డిప్లొమా ఇన్ ఉర్దూ క్వాలిగ్రఫికి దరఖాస్తులు
Published Wed, Oct 5 2016 1:05 AM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM
కర్నూలు (ఓల్డ్‌సిటీ): డిప్లొమా ఇన్ ఉర్దూ క్వాలిగ్రఫి అండ్ గ్రాఫికల్ డిజైనింగ్ కోర్సులో ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వెజ్ (ఎన్‌సీపీయూఎల్) స్టడీ సెంటర్ ఇన్‌చార్జి షుకూర్ మియ్య తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సెకండరీ, హయ్యర్ ఎడ్యుకేషన్ వారు నిర్వహిస్తారన్నారు. ఎస్‌ఎస్‌సీ లేదా ఓఎస్‌ఎస్ చదివిన 15 నుంచి 35 ఏళ్ల లోపు వయసు కలిగిన యువతీ యువకులు అర్హులన్నారు. దరఖాస్తులను ఈనెల 8వ తేదీలోగా సమర్పించాలన్నారు. 9వ తేదీన ఉదయం 10 గంటలకు అభ్యర్థులకు ప్రవేశపరీక్ష ఉంటుందని, మెరిట్ అభ్యర్థులకు అక్టోబరు 10వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు ఉర్దూ ఘర్, ఇంటి నెంబరు 9–239, లాల్ మసీద్ రోడ్, కర్నూలు చిరునామాలో కానీ, ఫోన్(08518–223314, 9948769374)లో కాని సంప్రదించాలన్నారు.
Advertisement