6,048 సీట్లు కంప్యూటర్ బ్రాంచీల్లోనే
ఫార్మసీలో 3.98 శాతమే సీట్ల భర్తీ
పూర్తయిన ఆఖరి విడత ఈసెట్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్, ఫార్మసీ డిప్లొమా పూర్తి చేసిన వారికి నిర్వహించే తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇంజనీరింగ్, ఫార్మసీలో రెండో సంవత్సరంలో నేరుగా ప్రవేశాలు కల్పించారు. ఇంజనీరింగ్‌లో 12,785 సీట్లు అందుబాటులో ఉంటే, 10,407 సీట్లు భర్తీ చేశారు. ఫార్మసీలో 1,180 సీట్లు అందుబాటులో ఉంటే, కేవలం 47 సీట్లు (3.98 శాతం) మాత్రమే భర్తీ అయ్యాయి. ఈ ఏడాది ఈ సెట్‌కు 22,365 మంది అర్హత సాధించారు.
ఫైనల్ ఫేజ్‌లో 9,646 మంది 3,92,923 ఆప్షన్లు ఇచ్చారు. ఆఖరి విడతలో 1,246 మంది బ్రాంచీలను మార్చుకున్నట్టు సాంకేతిక విద్య విభాగం తెలిపింది. ఇంజనీరింగ్‌లో ఎక్కువ భాగం కంప్యూటర్ సైన్స్, ఇతర కంప్యూటర్ కోర్సుల్లోనే ఆప్షన్లు ఇచ్చారు. దీంతో 8,371 సీట్లు ఈ బ్రాంచీల్లో ఉంటే, 6,084 సీట్లు భర్తీ అయ్యాయి. 72.68 శాతం సీట్ల భర్తీ పూర్తయినట్టు అధికారులు తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 24లోగా రిపోర్టు చేయాలని అధికారులు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment