diploma
-
డిప్లొమా విద్యార్థులకు 10వేల ఇంజనీరింగ్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్, ఫార్మసీ డిప్లొమా పూర్తి చేసిన వారికి నిర్వహించే తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇంజనీరింగ్, ఫార్మసీలో రెండో సంవత్సరంలో నేరుగా ప్రవేశాలు కల్పించారు. ఇంజనీరింగ్‌లో 12,785 సీట్లు అందుబాటులో ఉంటే, 10,407 సీట్లు భర్తీ చేశారు. ఫార్మసీలో 1,180 సీట్లు అందుబాటులో ఉంటే, కేవలం 47 సీట్లు (3.98 శాతం) మాత్రమే భర్తీ అయ్యాయి. ఈ ఏడాది ఈ సెట్‌కు 22,365 మంది అర్హత సాధించారు. ఫైనల్ ఫేజ్‌లో 9,646 మంది 3,92,923 ఆప్షన్లు ఇచ్చారు. ఆఖరి విడతలో 1,246 మంది బ్రాంచీలను మార్చుకున్నట్టు సాంకేతిక విద్య విభాగం తెలిపింది. ఇంజనీరింగ్‌లో ఎక్కువ భాగం కంప్యూటర్ సైన్స్, ఇతర కంప్యూటర్ కోర్సుల్లోనే ఆప్షన్లు ఇచ్చారు. దీంతో 8,371 సీట్లు ఈ బ్రాంచీల్లో ఉంటే, 6,084 సీట్లు భర్తీ అయ్యాయి. 72.68 శాతం సీట్ల భర్తీ పూర్తయినట్టు అధికారులు తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 24లోగా రిపోర్టు చేయాలని అధికారులు సూచించారు. -
'పాలిటెక్నిక్' లో నవోదయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్య సరికొత్త బ్రాండ్ ఇమేజ్ను సృష్టిస్తోంది. పదో తరగతి ఉత్తీర్ణులై.. మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తి చేసేలోగా బహుళజాతి సంస్థల్లో లక్షల రూపాయల జీతాలతో ఉద్యోగాలు కల్పిస్తోంది. గడచిన ఐదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో వివిధ కంపెనీల్లో దక్కుతున్న ఉద్యోగాలకు సంబంధించిన ప్లేస్మెంట్లు క్రమేణా పెరుగుతున్నాయి. 2023–24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ఏకంగా 12 వేల మందికి ఉద్యోగాలు దక్కడం విశేషం.గతేడాది అత్యధిక వార్షిక వేతనం రూ.6.25 లక్షలుగా ఉంటే.. ఈ ఏడాది రూ.8.60 లక్షలకు పెరిగింది. ప్రతి వి ద్యార్థి సగటున రూ.3 లక్షల ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఒకప్పుడు 2019కి ముందు 400 కూడా దాటని ఉద్యోగ అవకాశాలు.. ఇప్పడు వేల మందికి చేరు వ అవుతున్నాయి.2019–20లో 575 ఉద్యోగాలు, 2020–21లో 652 పోస్టులు, 2021–22లో 780 కొలువులు మాత్రమే వచ్చాయి. 2022–23లో 6వేల మంది క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఎంపికైతే.. ఈ ఏడాది రెట్టింపైంది. ఇంటర్మీడియెట్, ఇంజనీరింగ్ కోర్సులను ఆరేళ్లు చదివి పూర్తి చేసిన తర్వాత అందుకునే వేతనాలను మూడేళ్ల డిప్లొమాతో 18 ఏళ్ల వయసులోనే దక్కించుకోవడం మార్కెట్లో పాలిటెక్నిక్ విద్య డిమాండ్‌కు అద్దం పడుతోంది. ఒకవైపు ఉద్యోగం.. మరోవైపు ఉన్నత చదువులు రాష్ట్రవ్యాప్తంగా 88 ప్రభుత్వ, 179 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో 35,533 మంది డిప్లొమా ఫైనలియర్ చదువుతుంటే.. వీరిలో 12వేల మందికి ఉద్యోగాలు దక్కాయి. ఇందులో 50 శాతం ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర పాలిటెక్నిక్ విద్యా చరిత్రలో తొలిసారిగా బహుళజాతి సంస్థ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ రూ.8.60 లక్షల వార్షిక వేతనంతో విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసింది. ఈ సంస్థ సాధారణంగా జాతీయ స్థాయిలో పేరొందిన ఐఐటీలు, ఎన్ఐటీలు నుంచి బీటెక్ గ్రాడ్యుయేట్లను మాత్రమే తమ సంస్థలో ఉద్యోగాలకు ఎంపిక చేసేది. కానీ.. ఏపీలో నైపుణ్యాలతో కూడిన విద్యను అభ్యసిస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులకు అరుదైన అవకాశం కల్పించింది.ఇక్కడ అత్యధిక ప్యాకేజీలతో రూ.8.60 వార్షిక వేతనానికి 9 మంది ఎల్రక్టానిక్స్ విద్యార్థులకు టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ ల్యాబ్ ఇంటర్న్‌లుగా, రూ.8 లక్షల వార్షిక వేతనంతో థాట్వర్క్ల కోసం సాఫ్ట్వేర్ డెవలపర్లుగా 35 మంది కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించాయి. ఈ రెండు సంస్థలతో పాటు మెగా ఇంజనీరింగ్, జీఈ ఏరోస్పేస్, మోస్ చిప్, సుజ్లాన్, అమరరాజా, ఆర్సెలర్ మిట్టల్ అండ్ నిప్పన్ స్టీ ల్, ఎఫ్ట్రానిక్స్, మేధా సర్వో, డాక్టర్ రెడ్డీస్ లే»ొరేటరీస్, షాపూర్జీ పల్లోంజీ, ఆల్ఫా లావాల్, మారుతీ సుజుకి రాయ ల్ ఎన్ఫీల్డ్, వీల్స్ ఇండియా, స్మార్ట్‌డివి టెక్నాలజీస్, నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, హెచ్ఎల్ మాండో ఆనంద్ ఇండియా వంటి ప్రధాన సంస్థల్లో డిప్లొమా విద్యార్థులు కొలువుదీరారు.డిప్లొమా స్థాయిలో ఉద్యోగాలు పొందిన విద్యార్థులను సైతం ఉన్నత చదువుల వైపు ప్రోత్సహించేలా సాంకేతిక విద్యాశాఖ కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే ఆయా సంస్థలు రెండేళ్లు అనుభవం గడించిన తర్వాత ఉద్యోగులందరికీ బీటెక్ విద్యను అభ్యసించేలా తోడ్పాటును అందించనున్నాయి. ఇక్కడ ఉన్నత చదువులకయ్యే మొత్తం ఫీజును కూడా కంపెనీలే భరించనున్నాయి. ప్రత్యేక క్యాంపస్ రిక్రూట్మెంట్ శిక్షణసాంకేతిక విద్యాశాఖ విద్యార్థులను మార్కెట్లోకి రెడీ టు వర్క్‌గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కరిక్యులమ్ అమలు చేస్తోంది. అకడమిక్ లెర్నింగ్, ఇండస్ట్రీ అవసరాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి వర్క్‌షాపులను నిర్వహిస్తోంది. పారిశ్రామికవేత్తలు, ఐటీ తదితర కంపెనీల ప్రతినిధుల నుంచి వచ్చిన సూచనలతో పరిశ్రమ ఆధారిత కోర్సులను ప్రారంభించింది. అన్ని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రభుత్వం వర్చువల్ డిజిటల్ క్లాస్‌రూమ్‌లను ఏర్పాటు చేసినందున విద్యార్థులకు లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా థియరీ, ప్రాక్టికల్ సబ్జెక్టుల బోధన పకడ్బందీగా అందుబాటులోకి వచ్చింది.పారిశ్రామిక రంగంలో వస్తున్న మార్పులకనుగుణంగా సిలబస్‌ను మార్పు చేయడంతో పాటు వాటి బోధనకు వీలుగా సిబ్బంది కోసం ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లను అమలు చేయిస్తున్నారు. పారిశ్రామిక శిక్షణ కార్యక్రమాల కోసం విద్యాసంస్థలను పరిశ్రమలతో అనుసంధానిస్తున్నారు. వీటితో పాటు క్యాంపస్ రిక్రూట్మెంట్ శిక్షణ ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు ఇంటర్వ్యూల్లో చక్కగా రాణించేలా సంసిద్ధం చేసింది. కళాశాల స్థాయి, క్లస్టర్ల వారీగా, కమిషనరేట్ స్థాయి వరకు మల్టీ లెవల్ ప్లేస్మెంట్ డ్రైవ్‌లు చేపట్టింది. తద్వారా మహిళా పాలిటెక్నిక్‌లు, మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్,మైనారిటీ పాలిటెక్నిక్‌ల విద్యార్థులు గణనీయంగా ఉద్యోగాలు పొందారు. పాడేరు, చీపురుపల్లి, శ్రీకాకుళం, అద్దంకి, శ్రీశైలం, చోడవరం వంటి మారుమూల ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులు ప్రఖ్యాత కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విజయం సాధించింది. రూ.8.60 లక్షల వేతనంతో.. మాది అనంతపురం జిల్లా పామిడి గ్రామం. నాన్న డ్రైవర్. అమ్మ గృహిణి. వాళ్లిద్దరూ కష్టపడి చదివించడంతో నేను డిప్లొమాలో ఎలక్ట్రికల్ అండ్ ఎల్రక్టానిక్స్ (ఈఈఈ) పూర్తి చేశాను. చివరి ఏడాది చదువుతుండగానే బెంగళూరులోని టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ కంపెనీలో రూ.8.60 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం వచ్చింది. ఇది మల్టీ నేషనల్ కంపెనీ. నాకు రాయల్ ఎన్ఫీల్డ్లోనూ ఉద్యోగం వచ్చినప్పటికీ చిన్న ప్యాకేజీ కావడంతో చేరలేదు. మా కాలేజీలో చదువుతో పాటు ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలను ముందుగానే నేరి్పంచారు. ల్యాబ్స్, కరిక్యులమ్, క్యాంపస్ ఇంటర్వ్యూల్లో రాణించేలా ఇచ్చిన ప్రత్యేక శిక్షణ మాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులు కొనసాగించాలని ఉంది. – ఎన్.గౌతమి, ప్రభుత్వ పాలిటెక్నిక్, అనంతపురం‘రెడీ టూ వర్క్’ లక్ష్యంతో.. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పాలిటెక్నిక్ విద్యను అందించడంలో ఏపీ విజయం సాధించింది. ఏటా పెరుగుతున్న క్యాంపస్ ఎంపికలే ఇందుకు నిదర్శనం. టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, థాట్వర్స్, మేధా సర్వో, జీఈ ఏరో స్పేస్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు సాంకేతిక విద్యలోని విప్లవాత్మక మార్పులను చూసి ఎంతో ప్రశంసించారు. దేశవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యలో ఇంతటి స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కలి్పస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ ఒకటే.మారుతున్న సాంకేతిక, అవసరాలకు తగ్గట్టు బోధన ఉండేలా లెక్చరర్లకు పరిశ్రమల్లో నైపు ణ్య శిక్షణ ఇస్తున్నాం. విద్యార్థులను రెడీటూ వర్క్‌గా తీర్చిదిద్దుతున్నాం. అందుకే రాష్ట్రానికి అంతర్జాతీయ, జాతీయ బహుళజాతి కంపెనీలు వస్తున్నాయి. డిప్లొమాతో ఉద్యోగం పొందిన విద్యార్థులకు ఆయా సంస్థలే ఉన్నత చదువులకు ప్రోత్సహించేలా కంపెనీలు సైతం అంగీకరించాయి. చివరి సంవత్సరంలో ఉండగానే క్యాంపస్ రిక్రూట్మెంట్పై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకున్నాం. అందుకే ప్లేస్మెంట్లు రెట్టింపయ్యాయి. – చదలవాడ నాగరాణి, కమిషనర్, సాంకేతిక విద్యాశాఖ -
డిప్లొమాలో ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యార్థులకు అత్యున్నతస్థాయి విద్యనందించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం. సాంకేతిక విద్యలోనూ సీఎం జగన్ పలు సంస్కరణలు చేపట్టారు. విద్యార్థులు చదువు పూర్తి చేయగానే మంచి కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చేలా పాఠ్యాంశాల్లో కూడా మార్పులు చేస్తున్నారు. సాంకేతిక విద్యలో ప్రభుత్వం ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా కరిక్యులమ్‌లో మార్పులు తెచ్చింది. డిప్లొమా స్థాయి నుంచి ఇండస్ట్రీ కనెక్ట్ విధానాన్ని అమలు చేస్తోంది. తాజాగా డిప్లొమాలో తొలిసారిగా ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను ముద్రిస్తోంది. ఈ విద్యా సంవత్సరం (2023–24)లో డిప్లొమా మొదటి ఏడాదికి ఆరు బ్రాంచ్‌లలో కొత్త కరిక్యులమ్ ప్రకారం 17 థియరీ, 10 ల్యాబ్ మాన్యువల్స్‌ను ప్రచురిస్తోంది. త్వరలో ఆటోమొబైల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌లలో ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి. అదనపు సమాచారం కోసం పాఠ్యపుస్తకాల్లో వెబ్ లింక్‌లు, ఆడియో విజువల్ విద్యా సమాచారానికి అనుగుణంగా డిజిటల్ లింక్‌లు పొందుపరిచారు. విద్యార్థులు డిప్లొమా పరీక్షలతోపాటు బహుళ జాతీయ సంస్థ, పలు కంపెనీల్లో ఉద్యోగాలు సాధించేలా మంచి క్వశ్చన్ బ్యాంక్‌లను కూడా రూపొందించడం విశేషం. విద్యార్థులకు అందుబాటు ధరల్లో ఇప్పటివరకు డిప్లొమా కోర్సుల్లో బోధనకు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి ఆమోదించిన పాఠ్య పుస్తకాలు అందుబాటులో లేవు. ఈ పరిస్థితుల్లో పుస్తకాల ఎంపికలో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. దీంతో విద్యార్థులకు మేలు చేకూర్చేలా సొంతంగా పాఠ్యపుస్తకాలు రూపొందించాలని సాంకేతిక విద్యా శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో సాంకేతిక విద్య, శిక్షణ మండలి తక్కువ ధరకు నాణ్యమైన పాఠ్య పుస్తకాలు, ప్రయోగశాల కరదీపికల ప్రాజెక్టును ప్రారంభించింది. వీటి రూపకల్పనకు ప్రత్యేక అధ్యాపక బృందాన్ని ఎంపిక చేసింది. పాఠ్య పుస్తక ప్రచురణలో 46 మంది రచయితలు, 20 మంది సంపాదకులు సేవలు అందించారు. నేషనల్ అక్రెడిటేషన్ బోర్డు మార్గదర్శకాల ప్రకారం అభ్యాస ఫలితాలకు తగినట్లుగా కంటెంట్‌ను రూపొందించింది. మార్కెట్ ధరలతో పోల్చితే తక్కువ ధరకు పాఠ్య పుస్తకాలను అందించనుంది. గతంలో ఏ పుస్తకం కొనాలన్నా రూ.200–రూ.300 ఖర్చు అయ్యేది. ఇప్పుడు మెరుగైన విషయ పరిజ్ఞానంతో ప్రభుత్వమే రూ.100 లోపు ధరలకు పాఠ్యపుస్తకాలను అందించనుంది. ముద్రిత ధరపై మరో 20 శాతం మేర సాంకేతిక విద్య, శిక్షణ మండలి ప్రత్యేక రాయితీని కల్పిస్తోంది. కొద్ది రోజుల్లోనే అందుబాటులోకి కొద్ది రోజుల్లోనే డిప్లొమా మొదటి సంవత్సరం విద్యార్థులకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి తెస్తాం. ఇప్పటికే సాధారణ సబ్జెక్టుల పుస్తకాలు, ల్యాబ్ మాన్యువల్లు సిద్ధంగా ఉన్నాయి. సీఎం జగన్ సూచనలతో సాంకేతిక విద్యా శాఖ, శిక్షణ మండలి పాఠ్యపుస్తకాలను ముద్రిస్తోంది. ఇవి తక్కువ ధరకే లభిస్తాయి. – చదలవాడ నాగరాణి, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ -
ప్రిన్సిపాల్ ఎదుట డాన్స్.. ఊహించని షాక్.. డిగ్రీ గోవిందా!
అమెరికా: అమెరికాలో ఒక హై స్కూల్లో స్టేజి మీద డాన్స్ చేసినందుకు ఓ విద్యార్థినికి డిప్లొమా పట్టా ఇవ్వడానికి నిరాకరించారు ఆ స్కూలు ప్రిన్సిపాల్. దీంతో ఇన్నేళ్ల శ్రమ మొత్తం బూడిదలో పోసినట్టయ్యిందని ఆ విద్యార్థిని తోపాటు ఆమె తల్లిదండ్రులు వాపోతున్నారు. జూన్ 9న ఫిలడెల్ఫియా బాలికల హై స్కూల్ స్నాతకోత్సవంలో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తమ పిల్లలు డిగ్రీలు స్వీకరిస్తున్న సమయంలో ఎలాంటి గోల, అరుపులు చేయవద్దని.. కనీసం చప్పట్లు కూడా కొట్టవద్దని స్ట్రిక్ట్ గా చెప్పింది స్కూల్ యాజమాన్యం. దీంతో నిశ్శబ్ద వాతావరణంలో పట్టా ప్రదానోత్సవం జరుగుతుండగా హఫ్సా అబ్దుల్ రహ్మాన్ అనే అమ్మాయి తన పేరు పిలవగానే స్టేజి మీదకు వచ్చింది. కానీ డిగ్రీ పట్టా సాధిస్తున్నానన్న సంతోషంలో ఉండబట్టలేక చిన్నగా చిందేసింది. అదికాస్తా ప్రిన్సిపాల్ దృష్టిలో పడేసరికి ఆమెకు పట్టా అందివ్వలేదు సరికదా మర్యాదగా స్టేజి విడిచి వెళ్ళమని ఆదేశించారు. దీంతో స్టేజి విడిచి వెళ్లిన హఫ్సా అబ్దుల్ రహ్మాన్ ప్రిన్సిపాల్ పట్టా అందివ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసింది. నేనే తప్పూ చేయలేదు, ఏ నిబంధనను అతిక్రమించలేదని తెలిపింది. ఇదే స్నాతకోత్సవంలో హఫ్సా తనతో పాటు 2014లో కాల్పుల్లో చనిపోయిన తన సోదరి ఐషా తరపున కూడా డిగ్రీ పట్టా స్వీకరించాల్సి ఉంది. కానీ అంతలోనే ఆమెను స్టేజి విడిచి వెళ్ళమనడంతో బోరున ఏడ్చేసింది. హఫ్సా తల్లి మాట్లాడుతూ.. నాలుగేళ్లపాటు కోవిడ్ సమయంలో మానసికంగానూ, శారీరకంగానూ చాలా ఇబ్బందులు ఎదుర్కొని చదువుకున్నారని. ప్రిన్సిపాల్ ఇలా చేయడం అమానుషమని అన్నారు. Controversy at Philadelphia Girls' High School as Muslim graduate Hafsah Abdur-Rahman's diploma denied on stage for a celebratory dance. Despite the district's apology, her family calls for rule changes. pic.twitter.com/qbiIG0Rlr7 — Middle East Eye (@MiddleEastEye) June 18, 2023 ఇది కూడా చదవండి: మోస్ట్ వాంటెడ్ ఖలిస్థాన్ ఉగ్రవాది హతం.. -
శునకానికి డిప్లొమా డిగ్రీ: వీడియో వైరల్
గ్రాడ్యుయేషన్ వేడుకలో యజమాని తోపాటు డిగ్రీ అందుకుని విస్మయపరిచింది ఓ శునకం. ఆ కుక్క తన యజమాని తోపాటు ప్రతి తరగతికి క్రమంత తప్పకుండా అటెండెంట్ అయ్యింది. దీంతో ఆ వేడుకలో స్టేజ్‌పై ఆ కుక్కకి డిప్లొమా డిగ్రీ అందజేసింది సదరు యూనివర్సిటీ. వివరాల్లోకెళ్తే..యూఎస్‌లోని న్యూజెర్సీలోని సెటన్ హాల్ యూనివర్సిటీలో జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుకలో జస్టిన్ అనే సర్వీస్ డాగ్ డిప్లోమా డిగ్రీని అందుకుని అందర్నీ ఆకర్షించింది. సెటన్ హాల్‌కి చెందని జోసెఫ్ నైర్ గ్రేస్ మరియాని, తన కుక్క జస్టిన్లు ఈ వేడుకలో డిగ్రీలను అందుకున్నారు. మరియాని బ్యాచిలర్ ఆప్ సైన్స్ ఇన్ ఎడ్యుకేషన్ డిగ్రీతో పట్టుభద్రురాలైంది. ఆమె కుక్క యూనివర్సిటీలో ఉన్న అన్ని సమయాల్లో ఆమె పక్కనే ఉండి అన్ని తరగతులకు హజరయ్యి.. యజమాని పట్ల అచంచలమైన అంకితభావంతో పనిచేసింది. అందుకు గాను గ్రాడ్యుయేషన్ వేడుకలో ఆమెకు డిప్లొమా డిగ్రీని ప్రధానం చేశారు. తన యజమాని మరియాని తోపాటు ఆ కుక్క అన్ని శిక్షణా తరుగుతుల్లో ఉండటం అనేది చాలా అరుదైన విషయం అని ప్రశంసిస్తూ యూనివర్సిటీ ఈ డిగ్రీని సదరు కుక్కకి బహుకరించింది. ఇక మరియాని తన కుక్క సహచర్యంతోనే ప్రాథమిక పాఠశాలలో భోదించాలని భావిస్తున్నట్లు పేర్కొంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Seton Hall President Joseph E. Nyre, Ph.D. presents Justin, the service dog for Grace Mariani, of Mahwah, NJ, with a diploma for attending all of Grace’s classes at Seton Hall. pic.twitter.com/sZgHD5Fs3X — Seton Hall (@SetonHall) May 23, 2023 (చదవండి: శునకాన్ని చిన్నపాటి కొమ్మతో అదిలించాడు..అంతే అది రెచ్చిపోయి...) -
పాలిటెక్నిక్ విద్యలో నవోదయం
ఈ చిత్రంలోని విద్యార్థి పేరు కె. తరుణ్. రావులపాలేనికి చెందిన ఓ రైతు కొడుకు. మూడేళ్ల క్రితం పాలిసెట్‌లో ర్యాంకు సాధించి కాకినాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్‌లో చేరాడు. ఇటీవల నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్‌లో విప్రో కంపెనీలో రూ.3.50 లక్షల వేతనంతో ఉద్యోగంతో పాటు నాలుగేళ్ల సర్వీసు అనంతరం బిట్స్ పిలానీ నుంచి బీటెక్ డిగ్రీ ఇచ్చేందుకు కంపెనీ ఆఫర్ ఇచ్చింది. కానీ, ‘పదో తరగతిలో నా స్నేహితులు 10 మంది పాలిసెట్ రాశాం. నలుగురికి ర్యాంకులు వచ్చాయి. నేరు డిప్లొమాలో చేరితే మిగతా వారు ఇంటర్, తర్వాత ఇంజినీరింగ్‌లో చేరారు. వారింకా చదువుల్లో ఉంటే నేను 18 ఏళ్లకే మంచి ప్యాకేజీతో ఉద్యోగం అందుకున్నా. డిప్లొమా వదిలేసినందుకు వారిప్పుడు బాధపడుతున్నారు’.. అని తరుణ్ అంటున్నాడు. ఈ విద్యార్థి పేరు ప్రేమ్‌సాయి. ఊరు ప్రొద్దుటూరు. అత్యంత సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఇతను విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో మెకానికల్ డిప్లొమా కోర్సులో చేరాడు. ఇటీవల క్యాంపస్ ప్లేస్మెంట్లో రూ.6.25 లక్షల వేతనంతో మెట్సో ఒటోటెక్ కంపెనీలో ఉద్యోగం సాధించాడు. కానీ, ఈయన సోదరి ఇంకా బీటెక్ మూడో ఏడాది చదువుతుండగానే ప్రేమ్‌సాయి ఉద్యోగం సాధించేశాడు. విశాఖపట్నానికి చెందిన పి. నవ్యశ్రీని ఆమె తల్లి చిరుద్యోగం చేస్తూ కుమార్తెను చదివించింది. భీమునిపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఈసీఈ డిప్లొమా మూడో ఏడాది చదువుతోంది. రూ.4.06 లక్షల ప్యాకేజీతో స్క్లంబర్గర్ కంపెనీలో కొలువు సంపాదించింది. కంచరపాలేనికి చెందిన జి. గీతాభవాని తండ్రి ఓ సంస్థలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. గీత విశాఖపట్నంలోని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో పెట్రో కెమికల్స్‌లో డిప్లొమా చేసింది. ఇటీవల క్యాంపస్ ఎంపికల్లో రూ.4 లక్షల వేతనంతో అల్ట్రాటెక్ కంపెనీలో కొలువును సొంతం చేసుకుంది. కేవలం 18 ఏళ్ల వయసులో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లోని నాలుగు వేల మందికి పైగా విద్యార్థులు ఏడాదికి సగటున రూ.2.80 లక్షల వేతనంతో కొలువులతో పాటు, ఉన్నత విద్యావకాశాలు కూడా దక్కించుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రాంగణ ఎంపికల్లో మరో రెండు వేల మందికి పైగా ఉద్యోగాలు సాధిస్తారని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ సి. నాగరాణి గర్వంగా చెబుతున్నారు. ఇదంతా గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, ప్రోత్సాహంతోనే సాధ్యమైందంటున్నారు. సాక్షి, అమరావతి: పదో తరగతి తర్వాత పేద, దిగువ మధ్యతరగతి విద్యార్థుల గమ్యం మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు. చదువుతో పాటే క్యాంపస్ ప్లేస్మెంట్లలో రూ.లక్షల వేతనాలతో విద్యార్థులు ఉద్యోగాలు దక్కించుకుంటున్నారు. 2022–23 బ్యాచ్‌కు సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు 4,000 మందికి పైగా ఇంకా పరీక్షలు పూర్తికాకుండానే మంచి వేతనాలతో క్యాంపస్ కొలువులను సొంతం చేసుకున్నారు. గరిష్టంగా రూ.6.25 లక్షలు, సరాసరి రూ.2.80 లక్షల వార్షిక వేతనాలతో బహుళజాతి సంస్థల్లో ఆఫర్ లెటర్లు అందుకున్నారు. ఇంటర్, ఇంజినీరింగ్ కోర్సులతో ఆరేళ్లు చదివి పూర్తిచేసిన తర్వాత అందుకునే వేతనాలను మూడేళ్ల డిప్లొమాతో 18 ఏళ్ల వయసులోనే అందుకుంటున్నారు. నాలుగేళ్ల క్రితం 400 దాటని అవకాశాలు.. ఇçప్పుడు వేలమందికి అందడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, సంస్కరణల ప్రభావం ఎంతో ఉంది. దీంతోపాటు ఏపీ సాంకేతిక విద్యాశాఖ చూపిన చొరవతో డిప్లొమా బోధనలోను మార్పులు చేశారు. ప్రభుత్వ కాలేజీల్లోనే అధిక కొలువులు రాష్ట్రంలో 84 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు, 175 ప్రైవేటు, ఒక ఎయిడెడ్ కాలేజీ ఉన్నాయి. వీటిల్లో గత దశాబ్ద కాలంలో ఏనాడు కొలువులు 450 దాటలేదు. 2019–20లో 575 ఉద్యోగాలు, 2020–21లో 652, 2021–22లో 780 ఉద్యోగాలు అందుకుంటే.. ఈసారి 2022–23లో ఒక్క ప్రభుత్వ కాలేజీ విద్యార్థులే 4,071 మంది ఉద్యోగాలు సాధించారు. మే చివరి వరకు కొనసాగే ఈ నియామక ప్రక్రియలో మరో రెండువేల మందికి పైగా అవకాశాలు పొందుతారని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ సి. నాగరాణి ‘సాక్షి’కి తెలిపారు. అలాగే, ప్రైవేటు, ఎయిడెడ్ కాలేజీల్లోని 24,667 మంది విద్యార్థుల్లో రెండువేల మంది విద్యార్థులు ఉద్యోగావకాశాలు దక్కించుకున్నారు. 31 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది స్కిల్ హబ్‌లను ఏర్పాటుచేయడంతో శిక్షణ పొందిన విద్యార్థులు సునాయాసంగా కొలువులను దక్కించుకున్నారు. అత్యధికంగా నంద్యాలలోని ఈఎస్సీ పాలిటెక్నిక్ కాలేజీ నుంచి 352 మంది, విజయవాడ పాలిటెక్నిక్ నుంచి 277 మంది, కాకినాడ ఆంధ్రా పాలిటెక్నిక్ నుంచి 224 మంది, అనంతపురం పాలిటెక్నిక్ నుంచి 215 మంది, విశాఖపట్నం (నేషనల్ హైవే) పాలిటెక్నిక్ నుంచి 174 మంది ఎంపికయ్యారు. ఉద్యోగంతో పాటు ఉన్నత చదువులు గతంలో ఒక కంపెనీలో ఉద్యోగం వచ్చిందంటే సీనియారిటీ ప్రకారం వేతనాలు పెరిగే పరిస్థితి. ఈ ఏడాది నుంచి సాంకేతిక విద్యాశాఖ చేసిన కృషితో చాలా కంపెనీలు డిప్లొమా విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు ఉన్నత చదువులు చదివేందుకూ అవకాశం కల్పించాయి. వాటిల్లో ఆర్సెలర్ మిట్టల్, నిప్పన్, విప్రో, స్మార్ట్ డీవీ టెక్నాలజీస్, ఏషియన్ పెయింట్స్, టాటా ప్రాజెక్ట్స్, షాపూర్జీ–పల్లోంజీ, జేఎస్‌డబ్ల్యూ, అల్ట్రాటెక్, మెట్సో ఉటోటెక్ వంటి అగ్రశ్రేణి సంస్థలు ఉండడం గమనార్హం. ఉద్యోగాల్లో చేరిన వారికి నాలుగేళ్లల్లో ‘వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్’ (వైల్) ద్వారా బీఎస్సీ, బీటెక్ డిగ్రీ ఇచ్చేలా ఆయా కంపెనీలు అంగీకరించాయి. వచ్చే ఏడాది నుంచి విద్యార్థులు చదువులో భాగంగా చేసే 6 నెలలు, ఏడాది ఇండస్ట్రియల్ ట్రైనింగ్‌లోనే నూరు శాతం ఉద్యోగాలు లభించేలా శిక్షణనివ్వనుంది. ప్రతి కాలేజీలోనూ ప్లేస్మెంట్ సెల్ ఇంజినీరింగ్ చేస్తేనే అవకాశాలు ఉంటాయన్నది అపోహే. ఈ ఏడాది ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 11,604 మంది విద్యార్థులు చివరి సంవత్సరం చదువుతుంటే వారిలో 4 వేల మందికి పైగా పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. కమిషనర్ నాగరాణి ఆయా పరిశ్రమలను స్వయంగా పరిశీలించి ఒప్పందం చేసుకున్నారు. అన్ని కాలేజీల్లోను ప్లేస్మెంట్ సెల్ ఏర్పాటుచేసి కేంద్ర కార్యాలయంతో అనుసంధానించారు. ఫైనలియర్‌లోనే క్యాంపస్ రిక్రూట్మెంట్పై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకున్నాం. – డాక్టర్ ఎంఏవీ రామకృష్ణ, డిప్యూటీ డైరెక్టర్ (ప్లేస్మెంట్ సెల్) ఇండస్ట్రియల్–అకడమిక్ సౌజన్యంతో.. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పాలిటెక్నిక్ విద్యా బోధనలో మార్పులు చేస్తున్నాం. 31 జీపీటీల్లో స్కిల్ హబ్స్‌ను ఏర్పాటుచేశాం. రాష్ట్రానికి బహుళజాతి కంపెనీలూ వస్తున్నాయి. వాటికి అనుగుణంగా విద్యార్థులకు శిక్షణనిస్తున్నాం. ఆ కంపెనీలే క్యాంపస్‌కు వచ్చి ఉద్యోగాలిస్తున్నాయి. అలాగే, మారుతున్న సాంకేతిక, అవసరాలకు తగ్గట్టు బోధన ఉండేలా లెక్చరర్లకు అవసరమైన నైపుణ్య శిక్షణ కూడా ఇస్తున్నాం. ఈ ఏడాది మొదటి విడతగా 84 మంది ప్రొఫెసర్లను ఇండస్ట్రియల్ ట్రైనింగ్‌కు పంపించాం. చాలామంది విద్యార్థులు డిప్లొమా తర్వాత బీఎస్సీ, బీటెక్ చేయాలనుకుంటున్నారు. అలాంటి వారికి కంపెనీలో ఉద్యోగం ఇస్తూనే నాలుగేళ్లల్లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇచ్చేలా యాజమాన్యాలు ఒప్పందం చేసుకున్నాయి. వచ్చే ఏడాది నూరుశాతం ప్లేస్‌మెంట్స్‌కు ప్రణాళిక సిద్ధంచేశాం. – సి. నాగరాణి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ -
మా అమ్మ, సోదరికి చదువు లేనప్పుడూ..మాకు వద్దు అంటూ సర్టిఫికేట్లను..
అఫ్గాన్‌లో మహిళలకు యూనివర్సిటీల్లో ప్రవేశం లేదని తాలిబన్లు హుకుం జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తిన తాలిబన్లు లెక్కచేయకుండా నిరంకుశత్వ ధోరణితో మహిళలపై ఉక్కుపాదం మోపారు. ఈ క్రమంలో కాబూల్ యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్ అప్గాన్ మహిళలపై యూనివర్సిటీ నిషేధానికి వ్యతిరేకంగా తన డిప్లొమా సర్టిఫికేట్లను చించేస్తూ నిరసన తెలిపారు. నా సోదరి, మా అమ్మ చదుకుకోలేనప్పుడూ నాకు ఈ విద్య వద్దు అంటే ఆ సర్టిఫికేట్లను లైవ్ టీవీ ఇంటర్వ్యూలో చించేశారు. ఈ రోజు నుంచి నాకు ఈ చదుకు అవసరం లేదు. అయినా ఈ దేశం విద్యకు తగిన స్థలం కాదు అంటూ మండిపడ్డారు. అందుకు సంబంధించిన వీడియోని సామాజిక కార్యకర్త షబ్నం నసిమి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా, మహిళలు, మైనారిటీల హక్కులకు సంబంధించి మరి మితవాద పాలనను మొదట్లో వాగ్దానం చేసినప్పటికీ.. తాలిబాన్లు అఫ్గాన్ మహిళలకు విశ్వవిద్యాలయంలో చదువుకోనివ్వకుండా నిర్వధిక నిషేధాన్ని విధించారు. బాలికలను మిడిల్ స్కూల్స్‌కే పరిమితం చేసి, హైస్కూల్‌కి హాజరు కాకుండా నిషేధించారు. అంతేగాదు మహిళలను చాలా ఉద్యోగాల నుంచి తొలగించారు. అలాగే బహిరంగంగా తల నుంచి కాలి వరకు దుస్తులను ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆఖరికి మహిళలు మగ బంధువులు లేకుండా ప్రయాణించేందుకు కూడా వీలు లేదు. (చదవండి: యూనివర్సిటీల్లో అమ్మాయిలపై నిషేధం.. క్లాస్‌లు బాయ్‌కాట్ చేసి అబ్బాయిల నిరసన..) -
పాలిటెక్నిక్ కాలేజీల్లో 72.5% సీట్లు భర్తీ
సాక్షి, హైదరాబాద్: టెన్త్ తర్వాత డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన పాలిసెట్–2022 కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 118 పాలిటెక్నిక్ కాలేజీల్లోని దాదాపు 25 బ్రాంచీల్లో 28,562 సీట్ల భర్తీకి చేపట్టిన కౌన్సెలింగ్‌లో 20,709 సీట్లు (72.51%) నిండాయని సెట్ కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. 21 ప్రభుత్వ కాలేజీలు, 3 ప్రైవేటు కాలేజీల్లో 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయని చెప్పారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 10 నాటికి లాగిన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సీటును నిర్ధారించుకొని కాలేజీలో ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయకుంటే సీటు రద్దవుతుందన్నారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో సోమవారం నుంచి అకడమిక్ సెషన్ ప్రారంభం కానుండగా 16వ తేదీ వరకు ఓరియంటేషన్, ఈ నెల 17 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. 8 బ్రాంచీల్లో సీట్లన్నీ ఫుల్... పాలిటెక్నిక్ కోర్సుల్లో 8 బ్రాంచీల్లో 100% సీట్లు భర్తీ అయ్యాయి. ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్, ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్, బయో మెడికల్ ఇంజనీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా, కెమికల్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్ బ్రాంచీల్లో సీట్లన్నీ నిండాయి. టెక్స్టైల్ టెక్నాలజీ, లెదర్ గూడ్స్ అండ్ ఫుట్‌వేర్ టెక్నాలజీ, మెటర్లాజికల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో అతితక్కువగా సీట్లు భర్తీ అయ్యాయి. -
@ హెయిర్ బై సీమ
కట్టుబాట్లు, హద్దులు ఎన్ని ఉన్నా.. అన్నింటిని చెరిపేసి అనేక రంగాల్లో తమదైన ముద్రవేస్తున్న మహిళలెందరినో చూస్తున్నాం. చుట్టూ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ తమలోని ప్రతిభతో వెలుగులోకి వచ్చి ప్రపంచానికి తామేంటో నిరూపిస్తూ ఎంత మందికి ఉదాహరణగా నిలుస్తున్నారు మరికొందరు. ఈ కోవకు చెందిన వారే సెలబ్రెటీ హెయిర్ స్టైలిస్ట్ సీమా మనే. షోలాపూర్‌లోని బర్షీలో పుట్టింది సీమా మనే. చిన్నతనంలో అనేక కష్టాలను చూస్తూ ఆశ్రమంలో పెరిగిన సీమ.. తొమ్మిదో తరగతి అయిన తరువాత చదువు మానేసింది. ఆశ్రమంలోనే హెల్త్ సెంటర్లో పనికి చేరింది. తర్వాత కొన్నేళ్లకు పెళ్లి కుదిరింది సీమకు. వివాహం తరువాత భర్త అండతో తన కష్టాలు కాస్త కుదుటపడ్డాయి. దీంతో ఐదేళ్ల తరువాత భర్త ప్రోత్సాహంతో తనకెంతో ఇష్టమైన హెయిర్ కటింగ్ కోర్సు చేయాలనుకుంది. భర్త సహకారం అందించడంతో పదోతరగతి చదువుతూనే హెయిర్ కటింగ్‌లో డిప్లొమా చేసింది. కోర్సు పూర్తయ్యాక ఇంట్లోనే ఒక సెలూన్ ఏర్పాటు చేసుకుంది. అలా రెండేళ్లపాటు సెలూన్ నిర్వహించిన తరువాత సీమకు ఓ ఫ్యాషన్ షోలో హెయిర్ స్టైలిస్ట్‌గా అవకాశం వచ్చింది. తక్కువ సమయంలో వెరైటీ, మోడ్రన్ హెయిర్ స్టైల్స్‌తో మోడల్స్‌ను తీర్చిదిద్దడంతో ఈ ఫ్యాషన్ ప్రాజెక్ట్ విజయవంతమైంది. దీంతో సీమకు మంచి హెయిర్ స్టైలిస్ట్‌గా గుర్తింపు వచ్చింది. ఈ గుర్తింపుతో ‘ఎట్ ది రేట్ హెయిర్బై సీమ’ పేరుతో సోషల్ మీడియాలో అకౌంట్ ను ప్రారంభించింది. ఈ అకౌంట్లో సరికొత్త హెయిర్ స్టైల్స్‌ను పోస్టు చేస్తుండేది. ఈ హెయిర్ స్టైల్స్ నచ్చడంలో గ్లామర్ ప్రపంచంలో సీమ బాగా పాపులర్ అయ్యింది. దీంతో సినిమాలు, ఫ్యాషన్ షోలు, ఫోటోషూట్స్‌లో పనిచేయడానికి అవకాశాలు వచ్చేవి. వచ్చిన ప్రతి అవకాశాన్ని తన ప్రతిభతో సరికొత్త హెయిర్‌స్టైల్స్‌ను రూపొందించి తానేంటో నిరూపించింది. దీంతో సెలబ్రిటీల దృష్టిలో పడింది సీమ. ఒక్కోమెట్టు ఎక్కుతూ... అంతర్జాతీయంగానూ సీమ హెయిర్‌స్టైలిస్ట్‌గా పనిచేసిన సెలబ్రెటీలలో మాధురీ దీక్షిత్, అలియా భట్, తాప్సీ పన్ను, కియరా అడ్వాణి, బిపాషా బసు, కత్రినా కైఫ్, అంబాని కుటుంబానికి చెందిన విభూతి ఉన్నారు. అంతర్జాతీయ వెబ్ సిరీస్ ‘ఏ సూటబుల్‌బాయ్’ లో టబుకు హెయిర్ స్టైలిస్ట్‌గా పనిచేసింది. ‘ఘాజీ’ సినిమాలో తాప్సీకి, నామ్ షబాన, లక్ష్మీబాంబ్, సూర్మ, మన్ మర్జియా, జుడ్వా–2 సినిమాలకు పనిచేసింది. కళంక్, గుడ్‌న్యూస్, ఎంఎస్ ధోణి, కబీర్ సింగ్ సినిమాల్లో కియరా అడ్వాణికి హెయిర్ స్టైల్స్ చేసింది. తెలుగు సినిమా బాద్షాలో కాజల్ అగర్వాల్‌కు మోడ్రన్ హెయిర్ స్టైల్స్‌ను అందించింది. ఒక్క ఇండియాలోనేగాక అంతర్జాతీయ స్థాయిలోనూ సీమకు మంచి గుర్తింపు లభించింది. 2016లో ఓ పెళ్లిలో హెయిర్‌స్టైల్స్ చేయడానికి ఇటలీ వెళ్లగా, ఆ ఏడాది విడుదలైన ‘ద వోగ్ వెడ్డింగ్ బుక్’లో సీమ పేరు ప్రస్తావించారు. చేసే పనిలో నిజాయితీ ఉండాలి ‘‘నిజాయితీగా పనిచేస్తే ఫలితం మనకు వందశాతం అనుకూలంగా వస్తుందని అమ్మ చెప్పేవారు. ఎన్ని సమస్యలు ఉన్నా నిబద్ధతతో పని చేయడం వల్లే ఈ స్థాయికి చేరుకున్నాను. తాప్సీ, కియరా లాంటి సెలబ్రెటీల సాయంతో బాలీవుడ్లో నాకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకోగలిగాను. ప్రస్తుతం ప్రారంభించబోయే హెయిర్ అకాడమీ, స్టూడియోల ద్వారా నాలా మరికొంతమందిని ఇండస్ట్రీకి అందించడమే నా లక్ష్యం’’ అని చెబుతోంది సీమ. మనలో కష్టపడే తత్వం, ప్రతిభ ఉంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగవచ్చనడానికి సీమ జీవితమే నిదర్శనం. -
పరి పూనమ్ చౌదరి.. ఉమన్ ఆఫ్ బునాయ్
తెలిసీ తెలియని వయసులో... ‘‘పెద్దయ్యాక నేను డాక్టర్ని అవుతాను.. ఇంజినీర్ని అవుతాను... కలెక్టర్ అవుతాను’’ అని చెప్పి ఆ తర్వాత మర్చిపోయేవారు కొందరైతే, పెద్దయ్యాక ఏమవ్వాలో చిన్నతనంలోనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా ప్రణాళికాబద్ధంగా కష్టపడి, సమాజంలో తమకంటూ ఒక ఉన్నత స్థానాన్ని ఏర్పరచుకునేవారు మరికొందరు. ఈ రెండో కోవకు చెందిన అమ్మాయే పరి పూనమ్ చౌదరి. జైపూర్‌లోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన పరి పూనమ్ చౌదరికి చిన్నప్పటి నుంచి ఫ్యాషనబుల్‌గా ఉండే దుస్తులంటే ఎంతో ఆసక్తి. పదమూడేళ్ల వయసులో తన అభిరుచి ఫ్యాషన్ అని తెలుసుకుంది పరి. అప్పటినుంచి ఆ రంగంలో గొప్ప స్థాయికి ఎదగాలని కలలు కనేది. తన కలను నిజం చేసుకునేందుకు డిగ్రీ చదువుతూనే ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిప్లొమా కోర్సు చేసింది. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్‌లో ఫ్యాషన్ మీడియా స్టైలింగ్ కోర్సును నేర్చుకుంది. తరువాత 2014లో ఢిల్లీలో మాస్టర్స్ చేస్తూనే ఫైన్ ఆర్ట్స్, స్ట్రీట్ ఫొటోగ్రఫీ, విజువల్ ఆర్ట్స్’, లగ్జరీ బ్రాండ్ మేనేజ్మెంట్ కోర్సులు చేసింది. తన చదువుకు తగ్గట్టే ఫ్యాషన్ ప్రపంచంలో తన మార్కును చూపించాలన్న ఆలోచన వచ్చింది పూనమ్‌కి. వెంటనే తను రూపొందించిన డిజైన్లతో ఒక బ్లాగ్‌ను ప్రారంభించింది. దాంతోబాటు ఇన్ స్టాగ్రామ్ పేజిలో ఫ్యాషన్ కు సంబంధించిన పోస్టులు పెడుతూ యూజర్లను ఆకట్టుకునేది. బ్లాగ్ ప్రారంభించిన రెండేళ్ల తరవాత తన ఫ్యాషన్ డిజైనింగ్ ఐడియాలతో ‘బునాయ్’ అనే బ్రాండ్‌ను ప్రారంభించింది. ఈ బ్రాండ్ మార్కెట్లోకి వచ్చే సమయానికి పరి వయసు 23 ఏళ్లు. బునాయ్ బ్రాండ్... భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబిస్తూనే ఫ్యాషనబుల్‌గా ఉండే డ్రెస్‌లతో 2016లో బునాయ్ని జైపూర్‌లో ప్రారంభించింది. సంప్రదాయాలకు తగ్గట్టుగా స్టైల్‌గా ఉండే వస్త్రాలను అందుబాటు ధరలకు అందించడమే బునాయ్ లక్ష్యం. అందులో భాగంగా కొన్ని డ్రెస్‌లను ఆన్ లైన్ లో పెట్టింది. వారం తిరక్కుండానే అన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. దీంతో బట్టలే కాకుండా, ఆభరణాలు, సంప్రదాయ ఎంబ్రాయిడరీ డిజైన్లు, హస్తకళాకారులు రూపొందించిన అలంకరణ వస్తువులను విక్రయించేది. కస్టమర్ల అభిరుచులకు, వారి స్కిన్ టోన్‌కు సరిపడినట్లు డిజైన్ చేయడం, నాణ్యమైన బట్టను అందుబాటు ధరకే అందించడంతో అతికొద్దికాలంలోనే ఆమె బ్రాండ్ ‘బునాయ్’ ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది. కార్పొరేట్ మోడల్స్ నుంచి గృహిణుల వరకు అందరూ వేసుకోదగిన డ్రెస్‌లు లభించడం కూడా బునాయ్ బ్రాండ్ పాపులర్ అవడానికి మరో కారణం. ఉమన్ ఆఫ్ బునాయ్ ప్రారంభంలో కేవలం యాభై వేల రూపాయలతో కొన్ని కుట్టుమిషన్లను కొని, ఇద్దరు టైలర్స్‌ను చేర్చుకుని బునాయ్ని ప్రారంభించిన పరి నేడు నాలుగు వందలకు పైగా ఉద్యోగులు, మూడున్నర లక్షల కస్టమర్లతో, కోట్ల టర్నోవర్‌తో వాణిజ్య ప్రపంచంలో దూసుకుపోతుండడంతో పూనమ్‌కి ‘ఉమన్ ఆఫ్ బునై’ అనే స్థాయిలో గుర్తింపు వచ్చింది. మామూలు వారితోపాటు సోనాక్షి సిన్హా, భూమి పెడ్నేకర్, దివ్యాంకా త్రిపాఠీ, రిధి డోగ్రా వంటి ఎంతోమంది సెలబ్రెటీలు కూడా బునాయ్ బ్రాండ్‌వే కావాలని అడిగి కొనేంతగా పాపులర్ అయింది. ఇన్ స్టాగ్రామ్ పేజీలో పదిలక్షలకుపైగా ఫాలోవర్స్‌తో పరి ఫ్యాషన్ ఇన్ ఫ్లుయెన్సర్ అనే పేరుతోబాటు, గతేడాది బీడబ్ల్యూ ఇచ్చే ఎంట్రప్రెన్యూర్షిప్ అవార్డ్స్’లో ఈ–కామర్స్ టెక్ ఉమెన్ ఎంట్రప్రెన్యూర్ అవార్డు కూడా ఆమెను వరించింది. -
మగపిల్లవాడిగా పుట్టి స్త్రీగా మారింది.. ఎక్కడా ఉద్యోగం రాలేదు.. రెండేళ్లపాటు
అభినా ఆహెర్ వయసు 44. ముంబయి వాసి. మగపిల్లవాడిగా పుట్టి స్త్రీగా మారింది. ఎకనమిక్స్ అండ్ డిప్లమో ఇన్ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ చేసింది. కానీ ఎక్కడా ఉద్యోగం రాలేదు. కారణం ఆమె సర్టిఫికేట్లో జెండర్ ‘మేల్’ అని ఉంది. ఆమె వస్త్రధారణ, హావభావాలు మహిళలా ఉన్నాయి. ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. కడుపు నింపుకోవడానికి పడుపు వృత్తి ఒక్కటే మార్గమైంది. రెండేళ్ల తర్వాత ఆ వృత్తి నుంచి బయటపడి తనలాంటి వాళ్ల కోసం సర్వీస్ చేసే ఎన్జీవోలో ఉద్యోగంలో చేరింది. తనకంటే అధ్వాన్నమెన జీవితాలెన్నో ఉన్నాయని తెలుసుకుంది. ఆ తర్వాత ట్వీట్ (ట్రాన్స్‌జెండర్ వెల్ఫేర్ ఈక్విటీ అండ్ ఎంపవర్మెంట్ ట్రస్ట్) స్థాపించి తనలాంటి వారి హక్కుల పరిరక్షణ కోసం పని చేస్తోంది. ‘చదువుకున్నాం... ఉద్యోగం చేస్తాం... ఉద్యోగం ఇవ్వండి. మా జెండర్‌ని గుర్తించండి’ అని పోరాడుతోంది. రాళ్లతో కొట్టారు అభినా అహెర్కి మూడేళ్ల వయసులోనే తండ్రి పోయాడు. తల్లి మంగళ ముంబయి మున్సిపల్ ఆఫీస్‌లో చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంది. మంగళ జానపద నాట్యకారిణి. నాట్యప్రదర్శనలు ఇస్తూ మరాఠీ సినిమాల్లో చిన్న పాత్రల్లో నటిస్తూ అభిన భవిష్యత్తు కోసం డబ్బు దాస్తుండేది. తల్లి డాన్స్ చేస్తుంటే కళ్లప్పగించి చూసేది అభిన. ఓ రోజు మంగళ ఇంటికి వచ్చేటప్పటికి తల్లి చీర కట్టుకుని, నాట్యకారిణిలా అలంకరించుకుని ఉంది. ‘నీలాగే చేస్తున్నాను చూడు’ అంటూ నాట్యం చేసి చూపించింది. ఆ క్షణంలో కొడుకుని చూసి మురిసిపోయిందా తల్లి. కానీ అదే పనిగా స్త్రీలాగ ఉండడానికి ప్రయత్నం చేయడాన్ని మాత్రం సహించలేకపోయింది. అప్పటికే ఇరుగుపొరుగు ఎగతాళి మొదలైంది. వద్దని ఎంత చెప్పినా వినని కొడుకు పట్ల తృణీకారం మొదలైంది. తన బిడ్డ గుర్తింపు పురుషుడిగా ఉండాలని తల్లి తాపత్రయం, తన గుర్తింపు స్త్రీగా ఉండాలనేది అభిన ఆకాంక్ష. ఎవరు వద్దన్నా, కాదన్నా సమాజం అభినా అహెర్ గుర్తింపును ‘హిజ్రా’ అని నిర్ధారించేసింది. తోటి పిల్లలు ఏడిపించడం, రాళ్లతో కొట్టడం నిత్యకృత్యమైంది. అభిన మానసిక క్షోభ తారస్థాయికి చేరి ఆత్మహత్యకు పాల్పడే వరకు వెళ్లింది. ఇన్ని ఆవేదనల మధ్య గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, 27వ ఏట లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుని స్త్రీగా మారిపోయింది. ఆపరేషన్ పూర్తయిన తర్వాత హార్మోన్లు తగిన మార్పు చెందడానికి కొంత సమయం పట్టింది. ఈ లోపు పరిస్థితులు ఆమె మానసిక ఆరోగ్యాన్ని సవాల్ చేశాయి. అన్నింటికీ ఎదురీది సంపూర్ణ ఆరోగ్యంతో ఉద్యోగాన్వేషణ మొదలుపెట్టింది. అసలైన పరీక్ష మొదలైంది. సందేహంగా దేహాన్ని పరిశీలనగా చూసేవారు. సర్టిఫికేట్లను, దేహాన్ని మార్చి మార్చి చూసి ‘ఉద్యోగం లేదు’ అనేవారు. కొన్నేళ్లపాటు మాట్లాడడం మానేసిన తల్లి... అభిన స్త్రీగా మారిపోయిన తర్వాత నిస్సహాయ స్థితిలో ‘జెండర్ ఏదయితేనేం. నేను కన్నబిడ్డవి. ఇద్దరి బ్లడ్ గ్రూపూ బీ పాజిటివే. మనిద్దరం ఒకటే’ అని కూతురికి ధైర్యం చెప్పి అండగా నిలిచింది. ఇది హక్కుల పోరాటం అభినా అహెర్ తనలాంటి వాళ్ల కోసం పని చేసే హమ్‌సఫర్ ఎన్జీవోలో ఉద్యోగంలో చేరింది. హెల్ప్‌లైన్ నంబర్‌కి వచ్చిన ఫోన్లు రిసీవ్ చేసుకోవడం, బాధితులకు ధైర్యం ఆమె డ్యూటీ. దాదాపుగా ఎనిమిదేళ్లపాటు ఆ ఉద్యోగంలో తనలాంటి వాళ్లు సమాజంలో ఎదుర్కొనే వెతలు ఎన్ని రకాలుగా ఉంటాయో అర్థమైంది. ట్రాన్స్జెండర్ల కోసం చేయాల్సినవి ఎన్నో ఉన్నాయనిపించింది. సొంతంగా 2013లో ట్వీట్ అనే ఎన్జీవో స్థాపించింది. ‘‘ట్రాన్స్‌జెండర్స్‌కి కూడా మిగిలిన అందరిలాగానే అన్ని ప్రాథమిక హక్కులూ వర్తిస్తాయనే వాస్తవాన్ని సమాజం మర్చిపోయింది. విద్య, వైద్యం, ఉపాధి హక్కుల పరిరక్షణ కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. నేను స్థాపించిన ట్వీట్ స్వచ్ఛంద సంస్థ ట్రాన్స్ఉమెన్, ట్రాన్స్మెన్, హెచ్ఐవీ బాధితులకు పునరావాస కేంద్రం మాత్రమే కాదు. వాళ్లకు వాళ్ల చదువు, నైపుణ్యాలను బట్టి ఉపాధి కల్పించే బాధ్యత కూడా నాదే. ఇప్పటి వరకు 250 మందిని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లలో ఉద్యోగంలో చేర్పించాను. మాలో డాన్స్ చేయడానికి ఇష్టపడే వాళ్లందరం కలిసి ‘డాన్స్క్వీన్స్’ బృందంగా ఏర్పడ్డాం.. వేడుకల్లో నాట్యం చేసి ఆ వచ్చిన డబ్బుతో సంస్థను నడపడానికి ఎల్జీబీటీల సహాయం కోసం ఖర్చు చేస్తున్నాం’’ అని చెప్పింది అభినా ఆహెర్. మా అమ్మ కూడా మాతోపాటు నాట్యం చేస్తోందని సంతోషంగా చెప్పింది అభిన. ‘నాట్యం మా తొలి అడుగు మాత్రమే. మా హక్కుల పరిరక్షణ కోసం, జెండర్ మార్చుకున్న వెంటనే మా సర్టిఫికేట్లన్నీ మార్చి ఇచ్చేవిధంగా ప్రభుత్వంలో చట్టాల రూపకల్పన కోసం ఉద్యమించడమే మా అసలు లక్ష్యం. సాధించి తీరుతాం’ అని ముక్త కంఠంతో చెబుతున్నారు ట్వీట్ సభ్యులు. -
బీహెచ్ఈఎల్లో అప్రెంటిస్‌లు.. అప్లై చేసుకోండి
ఘజియాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 80 ► ఖాళీల వివరాలు: మెకానికల్ ఇంజనీరింగ్–20, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్–20, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్–20, మోడర్న్ ఆఫీస్ మేనేజ్మెంట్ అండ్ సెక్రటేరియల్ ప్రాక్టీస్–20. ► అర్హత: 30.11.2018 తర్వాత సంబంధిత బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 30.11.2021 నాటికి 23ఏళ్లు మించకుండా ఉండాలి. ► ఎంపిక విధానం: ఇంజనీరింగ్ డిప్లొమాలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► దర ఖాస్తులకు చివరి తేది: 15.11.2021 ► వెబ్సైట్: www.bel-india.in బెల్, చెన్నైలో 73 అప్రెంటిస్‌లు చెన్నైలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్).. 2021–22 సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 73 ► ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు–63, టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్‌లు–10. ► గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు: విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. 2019, 2020, 2021లలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే అర్హులు. స్టయిపెండ్: నెలకు రూ.11,110 చెల్లిస్తారు. ► టెక్నీషియన్(డిప్లొమా)అప్రెంటిస్‌లు:విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. 2019, 2020, 2021లలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు. స్టయిపెండ్: నెలకు రూ.10,400 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: డిప్లొమా, బీఈ/బీటెక్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► నాట్స్ పోర్టల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 10.11.2021 ► బెల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 25.11.2021 ► వెబ్సైట్: www.mhrdnats.gov.in -
ఇంజనీరింగ్ విద్యార్థినులకు స్కాలర్షిప్.. ఏడాదికి 50 వేలు
ఇంజనీరింగ్, డిప్లొమా చదివే విద్యార్థినులకు ఏఐసీటీఈ ప్రగతి స్కాలర్షిప్ ప్రకటన వచ్చేసింది. ప్రతిభావంతులైన విద్యార్థినులను ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించే ఉద్దేశంతో అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) ప్రతి ఏటా ఈ స్కాలర్షిప్ అందిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల విద్యార్థులు నవంబర్ 30వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. గతంలో ఇలా ఏఐసీటీఈ గతంలో 4వేల మందికి స్కాలర్‌షిప్స్‌ను అందించేది. ఇందులో బీటెక్ అభ్యసించేవారికి 2000, డిప్లొమా వారికి 2000 చొప్పున కేటాయించింది. ప్రస్తుతం 2021 ఏడాది సంబంధించి ఈ స్కాలర్షిప్స్ సంఖ్యను భారీగా పెంచింది. 4 వేల నుంచి 10వేలకు(బీటెక్–5000, డిప్లొమా–5000)పెంచింది. ఆర్థిక ప్రోత్సాహం ప్రగతి స్కాలర్షిప్ పథకం కింద ఎంపికైన ప్రతి విద్యార్థినికి ఏడాదికి రూ.50వేల చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. కాలేజీ ఫీజు, కంప్యూటర్ కొనుగోలు, స్టేషనరీ, బుక్స్, ఎక్విప్మెంట్ తదితర అవసరాలన్నింటికీ కలిపి ఈ మొత్తాన్ని డీబీటీ(డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) విధానంలో అందజేస్తారు. అర్హత ఏఐసీటీఈ గుర్తింపు పొంది టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ ఇయర్ బీటెక్/డిప్లొమా కోర్సుల్లో చేరి ఉండాలి. కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలకు మించకుండా ఉండాలి. కుటుంబంలో అర్హులైన విద్యార్థినులు ఇద్దరూ ఉంటే ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంబంధిత కాలేజీలో బీటెక్/పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నిర్వహించే అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ధ్రువపత్రాలు పదోతరగతి/ఇంటర్ అకడమిక్ సర్టిఫికెట్లు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, సంబంధిత ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ పొందిన సర్టిఫికేట్, ట్యూషన్ ఫీజు రిసిప్ట్, ఆధార్‌తో లింక్ అయి ఉన్న బ్యాంక్ ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్, ఫోటోగ్రాఫ్, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డ్, తల్లిదండ్రుల ధ్రువీకరణ పత్రం ఉండాలి. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30.11.2021 ► వెబ్సైట్: https://www.aicte-india.org/ -
డిప్లొమా, ఇంజనీరింగ్, ఐటీఐ అప్రెంటిస్ ఖాళీలు
జీఆర్ఎస్ఈలో 256 అప్రెంటిస్‌లు కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్(జీఆర్ఎస్ఈ).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం ఖాళీల సంఖ్య: 256 » ఖాళీల వివరాలు: ట్రేడ్ అప్రెంటిస్ (ఎక్స్–ఐటీఐ)–170, ట్రేడ్ అప్రెంటిస్ (ఫ్రెషర్)–40, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్–16, టెక్నీషియన్ అప్రెంటిస్–30. » ట్రేడ్ అప్రెంటిస్(ఎక్స్–ఐటీఐ): ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, పైప్ ఫిట్టర్, కార్పెంటర్, డ్రాఫ్ట్స్‌మెన్, పెయింటర్ తదితరాలు. అర్హత: సంబంధిత ట్రేడులో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్‌తోపాటు క్రాఫ్ట్స్‌మెన్ ట్రెయినింగ్ స్కీమ్ కోసం ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 14 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. » ట్రేడ్ అప్రెంటిస్(ఫ్రెషర్): ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, పైప్ ఫిట్టర్. అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 14ఏళ్ల నుంచి 20ఏళ్ల మధ్య ఉండాలి. » గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్. అర్హత: 2018, 2019, 2020లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులైనవారు మాత్రమే అర్హులు. ఎంఈ/ఎంటెక్/ఎంబీఏ అభ్యర్థులు అర్హులు కాదు. వయసు: 14ఏళ్ల నుంచి 26ఏళ్ల మధ్య ఉండాలి. » టెక్నీషియన్ అప్రెంటిస్: విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, సివిల్. అర్హత: 2018, 2019, 2020లో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 14 నుంచి 26ఏళ్ల మధ్య ఉండాలి. » ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు. » దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. » ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 01.10.2021 » వెబ్సైట్: https://apprenticeshipindia.org చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్‌లో 492 అప్రెంటిస్‌లు చిత్తరంజన్(పశ్చిమ బంగ)లోని చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్.. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం ఖాళీల సంఖ్య: 492 » ట్రేడులు: ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, రిఫ్రిజిరేషన్స్ అండ్ ఏసీ మెకానిక్స్, పెయింటర్. » అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ(ఎన్సీవీటీ) ఉత్తీర్ణులవ్వాలి. » వయసు: 15.09.2021 నాటికి 15ఏళ్ల నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. » ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ/ఓరల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపికచేస్తారు. » దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. » ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:03.10.2021 » వెబ్సైట్: https://clw.indianrailways.gov.in ఎస్ఈసీఎల్, బిలాస్పూర్లో 450 అప్రెంటిస్‌లు బిలాస్‌పూర్‌లోని సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం ఖాళీల సంఖ్య: 450 » ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ మైనింగ్–140, టెక్నీషియన్ అప్రెంటిస్ మైనింగ్/మైన్ సర్వేయింగ్–310. » అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. » వయసు: 05.10.2021 నాటికి 18ఏళ్లు నిండి ఉండాలి. » వేతనం: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు నెలకు రూ.9000, టెక్నికల్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.8000 చెల్లిస్తారు. » ఎంపిక విధానం: డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. » దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. » ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 05.10.2021 » వెబ్సైట్: www.secl.cil.in ఎస్ఈసీఆర్, బిలాస్పూర్ డివిజన్లో 432 అప్రెంటిస్‌లు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే(ఎస్ఈసీఆర్), బిలాస్పూర్ డివిజన్.. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం ఖాళీల సంఖ్య: 432 » ట్రేడులు: కోపా, స్టెనోగ్రాఫర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వైర్‌మెన్, వెల్డర్, ప్లంబర్, పెయింటర్, కార్పెంటర్ తదితరాలు. » అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. » వయసు: 01.07.2021 నాటికి 15ఏళ్ల నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. » ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. » దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. » ఆన్లైన్ దర ఖాస్తులకు చివరి తేది:10.10.2021 » వెబ్సైట్: https://secr.indianrailways.gov.in -
పవర్‌గ్రిడ్‌లో డిప్లొమా ట్రెయినీ ఖాళీలు
భారత ప్రభుత్వ రంగానికి చెందిన పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నార్తర్న్ రీజియన్ ట్రాన్స్మిషన్ సిస్టమ్(జమ్మూ–లద్దాక్ రీజియన్లలో).. డిప్లొమా ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 42 ► పోస్టుల వివరాలు: డిప్లొమా ట్రెయినీ(ఎలక్ట్రికల్)–23, డిప్లొమా ట్రెయినీ(ఎలక్ట్రికల్) లద్దాక్ రీజియన్–09, డిప్లొమా ట్రెయినీ(ఎలక్ట్రికల్) కాశ్మీర్ రీజియన్–05, డిప్లొమా ట్రెయినీ(సివిల్)–03, డిప్లొమా ట్రెయినీ(సివిల్)లద్దాక్ రీజియన్–02. ► సబ్జెక్టులు: ఎలక్ట్రికల్, సివిల్. ► అర్హత: కనీసం 70శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల రెగ్యులర్ ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. డిప్లొమా లేకుండా బీఈ/బీటెక్/ఎంఈ /ఎంటెక్ వంటి అర్హతలున్నా పరిగణనలోకి తీసుకోరు. ► వయసు: 15.06.2021 నాటికి 27ఏళ్లు మించకూడదు. ► ఎంపిక విధానం: రాతపరీక్ష/కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► పరీక్షా విధానం: పరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో జరుగుతుంది. ఇందులో పార్ట్–1లో 120 ప్రశ్నలు టెక్నికల్ నాలెడ్జ్/ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి ఉంటాయి. పార్ట్–2 సూపర్ వైజరీ ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో 50 ప్రశ్నలు వొకాబ్యులరీ, వెర్బల్కాంప్రహెన్షన్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, డేటా సఫిషియన్సీ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ , న్యూమరికల్ ఎబిలిటీ విభాగాల నుంచి అడుగుతారు. పరీక్షా సమయం 2 గంటలు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 12.07.2021 ► వెబ్సైట్: www.powergridindia.com మరిన్ని నోటిఫికేషన్లు: ఎన్డీఏ, ఎన్ఏ 2021: ఇంటర్‌తోనే.. కొలువు + చదువు సీఆర్పీఎఫ్, అసోం రైఫిల్స్‌లో ఉద్యోగాలు పవర్‌గ్రిడ్, ఎస్బీఐలో ఉద్యోగ అవకాశాలు -
‘అగ్రికల్చర్ పాలిటెక్నిక్’ నోటిఫికేషన్ విడుదల
సాక్షి, జగిత్యాల: పదో తరగతి పూర్తయిన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కోర్సులు వరంగా మారాయి. రెండేళ్ల కోర్సు చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉండటంతో వీటికి డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా వ్యవసాయంపై మక్కువ ఉన్నవారు, రైతుబిడ్డలు మరింత వ్యవసాయ విజ్ఞానాన్ని పొంది, సాగు చేసే పంటల్లో అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది. ఈ కోర్సులు చేసిన తర్వాత ఉన్నత విద్యనభ్యసించాలంటే ఎంసెట్‌తో సంబంధం లేకుండా బీఎస్సీ(అగ్రికల్చర్) కోర్సులో చేరవచ్చు. డిప్లొమా చేసిన వారికి బీఎస్పీ అగ్రికల్చర్లో 10 నుంచి 15 శాతం సీట్లు రిజర్వ్ చేస్తారు. సీట్ల వివరాలు... దరఖాస్తులను బట్టి సీట్లను కౌన్సెలింగ్ పద్ధతిలో భర్తీ చేస్తా రు. రాష్ట్రంలో ఉన్న 9 ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీల్లో 200 సీట్లు, 7 ప్రైవేట్ కాలేజీల్లో 420 సీట్లు ఉన్నాయి. విత్తన సాంకేతిక పరిజ్ఞానం(సీడ్ టెక్నాలజీ)లో... ఒక ప్రభుత్వ కాలేజీలో 20 సీట్లు, ఒక ప్రైవేట్ కాలేజీలో 60 సీట్లు ఉన్నాయి. అలాగే మూడేళ్ల అగ్రికల్చర్ ఇంజినీరింగ్ డిప్లొమాలో.. ఒక ప్రభుత్వ కళాశాలలో 20 సీట్లు, మూడు ప్రైవేట్ కాలేజీల్లో 90 సీట్లు ఉన్నాయి. ఇటీవల నూతనంగా వికారాబాద్ జిల్లా గింగుర్తిలో ప్రవేశపెట్టిన సేంద్రియ వ్యవసాయం డిప్లొమా కోర్సుల్లో 60 సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది నుంచి అగ్రికల్చర్ ఇంజినీరింగ్ డిప్లొమా మూడేళ్లు, అగ్రికల్చర్, సీడ్ టెక్నాలజీ, సేంద్రియ వ్యవసాయం రెండేళ్ల డిప్లొమా కోర్సులను సైతం ఇంగ్లిష్ మీడియంలో చదవాల్సి ఉంటుంది. అర్హత వివరాలు... ఈ ఏడాదికి గాను రెండేళ్ల అగ్రికల్చర్ పాలిటెక్నిక్, సీడ్ టెక్నాలజీ కోర్సులతో పాటు మూడేళ్ల అగ్రికల్చర్ ఇంజినీరింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది. ఈ కోర్సులు చదివేందుకు పదో తరగతి చదివిన విద్యార్థులు అర్హులు. ఇంటర్మీడియట్, ఆపైన చదివిన వారు అనర్హులు. పదేళ్ల చదువు కాలంలో కనీసం నాలుగేళ్ల పాటు గ్రామీణ పాంత్రాల్లో(మున్సిపల్ ఏరియా కాకుండా) చదివిన వారు అర్హులు. అభ్యర్థి వయసు డిసెంబర్ 31, 2020 నాటికి 15–22 ఏళ్ల మధ్య ఉండాలి. పాలిసెట్–2020 పరీక్షల్లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. దరఖాస్తు విధానం, ఫీజులు ఇలా... దరఖాస్తు ఆన్లైన్లో అక్టోబర్ 16లోగా చేసుకోవాలి. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1100, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ వారు రూ.600 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సీటు వస్తే ప్రభుత్వ కళాశాలల్లో రూ.12,810, ప్రైవేట్ కళాశాలల్లో రూ.17,810 చెల్లించాలి. మరిన్ని వివరాలకు వ్యవసాయ విశ్వవిద్యాలయ వెబ్సైట్ డబ్లూడబ్ల్యూడబ్ల్యూ.పీజేటీఎస్ఏయూ.ఎసీ.ఇన్ లో సంప్రదించవచ్చు. -
మరో తప్పిదం.. అందరికీ సున్నా మార్కులే..!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఇంటర్ బోర్డు చేసిన తప్పిదాలను మరువకముందే రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ బోర్డు (టీఎస్‌ఎస్‌బీటీఈటీ)లోనూ ఇలాంటి ఘనకార్యమే వెలుగు చూసింది. పరీక్ష రాసిన విద్యార్థులందరినీ బోర్డు మూకుమ్మడిగా ఫెయిల్ చేసింది. విద్యార్థులంతా చివరి సెమిస్టర్లో సున్నా మార్కులతో ఫెయిల్ కావడం గమనార్హం. ఈ నెల 1న పాలిటెక్నిక్ డిప్లొమా చివరి ఏడాది ఫలితాలను బోర్డు విడుదల చేసింది. ఫలితాలు చూసుకున్న విద్యార్థులు ఒక్కసారి అవాక్కయ్యారు. ప్రతిభావంతులు, ఈసెట్–2019 టాప్ ర్యాంకర్లు సైతం ఫెయిల్ అవ్వడంతో లబోదిబోమంటున్నారు. అందరూ బాధ్యులే..: ఈసీఈ, ఈఈఈ బ్రాంచ్ విద్యార్థులకు చివరి సెమిస్టర్లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఆధారంగా ప్రయోగ విభాగంలో మార్కులు వేయాల్సి ఉంటుంది. వీటిని విద్యార్థి ప్రతిభ ఆధా రంగా కాలేజీ యాజమాన్యాలే నిర్దేశిస్తాయి. ఆ మార్కులను కాలేజీ యాజమాన్యమే బోర్డు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. కానీ పలు కాలేజీ యాజమాన్యాలు బోర్డు నిర్దేశించిన తేదీల్లో అప్లోడ్ చేయలేదు. గడువు పూర్తవడంతో అప్లోడ్ ఆప్షన్‌ను బోర్డు తొలగించింది. దీనిని ఆలస్యంగా గుర్తించిన కాలేజీ యాజమాన్యాలు విషయాన్ని బోర్డుకు వివరించగా.. మార్కులను నిర్దేశిత పద్ధతిలో పంపించాలని కోరింది. దీంతో యాజమాన్యాలు మార్కులను పం పాయి. కానీ ఫలితాల్లో విద్యార్థులకు మార్కులు యాడ్ కాలేదు. సోమవారం మీర్పేట్ సమీపంలోని ఓ కాలేజీ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన చేపట్టినప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బోర్డుకు ఫిర్యాదు చేశారు. బోరుమంటున్న విద్యార్థులు.. ఈసెట్‌లో టాప్ 100లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఫలితాల్లో ఫెయిల్ కావడంతో బోరుమంటు న్నారు. త్వరలో ఈసెట్ కౌన్సెలింగ్ జరగనున్న నేపథ్యంలో పొరపాట్లు సరిదిద్ది ఫలితాలు ప్రకటించాలని బోర్డు అధికారులను కోరుతున్నారు. -
చదవలేకపోతున్నానంటూ.. యువతి ఆత్మహత్య
డోన్ రూరల్: తాను చదవలేకపోతున్నానంటూ డోన్ పట్టణంలోని శ్రీరామ నగర్ కాలనీకి చెందిన కె.ప్రియాంక (20) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీరామ నగర్ కాలనీలో నివాసముండే కటికె రాముడు కుమార్తె ప్రియాంక. ఏడాది క్రితం స్థానికంగా డిప్లొమా పూర్తి చేసింది. పైచదువులకు వెళ్లాలని తల్లిదండ్రులు సూచించారు. అయితే..తాను చదవలేకపోతున్నానంటూ ఇంటి వద్దనే ఉండిపోయింది. చాలారోజులుగా ఇదే దిగులుతో ఉండేది. ఈ నేపథ్యంలో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి రాముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీహరి తెలిపారు. -
పీజీ డీఐఎస్ఎంకు దరఖాస్తుల ఆహ్వానం
ఎస్కేయూ : పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమో ఇన్ ఇంటిగ్రేటేడ్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ (పీజీ డీఐఎస్ఎం) కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, రక్షా అకాడమీ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా డిప్లమో కోర్సును సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. కామర్స్, లా, మేనేజ్మెంట్, సైన్సెస్ డిగ్రీలో 50 శాతం ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తుకు అర్హులు. ఈ నెల 15 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి కొడికొండ చెక్‌పోస్టు వద్ద గల రక్షా అకాడమీలో ఏడాది పాటు శిక్షణ ఇస్తారు. ఆర్మీ, పోలీసు ఫోర్స్‌లలో ఉద్యోగాలు సాధించడానికి ఈ డిప్లమో కోర్సు దోహదపడుతుంది. -
డిప్లొమా ఇన్ ఉర్దూ క్వాలిగ్రఫికి దరఖాస్తులు
కర్నూలు (ఓల్డ్‌సిటీ): డిప్లొమా ఇన్ ఉర్దూ క్వాలిగ్రఫి అండ్ గ్రాఫికల్ డిజైనింగ్ కోర్సులో ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వెజ్ (ఎన్‌సీపీయూఎల్) స్టడీ సెంటర్ ఇన్చార్జి షుకూర్ మియ్య తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ సెకండరీ, హయ్యర్ ఎడ్యుకేషన్ వారు నిర్వహిస్తారన్నారు. ఎస్ఎస్సీ లేదా ఓఎస్ఎస్ చదివిన 15 నుంచి 35 ఏళ్ల లోపు వయసు కలిగిన యువతీ యువకులు అర్హులన్నారు. దరఖాస్తులను ఈనెల 8వ తేదీలోగా సమర్పించాలన్నారు. 9వ తేదీన ఉదయం 10 గంటలకు అభ్యర్థులకు ప్రవేశపరీక్ష ఉంటుందని, మెరిట్ అభ్యర్థులకు అక్టోబరు 10వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు ఉర్దూ ఘర్, ఇంటి నెంబరు 9–239, లాల్ మసీద్ రోడ్, కర్నూలు చిరునామాలో కానీ, ఫోన్(08518–223314, 9948769374)లో కాని సంప్రదించాలన్నారు. -
పీజీ సెట్ వెబ్ ఆప్షన్లకు ముగిసిన గడువు
∙ఈనెల 16న సీట్ల కేటాయింపు ∙20లోపు ప్రవేశాలు పొందాలి కేయూ క్యాంపస్ : కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ఈ ఏడాది జులై 21 నుంచి ప్రారంభం కాగా ఈనెల 12తో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే ప్రక్రియ ముగి సింది. ఎమ్మెస్సీ మ్యాథ్స్, ఎంసీజే, ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్‌సైన్స్, సైకాలజీ, మైక్రోబయాలజీ, జీయాలజీ, ఎంఏ సోషియాలజీ, ఎంఏ హిస్టరీ, ఎంటీఎం, ఎంహెచ్ఆర్ఎం, ఎంఎల్ఐఎస్సీ, పీజీ సెరికల్చర్ డిపో్లమా, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎంఏ ఎకనామిక్స్, ఎమ్మెస్సీ జూవాలజీ, ఫిజిక్స్, ఎంఏ ఇంగ్లిష్, పొలిటికల్ సైన్స్, ఎంఈడీ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఎ తెలుగు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జనరల్‌స్టడీస్, ఎమ్మెస్సీ బాటనీ, ఎంపీఈడీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు ల్లో ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ముగిసింది. కేయూ పీజీ సెట్ వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ. కేయూడివోఏ.ఇన్ ద్వారా విద్యార్థులు తమ తమకు ఇష్టమైన కళాశాల, కోర్సులను ఎంపిక కోసం వెబ్ఆప్షన్లు ఇచ్చారు. ఈనెల16న మొదటిదశలో విద్యార్థులకు సీట్ల కేటాయింపు జరుగబోతుంది. ఏఏ కళాశాలలో సీటు వచ్చిందో ఆయా విద్యార్థులకు సెల్‌కు మెస్సేజ్‌తో పాటు వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంచబోతున్నారు. ఈనెల 20 లోపు తమకు కేటాయించిన కళాశాలల్లో ప్రవేశాలు పొందాలని సంబంధిత అధికారులు తెలిపారు. కేయూ వెబ్సైట్æడైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ వెబ్సైట్లో చూసుకోవాలన్నారు.ఎస్బీఐ ద్వారా ఫీజు వివరాలు చలానా ద్వారా చెల్లించి సం బంధిత కళాశాల ప్రిన్సిపాల్స్కుకు రిపోర్ట్ చేయాలన్నారు. -
ఇగ్నో కోర్సులకు ప్రవేశాలు ప్రారంభం
ఎంవీపీకాలనీ : ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో)లో పలు కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభించినట్టు ప్రాంతీయ చాలకులు డాక్టర్ ఎస్.రాజారావు తెలిపారు. ఉషోదయా కూడలి వద్ద ఉన్న ఇగ్నో ప్రాంతీయ కేంద్రంలో మంగళవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లాల పరిధి విశాఖ కేంద్రంగా 2011లో ప్రారంభమైన ఇగ్నోకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 32 అధ్యయన కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది కొత్తగా ఇంటర్ అర్హత కలిగిన విద్యార్థులకు డిప్లొమా ఇన్ అక్వాకల్చర్, డిప్లొమా ఇన్ డెయిరీ వంటి కోర్సులు ప్రవేశపెట్టినట్టు తెలిపారు. అక్వాకల్చర్ కోర్సు ఆంగ్లమాధ్యమంలో ఉంటుందన్నారు. ప్రవేశ రుసుము రూ. 6500. కాగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు రాయితీ ఉందన్నారు. డిప్లొమా ఇన్ డెయిరీ కోర్సును తెలుగు మాధ్యమంలో ప్రవేశపెడుతున్నామన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఫీజులో 50 శాతం రాయితీ ఇస్తున్నామన్నారు. అదేవిధంగా పీజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా కోర్సులలో చేరగోరు అభ్యర్థులకు ఆగస్టు 17 చివరి తేదీ కాగా, ఆగష్టు 31వ వరకు రూ. 300 అపరాధ రుసుముతో ప్రవేశాలు పొందవచ్చన్నారు. ఇగ్నో సహాయ ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ డి.ఆనంద్ మాట్లాడుతూ ఈ ఏడాది నుంచి సీఏ అభ్యర్థులకు సీపీటీ ప్రవేశపరీక్ష ద్వారా బీకాం కోర్సు అందిస్తున్నట్టు తెలిపారు. దరఖాస్తులను ఉషోదయా కూడలిలోని ఇగ్నో ప్రాంతీయ కేంద్రం లేదా ఇగ్నో అధ్యయన కేంద్రాల్లో రూ. 200 చెల్లించి ప్రాస్పెక్టస్ పొందవచ్చునని తెలిపారు. మరిన్ని వివరాలకు 0891–2511200– 300– 400 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు. సమావేశంలో ఇగ్నో సహాయ రిజిస్ట్రార్ లక్ష్మిపతిరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
డిప్లమో కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
ఏయూక్యాంపస్ : ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగంలో నిర్వహిస్తున్న పలు కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విభాగాధిపతి ఆచార్య పి.బాబీవర్థన్ ఒక ప్రకటనలో తెలిపారు. పబ్లిక్ రిలేషన్స్‌లో పీజీ డిప్లమో, ఫొటోగ్రఫీ, జర్నలిజంలో డిప్లమో కోర్సులకు ప్రవేశాల సంచాలకుల కార్యాలయంలో ప్రవేశాలు జరుగుతాయన్నారు. ఈ నెల 14న ఉదయం పీజీ డిప్లమో కోర్సులకు, మధ్యాహ్నం 2 గంటలకు డిప్లమో కోర్సులకు ప్రవేశాలు జరుపుతారు. ఆసక్తి కలిగిన వారు ఫీజు వివరాలు, దరఖాస్తులను ఏయూ వెబ్సైట్ నుంచి పొందవచ్చు -
డిప్లొమా విద్యార్థుల్లో అయోమయం
సీపీ ప్రకటనతో ఆందోళన స్పష్టత ఇవ్వాలని డిమాండ్ వరంగల్ : కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తున్న దేహదారుఢ్య పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన డిప్లొమా విద్యార్థులు అయోమయంలో పడ్డారు. అర్హత పరీక్షలు రాసి పరుగు పందెంల్లో పాల్గొన్న అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన సమయంలో డిప్లొమా చదువుకున్న వారిని అన ర్హులుగా పరిగణించడంతో ఈ సమస్య ఉత్పన్నమైంది. ఇంటర్మీడియెట్‌కు డిప్లొమా విద్యార్హత తత్సమానం కాదని పోలీసు అధికారులు తేల్చి చెబుతున్నారు. అర్హత పరీక్షల కోసం దరఖాస్తు సమయంలో పాలిటెక్నిక్ ఉత్తీర్ణత పేర్కొన్నామని, అప్పుడు పరీక్షలకు అనుమతించి ఇప్పుడు దేహదారుఢ్య పోటీలకు ఎందుకు అనుమతించడం లేదని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో నిర్వహించిన అర్హత పరీక్షలకు తమకు సంబంధం లేదని పోలీసు అధికారులు అంటున్నారు. వేలాది రూపాయాలు కోచింగ్ కోసం వ్యయం చేసి దేహదారుఢ్య, క్రీడాంశాల్లో అర్హత సాధించేందుకు రోజుల తరబడి శ్రమించినా లాభం లేకుండా పోయిందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈవిషయంపై అధికారుల స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
పీఈసెట్‌లో బాలికలే టాప్
- బీపీఈడీ టాప్ టెన్‌లో ఆరుగురు..డీపీఈడీ టాప్ 10లో ఏడుగురు వారే - బీపీఈడీలో 97.13%,డీపీఈడీలో 97.62% ఉత్తీర్ణత సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(బీపీఈడీ), డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్(డీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(పీఈసెట్)లో బాలికలు సత్తాచాటారు. బీపీఈడీలో టాప్ 10 ర్యాంకర్లలో ఆరుగురు బాలికలు కాగా నలుగురే బాలురు. డీపీఈడీలో ఏడుగురు బాలికలు ఉండగా ముగ్గురే బాలురు ఉన్నారు. ఇక టాపర్లలో ఎక్కువ మంది ఖమ్మం జిల్లా నుంచి ఉండటం విశేషం. 12 రోజుల పాటు(బాలురకు 10 రోజులు, బాలికలకు 2 రోజులు) నిర్వహించిన ఫిజికల్ ఎఫిషియెన్సీ, స్కిల్ టెస్టులను గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో ఈ నెల 6 నుంచి 17 వరకు నిర్వహించారు. ఈ ఫలితాలను బుధవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. విద్యార్థులు ్టటఞ్ఛఛ్ఛ్టి.ౌటజ వెబ్సైట్ నుంచి ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంసెట్-2 మినహా ఈ పరీక్ష ఫలితాలతో దాదాపు అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షల ఫలితాల వెల్లడి పూర్తయిందన్నారు. వచ్చే నెల 2 నుంచి ఎడ్‌సెట్ ప్రవేశాలు ప్రారంభమవుతాయన్నారు. త్వరలోనే ఎంసెట్ ప్రవేశాలు కూడా మొదలు పెడతామన్నారు. ఈ నెలాఖరులోగా కాలేజీల అనుబంధ గుర్తింపు, ఫీజుల ఖరారు అవుతుందన్నారు. కాలేజీ యాజమాన్యాలు మేనేజ్మెంట్ కోటాలో ప్రవేశాలు చేపడుతున్నాయన్న అంశంపై స్పందిస్తూ ఏయే కాలేజీకి అనుబంధ గుర్తింపు వస్తుందో రాదో ఇప్పుడే తెలియదని, అలాంటప్పుడు మేనేజ్మెంట్ కోటాలో చేరవద్దని విద్యార్థులకు సూచించారు. ఉత్తీర్ణత వివరాలు: బీపీఈడీలో చేరేందుకు మొత్తం 3,564 మంది దరఖాస్తు చేసుకోగా 2,547 మంది పరీక్ష కు హాజరయ్యారు. అందులో 2,474 మంది(97.13 %) ఉత్తీర్ణులయ్యారు. డీపీఈడీలో చేరేందుకు 4,344 మంది దరఖాస్తు చేసుకోగా 3,276 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 3,198 మంది (97.62%) ఉత్తీర్ణులయ్యారు.