helath problems
-
అరటి పండ్లను తింటున్నారా ? అయితే జాగ్రత్త..
శ్రీకాకుళం: ప్రస్తుతం కాలంలో ప్రతి ఒక్కరూ ఉద్యోగ, వ్యాపార, క్రీడా, తదితర పనుల్లో బిజీగా ఉంటున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు ఎక్కువ మంది ఫలాలను తీసుకుంటున్నారు. వైద్యులు కూడా పండ్లు జాతులు, కూరగాయలు అధికంగా తీసుకోవాలని సూచిస్తారు. అయితే ఆరోగ్యానిచ్చే పండ్లు, కూరగాయలను సైతం కొంత మంది వ్యాపారులు రసాయనాలతో మాగపెడుతున్నారు. దీంతో ప్రజలు అరోగ్యం బారితన పడుతున్నారు. లాభార్జనే ధ్యేయం.. వ్యాపారులు లాభార్జనే ప్రధానధ్యేయంగా ప్రజలను అడ్డదారుల్లో మోసగించి వారి అనారోగ్యాలకు కారణమవుతున్నారు. తక్కవ కాలంలో ఎక్కవ సంపాదించాలనే ధ్యేయంతో ఎక్కవమంది వ్యాపారులు గోదాంలో అరటి, బొప్పాయి, కర్బూజ, ఆపిల్ పక్వానికి రాకముందే పలు రకాల రసాయనాలను పూస్తున్నారు. దీనివల్ల వాటిలో సహజత్వం కోల్పోయి అధికంగా మెరుపు కనిపిస్తుంది. దీంతో కొనుగోలు దారులు సులువుగా మోసపోతున్నారు. అరటిలో మోసాలు అధికం.. అన్ని కాలాల్లో కూడా అరటి పండ్లకు గిరాకీ ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని వ్యాపారులు కార్బన్‌మోనాక్సైడ్ పౌడర్‌ను పిచికారీ చేయిస్తున్నారు. లిక్విడ్ రూపంలో మరికొన్ని రసాయనపదార్థాలు వినియోగించిన బకెట్లలో అరటి గెలలు వేసి మగ్గబెడుతున్నారు. కానరాని దాడులు.. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న వ్యాపారులుపై దాడులు చేయాల్సిన సంబంధిత అధికారులు ఎక్కడా కనిపించడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. వ్యాపారులు అరటి గెలలు వేలాడిదీసి, వాటికి కార్బైడ్‌తో మగ్గపెడుతున్న విషయం తెలిసినా ప్రశ్నించేవారే కరువయ్యారు. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారే ఆరోపణలున్నాయి. అమలుకాని ఆహార భద్రతాచట్టాలు ఆహారభద్రతా చట్టం 2006 (ఫుడ్‌సేప్టీ స్టాండర్డ్‌యాక్ట్)ప్రకారం ప్రజలు ఆహారపదార్థాలు కలుíÙతం చేస్తున్నవారిపై దాడులు చేయాలి. పండ్లపై కార్బైడ్ వినియెగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాలు ఆదేశాలిస్తున్నా క్షేత్రస్థాయిలో అమలుకు జరగడంలేదు. -
పరదాల మాటు నుంచి ప్రమాదాలు!
ఇళ్లలో ఇటు తలుపులకూ, అటు కిటికీలకు పరదాలు (డోర్ అండ్ విండో కర్టెన్స్) అమర్చుకోవడం ప్రైవసీని ఇస్తూనే ఒక రకంగా అందాన్ని ఇనుమడింపజేసే అంశం. మంచి కర్టెయిన్లతో ఇళ్లకు అందునా ప్రధానంగా హాల్స్‌కు ఓ రాజసపు రిచ్ లుక్ కూడా వస్తుంది. అందుకే రంగురంగుల ఆకర్షణీయమైన కర్టెన్స్ అమర్చడం అన్నది బాగా ధనవంతుల ఇళ్ల మాదిరిగానే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాల్లోనూ పెరిగిపోయింది. దీనికి తోడు కొన్నిసార్లు ఇంటి పై సజ్జా (అటక) వంటి చోట్ల పాత సామాన్ల వంటి తరచూ ఉపయోగించిన సామగ్రి ఉంచినప్పుడు, వాటికి అడ్డంగా కూడా నెలల తరబడి అవే కర్టెన్లు వాడటమూ కొన్ని ఇళ్లలో సాధారణంగా చోటు చేసుకునే విషయమే. బట్టతో చేసిన పరదాల(క్లాత్/ఫ్యాబ్రిక్ కర్టెన్స్) నిర్వహణ జరిగా లేకపోతే, వాటితో నాలుగు రకాల హాని చేకూరే ప్రమాదం ఉంది. 1. ఫ్యాబ్రిక్ కర్టెన్లలో అలర్జెన్లూ, డస్ట్‌మైట్స్: కర్టెన్లు మన ఇళ్లలోకి వేడిమి, చలి రాకుండా చేయడంతో పాటు దుమ్మూ, ధూళిని సైతం నిరోధిస్తాయన్న అంశం తెలిసిందే. ఈ క్రమంలో మన తలగడల్లో, పక్కబట్టల్లో చేరినట్టే పరదాల మాటున సైతం డస్ట్‌మైట్స్ మాటు వేస్తాయి. ఒక అంచనా ప్రకారం 30 గ్రాముల దుమ్ములో కనీసం 14,000 డస్ట్‌మైట్స్ ఉంటాయి. ఒక చదరపు గజం విస్తీర్ణంలో కనీసం 1,00,000 (లక్ష) వరకు ఉండవచ్చు. ఒక్కో డస్ట్‌మైట్ తన జీవితకాలంలో 300 మిల్లీగ్రాముల విసర్జకాలను వెలువరిస్తుంది. ఈ విసర్జకాల్లోని ప్రోటీన్స్ మనుషులు శ్వాసించేటప్పుడు ముక్కులోకి వెళ్లి అలర్జీ కలిగిస్తుంది. కేవలం డస్ట్‌మైట్స్ మాత్రమే కాకుండా అనేక రకాల అలర్జెన్స్ సైతం కర్టెన్లలో చోటు సంపాదిస్తాయి. అవి కలిగించే అలర్జీ కారణంగా దగ్గడం, ఎడతెరిపి లేకుండా తుమ్ములు రావడం, అదేపనిగా ముక్కుకారడం, కళ్లెర్రబడటం వంటి రియాక్షన్స్ కనిపిస్తాయి. 2. మౌల్డ్స్, మిల్డ్యూ లాంటి ఫంగస్ చేరడం: కర్టెన్లలో మౌల్డ్స్, మిల్డ్యూ వంటి ఫంగల్ జాతికి చెందిన అతి సూక్ష్మమైన జీవులు చేరతాయి. ఇవి బూజు లాంటివి అనుకోవచ్చు. అవి కలిగించే అలర్జిక్ రియాక్షన్ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. 3. సూక్ష్మజీవులకు నెలవు అత్యంత హానికరమైన అనేక రకాల సూక్ష్మజీవులు (జెర్మ్స్) సైతం పెద్దసంఖ్యలో కరెన్లలో చేరి, అవి కూడా ఆరోగ్యానికి హాని చేస్తాయి. 4. దుమ్ము కణాలు అత్యంత సూక్ష్మమైన దుమ్ము కణాలు కూడా అలర్జీలకు తెచ్చి పెడతాయి. దుమ్ము కణాలు పెద్ద సంఖ్యలో ఉన్నప్పుడు అవి ఊపిరితిత్తులను దెబ్బతీసే విషయం మనకు తెలిసిందే. ప్లాస్టిక్ కర్టెన్ల విషయంలో... మొదట్లో అన్ని ఇళ్లలో, నివాస ప్రదేశాల్లో కేవలం క్లాత్ కర్టెయిన్లు మాత్రమే ఉపయోగించేవారు. కానీ ఇటీవల ఉపయోగాలూ, ఫ్యాషన్ దృష్ట్యా ప్టాస్టిక్తో తయారైనవీ వాడుతున్నారు. ఇక బాత్రూమ్ల విషయానికి వస్తే... అక్కడ అవి నీళ్ల వల్ల పాడైపోకుండా ఉండటం కోసం పూర్తిగా వాటర్‌ప్రూఫ్ మెటీరియల్‌తో తయారయ్యేవే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అవి బట్టలాగే ఎటు పడితే అటు వంగేందుకు వీలుగా వాటిని ‘థాలేట్’ అనే పదార్థంతో తయారు చేస్తారు. దీన్నే వాల్పేపర్లు, ఫ్లెక్సీల్లో కూడా వాడతారు. ఈ తరహా ప్లాస్టిక్ కర్టెన్లలోని హానికర/విష (టాక్సిక్)పదార్థాలు కేవలం అలర్జీలను ప్రేరేపించడం, శ్వాససంబంధ సమస్యలను తెచ్చిపెట్టడం మాత్రమే కాకుండా హార్మోన్ల వ్యవస్థపైన ప్రభావం చూపి, ప్రత్యుత్పత్తి వ్యవస్థను దెబ్బతీస్తాయి. గర్భవతులపై కూడా ప్రతికూలంగా పనిచేయడం వల్ల పుట్టబోయే పిల్లలకు ఏడీహెచ్‌డీ (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ అటెన్షన డిజార్డర్) వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కర్టెన్ల అలర్జీలను నివారించడం ఇలా... ∙డోర్, విండో కర్టెన్ల కోసం వీలైనంతవరకు బట్టతో చేసిన పరదాలు (ఫ్యాబ్రిక్ కర్టెయిన్స్) వాడటమే మంచిది. ∙షవర్ కర్టెన్ల కోసం కూడా ఫ్యాబ్రిక్ మెటీరియల్ వాడటం మంచిదే అయినా... అది తడిసే అవకాశాలు ఎక్కువ కాబట్టి అక్కడ పీవీసీ మెటీరియల్ కంటే... హానికరంకాని అలర్జీ ఫ్రెండ్లీ బ్లైండ్స్ వంటివి వాడటం మేలు. ∙కర్టెన్లు ఫ్యాబ్రిక్ లేదా ప్లాస్టిక్ మెటీరియల్‌తో చేసినవైనా పూర్తిగా మాసిపోయే వరకు ఆగకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచడం అవసరం. ఫ్యాబ్రిక్ మెటీరియల్‌తో తయారైన కర్టెన్స్‌ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉతికి, పూర్తిగా పొడిబారే వరకు ఆరబెట్టడం... అదే విధంగా ప్లాస్టిక్ మెటీరియల్‌తో తయారైన వాటిని డిస్ఇన్ఫెక్టెంట్స్తో తరచూ శుభ్రపరచడం అనివార్యం. ఇలా ప్లాస్టిక్‌తో తయారైనవి వాడాల్సి వచ్చినప్పుడు హైపోఅలర్జెనిక్ వాషబుల్వి వాడాలి. దాంతో వాటిని కూడా సబ్బుతో కడిగినట్టే కడిగే అవకాశం ఉంటుంది. అలర్జీలు వస్తే... కర్టెన్లు లేదా ఇతరత్రా కూడా అలర్జీలు వచ్చినప్పుడు ‘రేడియో అలర్జో సార్బెంట్ టెస్ట్’ (ర్యాస్ట్) అనే ఓ రక్తపరీక్ష ద్వారా అలర్జీ ఉందా, దాని తీవ్రత ఎంత అని తెలుసుకుంటారు. అటు తర్వాత తీవ్రతను బట్టి డాక్టర్ల పర్యవేక్షణలో యాంటీహిస్టమైన్స్ వాడాల్సి ఉంటుంది. తీవ్రత మరీ ఎక్కువగా ఉన్న సందర్భాల్లో డాక్టర్లు చాలా నిశితంగా పరిశీలిస్తూ, అవసరమైన స్టెరాయిడ్స్ మోతాదులతో జాగ్రత్తగా చికిత్స అందిస్తారు. -
సాయం కోసం ఎదురుచూపులు
అడ్డగుట్ట: వైద్యానికి డబ్బులేక ఓ నిరుపేద బాలుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. తండ్రి రైలు ప్రమాదంలో మరణించాడు.. తల్లి ఇళ్లలో పనిచేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. బాణసంచా చేతిలో పేలడంతో ఆమె చిన్న కుమారుడు అటు వైద్యానికి, ఇటు మందులకు డబ్బు లేక ఇంటికే పరిమితమయ్యాడు. ఆ నిరుపేద కుటుంబం సాయం కోసం దాతలవైపు చూస్తోంది. వివరాలు.. అడ్డగుట్ట వడ్డెరబస్తీకి చెందిన కనకరాజు రైలు ప్రమాదంలో చనిపోవడంతో అతని భార్య సరిత ఇండ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఈమె చిన్నకుమారుడు వి.రాజేష్(8) నవంబర్ 14 బాలల దినోత్సవం రోజున ఇంటి ముందు బాణసంచా కాలుస్తున్న సమయంలో బాణాసంచా చేతిలో పేలింది. ఈ ప్రమాదంలో బాలుడి శరీరం దాదాపు 50 శాతం కాలిపోయింది. పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు.అయితే గాయాలతో ఇంటికే పరిమితమయ్యాడు. ప్రస్తుతం ఆ బాలుడిది లేవలేని పరిస్థితి. అసలే నిరుపేద కుటుంబం, ఒక్క ఇంజెక్షన్ రూ. 1,300 ఖరీదు. వారానికి ఒక సారి వేస్తే తప్ప శరీరంలో కదలికరాదు. వైద్యానికి చేతిలో డబ్బులు లేకపోవడంతో ఆ కుటుంబం మనోవేదనకు గురవుతోంది. స్నేహితులతో ఆడుకోవాల్సిన వయస్సులో కదలలేని స్థితితో ఉన్నాడు. బాగా చదువుకొని న్యాయవాది అవుతానని, లాయర్ చదువు అంటే ఇష్టమంటున్నాడు. వైద్యం ఖర్చుల నిమిత్తం ఎవరైనా సహాయం చేసేవారు అకౌంట్ నెంబరుకు డబ్బు పంపించవచ్చు.కెనెరా బ్యాంకు అకౌంట్ నంబర్ 0624108031004, ఐఎఫ్ఎస్సీ కోడ్ సీఎన్ఆర్బి0000624, వరికుప్పల సరిత, వివరాల కోసం 91776 98638నెంబరుకు ఫోన్ చేయవచ్చు. -
బాగా బతకాలంటే ఇవి తెలుసుకోండి..!
తిండి కలిగితే కండ కలదోయ్.. కండ కలవాడే మనిషోయ్.. అని అప్పుడెప్పుడో ఓ మహాకవి కవితలు అల్లేశారు గానీ.. ఈ కాలంలో ఇదో సమస్య. ఏం తినాలి? ఏం తినకూడదన్న అవగాహన చాలా మందిలో లేదు అందుకే అటు పట్టణాల్లో.. ఇటు పల్లెల్లోనూ రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బుల్లాంటివి పెచ్చరిల్లుతున్నాయి. నేడు ‘ప్రపంచ ఆహార దినోత్సవం’సందర్భంగా తిండి సంగతులు కొన్ని చెప్పుకుందాం.. చురుకైన, జబ్బుల ప్రమాదం తక్కువగా ఉన్న జీవితం కావాలనుకుంటున్నారా? అయితే సురక్షితమైన, పోషకాలతో కూడిన, వైవిధ్యభరితమైన ఆహారం తీసుకోండి. పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలతో పాటు గింజలు, విత్తనాలు, పల్లీలు, శనగలు, ఉలవలు, బొబ్బర్లు, జీడిపప్పు, బాదం, వాల్నట్స్ వీలైనంత రోజూ తీసుకోండి. భారతీయులు రోజూ కనీసం 400 గ్రాముల కాయగూరలు, పండ్లు తీసుకోవాలని భారత పోషకాహార సంస్థ చెబుతోంది. రాగులు, జొన్నలు, వరి, గోధుమ వంటి ధాన్యాన్ని మరపట్టించకపోవడం మేలు. కొవ్వులు, మరీ ప్రత్యేకంగా సంతృప్త కొవ్వులు, చక్కెర, ఉప్పు వాడకాన్ని మితంగా ఉంచుకోవడం మేలు. ఆరోగ్యంలో పౌష్టికాహారం పాత్ర ఎంత ఉందో.. తగు మోతాదులో రోజూ వ్యాయామం చేయడం కూడా అంతే ముఖ్యం. మరిన్ని వివరాల కోసం జాతీయ పోషకాహార సంస్థ సిద్ధం చేసిన వెబ్‌పేజీ http://te.vikaspedia.in/health/nutrition చూడండి. ఏ ఆహారంతో ఎలాంటి ప్రయోజనం ఉంటుందో. కొన్ని ఆరోగ్య సమస్యలను ఆహారంతో ఎలా అధిగమించవచ్చో ఇందులో విపులంగా అందించారు. మీరు తినే ఆహారంతో ఎన్ని కేలరీలు అందుతున్నాయో తెలుసు కోవాలనుకుంటే.. http://count&what&you&eat.ninindia. org:8080/CountWhatYouEat/Receipes.do లింక్ వాడండి. మీకు తెలుసా..? భూమ్మీద మనిషి తినగలమొక్క జాతుల సంఖ్య 30,000 సాగవుతున్న పంటల సంఖ్య 200 50 శాతం కేలరీలు అందిస్తున్న పంటలు 8 రకాలు (బార్లీ, బీన్స్, వేరుశనగ, మొక్కజొన్న, బంగాళదుంప,, వరి, జొన్న, గోధుమ) ఊబకాయ సంబంధిత ఆరోగ్య సమస్యలపై ప్రపంచవ్యాప్తంగా ఏటా ప్రభుత్వాలు పెడుతున్న 140లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయి అసాంక్రమిక వ్యాధులతో జరిగే మరణాల్లో అనారోగ్యకరమైన ఆహారం , శారీరక శ్రమలేమితో జరిగేవి ముందు వరుసలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆకలితో బాధపడుతున్న వారి సంఖ్య 82కోట్లు పోషకాహార లోపం కారణంగా సామర్థ్యానికి తగ్గట్టు ఎదగని ఐదేళ్లలోపు పిల్లలు 14.9కోట్లు అధిక ఆహారం కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్న ఐదేళ్ల లోపు పిల్లలు 4.9కోట్లు ఊబకాయ సమస్యతో ఉన్న వాళ్లు 67కోట్లు ఊబకాయులైన (5 –19 మధ్య వయస్కులు) పిల్లల సంఖ్య 12కోట్లు ఊబకాయులుగా ఉన్న ఐదేళ్లలోపు పిల్లలు 4కోట్లు -
‘సాఫ్ట్వేర్’కు సంతానలేమి!
సాక్షి, హైదరాబాద్: ఐటీ ఉద్యోగులు ‘అమ్మా-నాన్న’ పిలుపునకు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయని స్త్రీ, ప్రసూతి వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాఫ్ట్వేర్, దాని అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో సంతానలేమి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఫెడరేషన్ ఆఫ్ అబ్స్టెట్రిక్స్- గైనకాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ గైనకాలజీ అబ్స్టెట్రిక్స్’ సంయుక్తంగా హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ‘రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ’అంశంపై ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సు ఆదివారం ముగిసింది. ఫిగో అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎస్.అరుల్‌కుమారన్, ఫోగ్సీ అధ్యక్షురాలు డాక్టర్ హేమదివాకర్, ఫిగో ప్రెసిడెంట్ ఎలక్ట్ సీఎన్ పురందరే, ఉపాధ్యాక్షురాలు డాక్టర్ శాంతకుమారితో పాటు దేశవిదేశాల నుంచి సుమారు వెయ్యి మంది వైద్య నిపుణులు ఈ సదస్సులో పాల్గొని సిజేరియన్ ఆపరేషన్లు, సంతానలేమి సమస్యలపై విస్తృతంగా చర్చించారు. సదస్సులో నిపుణులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇవీ... ఐటీ రంగాలలో పనిచేసే ఉద్యోగుల్లో ప్రతి ఏడుజంటల్లో ఒక జంట సంతాన లేమితో బాధపడుతోంది. ఆలస్యపు వివాహాలు, మానసిక ఆందోళన, పని ఒత్తిడి,మారిన జీవన శైలి, ఊబకాయం, రుతుక్రమం తప్పడం వంటి అంశాలే ఇందుకు ప్రధాన కారణం సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువగా ల్యాప్‌ట్యాప్‌లను ఒడిలో పెట్టుకుని పని చేయడం వల్ల వీర్యకణాల ఉత్పత్తిపై రేడియన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రతి వంద జంటల్లో 15 శాతం మందికి సంతానలే మి సమస్య వల్ల చికిత్సతీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఆ పదిహేను శాతంలో కూడా 40 మంది పురుషులే. ఈ పెరుగుదల రేటు ఆందోళనకరంగా ఉంది. ఇటీవలి జనాభా లెక్కల ప్రకారం ఇన్ఫెర్టిలిటీ రేటు 50 శాతం పెరిగింది. దేశవ్యాప్తంగా సుమారు మూడు కోట్ల జంటలు సంతానలేమితో బాధపడుతున్నాయి. మధుమేహం, రక్తపోటు, గుండెపోటు జబ్బులతో సంతాన లేమి సమస్య పోటీపడుతోంది. ఈ సమస్యకు ఆడవారినే బాధ్యులను చేయడం తగదు... స్త్రీ, పురుషులిద్దరూ ఇందుకు బాధ్యులే. 18 నుంచి 25 ఏళ్లలోపు ఉన్న ప్రతి ఐదుగురు యువకుల్లో ఒకరికి వీర్యకణాల సంఖ్య ఉండాల్సిన దానికంటే తక్కువ గా ఉంటోంది. అతిగా మద్యం సేవించిడం, పొగతాగడం కూడా ఇందుకు మరో కారణం.