రాజేష్
అడ్డగుట్ట: వైద్యానికి డబ్బులేక ఓ నిరుపేద బాలుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. తండ్రి రైలు ప్రమాదంలో మరణించాడు.. తల్లి ఇళ్లలో పనిచేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. బాణసంచా చేతిలో పేలడంతో ఆమె చిన్న కుమారుడు అటు వైద్యానికి, ఇటు మందులకు డబ్బు లేక ఇంటికే పరిమితమయ్యాడు. ఆ నిరుపేద కుటుంబం సాయం కోసం దాతలవైపు చూస్తోంది. వివరాలు.. అడ్డగుట్ట వడ్డెరబస్తీకి చెందిన కనకరాజు రైలు ప్రమాదంలో చనిపోవడంతో అతని భార్య సరిత ఇండ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఈమె చిన్నకుమారుడు వి.రాజేష్(8) నవంబర్ 14 బాలల దినోత్సవం రోజున ఇంటి ముందు బాణసంచా కాలుస్తున్న సమయంలో బాణాసంచా చేతిలో పేలింది.
ఈ ప్రమాదంలో బాలుడి శరీరం దాదాపు 50 శాతం కాలిపోయింది. పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు.అయితే గాయాలతో ఇంటికే పరిమితమయ్యాడు. ప్రస్తుతం ఆ బాలుడిది లేవలేని పరిస్థితి. అసలే నిరుపేద కుటుంబం, ఒక్క ఇంజెక్షన్ రూ. 1,300 ఖరీదు. వారానికి ఒక సారి వేస్తే తప్ప శరీరంలో కదలికరాదు. వైద్యానికి చేతిలో డబ్బులు లేకపోవడంతో ఆ కుటుంబం మనోవేదనకు గురవుతోంది. స్నేహితులతో ఆడుకోవాల్సిన వయస్సులో కదలలేని స్థితితో ఉన్నాడు. బాగా చదువుకొని న్యాయవాది అవుతానని, లాయర్ చదువు అంటే ఇష్టమంటున్నాడు. వైద్యం ఖర్చుల నిమిత్తం ఎవరైనా సహాయం చేసేవారు అకౌంట్ నెంబరుకు డబ్బు పంపించవచ్చు.కెనెరా బ్యాంకు అకౌంట్ నంబర్ 0624108031004, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ సీఎన్‌ఆర్‌బి0000624, వరికుప్పల సరిత, వివరాల కోసం 91776 98638నెంబరుకు ఫోన్ చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment