ట వేయడంతోపాటు విద్యుత్ ఆదా చేయడం ద్వారా వినియోగదారులపై భారం తగ్గించాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచన మేరకు ఏపీ ట్రాన్స్‌కో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సెంబ్‌కార్ప్ థర్మల్ విద్యుత్ కేంద్రానికి ట్రాన్స్మిషన్ లైన్ నిర్మాణణం చేపట్టింది. 5 కిలోమీటర్ల పొడవున ఈ లైన్ పూర్తికావడంతో మంగళవారం ఏపీట్రాన్స్కో అధికారులు సెంబ్‌కార్ప్ థర్మల్ ప్లాంటు లైన్‌ను పవర్‌గ్రిడ్ లైన్ నుంచి తప్పించి ఏపీగ్రిడ్ లైన్‌కు అనుసంధానం చేశారు. దీంతో పవర్‌గ్రిడ్ ట్రాన్స్మిషన్ లైన్లతో సంబంధం లేకుండా నేరుగా ఏపీట్రాన్స్కో ట్రాన్స్మిషన్ లైన్ల ద్వారా ఏపీ గ్రిడ్‌కు, అక్కడ నుంచి డిస్కంలకు విద్యుత్ సరఫరా అవుతోంది. ఏడాదికి రూ.365 కోట్లు ఆదా విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ)లో భాగంగా సెంబ్‌కార్ప్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ (ఎస్ఈఐఎల్)కు చెందిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని థర్మల్ పవర్ ప్లాంటు నుంచి రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటి వరకూ ఈ ప్లాంటు నుంచి పవర్‌గ్రిడ్‌కు చెందిన ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా ఏపీ ఏపీట్రాన్స్కోకు చెందిన రాష్ట్ర గ్రిడ్‌కు, అక్కడి నుంచి డిస్కమ్‌లకు విద్యుత్ సరఫరా అవుతోంది. పవర్‌గ్రిడ్ ట్రాన్స్మిషన్ లైన్ వినియోగించుకున్నందుకు ఆ సంస్థకు యూనిట్‌కు రూ.0.72 పైసలు చొప్పున ఏపీ ట్రాన్స్‌కో చెల్లిస్తోంది. అంటే రోజుకు సగటున రూ.కోటి పవర్‌గ్రిడ్‌కు ట్రాన్స్‌కో ఇవ్వాల్సి వస్తోంది. సెంబ్‌కార్ప్ థర్మల్ పవర్ ప్లాంట్‌తో ఏపీ గ్రిడ్‌ను నేరుగా అనుసంధానం చేయడంవల్ల ఈ ఖర్చు ఆదా కానుంది. రోజుకు 15 మిలియన్ యూనిట్ల చొప్పున ఏడాదికి సుమారు 5,475 మిలియన్ యూనిట్ల విద్యుత్ ‘సెంబ్‌కార్ప్’ నుంచి రాష్ట్ర గ్రిడ్‌కు సరఫరా అవుతోంది. శుభపరిణామం: మంత్రి పెద్దిరెడ్డి తక్కువ సమయంలోనే ఈ లైన్ నిర్మాణం పూర్తిచేసి సెంబ్కార్ప్ను నేరుగా ఏపీ గ్రిడ్‌కు అనుసంధానం చేయడం రాష్ట్రానికి ఎంతో మేలు చేకూర్చే పరిణామమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. -
పవర్‌గ్రిడ్ చెస్ టోర్నీ విజేత కార్పొరేట్ సెంటర్
సాక్షి, హైదరాబాద్: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇంటర్ రీజినల్ చెస్ టోర్నమెంట్లో మహిళల టీమ్ విభాగంలో కమలేశ్ భూరాణి, హిమాన్షిలతో కూడిన కార్పొరేట్ సెంటర్ (సీసీ) జట్టు విజేతగా నిలిచింది. కార్పొరేట్ సెంటర్ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి అజేయంగా నిలిచింది. పవర్‌గ్రిడ్ సదరన్ రీజియన్–1 ఆధ్వర్యంలో మూడు రోజులపాటు హైదరాబాద్‌లో జరిగిన ఈ టోర్నీ ఆదివారం ముగిసింది. మహిళల టీమ్ విభాగంలో ఈస్టర్న్ రీజియన్–1కు రెండో స్థానం, నార్తర్న్ రీజియన్–2కు మూడో స్థానం లభించాయి. పురుషుల టీమ్ విభాగంలో బిశ్వజ్యోతి దాస్, అరుణ్ తివారీ, హృషికేశ్ సింగ్, బిజిత్ శర్మలతో కూడిన నార్త్ ఈస్టర్న్ రీజియన్ చాంపియన్‌గా నిలిచింది. నార్తర్న్ రీజియన్–1కు రెండో స్థానం, కార్పొరేట్ సెంటర్‌కు మూడో స్థానం దక్కాయి. పురుషుల వ్యక్తిగత విభాగంలో అంజన్ సేన్ (కార్పొరేట్ సెంటర్), బిశ్వజ్యోతి దాస్, గౌరవ్ కుమార్ (నార్తర్న్ రీజియన్–1) వరుసగా తొలి మూడు స్థానాల్లో... మహిళల వ్యక్తిగత విభాగంలో మీనాక్షి మలిక్ (నార్నర్త్ రీజియన్–1), హిమాన్షి, కమలేశ్ భూరాణి వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. పవర్‌గ్రిడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె.శ్రీకాంత్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సదరన్ రీజియన్–1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ శ్రీవాస్తవ, అలోక్ కుమార్ శర్మ (సీజీఎం–అసెట్ మేనేజ్మెంట్), సంజయ్ కుమార్ గుప్తా (సీజీఎం–ప్రాజెక్ట్స్), హరినారాయణన్ (సీజీఎం–హ్యూమన్ రిసోర్సెస్) తదితరులు పాల్గొన్నారు. -
రెడ్‌క్రాస్ సేవలు అమూల్యం.. కోవిడ్ సమయంలో అద్భుత సేవలు
సాక్షి, అమరావతి/పటమట(విజయవాడ తూర్పు): సమాజ శ్రేయస్సు కోసం రెడ్‌క్రాస్ సభ్యులు అమూల్యమైన సేవలు అందిస్తున్నారని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. రక్తం అందక ఒక్కరు కూడా ప్రాణం కోల్పోకూడదని, ఇందుకోసం మరిన్ని రక్తదాన శిబిరాలు నిర్వహించాలని రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులకు ఆయన సూచించారు. రెడ్‌క్రాస్ సొసైటీ ఏపీ శాఖ వార్షిక అవార్డుల (2019–20, 2021–22 సంవత్సరాలకు) ప్రదానోత్సవం విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ సమాజంలోని పేద, బడుగు, బలహీన వర్గాలకు మానవతా దృక్పథంతో సేవలు అందించడంలో రెడ్‌క్రాస్ ముందంజలో ఉందన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో రెడ్‌క్రాస్ తన పాత్రను అద్భుతంగా పోషించిందని, పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు రక్తం, ఆక్సిజన్, మాస్కులు, మందులు వంటివి అందించడం ద్వారా వేల మంది రోగుల ప్రాణాలు కాపాడిందని కొనియాడారు. రోగులకు, తలసేమియా బాధిత పిల్లలకు సురక్షితమైన రక్తాన్ని అందించాలనే లక్ష్యంగా రెడ్‌క్రాస్ పని చేయడం ప్రశంసనీయమని అన్నారు. రాష్ట్రంలో 26 జిల్లాల ఏర్పాటుతో 26 జిల్లాల కలెక్టర్లు, మేనేజింగ్ కమిటీలు సేవలు అందించడం ద్వారా రెడ్‌క్రాస్ మరింత బలోపేతమైందని తెలిపారు. జిల్లా శాఖలు మారుమూల గ్రామీణ, గిరిజన ప్రజలకు చేరువకావడంపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి మొక్కల పెంపకంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. యువత, విద్యార్థులను చైతన్యవంతం చేయడం ద్వారా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టాలన్నారు. నిరుపేదలకు సేవలు అందించడానికి అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన రెడ్‌క్రాస్ ఏపీ శాఖ చైర్మన్ శ్రీధర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు ఆర్పీ సిసోడియా, ప్రధాన కార్యదర్శి ఏకే పరిడాను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరంఎన్టీఆర్, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల కలెక్టర్లు ఎస్.ఢిల్లీరావు, పి.రంజిత్‌బాషా, శ్రీకేష్.బి.లతకర్, ఎ.సూర్యకుమారి, గుంటూరు జేసీ ఎ.దినేష్‌కుమార్, రాజమండ్రి సబ్ కలెక్టర్ డాక్టర్ పి.మహేష్‌కుమార్‌తోపాటు తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా, సింగపూర్ రెడ్‌క్రాస్ సొసైటీ, జిల్లాస్థాయిలో విస్తృతంగా సేవలు అందించిన 94 మంది నిస్వార్థ సేవకులకు అవార్డులను, ట్రోఫీలను గవర్నర్ ప్రదానం చేశారు. ‘నాటా’కు ప్రశంశలు కోవిడ్–19 సమయంలో నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్(నాటా) 150 ఆక్సిజన్ సిలిండర్లను రెడ్‌క్రాస్ ద్వారా సహాయం చేసినందుకు అప్పటి నాటా అధ్యక్షుడు గోసాల రాఘవరెడ్డి, కార్యదర్శి ఆళ్ల రామిరెడ్డి, కోశాధికారి గండ్ర నారాయణరెడ్డిని గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. ఆ సంస్థ సేవలకు గుర్తింపుగా నాటా పీఆర్ అండ్ మీడియా కో–ఆర్డినేటర్ డీవీ కోటిరెడ్డి, ఎం.పార్థసారథిరెడ్డి, కె.సాంబశివారెడ్డికి గవర్నర్ మెడల్, అవార్డులను ప్రదానం చేశారు. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌కు రెడ్‌క్రాస్ గోల్డ్‌మెడల్ సాక్షి, హైదరాబాద్: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ను రెడ్‌క్రాస్ గోల్డ్‌మెడల్ వరించింది. శుక్రవారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (ఐఆర్సీఎస్) అధ్యక్షుడు విశ్వభూషణ్ హరిచందన్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఏపీలోని విజయనగరం జిల్లా కురుపం గ్రామంలో మెడికల్ క్యాంపులో కావాల్సిన వనరులను సమకూర్చినందుకు, అలాగే చిత్తూరులో బ్లడ్ బ్యాంకు నిర్మాణం చేపట్టినందుకు గాను పవర్‌గ్రిడ్‌కు ఈ అవార్డు లభించింది. కాగా, పవర్‌గ్రిడ్ ఈ రెడ్‌క్రాస్ గోల్డ్ మెడల్‌ను అందుకోవడం ఇది మూడోసారి. పవర్‌గ్రిడ్ తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ శ్రీవాస్తవ అవార్డును అందుకున్నారు. (క్లిక్ చేయండి: ఐటీ హబ్‌గా విశాఖలో అపారమైన అవకాశాలు) -
పవర్ గ్రిడ్ ఈడీగా రాజేశ్ శ్రీవాత్సవ
సాక్షి, హైదరాబాద్: పవర్ గ్రిడ్ సదరన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా రాజేష్ శ్రీవాత్సవ నియమితులయ్యారు. ఆయన తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు ఇన్చార్జిగా వ్యవహరించనున్నారు. 1984లో ఆయన ఎన్టీపీసీలో చేరారు. ఆ తర్వాత 1991 వరకు సీనియర్ ఇంజనీర్‌గా పని చేశారు. ట్రాన్స్మిషన్, లైన్స్, ప్రాజెక్ట్స్ విభాగాల్లో ఆయన 34 ఏళ్ల పాటు సేవలు అందించారు. సదరన్ సీజీఎంగా పని చేశారు. ప్రస్తుతం ఆయన ఈడీగా నియమితులవడంపై సహోద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
పవర్‌గ్రిడ్‌లో ఫీల్డ్ ఇంజనీర్లు, సూపర్ వైజర్ ఉద్యోగాలు
భారత ప్రభుత్వ విద్యుచ్ఛక్తి మంత్రిత్వశాఖకు చెందిన మహారత్న సంస్థ పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. ఒప్పంద ప్రాతిపదికన ఫీల్డ్ ఇంజనీర్, సూపర్వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (నిట్, వరంగల్‌లో 129 నాన్‌టీచింగ్ పోస్టులు) ► మొత్తం పోస్టుల సంఖ్య: 137 ► పోస్టుల వివరాలు: ఫీల్డ్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)–48, ఫీల్డ్ ఇంజనీర్(సివిల్)–17, ఫీల్డ్ సూపర్వైజర్(ఎలక్ట్రికల్)–50, ఫీల్డ్ సూపర్వైజర్(సివిల్)–22. ► అర్హత: ఫీల్డ్ ఇంజనీర్ పోస్టులకు కనీసం 55శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్)/బీఈ(పవర్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి. ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టులకు కనీసం 55శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత అనుభవం ఉండాలి. ► వయసు: 27.08.2021 నాటికి 29 ఏళ్లు మించకుండా ఉండాలి. ► వేతనం: ఫీల్డ్ ఇంజనీర్లకు నెలకు రూ.30,000 నుంచి రూ.1,20,000, ఫీల్డ్ సూపర్వైజర్లకు నెలకు రూ.23,000 నుంచి రూ.1,05,000లతో పాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు. (టీఎస్ఏసీఎస్లో ఉద్యోగాలు.. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు) ► ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్(టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్, అప్టిట్యూడ్ టెస్ట్), పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 27.08.2021 ► వెబ్సైట్: http://www.powergrid.in -
పవర్‌గ్రిడ్‌లో డిప్లొమా ట్రెయినీ ఖాళీలు
భారత ప్రభుత్వ రంగానికి చెందిన పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నార్తర్న్ రీజియన్ ట్రాన్స్మిషన్ సిస్టమ్(జమ్మూ–లద్దాక్ రీజియన్లలో).. డిప్లొమా ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 42 ► పోస్టుల వివరాలు: డిప్లొమా ట్రెయినీ(ఎలక్ట్రికల్)–23, డిప్లొమా ట్రెయినీ(ఎలక్ట్రికల్) లద్దాక్ రీజియన్–09, డిప్లొమా ట్రెయినీ(ఎలక్ట్రికల్) కాశ్మీర్ రీజియన్–05, డిప్లొమా ట్రెయినీ(సివిల్)–03, డిప్లొమా ట్రెయినీ(సివిల్)లద్దాక్ రీజియన్–02. ► సబ్జెక్టులు: ఎలక్ట్రికల్, సివిల్. ► అర్హత: కనీసం 70శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల రెగ్యులర్ ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. డిప్లొమా లేకుండా బీఈ/బీటెక్/ఎంఈ /ఎంటెక్ వంటి అర్హతలున్నా పరిగణనలోకి తీసుకోరు. ► వయసు: 15.06.2021 నాటికి 27ఏళ్లు మించకూడదు. ► ఎంపిక విధానం: రాతపరీక్ష/కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► పరీక్షా విధానం: పరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో జరుగుతుంది. ఇందులో పార్ట్–1లో 120 ప్రశ్నలు టెక్నికల్ నాలెడ్జ్/ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి ఉంటాయి. పార్ట్–2 సూపర్ వైజరీ ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో 50 ప్రశ్నలు వొకాబ్యులరీ, వెర్బల్కాంప్రహెన్షన్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, డేటా సఫిషియన్సీ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ , న్యూమరికల్ ఎబిలిటీ విభాగాల నుంచి అడుగుతారు. పరీక్షా సమయం 2 గంటలు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 12.07.2021 ► వెబ్సైట్: www.powergridindia.com మరిన్ని నోటిఫికేషన్లు: ఎన్డీఏ, ఎన్ఏ 2021: ఇంటర్‌తోనే.. కొలువు + చదువు సీఆర్పీఎఫ్, అసోం రైఫిల్స్‌లో ఉద్యోగాలు పవర్‌గ్రిడ్, ఎస్బీఐలో ఉద్యోగ అవకాశాలు -
పవర్‌గ్రిడ్, ఎస్బీఐలో ఉద్యోగ అవకాశాలు
భారత ప్రభుత్వ రంగానికి చెందిన పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. ఏపీ, తెలంగాణ, కర్ణాటక పరిధిలోని సదరన్ రీజియన్ ట్రాన్స్మిషన్ సిస్టమ్.. డిప్లొమా ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 35; ► సబ్జెక్టులు: ఎలక్ట్రికల్, సివిల్. డిప్లొమా ట్రెయినీ(ఎలక్ట్రికల్)–30, డిప్లొమా ట్రెయినీ(సివిల్)–05. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 29.06.2021 ► వెబ్సైట్: https://www.powergrid.in ఎస్బీఐలో 16 ఇంజనీర్(ఫైర్) పోస్టులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)కి చెందిన సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ విభాగం.. ఇంజనీర్(ఫైర్)పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 16 ► అర్హత: బీఈ/బీటెక్(ఫైర్ టెక్నాలజీ–సేఫ్టీ ఇంజనీరింగ్)/బీఎస్సీ(ఫైర్) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో నాలెడ్జ్ ఉండాలి. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 15.06.2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 28.06.2021 ► వెబ్సైట్: https://www.sbi.co.in -
పవర్‌గ్రిడ్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ సక్సెస్
న్యూఢిల్లీ: విద్యుత్ రంగ దిగ్గజం పవర్‌గ్రిడ్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీవో) చివరి రోజుకి ఇన్వెస్టర్ల నుంచి 6.7 రెట్లు అధికంగా బిడ్స్ లభించాయి. కంపెనీ 78.70 కోట్ల షేర్ల(17% వాటా)ను అమ్మకానికి పెట్టగా, 530 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు దాఖలయ్యాయి. షేరుకి రూ. 85-90 ధరను నిర్ణయించగా, ఉద్యోగులు, రిటైలర్లకు ధరలో 5%(రూ. 4.50) డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 13% వాటాకు సమానమైన 60.18 కోట్ల షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ప్రభుత్వం 18.51 కోట్ల షేర్లను(4% వాటా) విక్రయానికి పెట్టింది. తద్వారా కంపెనీ రూ. 5,416 కోట్లు, ప్రభుత్వం రూ. 1,666 కోట్లను అందుకోనున్నాయి. కాగా, బీఎస్ఈలో శుక్రవారం షేరు ధర దాదాపు 3% లాభపడి రూ. 99 వద్ద ముగిసింది. ఇష్యూ కారణంగా కంపెనీలో ప్రభుత్వ వాటా 69.42% నుంచి 57.89%కు తగ్గనుంది.