2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే దేశ ఆర్థిక వ్యవస్థ పెంపుకు కావాల్సిన కీలక నిర్ణయాలు, ఆటోమొబైల్ రంగం అభివృద్ధికి కావాల్సిన చర్యలు తీసుకుంటోంది. దేశం అభివృద్ధి చెందాలంటే ఉపాధి కూడా తప్పనిసరి. కాబట్టి యువతకు ఉద్యోగాలు చాలా అవసరం. ఉద్యోగ కల్పనకు ఫుడ్ డెలివరీ సంస్థలు కీలకమని కేంద్రమంత్రి 'నితిన్ గడ్కరీ' అన్నారు.
జొమాటో నిర్వహించిన 'సస్టైనబిలిటీ అండ్ ఇన్‌క్లూజివిటీ - రోల్ ఆఫ్ ప్లాట్‌ఫామ్ ఎకానమీ' సమావేశంలో నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం భారతదేశంలో 77 లక్షల మంది డెలివరీ కార్మికులు ఉన్నారు. ఈ సంఖ్య 2030 నాటికి 2.5 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు.
దేశంలో ఏకంగా 2.5 కోట్ల మందికి ఉపాధి కల్పించడం చాలా పెద్ద విషయమే. ప్రస్తుతం దేశంలో ఉద్యోగ కల్పన చాలా అవసరం అని గడ్కరీ పేర్కొన్నారు. దేశంలోని చాలా మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్నందుకు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటోను.. మంత్రి అభినందించారు.
ఉద్యోగాల కల్పినలో ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అయితే రోడ్డు ప్రమాదాల సంఖ్యపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డెలివరీ బాయ్‌లు పరిమిత సమయంలో వస్తువులను డెలివరీ చేయవలసి ఉన్నందున ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు.
ఇదీ చదవండి: అంబానీ, అదానీ కంటే సంపన్నుడు: ఇప్పుడు నిలువ నీడ లేక..
భారతదేశంలో గంటకు 45 ప్రమాదాలు, 20 మరణాలు జరుగుతున్నాయని గడ్కరీ తెలిపారు. ఇందులో 18 నుంచి 45 ఏళ్ల వయసు వారే ఎక్కువగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన ద్విచక్ర వాహనదారుల సంఖ్య 80,000 కాగా.. ఇందులో హెల్మెట్ ధరించకపోవడం వల్ల మరణించినవారి సంఖ్య 55,000 కావడం గమనార్హం. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం వల్ల 10,000 మరణాలు సంభవిస్తున్నాయని ఆయన అన్నారు. సరైన శిక్షణ అందించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని.. జొమాటో సుమారు 50వేలమంది డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నందుకు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment