
సాక్షి, హైదరాబాద్: పవర్ గ్రిడ్ సదరన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా రాజేష్ శ్రీవాత్సవ నియమితులయ్యారు. ఆయన తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు ఇన్చార్జిగా వ్యవహరించనున్నారు. 1984లో ఆయన ఎన్టీపీసీలో చేరారు.
ఆ తర్వాత 1991 వరకు సీనియర్ ఇంజనీర్‌గా పని చేశారు. ట్రాన్స్‌మిషన్, లైన్స్, ప్రాజెక్ట్స్ విభాగాల్లో ఆయన 34 ఏళ్ల పాటు సేవలు అందించారు. సదరన్ సీజీఎంగా పని చేశారు. ప్రస్తుతం ఆయన ఈడీగా నియమితులవడంపై సహోద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.