భారత ప్రభుత్వ రంగానికి చెందిన పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నార్తర్న్ రీజియన్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్(జమ్మూ–లద్దాక్ రీజియన్లలో).. డిప్లొమా ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 42
► పోస్టుల వివరాలు: డిప్లొమా ట్రెయినీ(ఎలక్ట్రికల్)–23, డిప్లొమా ట్రెయినీ(ఎలక్ట్రికల్) లద్దాక్ రీజియన్–09, డిప్లొమా ట్రెయినీ(ఎలక్ట్రికల్) కాశ్మీర్ రీజియన్–05, డిప్లొమా ట్రెయినీ(సివిల్)–03, డిప్లొమా ట్రెయినీ(సివిల్)లద్దాక్ రీజియన్–02.
► సబ్జెక్టులు: ఎలక్ట్రికల్, సివిల్.
► అర్హత: కనీసం 70శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల రెగ్యులర్ ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. డిప్లొమా లేకుండా బీఈ/బీటెక్/ఎంఈ /ఎంటెక్ వంటి అర్హతలున్నా పరిగణనలోకి తీసుకోరు.
► వయసు: 15.06.2021 నాటికి 27ఏళ్లు మించకూడదు.
► ఎంపిక విధానం: రాతపరీక్ష/కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
► పరీక్షా విధానం: పరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో జరుగుతుంది. ఇందులో పార్ట్–1లో 120 ప్రశ్నలు టెక్నికల్ నాలెడ్జ్/ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి ఉంటాయి. పార్ట్–2 సూపర్ వైజరీ ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో 50 ప్రశ్నలు వొకాబ్యులరీ, వెర్బల్‌కాంప్రహెన్షన్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, డేటా సఫిషియన్సీ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ , న్యూమరికల్ ఎబిలిటీ విభాగాల నుంచి అడుగుతారు. పరీక్షా సమయం 2 గంటలు.
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 12.07.2021
► వెబ్‌సైట్: www.powergridindia.com
మరిన్ని నోటిఫికేషన్లు:
ఎన్‌డీఏ, ఎన్‌ఏ 2021: ఇంటర్‌తోనే.. కొలువు + చదువు
పవర్‌గ్రిడ్‌లో 42 డిప్లొమా ట్రెయినీ ఖాళీలు
Published Wed, Jun 23 2021 7:36 PM | Last Updated on Wed, Jun 23 2021 7:38 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment