Engineering seats
-
నాణ్యత లేకుంటే సీట్లు కట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలు ఇబ్బడిముబ్బడిగా కోర్సులు, సీట్లకు అనుమతులు పొందుతున్నాయి. వాటిల్లో సరైన ఫ్యాకల్టీ, మౌలిక వసతులు లేవనే ఆరోపణలున్నాయి. ఫలితంగా ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత దెబ్బతింటోంది. ఏటా 57 వేల మంది కంప్యూటర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటికొస్తుండగా.. వీరిలో స్కిల్డ్ ఉద్యోగాలు పొందే వారి సంఖ్య 5 వేలు దాటడం లేదు. మరోవైపు కోర్ బ్రాంచీలు మూతపడే పరిస్థితి ఏర్పడుతోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే సీఎస్ఈ, దాని అనుబంధ బ్రాంచీలు తప్ప, ఈఈఈ, సివిల్, మెకానికల్‌తోపాటు అనేక కోర్ గ్రూపులకు కాలం చెల్లినట్టే. ఈ పరిణామాలపై ఆందోళన చెందుతున్న ప్రభుత్వం.. వీటికి చెక్ పెట్టాలని సంకల్పించింది. కోర్సుల సమతుల్యతపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఉన్నత విద్యామండలిని ఆదేశించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని కళాశాలల్లోని బ్రాంచీలపై ఆడిటింగ్ చేపట్టాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. డిమాండ్ ఉన్న కోర్సుల్లో నాణ్యత పరిశీలనే దీని ప్రధాన ఉద్దేశమని మండలి వర్గాలు తెలిపాయి. నాణ్యత పాటించని కళాశాలల్లో ఆయా కోర్సుల్లో సీట్లకు కోత వేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సీఎస్ఈదీ క్రేజేనా? రాష్ట్రవ్యాప్తంగా 175 ఇంజనీరింగ్ కాలేజీలు కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నాయి. వీటిలో 1.06 లక్షల సీట్లున్నాయి. ఇందులో కనీ్వనర్ కోటా కింద 87 వేల సీట్లు ఉండగా, వీటిలో 61 వేల సీట్లు కంప్యూటర్ కోర్సుల్లోనే ఉన్నాయి. ఈ సీట్లకే పోటీ తీవ్రంగా ఉంటోంది. 2019లో రాష్ట్రంలో కంప్యూటర్ సీట్లు 22,033 మాత్రమే. 2024 సంవత్సరానికి ఇవి 61,587కు పెరిగాయి. అంటే మూడు రెట్లు పెరిగాయి. ఇక కోర్ గ్రూపు (సివిల్, మెకానికల్, ఈఈఈ తదితరాలు)ల్లో 2019లో 43,532 సీట్లు ఉంటే, 25,823 సీట్లు భర్తీ అయ్యాయి. 2024లో కోర్ గ్రూపులో సీట్లు 25,597కు పడిపోయాయి. ప్రవేశాలు కూడా 19,739కి తగ్గిపోయాయి. కోవిడ్ తర్వాత నుంచి కోర్ గ్రూపుల్లో సీట్లు, ప్రవేశాలు గణనీయంగా తగ్గిపోగా.. కంప్యూటర్ సైన్స్ సీట్లకు డిమాండ్ పెరిగింది. ఈ సీట్ల పెరుగుదల మూడు రెట్లు ఉన్నప్పటీకీ, నాణ్యత అంతంత మాత్రంగానే ఉంది. 56 శాతం మంది అన్‌స్కిల్డ్ ఉద్యోగాలతోనే సరిపెట్టుకుంటున్నారు. ఇప్పుడేం చేస్తారు? బ్రాంచీల ఆడిటింగ్ చేపట్టి వాటికి ప్రామాణికతను పొందుపరచాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ముందుగా కాలేజీల నుంచి సీఎస్ఈ, ఇతర కంప్యూటర్ కోర్సుల సమగ్ర సమాచారం తెప్పిస్తున్నారు. ఫ్యాకల్టీ, కోర్సుకు కావాల్సిన లాంగ్వేజ్, లైబ్రరీ, లేబొరేటరీల వివరాలను తీసుకుంటారు. సీఎస్ఈ అనుమతి లభించినప్పటి నుంచీ కాలేజీల్లో ఉపాధి అవకాశాలను పరిశీలిస్తారు. కనీసం 40 శాతం ఉపాధి కల్పించని కాలేజీలపై మరింత లోతుగా అధ్యయనం చేస్తారు. డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఉండాల్సిన ప్రమాణాలు, బోధన పద్ధతులను మార్కెట్ నిపుణుల నుంచి తెలుసుకుంటారు. ఈ తరహా ప్రమాణాలు ఎన్ని కాలేజీల్లో ఉన్నాయో పరిశీలిస్తారు. వీటి ఆధారంగా నాణ్యతను గుర్తించి, అది లోపించిన కాలేజీల్లో సీట్లను తగ్గించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసే అవకాశముంది. మరోవైపు ప్రాజెక్టు వర్క్‌ను గుర్తింపు ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీల్లో చేయించేలా కాలేజీలే ఆయా సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాలి. ఈ దిశగా భరోసా ఇచి్చన తర్వాతే వాటికి అనుమతినివ్వాలని భావిస్తున్నారు. ఎందుకీ పరిస్థితికంప్యూటర్ సైన్స్ బ్రాంచీల్లో సీట్లు పెరిగినా... తగ్గట్టుగా ఫ్యాకల్టీ ఉండటం లేదు. చాలా కాలేజీల్లో రికార్డుల ప్రకారం బోధకులు నిపుణులే (పీహెచ్డీ, ఎంఫిల్ చేసిన వాళ్లు) ఉంటున్నారు. కానీ వాస్తవంగా బోధించేది బీటెక్, ఎంటెక్ చేసిన వాళ్లే. అరకొర వేతనాలివ్వడమే ఈ పరిస్థితికి కారణం. అనుబంధ గుర్తింపు ఇచ్చేటప్పుడు జరిగే తనిఖీ సమయంలోనే రికార్డుల్లోని బోధకులు వస్తున్నారు. ఇక మౌలిక వసతుల మాటకొస్తే... 76 కాలేజీల్లో కంప్యూటర్ కోడింగ్ లే»ొరేటరీలు లేవని జేఎన్టీయూహెచ్ వర్గాలు అంటున్నాయి. డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై నిష్ణాతులైన బోధకులే కరువయ్యారు. 28 కాలేజీల్లో విద్యార్థులకు కోడింగ్‌లో 20 శాతం పరిజ్ఞానం కూడా ఉండటం లేదని గత ఏడాది క్యాంపస్ నియామకాలు చేపట్టిన ఓ దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీ ముఖ్య ఉద్యోగి తెలిపారు.నాణ్యత కోసమే ఆడిట్కోర్సుల ఆడిటింగ్ ద్వారా డిమాండ్ ఉన్న కోర్సుల్లో నాణ్యత ఎంతో ప్రజలకు తెలుస్తుంది. క్రేజ్ కొద్దీ చేరే విద్యార్థులు ఏమేర నష్టపోతున్నారో అర్థం చేసుకోవడానికి ఆడిటింగ్ మంచి ఆయుధమని భావిస్తున్నాం. సమాజానికి అవసరమైన ఇంజనీరింగ్ విద్యలో ప్రైవేటు కాలేజీలు వ్యాపార ధోరణితో కాకుండా, నాణ్యత ప్రమాణాలు పాటించాలని ప్రభుత్వం కోరుకుంటోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఆడిట్‌కు సిద్ధమయ్యాం. పూర్తి ఆడిట్ నివేదికను ప్రభుత్వం ముందుంచుతాం. – ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
ఇంజనీరింగ్ సీట్లు నిండేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లకు ఈసారి దరఖాస్తులు తగ్గే అవకాశం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం తెలంగాణలో ఏపీ విద్యార్థులకు నాన్‌లోకల్ కోటా కింద 15 శాతం సీట్లు లభించేవి. ఆ కాలపరిమితి గత ఏడాదితో ముగిసింది. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆ కోటాను తీసివేయాలని ప్రభుత్వం భావి స్తోంది. ఏటా ఏపీ నుంచి దాదాపు 50 వేల మంది విద్యార్థులు తెలంగాణలో ఇంజనీరింగ్ సీట్ల కోసం పోటీ పడతారు. ఇందులో 16 వేల సీట్ల వరకు నాన్–లోకల్ కోటా కింద, మిగతావి జనరల్ పోటీలో ఏపీ విద్యార్థులు దక్కించుకుంటారు. ఇప్పుడు ఏపీ స్థానికతను అనుమతించకపోతే రెండు కేటగిరీల్లోనూ ఆ రాష్ట్ర విద్యార్థులకు సీట్లివ్వరు. యాజమాన్య కోటా సీట్లు మాత్రమే వారికి అందుబాటులో ఉంటాయి. అయితే, ఏపీ నాన్‌లోకల్ కోటా ఎత్తివేతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాతే ఎప్‌సెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. గత ఏడాది ఎప్‌సెట్‌లో ఇంజనీరింగ్ విభాగానికే 2.40 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 1.80 లక్షల మంది సెట్లో అర్హత పొందారు. సీట్లకు డిమాండ్ తగ్గుతుందా? రాష్ట్రంలో 174 ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. వీటిల్లో మొత్తం 1,12,069 సీట్లున్నాయి. కన్వీనర్ కోటా కింద 70 శాతం సీట్లు భర్తీ చేస్తారు. 30 శాతం యాజమాన్య కోటా కింద భర్తీ అవుతాయి. గత ఏడాది మరో 3 వేల సీట్ల పెంపునకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనుమతిచ్చినా, ప్రభుత్వం అనుమతివ్వకపోవటంతో కాలేజీలు కోర్టుకెళ్లి అనుమతి తెచ్చుకున్నాయి. దీంతో ఆ 3 వేల సీట్లను ఈసారి ఎప్‌సెట్ కౌన్సెలింగ్‌లో అనుమతించాల్సి ఉంటుంది. ఏపీ విద్యార్థులు తగ్గడం, కొత్తగా సీట్లు పెరగడంతో ఈసారి ఇంజనీరింగ్ సీట్లకు డిమాండ్ తగ్గే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో 58 శాతం ఇంజనీరింగ్ సీట్లు సీఎస్ఈ, కంప్యూటర్ అనుసంధాన డేటాసైన్స్, ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సుల్లోనే ఉన్నాయి. వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ సీట్లను తెలంగాణ విద్యార్థులు కొంత తేలికగానే పొందే వీలుంది. వెంటాడుతున్న న్యాయ సమస్యలు రాష్ట్ర విభజన సమయంలో పదేళ్లపాటు నాన్–లోకల్ కోటా అమలుకు రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చారు. గత ఏడాది ఎప్‌సెట్ నోటిఫికేషన్ సమయానికి పదేళ్లు పూర్తి కాలేదు కాబట్టి నాన్–లోకల్ కోటా అమలు చేశారు. అయితే, నాన్–లోకల్ కోటా ఎత్తివేసే ముందు రాష్ట్రపతి అనుమతి అవసరమని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్‌కు అధికారికంగా తెలియజేయలేదు. రాష్ట్రపతి అనుమతి వచ్చిన తర్వాత మాత్రమే కోటా ఎత్తివేత జీవో ఇవ్వాలి. లేని పక్షంలో ఎవరైనా కోర్టుకెళ్తే న్యాయపరమైన చిక్కులు తప్పవని అధికార వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వానికి తెలిపాం నాన్–లోకల్ కోటా ఎత్తివేత జీవో వచ్చిన తర్వాతే నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాం. విధి విధానాలు ఏ విధంగా ఉంటాయనేది ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాక తెలుస్తుంది. ఇందుకు తగ్గట్టుగానే నిర్ణయాలు తీసుకుంటాం. – ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్య మండలి చైర్మన్. -
ఐఐటీలు, ఎన్ఐటీల్లో మరో 15,000 సీట్లు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) కాలేజీల్లో ఇంజనీరింగ్ సీట్లు పెరిగే అవకాశం ఉంది. ప్రాథమిక అంచనా ప్రకారం 15 వేల (ఐఐటీల్లో 5 వేలు, ఎన్ఐటీల్లో 10 వేలు) సీట్లు పెంచాలనే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం వద్దకు వచ్చాయి. దీంతోపాటు ఆన్లైన్ విధానంలో కొన్ని కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని ఐఐటీలు (IITs) యోచిస్తున్నాయి. కొన్నేళ్లుగా విద్యార్థుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు సీట్లు పెంచాల్సిన అవసరాన్ని ఐఐటీలు, ఎన్ఐటీలు గత ఏడాది కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి. జేఈఈ అడ్వాన్స్డ్ (JEE Advanced) అర్హత సాధించిన విద్యార్థులంతా అన్ని ఐఐటీల్లోనూ కంప్యూటర్ కోర్సులనే మొదటి ఆప్షన్‌గా పెట్టుకుంటున్నారు. దాదాపు 1.45 లక్షల మంది ఈ బ్రాంచ్‌లనే కౌన్సెలింగ్‌లో మొదటి ఐచ్ఛికంగా ఎంచుకున్నారు. సీట్లు పెంచాలంటే ఫ్యాకల్టీతోపాటు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి అదనంగా నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఐఐటీలు కేంద్రానికి పంపిన నివేదికలో పేర్కొన్నాయి. వీటికి కేంద్రం సానుకూలంగా ఉందని, త్వరలో నిర్ణయం రావొచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఐఐటీల్లో ఈ ఏడాది ఏఐ/ఎంఎల్ (ఆర్టిటఫిషియల్ ఇంటెలిజెన్స్/మిషన్ లెర్టినంగ్), డేటా సైన్స్ తదితర కంప్యూటర్ కోర్సుల్లో కనీసం 4 వేల సీట్లు పెరిగే అవకాశముంది. ప్రస్తుతం ఐఐటీల్లో మొత్తం 17 వేల సీట్లు ఉన్నాయి. సీటు అక్కడే కావాలి... జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకు పొందిన వారు బాంబే–ఐఐటీపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అందువల్ల సీట్ల పెంపునకు కేంద్రం అంగీకరిస్తే బాంబే–ఐఐటీకి (IIT Bombay) మొదటి ప్రాధాన్యమిచ్చే వీలుంది. ఆ తర్వాత ఢిల్లీ, కాన్పూర్, మద్రాస్ ఐఐటీలకు ప్రాధాన్యమిస్తున్నారు. వీటి తర్వాత స్థానంలో హైదరాబాద్ ఐఐటీ (IIT Hyderabad) నిలిచింది. బాంబే ఐఐటీలో ఓపెన్ కేటగిరీలో బాలురు 67, బాలికలు 291వ ర్యాంకుతో క్రితంసారి సీటు కేటాయింపు ముగిసింది. మొత్తం మీద మంచి పేరున్న ఐఐటీల్లో 5 వేల లోపు ర్యాంకు వరకూ సీటు దక్కింది. అయితే, విద్యార్థులు అంతగా ప్రాధాన్యమి వ్వని ఐఐటీల్లో 11,200 ర్యాంకు వరకూ సీట్లు వచ్చాయి. ఈ కేటగిరీలో బిలాల్ ఐఐటీ ఉంది. ఇలాంటి ఐఐటీల్లో సీట్లు పెంచడం అవసరం లేదని భావిస్తున్నారు. ఎన్ఐటీల్లో... ఐఐటీల్లో సీట్ల పెంపు నేపథ్యంలో ఎన్ఐటీల్లో ఈసారి కటాఫ్ పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరంగల్ ఎ¯న్‌ఐటీలో కంప్యూటర్ సైన్స్‌కు అంతకుముందు 1996 ర్యాంకు వరకూ సీటు వస్తే, 2024లో బాలురకు 3115 ర్యాంకు వరకూ సీటు వచ్చింది. సీట్లు పెరిగితే 2025లో 4 వేల ర్యాంకు వరకూ సీటు వచ్చే అవకాశముంది. తమిళనాడు తిరుచిరాపల్లి ట్రిపుల్‌ఐటీలో బాలురకు గత ఏడాది 996 ర్యాంకుతోనే సీట్లు ఆగిపోగా, ఈ ఏడాది మాత్రం బాలురకు 1,509 ర్యాంకు దాకా సీటు వచ్చింది. చదవండి: ఊరంతా ఉద్యోగులే.. ప్రతి ఇంట్లో ఓ ప్రభుత్వ ఉద్యోగి..ఎన్ఐటీల్లో 82 శాతం విద్యార్థులు తొలి ప్రాధాన్యంగా కంప్యూటర్ సైన్స్‌ను ఎంచుకోగా, రెండో ప్రాధాన్యత కూడా 80 శాతం ఇదే బ్రాంచ్ ఉండటం విశేషం. మొత్తం మీద గత ఏడాది ఆరు రౌండ్ల తర్వాత 34,462వ ర్యాంకు వరకూ బాలికల విభాగంలో సిక్కిం ఎన్ఐటీలో సీఎస్సీ సీట్లు వచ్చాయి. మెకానికల్‌కు మాత్రం 58 వేల ర్యాంకు వరకూ ఓపెన్ కేటగిరీ సీట్లకు కటాఫ్‌గా ఉంది. బయోటెక్నాలజీకి 48 వేల వరకూ సీటు వచ్చింది. ఈసారి సీట్లు పెరిగితే ఈ కటాఫ్‌లో మార్పులు ఉండొచ్చని భావిస్తున్నారు. -
కావాల్సినన్ని ‘సీట్లు’!
దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ సీట్లు భారీగా పెరిగాయి. 2024–25 విద్యా సంవత్సరంలో బీటెక్ సీట్ల సంఖ్య 14.90 లక్షలకు చేరింది. 2021–22లో దశాబ్దంలోనే కనిష్ట స్థాయికి(12.54 లక్షలకు) పడిపోయిన తర్వాత.. మళ్లీ ఇప్పుడు 18.84 శాతం మేర సీట్లు పెరగడం విశేషం. వాస్తవానికి 2014–15లో దాదాపు 17.05 లక్షల సీట్లు ఉండగా.. ఆ తర్వాత ఏటా తగ్గుదల నమోదయ్యింది. మళ్లీ తిరిగి 2022–23లో 2 శాతం, 2023–24లో 5 శాతం, ఈ విద్యా సంవత్సరంలో ఏకంగా 10 శాతం(1.40 లక్షలు) మేర సీట్ల సంఖ్య పెరిగింది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) గణాంకాల ప్రకారం దేశంలో 2,906 అనుమతి పొందిన యూనివర్సిటీలు, కాలేజీల్లో 14.90 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. కొత్తగా 1,256 కాలేజీల్లో ఇన్‌టేక్ పెంపునకు ఆమోదం పొందాయి. ఇంజనీరింగ్ సీట్లలో అత్యధికంగా 40 శాతం దక్షిణాదికి చెందిన మూడు రాష్ట్రాల్లోనే ఉండటం విశేషం. దేశంలోనే అత్యధికంగా తమిళనాడులో 3,08,686, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 1,83,532, తెలంగాణలో 1,45,557 సీట్లు అందుబాటులో ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే తమిళనాడులో 32,856, ఏపీలో 23,518, తెలంగాణలో 20,213 సీట్లు పెరిగాయి. ఈ గణాంకాలు ఇంజనీరింగ్ విద్యలో దక్షిణాది రాష్ట్రాల ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. – సాక్షి, అమరావతిపరిమితి ఎత్తివేతతో పెరిగిన సీట్లు..వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఇంజనీరింగ్–టెక్నాలజీ కోర్సులకు ఆమోదంతో పాటు 2023–24లో బీటెక్‌లో కొత్త సీట్లు ప్రవేశపెట్టడంపై పరిమితిని ఏఐసీటీఈ ఎత్తివేసింది. దీంతో సీట్ల సంఖ్య భారీగా పెరిగింది. ఇందులో సూపర్ న్యూమరీ కోటాలో సుమారు 50 వేల సీట్లు కొత్తగా చేరాయి. 400 నుంచి 500 విద్యా సంస్థలు వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోర్సులను ప్రారంభించాయి.2014–15 నుంచి 2021–22 వరకు ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరికలు చాలా వరకు తగ్గాయి. ఫలితంగా అనేక కాలేజీలు మూతపడ్డాయి. 2016–17 విద్యా సంవత్సరంలో 15.56 లక్షల సీట్లు అందుబాటులో ఉండగా.. 51 శాతం సీట్లు కూడా భర్తీ కాలేదు. అనంతరం మళ్లీ 2021–22లో 71 శాతానికి, 2022–23లో 81 శాతానికి సీట్ల భర్తీ పెరిగింది. దీంతో అడ్మిషన్లు ప్రోత్సాహకరంగా ఉండటంతో సీట్ల గరిష్ట పరిమితిని ఏఐసీటీఈ తొలగించింది.అవసరమైన మౌలిక సదుపాయాలు, నిపుణులైన అధ్యాపకులు ఉంటే.. వాటిని పరిశీలించి కావాల్సినన్ని సీట్లకు ఏఐసీటీఈ అనుమతులిస్తోంది. ఒక విద్యా సంస్థ సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా 420 సీట్ల వరకు పెంచుకునే వెసులుబాటు తీసుకువచి్చంది. -
మెరిట్ ఉన్నోళ్లకే మేనేజ్మెంట్ సీటు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ సీట్ల బేరసారాలకు చెక్ పెట్టేందుకు ఉన్నత విద్యామండ లి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. యాజమాన్య కోటా సీట్లను కూడా ఆన్లైన్ విధానంలోనే భర్తీ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం కన్వినర్ కోటా సీట్లను ఈ తరహాలో కేటాయిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియను సమూలంగా మార్చాలని అధికారులు నిర్ణయించారు. దీనిపై ఇప్పటికే ఉన్నత స్థాయిలో చర్చలు జరిగాయి. కొన్ని కాలేజీల మేనేజ్మెంట్ల అభిప్రాయాలను అధికారులు సేకరిస్తున్నారు. కొంతమంది ఆన్లైన్ విధానాన్ని సమర్థిస్తున్నట్టు కౌన్సిల్ వర్గాలు తెలిపాయి. ఆన్లైన్ సీట్ల భర్తీ వ్యవహారంపై త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు మండలి అధికారులు తెలి పారు. ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చిన వెంట నే విధివిధానాలను రూపొందిస్తామన్నా రు. ప్రభుత్వం కూడా ఆన్లైన్ సీట్ల భర్తీపై పట్టుదలగా ఉందని మండలి ఉన్నతాధికారులు చెప్పారు.ఏటా రూ. కోట్ల వ్యాపారం రాష్ట్రంలో దాదాపు 1.16 లక్షల ఇంజనీరింగ్ సీట్లున్నాయి. ప్రస్తుతం 70 శాతం సీట్లను కన్వినర్ కోటా కింద భర్తీ చేస్తున్నారు. దాదాపు 38 వేల సీట్లను యాజమాన్య కోటా కింద కాలేజీలే నింపుకుంటున్నాయి. నిబంధనల ప్రకారం 15% బీ కేటగిరీ కింద భర్తీ చేయాలి. ప్రభుత్వం నిర్ణ యించిన మేరకే ఈ కేటగిరీకి ఫీజులు వసూలు చేయాలి. వీరికి ఎలాంటి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. అయితే, జేఈఈ, ఈఏపీసెట్, ఇంటర్ మార్కుల మెరిట్‌ను పరిగణలోనికి తీసుకోవాలి. కాలేజీలు మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. కౌన్సెలింగ్ తేదీలకు ముందే ఒక్కో సీటును రూ.7 నుంచి 18 లక్షల వరకూ అమ్ముకుంటున్నాయనే ఫిర్యాదులున్నాయి. ఏటా ఈ తరహా సీట్ల అమ్మకంతో రూ.వందల కోట్ల వ్యాపారం జరుగుతోందనే ఆరోపణలున్నాయి. ప్రతీ సంవత్సరం ఉన్నత విద్యామండలికి వందల కొద్దీ ఫిర్యాదులు వస్తున్నాయి. యాజమాన్య కోటా సీట్లను ఆన్లైన్ ద్వారా భర్తీ చేయా లని విద్యార్థి సంఘాలతోపాటు విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాదే దీనిపై ఆలోచన చేసినా, కాలేజీ యాజమాన్యాలు అడ్డుకున్నట్టు తెలిసింది.ఎన్‌ఆర్‌ఐలకే సీ’కేటగిరీయాజమాన్య కోటాలో 15% ప్రవాస భారతీయులకు కేటాయిస్తారు. ఈ కోటాలో సీటు పొందే వాళ్లు ఏడాదికి 5 వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఐలు సిఫార్సు చేసిన వాళ్లకు సీట్లు ఇవ్వడం ఇప్పటి వరకూ ఉంది. ఇక నుంచి నేరుగా ఎన్ఆర్ఐ పిల్లలకు మాత్రమే ఈ కేటగిరీ కింద సీట్లు ఇవ్వాలనే నిబంధనను తేవాలని మండలి భావిస్తోంది. ఒకవేళ ఎన్ఆర్ఐలు లేక సీట్లు మిగిలితే... ఆ సీట్లను బీ కేటగిరీ కిందకు మార్చాలని భావిస్తున్నారు. ఏటా ఇంజనీరింగ్ సీట్ల కోసం అనేక రకాలుగా సిఫార్సులు వస్తున్నాయి. కొన్ని కాలేజీలు వీటిని తప్పించుకోవడానికి ఆన్లైన్ విధానం సరైందిగా భావిస్తున్నాయి. ఆన్లైన్ సీట్ల భర్తీని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలులోకి తెచి్చంది. దీనిపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. కచ్చితంగా అమలు చేస్తాం..ఇంజనీరింగ్ యాజమాన్య కోటా సీట్లను వచ్చే విద్యా సంవత్సరం నుంచిఅమలు చేస్తాం. సీట్ల అమ్మకానికి తెరవేయాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. మేనేజ్మెంట్ కోటా సీట్లయినా మెరిట్ ఉన్నవాళ్లకే కేటాయించేలా చేస్తాం. – వి.బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
సీట్లు రానివారికా... అందరికా
ఇంజనీరింగ్ కాలేజీల్లో పెరిగిన సీట్లు ఎవరికి దక్కుతాయి? కౌన్సెలింగ్ ఎలా నిర్వహిస్తారు? అనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు. మొదట్లో డిమాండ్ లేని కోర్సులు రద్దు చేసుకున్న ప్రైవేట్ కాలేజీలకు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌లలో సీట్లు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. దీనిపై కాలేజీ యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించడం, తాజాగా సీట్ల పెంపునకు అనుకూలంగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం తెలిసిందే. మాప్‌ఆప్ కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పించాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో పెరిగిన సీట్లపై విద్యార్థులు ఆశలు పెట్టుకున్నారు.– సాక్షి, హైదరాబాద్కౌన్సెలింగ్ ఎలా ?ష్ట్రవ్యాప్తంగా కన్వీనర్ కోటాకింద 86 వేల ఇంజనీరింగ్ సీట్లు ఉండగా, ఇందులో ఈ ఏడాది 79 వేల సీట్లు భర్తీ అయ్యాయి. మూడు దశలతోపాటు, ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. అంతిమంగా స్పాట్ అడ్మిషన్లు కూడా పూర్తయ్యాయి. సీట్లు వచ్చిన విద్యార్థులు సంబంధిత కాలేజీల్లోనూ రిపోర్టు చేసి, సర్టిఫికెట్లు కూడా ఇచ్చారు. సీట్లు రానివారు ఇతర రాష్ట్రాల్లోని కాలేజీల్లో, దోస్త్ ద్వారా డిగ్రీలోనూ చేరారు. ఈ దశలో కౌన్సెలింగ్ నిర్వహించడం కష్టమని అధికారులు భావిస్తున్నారు. కేవలం మిగిలిపోయిన విద్యార్థులకు మాత్రమే కౌన్సెలింగ్ చేపట్టాలా? మొత్తం అభ్యర్థులకూ ఆప్షన్లు ఇచ్చే అవకాశం ఇవ్వాలా? అనే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. ఎక్కడా సీటు రాని వారు మాత్రమే ప్రస్తుతం మిగిలిపోయారు. వీరికన్నా ఎక్కువ ర్యాంకు వచ్చిన వారు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌కు ప్రయత్నించినా, ఆఖరుకు సివిల్, మెకానికల్, ఈఈఈలో చేరారు. ఇప్పుడు 3 వేల సీట్లు పెరిగితే, అందులో 2,100 కన్వీనర్ కోటా కింద ఉంటాయి. కేవలం సీట్లు రాని వారికే వీటిని కేటాయిస్తే, అంతకన్నా ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి అన్యాయం జరుగుతుందని అధికారులు అంటున్నారు.యూటర్న్ కష్టమేఇప్పటికే 79 వేల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరారు. పెరిగిన సీట్లకు వీరు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తే కౌన్సెలింగ్ ప్రక్రియ మళ్లీ మొదటికొస్తుంది. వివిధ కాలేజీల్లో పలు గ్రూపుల్లో చేరిన వారు కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేరేందుకు ప్రయత్నిస్తారు. దీనివల్ల ఇప్పటికే చేరిన కాలేజీల్లో మళ్లీ సీట్లు ఖాళీ అవుతాయి. వీటికి మరో దఫా కౌన్సెలింగ్ చేపట్టాలి. మొత్తం మీద కౌన్సెలింగ్ ప్రక్రియ మళ్లీ మొదటి నుంచి చేపట్టడమే అవుతుందని సాంకేతిక విద్య విభాగం చెబుతోంది. ఇదే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే, ప్రైవేట్ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీ పూర్తయింది. ఉన్నత విద్యామండలి ర్యాటిఫికేషన్ చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. కోర్టు తీర్పు ద్వారా పెరిగిన సీట్లకు కౌన్సెలింగ్ చేపడితే ర్యాటిఫికేషన్ ప్రక్రియ వాయిదా వేయాల్సి ఉంటుంది. పరిస్థితి అంతా గందరగోళంగానే ఉందని సాంకేతిక విద్యకు చెందిన ఓ ఉన్నతాధికారి అన్నారు. ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వాలని అధికారులు, విద్యార్థులు కోరుతున్నారు. -
డిప్లొమా విద్యార్థులకు 10వేల ఇంజనీరింగ్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్, ఫార్మసీ డిప్లొమా పూర్తి చేసిన వారికి నిర్వహించే తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇంజనీరింగ్, ఫార్మసీలో రెండో సంవత్సరంలో నేరుగా ప్రవేశాలు కల్పించారు. ఇంజనీరింగ్‌లో 12,785 సీట్లు అందుబాటులో ఉంటే, 10,407 సీట్లు భర్తీ చేశారు. ఫార్మసీలో 1,180 సీట్లు అందుబాటులో ఉంటే, కేవలం 47 సీట్లు (3.98 శాతం) మాత్రమే భర్తీ అయ్యాయి. ఈ ఏడాది ఈ సెట్‌కు 22,365 మంది అర్హత సాధించారు. ఫైనల్ ఫేజ్‌లో 9,646 మంది 3,92,923 ఆప్షన్లు ఇచ్చారు. ఆఖరి విడతలో 1,246 మంది బ్రాంచీలను మార్చుకున్నట్టు సాంకేతిక విద్య విభాగం తెలిపింది. ఇంజనీరింగ్‌లో ఎక్కువ భాగం కంప్యూటర్ సైన్స్, ఇతర కంప్యూటర్ కోర్సుల్లోనే ఆప్షన్లు ఇచ్చారు. దీంతో 8,371 సీట్లు ఈ బ్రాంచీల్లో ఉంటే, 6,084 సీట్లు భర్తీ అయ్యాయి. 72.68 శాతం సీట్ల భర్తీ పూర్తయినట్టు అధికారులు తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 24లోగా రిపోర్టు చేయాలని అధికారులు సూచించారు. -
75,200 ఇంజనీరింగ్ సీట్ల భర్తీ
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ తొలి దశ సీట్ల కేటాయింపు శుక్రవారం చేపట్టారు. సాంకేతిక విద్య విభాగం ఇందుకు సంబంధించిన వివరాలను సాయంత్రం వెల్లడించింది. మొత్తం 175 కాలేజీలు కౌన్సెలింగ్‌లో పాల్గొన్నాయి. కనీ్వనర్ కోటా కింద 78,694 సీట్లు అందుబాటులో ఉండగా, వీటిల్లో 75,200 సీట్లు భర్తీ చేశారు. 3,494 సీట్లు మిగిలిపోయాయి. మొత్తం 95.56 శాతం సీట్లు భర్తీ చేసినట్టు అధికారులు తెలిపారు. 95,735 మంది 62,60,149 ఆప్షన్లు ఇచ్చారు. 20,535 సరైన ఆప్షన్లు ఇవ్వలేదు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 6,038 మందికి సీట్లు వచ్చాయి. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 23వ తేదీలోగా ఆన్లైన్ రిపోరి్టంగ్ చేయాలని సూచించారు. ముందుకు రాని టాపర్స్ ఈఏపీ సెట్లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఈసారి కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపలేదు. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొందడానికే ప్రాధాన్యమిచ్చారు. వందలోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులు కేవలం ఒక్కరే తొలి కౌన్సెలింగ్‌లో సీటు కోసం పోటీ పడ్డారు. 201 నుంచి 500 ర్యాంకులు వచి్చన వాళ్ళు కూడా 10 మందే ఉన్నారు. ఆఖరుకు వెయ్యిలోపు ర్యాంకర్లు కూడా 74 మంది మాత్రమే కని్పంచారు. 5 వేలు పైబడిన ర్యాంకు వచ్చిన వాళ్ళే రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల కోసం ప్రయత్నించారు. 53 వేల సీట్లు కంప్యూటర్ కోర్సుల్లోనేభర్తీ అయిన 75,200 సీట్లల్లో 53,517 సీట్లు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇతర కంప్యూటర్ సైన్స్ అనుబంధ గ్రూపుల్లోనే ఉన్నాయి. వివిధ విభాగాలుగా ఉన్న ఆరి్టఫిíÙయల్ ఇంటలిజెన్స్ బ్రాంచీలో వందశాతం సీట్లు భర్తీ అయ్యాయి. సీఎస్ఈలో 99.80 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఐటీ, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్ కోర్సుల్లోనూ 97 శాతంపైగా సీట్లుకేటాయించారు. సివిల్, మెకానికల్, ఎలక్రి్టకల్ ఇంజనీరింగ్‌ల్లో సీట్లు తక్కువగా ఉన్నా మిగిలిపోయాయి. -
కంప్యూటర్ సైన్సు ఫస్ట్.. ఈసీఈ సెకండ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లు హాట్ కేకులను తలపిస్తున్నాయి. ఇంజినీరింగ్ సీట్ల తొలి విడత కౌన్సెలింగ్‌లో 86 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఈ ఏడాది కన్వీనర్ కోటాలో మొత్తం 245 కళాశాలల్లో 1,36,660 సీట్లు ఉండగా తొలి దశలో 1,17,136 సీట్లు భర్తీ అవడం విశేషం. 19,524 సీట్లు మలి విడత కౌన్సెలింగ్ ద్వారా కేటాయిస్తారు. విద్యార్థులు కంప్యూటర్ సైన్సుకే తొలి ప్రాధాన్యతనిచ్చారు. ఆ తర్వాత ఈసీఈకి డిమాండ్ ఉంది. కాలేజీలు కూడా ఇదే దృష్టితో కంప్యూటర్ సైన్సు సీట్లను ఎక్కువగా అందుబాటులో ఉంచాయి. ఈ మేరకు అఖిలభారత సాంకేతిక విద్యా మండలి నుంచి అనుమతులు తెచ్చుకున్నాయి.కంప్యూటర్ సైన్స్‌లోనే ఎక్కువ..కంప్యూటర్ సైన్స్‌లో కన్వీనర్ కోటాలో 42,303 సీట్లు ఉండగా, 40,242 సీట్లు తొలి దశలోనే భర్తీ అయ్యాయి. అంటే సీట్లన్నీ దాదాపుగా భర్తీ అయ్యాయి. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో (ఈసీఈ)లో 24,121 సీట్లు ఉండగా, 21,060 సీట్లను కేటాయించారు. సీఎస్ఈ (ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్)లో 11,156 సీట్లకు గాను 10,133 సీట్లు భర్తీ అయ్యాయి. ఫెసిలిటైస్ అండ్ సర్వీసెస్ ప్లానింగ్‌లో 66 సీట్లలో ఒక్కటి కూడా భర్తీ కాలేదు. కన్స్ట్రక్షన్ అండ్ టెక్నాలజీ మేనేజ్మెంట్లో 64 సీట్లకు గాను 7 సీట్లే భర్తీ అయ్యాయి. తొలి దశ కౌన్సెలింగ్ 17వ తేదీతో ముగిసింది. శుక్రవారం నుంచి కళాశాలల్లో తరగతులు ప్రారంభమయ్యాయి. తొలి విడతలో మిగిలిన 19,524 సీట్లకు వచ్చే వారంలో మలి విడత కౌన్సెలింగ్‌కు సాంకేతిక విద్యా శాఖ చర్యలు చేపడుతోంది. దానికంటే ముందే ఎన్ఆర్ఐ, కేటగిరీ–బి సీట్ల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనుంది. చివరి దశలో కళాశాలలకు స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పించనుంది.వైఎస్ జగన్ దార్శనికతతో..వైఎస్ జగన్మోహన్ రెడ్డి దార్శనికత, సంస్కరణలతో మెరిట్ సాధించిన పేద, మధ్య తరగతి విద్యార్థులు కూడా ప్రైవేటు వర్సిటీల్లో సీట్లు సాధించుకోగలిగారు. రాష్ట్రంలో 9 ప్రైవేటు వర్సిటీలు ఉన్నాయి. వీటిలో గ్రీన్‌ఫీల్డ్ వర్సిటీల్లో 35 శాతం, బ్రౌన్ ఫీల్డ్ వర్సిటీల్లో 70 శాతం సీట్లను ఏపీఈఏపీసెట్‌లో మెరిట్ సాధించిన విద్యార్ధులకు కన్వీనర్ కోటాలో కేటాయించేలా గత వైఎస్ జగన్ సర్కారు సంస్కరణలు తెచ్చింది. దీంతో గడిచిన రెండేళ్లలో 7 ప్రైవేటు వర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు ఎందరో పేదింటి విద్యార్థులు మెరుగైన ఉన్నత విద్యను అందుకున్నారు. ఈ ఏడాది ప్రైవేటు వర్సిటీలు 9కి చేరడంతో సీట్ల సంఖ్య 7,832కు చేరుకుంది. ఇందులో ఈ ఏడాది కౌన్సెలింగ్‌లో తొలి విడతలోనే 7,700 సీట్లను విద్యార్థులు దక్కించుకున్నారు. గతంలో 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో ప్రైవేటు వర్సిటీల్లో చదువంటే పేద మెరిట్ విద్యార్థులకు సాధ్యయ్యేది కాదు. లక్షల్లో ఫీజులు చెల్లించే వారికే అక్కడ సీట్లు దక్కేవి. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రావడంతో ఈ వర్సిటీల్లో పేద విద్యార్థులూ చదువుకోగలుగుతున్నారు. -
ఇంజనీరింగ్ సీట్లు 98,296
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల లెక్క పాక్షికంగా తేలింది. ఆఖరి నిమిషంలో కాలేజీలకు విశ్వవిద్యాలయాల అనుబంధ గుర్తింపు లభించింది. దీంతో ఈఏపీసెట్ అర్హత పొంది, కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు సోమవారం నుంచి వెబ్ ఆప్షన్లు ఇవ్వొచ్చు. ఈ నెల 15 వరకు ఈ అవకాశం ఉంటుంది. సాంకేతిక విద్యా విభాగం అందించిన సమాచారం ప్రకారం తొలిదశ ఆప్షన్లు ఇచ్చే నాటికి 173 కాలేజీలు కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నాయి. మొత్తం 98,296 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో కన్వీనర్ కోటా కింద 70,307 సీట్లు భర్తీ చేయనున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో 1.18 లక్షల ఇంజనీరింగ్ సీట్లు వివిధ విభాగాల్లో ఉండాలి. కానీ కొన్ని కాలేజీలు సివిల్, మెకానికల్, ఈఈఈ, ఈసీఈ వంటి బ్రాంచీల్లో సీట్లు, సెక్షన్లు తగ్గించుకున్నాయి. వాటి స్థానంలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇతర కంప్యూటర్ కోర్సులు కావాలని దరఖాస్తు చేసుకున్నాయి. పెరిగే సీట్ల వివరాలకు ఇంకా ప్రభుత్వం అనుమతి లభించలేదు. దీంతో కోత పడే సీట్లుపోను మిగతా వాటిని కౌన్సెలింగ్‌లో చేర్చారు. సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన ఆదివారం ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇందులో 60 శాతానికిపైగా సీట్లు కంప్యూటర్ కోర్సుల్లోనే ఉన్నాయి. -
సీట్లు పెరిగినా.. సీఎస్‌ఈకే డిమాండ్
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈసారి సీట్లు భారీగా పెరిగాయి. ఇప్పటివరకూ రెండు దశల కౌన్సెలింగ్ చేపట్టారు. వీటిల్లో 59,917 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. గత ఏడాది 57,152 సీట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో పోలిస్తే ఈ సంవత్సరం 2,765 సీట్లు పెరిగాయి. ఐఐటీల్లో స్వల్పంగా సీట్లు పెరిగితే, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ప్రభుత్వ నిధులతో నడిచే జాతీయ కాలేజీల్లో కొత్త కోర్సులను చేర్చారు. వీటిల్లోనూ ఎక్కువగా కంప్యూటర్ సైన్స్ కోర్సులే ఉన్నాయి. మరికొన్ని కోర్సులకు అనుమతి రావాల్సి ఉంది. కొన్ని జాతీయ కాలేజీల్లో కొత్త కోర్సులతో ప్రత్యేక సెక్షన్లు ఏర్పాటు చేసే వీలుంది. దీంతో ఆఖరి దశ కౌన్సెలింగ్ నాటికి మరికొన్ని సీట్లు అందుబాటులోకి వచ్చే వీలుంది. దీనిపై త్వరగా నిర్ణయం వెల్లడించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒకవైపు సీట్లు పెరిగినా... ప్రధాన కాలేజీల్లో డిమాండ్ మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోసం అన్ని ప్రాంతాల్లోనూ విద్యార్థులు పోటీ పడుతున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు సంపాదించిన వారి మధ్య కూడా ఈసారి పోటీ కన్పిస్తోంది. జాతీయ స్థాయిలో డిమాండ్ జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ)కు భారీగా డిమాండ్ కని్పస్తోంది. జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్‌లో ఇది స్పష్టంగా కన్పిస్తోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ఎక్కువ మంది సీఎస్‌ఈకే దరఖాస్తు చేశారు. గత ఏడాది కన్నా కటాఫ్ పెరిగినప్పటికీ టాప్ కాలేజీల్లో పోటీ మాత్రం ఈసారి కాస్త ఎక్కువగానే కని్పస్తోంది. వాస్తవానికి దేశంలోని 23 ఐఐటీల్లో గత ఏడాది 17,385 ఇంజనీరింగ్ సీట్లు ఉంటే, ఈ సంవత్సరం 17,740 సీట్లు అందుబాటులోకి వచ్చాయి.జాతీయ కాలేజీల్లోనూ ఈసారి కొన్ని కొత్త కోర్సులను ప్రవేశ పెడుతున్నారు. వీటిల్లో కొన్నింటికి అనుమతులు రాగా.. మరికొన్నింటికి రావాల్సి ఉంది. ఆఖరి దశ కౌన్సెలింగ్ వరకూ ఎన్ఐటీల్లో సీట్లు పెరిగే వీలుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం 121 విద్యాసంస్థల్లో ఈ ఏడాది 59,917 సీట్లు భర్తీ చేయబోతున్నారు. ఇప్పటికే రెండు దశల కౌన్సెలింగ్ పూర్తికాగా, మరో మూడు దశలు ఉంది. టాప్ కాలేజీల్లోనూ... దేశంలోని ప్రధాన ఐఐటీలు, ఎన్ఐటీల్లో కంప్యూటర్ సైన్స్‌కు పోటీ ఎక్కువగా ఉంది. అయితే, దూర ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో పెద్దగా పోటీ కన్పించలేదు. ఈ ప్రాంతాల్లో లక్షల్లో ర్యాంకులు వచి్చన వాళ్లకూ సీట్లు దక్కుతున్నాయి. తిరుపతి ఐఐటీలో సీట్లు ఈసారి 244 నుంచి 254కు పెరిగాయి. అయితే, సీఎస్ఈ ఓపెన్ కేటగిరీలో బాలురకు 4,522, బాలికలకు 6,324 ర్యాంకు వరకే సీట్లు వచ్చాయి. ఈసారి ఇక్కడ నాలుగేళ్ల ఇంజనీరింగ్ ఫిజిక్స్ కోర్సును అందుబాటులోకి తెచ్చారు. అయినప్పటికీ సీఎస్ఈ వైపే పోటీ కని్పంచింది. వరంగల్ ఎన్ఐటీలో కూడా సీట్లు 989 నుంచి 1049కు పెరిగాయి. ఇక్కడ 60 సీట్లతో ఏఐ అండ్ డేటా సైన్స్ కోర్సును ప్రవేశ పెట్టారు.అయితే, సీఎస్ఈకి ఇక్కడ బాలురకు ఓపెన్ కేటగిరీలో 201, బాలికలకు 3,527 ర్యాంకు వరకే సీట్లు వచ్చాయి. ఐఐటీ గాం«దీనగర్‌లో 288 నుంచి 370కు గత ఏడాదే పెంచారు. ఈసారి కొత్తగా 30 సీట్లు అదనంగా ఇచ్చారు. ఇక్కడ కూడా 90 శాతం మంది సీఎస్‌ఈకే దరఖాస్తు చేశారు. ఐఐటీ బాంబే 1,358 నుంచి 1,368కి, ధార్వాడ్‌లో 310 నుంచి 385కు, భిలాయ్‌లో 243 నుంచి 283కు, భువనేశ్వర్‌లో 476 నుంచి 496కు, ఖరగ్‌పూర్‌లో 1,869 నుంచి 1,889కి, జోథ్‌పూర్‌లో 550 నుంచి 600కు, పట్నాలో 733 నుంచి 817కు, గువాహటిలో 952 నుంచి 962కు సీట్లు పెరిగాయి. ఈ పెరిగిన సీట్లతో పోలిస్తే సీఎస్సీ కోసం పోటీ పడిన విద్యార్థుల సంఖ్య రెట్టింపు కన్పిస్తోంది. -
జోసా కౌన్సెలింగ్‌లో జోష్
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపులో ఈ ఏడాది భారీ మార్పు కన్పిస్తోంది. గత ఏడాది కన్నా ఈసారి కటాఫ్ బాగా పెరిగింది. దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో సీట్ల భర్తీకి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ చేపట్టింది. ఇందులో భాగంగా గురువారం తొలిదశ సీట్లు కేటాయించింది. అయితే ఈసారి ఐఐటీల్లో 900 సీట్లు అదనంగా పెరిగాయి. దీంతో సీట్ల కేటాయింపు కటాఫ్ పెరిగింది. ముంబై ఐఐటీలో బాలికల విభాగంలో గత ఏడాది 305 ర్యాంకుకు సీటు వస్తే, ఈసారి 421వ ర్యాంకు కూడా సీటు వచ్చింది. హైదరాబాద్ ఐఐటీలో బాలుర విభాగంలో 585 ర్యాంకుకు సీటు వస్తే, ఈసారి 649 ర్యాంకు వరకూ సీటు వచ్చింది. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీ (నిట్)ల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగింది. వరంగల్ నిట్‌లో బాలుర విభాగంలో 1664 ర్యాంకుకు గత ఏడాది సీటొస్తే, ఈసారి 2698 ర్యాంకుకు సీటు వచ్చింది. బాలికల విభాగంలో పోయినసారి 3593 ర్యాంకుకు సీటొస్తే, ఈసారి 4625 ర్యాంకుకు కూడా సీటు వచ్చింది. ఇక ఏపీ నిట్‌లో బాలికల విభాగంలో గత ఏడాది 17873 కటాఫ్ ఉంటే, ఈసారి ఇది 23130కి పెరిగింది. జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన వారికి ఐఐటీలు మినహా అన్ని జాతీయ కాలేజీల్లో ర్యాంకును బట్టి సీటు కేటాయిస్తారు. ఐఐటీల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా సీట్లు ఇస్తారు. జోసా మొత్తం ఐడు రౌండ్ల కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. ముంబై ఐఐటీలోనే టాపర్లుజేఈఈ అడ్వాన్స్‌డ్‌లో టాప్ ర్యాంకులు పొందిన విద్యార్థుల్లో ఎక్కువ మంది ముంబై ఐఐటీకే ప్రాధాన్యమిచ్చారు. టాపర్లంతా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వైపే మొగ్గు చూపారు. ఓపెన్ కేటగిరీలో ముంబై ఐఐటీలో తొలి ర్యాంకు మొదలుకుని 68వ ర్యాంకు వరకూ సీట్లు వచ్చాయి. బాలికల విభాగంలోనూ 7వ ర్యాంకు సహా 421వ ర్యాంకు వరకూ సీట్లు పొందారు. తర్వాత స్థానంలో ఢిల్లీ ఐఐటీ ఉంది. ఇక్కడ 116లోపు ర్యాంకు వరకూ సీట్లు దక్కాయి. కాన్పూర్ ఐఐటీలోనూ పోటీ ఎక్కువగానే ఉంది. ఓపెన్ కేటగిరీలో 226 ర్యాంకుతో ప్రారంభమై 414 ర్యాంకుతో ముగిసింది. హైదరాబాద్ ఐఐటీలో సీఎస్సీ ఓపెన్ కేటగిరీలో 431వ ర్యాంకుతో మొదలై 649వ ర్యాంకు వరకూ సీట్లు వచ్చాయి. చివరి కౌన్సెలింగ్ వరకు చూడాలి గత కొన్నేళ్ళతో పోలిస్తే ఈసారి జోసా కౌన్సెలింగ్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. కటాఫ్ ఊహించని విధంగా పెరిగింది. సీట్లు పెరగడమే దీనికి కారణం. విద్యార్థులు చివరి కౌన్సెలింగ్ వరకూ వేచి చూస్తే తప్పకుండా మంచి అవకాశాలు రావచ్చు. రెండో దశ కౌన్సెలింగ్ నుంచి ఆప్షన్లు ఇచ్చే ముందు సీట్ల కేటాయింపుపై కొంత కసరత్తు చేయాలి. – ఎంఎన్ రావు (గణిత శాస్త్ర నిపుణులు) -
ఏ కాలేజీ.. ఏబ్రాంచీ!
సాక్షి, హైదరాబాద్: టీఎస్ఈఏపీ ఫలితాలు ప్రకటించడంతో ఇంజనీరింగ్ సీట్ల కోసం విద్యార్థుల హడావుడి మొదలైంది. తనకు వచ్చిన ర్యాంకుకు ఏ కాలేజీలో బ్రాంచిలో సీటొస్తుంది? ఏ కాలేజీలో ఎంత ర్యాంకు వరకు సీటు వచ్చే అవకాశం ఉంది? కౌన్సెలింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? తదితర సవాలక్ష ప్రశ్నలు విద్యార్థులను వెంటాడుతున్నాయి. దీంతో కన్సల్టెన్సీలను, నిపుణులను సంప్రదిస్తున్నారు. తల్లిదండ్రులతో కలిసి ర్యాంకు గురించి చర్చిస్తున్నారు. కౌన్సెలింగ్ తేదీలు ప్రకటించేలోగా స్పష్టమైన సమాచారంతో సిద్ధంగా ఉంటే మంచిదని భావిస్తున్నారు. వాస్తవానికి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ మొదలయ్యేలోగా కొంత కసరత్తు అవసరమని నిపుణులు కూడా అంటున్నారు. తొలిదశ కౌన్సెలింగ్‌లో ఖచ్చితమైన ఆప్షన్లు పెట్టుకుంటే సీటు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. గత ఏడాది కటాఫ్‌ను పరిశీలిస్తే కొంత స్పష్టత వచ్చే వీలుందని పేర్కొంటున్నారు. టెన్షన్ అవసరమే లేదు ఐదేళ్ళ క్రితం ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ బ్రాంచిలకు తీవ్ర స్థాయిలో పోటీ ఉండేది. అయితే డిమాండ్ ఉన్న కోర్సులకే కాలేజీలు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల గత రెండేళ్ళుగా కంప్యూటర్ సైన్స్‌లో సీట్లు పెరిగాయి. గత ఏడాది ఏకంగా 14 వేల సీట్లు కొత్తగా వచ్చాయి. కాబట్టి సీటు కోసం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదని నిపుణులు చెబుతున్నారు. కాకపోతే వచి్చన ర్యాంకును బట్టి సీటు ఎక్కడ వస్తుందనేది సరిగ్గా అంచనా వేసి, ఆ దిశగా ఆప్షను ఇవ్వాలి. అవసరమైతే రెండో దశ కౌన్సెలింగ్ లేదా ఆఖరి దశలో సీట్లు మిగిలితే నచ్చిన కాలేజీని ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. గత సంవత్సరం పరిస్థితిని బట్టి చూస్తే ఈ ఏడాది కూడా సీఎస్ఈలో పోటీ అదే విధంగా ఉండే వీలుంది. యూనివర్సిటీ క్యాంపస్‌లో సీఎస్ఈ బ్రాంచిలో సీటు రావాలంటే ఈఏపీ సెట్లో ఓపెన్‌లో 4 వేల లోపు ర్యాంకు వచ్చి తీరాలని నిపుణులు అంటున్నారు. టాప్ కాలేజీల్లో రావాలంటే 8 వేల లోపు ర్యాంకు అవసరమని స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో సాధారణ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ సంవత్సరం 60 వేల ర్యాంకు వచ్చినా సీఎస్ఈలో సీటు వచ్చే వీలుందని అంచనా వేస్తున్నారు. జేఎన్టీయూ సుల్తాన్పూర్ క్యాంపస్‌లో పోటీ తక్కువగా ఉంటోంది. 19 వేల ర్యాంకు వరకు సీటు వచ్చే వీలుంది. అందరి దృష్టీ సీఎస్‌ఈపైనే ఏ స్థాయిలో ర్యాంకు వచ్చినా విద్యార్థి ముందుగా కోరుకునేది కంప్యూటర్ సైన్స్ సీటు. గత మూడేళ్ళుగా విద్యార్థులు పెట్టే ఆప్షన్లు చూస్తే ఈ విషయం అర్ధమవుతుంది. గత ఏడాది 58 శాతం కంప్యూటర్ సైన్స్ సీట్లకే అప్షన్లు ఇచ్చుకున్నారు. అయితే సరైన ర్యాంకు రాకపోయినా టాప్ కాలేజీలకు ప్రాధాన్యత ఇస్తూ అప్షన్లు పెడుతున్నారు. ఆఖరి దశ కౌన్సెలింగ్ వరకూ ఇదే తరహా ఆప్షన్లు ఇస్తున్నారు. ఫలితంగా తన ర్యాంకుకు వచ్చే కాలేజీని, బ్రాంచిని మొదటి రెండు దశల కౌన్సెలింగ్‌లోనే పోగొట్టుకుంటున్నారు. ఉదాహరణకు ఓ విద్యార్థికి 16 వేల ర్యాంకు వచ్చింది. అతనికి టాప్ టెన్‌లో కాకుండా వేరే కాలేజీలో కోరుకున్న బ్రాంచిలో సీటు వచ్చే వీలుంది. కానీ ఆప్షన్లు పెట్టే సమయంలో టాప్ టెన్‌కే పరిమితమ అవుతున్నారు. దీంతో కోరుకున్న కాలేజీ రావడం లేదు. ఇలా చేయడం వల్ల తనకు వచ్చేందుకు అవకాశం ఉన్న కాలేజీలోనూ సీటు పోగొట్టుకుంటున్నారు. ఆప్షన్లుఇచ్చేటప్పుడు అప్రమత్తత అవసరం ఆప్షన్లు ఇచ్చేప్పుడు విద్యార్థులు అన్ని అంశాలను పరిశీలించాలి. గత కొన్నేళ్లలో ఏ ర్యాంకుకు ఏ కాలేజీలో సీటు వచ్చిందనే అంశాన్ని పరిశీలించాలి. టాప్ కాలేజీలకే ప్రాధాన్యత ఇస్తూ ఆప్షన్లు ఇవ్వాలనే ధోరణి సరికాదు. ఈ దిశగా అనేక కౌన్సెలింగ్‌ల కోసం వేచి చూడటం మంచిది కాదు. మీకు సీటు వచ్చే వీలున్న కాలేజీని మీరు వదులుకుంటే, ఇతరులు ఆ సీటులో చేరతారు. అందువల్ల జాగ్రత్తగా కాలేజీని, బ్రాంచిని ఎంపిక చేసుకోవాలి. అవసరమైతే మంచి కాలేజీ కోసం తర్వాత కౌన్సెలింగ్‌లో ప్రయత్నించాలి. – ఎంఎన్‌రావు (గణిత శాస్త్ర నిపుణుడు) -
వందొస్తే టాప్ కాలేజీల్లో సీఎస్సీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు మరో 20 రోజుల్లో వెలువడే అవకాశముంది. ఇప్పటికే కీ విడుదల చేశారు. దీన్ని బట్టి ఎన్ని మార్కులు వస్తాయనేది విద్యార్థులకు ఓ అంచనా ఉంది. ఈ మార్కుల ఆధారంగా ఏయే ర్యాంకులు వస్తాయి? ఆ ర్యాంకుకు అనుకున్న కాలేజీలో సీటు వస్తుందా? అనే ఉత్కంఠ విద్యార్థుల్లో కన్పిస్తోంది. అయితే ఇంజనీరింగ్ ప్రశ్నపత్రం కష్టంగా లేదని, ఎక్కువ మంది అర్హత సాధించే వీలుందని నిపుణులు అంటున్నా రు. సాధారణ విద్యార్థి కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథ్స్ సబ్జెక్టుల నుంచి 40 ప్రశ్నలకు జవాబులు ఇచ్చే చాన్స్ ఉందంటున్నారు. 160 ప్రశ్నల్లో ఎక్కువ మంది 50 శాతానికి పైగానే కరెక్టు సమాధానాలు రాయవచ్చని అంచనా వేస్తున్నారు. 100 మార్కులొస్తే టాప్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ సీటు వచ్చే అవకాశముందని నిపుణులు విశ్షిస్తున్నారు. సీఎస్సీ సీటు ఈజీనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద 80 వేల వరకూ సీట్లు అందుబాటులో ఉండే వీలుంది. ఇందులో 58% కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇతర కంప్యూటర్ కోర్సు సీట్లు ఉంటాయి. గత ఏడాది సివిల్, మెకానికల్, ఎలక్ట్రి కల్ బ్రాంచిల్లోని సీట్లు కాలేజీలు రద్దు చేసుకోవడం, కొత్తగా పెరిగిన సీట్ల వల్ల కంప్యూటర్ కోర్సుల సీట్లు అదనంగా 14 వేలు పెరిగాయి. కాబట్టి ఈసారి కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు పొందడం తేలికేనని నిపుణులు అంటున్నారు. గత ఏడాది ఆఖరి దశ కౌన్సెలింగ్‌ను ప్రామాణికంగా తీసుకుంటే టాప్ కాలేజీల్లో సీఎస్సీ సీటు 4 వేల ర్యాంకు వరకూ వచ్చింది. ఈ ఏడాది కూడా ఇంచుమించు ఇదే ర్యాంకు వరకూ ఉండే వీలుందని తెలుస్తోంది. అయితే కాలేజీతో పనిలేదు కంప్యూటర్ సైన్స్ బ్రాంచిలో సీటే ప్రధానం అనుకుంటే 35 వేల ర్యాంకు వరకూ ఆ సీటు వచ్చే వీలుంది. 50 వేల ర్యాంకు దాటితే మాత్రం సీఎస్సీ సీటును ఆశించలేమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సెట్లో కనీసం 40 నుంచి 50 మార్కులు తెచ్చుకుంటే ఆ విద్యారి్థకి 35 నుంచి 50 వేల ర్యాంకు వచ్చే వీలుందని చెబుతున్నారు. అదే 90 నుంచి 100 మార్కులు వస్తే 1500 నుంచి 3600 ర్యాంకు వచ్చే వీలుందని అంచనా వేస్తున్నారు. ముందే అంచనా వేయాలిగత కొన్నేళ్ళుగా ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియను పరిశీలించాలి. ఎన్ని మార్కులకు ఏ ర్యాంకు వస్తుంది? ఏ ర్యాంకు వస్తే ఏ కాలేజీలో ఏయే బ్రాంచిల్లో సీట్లు వస్తున్నాయి? అనేది ముందుగానే అంచనా వేసుకోవాలి. మొదటి దశ కౌన్సెలింగ్‌లో పక్కాగా సీటు వచ్చే కాలేజీని ఎంపిక చేసుకునేందుకు కొంత కసరత్తు చేసి ఆప్షన్లు ఇచ్చుకుంటే కోరుకున్న బ్రాంచిలో సీటు అవకాశం ఉంది. – ఎంఎన్ రావు (గణితశాస్త్ర సీనియర్ అధ్యాపకుడు) ఎన్ని మార్కులొస్తే.. ఎంత ర్యాంకు? మార్కులు ర్యాంకు 140పైన 100 130పైన 200 120పైన 300 110–120 800–300 100–110 1500–800 90–100 3600–1500 80–90 6000–3600 70–80 12000–6000 60–70 20000–12000 50–60 35000 – 20000 40–50 50000 – 35000 -
దక్షిణాదికి మరిన్ని ఇంజనీరింగ్ సీట్లు!
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది దక్షిణాది రాష్ట్రాలకు ఇంజనీరింగ్ సీట్లు పెరగనున్నాయి. అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఈ మేరకు వెసులుబాటు కల్పిస్తోంది. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఏపీ నుంచి వస్తున్న డిమాండ్‌ను ఏఐసీటీఈ పరిగణనలోకి తీసుకున్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంజనీరింగ్‌పై విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో అక్కడ మేనేజ్మెంట్ కోర్సుల పెంపునకు అనుమతి ఇవ్వాలని భావిస్తున్నారు. ఇదే జరిగితే తెలంగాణవ్యాప్తంగా 10 వేల ఇంజనీరింగ్ సీట్లు పెరుగుతాయని రాష్ట్ర అధికారులు అంచనా వేస్తున్నారు. కంప్యూటర్ కోర్సుల్లోనే సీట్లు పెంచాలని ఇంజనీరింగ్ కాలేజీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లలో సీట్లకు కోత పడొచ్చు.గత ఏడాది 7 వేల సీట్లు ఈ బ్రాంచ్‌లలో తగ్గాయి. వీటి స్థానంలో కంప్యూటర్ కోర్సుల్లో పెంచారు. దీంతోపాటు మరో 7 వేల వరకూ కంప్యూటర్ బ్రాంచ్‌ల్లో సీట్లు పెరిగాయి. మారుతున్న ట్రెండ్ కొన్నేళ్లుగా దక్షిణ, ఉత్తరాది రాష్ట్రాల మధ్య కోర్సుల ఎంపికలో తేడా కనిపిస్తోందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఏఐసీటీఈ గుర్తించాయి. తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్ఛేరిలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్), ఎంబీఏ, ఎంసీఏల్లో ఎక్కువగా చేరుతున్నారు. కానీ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యార్థులు ఎక్కువగా సంప్రదాయ డిగ్రీ కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు ఇంజనీరింగ్ తర్వాత ఎంఎస్‌కు విదేశాలకు వెళ్లేందుకు, లేదా సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లోని విద్యార్థులు డిగ్రీ తర్వాత సివిల్స్, ఇతర పోటీ పరీక్షల వైపు దృష్టి పెడుతున్నారు. ఈ డిమాండ్‌ను బట్టే ఎక్కువ ఇంజనీరింగ్ సీట్లు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉంటున్నాయి. ► దేశవ్యాప్తంగా 12,47,667 బీటెక్ సీట్లు అందుబాటులో ఉంటే, వీటిల్లో 6,74,697 (54 శాతం) సీట్లు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ►ఎంసీఏలో 70,065 సీట్లు ఉంటే, 30,812 (44 శాతం) దక్షిణాదిలో ఉన్నాయి. ►ఎంబీఏ, పీజీడీఎం వంటి మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించిన సీట్లు 3,39,405 దేశవ్యాప్తంగా ఉంటే, దక్షిణాదిన 1,57,632 సీట్లున్నాయి. ►రానురాను బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ సీట్లు దక్షిణాదిలోనే పెరగడానికి ఇదే కారణమని ఏఐసీటీఈ భావిస్తోంది. ►2015–16లో దక్షిణాది రాష్ట్రాల్లో 48.77 బీటెక్ సీట్లు ఉంటే, కేవలం ఆరేళ్లలో అవి 5.3 శాతం పెరిగాయి. ఇప్పుడిది 7 శాతానికి చేరొచ్చని అంచనా వేస్తున్నారు. నైపుణ్యంపై దృష్టి ఇంజనీరింగ్ విద్యలో కొత్త కోర్సులు వస్తున్నా, విద్యార్థుల్లో నైపుణ్యం ఉండటం లేదని పలు సర్వేలు చెబుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని ఇంజనీరింగ్‌లో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇంజనీరింగ్ రెండో ఏడాది నుంచే ప్రాక్టికల్‌గా అవసరమైన నైపుణ్యం పొందేలా ప్రాజెక్టులు రూపొందిస్తున్నారు. తరగతిగది కన్నా, నైపుణ్యం పొందే పారిశ్రామిక సంస్థల్లో పనిచేసేలా చేయాలని ఏఐసీటీఈ సూచిస్తోంది. టెక్నాలజీలో దక్షిణాది ముందంజ దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు బీటెక్ చదవడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ ట్రెండ్ రానురాను పెరుగుతోంది. తక్షణ ఉపాధితో పాటు, నైపుణ్యం పెంచే విధంగా ఇంజనీరింగ్‌లో వస్తున్న మార్పులూ ఇందుకు కారణమే. అందుకే తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ సీట్ల పెంపు అనివార్యమవుతోంది. గణితం నేపథ్యం విద్యార్థులూ ఉత్తరాది కన్నా, దక్షిణాదిలో ఎక్కువగా ఉంటున్నారు. ఇది కూడా బీటెక్ సీట్ల డిమాండ్‌కు కారణమవుతోంది. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉన్నత విద్య మండలి చైర్మన్ -
‘మేనేజ్’ చేస్తున్నారా?
సాక్షి, హైదరాబాద్: మేనేజ్మెంట్ కోటాలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిపై ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నతవిద్య అధికారులను అప్రమత్తం చేసింది. విద్యార్థి సంఘాలు, వివిధ వర్గాల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిగణలోనికి తీసుకున్నట్టు తెలిసింది. దీని ఆధారంగా సమగ్ర వివరాలు అందించాలని అధికారులను సీఎంఓ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి సహా అన్ని యూనివర్సిటీల వీసీలు వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. విశ్వవిద్యాలయాలపై వస్తున్న ఫిర్యాదులపై ఇటీవల ముఖ్యమంత్రి విద్యాశాఖ సమీక్షలో ప్రస్తావించారు. ఇదే క్రమంలో సీట్ల అమ్మకాలపైనా ఆరా తీశారు. ఆ తర్వాతే వర్సిటీల ప్రక్షా ళన దిశగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శితో ప్రత్యేకంగా మాట్లాడినట్టు తెలిసింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపుపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది. పక్కాగా తనిఖీలుండాల్సిందే... ప్రైవేట్ కాలేజీలకు గుర్తింపు ఇచ్చే సమయంలో యూనివర్సిటీ స్థాయిలో ప్రత్యేకంగా కమిటీలు వేస్తారు. ఇవి ప్రతీ కాలేజీకి వెళతాయి. అక్కడ మౌలిక వసతులు, అధ్యాపకుల పరిస్థితిని సమీక్షిస్తాయి. ఈ వ్యవహారం మొత్తం నామమాత్రంగానే సాగుతోందనే ఫిర్యాదులున్నాయి. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో వర్సిటీ అధికారులు బేరం కుదుర్చుకుంటున్నారనే విమర్శలూ వస్తున్నాయి. ఇలాంటి ఆరోపణలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం సూచించినట్టు తెలిసింది. చాలా కాలేజీల్లో మౌలిక వసతులు లేకున్నా అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. ఇలాంటి కాలేజీల జాబితా సిద్ధం చేయాలని అధికారులను సీఎంఓ ఆదేశించినట్టు సమాచారం. ఈ ప్రక్రియలో వీసీలనే కాకుండా, ఇతర అధికారులను కూడా భాగస్వామ్యం చేసే ఆలోచననలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఫ్యాకల్టీపై ప్రత్యేక దృష్టి గత ఏడాది రాష్ట్రంలో 14 వేల వరకూ కంప్యూటర్ దాని అనుబంధ బ్రాంచ్‌లలో సీట్లు పెరిగాయి. సీఎస్సీ, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి బ్రాంచ్‌లలో సీట్లను యాజమాన్యాలు రూ.12 నుంచి రూ.18 లక్షల వరకూ అమ్ముకున్నట్టు ఆరోపణలు వచ్చా యి. ఉన్నత విద్యామండలికి కూడా ఇలాంటి ఫిర్యాదులు 145 వరకూ వచ్చాయి. దీనిపై ఏం చర్యలు తీసుకున్నారనే విషయమై సీఎంఓ ఆరా తీసింది. సరైన ఆధారాలు లేవంటూ అధికారులు వీటిని పక్కన బెట్టడంపై ఇటీవల సీఎం సీరియస్ అయినట్టు సమాచారం. ఫిర్యాదుల ఆధారంగా కొంతమంది అధికారుల బృందంతో దర్యాప్తు జరిపించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. వచ్చే ఏడాది కూడా కంప్యూటర్ సైన్స్ బోధించేందుకు యూజీసీ నిబంధనల ప్రకారం అర్హతలు ఉంటేనే అఫ్లియేషన్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని అధికా రులను ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం. -
టాప్ కాలేజీల్లో ఇంజనీరింగ్ సీట్ల పరిమితి ఎత్తివేత!
సాక్షి, హైదరాబాద్: అత్యుత్తమ ప్రతిభగల ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్థుల ప్రవేశానికి పరిమితి ఎత్తివేయబోతున్నారు. ఇందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ మేరకు ముసాయిదా ప్రతిని రూపొందించింది. దీన్ని రాష్ట్రాల ఉన్నతవిద్యా మండళ్లకు పంపింది. వచ్చే ఏడాది (2024) నుంచి దీన్ని అమల్లోకి తేవాలని భావిస్తోంది. బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ), బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) కోర్సుల విషయంలోనూ ఈ విధానాన్ని అనుసరించాలని ప్రతిపాదించింది. ఇటీవల విడుదల చేసిన హ్యాండ్‌బుక్‌లోనూ ఏఐసీటీఈ దీన్ని ప్రస్తావించింది. ముసాయిదా ప్రతిని సమీక్షించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి సిద్ధమవుతోంది. యూనివర్సిటీల వీసీలు, మండలి ఉన్నతాధికారులు ఈ అంశంపై చర్చించేందుకు సమావేశమవుతున్నారు. రాష్ట్రంలో పది కాలేజీలకు అవకాశం.. రాష్ట్రంలో 174 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా అటానమస్ కాలేజీలను కలుపుకొని 100 కాలేజీలకు ‘న్యాక్’అక్రెడిటేషన్ ఉంది. వాటిల్లో అత్యుత్తమ ప్రమాణాలు కనబరిచే కాలేజీల జాబితాను గుర్తించాల్సి ఉంటుంది. దీనికోసం ఎక్స్పర్ట్ విజిటింగ్ కమిటీ (ఈవీసీ)ని మండలి నియమించాల్సి ఉంటుంది. ఇందులో ఏఐసీటీఈ, రాష్ట్ర ఉన్నత విద్యామండలి, అనుబంధ గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీల సభ్యులు ఉంటారు. విద్యార్థుల హాజరు శాతం, ఏటా కౌన్సెలింగ్‌లో ఏ కాలేజీకి ఎందరు దరఖాస్తు చేస్తున్నారు? ఏయే కోర్సులను డిమాండ్ చేస్తున్నారు? ఆయా కోర్సుల్లో చేరేవారి పురోగతి ఎలా ఉంది? కాలేజీలో చేరిన విద్యార్థుల మార్కుల వివరాలను పరిశీలించాల్సి ఉంటుంది. విద్యార్థులు ఉపాధి పొందిన తీరు, లభించిన వార్షిక వేతనం వంటి అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఇలా రాష్ట్రంలో అన్ని అర్హతలు ఉన్న కాలేజీలు 10 వరకూ ఉంటాయని మండలి వర్గాలు చెబుతున్నాయి. అయితే కంప్యూటర్ కోర్సులకు డిమాండ్ పెరిగాక సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి సంప్రదాయ కోర్సుల్లో ప్రవేశాలు తగ్గాయి. దీన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారా? అనే విషయమై ఏఐసీటీఈ స్పష్టత ఇవ్వలేదు. కాలేజీల్లో ఉండే మౌలికవసతులను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పినా, దానిపైనా స్పష్టత ఇవ్వలేదని అధికారులు అంటున్నారు. సీట్లు పెరిగేనా? ప్రస్తుతం ప్రతి కాలేజీలోని ఒక్కో బ్రాంచిలో గరిష్టంగా 4 సెక్షన్లనే అనుమతిస్తున్నారు. ఒక్కో సెక్షన్లో 60 సీట్ల చొప్పున మొత్తం 240 సీట్లు ఉంటున్నాయి. అయితే నాలుగు సెక్షన్లు ఉన్న కాలేజీలు పదుల సంఖ్యలోనే ఉన్నాయి. వాటిల్లోనూ ఎక్కువగా సీఎస్ఈ, కొత్తగా వచి్చన కంప్యూటర్ కోర్సులే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పరిమితి ఎత్తేసినా కొత్తగా సీట్లు పెరుగుతాయా? అనే సందేహాలు కూడా ఉన్నాయి. కొత్త విధానం వల్ల యూనివర్సిటీల అనుబంధ గుర్తింపు తీసుకోవాల్సిన అవసరం ఉండదని అధికారులు అంటున్నారు. విస్తృత చర్చ చేపడతాం.. ఏఐసీటీఈ ముసా యిదా ప్రతిపై త్వరలో ఉన్నతస్థాయి చర్చ చేపడతాం. ఏఐసీటీఈ ప్రతిపాదనలు రాష్ట్రంలో అమలు చేయగలమా లేదా? అనేది పరిశీలించాల్సి ఉంది. వీసీలు, నిపుణుల అభిప్రాయాలు తీసుకున్నాక దీనిపై ఏఐసీటీఈకి అభిప్రాయం తెలియజేస్తాం. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
ఏపీలో ఇంజినీరింగ్‌లో ప్రత్యేక దశ ప్రవేశాలు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ముగిసిన ఎంసెట్–23 ప్రవేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంసెట్–2023 ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ముగిసింది. బీటెక్ ఫస్టియర్ అడ్మిషన్లకు సంబంధించి ప్రస్తుత విద్యాసంవత్సరంలో వివిధ కాలేజీల్లో 16,296 ఇంజనీరింగ్ సీట్లు మిగిలాయి. ఇవి ఖాళీగా ఉన్నట్టే లెక్క. అడపాదడపా స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా కాలేజీలే సీట్లు నింపుకునే అవకాశముంది. ఇలా నిండేవి స్పల్పంగానే ఉంటాయి. ♦ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్(సీఎస్ఈ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) కోర్సుల్లో 5,723 సీట్లు, ఎల్రక్టానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ బ్రాంచ్‌ల్లో 4,959, సివిల్, మెకానికల్ బ్రాంచ్‌ల్లో 5,156, ఇతర బ్రాంచ్‌ల్లో మరో 458 సీట్లకు అడ్మిషన్లు జరగలేదు. ♦ రాష్ట్రంలో 178 కాలేజీల్లో మొత్తం 85,671 బీటెక్ సీట్లుండగా, వీటిలో 69,375 సీట్లు (80.97శాతం) భర్తీ అయ్యాయి. ♦ యాజమాన్యాల వారీగా మిగిలిన సీట్లను పరిశీలిస్తే.. ప్రైవేట్ కాలేజీల్లో 14,511 సీట్లు, 289 ప్రైవేట్ యూనివర్సిటీల్లో 289, యూనివర్సిటీ కాలేజీల్లో 1,496 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 29లోగా ఫీజు చెల్లించాలి ఎంసెట్–23 స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ సీట్లను అధికారులు గురువారం కేటాయించారు. ఈ సీట్లు పొందిన వారు ఈనెల 29లోపు ఫీజు చెల్లించి, ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని అధికారులు సూచించారు. విద్యార్థులు టీసీతో పాటు ఒరిజినల్ సరి్టఫికెట్లు కాలేజీలో సమర్పించాల్సి ఉంటుందన్నారు. -
అదనంగా 1,410 ఇంజనీరింగ్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ విద్యాసంవత్సరం నుంచే మరో 1,410 ఇంజనీరింగ్ సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. ఆఖరి నిమిషంలో ఈ సీట్ల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఎంసెట్ ప్రత్యేక కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా మార్చారు. ♦ మహబూబాబాద్, ఖమ్మం జిల్లా పాలేరులో కొత్తగా రెండు ఇంజనీరింగ్ కాలేజీలకు ప్రభుత్వం అనుమతించింది. ఇవి జేఎన్టీయూహెచ్ పరిధిలో నడుస్తాయి. వాస్తవానికి ఈ రెండు కాలేజీల్లో ఒక్కోదాంట్లో 300 వరకూ సీట్లు మంజూరయ్యాయి. ఈ ఏడాది మాత్రం సీఎస్ఈ, ఈసీఈ, సీఎస్ఈ–ఎంఎల్ కోర్సులు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. ఒక్కో బ్రాంచ్‌లో 60 చొప్పున, ఒక్కో కాలేజీలో 180 సీట్లు అందుబాటులోకి వస్తాయి. రెండు కాలేజీల్లో కలిపి 360 సీట్లు ఉంటాయి. ♦ ఘట్కేసర్లోని కొమ్మూరు ప్రతాప్‌రెడ్డి ఎంబీఏ కాలేజీకి కూడా ఇంజనీరింగ్ కోర్సులకు ప్రభుత్వం అనుమతించింది. దీంతో ఈ కాలేజీలో ఆరు బ్రాంచ్‌లకు కలిపి 360 సీట్లు అదనంగా వస్తాయి. ♦ హైదరాబాద్‌లోని టీఆర్ఆర్ పాలిటెక్నిక్ కాలేజీని అప్‌గ్రేడ్ చేశారు. దీంతో 300 సీట్లు అదనంగా రాబోతున్నాయి. ♦ ఇవి కాకుండా మరో మూడుకాలేజీలకు అదనంగా సీట్లు ఇవ్వడానికి అనుమతి లభించింది. దీనికి జేఎన్టీయూహెచ్ అనుబంధ గుర్తింపు రావాల్సి ఉంది. ♦ ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. అన్నీ కలిపి 1,410 సీట్లు అదనంగా రాబోతున్నాయని ఉన్నత విద్యామండలి పేర్కొంది. పెరిగిన సీట్లూ కంప్యూటర్ కోర్సుల్లోనే కొత్తగా పెరిగే 1,410 సీట్లల్లో ఎక్కువగా కంప్యూటర్ కోర్సులే ఉన్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 83,766 సీట్లు కన్వీనర్ కోటా కింద ఉంటే, 58 వేల వరకూ కంప్యూటర్ సంబంధిత బ్రాంచ్‌ల్లోనే ఉన్నాయి. మూడు విడతలుగా సీట్ల భర్తీ చేపట్టినా, ఇంకా 3,034 సీట్లు కంప్యూటర్ కోర్సుల్లో మిగిలాయి. తాజాగా మరో 900 వరకూ కొత్త సీట్లు కలుపుకుంటే, దాదాపు 4 వేల సీట్లు మిగిలే అవకాశం ఉంది. ప్రత్యేక కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇలా.. ఆఖరిదశలో అనుమతులు, కొత్త సీట్లు రావడంతో వాటి భర్తీకి ప్రత్యేక కౌన్సెలింగ్ తేదీలు మార్చారు. వాస్తవానికి ఈ నెల 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ మొదలు పెట్టి, 23న సీట్ల కేటాయింపు చేపట్టాలని భావించారు. ఈ తేదీల్లో మార్పులు చేస్తూ సాంకేతిక విద్యా శాఖ కొత్త షెడ్యూల్ ఇచ్చింది. 18వ తేదీ స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ (కొత్తవారు) 17–22 తేదీల్లో ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు 26న సీట్ల కేటాయింపు 26–28 తేదీల్లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ 27–29 తేదీల్లో కాలేజీలో రిపోరి్టంగ్ -
19 వేల సీట్లకు 17 నుంచి కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ సీట్లు ఇంకా 19,049 మిగిలాయి. ఆదివారం మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ లెక్క తేలినట్టు సాంకేతిక విద్య విభాగం వెల్లడించింది. ఇందులో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సీట్లు 3,034 వరకూ ఉన్నాయి. ఈసారి సంప్రదాయ కోర్సులైన సివిల్, మెకానికల్ సీట్లను అన్ని కాలేజీలు ముందే భారీగా తగ్గించుకున్నాయి. ఈ బ్రాంచీల్లో మొత్తం 7 వేల సీట్లకు కోత పడింది. ఈ మేరకు కంప్యూటర్ సైన్స్ దాని అనుబంధ కోర్సుల్లో సీట్లు పెరిగాయి. ఇవి కాకుండా మరో 7 వేల వరకూ కొత్తగా కంప్యూటర్ సైన్స్ సంబంధిత బ్రాంచీల్లో సీట్లు పెరిగాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కన్వినర్ కోటా కింద 83,766 ఇంజనీరింగ్ సీట్లు ఉంటే, ఇందులో కంప్యూటర్ సైన్స్ కోర్సులే 56,811 ఉన్నాయి. ఈ విధంగా కంప్యూటర్ బ్రాంచీల్లో సీట్లు పెరగడంతో టాప్ 20 కాలేజీల్లో సీట్లు వంద శాతం భర్తీ అయ్యాయి. అంతగా పేరులేని, గ్రామీణ ప్రాంతాలకు చేరువలో ఉండే కాలేజీల్లో మాత్రం కంప్యూటర్ కోర్సుల్లో కూడా సీట్లు మిగిలిపోయాయి. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రాకల్స్, సివిల్, మెకానికల్ బ్రాంచీల్లో సీట్లు తక్కువే (కాలేజీలు తగ్గించుకోవడం వల్ల) ఉన్నప్పటికీ, చివరకు వాటిల్లోనూ భారీగా సీట్లు మిగిలాయి. ఇలా మిగిలిపోయిన సీట్లకు ఈ నెల 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. -
నేడు తుది దశ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కన్వినర్ కోటా కింద తుదిదశ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు బుధవారం జరగనుంది. ఈ విడతలో వివిధ బ్రాంచీలకు చెందిన 19 వేల సీట్లను కేటాయించాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కన్వినర్ కోటా కింద 82,666 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉండగా తొలి విడతలో 70,665 మందికి సీట్లు కేటాయించారు. తొలి విడత కౌన్సెలింగ్‌లో మిగిలిన 12,013 సీట్లతోపాటు ఆ విడతలో సీట్లు లభించినా రిపోర్టు చేయకపోవడంతో మిగిలిపోయిన 18 వేల సీట్లను కలిపి రెండో దశలో 30 వేలకుపైగా సీట్లు కేటాయించారు. రెండో దశలోనూ 12 వేల సీట్లు మిగిలిపోయాయి. ఆ విడతలో సీట్లు లభించినా 7 వేల మంది చేరలేదు. దీంతో తుది విడత కౌన్సెలింగ్‌లో 19 వేల వరకూ సీట్లు కేటాయించనున్నారు. 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ తుది విడత సీట్లు కేటాయించిన అభ్యర్థులు ఈ నెల 10 నుంచి 12లోగా సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాలి. లేకుంటే సీటు రద్దవుతుంది. ఇందులో మిగిలిపోయిన సీట్లకు ఈ నెల 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ జరగనుంది. ఎన్ఐటీ, ఐఐటీ సీట్ల కేటాయింపునకు సంబంధించిన జోసా కౌన్సెలింగ్ కూడా పూర్తవ్వడంతో వాటిల్లో సీట్లు పొందని వారికి ఇది ఉపయోగపడుతుంది. స్పెషల్ కౌన్సెలింగ్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తవ్వగానే ఈ నెల 23న సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇందులో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 25లోగా కాలేజీల్లో నేరుగా రిపోర్టు చేసి సీటు దక్కించుకోవాలి. ఒక కాలేజీలో తుది విడత కౌన్సెలింగ్‌లో ఏదైనా బ్రాంచీలో సీటు వచ్చి ప్రత్యేక కౌన్సెలింగ్‌లో వేరొక బ్రాంచీలో సీటు వస్తే కేటాయింపు పత్రాన్ని సమర్పించి సీటు మార్పిడి చేసుకోవాలి. వేరొక కాలేజీలో సీటు వచి్చన పక్షంలో అంతకుముందు రిపోర్టు చేసిన కాలేజీలో టీసీ, ఇతర సరి్టఫికెట్లను ఈ నెల 25లోగా తీసుకొని ప్రత్యేక కౌన్సెలింగ్‌లో సీటు వచ్చిన కాలేజీలో రిపోర్టు చేయాలి. యాజమాన్య కోటా సీట్ల పరిశీలన ఎంసెట్ కౌన్సెలింగ్ తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో యాజమాన్య కోటా సీట్ల కేటాయింపుపై ఉన్నత విద్యామండలి దృష్టి పెట్టింది. ప్రత్యేక కౌన్సెలింగ్ పూర్తయ్యేలోగా ప్రైవేటు కాలేజీలు యాజమాన్య కోటా సీట్ల భర్తీ వివరాలను పంపాలని అధికారులు కోరుతున్నారు. ప్రతి కాలేజీలోనూ 30 శాతం యాజమాన్య కోటా ఉంటుంది. ఇందులో 15 శాతం ఎన్ఆర్ఐ సిఫార్సులకు సీట్లు ఇస్తారు. మిగిలిన 15 శాతం సీట్లను నిబంధనల ప్రకారం భర్తీ చేయాలి. జేఈఈ, ఎంసెట్ ర్యాంకులను, ఇంటర్లో వచి్చన మార్కులను ప్రాతిపదికగా తీసుకోవాలి. ఈ రూల్స్ ఎంతమేర పాటించారనేది అధికారులు పరిశీలిస్తారు. -
సీటు రద్దు చేసుకుంటే ఫీజు వాపస్
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యా సంస్థల్లో చేరిన విద్యార్థులు సీటు రద్దు చేసుకున్నప్పుడు అప్పటికే చెల్లించిన వార్షిక ట్యూషన్ ఫీజును తిరిగి ఇవ్వాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) స్పష్టం చేసింది. ప్రాసెసింగ్ ఫీజు రూ.1,000 మాత్రం సంబంధిత సంస్థలు తీసుకోవచ్చని తెలిపింది. సీటు రద్దు చేసుకునే సమయాన్ని బట్టి ట్యూషన్ ఫీజు చెల్లింపు ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు మార్గదర్శకాలతో కూడిన ఫీజు రిఫండ్ పాలసీని యూజీసీ విడుదల చేసింది. అన్ని కౌన్సెలింగ్‌లు ముగిసి, అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన తేదీని కటాఫ్‌గా నిర్థారించింది. చెల్లింపు ప్రక్రియను ఐదు కేటగిరీలుగా విభజించింది. ఈ పాలసీని ఈ ఏడాది నుంచే ముందుకు తీసుకెళ్ళాలని అన్ని రాష్ట్రాల ఉన్నత విద్యా మండళ్ళకు సూచించింది. ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ (ఎఫ్ఆర్సీ) నిర్ణయించిన మేరకు ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఒక్కో కాలేజీలో ఒక్కో విధంగా ఉంటుంది. కొన్ని కాలేజీల్లో ఇది లక్షల్లో ఉంది. ప్రైవేటు కాలేజీల వేధింపుల నేపథ్యంలోనే... సీటు వచ్చిన తర్వాత విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ సమయంలో రూ.1,000 చెల్లిస్తారు. సీటు ఖరారైనప్పుడు కాలేజీకి మొత్తం ట్యూషన్ ఫీజు చెల్లించడంతో పాటు సర్టిఫికెట్లు ఇస్తారు. అయితే కొన్నిసార్లు విద్యార్థులకు ఇతర అవకాశాలు వస్తాయి. అప్పుడు అప్పటికే చేరిన కాలేజీలో సీటు వదిలేస్తారు. ఇలాంటి సందర్భాల్లో కాలేజీలు విద్యార్థుల సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వకుండా, చెల్లించిన ఫీజు రీఫండ్ చేయకుండా వేధిస్తున్నట్టు ఫిర్యాదులున్నాయి. వీటిపై యూజీసి గత నెల 27న నిర్వహించిన సమావేశంలో చర్చించింది. ఈ అంశంపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఇది కేవలం మొదటి సంవత్సరం విద్యార్థులకే పరిమితమవుతుందా? ఏ సంవత్సరంలో సీటు వదులుకున్నా వర్తిస్తుందా? అనే దానిపై యూజీసి స్పష్టత ఇవ్వలేదు. అడ్మిషన్ల ప్రక్రియ చివరి తేదీని కటాఫ్‌గా నిర్ణయించడం వల్ల కేవలం మొదటి సంవత్సరం విద్యార్థులకే ఇది పరిమితమని ప్రైవేటు కాలేజీలు అంటున్నాయి. ఐదు కేటగిరీలుగా.. ఈ సంవత్సరం అన్ని రాష్ట్రాల్లోనూ అడ్మిషన్ల ప్రక్రియను అక్టోబర్ 31లోగా పూర్తి చేయాలని యూజీసీ సూచిస్తోంది. ఈ తేదీకి ముందు, ఆ తర్వాత సీటు రద్దు చేసుకునే విద్యార్థులను వివిధ కేటగిరీలుగా విభజించారు. – అక్టోబర్ 31కి 15 రోజలు కంటే ముందే సీటు రద్దు చేసుకుంటే 100 శాతం ట్యూషన్ ఫీజును తిరిగి చెల్లించాలి. – ప్రవేశాల నోటిఫికేషన్ ఇచ్చిన తేదీకి ముందు 15 రోజుల్లో సీటు రద్దు చేసుకుంటే 90 శాతం ఫీజు తిరిగి ఇవ్వాలి. – అడ్మిషన్ల ముగింపు తేదీ తర్వాత 15 రోజుల్లో ఎప్పుడు సీటు రద్దు చేసుకున్నా 80 శాతం ఫీజు తిరిగి ఇవ్వాలి. – అడ్మిషన్ తేదీ ముగిసిన 15 నుంచి నెల రోజుల్లో సీటు వద్దనుకునే విద్యార్థులకు 50 శాతం ఫీజు వాపసు ఇవ్వాలి. ఆ తర్వాత సీటు వద్దనుకునే వారికి చెల్లించిన ఫీజు ఏమాత్రం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. స్పష్టత కొరవడిన యూజీసీ ఆదేశాలు ఫీజు వాపసు ఇచ్చేందుకు యూజీసీ ఇచ్చిన ఆదేశాలు మరింత స్పష్టంగా ఉంటే బాగుండేది. మార్గదర్శకాలు మొదటి సంవత్సరం విద్యార్థులకే సంబంధించినవిగా కన్పిస్తున్నాయి. అలా కాకుండా కోర్సు పూర్తయ్యే వరకూ వర్తిస్తుందనే విషయాన్ని స్పష్టం చేసి ఉంటే విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. – డాక్టర్ వి.బాలకృష్ణారెడ్డి (రాష్ట్ర సాంకేతిక, వృత్తి విద్యా సంస్థల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు) -
‘బీ’టెక్ బేరం షురూ!
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ఫలితాలు ప్రకటించి, కౌన్సెలింగ్ తేదీలు వెల్లడించిన తర్వాత ఇంజనీరింగ్ సీట్ల కోసం పోటీ ఎక్కువైంది. ప్రైవేటు కాలేజీలు బీ కేటగిరీ (యాజమాన్య కోటా) సీట్ల భర్తీకి ఇప్పటికే ద్వారాలు తెరిచాయి. బేరసారాల కోసం ఆయా కాలేజీలు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశాయి. తల్లిదండ్రులూ ప్రముఖ కాలేజీల వద్ద బారులు తీరుతున్నారు. మధ్యస్థంగా ఉండే కాలేజీలు డిమాండ్ సృష్టించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాయి. కన్సల్టెన్సీలు, పీఆర్వోల ద్వారా విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఎంసెట్‌లో 50 వేలు ర్యాంకు దాటిన విద్యార్థులు మంచి కాలేజీలో కోరుకున్న సీటు రాదని భావిస్తున్నారు. దీంతో యాజమాన్య కోటాలో సీటు తెచ్చుకునేందుకు ముందుకొస్తున్నారు. హైదరాబాద్‌లోని మూడు ప్రముఖ కాలేజీల్లో రోజూ 20 మంది వరకూ కళాశాల ప్రతినిధులతో బేరసారాలు ఆడుతున్నారు. ఈ కేటగిరీలో ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఉన్నతాధికారులు ఉంటున్నారు. వాస్తవానికి కన్వినర్ కోటా సీట్ల భర్తీ తర్వాతే యాజమాన్య కోటా సీట్ల భర్తీ ఉంటుంది. కానీ కాలేజీలు అనధికారికంగా ముందే బేరం కుదుర్చుకుంటున్నాయి. నిబంధనలకు పాతరేస్తున్నా అధికారులు మాత్రం ఇవేవీ తమ దృష్టికి రావడం లేదని చెబుతున్నారు. రూ.లక్షల్లో బేరం రాష్ట్రంలో దాదాపు 176 ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. ఇందులో 145 ప్రైవేటు కాలేజీలే. 71 వేల ఇంజనీరింగ్ సీట్లు కన్వినర్ కోటా కింద, 30 వేల సీట్లు యాజమాన్య కోటా కింద ఉంటాయి. ఇందులో సగం సీట్లను జేఈఈ ర్యాంకులు, ఎంసెట్ ర్యాంకులు, ఇంటర్ మార్కుల మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలి. ప్రభుత్వం నిర్ణయించిన వార్షిక రుసుం తీసుకోవాలి. కాకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ ఉండదు. మిగిలిన సగం సీట్లను ప్రవాస భారతీయుల పిల్లలకు, ఎన్ఆర్ఐలు స్పాన్సర్ చేసే వారికి ఇవ్వాలి. ఈ సీట్లకు ఎక్కువ ఫీజు వసూలు చేయొచ్చు. అందుకే ముందుగానే అనధికారికంగా డొనేషన్ల రూపంలో తీసుకుంటున్నాయి. ఒక్కో సీటుకు రూ. 8 నుంచి 12 లక్షల వరకూ డిమాండ్ చేస్తున్నాయి. ఎన్ఆర్ఐ కోటా సీట్లకు ఫీజులతో కలిపి రూ.20 లక్షల వరకూ డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. బేరం కుదిరితే ఇప్పుడే సగం కట్టాలని షరతు పెడుతున్నట్లు సమాచారం. కంప్యూటర్ సైన్స్ హాట్ కేక్ యాజమాన్య కోటా కింద సీట్లు ఆశిస్తున్న విద్యార్థులు ఎక్కువగా కంప్యూటర్, అనుబంధ బ్రాంచ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులను అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో కాలేజీలు సీఎస్సీ సీటుకు వార్షిక ఫీజుకు అదనంగా రూ.8–10 లక్షలు అడుగుతున్నాయి. మెషీన్ లెర్నింగ్, డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కోర్సులైతే రూ.12 లక్షల వరకూ డిమాండ్ చేస్తున్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల్లో కన్వినర్ కోటా కిందే సీట్లు భర్తీ కావడం లేదు. కాబట్టి ఎంసెట్‌లో లక్షల్లో ర్యాంకు వచ్చిన వాళ్లు, క్వాలిఫై కాని వాళ్లే ఈ సీట్లను ఆశిస్తున్నారు. ప్రముఖ కాలేజీలైతే రూ. 2 లక్షల వరకూ అదనంగా డిమాండ్ చేస్తున్నాయి. నోటిఫికేషన్ ఇచ్చాకే భర్తీ చేయాలి యాజమాన్య కోటా సీట్లయినా నిబంధనల ప్రకారమే భర్తీ చేయాలి. ఈ విషయంలో మండలి సీరియస్‌గా ఉంది. బీ కేటగిరీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మెరిట్ పద్ధతి పాటించాల్సిందే. అందుకు విరుద్ధంగా డబ్బులు తీసుకుని సీట్లు అమ్ముకున్నట్టు ఫిర్యాదులొస్తే విచారణ జరిపిస్తాం. ఏ విద్యార్థికి అన్యాయం జరిగినా ఊరు కోం. తల్లిదండ్రులు కూడా నోటిఫికేషన్ రాకుండా యాజమాన్య కోటా సీట్లు ఆశించడం సరికాదు. - ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి (ఉన్నత విద్య మండలి ఛైర్మన్) -
ఇంజనీరింగ్ సీటు కోసం అన్వేషణ షురూ!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షలు వచ్చే నెల మొదటి వారంలో ముగుస్తాయి. ఆ తర్వాత విద్యార్థులు ఎంసెట్‌పై దృష్టి పెడతారు. ఎంసెట్ కూడా మే రెండో వారంతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులు ఇంజనీరింగ్ కాలేజీల కోసం వెతుకులాట మొదలు పెడుతున్నారు. ఏ కాలేజీలో ఏ కోర్సులున్నాయి? ఎంసెట్ ర్యాంకు ఎంత వస్తే ఏ కాలేజీలో సీటు వస్తుంది? ఏయే కోర్సులకు డిమాండ్ ఉంది? నచ్చిన కోర్సు ఎక్కడ బాగుంటుంది? ఇలా అనేక అంశాలపై తల్లిదండ్రలు వాకబు చేస్తున్నారు. వీళ్ళంతా ప్రధానంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కాలేజీలపైనే దృష్టి పెడుతున్నారు. వీటితో పాటు డీమ్డ్ యూనివర్శిటీల వివరాలూ సేకరిస్తున్నారు. ఎంసెట్ ర్యాంకుపై ఆశల్లేని వాళ్ళు ముందే సీటు ఖాయం చేసుకోవాలనే ఆతృతలో ఉన్నారు. మేనేజ్మెంట్ కోటా సీటు గురించి వాకబు చేస్తున్నారు. ఎంసెట్‌లో మంచి ర్యాంకు వస్తుందని ఆశించే విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం గత కొన్నేళ్ళ కౌన్సిలింగ్ వివరాలను బట్టి అంచనాల్లో మునిగి తేలుతున్నారు. ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిడిక్టర్ కోసం ఇక్కడ చూడండి. కాలేజీల్లోనూ హడావిడి.. సీట్ల వివరాల కోసం వస్తున్న వారికి ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎలాంటి సంప్రదింపులూ జరపకపోయినా, వారి వివరాలను నమోదు చేసుకుంటున్నారు. ఎంసెట్ పరీక్ష పూర్తయిన తర్వాత కాలేజీ నుంచి ఫోన్ కాల్ వస్తుందని, మేనేజ్మెంట్ సీటు విషయంలో అప్పుడు సంప్రదించవచ్చని కాలేజీ సిబ్బంది చెబుతున్నారు. కంప్యూటర్ సైన్స్ కోర్సులను కావాలనుకునే వాళ్ళు ముందే వాకబు చేస్తున్నారని, వీరంతా మేనేజ్మెంట్ కోటా సీట్లను ఆశిస్తున్నవారేనని నిజాంపేట ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ నిర్వాహకులు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వచ్చిన సంజయ్ తన కూతురుకు 20 వేల లోపు ఎంసెట్ ర్యాంకు వస్తుందనే విశ్వాసం వెలిబుచ్చాడు. అయితే డేటా సైన్స్ ఆశిస్తున్నామని, టాప్ టెన్ కాలేజీల్లో సీటు వచ్చే పరిస్థితి లేదని తెలిపాడు. అందుకే మేనేజ్మెంట్ కోటా సీటును ముందే మాట్లాడుకుంటే కొంతైనా తగ్గుతుందని ప్రయత్నిస్తున్నట్టు తెలిపాడు. ఈ పరిస్థితిని గమనించిన కాలేజీలు ఎంసెట్ పూర్తవ్వగానే సంప్రదింపుల పేరుతో బేరసారాలు చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాయి. డీమ్డ్ వర్సిటీల్లో మొదలైన ప్రవేశాల ప్రక్రియ ప్రైవేటు డీమ్డ్ వర్సిటీలు ఇప్పటికే ప్రవేశాల ప్రక్రియను మొదలు పెట్టాయి. వేర్వేరుగా సెట్స్ నిర్వహణ తేదీలను ప్రకటించాయి. మంచి ర్యాంకు వస్తే ఫీజు రాయితీ ఇస్తామని విద్యార్థులకు వల వేస్తున్నాయి. భారీ ఫీజులుండే ఈ వర్సిటీల్లో సీట్లు నింపుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాయి. ప్రత్యేకంగా పీఆర్వోలను, ఏజెంట్లను కూడా నియమించాయి. ఇంటర్ కాలేజీలకు వెళ్ళి తమ ప్రవేశ పరీక్ష, కోర్సుల వివరాలు, వాళ్ళిచ్చే సదుపాయాలతో విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నాయి. ముందస్తు ప్రవేశాలు అనుమతించబోమని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా, తల్లిదండ్రుల ఆతృతను గుర్తించి, తెరచాటు బేరసారాలు చేసే విషయంలో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా పలు మార్గాలను అన్వేషిస్తున్నాయి. -
AP: బీటెక్ సీటు హాట్ కేకు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లు హాట్‌కేకుల్లా భర్తీ అవుతున్నాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా రాష్ట్రంలోని కాలేజీల్లో చదవడానికి ఇంజనీరింగ్ విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఏపీ ఈఏపీ సెట్–2022 అడ్మిషన్ల కౌన్సెలింగ్ (ఎంపీసీ స్ట్రీమ్)లో గురువారం తొలి విడత సీట్ల కేటాయింపులో 82% సీట్లు భర్తీ అయ్యాయి. కన్వీనర్ కోటా ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపులో ఇదో రికార్డు. గత ఏడాదిలో కూడా తొలి విడతలోనే 75 శాతానికి పైగా భర్తీ అయ్యాయి. ఇప్పుడు మరిన్ని ఎక్కువ సీట్లు భర్తీ అయ్యాయి. జగన్ సీఎం అయిన తర్వాత కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన విద్యార్థులందరికీ ప్రభుత్వమే జగనన్న విద్యా దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తుంది. దీంతోపాటు జగనన్న వసతి దీవెన కింద ఏడాదికి రూ.20 వేలు చెల్లిస్తుంది. ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రమాణాలు మెరుగుపరుస్తోంది. ఏడాది ఇంటర్న్‌షిప్ విధానాన్ని ప్రవేశపెట్టింది. నైపుణ్య శిక్షణ ఇప్పిస్తోంది. ప్రముఖ పరిశ్రలతో కాలేజీలను అనుసంధానిస్తోంది. ఈ చర్యలన్నిటి ఫలితంగా రాష్ట్రంలోని ఇంజనీరింగ్ సీట్లు హాట్ కేకులే అయ్యాయి. రాష్ట్రంలోని 248 ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 1,11,864 సీట్లు ఉన్నాయి. వీటిలో తొలి విడతలోనే 91,249 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 20,615 సీట్లు మిగిలి ఉన్నట్లు అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ సి.నాగరాణి చెప్పారు. ఏపీ ఈఏపీ సెట్లో 1,73,572 మంది అర్హత సాధించగా ధ్రువపత్రాల పరిశీలన అనంతరం 1,01,318 మంది వెబ్ ఆప్షన్లకు అర్హత సాధించారు. వీరిలో 99,025 మంది ఆప్షన్లను నమోదుచేశారు. తొలివిడతలో ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీ కాలేజీలు, ప్రైవేటు కాలేజీల్లోని సీట్లను కేటాయించారు. స్పోర్ట్సులో 492, ఎన్సీసీలో 984 సీట్ల కేటాయింపును పెండింగ్‌లో పెట్టారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) నుంచి మెరిట్ జాబితా అందిన అనంతరం ఆ సీట్లు కేటాయిస్తారు. భారీగా కంప్యూటర్ సైన్సు సీట్లు ఇంజనీరింగ్ సీట్లలో కంప్యూటర్ సైన్సు, తత్సంబంధిత సీట్లు అత్యధికంగా భర్తీ అయ్యాయి. ఇంజనీరింగ్ కాలేజీలు కూడా కంప్యూటర్ సైన్సు కోర్సుల్లోనే అత్యధిక శాతం సీట్లకు అనుమతులు తెచ్చుకున్నాయి. గతంలోకన్నా ఈసారి ఎక్కువ సీట్లు ఈ విభాగంలోనే ఉన్నాయి. సీఎస్ఈ, తత్సంబంధిత సీట్లు 41,991 భర్తీ కాగా అందులో సీఎస్ఈ సీట్లు 27,261 ఉన్నాయి. ఆ తరువాత ఈసీఈ, ఈఈఈలో ఎక్కువ సీట్లు భర్తీ అయ్యాయి. తొలివిడతలోనే ఈ సీట్లు దాదాపు పూర్తిగా భర్తీ అయ్యాయి. బాబు హయాంలో సీట్ల భర్తీ అంతంతే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కన్వీనర్ కోటా ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి విద్యార్ధుల నుంచి స్పందన పెద్దగా ఉండేది కాదు. విద్యార్థుల్లో చాలా మంది హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లోని ప్రైవేటు కాలేజీల్లో చేరేందుకే మొగ్గు చూపేవారు. జేఈఈ మెరిట్ విద్యార్థులు ఏపీ ఎంసెట్‌లో టాప్ ర్యాంకులో నిలిచి మంచి కాలేజీలో సీటు వచ్చినా, దానిని వదులుకొని వేరే రాష్ట్రాలకు వలస వెళ్లే వారు. అప్పట్లో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటు కాకుండా కాలేజీ ఫీజు లక్షల్లో ఉన్నా కేవలం రూ.35 వేలు మాత్రమే చెల్లించేది. చంద్రబాబు హయాంలో చివరి దశ కేటాయింపులు పూర్తయ్యాక కూడా కాలేజీల్లో దాదాపు 40 శాతం సీట్లు ఖాళీగా ఉండేవి. 2016లో 58 శాతం, 2017లో 60 శాతం, 2018లో 61 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రభుత్వ చర్యల ఫలితంగా రాష్ట్రంలోని కాలేజీల్లోనే చదవడానికి విద్యార్థులు మొగ్గు చూపిస్తున్నారు. నేడు బీ కేటగిరీ నోటిఫికేషన్ ఇంజనీరింగ్ కాలేజీల్లోని యాజమాన్య కోటా అయిన బీ కేటగిరీ సీట్ల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సీట్ల భర్తీని కాలేజీలో ప్రత్యేక పోర్టల్ ద్వారా ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేపడతాయి. విద్యార్థులు కాలేజీలకు నేరుగా దరఖాస్తు చేయడానికి లేదా ఈ పోర్టల్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులకు అవకాశం కల్పించనున్నారు. ఫార్మసీ సీట్ల భర్తీకి బ్రేకు ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లోనే ఫార్మసీ సీట్లు కూడా భర్తీ చేయాల్సి ఉన్నా వాటికి బ్రేకు పడింది. ఫార్మసీ కాలేజీల సీట్లకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు రాకపోవడంతో వీటి భర్తీని నిలిపివేశారు. అనుమతుల మంజూరు ప్రక్రియ వచ్చే నెలలో పూర్తవుతుందని ఫార్మసీ కౌన్సిల్ ఉన్నత విద్యాశాఖకు తెలిపింది. ఈ ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని ఉన్నత విద్యా మండలి ఫార్మసీ కౌన్సిల్‌కు మరోసారి లేఖ రాసింది. -
కంప్యూటర్ సైన్స్ సీటు కోసం పోటాపోటీ
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 28న మొదలు కానున్న ఇంజనీరింగ్ రెండోవిడత కౌన్సెలింగ్‌లో విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ సీట్లు దక్కించుకునేందుకు ఎక్కువగా పోటీపడుతున్నారు. కన్వీనర్ కోటాతోపాటు మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం ఈసారి విపరీతమైన పోటీ కన్పిస్తోంది. చాలామంది తొలిదశ కౌన్సెలింగ్‌లో సీట్లు వచ్చినా, సీటు, కాలేజీ నచ్చని కారణంగా వదిలేసుకున్నారు. ఇలాంటివాళ్లు 17 వేలమంది వరకూ ఉన్నారు. ఇందులో చాలామంది కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సులను ఇష్టపడుతున్నారు. దీంతో రెండోవిడతలో సీటు వస్తుందనే ఆశతో ఉన్నారు. తాజాగా ప్రభుత్వం కంప్యూటర్ సైన్స్‌సహా పలు అనుబంధ కోర్సుల్లో 9,240 సీట్లకు అనుమతించింది. ఇది కూడా విద్యార్థులు ఆశలు రేకెత్తిస్తోంది. మరోవైపు ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలుకానుంది. ఇందులో సీటు వచ్చేవారు రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో కౌన్సెలింగ్ నుంచి తప్పుకునే అవకాశముంది. ఇది కూడా తమకు కలిసి వస్తుందని పలువురు విద్యార్థులు భావిస్తున్నారు. ఇదే సరైన సమయం... రాష్ట్రంలో తొలివిడత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు మొత్తం 71,286 సీట్లు కన్వీనర్ కోటా కింద సిద్ధంగా ఉండగా, 60,208 సీట్లు కేటాయించారు. విద్యార్థులు ఇచ్చిన ఆప్షన్ల మేరకు ఈ కేటాయింపు జరిగింది. ఈ నెల 13వ తేదీ నాటికి సీటు వచ్చినవారు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటే, కేవలం 43 వేల మంది మాత్రమే రిపోర్టింగ్ చేశారు. 17 వేలమంది సీటు వచ్చినా, అది తమకు నచ్చలేదని భావించారు. ఇలాంటివారిలో ఎక్కువమంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదా ఐటీ, ఆఖరుకు ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో సీట్లు ఆశపడుతున్నవారే ఉన్నారు. తొలిదశలో పెంచిన కంప్యూటర్ సైన్స్ కోర్సు సీట్లు 9,240 అందుబాటులోకి రాలేదు. అందుకే తమకు ఆశించిన సీటు రాలేదనే భావనతో వారు ఉన్నారు. 25 వేలలోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులు కూడా మెరుగైన కాలేజీ, సీటు కోసం తొలిదశలో వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టారు. కొంతమంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్(సీఎస్సీ)లో సీటు వచ్చినా, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, డేటా సైన్స్ వంటి కోర్సుల కోసం మొదటి విడతలో జాయిన్ అవ్వలేదు. మేనేజ్మెంట్కు పోటీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ సీట్లలో 30 శాతం మేనేజ్మెంట్ కోటా కింద ఉంటాయి. ఇందులో 15 శాతం ఎన్ఆర్ఐకి ఇవ్వాలి.నిబంధనలు ఎలా ఉన్నా, యాజమాన్యాలు నచ్చినవారికి, నచ్చిన రేటుకు అమ్ముకోవడం ఏటా జరిగే తంతే. కాలేజీని బట్టి కంప్యూటర్‌సైన్స్ సీట్ల రేట్లు రూ.10 నుంచి 16 లక్షల వరకూ పలుకుతున్నాయి. 40 వేలపైన ఎంసెట్ ర్యాంకు వచ్చినవారిలో చాలామంది మేనేజ్మెంట్లో కంప్యూటర్ సైన్స్ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. దీంతో సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, సీఎస్సీ కోర్సులకు డిమాండ్ బాగా కన్పిస్తోంది. ఈసారి ఆప్షన్లు కీలకమే రెండోవిడత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఈ నెల 28 నుంచి మొదలవుతుంది. తొలి విడత కన్నా, ఇది చాలా కీలకమైందని సాంకేతిక రంగం నిపుణులు అంటున్నారు. కొత్తగా 12 వేలకుపైగా సీట్లు పెరగడం, జేఈఈ ర్యాంకర్లు ఈసారి పోటీలో పెద్దగా ఉండకపోవడం వల్ల రాష్ట్రస్థాయి విద్యార్థులకు సానుకూలంగా ఉండే వీలుందని చెబుతున్నారు. 40 వేల లోపు ర్యాంకు విద్యార్థులు ఆచితూచి ఆప్షన్లు ఇచ్చుకోవడం మంచిదని చెబుతున్నారు. దాదాపు 5 వేల లోపు ర్యాంకుల్లో ఉన్న విద్యార్థులు ఎక్కువ మంది ఈసారి పోటీలో ఉండరని, 10 వేల లోపు ర్యాంకు విద్యార్థుల్లో 50 శాతం మాత్రమే ఉండే వీలుందని అంచనా వేస్తున్నారు. కాబట్టి 40 వేలలోపు ర్యాంకు విద్యార్థులు కోరిన కాలేజీ, సీటు కోసం పోటీపడేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు. ఆపై ర్యాంకు విద్యార్థులు కాలేజీ విషయం పక్కన పెట్టినా, కోరుకున్న సీటును ఎక్కడైనా పొందేందుకు ప్రయత్నించి సఫలం కావచ్చని చెబుతున్నారు. -
టార్గెట్ ఐఐటీ.. విద్యార్థుల్లో పెరుగుతున్న ఆసక్తి
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ఇంజనీరింగ్ సీట్లకు పోటీ పడేవారి సంఖ్య కొన్నేళ్ళుగా పెరుగుతోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల విద్యార్థుల్లో ఎక్కువ మంది ఐఐటీల్లో సీటు సాధనే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. ఒక్కోసంవత్సరం ఒక్కో ఐఐటీ జేఈఈ అడ్వాన్స్డ్ నిర్వహిస్తోంది. ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) నిర్వహించే మెయిన్స్‌తో పోలిస్తే పదిరెట్లు కష్టంగా ఉంటుందని విద్యార్థులు భావిస్తుంటారు. అయినా పోటీ పడేవారు, పరీక్షలో అర్హత సంపాదించే వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతుండటం విశేషం. 2007లో జేఈఈ అడ్వాన్స్డ్ రాసిన వారిలో కేవలం 3 శాతం మందే అర్హత సంపాదించగా ఇప్పుడది దాదాపు 30 శాతం వరకు పెరిగిందని జేఈఈ విభాగం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా గడచిన ఆరేళ్ళలో అడ్వాన్స్‌డ్‌లో క్వాలిఫై అయ్యే వారి సంఖ్య మరింత పెరిగింది. ఒక విద్యా సంవత్సరం నష్టపోయినా.. లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని మరీ ఐఐటీ సీటు సాధించాలనే పట్టుదల విద్యార్థుల్లో బలపడుతోంది. జేఈఈలో మంచి ర్యాంకు వచ్చిన ప్రతి విద్యార్థికీ ఎన్ఐటీల్లో సీటు వస్తుందని తెలిసినా, ఐఐటీ సీటు కోసం అడ్వాన్స్డ్ కూడా రాసేందుకు సిద్ధపడుతున్నారు. నిజానికి 15 ఏళ్ళ క్రితం కంటే ఇప్పుడు ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్ల సంఖ్య పెరిగిందని.. ఇదే క్రమంలో అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించే అభ్యర్థులూ పెరుగుతున్నారని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. మారిన విధానంతో ముందుకు.. ఐఐటీలపై విద్యార్థుల ఆసక్తి పెరగడానికి అనేక కారణాలు కన్పిస్తున్నాయి. గతంలో ఐఐటీ–జేఈఈ, జేఈఈ మెయిన్, ఏఐఈఈఈ పేరుతో వేర్వేరుగా ప్రవేశ పరీక్షలుండేవి. అంటే ఐఐటీలకు, నిట్‌కు.. ట్రిపుల్ ఐటీలకు విడివిడిగా పరీక్షలు నిర్వహించి ప్రవేశాలు కల్పించేవారు. ఈ పరీక్షలకు విద్యార్థులు వేర్వేరుగా సన్నద్ధమవ్వాల్సిన పరిస్థితి ఉండేది. 2013 తర్వాత కేంద్రం ఈ విధానాన్ని మార్చింది. ప్రస్తుతం జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్డ్ మాత్రమే ఉన్నాయి. మెయిన్స్‌లో అర్హత సాధించిన వారు, అడ్వాన్స్‌డ్‌కు వెళ్తారు. మెయిన్స్ ర్యాంకుల ఆధారంగా నిట్, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు పొందితే, అడ్వాన్స్డ్ ర్యాంకు ద్వారా ఐఐటీల్లో సీట్లు లభిస్తాయి. ఈ విధానం వచ్చిన తర్వాత తేలికగా సన్నద్ధమయ్యే అవకాశం లభించిందని, అర్హత శాతం గణనీయంగా పెరగడం ప్రారంభం అయ్యిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే గత కొన్నేళ్ళుగా పరీక్ష విధానం, సిలబస్, సన్నద్ధమయ్యే తీరు తేలికగా ఉండి శిక్షకులు, విద్యార్థులు అర్థం చేసుకునే అవకాశం ఏర్పడిందని చెబుతున్నారు. మరోవైపు ఆసక్తి, పట్టుదల కలిగిన విద్యార్థులను అడ్వాన్స్డ్ వరకు తీసుకెళ్లగలిగేలా కోచింగ్ సెంటర్లు, ఆన్లైన్ మెటీరియల్స్ అందుబాటులోకి రావడం మరో కారణమని పేర్కొంటున్నారు. 2012లో 5.02గా ఉన్న అర్హత శాతం 2013లో ఏకంగా 17.96 శాతానికి పెరగడం ఇందుకు నిదర్శనం. కాగా అప్పట్నుంచీ 20 శాతానికి పైగా విద్యార్థులు అర్హత సాధిస్తుండటం గమనార్హం. సాధారణంగా జేఈఈ మెయిన్స్‌కు ఏటా 8 నుంచి 10 లక్షల మంది వరకు హాజరవుతున్నారు. ఇందులో 2.5 లక్షల మంది వరకు అడ్వాన్స్‌డ్‌కు క్వాలిఫై అవుతున్నారు. వీరిలో 50 వేల మంది దాకా ఐఐటీల్లో ప్రవేశానికి అర్హత సాధిస్తున్నారు. -
కసరత్తు చేస్తే... కోరుకున్న సీటు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 21 నుంచి ఎంసెట్ తొలిదశ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలుకానుంది. 1.56 లక్షల మంది ఇంజనీరింగ్ సీట్ల కోసం పోటీపడనున్నారు. 21, 22 తేదీల్లో స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ ఉంటుంది. 23వ తేదీ నుంచి ఆన్లైన్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. కన్వీనర్ కోటా కింద దాదాపు 75 వేల సీట్లు ఉంటే, మరో 35 వేల వరకు మేనేజ్మెంట్ కోటా సీట్లున్నాయి. మొత్తం 1.10 లక్షల సీట్లున్నా, బీటెక్‌లో చేరుతున్నది ఏటా 80 వేల మందే ఉంటున్నారు. 58 శాతం వరకూ కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కొత్త కోర్సులైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి కోర్సుల్లోనే చేరుతున్నారు. ఈసారి డిమాండ్ లేని బ్రాంచీల్లో సీట్లు తగ్గాయి. దీంతో ఆచితూచి ఆప్షన్లు ఇవ్వాలని, గతంలో జరిగిన కౌన్సెలింగ్‌లను అధ్యయనం చేసి తమ ర్యాంకు ఆధారంగా ఒక అంచనాకు రావాలని, అప్పుడు టాప్ కాలేజీ కాకపోయినా కోరుకున్న బ్రాంచి దక్కే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అభ్యర్థులు ఎన్ని ఆప్షన్లయినా పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి చివరి వరకు ఇచ్చే ప్రాధాన్యతలు కీలకంగా మారనున్నాయి. టాప్ ర్యాంకుల్లో ఇలా.. ఆప్షన్లు ఇచ్చే విషయంలో తికమకపడి అస్పష్టతతో ఆప్షన్లు ఇస్తుంటారు. దీంతో కొంతమంది అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంది. మొదటి దశ కౌన్సెలింగ్‌లో 500లోపు ఎంసెట్ ర్యాంకర్లు ఆప్షన్లు ఇస్తారు. వీళ్లల్లో చాలామంది ఆయా కోర్సుల్లో చేరే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్లకు జేఈఈ వంటి ర్యాంకులు కూడా వచ్చి ఉంటాయి. 500–1000 లోపు ర్యాంకులు వచ్చిన విద్యార్థుల్లో 25% వరకే వచ్చిన సీటులో చేరుతుంటారు. అంటే వర్సిటీ క్యాంపస్ కళాశాలల్లోనో, టాప్ ప్రైవేట్ కాలేజీల్లోనో చేరతారు. 1000–1500 ర్యాంకులు వచ్చిన విద్యార్థుల్లో 50% పైగా టాప్ టెన్ కాలేజీల్లో నచ్చిన బ్రాంచిలో చేరే వీలుంది. ఇక 1500 నుంచి 5 వేల ర్యాంకు వరకు వచ్చిన ఓపెన్ కేటగిరీ విద్యార్థులు ఇతర టాప్ కాలేజీ ల్లో కన్వీనర్ కోటా కింద అవకాశం దక్కించు కునే అవకాశం ఉంటుంది. వీరిలో 80% వచ్చిన సీటును వదులుకోవడం లేదు. ఏదో ఒక బ్రాంచిలో ఇష్టం లేకున్నా చేరి తర్వాత కౌన్సెలింగ్‌లో నచ్చిన బ్రాంచి దక్కించుకునే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. 10 వేల ర్యాంకు తర్వాత... విద్యార్థులు డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్ కోర్సు, టాప్ కాలేజీలకే తొలి ఆప్షన్ ఇస్తారు. ఇలాంటప్పుడు 10 వేల పైన ర్యాంకు వచ్చిన వారు కాస్త ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. గత ఐదేళ్ళ ఎంసెట్ కౌన్సెలింగ్‌ను పరిశీలిస్తే... 40 వేల ర్యాంకుపైన వచ్చిన వాళ్లు కూడా టాప్ కాలేజీలకు మొదటి ఆప్షన్ ఇస్తు న్నారు. కొంతమంది పోటీ ఉన్న బ్రాంచికి కాకుండా, సివిల్, మెకానికల్, ఈఈఈ వంటి బ్రాంచిలకు ప్రాధాన్యత ఆప్షన్లుగా ఇస్తున్నారు. పోటీ లేదని, సీటు వస్తుందని భావిస్తారు. 10 వేల ర్యాంకు తర్వాత కూడా సీటు వచ్చే కాలేజీ ల్లో ఆప్షన్లు ఇవ్వడం లేదు. దీంతో వాళ్ల తర్వాత ర్యాంకు వారు ఆ కాలేజీలకు ఆప్షన్లు ఇస్తే వారికి సీటు వెళ్తుంది. వారు చేరితే టాప్ కాలేజీల్లో సీటు రాక తర్వాత కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు ఇచ్చినా ప్రయోజనం ఉండటం లేదు. సరైన అంచనా అవసరం ►ఆప్షన్లు ఇచ్చే ముందు తమకు వచ్చిన ర్యాంకు ప్రకారం గతంలో ఎక్కడ, ఏ కాలేజీలో సీటు వచ్చిందనే దానిపై ప్రాథమిక అంచనాకు రావాలి. వాటిల్లో నచ్చిన బ్రాంచిని ఎంపిక చేసుకునేందుకు మొదటి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ►ఈసారి మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ సీట్లు తగ్గాయి. అయితే పోటీ పెద్దగా ఉండే అవకాశం కన్పించడం లేదు. అంతా కంప్యూటర్ సైన్స్ గ్రూపుల వైపు వెళ్తున్నారు. కాబట్టి డిమాండ్ లేని కోర్సులు కోరుకునే వారు మంచి కాలేజీకి ప్రాధాన్యత ఇవ్వొచ్చు. ►వెయ్యిలోపు ర్యాంకులు వచ్చిన వారికి కౌన్సెలింగ్‌లో వచ్చే సీటు సాధారణంగా మంచి కాలేజీలోనే అయి ఉంటుంది. కాబట్టి కోరుకున్న కాలేజీ, బ్రాంచి.. తర్వాత జరిగే కౌన్సెలింగ్‌లో అయినా దక్కుతుందనే ధీమాతో ఉండొచ్చు. వీళ్ళు తుది దశ కౌన్సెలింగ్ వరకు వేచి చూసి, ఆ తర్వాతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం మంచిది. -
ఐఐటీల్లో మరో 500 సీట్లు!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి సీట్లు పెరిగే అవకాశముంది. గతేడాది (2021–22)లో 16,232 సీట్లు ఉండగా, ఈసారి మరో 500 సీట్లు పెరగవచ్చని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి. జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ(జోసా) కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వెలువడే నాటికి వీటిని జాబితాలో చేరుస్తారని చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఐఐటీలు కొత్త కోర్సుల వైపు అడుగులేస్తున్నాయి. పాఠ్యప్రణాళికలోనూ మార్పులు తెస్తున్నాయి. డిమాండ్ ఉన్న, పారిశ్రామిక అవసరాలు తీర్చగలిగే కోర్సులను విద్యార్థుల ముందుకు తెస్తున్నాయి. ఈ క్రమంలో ఐఐటీలు కొన్ని కొత్త కోర్సులను డిజైన్ చేశాయి. హైదరాబాద్ ఐఐటీలో బీటెక్ బయోటెక్నాలజీ అండ్ బయో ఇన్ఫర్మేటిక్స్, కంప్యూటేషన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ కోర్సులను గతేడాది కొత్తగా అందుబాటులోకి తెచ్చారు. ఈ ఏడాది కూడా మరికొన్ని పరిశోధనాత్మక ప్రాధాన్యం ఉన్న కోర్సుల వైపు అడుగులు వేస్తున్నారు. స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్, మెడికల్ అనుబంధ సాంకేతిక కోర్సుల వైపు ఐఐటీలు మొగ్గు చూపుతున్నాయి. త్వరలో వీటికి అనుమతి వస్తుందని భావిస్తున్నాయి. మరోవైపు ఇతర ప్రాంతాల్లోని ఐఐటీలు కూడా కొత్త కోర్సులను ముందుకు తెస్తున్నాయి. ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక సంస్థలు కూడా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కంప్యూటర్ కోర్సులకు రూపకల్పన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐఐటీల్లోనే ఈసారి 500 సీట్లు పెరిగే అవకాశం ఉంది. -
27న సెల్ఫ్ రిపోర్టింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చివరిదశ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు బుధవారం పూర్తవుతుంది. సీట్లు దక్కే విద్యార్థులు ఈ నెల 27న సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. దీంతో కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తవుతుందని ఉన్నత విద్యామండలి తెలిపింది. ఇప్పటివరకూ రెండు దశలుగా కౌన్సెలింగ్ చేపట్టారు. తొలిదశలో 78,270 సీట్లు అందుబాటులో ఉంటే, ఆప్షన్లు ఇచ్చినంత వరకూ 61,169 సీట్లు కేటాయించారు. అయితే తొలి దశలో 46,322 మంది మాత్రమే సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. రెండో దఫా కౌన్సెలింగ్‌లో 59,993 సీట్లు కేటాయించారు. ఇందులో కొత్తగా అనుమతి వచ్చిన కంప్యూటర్ సైన్స్ గ్రూప్, దాని అనుబంధ కోర్సుల సీట్లు 4 వేలకుపైగా ఉన్నాయి. రెండో దశలో సీట్లు పొందిన వారిలో 53,717 మంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. ఈ దఫా 6,278 సీట్లు మిగిలాయి. మొత్తంగా 26,073 సీట్లు మిగిలాయి. శని, ఆదివారాల్లో ప్రత్యేక రౌండ్ కౌన్సెలింగ్ ఉన్నత విద్యామండలి శని, ఆదివారాల్లో ప్రత్యేక రౌండ్ కౌన్సెలింగ్‌కు అనుమతించింది. ఆఖరి దఫా కౌన్సెలింగ్ కావడంతో దాదాపు 25 వేల మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చారు. రెండోదశలో సీట్లు పొందినవాళ్లు మంచి కోర్సులు, కాలేజీల కోసం ఆప్షన్లు ఇచ్చారు. మూడు దశల్లోనూ కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల సీట్లనే విద్యార్థులు ఎక్కువగా ఎంచుకున్నారు. దీంతో సివిల్ ఇంజనీరింగ్‌లో 3,629, మెకానికల్‌లో 3,980 సీట్లు, ఎలక్ట్రికల్‌లో 3,847 సీట్లు మిగిలాయి. ప్రత్యేక రౌండ్లో ఎక్కువ మంది కంప్యూటర్ కోర్సులను మొదటి ఆప్షన్‌గా పెట్టుకున్నారు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్‌ను పెట్టుకున్నారు. ఈ లెక్కన ఈసారి కూడా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో సీట్లు మిగిలిపోయే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ వివరాలను కాలేజీలు ఈ నెలాఖరులోగా ఉన్నత విద్య మండలికి సమర్పించాల్సి ఉంటుంది. -
26 వేల ఇంజనీరింగ్ సీట్ల మిగులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంకా 26,073 ఇంజనీరింగ్ సీట్లు మిగిలిపోయాయి. వీటి భర్తీకి ఉన్నత విద్యా మండలి ప్రత్యేక కౌన్సెలింగ్ చేపట్టింది. ఆన్లైన్ ద్వారా శని, ఆదివారాల్లో ఆప్షన్లు పెట్టుకునే అవకాశం కల్పించింది. ఈ నెల 24న ఆఖరి విడతగా సీట్లు కేటాయిస్తున్నట్లు సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. దీంతో ఈ ఏడాది ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఈ నెలాఖరు కల్లా ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు దాదాపు 32 వేల మేనేజ్మెంట్ సీట్ల భర్తీ వివరాలను ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఈ నెలాఖరులోగా సమర్పించనున్నాయి. ప్రత్యేక విడతలో కేటాయించే సీట్లకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత ఈ ఏడాది ఎన్ని సీట్లు మిగులుతాయో ఓ అంచనాకు వచ్చే వీలుందని ఎంసెట్ క్యాంప్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 175 ఇంజనీరింగ్ కాలేజీలు ఈసారి కౌన్సెలింగ్‌లో పాల్గొన్నాయి. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి మొత్తం 79,790 సీట్లకు అనుమతించింది. రెండు దశల్లో చేపట్టిన కౌన్సెలింగ్‌లో 59,993 సీట్లు కేటాయించారు. గడువు ముగిసేలోగా 53,717 మంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. దీంతో 6,278 సీట్లు మిగిలిపోయాయి. దీనికి తోడు రెండో విడతలో ఆప్షన్లు ఇవ్వని కారణంగా 19,797 సీట్లు మిగిలాయి. ఇవన్నీ కలిపి మొత్తం 26,073 సీట్లకు ప్రత్యేక రౌండ్ ద్వారా భర్తీ చేయనున్నారు. కాగా, రెండు కౌన్సెలింగ్‌ల్లోనూ విద్యార్థులు కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి కొత్త కోర్సులకే ప్రాధాన్యమిచ్చారు. సివిల్, మెకానికల్ సీట్లపై విద్యార్థులు అనాసక్తి ప్రదర్శించారు. -
కోర్ బ్రాంచ్‌ల డోర్ క్లోజ్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సహా దేశవ్యాప్తంగా గత రెండేళ్లుగా ఇంజనీరింగ్ విద్యలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. కంప్యూటర్ అనుబంధ కోర్సులు పూర్తిగా పైచేయి సాధిస్తు న్నాయి. ఫలితంగా కొన్ని బ్రాంచ్‌ల్లో సీట్లు అనివార్యంగా తగ్గించాల్సి వస్తోంది. భవిష్యత్‌లో అవి పూర్తిగా తెరమరుగయ్యే ప్రమాదం ఉందని సాంకే తిక విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. సామాజిక పరిస్థితుల నేపథ్యమే దీనికి ప్రధాన కారణమనే వాదన విన్పిస్తోంది. తాజా పరిస్థితిపై ఇటీవల అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఓ అధ్యయనం కూడా చేసింది. ఇంజనీరింగ్ విద్య సామాన్యులకు అందుబాటులోకి వచ్చాక, సంప్ర దాయ డిగ్రీ కోర్సుల ప్రాధాన్యత తగ్గింది. అలాగే అన్నింటా సాంకేతికత అవసరంతో సరికొత్త కోర్సుల ప్రాధాన్యత పెరుగుతోంది. ఇది ఆహ్వానిం చదగ్గ పరిణామమే అయినా, మిగతా కోర్సులను రక్షించుకోకపోతే అర్థవంతమైన ఇంజనీరింగ్ విద్య సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు. ఎందుకీ పరిస్థితి?: ప్రపంచవ్యాప్తంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రాజ్యమేలుతోంది. సాంకే తికత లేకుండా ముందుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు మెకానికల్‌కు సీఎస్ఈకి సంబంధం లేకున్నా.. ఏదైనా వాహనాన్ని డిజైన్ చేయాలంటే ముందుగా సాంకేతిక టెక్నాలజీతోనే చేస్తారు. కంప్యూటర్ టెక్నాలజీతోనే దాని సామర్థ్యాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాతే హార్డ్‌వేర్‌తో అవసరం. అలాగే ఎలక్ట్రానిక్స్‌తో రూపొందించే టీవీల తయారీలోనూ అత్యాధునిక ఐవోటీ టెక్నాలజీ కీలకం. సివిల్‌లోనూ ఇదే ధోరణి. నిర్మాణాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ముందుగా వినియో గించాలి. మానవ జీవితంలో అంతర్భాగమైన ఇంటర్నెట్ను గుప్పిట్లో పెట్టుకునేది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్. డేటాసైన్స్ ఉపయోగమూ అంతాఇంతా కాదు. దీంతో కంప్యూటర్ అనుబంధ కోర్సులకు అత్యధిక ప్రాధాన్యం ఏర్పడింది. తాజా ఎంసెట్ కౌన్సెలింగ్‌ను పరిశీలిస్తే 74,071 సీట్లు తొలి విడత భర్తీ చేస్తే అందులో 38,796 కంప్యూటర్, దాని అనుబంధ కొత్త బ్రాంచీల సీట్లే ఉన్నాయి. ప్రైవేటు పంట... కంప్యూటర్ అనుబంధ బ్రాంచ్‌ల్లో సీట్లకు ఉన్న డిమాండ్‌ను ప్రైవేట్ కాలేజీలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఈ కోర్సులకు ఇష్టానుసారంగా డొనేషన్లు దండుకుంటున్నాయి. మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేసే 30 శాతం సీట్లను ఎంసెట్ కౌన్సెలింగ్ మొదలుకాక ముందు నుంచే అమ్మేసుకుంటున్నాయి. ఈ ఏడాది ఒక్కో సీటుకు రూ.10 లక్షలకు పైనే వసూలు చేశాయి. జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ విద్యలో సంస్కరణలు తీసుకొస్తే తప్ప డిమాండ్ తగ్గుతున్న కోర్సుల విషయంలో తామేమీ చేయలేమని రాష్ట్ర ఉన్నతవిద్యా మండలి ఉన్నతాధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. కంప్యూటర్ కోర్సులే కాకుండా, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ కోర్సుల్లో కూడా కంప్యూటర్ టెక్నాలజీతో పాఠ్యప్రణాళిక రావాల్సిన అవసరం ఉందంటున్నారు. ఈ కోర్సులు పూర్తి చేసినా.. తాము అంతిమంగా సాఫ్ట్వేర్ వైపే వెళ్లాలి కదా అనే అభిప్రాయం వాళ్లలో ఉందని చెబుతున్నారు. ఇదే ప్రైవేటు కాలేజీలకు కలిసి వస్తోందని నిపుణులు అంటున్నారు. తెలంగాణలో 2018–19లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ సీట్లు 17,361 ఉంటే 2021 నాటికి అవి 18,614కు చేరాయి. అంటే ఈ రెండేళ్లలోనే 1,253 పెరిగాయి. తాజాగా హైకోర్టు తీర్పుతో మరో 3,500 పెరగబోతున్నాయి. ఎలక్ట్రికల్ కోర్సు (ఈఈఈ)లో సీట్లు 8,667 నుంచి 7,019 (1,648 తక్కువ)కు తగ్గాయి. సివిల్‌లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రెండేళ్ల క్రితం సివిల్ బ్రాంచ్ సీట్లు 8,293 ఉంటే ఇప్పుడు 6,221 (2072)కు తగ్గాయి. మెకానికల్ పరిస్థితి చెప్పుకోలేని స్థాయికి దిగజారింది. ఈ బ్రాంచ్‌లో 2018–19లో 10,104 ఉంటే, ఇప్పుడు 5,881 (4,223) సీట్లున్నాయి. సీఎస్ఈ తర్వాత పాత్ర పోషించే ఎలక్ట్రానిక్స్ (ఈసీఈ)లోనూ 15,415 నుంచి 13,935 (2,210 తక్కువ) సీట్లకు చేరుకున్నాయి. ఏడాది కాలంలోనే కంప్యూటర్ అనుబంధ కోర్సులైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్, ఇంటర్ ఆఫ్ థింగ్స్ బ్రాంచ్‌ల్లో 14,920 మంది కొత్తగా చేరడం విశేషం. కంప్యూటర్ కోర్సులే కాదు.. కోర్ సబ్జెక్టుల ప్రాధాన్యతను పెంచాల్సిన అవసరం ఉంది. జేఎన్టీయూహెచ్తో పాటు దేశవ్యాప్తంగా దీనిపై అధ్యయనం జరుగుతోంది. వ్యవస్థకు కోర్ ఇంజనీరింగ్ ఎప్పుడైనా అవసరం. యంత్రాలున్నంత కాలం సివిల్, మెకానికల్, ఎలక్ట్రిక్ కోర్సుల ప్రాధాన్యత ఉంటుంది. అయితే, వీటిని నేటి తరానికి, ముఖ్యంగా కంప్యూటర్ కోర్సులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిగణనలోనికి తీసుకుని తీర్చిదిద్దాలి. ఈ ప్రయత్నంలో అఖిలభారత సాంకేతిక విద్యా మండలి కూడా దృష్టి పెట్టింది. – లింబాద్రి, రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి చైర్మన్ -
ఇంజనీరింగ్ సీట్ల పంచాయితీ: ర్యాంకున్నా సీటివ్వరేం?
సాక్షి, హైదరాబాద్: అర్హతలున్నా ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ‘బీ’కేటగిరీలో సీట్లివ్వడానికి నిరాకరిస్తున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దర ఖాస్తులను తీసుకునేందుకూ ఇష్టపడటం లేదని, తిరస్కరణకు కారణాలూ చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ర్యాంకు తక్కువొచ్చిన వారికి సీటు ఖాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్ర వేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ)కి ఈ తరహా ఫిర్యాదులు గత వారం రో జులుగా 54 అందాయి. ఇందులో ఒకటికి మించి ఎక్కువ కాలేజీల్లో దరఖాస్తు చేసిన వారు కూడా ఉన్నారు. టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ ఒకే దరఖాస్తును పరిగ ణనలోకి తీసుకుంటే 28 ఫిర్యాదులు అందినట్లు గు ర్తించింది. ప్రైవేటు కాలేజీలు తిరస్కరించిన అభ్య ర్థులంతా నేరుగా టీఎస్ఎఫ్ఆర్సీకి తమ దరఖాస్తులను పంపారు. వాటిని ఆయా కాలేజీలకు టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ పంపింది. ర్యాంకు ప్రకారం సీటెందు కు ఇవ్వలేదని వివరణ కోరింది. టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ కార్యాలయాన్ని ఆశ్రయించిన వారిలో జేఈఈ మెయిన్స్ ర్యాంకు పొందిన వారూ ఉన్నారు. నిబంధనల ప్రకారం ‘బీ’కేటగిరీ ఇంజనీరింగ్ సీట్లను తొలుత జేఈఈ ర్యాంకులు పొందిన వారికి, ఆ త ర్వాత ఎంసెట్ ర్యాంకులు, ఇంకా మిగిలితే ఇంటర్ మార్కుల్లో మెరిట్ ఆధారంగా కేటాయించాలి. కానీ ప్రైవేటు కాలేజీలు ఇష్టానుసారం సీట్లను అమ్ముకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. పారదర్శకత లేకనే...: తమకు అందిన దరఖాస్తుల్లో మెరిట్ ప్రకారం సీట్లిచ్చామని కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. కానీ దరఖాస్తుల విషయంలో ఎలాంటి పారదర్శకత లేకపోవడంతో ర్యాంకు ఉన్న అభ్యర్థుల దరఖాస్తులు యాజమాన్యాలు లెక్కల్లో చూపించట్లేదు. లక్షల రూపాయల డొనేషన్ తీసుకున్న వారి జాబితానే ఉన్నత విద్యామండలికి పంపుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈసారి ఉపేక్షించేదే లేదు... ‘బి’కేటగిరీ సీట్ల విషయంలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలను కోరాం. మాకు అందిన ప్రతి దరఖాస్తును ఆయా కాలేజీలకు పంపాం. వారికి అర్హత ఉన్నప్పుడు సీటు ఇవ్వకపోతే ఉపేక్షించే ప్రశ్నే లేదు. యాజమాన్య కోటా సీట్ల భర్తీపై పూర్తి వివరాలను 15వ తేదీలోగా ఉన్నత విద్యామండలికి సమర్పించాలి. ఎవరికి అన్యాయం జరిగినా కఠిన చర్యలు తప్పవు. – పి. స్వరూప్‌రెడ్డి, టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ చైర్మన్ -
ఇంజనీరింగ్‌పై తగ్గుతున్న క్రేజ్
సాక్షి, అమరావతి: చేరికలు క్రమేణా కుదించుకుపోతుండడంతో దేశంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల సంఖ్య ఏటా తగ్గిపోతోంది. గత పదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఈ తగ్గుదల ఏటా సగటున లక్ష వరకు ఉంటోంది. ఇంజనీరింగ్‌తో పాటు మేనేజ్మెంట్ కోర్సులలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) గణాంకాల ప్రకారం 2012–13లో దేశంలో 26.9 లక్షల ఇంజనీరింగ్ సీట్లుండగా ఇప్పుడు 23.61 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. 2014–15లో గరిష్ట స్థాయిలో 31.83 లక్షల సీట్లున్నాయి. అప్పటి నుంచి సీట్ల సంఖ్యలో ఏటా లక్ష చొప్పున తగ్గుదల కనిపించింది. సరైన బోధనా సిబ్బంది లేకపోవడం, లేబొరేటరీలు, ఇతర ప్రమాణాలను సంస్థలు పాటించకపోవడంతో విద్యార్థులలో నైపుణ్యాలు కొరవడి ఉద్యోగావకాశాలు సన్నగిల్లుతూ వచ్చాయి. ఈ ప్రభావంతో క్రమేణా ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశాల సంఖ్య తగ్గుతోంది. విద్యార్థుల చేరికలు పడిపోతుండటంతో కాలేజీలు సీట్ల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొత్త టెక్నాలజీ అభివృద్ధి చెందుతుండటంతో ఆయా రంగాల్లోని అంశాలపై పరిజ్ఞానాన్ని విద్యార్థులు అలవర్చుకోవలసి వస్తోంది. పాత సంప్రదాయ కోర్సులకు ఆదరణ తగ్గుతుండడంతో కాలేజీలు క్రమేణా వాటిని వదులుకుంటున్నాయి. ఇవన్నీ ఇంజనీరింగ్ కోర్సులలో సీట్ల సంఖ్య తగ్గడానికి కారణంగా యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. మేనేజ్మెంట్ కోర్సుల్లో కొంత వ్యత్యాసం.. పదేళ్లుగా దేశంలో మేనేజ్మెంట్ కోర్సుల డేటా పరిశీలిస్తే 2012–13 నుంచి 2014–15 వరకు సీట్లు పెరగ్గా ఆ తర్వాత తగ్గాయి. 2017–18లో మేనేజ్మెంట్ సీట్ల సంఖ్య 3.94 లక్షలు కాగా 2018–19లో 3.74 లక్షలకు, 2019–20లో 3.73 లక్షలకు తగ్గాయి. తరువాత పెరుగుదల నమోదైంది. 2021–22లో 4.04 లక్షలకు చేరాయి. ఇంజనీరింగ్ వెలవెల.. మేనేజ్మెంట్ కోర్సులతో పోలిస్తే గత ఐదేళ్లలో ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎక్కువ సీట్లు ఖాళీగా ఉన్నాయి. మేనేజ్మెంట్ సీట్లు 34 – 37 శాతం వరకు ఖాళీగా ఉండగా ఇంజనీరింగ్ సీట్లు 45 – 48 శాతం వరకు ఖాళీగా ఉన్నాయి. బీఈ, బీటెక్ తర్వాత వెంటనే ఉద్యోగాలు రాకపోవడం కూడా దీనికి కారణం. అలాంటి వారు మేనేజ్మెంట్ కోర్సులలో చేరుతున్నట్లు తేలుతోంది. సివిల్, మెకానికల్, ఇతర ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు తమ కోర్ విభాగాల్లో ఉద్యోగాలు లేక మేనేజ్మెంట్ కోర్సుల ద్వారా కార్పొరేట్ రంగంలోకి ప్రవేశించాలని భావిస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. స్కిల్ ఇండియా తాజా నివేదికల ప్రకారం ఇంజనీరింగ్ విద్యార్థులు 46.82 శాతం, మేనేజ్మెంట్ విద్యార్ధులు 46.59 శాతం ఉపాధి పొందినట్లు వెల్లడిస్తున్నాయి. వివిధ సంస్థలు ఇంజనీరింగ్ అర్హతలతోపాటు మేనేజ్మెంట్ నైపుణ్యాలున్న వారికి ప్రాధాన్యమిస్తుండడంతో అటువైపు మొగ్గు చూపుతున్నట్లు ఏఐసీటీఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలోనూ ఇవే రకమైన గణాంకాలు దేశంలోని పరిస్థితినే రాష్ట్రంలో ఏఐసీటీఈ గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయి. రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లు 2.99 లక్షలుండగా 2021–22 నాటికి 2.37 లక్షలకు తగ్గాయి. మేనేజ్మెంట్ కోర్సుల్లో 2014–15లో 51,750 సీట్లుండగా 2021–22 నాటికి 39,451కి తగ్గాయి. -
నచ్చిన కాలేజీ.. మెచ్చిన బ్రాంచ్
గత వారం రోజులుగా ఇదే తంతు. ఎంసెట్ ర్యాంకు తక్కువొచ్చిన, కాస్త అటూ ఇటూగా వచ్చిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అదే పనిగా ఫోన్లు వస్తున్నాయి. ‘టాప్ టెన్ కాలేజీల్లో మీకు నచ్చిన బ్రాంచ్‌లో సీటు కావాలా? మేమిప్పిస్తాం..’ అని కన్సల్టెన్సీలకు చెందినవారు, దళారీలు ఊదరగొడుతున్నారు. కొన్ని కాలేజీ యాజమాన్యాలైతే ఏకంగా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లను (పీఆర్వోలు) పెట్టుకుని మరీ సీట్ల సేల్ కోసం విద్యార్థుల వెంటపడుతున్నాయి. సీట్లు అయిపోతున్నాయంటూ తల్లిదండ్రులను హడలెత్తిస్తున్నాయి. నోటిఫికేషన్ జారీ చేసి ర్యాంకు ప్రకారమే సీటివ్వాలని ఉన్నత విద్యా మండలి పదేపదే చెబుతున్నా అడ్డదారిలో సీట్లన్నీ బేరం పెట్టేస్తున్నాయి. మరోవైపు తమ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులను కూడా కొన్ని యాజమాన్యాలు ఉపయోగించుకుంటున్నాయి. వారికి తెలిసిన ఎంసెట్ అర్హత పొందిన విద్యార్థుల ఇళ్లకు పంపి సీటు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాయి. డిమాండ్‌ను సొమ్ము చేసుకుంటున్నారు పేరు మోసిన కాలేజీలు, ఆ తర్వాత స్థాయి కళాశాలలు కొన్ని.. తమకున్న డిమాండ్‌ను, తమ కాలేజీల్లో వివిధ బ్రాంచ్లకున్న డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా కాస్త ర్యాంకులు అటూ ఇటూగా వచ్చి, కన్వీనర్ కోటాలో సీటు రాదని భావించే విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనను ఆసరాగా తీసుకుని అలాంటి వారికి కన్సల్టెన్సీల ద్వారా ఎరవేస్తున్నాయి. సాధారణ యాజమాన్య, ఎన్ఆర్ఐ కోటా సీట్ల కేటాయింపులో దోపిడీకి పాల్పడుతున్నాయి. ముఖ్యంగా ఎన్ఆర్ఐ కోటా కింద ఎక్కువ సొమ్ము చేసుకునేందుకు కాలేజీలు ప్రయత్నిస్తున్నాయి. ఎన్ఆర్ఐ కోటా కింద దోపిడీ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 27 వేల ఇంజనీరింగ్ సీట్లు మేనేజ్మెంట్ కోటా కింద ఉంటాయి. ఇందులో సుమారు 13 వేలు సాధారణ యాజమాన్య కోటా సీట్లు కాగా సుమారు 14 వేల సీట్లు ఎన్ఆర్ఐ కోటా కింద ఉన్నాయి. నిబంధనల ప్రకారం ప్రవాస భారతీయుల పిల్లలు, వారు స్పాన్సర్ చేసే వారికి ఈ సీట్లు ఇస్తారు. ఫీజు కూడా డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది. భారత కరెన్సీ ప్రకారం చూస్తే ఏడాదికి దాదాపు రూ. 3.75 లక్షల వరకు వ్యయం అవుతుంది. కానీ డిమాండ్‌ను బట్టి దాదాపు రూ.15 లక్షల వరకు కాలేజీలు వసూలు చేస్తున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని దళారులు కొన్ని కాలేజీల్లో కొంతమంది సాయంతో ఎన్ఆర్ఐ కోటా కింద సీట్లు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. దళారుల పాత్రేంటి?: మేనేజ్మెంట్ సీటు ఆశించే తల్లిదండ్రులతో కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ విభాగాలు నేరుగా బేరసారాలు చేస్తున్నాయి. పీఆర్వోలను పెట్టుకుని కథ నడిపిస్తున్నాయి. ఈ సమయంలో తల్లిదండ్రుల సెల్ఫోన్లు బయట సిబ్బంది వద్ద ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఇక కన్సల్టెన్సీలు, దళారులుగా వ్యవహరిస్తున్న వ్యక్తులకు నిజానికి కొన్ని కాలేజీల యాజమాన్యంతో ఎలాంటి సంబంధం ఉండదు. కానీ, అక్కడ పనిచేసే సిబ్బంది ద్వారా ఆ కాలేజీలో సీటు ధర ఎంతో తెలుసుకుంటున్నారు. అంతకన్నా ఎక్కువ రేటు తల్లిదండ్రులకు చెబుతున్నారు. నేరుగా యాజమాన్యాన్ని కలిసి రమ్మని, వాళ్లతో మాట్లాడామని, సీటు రేటు తగ్గిస్తారని చెబుతున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు బేరసారాలు చేసుకుని వస్తున్నారు. దళారులు, కన్సల్టెన్సీల వల్లే ధర తగ్గిందని భావిస్తున్న తల్లిదండ్రులు వారికి కమీషన్ ఇస్తున్నారు. కొన్ని కాలేజీలు మాత్రం దళారుల ద్వారా సీట్లు భర్తీ అయ్యేలా నేరుగా బేరాలు కుదుర్చుకుంటున్నాయి. – సాక్షి, హైదరాబాద్ వరంగల్‌కు చెందిన అరుణ్‌కు 16 వేల ఎంసెట్ ర్యాంకు వచ్చింది. టాప్‌టెన్ కాలేజీలో సీఎస్సీ చేయాలన్నది అతని కోరిక. కానీ సీటు వస్తుందా? అని అనుమానం. ఇంతలోనే మీకు సీటిప్పిస్తామంటూ ఫోన్ కాల్ వచ్చింది. రూ.15 లక్షలు అవుతుందని చెప్పారు. దీంతో అతను ఆ వ్యక్తి చెప్పే మాట నిజమో? అబద్ధమో? తెలియని అయోమయంలో ఉన్నాడు. నిజామాబాద్‌కు చెందిన కార్తీక్ హైదరాబాద్‌లో టాప్‌టెన్‌లో ఉన్న ఒక కాలేజీలో డేటా సైన్స్ సీటు కోసం వెళ్లాడు. మేనేజ్మెంట్ కోటాలోనూ కష్టమని చెప్పారు. వేరే బ్రాంచ్ తీసుకోమంటే వద్దని బయటకొచ్చాడు. కాలేజీ బయట ఓ వ్యక్తి సీటిప్పిస్తానంటూ చెప్పాడు. అతడు చెప్పినట్లుగానే రెండురోజుల తర్వాత సీటు వచ్చింది. కృత్రిమ డిమాండ్ ఈసారి ఇంజనీరింగ్‌లో కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, డేటా సైన్స్ వంటి కొత్త కోర్సులు ప్రవేశపెట్టారు. వీటిపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. విద్యార్థులు కూడా ఈ కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇదే అదనుగా భావించిన ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయి. ‘ఆ సీట్లు అయిపోయాయి. వేరే బ్రాంచ్ తీసుకుంటారా?’ అని సీటు కోసం వెళ్లిన తల్లిదండ్రులను అడుగుతున్నాయి. వాళ్ల ఆసక్తిని ఆసరాగా చేసుకుని దళారులను రంగంలోకి దించి ఎక్కువ మొత్తానికి సీట్లు అమ్మేస్తున్నాయి. కూకట్‌పల్లికి చెందిన సత్యప్రకాశ్‌కు ఇదే అనుభవం ఎదురైంది. ‘యాజమాన్యం సీఎస్సీ సీటు కష్టమంది. గేటు దాటి బయటకు రాగానే దళారీ వచ్చాడు. అతని ద్వారా సీటు వచ్చింది..’ అని చెప్పాడు. -
రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లు 91,607
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్‌లో కలిపి 91,607 సీట్లు అందుబాటులో ఉన్నట్టు ఉన్నత విద్యా మండలి తెలిపింది. బీ ఫార్మసీ సీట్లు 4,550 ఉన్నట్టు వెల్లడించింది. జేఎన్టీయూహెచ్ పరిధిలో 141 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు, 71 ఫార్మసీ కాలేజీలకు అనుబంధ గుర్తింపు లభించినట్టు శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. బీటెక్ సీట్లకు త్వరలో కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలో.. ఆయా కాలేజీలు, సీట్ల వివరాలను ప్రకటించింది. ►బీ ఫార్మసీకి సంబంధించి.. జేఎన్టీయూ, ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, పాలమూరు వర్సిటీల పరిధిలో మొత్తం 80 సీట్లు ఉన్నాయి. ఈ వర్సిటీల అనుబంధ గుర్తింపు ఉన్న కాలేజీలు 109 ఉండగా.. వాటిలో 4,470 సీట్లు ఉన్నాయి. ఇందులో 3,130 సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. ►ఫార్మాడీ కోర్సులో వర్సిటీల అనుబంధ గుర్తింపు పొంది న కాలేజీలు 53కాగా.. వాటిల్లో 741 సీట్లు ఉన్నాయి. ఇందులో 520 సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. -
టీఎస్ ఎంసెట్: నేటి నుంచి 16 వరకు వెబ్ ఆప్షన్స్
సాక్షి, హైదరాబాద్: టీఎస్ ఎంసెట్‌కు సంబంధించి నేటి నుంచి 16 వరకు ఇంజనీరింగ్ ప్రవేశాల వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ మొదలవనుంది. ఈ సందర్భంగా ఏఐసీటీఈ 161 కాలేజీలకు అనుబంధ గుర్తింపునిచ్చింది. ఇంజనీరింగ్ కోటాలో 85,149 సీట్లకు గానూ 60, 697 కన్వీనర్ కోటా సీట్లు ఉన్నాయి. ఇక అడ్మిషన్ష్ కౌన్సిలింగ్ లిస్టులో పలు ఇంజనీరింగ్ కాలేజీలు లిస్టులో చోటు దక్కించుకోలేదు. ఇక 91 బీ ఫార్మసీ కాలేజీల్లో 7,640 సీట్లు ఉండగా.. అందులో 2,691 కన్వీనర్ కోటా ఉన్నాయి. 44 ఫార్మా డీ కాలేజీల్లో 1295 సీట్లు ఉండగా.. 454 కన్వీనర్ కోటా ఉన్నాయి. -
ఇంజనీరింగ్ సీటు ఇలా..
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో ధ్రువ పత్రాల పరిశీలన కోసం సహాయ కేంద్రానికి వెళ్లడం మినహా మిగతావన్నీ ఇంట్లోంచే ఆన్లైన్లో పూర్తి చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి తెలిపింది. స్లాట్ బుకింగ్ మొదలు కాలేజీలో చేరే వరకూ విద్యార్థులు ఏం చేయాలనే వివరాలను వెబ్సైట్లో ఉంచింది. ముందు ఇలా చేయండి ►ఈ నెల 30వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. వచ్చే నెల 9వ తేదీ వరకూ ఎంసెట్ అర్హత పొందిన అభ్యర్థులు ‘ ్టట్ఛ్చఝఛ్ఛ్టి. nజీఛి. జీn’ పేజీకి లాగిన్ అవ్వాలి. అక్కడ రిజిస్ట్రేషన్ కాలమ్‌లోకి వెళ్లాలి. ఎంసెట్ హాల్ టికెట్, పుట్టిన తేదీ, ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష హాల్‌టికెట్ నంబర్‌ను నిర్ణీత కాలమ్స్‌లో నింపాలి. ఇందులోనే ఆధార్ సంఖ్య, మొబైల్ నంబర్, కుల ధ్రువీకరణ పత్రం నంబర్ ఇవ్వాలి. ఇచ్చిన మొబైల్ నంబర్ చివరి వరకూ ఉంటుంది. మార్చడం కుదరదు. ►ప్రాథమిక సమాచారం పొందుపరిచిన తర్వాత రూ. 1,200 (ఎస్సీ, ఎస్టీలు రూ. 600) ఫీజు ఆన్లైన్ ద్వారానే చెల్లించాలి. అప్పుడు మీ పేరుతో అకౌంట్ క్రియేట్ అవుతుంది. దీని ద్వారా సర్టిఫికెట్ పరిశీలన తేదీని, దగ్గర్లోని కేంద్రాన్ని, సమయాన్ని ఎంపిక చేసుకోవాలి. దీంతో మొదటి మెట్టు పూర్తవుతుంది. స్లాట్ బుకింగ్‌ను ఈ నెల 30 నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకూ చేసుకోవచ్చు. పరిశీలనకు ఏయే సర్టిఫికెట్లు కావాలి? ►మీరు ఎంచుకున్న సహాయ కేంద్రానికి టీఎస్ఎంసెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఆధార్, ఎస్సెస్సీ తత్సమాన మార్కుల మెమో, ఇంటర్ మెమో, ఆరు నుంచి ఇంటర్ వరకూ స్టడీ సర్టిఫికెట్లు, టీసీ, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకెళ్లాలి. ఇవన్నీ ఒరిజినల్స్‌తోపాటు మూడు సెట్ల జిరాక్స్ కాపీలను సిద్ధంగా ఉంచుకోవాలి. ►సర్టిఫికెట్ల పరిశీలన వచ్చే నెల 9 నుంచి 11వ తేదీ వరకూ కొనసాగుతుంది. సహాయ కేంద్రంలో పరిశీలన అనంతరం సంబంధిత అధికారి ధ్రువీకరించినట్టు రసీదు ఇస్తారు. ఆప్షన్ వేళ కంగారొద్దు... ►వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే అభ్యర్థి రిజిస్టర్డ్ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత తిరిగి టీఎస్ఎంసెట్ పేజీకి మీ యూజర్ ఐడీ ద్వారా లాగిన్ అవ్వాలి. అప్పుడు ఆప్షన్స్‌ను ఎంపిక చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల వివరాలు ఎంసెట్ వెబ్ పోర్టల్‌లోనే ఉంటాయి. ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉందో తెలుస్తుంది. ఆ కాలేజీ కోడ్ పక్కనే ఉంటుంది. జిల్లాలవారీగా కాలేజీల వివరాలూ ఉంటాయి. అభ్యర్థి ఎంపిక చేసుకొనే కోర్సు, కాలేజీ కోడ్ ముందుగా రాసుకొని ఆ తర్వాత వెబ్‌లో క్లిక్ చేస్తే కంగారు పడాల్సిన అవసరం ఉండదు. వరుస క్రమంలో ప్రాధాన్యతను ఎంపిక చేసుకున్న తర్వాత డేటాను సబ్మిట్ చేయాలి. ►ఆప్షన్స్‌ను ఎన్నిసార్లయినా మార్చుకోవచ్చు. ఈ వెసులుబాటు సెప్టెంబర్ 13 రాత్రి వరకూ ఉంటుంది. రాత్రి 12 తర్వాత సైట్ ఫ్రీజ్ అవుతుంది. ఇక ఎలాంటి మార్పుకు అవకాశం ఉండదు. 15న సీటు ఖరారు... ►సెప్టెంబర్ 15వ తేదీన తొలిదశ సీట్ల కేటాయింపు ఉంటుంది. అభ్యర్థి తన ఐడీకి లాగిన్ అయి సీటు వచ్చిందా లేదా? చూసుకోవచ్చు. సీటొస్తే కేటాయింపు ఆర్డర్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో పేర్కొన్న ఫీజును అదే నెల 20వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. సీటు రాని పక్షంలో మళ్లీ రెండో దశ వెబ్ ఆప్షన్‌కు వెళ్లొచ్చు. ఈసారి ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండదు. అన్ని దశల కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాతే అభ్యర్థి కాలేజీకి వెళ్లి ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఇదీ షెడ్యూల్.. స్లాట్ బుకింగ్: 30–8–21 నుంచి 9–9–21 ధ్రువపత్రాల పరిశీలన: 4 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్స్: 4 నుంచి 13 వరకు తొలి దశ సీట్ల కేటాయింపు: 15–9–21 సెల్ఫ్ రిపోర్టింగ్: 20–9–21 -
ఇంజినీరింగ్‌లో ఇంకా సీట్లున్నాయ్..!
మచిలీపట్నం: ఇంజినీరింగ్ కాలేజీల్లో 2020–21 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్ పూర్తవుతోంది. జిల్లాలోని ఏఏ కాలేజీల్లో ఎంతమంది విద్యార్థులు సీట్లు ఎంపిక చేసుకున్నారనేది అధికారులు వెల్లడించారు. చాలా కాలేజీల్లో సీట్లు భారీగా మిగిలిపోయాయి. కొన్ని బ్రాంచిల్లో ఒకరిద్దరు విద్యార్థులు మాత్రమే కోరుకున్నారు. ఇలాంటి చోట్ల తరగతులు నిర్వహణ ఎలా ఉంటుందనేది విద్యాశాఖ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జిల్లాలో 32 కాలేజీల్లో ప్రవేశాలకు ఈ ఏడాది ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కన్వీనర్ కోటా కింద మొత్తం 11,555 సీట్లు అందుబాటులో ఉండగా, తొలివిడతలో 8,408 మంది సీట్లు కోరుకోగా, ఇందులో కొంతమంది విద్యార్థులు కాలేజీల్లో చేరలేదు. తాజాగా రెండో విడత కౌన్సెలింగ్ పూర్తయ్యే సరికి 8,698 మంది విద్యార్థులు సీటు పొందారు. ఫిబ్రవరి 1 నాటికి విద్యార్థులు కాలేజీల్లో చేరాలని అధికారులు స్పష్టం చేశారు. లేకుంటే సీటు రద్దు చేస్తామని ప్రకటించారు. కౌన్సెలింగ్‌లో సీటు కోరుకున్నప్పటికీ, ఎంత మంది కాలేజీలకు వచ్చి చేరుతారనేది తేలాల్సి ఉంది. రెండు విడుతల పూర్తి అయినప్పటికీ, కన్వీనర్ కోటాలోనే ఇంకా 2,857 సీట్లు ఖాళీ ఉన్నాయి.(చదవండి: త్వరలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ) ఇదిలా ఉంటే జిల్లాలోని 32 కాలేజీల్లో 9 చోట్ల వందమంది లోపే విద్యార్థులు చేరారు. కొన్ని బ్రాంచిల్లో అయితే ఒకరిద్దరు మాత్ర మే కోరుకున్నారు. మూడేళ్ల పాటు 25 శాతంపైన ప్రవేశాలు లేకుంటే, వాటికి గుర్తింపు వద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే జిల్లాలో మూడు కాలేజీలు ఈ విద్యా సంవత్సరంలో మూతపడ్డాయి. ఈ లెక్కన తక్కువ అడ్మిషన్లు నమోదు అయిన కాలేజీల పరిస్థితి వచ్చే ఏడాది ఎలా ఉంటుందోనని కళాశాల యాజమాన్యాల్లో సర్వత్రా చర్చసాగుతోంది. మరోవైపు, ఇంజినీరింగ్ విద్యలో సీఎస్ఈ బ్రాంచికు మంచి క్రేజ్ ఉంటుంది. కానీ గాంధీజీలో ఆరుగురు, అదే విధంగా శ్రీవాణి మైలవరంలో ఏడుగురు మాత్రమే చేరారు.లింగయాస్, పీపీడీవీ, డీజేఆర్ఎస్, మండవ వంటి కాలేజీల్లో మెకానికల్ బ్రాంచిలో ఒక్కొక్కొరు చొప్పున మాత్రమే విద్యార్థులు చేరారు. ఒక గ్రూపుకు తప్పనిసరిగా ఆరుగురు అధ్యాపకులు ఉండాలి. మరి ఒకరిద్దరు చేరిన చోట గ్రూపులను కొనసాగిస్తారా..లేదా..? అనేది తేలాల్సి ఉంది. వాసవి పెడన కాలేజీలో మిగతా గ్రూపుల్లో కొంతమేర పరువాలేకున్నా, సివిల్ ఇంజినీర్లో 8 మంది మాత్రమే చేరారు. ఇలాంటి కాలేజీలు చాలానే ఉన్నాయి. ఇదే ఇప్పుడు హాట్ టాఫిక్గామారింది. -
ఈసారి 90 వేల లోపే ఇంజనీరింగ్ సీట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈసారి ఇంజనీరింగ్ సీట్లు మరింతగా తగ్గిపోనున్నాయి. గతేడాది అనుబంధ గుర్తింపు ఇచ్చిన సీట్ల కంటే ఈసారి 5 వేలకు పైగా సీట్లు తగ్గిపోయే పరిస్థితి నెలకొంది. గతేడాది రాష్ట్రంలోని 228 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,14,247 సీట్ల భర్తీకి ఏఐసీటీఈ గుర్తింపు ఇచ్చింది. అయితే రాష్ట్రంలోని యూనివర్సిటీలు ఇంజనీరింగ్ కాలేజీల్లోని ఫ్యాకల్టీ, వసతులను బట్టి 198 కాలేజీల్లో 95,235 సీట్లకే అనుబంధ గుర్తింపును ఇచ్చాయి. ఇక ఈ విద్యా సంవత్సరంలో ఏఐసీటీఈ రాష్ట్రంలో 214 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,08,175 సీట్లకు గుర్తింపు ఇవ్వగా.. యూనివర్సిటీలు దాదాపు 180 కాలేజీల్లో 90 వేల లోపు సీట్లలో భర్తీకే అనుబంధ గుర్తింపు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కొన్ని కాలేజీల్లో ప్రవేశాలు లేక కొన్ని కోర్సులను రద్దు చేసుకోగా, కొన్ని కాలేజీలు పూర్తిగా మూసివేతకు దరఖాస్తు చేసుకున్నాయి. మరోవైపు కొన్ని కాలేజీల్లో లోపాల కారణంగా యూనివర్సిటీలు సీట్లను తగ్గిస్తున్నట్లు తెలిసింది. దీంతో గతేడాది కంటే ఈసారి 5 వేలకు పైగా సీట్లు తగ్గిపోయే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే యూనివర్సిటీలు ప్రారంభించిన కాలేజీ వారీగా అనుబంధ గుర్తింపు జారీ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. దీంతో యూనివర్సిటీల పరిధిలో మొత్తంగా ఎన్ని కాలేజీల్లో ఎన్ని సీట్లలో ప్రవేశాలకు అనుబంధ గుర్తింపు ఇచ్చామన్న లెక్కలు సిద్ధం చేస్తున్నాయి. మరోవైపు ఏఐసీటీఈ గుర్తింపు ఇచ్చిన కాలేజీలు, సీట్ల వివరాలను సాంకేతిక విద్యాశాఖ గురువారం ప్రకటించింది. అయితే అందులో ఎన్ని కాలేజీలు, ఎన్ని సీట్లలో ప్రవేశాలకు వర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇస్తాయనేది తేలాల్సి ఉంది. వెబ్సైట్లో గతేడాది ర్యాంకుల వివరాలు.. గతేడాది ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏ ర్యాంకుల వారికి ఏయే కాలేజీల్లో సీట్లు వచ్చాయన్న వివరాలను (http://www.sbtet.telangana.gov.in) అందుబాటులో ఉంచినట్లు ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ తెలిపారు. 2018కి సంబంధించి ఎంసెట్‌తోపాటు ఐసెట్ ప్రవేశాల ర్యాంకుల వివరాలను కాలేజీల వారీగా అందులో పొందుపరిచినట్లు వెల్లడించారు. -
ఇంజనీరింగ్‌లో 10 వేల సీట్లు కోత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈసారి దాదాపు 10 వేల సీట్లు తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తోంది. కాలేజీల మూసివేత, బ్రాంచీల రద్దుకు యాజమాన్యాల నుంచి వచ్చిన దరఖాస్తుల నేపథ్యంలో ఈ సీట్లు తగ్గిపోయే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని 173 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో 13 కాలేజీలు మూసివేత కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వాటిలోనే 6 వేలకుపైగా సీట్లు తగ్గిపోనుండగా, ఉన్న కాలేజీల్లో మరో 4 వేల వరకు సీట్లు తగ్గనున్నాయి. ఇందుకోసం యాజమాన్యాలే స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకున్నాయి. అందులో బీటెక్‌లో 26 బ్రాంచీలు, ఎంటెక్‌లో 66 బ్రాంచీలు, ఎంబీఏలో ఐదు, బీఫార్మసీ, ఎంఫార్మసీ తదితర కోర్సుల్లో 140 వరకు బ్రాంచీలను రద్దు చేసుకునేందుకు యాజమాన్యాలు దరఖాస్తు చేసుకున్నాయి. మరోవైపు యూనివర్సిటీల అధికారులు అనుబంధ గుర్తింపు ఇచ్చే క్రమంలో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలతో (ఎఫ్ఎఫ్సీ) తనిఖీలు చేపట్టనున్నారు. ఆ సమయంలో నిబంధనల ప్రకారం ప్రమాణాలు, సౌకర్యాలు లేకుంటే మరిన్ని సీట్లకు కోత పడే అవకాశం ఉంది. కాలేజీల్లో చేరే సంఖ్యకు అనుగుణంగా కాకుండా అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఆమోదం తెలిపిన సీట్ల సంఖ్య ప్రకారమే ఫ్యాకల్టీని నియమించాలని గురువారం జేఎన్టీయూహెచ్ నిర్ణయించింది. అనుబంధ గుర్తింపు ఇచ్చే క్రమంలో దానినే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. కాలేజీల్లో చేరే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఫ్యాకల్టీని నియమిస్తామని చెబుతున్న యాజమాన్యాల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోబోమని తేల్చిచెప్పింది. మూసివేతకు దరఖాస్తు చేసుకున్న కాలేజీలివే.. అల్ హబీబ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అయాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, జయముఖి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, కృష్ణమూర్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్, నిశిత కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, పల్లవి వీఐఎఫ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ప్రిన్స్టన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, విద్యాభారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పీఆర్‌ఆర్‌ఎం ఇంజనీరింగ్ కాలేజ్, ధ్రువ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, షాజ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కేబీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. -
నారాయణ కాలేజీ ఏఓ అరెస్ట్..
సాక్షి, హైదరాబాద్ : ఇంజనీరింగ్ సీట్లు ఇప్పిస్తానని చెప్పి రూ.5లక్షలు వసూలు చేసి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న నారాయణ కాలేజీ ఏఓను బుధవారం వనస్థలీపురం పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణ కాలేజీ ఏఓ రఘు విద్యార్థులకు ఇంజనీరింగ్ సీట్లు ఇప్పిస్తానని చెప్పి దాదాపు 5లక్షల రూపాయలు వసూలు చేశాడు. రఘు వారికి సీట్లు ఇప్పించకపోవటంతో ఇద్దరు విద్యార్థులు విద్యాసంవత్సరాన్ని కోల్పోయారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు వనస్థలీపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏఓ రఘుపై కేసు నమోదు చేసిన పోలీసులు అతనితో పాటు ప్రశాంత్‌రెడ్డి అనే మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. -
ఇంజనీరింగ్ సీట్లలో సగం ఖాళీ
సాక్షి, అమరావతి: ఫీజు రీయింబర్స్మెంట్ పథకం.. ఒకప్పుడు నిరుపేద విద్యార్థులకు ఎంతో అండగా నిలిచి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దింది. మెడిసిన్, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఇలా ఏ ఉన్నత చదువు పూర్తిచేయాలన్నా వారికి ఆ పథకం తోడుగా నిలిచింది. కానీ నేడు ఆ పథకాన్ని నీరుగార్చేశారు. పేదలకు ఉన్నత చదువుల్ని దూరం చేశారు. ఇప్పుడు ఇంజనీరింగ్ కోర్సులకు ఫీజులు భారీగా పెరిగిపోయాయి. ఆర్థిక స్థోమత లేక పేదలు ఈ కోర్సులకు దూరమవుతున్నారు. సంప్రదాయ డిగ్రీ కోర్సులకన్నా టెక్నికల్ కోర్సులు చదివితే తొందరగా ఉద్యోగమో, ఉపాధో దొరుకుతుందని విద్యార్థులు చాలాకాలంగా ఇంజనీరింగ్ వైపు ఎక్కువగా దృష్టి పెట్టేవారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం వారికి వెన్నుదన్నుగా నిలిచింది. అప్పట్లో ఎవరు ఏ కోర్సు చేయాలనుకున్నా ఆయా కోర్సుల ట్యూషన్ ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే భరించేది. దీంతో ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు బారులు తీరేవారు. కాలక్రమేణా ఆ పథకాన్ని నీరుగార్చడంతో విద్యార్థులు లేక కాలేజీలే మూతపడుతున్నాయి. ఫీజుల పెంపుతో విద్యార్థులపై భారం ఎంసెట్‌లో పదివేలలోపు ర్యాంకు సాధించిన వారికి మాత్రమే ఆయా కోర్సుల పూర్తిఫీజును రీయింబర్స్ చేసేలా ప్రభుత్వం నిబంధనలను మార్చింది. పదివేలు దాటి ర్యాంక్ వస్తే వారికి రూ. 35 వేలు మాత్రమే రీయింబర్స్‌మెంటు ఇస్తున్నారు. తక్కిన ఫీజు ఎక్కువగా ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతోంది. ఇంజనీరింగ్‌లో నాలుగేళ్లపాటు ఆర్థిక భారాన్ని భరించే స్థితిలో లేక తమ పిల్లలను కాలేజీల్లో చేర్చలేకపోతున్నారు. కాలేజీ యాజమాన్యాల ఒత్తిడితో ఫీజులను ప్రభుత్వం భారీగా పెంచేయడం కూడా విద్యార్థులను సాంకేతిక విద్యకు దూరం చేస్తోంది. గతంలో రూ. 75 వేల లోపు వరకు గరిష్ట ఫీజు ఉండగా ఇప్పుడు దానిని రూ. 1.10 లక్షలకు పెంచారు. అంటే ప్రభుత్వం రూ. 35 వేలు రీయింబర్స్మెంట్ ఇస్తే విద్యార్థి 75 వేలు చెల్లించాలి. రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల సంఖ్య 406 వరకు ఉంది. ఇందులో అత్యధిక కాలేజీల్లో రూ. 50 వేల నుంచి రూ. 60 వేల లోపు ఫీజు ఉండేది. గరిష్ట ఫీజు రూ.75 వేల వరకు ఉన్న కాలేజీల కొన్నే ఉండేవి. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఫీజులు పెంచడంతో రూ. 75 వేల నుంచి రూ. 95 వేల మధ్య ఫీజులున్న కాలేజీలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కాలేజీల్లో చేరే విద్యార్థులపై ఏటా రూ. 40 వేల నుంచి రూ. 60 వేల వరకు భారం పడుతోంది. ఇక రూ. లక్షకు పైగా ఉన్న కాలేజీల్లో చేరాలంటే ఫీజుల భారం తట్టుకోలేక ప్రతిభ ఉన్న పేద విద్యార్థులు కూడా వెనకడుగు వేస్తున్నారు. ఫీజులు చెల్లించలేక విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఇతర కోర్సుల్లో చేర్పిస్తున్నారు. తాజాగా ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరికలే ఇందుకు తార్కాణం వేలాది సీట్లు ఖాళీ.. రాష్ట్రంలో 1.56 లక్షల ఇంజనీరింగ్, ఫార్మా సీట్లు ఉంటే.. గత ఏడాదిలో 57 వేల సీట్లు మిగిలిపోయాయి. ప్రస్తుత విద్యాసంవత్సరంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 22 నుంచి 25 వరకు జరిగిన ఎంసెట్‌కు 2,64,295 మంది హాజరుకాగా వారిలో 2,01,900 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో ఎంపీసీ 1,38,017 మంది, బైపీసీ 63,883 మంది ఉన్నారు. ఇక ఎంపీసీ స్ట్రీమ్ మొదటి విడత కౌన్సెలింగ్‌లో కన్వీనర్ కోటా సీట్లు 95,455 ఉండగా 67,078 మంది మాత్రమే ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. వీరిలోనూ ఆప్షన్లు ఇచ్చింది 65,909 మంది కాగా సీట్లు పొందింది 60,943 మంది. మొదటి విడతలో సీట్లు పొందిన వారిలోనూ 15 వేల మందికి పైగా కాలేజీల్లో చేరలేదు. ఇక రెండో విడత కౌన్సెలింగ్‌కు 47,526 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా కౌన్సెలింగ్‌కు వచ్చిన వారి సంఖ్య కేవలం 3,165 మంది మాత్రమే. రెండో విడత కౌన్సెలింగ్ ముగిసేసరికి ఇంకా ఎంపీసీ స్ట్రీమ్‌లో 33 వేల సీట్లు మిగిలి ఉన్నాయి. బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ ఇంకా జరగాల్సి ఉంది. అందులోనూ భారీగానే సీట్లు మిగిలిపోతాయని భావిస్తున్నారు. అందులో ఫార్మా కోర్సుకు సంబంధించినవి కావడం, ఫీజులు ఎక్కువగా ఉండడంతో పాటు పెద్దగా ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఫీజులు చెల్లించి చేరడానికి విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. ముఖ్య బ్రాంచిల్లోనూ మిగిలిపోతున్న సీట్లు ఇంజనీరింగ్‌లో ముఖ్యమైన బ్రాంచిలుగా భావించే వాటిలోనూ సీట్లు భారీగా మిగిలిపోతున్నాయి. గతేడాది ఈసీఈలో 5,280, కంప్యూటర్ సైన్సులో 4,289, కెమికల్ ఇంజనీరింగ్‌లో 6,985, ఈఈఈలో 5,561, సివిల్‌లో 5,366 సీట్లు మిగిలిపోయాయి. ఫార్మసీలో 3,587 సీట్లుంటే అందులో కేవలం 298 మాత్రమే భర్తీ అయి 3,289 సీట్లు మిగిలిపోయాయి. ఇక గత ఏడాదిలో ఒక్క విద్యార్థీ చేరని కాలేజీలు 5 ఉన్నాయి. కేటాయించిన విద్యార్థుల సంఖ్య ప్రకారం 1–5 మంది విద్యార్థులు ఉన్నవి 14, 6–10 మంది ఉన్నవి 9, 11–15 వరకు ఉన్నవి 9, 16–20 వరకు ఉన్నవి 3, 21 నుంచి 25 వరకు ఉన్నవి 8 మాత్రమే. ఈ ఏడాది కూడా 1–5 మంది ఉన్నవి 5, 6–10 మంది ఉన్నవి 6, 11–15 మంది ఉన్నవి 4, 16–20 మంది ఉన్నవి 8, 21– 25 మంది ఉన్నవి 10 కాలేజీలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కొన్ని కాలేజీలు విద్యార్థులు చేరని కోర్సులను రద్దుచేసుకుంటుండగా మరికొన్ని కాలేజీలు స్వచ్ఛందంగా మూతకు దరఖాస్తు చేస్తున్నాయి. ఈ ఏడాదిలో కొన్ని కాలేజీలు 46 కోర్సులను రద్దుచేసుకున్నాయి. 9 కాలేజీలు మూతపడ్డాయి. -
మెరిట్‌కు పాతర.. సీట్ల జాతర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్డగోలు దందా సాగుతోంది. మేనేజ్మెంట్ కోటా సీట్లు అంగడి సరుకులయ్యాయి. కొన్ని కాలేజీలు మెరిట్‌కు పాతరేసి సీట్లను బహిరంగంగా అమ్ముకుంటున్నాయి. వేలం మాదిరి రోజురోజుకూ డిమాండ్ పెంచి మరీ డొనేషన్లు వసూలు చేస్తున్నాయి. బ్రాంచీని బట్టి ఒక్కో సీటుకు రూ.4 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నాయి. మెరిట్ కాదు కదా.. అసలు జేఈఈ ర్యాంకు, ఎంసెట్ రాయనివారికి కూడా సీట్లను అమ్మేసుకున్నాయి. 2017–18 విద్యా సంవత్సరం మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్లలో లీలలివీ! హైదరాబాద్ శివారులోని టాప్–3 కాలేజీల్లో 663 సీట్లను మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేస్తే దాదాపు 490కి పైగా సీట్లను కోట్ల రూపాయలకు అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో సీటుకు సగటున రూ.10 లక్షల చొప్పున అమ్మకానికి పెట్టిన యాజమాన్యాలు కోట్లు గడించినట్లు సాంకేతిక విద్యాశాఖ అధికారులే పేర్కొంటున్నారు. టాప్ కాలేజీల్లోనే ఈ అడ్డగోలు దందా సాగిందంటే మిగతా కాలేజీల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆ మూడు కాలేజీల్లోని మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ వివరాలను ‘సాక్షి’ సంపాదించింది. వాటిని పరిశీలించగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా.. గండిపేట ప్రాంతంలోని ఓ టాప్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటాలో 285 సీట్లుంటే.. అందులో 152 సీట్లను ర్యాంకులు లేని వారికే కేటాయించారు. అందులో 93 మందికి ఎన్నారై కోటాలో, మిగతా 59 మందికి మేనేజ్మెంట్ కోటాలో సీట్లను కేటాయించారు. నిబంధనల ప్రకారం ఒక కాలేజీలోని 70 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో ప్రవేశాల కమిటీ, మరో 30 శాతం సీట్లను మేనేజ్మెంట్లు భర్తీ చేస్తాయి. అందులో 15 శాతం సీట్లను ఎన్నారై/ఎన్నారై స్పాన్సర్డ్ కోటాలో కేటాయించాలి. మరో 15 శాతం సీట్ల భర్తీలో జేఈఈ మెయిన్ ర్యాంకర్లకు మొదటి ప్రాధాన్యం, ఎంసెట్ ర్యాంకర్లకు రెండో ప్రాధాన్యం ఇవ్వాలి. ఎవరూ లేకుంటే ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా సీట్లను కేటాయించాలి. కానీ ఎన్నారై కోటాలో 93 సీట్లను మాత్రమే భర్తీ చేసి, మేనేజ్మెంట్ కోటాలో 192 సీట్లను భర్తీ చేశారు. ఈ 192 సీట్లలోనూ 59 మంది జేఈఈ కానీ, ఎంసెట్ ర్యాంకుగానీ లేనివారే కావడం గమనార్హం. షేక్‌పేట ప్రాంతంలోని మరో కాలేజీలో 198 సీట్లను మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేస్తే అందులో 130 సీట్లను 20 వేలకు పైగా ర్యాంకు వచ్చిన వారికి కేటాయించారు. ఇందులో 50 వేల నుంచి 94 వేల వరకు ర్యాంకు వచ్చిన వారే 40 మంది వరకు ఉన్నారు. ఇక ఇబ్రహీంబాగ్ ప్రాంతంలోని మరో కాలేజీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇవే కాదు బయటకురాని మిగతా కాలేజీల్లోనూ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీలో నిబంధనలను తుంగలో తొక్కి యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా అమ్ముకుంటున్నాయి. వారికెలా సీట్లు వచ్చాయి? రాష్ట్రంలోనే టాప్ కాలేజీలుగా పేర్కొనే వాటిల్లో జేఈఈ, ఎంసెట్ లేకుండా సీట్లు రావడం సాధ్యమేనా అంటే సాంకేతిక విద్యాశాఖ అధికారులు అసాధ్యం అని చెబుతున్నారు. టాప్ కాలేజీల్లోని మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం పోటీపడే వారిలో 10 వేల ర్యాంకు పైనున్న వారంతా ఉంటారు. 10 వేల ర్యాంకులోపు వారికి ఏదో ఒక మంచి కాలేజీలోనే సీట్లు వస్తాయి. పైగా 10 వేల ర్యాంకు వరకు ఎంత ఫీజు ఉంటే అంత ఫీజును ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో ఇస్తుంది. కాబట్టి వారంతా కన్వీనర్ కోటాలోనే ఏదో ఒక మంచి కాలేజీలో చేరిపోతారు. మరీ టాప్ కాలేజీలోనే సీటు కావాలనుకునే వారు మాత్రమే డొనేషన్ చెల్లించి అయినా కోరుకున్న మేనేజ్మెంట్ కోటాలో చేరతారు. నిజానికి మేనేజ్మెంట్ కోటా, కన్వీనర్ కోటా ఫీజు సమానమే. కానీ ఏ ఒక్క టాప్ కాలేజీ కూడా ఆ కామన్ ఫీజుకు సీట్లు ఇవ్వడం లేదన్నది బహిరంగ రహస్యమే. అడ్డగోలు డొనేషన్లతో సీట్లను అమ్ముకోవడం వల్లే టాప్ కాలేజీల్లో 20 వేల నుంచి లక్షకు పైగా ర్యాంకులు ఉన్న వారికి కూడా సీట్లు వస్తున్నాయని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ర్యాంకుతో పనేముంది? గండిపేట, షేక్‌పేట, ఇబ్రహీంబాగ్ ప్రాంతాల్లోని ఆ టాప్–3 కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటాలో 663 సీట్లను భర్తీ చేస్తే.. అందులో ఎంసెట్ ర్యాంకుగానీ, జేఈఈ ర్యాంకుగానీ లేని 167 మందికి ఇంజనీరింగ్ సీట్లను కేటాయించాయి. 20 వేలలోపు ర్యాం కుతో సీట్లు పొందిన విద్యార్థులు కేవలం 170 మందే ఉన్నారు. 50 వేల ర్యాంకు నుంచి లక్షకు పైగా ర్యాంకు వచ్చిన వారు 85 మంది విద్యార్థులున్నారు. 21 వేల నుంచి 50 వేల లోపు ర్యాంకు వచ్చిన మరో 241 మంది విద్యార్థులు ఈ టాప్ కాలేజీల్లో సీట్లు పొందినట్లు బయటపడింది. ఇవేకాదు ఘట్కేసర్, ఇబ్రహీంపట్నం, బాచుపల్లిలోని టాప్ కాలేజీలతోపాటు నగర శివారుల్లోని మరో 80కి పైగా కాలేజీల్లో కూడా ఇదే దందా సాగుతోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. -
కన్వీనర్ కోటాలో అదనంగా 2,378 సీట్లు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈసారి కన్వీనర్ కోటా సీట్లు పెరిగాయి. 2017–18లో ఈ కోటాలో 62,188 సీట్లు ఉండగా.. ఈసారి (2018–19) 64,566 సీట్లు అందుబాటులో ఉన్నట్టు ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. అంటే గతేడాదికన్నా 2,378 సీట్లు పెరిగాయి. ఇందులో అత్యధికంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కోర్సులోనే సీట్లు ఎక్కువగా పెరగడం గమనార్హం. ఐటీలో గతేడాది 2,487 సీట్లు అందుబాటులో ఉండగా.. ఈసారి 3,369 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ)లో మాత్రం సీట్లు తగ్గిపోయాయి. ఈ కోర్సు కన్వీనర్ కోటాలో గతేడాది 8,412 సీట్లు ఉండగా.. ఈసారి 8,372 సీట్లు మాత్రమే ఉన్నాయి. మొత్తంగా కన్వీనర్ కోటా సీట్లను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేసేందుకు ప్రవేశాల క్యాంపు కార్యాలయం చర్యలు చేపట్టింది. గతేడాది 29 కోర్సుల్లో ప్రవేశాలకు చర్యలు చేపట్టగా.. ఈసారి రెండు కొత్త కోర్సులకు అనుమతులు వచ్చాయి. అందులో పెట్రోలియం ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో 42 సీట్లకు, ఫార్మాస్యుటికల్ ఇంజనీరింగ్‌లో 42 సీట్లు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. టాప్–100లో ముగ్గురే హాజరు ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా సోమవారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభమైంది. తొలిరోజున ఒకటో ర్యాంకు నుంచి 10 వేల ర్యాంకు వరకు విద్యార్థులను పిలవగా.. 5,699 మంది వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. అందులో టాప్–100లోపు ర్యాంకులు వచ్చినవారు కేవలం ముగ్గురే ఉండటం గమనార్హం. 101 ర్యాంకు నుంచి 500లోపు ర్యాంకు వారిలోనూ 63 మందే హాజరయ్యారు. ఇక స్పెషల్ కేటగిరీలో భాగంగా ఒకటో ర్యాంకు నుంచి 40 వేల ర్యాంకు వరకున్న ఎన్సీసీ విద్యార్థుల్లో వెరిఫికేషన్‌కు 6,075 మంది హాజరయ్యారు. మంగళవారం (29న) 10,001వ ర్యాంకు నుంచి 25 వేల ర్యాంకు వరకు, ఎన్సీసీ కేటగిరీలో 40,001వ ర్యాంకు నుంచి 80 వేల ర్యాంకు వరకు విద్యార్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుందని ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థులంతా వచ్చే నెల 5వ తేదీలోగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. -
213 కాలేజీలు.. 95 వేల సీట్లు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో 19 వేల ఇంజనీరింగ్ సీట్లకు కోత పడింది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) రాష్ట్రంలోని 228 కాలేజీల్లో 1,14,117 సీట్లకు అనుమతి ఇవ్వగా.. యూనివర్సిటీలు మాత్రం 213 కాలేజీల్లోని 95,235 సీట్లకే అనుబంధ గుర్తింపు ఇచ్చాయి. 15 కాలేజీల్లోని 19 వేల సీట్లకు కోత పెట్టాయి. ఇందులో కొన్ని కాలేజీలు సొంతంగా మూసివేసుకున్నవి కూడా ఉన్నాయి. మరోవైపు యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చిన 29 కాలేజీల్లోని 4 వేలకు పైగా సీట్లను యాజమాన్యాలే తమ కన్సార్షియం ద్వారా సొంతంగా భర్తీ చేసుకోనున్నాయి. మిగిలిన 184 కాలేజీల్లో 90,900 సీట్లు అందుబాటులో ఉండగా, కన్వీనర్ కోటాలో 64,500 సీట్లను భర్తీ చేసేందుకు ప్రవేశాల కమిటీ చర్యలు చేపట్టింది. ఈనెల 25వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించగా.. 28 నుంచి (సోమవారం) విద్యార్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌తోపాటు వెరిఫికేషన్ చేయించుకున్న వారు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్లు ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు హెల్ప్‌లైన్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాలని ప్రవేశాల కమిటీ పేర్కొంది. హెల్ప్‌లైన్ కేంద్రాల వివరాలను, వెంట తెచ్చుకోవాల్సిన సర్టిఫికెట్ల వివరాలను, ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టే వివరాలను, వెబ్ ఆప్షన్లు ఇచ్చే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలను తమ వెబ్సైట్లో (https://tseamcet.nic.in) పొందుపరిచామని తెలిపింది. అభ్యర్థులు వెబ్సైట్లో వివరాలను అనుసరించాల్సి ఉంటుందని పెర్కొంది. 1వ ర్యాంక్ నుంచి 10 వేల ర్యాంక్ వరకు తొలిరోజు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు 1వ ర్యాంక్ నుంచి 40 వేల వరకు ఉంటుంది. స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు సాంకేతిక విద్యా భవన్లో వెరిఫికేషన్ ఉంటుంది. వెరిఫికేషన్ పూర్తయిన వారు వచ్చే నెల 5వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని పేర్కొంది. ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు వచ్చే నెల 8వ తేదీన మొదటి దశ సీట్ల కేటాయింపును ప్రకటించనుంది. -
ఇంజనీరింగ్ సీట్ల కోత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈసారి కూడా భారీగా సీట్లు తగ్గనున్నాయి. ఈ మేరకు యూనివర్సిటీలు చేపట్టిన కసరత్తు పూర్తికావచ్చింది. అనుబంధ గుర్తింపు జాబితాలను ప్రవేశాల కౌన్సెలింగ్ కోసం వర్సిటీలు సిద్ధం చేస్తున్నాయి. జేఎన్టీయూ పరిధిలోని కాలేజీల్లోనే అత్యధికంగా సీట్లకు కోత పడే పరిస్థితులు ఉన్నట్లు ఉన్నత విద్యా మండలి అంచనా వేస్తోంది. జేఎన్టీయూ పరిధిలో 10 వేల వరకు సీట్లకు కోత పడే అవకాశం ఉందని పేర్కొంటోంది. కొన్ని కాలేజీల్లో ల్యాబ్‌లు లేకపోయినా కోర్సులను నిర్వహిస్తున్న కాలేజీలు ఉన్న ట్లు జేఎన్టీయూ తన ఫాక్ట్ ఫైండింగ్ కమిటీల (ఎఫ్ఎఫ్సీ) తనిఖీల్లో తేల్చింది. మరో 36 కాలేజీల్లో ఫ్యాకల్టీ సమస్య అధికంగా ఉన్నట్లు అంచనాకు వచ్చింది. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫె సర్లు లేకున్నా ఆయా కాలేజీలు కోర్సులను నిర్వహిస్తున్నట్లు తేల్చింది. దీంతో ఆ మేరకు సీట్లకు కోత విధించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. మరోవైపు ఇప్పటికే 14 కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతులు నిరాకరించడంతోపాటు 10,122 సీట్లకు కోత విధించింది. గతేడాది 27 వేల సీట్లకు కోత.. 2017–18 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 212 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1.24 లక్షల సీట్ల భర్తీకి ఏఐసీటీఈ అనుమతి ఇచ్చినా.. జేఎన్టీయూ సహా యూనివర్సిటీలు 97,961 సీట్ల భర్తీకి అనుబంధ గుర్తింçపు ఇచ్చాయి. ఈసారి ఏఐసీటీఈ 10,122 సీట్లను తగ్గించిన నేపథ్యంలో యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చే సీట్ల సంఖ్య గతేడాది కంటే భారీగా తగ్గిపోయే పరిస్థితి నెలకొంది. పైగా వరుసగా మూడేళ్లలో 25 శాతం లోపు సీట్లు భర్తీ అయిన బ్రాంచీలను రద్దు చేస్తామని ప్రకటించడంతో భారీగా సీట్లు తగ్గిపోయే అవకాశం ఉంది. అయితే గతంతో పోల్చితే కాలేజీలు చాలా వరకు తమ లోపాలను సరిదిద్దుకున్నాయని, అయినప్పటికీ ఇంకా కొన్ని కాలేజీల్లో లోపాలు ఉన్నట్లు తేలింది. ఈసారి ఏఐసీటీఈ 228 కాలేజీల్లో 1,14,117 సీట్లలో ప్రవేశాలకు అనుమతులు ఇవ్వగా.. జేఎన్టీయూ మరో 10 వేల వరకు సీట్లకు కోత విధించే అవకాశం ఉన్నట్లు ఉన్నత విద్యా మండలి వర్గాలు అంచనా వేశాయి. -
రాష్ట్రంలో మిగిలే ఇంజనీరింగ్ సీట్లు 80 వేలే!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య మరోసారి భారీగా తగ్గనుంది. ఈ ఏడాది ఏకంగా 25 వేల సీట్లకు కోతపడనుంది. ఈసారి మొత్తంగా అందుబాటులో ఉండే ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య 75 వేల నుంచి 80 వేల వరకే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. వరుసగా మూడేళ్ల పాటు 25 శాతం కంటే తక్కువ సీట్లు భర్తీ అయిన బ్రాంచీలను రద్దు చేస్తామని జేఎన్టీయూ ఇటీవలే స్పష్టం చేయడం, యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని వివరించిన నేపథ్యంలో సీట్ల కోత కచ్చితమేనని స్పష్టమవుతోంది. సీట్లు నిండకపోవడంతో.. ప్రస్తుత విద్యా సంవత్సరం (2017–18)లో రాష్ట్రంలోని 212 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1.04 లక్షల సీట్ల భర్తీకి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చింది. కానీ జేఎన్టీయూ సహా యూనివర్సిటీలు 97,961 సీట్లకు మాత్రమే అనుబంధ గుర్తింçపు ఇచ్చాయి. అయితే అనుమతించిన వాటిల్లోనూ పెద్ద సంఖ్యలో సీట్లు మిగిలిపోయాయి. చాలా కాలేజీల్లోని పలు బ్రాంచీల్లో 25 శాతం కన్నా తక్కువ సీట్లు భర్తీ అయ్యాయి. తాజాగా అలాంటి బ్రాంచీలను రద్దు చేయనున్నారు. 112 కాలేజీల్లోని సీట్లు.. గతేడాది రాష్ట్రంలోని 112 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్న పలు బ్రాంచీల్లో అతి తక్కువగా సీట్లు భర్తీ అయ్యాయి. ఈ బ్రాంచీల్లో 41,628 సీట్లు అందుబాటులో ఉండగా.. 2,874 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ 109 కాలేజీల్లోని పలు బ్రాంచీల్లో 47,640 సీట్లుండగా.. 5,687 మాత్రమే భర్తీ అయ్యాయి. ఈ బ్రాంచీలన్నీ 30శాతం లోపు సీట్ల భర్తీ ఉన్నవే. ఏఐసీటీఈ కూడా.. వరుసగా మూడేళ్ల పాటు 30 శాతంలోపు సీట్లు భర్తీ అయిన బ్రాంచీలను రద్దు చేస్తామని ఏఐసీటీఈ ఇప్పటికే కాలేజీలకు స్పష్టం చేసింది. ఈ లెక్కన రాష్ట్రంలో 41,628 ఇంజనీరింగ్ సీట్లు రద్దవుతాయి. అయితే ప్రస్తుతానికి అలాంటి బ్రాంచీల్లోని 50శాతం సీట్లకు కోత వేస్తామని ఏఐసీటీఈ ప్రకటించింది. కానీ రాష్ట్రంలో జేఎన్టీయూ మాత్రం 30 శాతం కాకుండా 25 శాతంలోపు సీట్ల భర్తీని పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఇలా 25 శాతంలోపు సీట్లు భర్తీ అయిన బ్రాంచీలను రద్దు చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో 41,628 సీట్లు కాకపోయినా 25వేల సీట్ల వరకు కోత తప్పదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇతర వృత్తి విద్యా కోర్సుల్లోనూ.. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లోనే కాదు ఇతర వృత్తి విద్యా కోర్సుల్లోనూ సీట్లకు కోత పడనుంది. మౌలిక సదుపాయాలు లేకపోవడం, ఫ్యాకల్టీ కొరత వంటి కారణాలతో చాలా కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలు సరిగా ఉండడం లేదు. అలాంటి కాలేజీల్లో చదివితే ప్రయోజనం ఉండదన్న ఉద్దేశంతో విద్యార్థులు మంచి విద్యాసంస్థల వైపే మొగ్గుతున్నారు. దీంతో చాలా కాలేజీల్లో సీట్లు భర్తీ కావడం లేదు. ఫలితంగా గత మూడేళ్లలో 242 కాలేజీలు రద్దు కాగా.. 53,163 సీట్లకు కోత పడింది. ► 2015లో బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీ కోర్సుల్లో 2,05,640 సీట్లు అందుబాటులో ఉండగా.. 2017 ప్రవేశాల నాటికి ఈ సంఖ్య 1,52,476కు తగ్గింది. ఇందులోనూ భర్తీ అయిన సీట్లు 1,15,420 మాత్రమే. ► ప్రధానంగా ఇంజనీరింగ్‌లోనే అత్యధిక సంఖ్యలో సీట్లు మిగిలిపోతున్నాయి. గతేడాది కూడా ప్రవేశాలకు ఆమోదం పొందిన సీట్లలో 29,367 సీట్లు మిగిలిపోయాయి. ఈ పరిస్థితుల్లో 25 శాతం భర్తీ నిబంధనతో 25 వేల సీట్లకు కోతపడే అవకాశముంది. ► ఇంజనీరింగ్ ప్రవేశాల విషయంలో దేశవ్యాప్తంగా ఇదే తరహా పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా 3,325 ఇంజనీరింగ్ కాలేజీల్లో 16.3 లక్షల సీట్లు అందుబాటులో ఉండగా.. ఏటా 8.5 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అవుతున్నాయి. వచ్చే మూడేళ్లను పరిగణనలోకి తీసుకోవాలి ‘‘బ్రాంచీల రద్దు విషయంలో గడిచిన మూడేళ్ల ప్రవేశాలను కాకుండా వచ్చే మూడేళ్లలో ప్రవేశాలను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు సూచించాం. ఆ నిబంధనపై పునః పరిశీలన చేయాలని కోరాం. అనుబంధ గుర్తింపు కోసం ఈ నెల 19వరకు దరఖాస్తు చేసుకునే వీలుంది. ఆ తర్వాత ఈ అంశంపై స్పష్టత వస్తుంది..’’ – గౌతంరావు, కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు -
సీటుకో రేటు!
-
సీటుకో రేటు!
అడ్డగోలుగా ఇంజనీరింగ్ సీట్ల అమ్మకాలు మేనేజ్మెంట్ కోటా సీటు → టాప్ కాలేజీల్లో రూ. 12 లక్షలు, → ద్వితీయ శ్రేణి కాలేజీల్లో రూ. 38 లక్షలు ► ప్రవేశాల నోటిఫికేషన్ రాకముందే బేరసారాలు ► కాలేజీలకు ఇంకా అనుబంధ గుర్తింపే రాలేదు ► ఈలోగానే సీట్లను అంగట్లో పెట్టి అమ్ముతున్న యాజమాన్యాలు ► ఆందోళనలో తల్లిదండ్రులు.. పట్టించుకోని ఉన్నత విద్యా మండలి శ్రీనివాస్‌రావు ఓ ప్రైవేటు ఉద్యోగి. ఆయన కొడుకు శ్రీవాత్సవకు ఎంసెట్‌లో 75 వేలకు పైగా ర్యాంకు వచ్చింది. కష్టమైనా కొడుకును ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ చదివించాలన్నది ఆయన కోరిక. హిమాయత్‌నగర్‌లో ఓ టాప్ కాలేజీ బ్రాంచి ఆఫీస్‌ను సంప్రదించారు. అక్కడున్న వారు ‘సీట్లు అయిపోవచ్చాయి. రెండే ఉన్నాయి. కావాలంటే రూ.12 లక్షలు అవుతుంది.. ముందుగా రూ.1 లక్ష చెల్లించి రిజిస్టర్ చేయించుకోండి.. లేదంటే అవీ ఉండవు..’ అనడంతో కంగుతిన్నారు. నర్సింహమూర్తి ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఆయన కూతురు లక్ష్మీప్రసన్న ఎంసెట్, జేఈఈ రాసింది. ఎంసెట్‌లో 28 వేలకు పైగా ర్యాంకు వచ్చింది. మంచి కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చదువుతానంటోంది. దీంతో ఆమె తండ్రి ఓ కన్సల్టెన్సీని సంప్రదించారు. సీటుకు రూ.15 లక్షలు అని వారు చెప్పడంతో నోట మాట రాలేదు. సాక్షి, హైదరాబాద్ ...ఇది ఈ ఇద్దరు తల్లిదండ్రులదే కాదు.. టాప్ కాలేజీలు, ద్వితీయశ్రేణి ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీటు కోసం యత్నిస్తున్న తల్లిదండ్రులందరిదీ ఇదే పరిస్థితి. సీటు కావాలంటే రూ.5 లక్షల నుంచి రూ.12 లక్షలు చెల్లించాల్సిందేనంటున్నాయి కాలేజీలు! దళారులు సైతం రంగంలోకి దిగి టాప్ కాలేజీల్లో సీట్లు కావాలంటే బ్రాంచిని బట్టి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు అవుతుందంటూ బేరాలు నడుపుతున్నారు. అదీ ముందు కనీసం రూ.1 లక్ష చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆ సీటు ఉంటుందని చెబుతుండటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ పిల్లలను టాప్ కాలేజీల్లో చదివించుకోవాలన్న తల్లిదండ్రుల ఆకాంక్షను యాజమాన్యాలు ఇలా క్యాష్ చేసుకుంటూ సీట్లను అడ్డంగా అమ్ముకుంటున్నా ఉన్నత విద్యా మండలి స్పందించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనుబంధ గుర్తింపు రాకముందే.. ఇంకా ఇంజనీరింగ్ కాలేజీల అనుబంధ గుర్తింపే రాలేదు. ఎన్ని సీట్లకు అనుమతి వస్తుందో తెలియదు. ఇప్పటివరకైతే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనుమతి ఇచ్చిన 242 కాలేజీల్లో 1,24,239 లక్షల సీట్లలో కేవలం 65 వేల సీట్లకే యూనివర్సిటీల నుంచి అనుబంధ గుర్తింపునకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. అదికూడా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇంకా ఎన్ని సీట్లకు అనుబంధ గుర్తింపు వస్తుందో తెలియదు. అయినా యాజమాన్యాలు మేనేజ్మెంట్ కోటా సీట్లను అడ్డగోలుగా అమ్మకానికి పెట్టాయి. ప్రతిభ, ర్యాంకులతో సంబంధం లేదు. డబ్బులు చెల్లిస్తే చాలు.. మా సీట్లు... మా ఇష్టం.. అమ్మేసుకుంటాం అన్న రీతిలో ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. 70 శాతం కన్వీనర్ కోటా సీట్లకు ప్రవేశాల నోటిఫికేషన్ జారీ కాకముందే 30 శాతం మేనేజ్మెంట్ కోటా సీట్ల అమ్మకానికి తెర లేపాయి. ‘సీట్లు అయిపోతున్నాయి... త్వరగా అడ్వాన్స్ చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోండి..’అంటూ తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ విషయం ఉన్నత విద్యా మండలికి తెలిసినా పట్టించుకోవడం లేదు. ఫిర్యాదులు వస్తేనే చర్యలు చేపడతామంటూ చేతులు ముడుచుకు కూర్చుంది. కనీసం ర్యాటిఫికేషన్లు ఇచ్చే సమయంలో కాలేజీ వారీగా ప్రతిభావంతులకే సీట్లు ఇచ్చారా? లేదా? అన్న విషయాలను కూడా ఉన్నత విద్యా మండలి అధికారులు సరిగ్గా చూడకుండా, యాజమాన్యాల అమ్మకాలకు ఆమోద ముద్ర వేస్తుండటం వల్లే అడ్డగోలుగా సీట్ల అమ్మకాలు సాగుతున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. నిబంధనలు ఏం చెబుతున్నాయంటే.. ఇంజనీరింగ్‌లో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో, 30 శాతం సీట్లను మేనేజ్మెంట్ కోటా (బీ కేటగిరీ) కింద భర్తీ చేయాలి. యాజమాన్య కోటాలో 15 శాతం సీట్లను జేఈఈ మెయిన్ ర్యాంకు ఆధారంగా, మిగిలినవాటిని ఎన్ఆర్ఐ/ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటాలో విద్యార్థులకు కేటాయించాలి. మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో జేఈఈ మెయిన్ ర్యాంకుల వారీగా సీట్లు కేటాయించగా మిగిలితే ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా మెరిట్ ప్రకారం సీట్లను ఇవ్వాలి. కానీ దరఖాస్తుల ప్రక్రియ లేకుండానే సీట్లను అమ్మకానికి పెట్టాయి. వాస్తవానికి కన్వీనర్ కోటా సీట్లకు నిర్ణయించిన ఫీజునే మేనేజ్మెంట్ కోటా(ఎన్నారై మినహా) సీట్లకు వర్తింపజేయాలి. కానీ అదేమీ లేకుండా యాజమాన్యాలు లక్షలకు అమ్ముకుంటున్నాయి. చివరకు ఎన్ఆర్ఐ కోటా సీట్లకు కూడా అదనంగా డిమాండ్ చేస్తున్నాయి. కన్సల్టెన్సీల మాయాజాలం.. కన్వీనర్ కోటాలో సీటు రాదేమోనన్న తల్లిదండ్రుల ఆందోళనను యాజమాన్యాలు, కన్సల్టెన్సీలు క్యాష్ చేసుకుంటున్నాయి. ఈ విషయంలో ఇటు ఉన్నత విద్యా మండలి, అటు ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో యాజమాన్యాలు ఆడిందే ఆటగా సాగుతోంది. ద్వితీయ శ్రేణి కాలేజీలు కూడా ఈసీఈ, సీఎస్ఈ వంటి సీట్లకు రూ.3 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నాయి. కొన్ని కాలేజీ యాజమాన్యాలైతే కన్సల్టెన్సీలతో ఒప్పందం కుదుర్చుకుని, కమీషన్ ప్రాతిపదికన సీట్లు అమ్ముకుంటున్నాయి. కొన్ని కాలేజీల సిబ్బంది అయితే తల్లిదండ్రులకు ఫోన్లు చేసి మరీ.. సీట్లు అయిపోతున్నాయంటూ ఆందోళనలో పడేస్తున్నాయి. కొన్నింట్లోనే ఆన్లైన్.. మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి ముందుగా నోటిఫికేషన్ జారీ చేసి, విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలి. అలా వచ్చిన విద్యార్థుల దరఖాస్తులను పరిశీలించి మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించాలి. అలా సీట్లు పొందిన విద్యార్థుల వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలి. కానీ దీన్ని కొన్ని కాలేజీలే పాటిస్తున్నాయి. మిగితా కాలేజీల్లో ఆన్లైన్ లేకుండా పోయింది. ఈ విషయంలో ఉన్నత విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఉన్నత విద్యామండలి కూడా గుడ్డిగా ఆమోదముద్ర (ర్యాటిఫికేషన్) వేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పైన పటారం.. లోన లొటారం!
‘మా కాలేజీలో అద్భుత సౌకర్యాలు కల్పిస్తున్నాం.. పరిమిత సీట్లున్నాయి.. మీ పిల్లల్ని వెంటనే చేర్పించండి.. ఆలస్యం చేస్తే సీటు దొరకడమే కష్టం.. అసలే మా కాలేజీకి గిరాకీ పెరిగింది..’ ఉన్నత విద్యా కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం కాలేజీల యాజమాన్యాలు చెప్పే మాటలివి. తీరా లోపలికి వెళ్లాక చూస్తే అక్కడ సగం సీట్లు కూడా భర్తీ కాని పరిస్థితి. ఇలా ప్రతిష్టకుపోయి పైన పటారం.. లోన లొటారం అన్న చందంగా మారింది ప్రస్తుతం కాలేజీల పరిస్థితి. హైదరాబాద్ : రాష్ట్రంలో ఉన్నత విద్యాకోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి సీట్ల భర్తీ దారుణంగా పడిపోయింది. అన్ని కోర్సుల్లో కూడా సగానికి పైగా సీట్లు మిగిలిపోయాయి. ఇంజనీరింగ్తోసహా అన్ని కోర్సులదీ ఇదే పరిస్థితి. అనేక కాలేజీలు మూతపడే దశకు చేరుకున్నాయి. కొన్ని కాలేజీలు అరకొర విద్యార్థులతోనే కొనసాగుతున్నాయి. కొన్ని కాలేజీల్లో విద్యార్థులు ఉన్నట్లు లెక్కచూపుతూ వారిని పక్కనే ఉన్న మరో కాలేజీల తరగతులకు పంపిస్తున్నాయి. కాలేజీలు మూతవల్ల వచ్చే ప్రయోజనం ఉండదని, ఏదోలా కొనసాగిస్తే వచ్చే విద్యా సంవత్సరానికైనా చేరికలు పెరుగుతాయన్నది కొన్ని యాజమాన్యాల ఆశ. కాలేజీ ఏర్పాటు చేసి విద్యార్థులు చేరక మూసేశారన్న మాట రాకుండా ప్రతిష్ట కాపాడుకొనేందుకు పిల్లలు లేకపోయినా మరి కొందరు కాలేజీలను కొనసాగిస్తున్నారు. వివిధ ఉన్నత విద్యాకోర్సుల్లో ప్రవేశానికి ఉన్నత విద్యామండలి ఏటా 8 ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ తదితర కోర్సులకు సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ విభాగంలో ప్రవేశాలకు ఎంసెట్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఐసెట్, బీఈడీ కోర్సులకు బీఎడ్, లా కోర్సుల ప్రవేశానికి లాసెట్, ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సులకు పీజీఈసెట్, బీటెక్ లేటరల్ ఎంట్రీ (డిప్లొమో విద్యార్థులు రెండో ఏడాది ప్రవేశానికి) ఈసెట్, పాలిటెక్నిక్ కోర్సుల కోసం పాలీసెట్లను నిర్వహిస్తోంది. యాజమాన్య కోటాలో మరింత అధ్వానం 2017 విద్యాసంవత్సరానికి సంబంధించి ఈనెలలో నోటిఫికేషన్ వెలువరించనున్న దశలోనూ కొన్ని కాలేజీలు తమ సంస్థల్లో ప్రవేశాలను నిర్వహిస్తూనే ఉన్నాయి. ఈ ప్రవేశాలను అనుమతించాలంటూ అవి ఉన్నత విద్యామండలికి ప్రతిపాదనలూ అందిస్తున్నాయి. గడువు ముగిసిపోయి ప్రవేశాలు జరుపుతున్నా సీట్లు సగానికి దాటకపోవడం విశేషం. కన్వీనర్ కోటాలోని సీట్లే మిగిలిపోయిన తరుణంలో ఇక యాజమాన్యకోటా సీట్ల భర్తీ మరింత అధ్వానంగా ఉంది. -
మరింత తగ్గనున్న ఇంజనీరింగ్ సీట్లు!
♦ బ్రాంచీల రద్దుకు 80కి పైగా కాలేజీల దరఖాస్తు ♦ ప్రవేశాల రద్దుకు దరఖాస్తు చేసిన మరో 11 కాలేజీలు ♦ దరఖాస్తులను పరిశీలిస్తున్న జేఎన్టీయూహెచ్ ♦ నెలాఖరులో ఇంజనీరింగ్ కాలేజీల్లో తనిఖీలు షురూ! ♦ కాలేజీల గుర్తింపు నోటిఫికేషన్ జారీ చేసిన ఏఐసీటీఈ ♦ ఈనెల 5 నుంచి వచ్చే నెల 4 వరకు దరఖాస్తుల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరంలో (2017–18) ఇంజనీరింగ్ సీట్లు భారీగా తగ్గనున్నాయి. 11 కాలేజీల వరకు ప్రవేశాలను రద్దు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోగా, 80కి పైగా కాలేజీలు బ్రాంచీలను రద్దు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. కాలేజీల్లోని వివిధ బ్రాంచీల్లో సీట్లను తగ్గించుకునేందుకు మరో 10కి పైగా కాలేజీల నుంచి జవహర్లాల్ నెహ్రూ సాంకే తిక విశ్వ విద్యాలయం–హైదరాబాద్ (జేఎన్టీ యూహెచ్)కు దరఖాస్తులు వచ్చాయి. కాలేజీల్లో కోర్సుల రద్దు, బ్రాంచీల రద్దు, సీట్ల తగ్గింపు కోసం నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీ చేసేందుకు జేఎన్టీయూహెచ్ ఇటీవల దరఖాస్తులను ఆహ్వానించింది. ఆ గడువు డిసెంబరు 27వ తేదీతో ముగిసింది. ప్రస్తుతం ఆ దరఖాస్తుల పరిశీలన జరుగుతోంది. జేఎన్టీయూహెచ్ ఇచ్చే ఎన్వోసీతో కాలేజీ యాజమాన్యాలు ఏఐసీటీఈకి దరఖాస్తు చేసుకోనున్నాయి. 2016–17 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 219 కాలేజీల్లో 1.04 లక్షల సీట్ల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టగా, అందులో 75 వేల వరకే సీట్లు భర్తీ అయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈసారి మరింతగా సీట్లు తగ్గిపోనున్నాయి. గుర్తింపునకు ఏఐసీటీఈ నోటిఫికేషన్ సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు అవసరమైన గుర్తింపు ప్రక్రియను చేపట్టేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 5వ తేదీ నుంచి సాంకేతిక విద్యా కాలేజీ యాజమాన్యాలు గుర్తింపు, కోర్సుల రద్దు, బ్రాంచీల రద్దు, సీట్ల తగ్గింపు, కాలేజీల షిఫ్టింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. వచ్చే నెల 4వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, ఆలస్య రుసుముతో (పాత కాలేజీలు) వచ్చే నెల 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. కాలేజీల అనుమతుల ప్రక్రియను పిబ్రవరి 5వ తేదీ నుంచి ప్రారం భిస్తామని, ఏప్రిల్ 10 లోగా పూర్తి చేస్తామని ఏఐసీటీఈ మెంబర్ సెక్రటరీ అలోక్ ప్రకాశ్ మిట్టల్ ఆ నోటిఫికేషన్లో వివరించారు. కసరత్తు వేగవంతం చేసిన జేఎన్టీయూహెచ్ ఏఐసీటీఈ నోటిఫికేషన్ నేపథ్యంలో రాష్ట్రంలో యూనివర్సిటీ నుంచి కాలేజీలు అనుబంధ గుర్తింపును (అఫిలియేషన్) పొందే ప్రక్రియపైనా జేఎన్టీయూహెచ్ దృష్టి సారించింది. కాలేజీల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించేందుకు కసరత్తు ప్రారంభించింది. జనవరి మొదటి లేదా రెండో వారంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఇటీవల నిర్ణ యించింది. త్వరలోనే దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించి.. మరోవైపు తనిఖీలను చేపట్టాలని నిర్ణయించింది. ఈ నెలాఖరు నుంచి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీల (ఎఫ్ఎఫ్సీ) ఆధ్వర్యంలో తనిఖీలను ప్రారంభించేందుకు కసరత్తు ప్రారంభించింది. నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ఈనెల 25 నుంచి కాలేజీల్లో తనిఖీలు ప్రారంభించే అవకాశం ఉంది. వీలైతే కలసి.. లేదంటే సమాంతరంగా తనిఖీలు ఏఐసీటీఈ బృందాలు కాలేజీల్లో సదుపాయాలపై తనిఖీ చేయనున్నాయి. వీలైతే ఏఐసీటీఈ బృందాలతో జేఎన్టీయూహెచ్ ఎఫ్ఎఫ్సీ బృందాలు కలసి తనిఖీలు చేసే అంశంపై పరిశీలన జరుపుతోంది. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి అనుమతుల ప్రక్రియ, కాలేజీల తనిఖీలను ఏఐసీటీఈ ప్రారంభించనుంది. దీంతో కలసి తనిఖీలు చేపట్టే అంశంపై ఏఐసీటీఈతో మాట్లాడేందుకు జేఎన్టీయూహెచ్ సిద్ధమవుతోంది. తద్వారా కాలేజీల్లో సదుపాయాలు, లోపాలు, సమస్యలపై తనిఖీలను మరింత పక్కాగా, పారదర్శకంగా చేపట్టవచ్చని భావిస్తోంది. అలా వీలుకాకపోతే సొంతంగా తనిఖీలు జరపనుంది. మే నెలలో యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపి, కాలేజీలకు అనుబంధ గుర్తింపును జారీ చేయనుంది. జూన్ 1వ తేదీకల్లా ప్రవేశాలకు సిద్ధంగా ఉండాలని భావిస్తోంది. -
తగ్గిపోతున్న విద్యార్థులు 'ఎంసెట్ రద్దు'!
-
ఎంసెట్ రద్దు?
భారీగా ఇంజనీరింగ్ సీట్లున్నా చేరేవారు లేకపోవడంతో ప్రభుత్వ యోచన జేఈఈ మెయిన్ ర్యాంకులతో ఇంజనీరింగ్ ప్రవేశాలు!.. లేదా ఇంటర్ మార్కుల ఆధారంగా భర్తీ ఇప్పటికే ‘నీట్’ పరిధిలోకి వెళ్లిపోయిన మెడికల్, డెంటల్ కోర్సులు అగ్రికల్చర్, ఆయుష్ కోర్సులకు ప్రత్యేక పరీక్ష న్యాయపరమైన సమస్యలేమైనా ఉంటాయా అని పరిశీలన సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లు ఎక్కువగా ఉండి, విద్యార్థులు తక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఎంసెట్ నిర్వహణ అవసరమా అన్న ఆలోచనలు మొదలయ్యాయి. ఇప్పటికే మెడికల్, డెంటల్ కోర్సులు జాతీయ స్థాయి ప్రవేశపరీక్ష ‘నీట్’ పరిధిలోకి వెళ్లిపోయాయి. దీంతో మిగిలిన అగ్రికల్చర్, ఆయుష్ తదితర కోర్సులకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించి.. ఇంజనీరింగ్ ప్రవేశాలను మాత్రం నేరుగా జేఈఈ మెయిన్ ర్యాంకులతోనో, ఇంటర్ మెరిట్‌తోనో చేపట్టాలని ప్రభుత్వ వర్గాలు యోచిస్తున్నాయి. తగ్గిపోతున్న విద్యార్థులు.. గత ఏడేళ్లలో వరుసగా ఐదేళ్లపాటు ఇంజనీరింగ్ సీట్లు పెరిగినా.. వాటిలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. 2016-17లో మొత్తంగా 1,43,820 సీట్లు అందుబాటులో ఉంటే.. 80 వేల సీట్లు (60 శాతం) కూడా నిండలేదు. కన్వీనర్ కోటాలో 1,00,674 సీట్లు అందుబాటులో ఉంటే.. అందులో 54,172 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే దాదాపు సగం మిగిలిపోయాయి. మేనేజ్మెంట్ కోటాలోనూ 43 వేలకు పైగా సీట్లుంటే భర్తీ అయిన సీట్లు 25 వేలకు మించలేదని ఉన్నత విద్యాశాఖ వర్గాలు అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం ప్రత్యేకంగా ప్రవేశపరీక్ష అవసరమా? అన్న కోణంలో ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. మెడికల్ కోర్సులకు ‘నీట్’ వచ్చే విద్యా సంవత్సరం నుంచి మెడికల్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలను ‘నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స టెస్టు (నీట్)’ ద్వారా చేపట్టనున్న విషయం తెలిసిందే. దీంతో అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు వేరుగా పరీక్ష నిర్వహించి.. ఇంజనీరింగ్ ప్రవేశాలను మాత్రం ఇంటర్ మార్కులు లేదా జేఈఈ మెయిన్ స్కోర్ ఆధారంగా భర్తీ చేస్తే ఎలా ఉంటుందని విద్యాశాఖ యోచిస్తోంది. ప్రస్తుతం ఎంసెట్ తుది ర్యాంకు ఖరారులో ఇంటర్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంది. అందువల్ల ఎంసెట్ లేకుండా ప్రవేశాలు చేపడితే న్యాయపరమైన సమస్యలేమైనా తలెత్తుతాయా? అన్న కోణంలో పరిశీలన జరుపుతోంది. ప్రస్తుతం ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్ స్కోర్ ఆధారంగానే తమ రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో ప్రవేశాలు చేపట్టేందుకు గుజరాత్, మధ్య ప్రదేశ్, హరియాణా, ఉత్తరాఖండ్, నాగాలాండ్, ఒడిషా తదితర రాష్ట్రాలు ముందుకొచ్చాయి. ఈ నేపథ్యంలో మన రాష్ట్రం కూడా జేఈఈ మెయిన్ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు చేపడితే ఎలా ఉంటుందన్న ప్రతిపాదన ఉంది. లేకపోతే ఇంటర్ మార్కుల ఆధారంగా ప్రవేశాలు చేపట్టడం ద్వారా వెయిటేజీ వంటి అంశాల్లో న్యాయపరమైన ఇబ్బందులను అధిగమించవచ్చన్న ఆలోచన కూడా ఉంది. ఈ అంశంపై త్వరలోనే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో విస్రృ్తత సమీక్ష నిర్వహించి తుది నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలిసింది. కాగా ఎంసెట్‌ను రద్దు చేస్తే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందని, దీనిపై పూర్తిగా అధ్యయనం చేశాకే తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు పి.మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. -
నేటి నుంచి తుది విడత కౌన్సెలింగ్
- 24న ధ్రువపత్రాల పరిశీలన, 25 వరకు ఎంసెట్ 1 వెబ్ఆప్షన్లు - ఎంసెట్-1 కౌన్సెలింగ్ వివరాలు - తొలుత ప్రకటించిన సీట్లు 9,123 - కేటాయించిన సీట్లు 57,940 - మిగిలిపోయిన సీట్లు 11,183 - గడువులోగా రిపోర్టు చేసినది 44,420 - తుదిదశకు కొత్తగా జతయిన సీట్లు 1,403 - తుదిదశకు అందుబాటులోని సీట్లు 26,106 సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ సీట్ల భర్తీకోసం నిర్వహించిన ఎంసెట్-1 తుది విడత కౌన్సెలింగ్ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. మొత్తంగా 26 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. తొలిదశలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకుని సీట్లు రాని అభ్యర్థులతోపాటు ఎంసెట్‌లో ర్యాంకులు పొందినా తొలిదశ కౌన్సెలింగ్‌కు హాజరుకాని వారు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. 24న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 21 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. ఇక తొలిదశలో సీట్లు పొందిన అభ్యర్థులు కూడా మెరుగైన కళాశాల/కోర్సులను ఎంచుకునేందుకు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. 24, 25వ తేదీల్లో అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈనెల 27న రాత్రి 8 గంటల తర్వాత సీట్ల కేటాయింపు చేపడతారు. ఇక జేఎన్టీయూహెచ్ ఇటీవల అఫిలియేషన్ ఇచ్చిన మరో మూడు ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజులను ఏఎఫ్ఆర్సీ నిర్ధారించింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో తొలిదశలో మిగిలిపోయిన సీట్లకు అదనంగా మరో 1,403 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే మరో రెండు బీఫార్మసీ కళాశాలలకు, ఒక ఫార్మ్-డి కళాశాలకు జేఎన్టీయూహెచ్ అఫిలియేషన్ ఇచ్చినందున.. వాటికి కూడా ఏఎఫ్ఆర్సీ ఫీజులను నిర్ధారించింది. మరో ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో 60 సివిల్ ఇంజనీరింగ్ సీట్లకు అనుమతిస్తూ ఇంకో ఉత్తర్వును విద్యాశాఖ జారీచేసింది. -
ఖాళీశాలలు
ఇంజనీరింగ్ సీట్ల తీరు మిగులుతో యాజమాన్యాల దిగులు మొదటి విడత జాబితాలో 46 శాతమే భర్తీ రెండో విడతపైనే ఆశలు కళాశాలల నిర్వహణపై మల్లగుల్లాలు ఫీజుల కుదింపుతో విద్యార్థుల వెనుకంజ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఇంజనీరింగ్ కళాశాలలు యాజమాన్యానికి గుదిబండలవుతున్నాయి. ఫీజుల భారంతో పాటు, కోర్సు పూరై్తనా ఉపాధి అవకాశాలు దొరక్కపోవటంతో విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యాభ్యాసానికి ఆసక్తి చూపడం లేదు. ఇంజనీరింగ్ స్థానంలో సాధారణ డిగ్రీ కోర్సులో చేరడానికే శ్రద్ధ చూపుతున్నారు. గతంలో విద్యార్థులతో కళకళలాడిన జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలలు ఇప్పుడు చేరే వారే లేక వెలవెల బోతున్నాయి. అన్ని వసతులున్నా.. అనువైన ఫ్యాకల్టీ ఉన్నట్లు జేఎన్టీయూ అధికారులు సర్టిఫికెట్ ఇచ్చి అప్లియేషన్ ఇచ్చినా.. కళాశాలల్లో మాత్రం ఆశించిన స్థాయిలో విద్యార్థులు చేరకపోవడంతో రూ.కోట్లు చెల్లించి కళాశాలలు నిర్వహిస్తున్న యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. గతంలో తొలి విడత జాబితాలో 80 శాతం సీట్లకు పైగా భర్తీ కాగా ఈసారి 46 శాతం మాత్రమే సీట్లు నిండటం గమనార్హం. సగం సీట్లు మాత్రమే భర్తీ ఇంజనీరింగ్ కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు వెబ్ ఆప్షన్ ద్వారా ఎంచుకున్న కళాశాలల జాబితాను జేఎన్టీయూ అధికారులు ప్రకటించారు. ఈ జాబితాలో జిల్లాలో మొత్తం 31 ఇంజనీరింగ్ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో 8,500కు పైగా సీట్లు అందుబాటులో ఉండగా.. మొదటి జాబితాలో 4,350 సీట్లే భర్తీ అయినట్లు తెలిసింది. ఇందులో ప్రధానంగా నాలుగు కళాశాలల్లోనే ఆశించిన స్థాయిలో సీట్లు భర్తీ అయ్యాయి. వీటిల్లో ప్రధానంగా డిమాండ్ ఉన్న కోర్సులు సివిల్, సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ వంటి కోర్సుల్లో కూడా పలు కళాశాలల్లో ఆశించిన స్థాయిలో భర్తీ కావడం లేదు. ఫీజు కుదింపుతో విద్యార్థుల వెనుకంజ ఏటా వేలాది మంది విద్యార్థులు ఇంటర్ ఉత్తీర్ణులై.. ఎంసెట్‌లో మంచి మార్కులు సాధించే సత్తా ఉన్నా ప్రభుత్వం ఈసారి ఫీజులు కుదించడంతో పేద విద్యార్థులు ఇంజనీరింగ్ చదివేందుకు వెనుకంజ వేస్తున్నారు. పేద విద్యార్థులకు పెద్ద చదువులు భారం కావద్దనే ఆలోచనతో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంసెట్‌లో అర్హత సాధించిన ప్రతీ విద్యార్థికి ఇంజనీరింగ్ చదువు పూర్తయ్యే వరకు ఫీజులు చెల్లించేవారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం 10 వేల ర్యాంకులోపు వచ్చిన వారికే మొత్తం ఫీజు చెల్లిస్తామని, ఎక్కువ ర్యాంకు వచ్చిన వారిలో ఎస్సీ, ఎస్టీల ఫీజులు మాత్రమే ఇస్తామని ప్రకటిండంతో బీసీ, ఓసీ విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యా భారంగా మారింది. ఏటా కళాశాల ఫీజు కేవలం రూ. 35వేలు మాత్రమే చెల్లిస్తుందని, మిగిలిన డబ్బులు విద్యార్థులే చెల్లించాలని ప్రకటించారు. దీంతో జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలల ఫీజు రూ. 60 వేల నుండి రూ.40 వేల లోపు ఉండగా.. ప్రభుత్వం చెల్లించే ఫీజు పోగా మిగిలినవి ఎలా చెల్లించాలని, ఫీజుతోపాటు జేఎన్టీయూ, బస్సు ఫీజు, ఇతర ఫీజుల కోసం అప్పులు చేసి చదవడం కన్నా డిగ్రీలో చేరడమే మేలనే ఆలోచనలో విద్యార్థులు ఉన్నారు. -
16న ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు!
- వెబ్ ఆప్షన్ల గడువు మరో రెండు రోజులు పొడిగింపు - హైకోర్టు ఆదేశాలతో షెడ్యూలు మార్పునకు - ఉన్నత విద్యా మండలి కసరత్తు - ముందస్తు షెడ్యూలు ప్రకారమే చివరి దశ కౌన్సెలింగ్ సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రవేశాల షెడ్యూలులో మార్పులు జరగనున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు కౌన్సెలింగ్ షెడ్యూలులో మార్పులు చేసేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. వెబ్ ఆప్షన్ల గడువు మరో రెండు రోజులు పొడిగించాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది. 14వ తేదీ ఉదయం 10 గంటల వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించి, 16వ తేదీన సీట్ల కేటాయింపును ప్రకటించనుంది. కోర్టు ఉత్తర్వుల కాపీ అందగానే ఒకటీ రెండు రోజుల్లో షెడ్యూలును అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధమైంది. ముందస్తు షెడ్యూలు ప్రకారం.. మొదటి దశ కౌన్సెలింగ్‌లో ఈ నెల 11వ తేదీ ఉదయం 10 గంటల వరకు 90,001వ ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకున్న విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే వీలు ఉంది. 10, 11 తేదీలు, 12వ తేదీ ఉదయం 10 గంటల వరకు అన్ని ర్యాంకుల వారు వెబ్ ఆప్షన్లలో మార్పులు చేసుకునేలా అధికారులు చర్యలు చేపట్టారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడం, మార్పులు చేసుకునే ప్రక్రియ 12వ తేదీ ఉదయం 10 గంటలకు ముగియాల్సి ఉంది. 14న సీట్లను కేటాయించాల్సి ఉంది. అయితే కోర్టు ఆదేశాల మేరకు వెబ్ ఆప్షన్లను ఈనెల 14 వ తేదీ ఉదయం 10 గంటలవరకు పొడిగించేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులకు ఇంజనీరింగ్‌లో సీట్ల కేటాయింపును 14న కాకుండా 16వ తేదీన ప్రకటించేందుకు సిద్ధమైంది. హైకోర్టు ఉత్తర్వుల కాపీ అధికారికంగా అందగానే వెబ్ ఆప్షన్ల గడువు పెంపు ప్రకటనను జారీ చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. కాలేజీల్లో చేరే షెడ్యూలుకు, చివరి దశ కౌన్సెలింగ్‌కు దీనితో ఎలాంటి ఇబ్బంది లేదని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 21వ తేదీ వరకు ఫీజు చెల్లించి, కాలేజీల్లో చేరవచ్చని, ఈ షెడ్యూలులో మార్పు ఉండకపోవచ్చని, అవసరమైతే 23వ తేదీ వరకు కూడా ఫీజు చెల్లింపు, కాలేజీల్లో చేరేందుకు అవకాశం ఇచ్చే వీలుంటుందని వెల్లడించారు. ఇక చివరి దశ కౌన్సెలింగ్‌లో భాగంగా ముందస్తు షెడ్యూలు ప్రకారం ఈనెల 24, 25 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టి, ఆయా తేదీల్లోనే వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు 27న సీట్లను కేటాయించి, 29 వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించ నున్నారు. ఆప్షన్లు ఇచ్చిన వారు 63,067 మంది ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా శనివారం వరకు 68,118 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కాగా 63,067 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. విద్యార్థులు ఇచ్చిన ఆప్షన్ల సంఖ్య 30,78,057 కు చేరింది. విద్యార్థులు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవాలని అధికారులు సూచించారు. -
'ముందే సీట్లు అమ్ముకుంటే చర్యలు'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ అడ్మిషన్లు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని తెలంగాణ ఉన్నతవిద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు. జులై 1 లోపే జేఎన్టీయూ నుంచి కాలేజీల లిస్ట్ వస్తుందని ఆయన చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో పాపిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఆప్లియేషన్ లిస్ట్ వచ్చాకే 'బి' కేటగిరి సీట్లపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ముందే ఇంజనీరింగ్ సీట్లు అమ్ముకుంటే ఆయా కాలేజీలపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పాపిరెడ్డి హెచ్చరించారు. -
జూన్ 22న ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
కాకినాడ (తూర్పు గోదావరి) : ఎంసెట్ ఇంజినీరింగ్ అభ్యర్థులకు సీట్ల కేటాయింపు ఈ నెల 22న ఉంటుందని ఏపీ ఎంసెట్ కన్వీనర్, జేఎన్టీయూకే ఓఎస్డీ సీహెచ్ సాయిబాబు గురువారం తెలిపారు. ఈ సంవత్సరం జేఎన్టీయూకే పరిధిలో కొత్తగా మంజూరైన గుంటూరు జిల్లా నరసారావుపేట కళాశాల, రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ యూనివర్సీటీలలో సీట్లకు ఆప్షన్లను విద్యార్థులు ఎంచుకోవచ్చన్నారు. ఈ నెల 19,20 తేదీల్లో మార్పులు, చేర్పులకు అవకాశం ఉందని, దీన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవచ్చునన్నారు. గుంటూరు జిల్లా నరసారావుపేట కళాశాలలో సీఎస్ఈ, సివిల్, మెకానికల్, ఈసీఈ, ఈఈఈ బ్రాంచీల్లో 60 సీట్ల చొప్పున, నన్నయ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో 30, ఐటీలో 30 సీట్లు ఉన్నాయన్నారు. నరసారావుపేట కళాశాలకు జేఎన్‌టీఎన్, నన్నయ్య వర్సిటీకు ఏకేఎన్‌యూ కౌన్సెలింగ్ కోడ్లని తెలిపారు. -
‘మేనేజ్మెంట్’లోనూ 43% సీట్లు మిగులు!
* 33 వేల సీట్లకు 19 వేలు మాత్రమే భర్తీ * లెక్కలు తేల్చిన ఉన్నత విద్యా మండలి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సు కన్వీనర్ కోటాలో సీట్లు మిగలడమే కాకుండా మేనేజ్మెంట్ కోటాలోనూ భారీగా సీట్లు మిగిలిపోతున్నాయి. 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించి మేనేజ్మెంట్ కోటాలో భర్తీ అయిన సీట్ల సంఖ్యను ఉన్నత విద్యా మండలి తేల్చింది. 30 శాతం మేనేజ్మెంట్ కోటాలో 19,171 సీట్లు మాత్రమే భర్తీ అయినట్లు లెక్కలు వేసింది. ఇక 2015-16 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో మొత్తంగా ఇంజనీరింగ్ సీట్లు 59 శాతమే భర్తీ అయ్యాయి. అందులో మేనేజ్మెంట్ కోటాలో 57 శాతం సీట్లు భర్తీ కాగా, 43 శాతం సీట్లు మిగిలిపోయాయి. రాష్ట్రంలోని 340 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,10,255 సీట్ల భర్తీకి అనుమతి ఇవ్వగా మేనేజ్మెంట్ కోటా కింద 33,377 సీట్లు కేటాయించారు. అందులో 19,171 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. యాజమాన్యాలు రాటిఫికేషన్ కోసం దరఖాస్తు చేసిన లెక్కల ప్రకారం 15,794 సీట్లు మిగిలిపోయాయి. -
ఇంజనీరింగ్ సీట్లలో భారీ కోత!
30 వేలకుపైగా తగ్గనున్న సీట్లు మూసివేత కోసం దరఖాస్తు చేసిన కాలేజీలు 21 బ్రాంచీల రద్దు, సీట్ల తగ్గింపునకు ఏఐసీటీఈకి దరఖాస్తు చేసినవి 41 అఫిలియేషన్ల కోసం దరఖాస్తు చేసుకోని కాలేజీలు 58 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం ఇంజనీరింగ్ సీట్లు భారీగా తగ్గిపోనున్నాయి. ఇప్పటికే పలు కాలేజీలు స్వచ్ఛం దంగా మూసివేతకు విజ్ఞప్తిచేసుకోగా.. మరిన్ని కాలేజీలు బ్రాంచీల రద్దు, సీట్ల తగ్గింపు కోసం ‘అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ)’కి దరఖాస్తు చేసుకున్నాయి. ఇక 58 కాలేజీలైతే అసలు అఫిలియేషన్ల కోసం కూడా దరఖాస్తు చేసుకోలేదు. దీంతో మొత్తం గా వచ్చే విద్యా సంవత్సరం(2016-17)లో 30 వేలకు పైగా ఇంజనీరింగ్ సీట్లు రద్దయ్యే అవకాశముంది. ఇదే జరిగితే రాష్ట్రంలోని ఇంజనీరింగ్ సీట్లు మొత్తం భర్తీ అయ్యే అవకాశముంది. గతేడాది కంటే ఈసారి ఇంజనీరింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య పెరగడం కూడా దీనికి తోడ్పడనుంది. రాష్ట్రంలో మొత్తం 249 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా.. అందులో 21 కాలేజీలు మూసివే సుకుంటున్నట్లు జేఎన్టీయూహెచ్కు తెలియజేశాయి. వీటిల్లో ఒక్కో కాలేజీలో 400 నుంచి 900 వరకు సీట్లున్నాయి. సగటున 500 సీట్ల చొప్పున లెక్కించినా 10 వేలకుపైగా సీట్లు తగ్గిపోనున్నాయి. ఇక 41 కాలేజీల యాజమాన్యాలు కొన్ని బ్రాంచీలను పూర్తిగా రద్దు చేయాలని, కొన్ని బ్రాంచీల్లోని సీట్లను తగ్గించాలని ఏఐసీటీఈకి దరఖాస్తు చేసుకున్నాయి. ఈ లెక్కన వీటన్నింటిలో కలిపి మరో 10 వేలకుపైగా సీట్లు తగ్గనున్నాయి. మరోవైపు తమ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ప్రక్రియను జేఎన్టీయూహెచ్ ప్రారంభించింది. కానీ 58 కాలేజీలు గుర్తింపుకోసం దరఖాస్తు చేసుకోలేదు. ఇందులో మూసివేతకు దరఖాస్తు చేసుకున్న కాలేజీలుపోగా... మిగతా 37 కాలేజీల్లోని మరో 10 వే లకు పైగా సీట్లు రద్దయ్యే అవకాశముంది. అయితే ఈ 58 కాలేజీలు బీటెక్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు చేపట్టకపోయినా... ఇప్పటికే ద్వితీయ, తృతీయ, నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల కోసమైనా గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ యాదయ్య పేర్కొన్నారు. లేకపోతే ఆ విద్యార్థులు నష్టపోతారని, అలాంటి కాలేజీలపై చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఈసారి కన్వీనర్ కోటా ఫుల్! 2016-17లో కన్వీనర్ కోటా ఇంజనీరింగ్ సీట్లు పూర్తిగా భర్తీ కానున్నాయి. మేనేజ్మెంట్ కోటాలోనూ చాలా వరకు సీట్లు భర్తీ అయ్యే అవకాశముంది. రాష్ట్రంలోని 249 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,23,427 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో కన్వీనర్ కోటాలో 88,527 సీట్లు, మేనేజ్మెంట్ కోటాలో 37,940 సీట్లు ఉన్నాయి. గతేడాది కన్వీనర్ కోటాలో 56,017 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే 30 వేల సీట్లు మిగిలిపోయాయి. ఈసారి అంతకంటే ఎక్కువ సీట్లు తగ్గిపోనుండడంతో కన్వీనర్ కోటా పూర్తిగా భర్తీ కానుంది. మరోవైపు ఎంసెట్‌కు గతేడాది 1,39,682 మంది దరఖాస్తు చేసుకోగా ఈసారి ఇప్పటివరకు 1,43,362 మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో మేనేజ్మెంట్ కోటాలోనూ సీట్ల భర్తీ పెరగనుంది. -
మెడికల్ సీటు ఇప్పిస్తానంటూ భారీ మోసం
హిమాయత్‌నగర్ (హైదరాబాద్): హిమాయత్‌నగర్‌లోని ప్రైమ్‌టెక్ సొల్యూషన్స్ అనే ఓ కన్సల్టెన్సీపై పోలీసులు బుధవారం దాడులు నిర్వహించి కేసు నమోదు చేశారు. ఈ సంస్థ మెడికల్, ఇంజనీరింగ్ సీట్లు ఇప్పిస్తానని, ఎంసెట్‌లో మార్కులు వేయిస్తానని చెప్పి పెద్ద ఎత్తున మోసానికి పాల్పడుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మెడికల్ సీటు ఇప్పిస్తానని తన దగ్గర ప్రైమ్‌టెక్ సొల్యూషన్స్ అధినేత సతీష్‌పాల్‌యాడ్ రూ.10 లక్షలు తీసుకున్నారంటూ గోపీకృష్ణ అనే బాధితుడు నారాయణగూడ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కన్సల్టెన్సీ కార్యాలయంపై దాడులు నిర్వహించి విచారణ నిర్వహించారు. కాగా, బాధితుల సంఖ్య పెద్ద మొత్తంలో ఉంటుందని భావిస్తున్నారు. పదేళ్ల నుంచి ఈ సంస్థ ఇక్కడ నడుస్తోంది. -
ఏంటి.. ఇలా జరుగుతోంది..!
ఇంజినీరింగ్ కళాశాలల్లో సగం సీట్లే భర్తీ కడప ఎడ్యుకేషన్ : ఇటీవల జరిగిన మొదటి విడతకౌన్సెలింగ్‌లో జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్లు భర్తీ కాలేదు. కనీస స్థాయిలో కూడా విద్యార్థులు చేరకపోవడంతో ఇంజీనీరింగ్ కళాశాలల యాజమాన్యం ఆందోళన చెందుతోంది. గతేడాది ఎంసెట్ కౌన్సెలింగ్ ఆలస్యం కావటంతో చాలా మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాలలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో చేరిపోయారు. కానీ ఈసారి మాత్రం సకాలంలోనే కౌన్సెలింగ్ జరిగింది. కానీ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యం ఊహించినంత స్పందన మాత్రం లేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పించటంతోపాటు వేలకు వేలు వెచ్చించి అధ్యాపకులను నియమించుకున్నారు. కానీ విద్యార్థులు చేరకపోతే పరిస్థితి ఏమిటని మథనపడుతున్నారు. జిల్లాలో మొత్తం 21 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 10,500 సీట్లు ఉండగా ఇందులో సగం సీట్లు కూడా భర్తీ కాలేదని తెలిసింది. జిల్లా వ్యాప్తంగా రెండు మూడు కళాశాలల్లో మాత్రమే వందశాతం సీట్లు భర్తీ అయినట్లు సమాచారం. కొన్ని కళాశాలల్లో పది నుంచి యాభై లోపు సీట్లు మాత్రమే భర్తీ అయినట్లు తెలిసింది. మరికొన్ని కళాశాలల్లో మాత్రం బోధన సిబ్బంది, వసతులు కళాశాల పేరును పరిగణలోకి తీసుకుని పలువురు విద్యార్థులు చేరేందుకు మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. కళాశాలలు ఎక్కువగా ఉండటం విద్యార్థులు తక్కువగా ఉండటంతో కళాశాల యాజమాన్యాలను ఆందోళన వెంటాడుతోంది. దీంతో రెండవ విడత కౌన్సెలింగ్‌పై వారు ఆశలు పెట్టుకున్నారు. -
ఏపీలో మొదటివిడత ఇంజనీరింగ్సీట్ల ప్రక్రియపూర్తి
-
ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు ఖరారు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపును ఖరారు చేసినట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మొత్తం 73,072 సీట్లు భర్తీ చేసినట్టు తెలిపారు. ఇంకా ఏడు కాలేజీల్లో విద్యార్థులు చేరలేదన్నారు. ఆ సీట్ల భర్తీకి త్వరలోనే రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. -
నాణ్యతకు తెగులు.. సీట్లు మిగులు!
ఇంజనీరింగ్ సీట్ల మిగులులో ఐదో స్థానంలో తెలంగాణ నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్ సాక్షి, హైదరాబాద్: నాణ్యతా ప్రమాణాల్లేని కాలేజీలు.. ఉపాధి అవకాశాలను అందించని చదువులు.. వెరసి ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్లు పెద్ద సంఖ్యలో మిగిలిపోతున్నాయి! కాలేజీల్లో ఏటా సీట్ల సంఖ్య పెరుగుతున్నా.. వాటిలో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇదే ధోరణి కనిపిస్తోంది. ఈ విషయాన్ని ప్రభుత్వ లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. గడిచిన ఐదేళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజనీరింగ్ కాలేజీల్లోని సీట్ల భర్తీ క్రమంగా తగ్గిపోయింది. దేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. ఇంజనీరింగ్ సీట్ల మిగులులో తెలంగాణ ఐదో స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఆ రాష్ట్రంలోని కాలేజీల్లో ఏకంగా 80 శాతం సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోతున్నాయి. మిగులు సీట్ల విషయంలో యూపీ మొదటి స్థానంలో ఉండడం గమనార్హం. ఇక ఇంజనీరింగ్‌లో నాణ్యతకు పెద్దపీట వేస్తూ, ఉపాధి అవకాశాలకు అవసరమైన చర్యలు చేపడుతున్న కర్ణాటక.. సీట్ల భర్తీలో మొదటి స్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రంలో మిగిలిపోయిన సీట్లు కేవలం 15 శాతమే. ఆ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర ఉంది. ఆ రాష్ట్రంలో 20 శాతం సీట్లు మాత్రమే మిగులుతున్నాయి. ఈ నేపథ్యంలో నాణ్యమైన విద్య అందిస్తూ, ఉపాధి అవకాశాలకు చర్యలు తీసుకుంటేనే ఇంజనీరింగ్ చదువులకు మనుగడ ఉంటుందని విద్యావేత్తలు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ దిశగా కసరత్తు ప్రారంభించినా.. పక్కా ప్రణాళికలతో ముందుకు సాగితేనే మంచి ఫలితాలు వస్తాయని అభిప్రాయపడుతున్నారు. ఉపాధి కల్పన ఎక్కడ..? ఐటీలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉద్యోగ అవకాశాల కల్పనలో మాత్రం వెనుకంజలో ఉన్నాయి. ఒకప్పుడు అగ్రశ్రేణి దేశాల సరసన నిలిచిన మన విద్యార్థులు ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్, సబ్జెక్టు సామర్థ్యాల విషయంలో చతికిలపడుతున్నారు. కాలేజీల మధ్య అనారోగ్యకర పోటీ, సీట్లు నింపుకునే తాపత్రయం, నాణ్యతా ప్రమాణాలను గాలికొదిలేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. -
అందుబాటులోకి 86,695 సీట్లు
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణలో 86,695 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. 174 ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టేందుకు సుప్రీంకోర్టు బుధవారం ఓకే చెప్పిన నేపథ్యంలో ఈనెల 31న కౌన్సెలింగ్ షెడ్యూల్ జారీ చేయాలని, నవంబర్ 5, 6 తేదీల్లో కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించాలని ఉన్నత విద్యాశాఖ భావిస్తోంది. ప్రభుత్వ ఆమోదం తీసుకొని కౌన్సెలింగ్‌కు చర్యలు చేపట్టే అవకాశం ఉంది. నవంబర్ 10, 11ల్లో తుది సీట్ల కేటాయింపులు చేసి, మిగులు సీట్లను స్పాట్ అడ్మిషన్లలో భర్తీ చేస్తారు. మేనేజ్మెంట్ కోటా సీట్లను నవంబరు 14లోగా భర్తీ చేసేలా షెడ్యూల్ జారీ చేయవచ్చు. ఈ ప్రవేశాలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో చేపడతారా, ఏపీ మండలి నేతృత్వంలోనా అన్నదానిపై తీర్పు కాపీ అందాకే స్పష్టత రానుంది. కొత్తగా అందుబాటులోకొచ్చే సీట్లలో కన్వీనర్ కోటాలో 60,687, మేనేజ్మెంట్ కోటాలో 26,008 సీట్లు ఉన్నాయి. తెలంగాణ విద్యార్థులు తక్కువే.. ప్రస్తుత కౌన్సెలింగ్‌లో సీట్లు భాగానే అందుబాటులో ఉన్నా.. తెలంగాణకు చెందిన అర్హులైన అభ్యర్థులు చాలా తక్కువగా ఉన్నారు. తెలంగాణ మొత్తమ్మీద ఎంసెట్ రాసిన వారిలో అర్హత సాధించిన వారు 88,937 మంది. ఇందులో ఇప్పటికే 52,839 మంది విద్యార్థులు వేర్వేరు కాలేజీల్లో చేరిపోయారు. మొత్తమ్మీద తెలంగాణకు విద్యార్థుల్లో మరో 26,098 మంది మాత్రమే అర్హులున్నారు. వారిలో ఎందరు కాలేజీల్లో చేరతారో తేలాలి. ఏపీ విద్యార్థుల్లో మంచి ర్యాంకు ఉన్న వారు 15 శాతం ఓపెన్కోటాలో వచ్చే అవకాశం ఉండగా, మరికొంతమంది మేనేజ్మెంట్ కోటాలో చేరే అవకాశం ఉంటుంది. తీర్పు కాపీ అందగానే చర్యలు: టీ మండలి చైర్మన్ పాపిరెడ్డి సుప్రీం ఆదేశాల ప్రకారం తెలంగాణ ఉన్నత విద్యా మండలి నేతృత్వంలో తదుపరి చర్యలు చేపడతాం. కోర్టు తీర్పు కాపీ అందిన వెంటనే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకుంటాం. కౌన్సెలింగ్ షెడ్యూలును జారీ చేసి ప్రవేశాలను చేపడతాం. ప్రభుత్వం ఓకే అనగానే 31న నోటిఫికేషన్ జారీ చేస్తాం. -
రండి బాబూ.. రండి!
►విద్యార్థులకు ఇంజినీరింగ్ కళాశాలల ఎర్ర తివాచీ ►ఏ గ్రేడ్ కళాశాలల్లో 90 శాతం సీట్లు భర్తీ ►పలు కళాశాలల్లో 100 లోపు సీట్లే భర్తీ ►తుది విడత కౌన్సెలింగ్‌పై ఆశలు పెట్టుకున్న యాజమాన్యాలు గుంటూరు ఎడ్యుకేషన్: కన్వీనర్ కోటాలోని ఇంజినీరింగ్ సీట్లే అరకొరగా భర్తీ అవటంతో జిల్లాలోని చాలా కళాశాలల యూజమాన్యాలు బెంబేలెత్తుతున్నాయి. విద్యార్థులను ఆకర్షించటానికి నానాపాట్లూ పడుతున్నారుు. ఎలాగోలా సీట్లు భర్తీ అయ్యేలా చూసుకునేందుకు వ్యూహాలు పన్నుతున్నారుు. రండి బాబూ.. రండంటూ విద్యార్థులకు ఆహ్వానం పలుకుతున్నారుు. ఎంసెట్ ర్యాంకుల వారీగా విద్యార్థులు సీట్లు పొందిన కళాశాలల జాబితా వివరాలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శనివారం రాత్రి ఎంసెట్ వెబ్సైట్లో పొందుపర్చింది. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. జిల్లాలో 41 ఇంజినీరింగ్ కళాశాలు ఉండగా టాప్ టెన్ కళాశాలల్లో మాత్రమే దాదాపు 90 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. బీ, సీ గ్రేడ్ కళాశాలల్లో సగానికి మించి భర్తీ కాలేదు. ఇటీవల ప్రారంభించిన కళాశాలల్లో సీట్లు భర్తీకి నోచుకోకపోవడం యాజమాన్యాలకు షాకిచ్చింది. పీఆర్వోలను నియమించుకుని భారీఎత్తున ప్రచారం చేపట్టినా ఫలితం లేకపోవడంతో అవి తలలు పట్టుకుంటున్నాయి. కేవలం ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి కళాశాలలను నిర్వహిస్తున్న యాజమాన్యాల పరిస్థితి మరింత దయనీయంగా తయూరైంది. అధ్యాపకులు, బోధన వసతులు, ఉత్తీర్ణత శాతం, ఉద్యోగ అవకాశాల కల్పనలో కళాశాలల ట్రాక్ రికార్డ్‌పై విద్యార్థులు దృష్టి సారించడంతో చాలా కళాశాలలు తొలి దశ కౌన్సెలింగ్‌లో అసలు బోణీ కొట్టలేదు. పదుల సంఖ్యలోని కళాశాలల్లో అన్ని విభాగాల్లో కలిపి 50 నుంచి 100 లోపు సీట్లే భర్తీ అయినట్లు తెలుస్తోంది. దీంతో మలి విడత కౌన్సెలింగ్‌పైనే యూజమాన్యాలు ఆశలు పెట్టుకున్నాయి. జిల్లాలో 19,250 మంది ఎంసెట్ రాయగా నాలుగు హెల్ప్‌లైన్ కేంద్రాల్లో గత నెల 7న మొదలై 23న ముగిసిన సర్టిఫికెట్ల పరిశీలనకు 8,839 మంది హాజరయ్యారు. జిల్లాలో కాకినాడ జేఎన్టీయూ, ఏఎన్‌యూ పరిధిలో ఉన్న 41 కళాశాలల్లో దాదాపు 16 వేల సీట్లు ఉన్నాయి. అలాట్మెంట్ ఆర్డర్ పొందిన విద్యార్థులు సీటును ధ్రువీకరించుకునేందుకు సోమవారం నుంచి ఆయూ హెల్ప్‌లైన్ కేంద్రాల కు హాజరుకావాలి. అక్కడి కోఆర్డినేటర్ నుంచి సీటు కేటాయింపు ధ్రువీకరణపత్రం పొందాలి. హెల్ప్‌లైన్ కేంద్రాల్లో పొందిన సీటు కేటాయింపు ధ్రువీకరణ పత్రం, ఫీజు చెల్లింపు రసీదును సెప్టెంబర్ 6వ తేదీలోగా ఆయా కళాశాలల్లో సమర్పించాలి. లేనిపక్షంలో సీటు రద్దవుతుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత కలిగిన విద్యార్థులకు రూ.35 వేలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫీజు మొత్తం రూ. 35 వేలు ఉంటే విద్యార్థి కళాశాలకు ఎటువంటి రుసుం చెల్లించనవసరం లేదు.తమకు కేటాయించిన కళాశాలలో చేరేందుకు ఆసక్తి లేని పక్షంలో విద్యార్థులు వెళ్లనవసరం లేదు. వీరు మలి విడత కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చు. -
ఇంజనీరింగ్ సీట్లు ఖాళీ
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల కోసం ఒకప్పుడు గట్టి పోటీ నెలకొనేది. పరిమితంగా ఉన్న కళాశాలల్లో ముఖ్య సీట్లను కైవశం చేసుకోవడం లక్ష్యంగా తీవ్ర ప్రయత్నాలు చేసేవారు. అయితే, ఇప్పుడు పరిస్థితి మారింది. పరిమితం నుంచి అపరిమిత స్థాయికి రాష్ట్రంలో కళాశాలలు పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పరంగా 571 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో 2,88,486 సీట్లు ఉన్నాయి. వీటిలో ఇది వరకు ప్రభుత్వ కోటా సీట్లు 1,69,789 ఉండేవి. రెండుమూడేళ్లుగా సీట్ల భర్తీ తగ్గుముఖం పడుతుండడంతో అనేక కళాశాలలు తమ యాజమాన్య కోటా సీట్లను ప్రభుత్వానికే ఇచ్చే పనిలో పడ్డాయి. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ కోటా సీట్ల సంఖ్య 2,11,355కు చేరింది. అన్నావర్సిటీ నేతృత్వంలో ప్రతి ఏటా ఈ కోటా సీట్లను భర్తీ చేస్తున్నారు. ఆదరణ కరువు: గత ఏడాది అనేక ఇంజనీరింగ్ కళాశాలల్లో పలు కోర్సులకు విద్యార్థులే కరువయ్యారు. ఈ ఏడాది పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. జనరల్ కోటా సీట్లకు 1,69,789 మంది దరఖాస్తులు చేసుకోవడంతో ప్రభుత్వ కోటా సీట్లు పూర్తిగా భర్తీ అయ్యేది కూడా కష్టంగా మారింది. ప్రభుత్వ కోటా సీట్లు కొంత మేరకు ఖాళీగా ఉండొచ్చన్న భావన తొలుత బయలు దేరినా, ప్రస్తుతం ఆ ఖాళీ లక్ష వరకు ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇందుకు కారణం విద్యార్థులు ఇంజనీరింగ్ మీద దృష్టి పెట్టకపోవడమే. ఈ ఏడాది ప్లస్‌టూ ఉత్తీర్ణత శాతం గణనీయంగా ఉన్నా, ఇంజనీరింగ్ మీద విద్యార్థులు దృష్టి పెట్టక పోవడం కళాశాలల యాజమాన్యాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఆందోళన : పుట్టగొడుగుల్లా కళాశాలలు పుట్టుకు వచ్చినా, విద్యా నాణ్యతను పాటించే సంస్థలు అంతంత మాత్రమేనన్న విమర్శలు రాష్ట్రంలో కొంతకాలంగా వినిపిస్తున్నారుు. కొన్ని గుర్తింపు పొందిన అతి పెద్ద కళాశాలల్లో సీట్ల కోసం మాత్రమే విద్యార్థులు ఉత్సాహం చూపుతున్నారు. మారుమూల ప్రాంతాల్లో, దక్షిణాది జిల్లాల్లోని అనేక కళాశాలల మీద విద్యార్థులు దృష్టి పెట్టడం లేదని తాజా కౌన్సెలింగ్ ద్వారా స్పష్టం అవుతోంది. గ్రామీణ విద్యార్థులకు ఉన్నత చదువులను దరి చేర్చాలన్న కాంక్షతో నెలకొల్పిన ప్రభుత్వ కళాశాలల్లోనూ సీట్లు ఖాళీగా ఉండటం గమనార్హం. ప్రతి ఏటా సీట్ల ఖాళీలు పెరుగుతుండడంతో కళాశాలల యాజమాన్యాల్లో ఆందోళన నెలకొంటోంది. ఈ ఖాళీలతో కళాశాలల నిర్వహణా పరిస్థితి దారుణంగా తయార య్యే అవకాశాలున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెయ్యి మంది కరువు : ఇంజనీరింగ్ సీట్ల వ్యవహారం మంగళవారం అసెంబ్లీకి చేరింది. తమ ప్రాంతంలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటయ్యేనా? అని ఓ సభ్యుడు వేసిన ప్రశ్నకు ఉన్నత విద్యా శాఖ మంత్రి పళనియప్పన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ సభ్యుడు ఆర్ముగం తన నియోజకవర్గంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు విషయంగా సంధించిన ప్రశ్నకు మంత్రి పళనియప్పన్ స్పందిస్తూ, ఈ ఏడాది ఇంజనీరింగ్ సీట్ల భర్తీ పురాణం అందుకున్నారు. 2,11,358 సీట్లు ప్రభుత్వ కోటాలో ఉన్నాయని, రోజుకు నాలుగు వేల మంది విద్యార్థులను కౌన్సెలింగ్‌కు పిలుస్తున్నామని వివరించారు. అయితే కనీసం వెయ్యి మంది కూడా కౌన్సెలింగ్‌కు రావడం లేదని, దీన్ని బట్టి అర్థం చేసుకోండి... ఇంజనీరింగ్ సీట్లు ఏ మేరకు ఖాళీగా ఉన్నాయోనని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న కళాశాలల్లోనే సీట్లు వేలాదిగా ఖాళీలుగా మిగులుతుంటే, ఇక కొత్త కళాశాలల ప్రస్తావన తెచ్చే పరిస్థితి లేదని, కొత్త కళాశాలలు ఏర్పాటు చేయబోవడం లేదని స్పష్టం చేయడం గమనార్హం. -
29 నుంచి ఎంసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
జూలై మూడో వారంలో ఐసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రవేశాల కమిటీల్లో రెండు రాష్ట్రాలకు సమ ప్రాధాన్యం సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం ఈనెల 29 నుంచి ఎంసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ప్రారంభించాలని ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయించారు. గురువారం ఉన్నత విద్యా మండలిలో చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఎంసెట్, ఐసెట్, ఈసెట్‌కు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సాంకేతిక విద్యా కమిషనర్లు శైలజా రామయ్యర్, అజయ్‌జైన్, మండలి కార్యదర్శి ప్రొఫెసర్ సతీష్‌రెడ్డి, ప్రవేశాల క్యాంపు ప్రధాన అధికారి రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. ఎంసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ఈనెల 22నుంచే ప్రారంభించాలని ముందుగా భావించినా.. ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు సంబంధించిన పలు ఉత్తర్వులు (జీఓలు) వెలువడాల్సి ఉంది. మరోవైపు ఏఐసీటీఈ కొత్త కాలేజీలకు అనుమతులు ఇస్తోంది. వాటికి యూనివర్సిటీల నుంచి అఫిలియేషన్ రావాల్సి ఉంది. మేనేజ్మెంట్స్ కన్సార్షియంగా ఏర్పడి నిర్వహించుకునే సొంత పరీక్షపైనా ఉత్తర్వులు రావాల్సి ఉంది. ఈ పరిస్థితుల నేపథ ్యంలో 29వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను చేపట్టాలని, ఈలోగా ప్రభుత్వాలను సంప్రదించి అన్నింటికి ఉత్తర్వులు జారీ చేసేలా చ ర్యలు చేపట్టాలని నిర్ణయించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తరువాత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు. ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాల కోసం (లేటరల్ ఎంట్రీ) నిర్వహించిన ఈసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను జూన్ 23 నుంచి; ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను జూలై మూడో వారంలో చేపట్టాలని నిర్ణయించారు. ప్రవేశాల కమిటీల్లో రెండు రాష్ట్రాలకు సమ ప్రాధాన్యం కల్పించనున్నారు. ప్రతి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రవేశాల కమిటీలోనూ రెండు రాష్ట్రాల అధికారుల్లో ఒకరు కన్వీనర్‌గా, మరొకరు కో కన్వీనర్‌గా ఉంటారు. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టేలా మండలి చైర్మన్‌కు అధికారాలు కల్పించారు. -
2 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఖాళీ !
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశాలు దారుణంగా పడిపోయాయి. సుమారుగా రెండు లక్షల ఇంజనీరింగ్ సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు సంబంధించి ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్ పూర్తయిపోగా, 32 కళాశాలల్లో ఒక్క అడ్మిషనూ రాలేదు. తొలి విడత కౌన్సెలింగ్‌లో ఒక్క అడ్మిషన్ రానీ కళాశాలలు 13 ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 32కు చేరింది. తుది విడత సీట్ల కేటాయింపు వివరాలను ఎంసెట్ అడ్మిషన్ల కన్వీనర్ ఆదివారం రాత్రి ఎస్.ఎం.ఎస్. ద్వారా అభ్యర్థులకు చేరవేశారు. కన్వీనర్ కోటాలో ఇంజనీరింగ్ సీట్లు 1,02,105, ఫార్మసీ సీట్లు 8,345 మిగిలిపోయాయి. వీటికి అదనంగా యాజమాన్య కోటాలో దాదాపు లక్ష సీట్లు ఖాళీగా ఉన్నట్టు అంచనా. అంటే ఈ ఏడాది కన్వీనర్, యాజమాన్య కోటాలో కలిపి మొత్తంగా 2 లక్షలకుపైగా ఇంజనీరింగ్ సీట్లు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అడ్మిషన్ల విషయంలో నాణ్యతలేని కళాశాలలు ఈ ఏడాది ఘోరంగా దెబ్బతిన్నాయి. అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభం కావడంతో దాదాపు 40 వేల మంది రాష్ట్ర విద్యార్థులు డీమ్డ వర్సిటీలు, పొరుగు రాష్ట్రాల్లోని ప్రైవేటు వర్సిటీల్లో చేరిపోయారు. 2,19,729 మంది ఎంసెట్‌లో అర్హత సాధించినప్పటికీ ఉపాధి అవకాశాలు కరువవడంతో కేవలం 1,31,396 మంది మాత్రమే కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపారు. తుది విడత కౌన్సెలింగ్‌లో సీటు పొంది న అభ్యర్థులు ఎంసెట్ వెబ్సైట్ నుంచి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుని, ఫీజును చెల్లించాల్సిన వారు చలానా ద్వారా ఇండియన్ బ్యాంకు, లేదా ఆంధ్రా బ్యాంకులో చెల్లించి అక్టోబర్ 5లోగా కళాశాలలో రిపోర్ట చేయాలని అడ్మిషన్ల కన్వీనర్ సూచించారు. అడ్మిషన్ రద్దు చేసుకోదలచిన అభ్యర్థులు హెల్పలైన్ సెంటర్లో అక్టోబర్ 7లోపు సంప్రదించి రద్దు చేసుకుని సర్టిఫికెట్లు వెనక్కి తీసుకోవచ్చు. కళాశాలలో రిపోర్ట చేసినప్పటికీ అక్టోబర్ 7వ తేదీ అనంతరం రద్దు చేసుకోదలచిన అభ్యర్థులు కళాశాల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకుని అక్టోబర్ 10వ తేదీ తరువాత మాసాబ్‌ట్యాంకులోని సాంకేతిక విద్యాభవన్‌లో సర్టిఫికెట్లు పొందవచ్చు. స్పాట్ అడ్మిషన్లకు అక్టోబర్ 8 నుంచి 23వ తేదీ మధ్య నోటిఫికేషన్ జారీచేయనున్నట్టు అడ్మిషన్ల కన్వీనర్ తెలిపారు. భర్తీ తీరు: 55 కళాశాలల్లో 5 లోపు మాత్రమే అడ్మిషన్లు వచ్చాయి. 20 లోపు మాత్రమే అడ్మిషన్లు ఉన్న కాలేజీల సంఖ్య 102గా ఉంది. 100 సీట్ల లోపు నిండిన కళాశాలలు 260 ఉన్నాయి. దీంతో వీటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. మొత్తం 609 ప్రైవేటు, 34 యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలు, 266 ప్రైవేటు ఫార్మసీ, 12 యూనివర్సిటీ ఫార్మసీ కళాశాలలు కౌన్సెలింగ్‌లో పాల్గొనగా.. 1,24,140 సీట్లు భర్తీ అయ్యాయి. ఠ తుది విడతకు 2 కోర్సులకు కలిపి 1,23,085 సీట్లు అందుబాటులో ఉండగా 28,023 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. తొలి విడతలో 1,26,390 మంది సీట్లు పొందినప్పటికీ కేవలం 1,11,505 మంది మాత్రమే కళాశాలల్లో రిపోర్ట చేశారు. ఫార్మసీలో మిగిలిన 8,345 సీట్లను బైపీసీ విభాగం ఎంసెట్ కౌన్సెలింగ్‌కు బదిలీ చేయనున్నారు. -
ఎంసెట్ వెబ్సైట్లో ఖాళీల వివరాలు
రేపు ఎంబీఏ, ఎంసీఏ సీట్ల కేటాయింపు జాబితా వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-2013 తొలి విడత కౌన్సెలింగ్ అనంతరం ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను సాంకేతిక విద్యాశాఖ పొందుపరిచింది. ఎంసెట్ వెబ్సైట్ https://apeamcet.nic.inలో ‘ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్’ అన్న లేబుల్‌ను క్లిక్ చే సి కళాశాల, బ్రాంచీల వారీగా ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను చూడొచ్చు. తొలి విడతలో సీటు లభించినప్పటికీ రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనదలిచిన అభ్యర్థులు ప్రస్తుతం లభించిన సీటు కంటే మెరుగైన సీట్లకే ఆప్షన్ ఇచ్చుకోవాలని సాంకేతిక విద్యాశాఖ తెలిపింది. అభ్యర్థికి రెండో విడతలో దక్కిన సీటు మాత్రమే ఖరారవుతుందని స్పష్టంచేసింది. ఫీజులను చూసి మోసపోని విద్యార్థులు రాష్ట్రంలోని కొన్ని కళాశాలలు బోధనలో నాణ్యత లేనప్పటికీ ఫీజులను మాత్రం రూ.60 వేలు, రూ.70 వేల వరకు ప్రతిపాదించాయి. అయితే వీటిలో బోధన, ఉత్తీర్ణత, వసతులు నామమాత్రంగానే ఉన్నాయని గ్రహించిన విద్యార్థులు వాటిని తిరస్కరించారు. రాజధాని, చుట్టుపక్కల ప్రాంతాల్లోని కొన్ని అత్యధిక ఫీజులు ఉన్న కాలేజీల్లో ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. నాణ్యత ఉండి ఫీజు రూ.35 వేలు ఉన్న కాలేజీల్లో కూడా సీట్లు పూర్తిగా భర్తీ అయ్యాయి. అలాగే నాణ్యత ఉండి లక్ష వరకు ఫీజులు ఉన్నా సీట్లు మొత్తం భర్తీ అయిన కళాశాలలూ ఉన్నాయి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు ముగిసిన కౌన్సెలింగ్ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న వెబ్‌కౌన్సెలింగ్ శుక్రవారంతో ముగియనుంది. శనివారం సీట్ల కేటాయింపు జాబితాను వెల్లడించనున్నట్టు అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి డాక్టర్ కె.రఘునాథ్ వెల్లడించారు. -
2 లక్షల సీట్లు ఖాళీయే !
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది మొత్తం 2 లక్షల వరకు ఇంజనీరింగ్ సీట్లు మిగిలిపోయే సూచనలు కన్పిస్తున్నాయి. తొలి విడత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ పూర్తయ్యేసరికి రాష్ట్రంలో కన్వీనర్ కోటాలోనే లక్ష సీట్లు మిగిలిపోయాయి. బీ ఫార్మసీలో కేవలం 558 సీట్లు మాత్రమే భర్తీ కాగా ఇంకా 7,927 సీట్లు ఖాళీ ఉన్నాయి. మంగళవారం సాయంత్రం సీట్ల కేటాయింపు వివరాలను సాంకేతిక విద్యా శాఖ వెల్లడించింది. విద్యార్థులకు ఎస్.ఎం.ఎస్. ద్వారా తెలియజేసింది. ఈఏడాది ఎంసెట్‌లో 2,18,893 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అనేక అడ్డంకుల నడుమ ఆగస్టు 19న ప్రారంభమై ఈనెల 3న ముగిసిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు కేవలం 1,30,290 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. వీరిలో 1,28,724 మంది వెబ్ఆప్షన్లు ఇవ్వగా.. 1,26,390 మందికి సీట్లు లభించాయి. ఎంపీసీ విభాగంలో ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో కన్వీనర్ కోటాలో మొత్తం 2,34,488 సీట్లు అందుబాటులో ఉండగా.. రెండింట్లో కలిసి 1,08,098 సీట్లు మిగిలాయి. ఇంజనీరింగ్‌లో 99,802, ఫార్మసీ(ఫార్మా-డితో కలుపుకొని)లో 8,296 సీట్లు మిగిలాయి. మరోవైపు యాజమాన్య కోటాలో లక్షా 10 వేల సీట్లు అందుబాటులో ఉండగా దాదాపు లక్ష సీట్లు మిగిలిపోయే పరిస్థితి ఉంది. అంటే ఇంజనీరింగ్‌లో ఈ ఏడాది మొత్తం రెండు లక్షల సీట్లు మిగిలిపోతాయన్నమాట. తుది విడత కౌన్సెలింగ్ పూర్తయినా పరిస్థితి పెద్దగా మెరుగయ్యే అవకాశాల్లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలావుండగా సీటు పొందిన అభ్యర్థులు ఈనెల 23లోగా ఫీజు చెల్లించి కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్య కమిషనర్ అజయ్‌జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు వెబ్సైట్లో ‘క్యాండిడేట్స్ లాగిన్’ అనే లేబుల్‌ను క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ నంబరు, హాల్‌టికెట్ నంబరు, పాస్వర్డ్, పుట్టిన తేదీ వివరాలను టైప్ చేయడం ద్వారా సీటు కేటాయింపు పత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు బోధన రుసుం చెల్లించాల్సిన కేటగిరీలో ఉంటే బ్యాంకు చలానా ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సీటు కేటాయింపు పత్రంలో పేర్కొన్న బోధన రుసుమును చలానా ద్వారా ఇండియన్ బ్యాంకులోగానీ, ఆంధ్రా బ్యాంకులోగానీ చెల్లించి రశీదు పొందాల్సి ఉంటుంది. ఆ రశీదును కళాశాలలో చూపించాల్సి ఉంటుంది. సీటు వద్దనుకున్నా లేదా రానిపక్షంలో..: తొలివిడతలో సీటు లభించినా చేరేందుకు ఆసక్తిలేని విద్యార్థులు తదుపరి విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనవద్దనుకుంటే తాము రిజిస్ట్రేషన్ చేసుకున్న హెల్ప్‌లైన్ సెంటర్‌ను ఆశ్రయించి సీటును రద్దు చేసుకుని సర్టిఫికెట్లు వెనక్కితీసుకోవచ్చు. ఇందుకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ సీటు మాత్రమే రద్దు చేసుకోవాలనుకుంటే రద్దు చేసుకుని సర్టిఫికెట్లు అక్కడే ఉంచి తదుపరి విడతల్లో కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. సీటు రానివారు తదుపరి కౌన్సెలింగ్‌లో పాల్గొనదలిస్తే సర్టిఫికెట్లను హెల్ప్‌లైన్ సెంటర్లోనే ఉంచాలి. ఏదైనా ఇతర సమస్యలు ఉంటే సమీపంలోని హెల్ప్‌లైన్ సెంటర్‌ను సంప్రదించవచ్చు. అక్కడినుంచి విన్నపాలు కన్వీనర్‌కు చేరుతాయి. 24 నుంచి తుది విడత కౌన్సెలింగ్ ఈనెల 24 నుంచి 27 వరకు తుది విడత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు అడ్మిషన్ల కన్వీనర్ తెలిపారు. 29న సీట్ల కేటాయింపు వివరాలను వెల్లడిస్తారు. 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఒకటి నుంచి చివరి ర్యాంకుల వరకు ఎవరైనా వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. తొలివిడతలో సీట్లు పొంది రిపోర్ట్ చేసిన విద్యార్థుల వివరాలను కళాశాలల ప్రిన్సిపల్స్ 01.10.2013లోగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు తమ జాయినింగ్ రిపోర్ట్ అయ్యిందా? లేదా అన్న వివరాలను వెబ్సైట్లో చూడొచ్చు. తొలి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు మంచి అవకాశం కోసం తుది విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనాలనుకుంటే తుదివిడతలో వచ్చే సీటును మాత్రమే పొందుతారు. ఇప్పటివరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకానివారు ఈనెల 24 నుంచి 27 వరకు హెల్ప్‌లైన్ సెంటర్లలో హాజరుకావొచ్చు. ఆ తరువాత వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఈసీఈకే ఎక్కువ డిమాండ్ ఇంజనీరింగ్‌లో ఈ ఏడాది ఈసీఈ బ్రాంచికే ఎక్కువ ఆదరణ లభించింది. ఆ తరువాతి స్థానం కంప్యూటర్ సైన్స్‌కు దక్కింది. మెకానికల్ బ్రాంచి మూడోస్థానంలో ఉంది. ఐటీని పట్టించుకున్నవారే లేరు. ఈసీఈలో 55 శాతం సీట్లు నిండగా.. ఆ తరువాత అత్యధిక సీట్లు అందుబాటులో ఉన్న సీఎస్ఈలో కేవలం 48 శాతం సీట్లు నిండాయి. మెకానికల్ బ్రాంచీలో తక్కువ సీట్లే ఉన్నప్పటికీ 68 శాతం సీట్లు నిండాయి. ఇక సివిల్‌లో కూడా తక్కువ సీట్లే ఉన్నప్పటికీ దీనిలోనూ 70 శాతం సీట్లు నిండాయి. -
నేడు ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు జాబితా
ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన ఎంసెట్ ఎంపీసీ కేటగిరీ అభ్యర్థుల జాబితా మంగళవారం సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్టు ఎంసెట్ అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి కె.రఘునాథ్ తెలిపారు. సీటు కేటాయింపు వివరాలను అభ్యర్థుల మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్ ద్వారా తెలియపరుస్తామన్నారు. అభ్యర్థులు వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ నంబర్, హాల్‌టికెట్ నంబరు, పాస్వర్డ్, పుట్టినతేదీ వివరాలను ఉపయోగించి సీటు కేటాయింపు పత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. అభ్యర్థులు బోధన రుసుం చెల్లించాల్సిన కేటగిరీలో ఉంటే బ్యాంకు చలానా ఫారం కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. సీటు కేటాయింపు పత్రంలో పేర్కొన్న బోధన రుసుమును ఇండియన్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకులోగానీ చెల్లించి రశీదు పొందాలని చెప్పారు. సీటు పొందిన అభ్యర్థులు ఈ నెల 23లోగా కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. కాగా, ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ అభ్యర్థులకు ప్రస్తుతం నిర్వహిస్తున్న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియలో మొత్తం 2,076 మంది హాజరయ్యారు. ప్రస్తుతం ఉన్న సహాయక కేంద్రాలకు అదనంగా ఈ నెల 17 నుంచి 21 వరకు ఏలూరులోని సెయింట్ థెరిసా అటానమస్ కాలేజ్ ఫర్ ఉమెన్స్‌లో ఒక కేంద్రం ఏర్పాటు చేశారు. ఐసెట్ రిజిస్ట్రేషన్లు 57,019 ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఐసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా నిర్వహిస్తున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియకు ఇప్పటి వరకూ మొత్తం 57,019 మంది హాజరవగా.. సోమవారం 21,107 మంది వెబ్ఆప్షన్లు నమోదు చేసుకున్నట్టు అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి తెలిపారు. ‘బీ-కేటగిరీ’పై అక్టోబర్ 7న సమావేశం ఇంజనీరింగ్‌లో బీ-కేటగిరీ (యాజమాన్య కోటా) సీట్ల భర్తీలో ఎదురవుతున్న బహుళ ప్రవేశాల ప్రతిబందకంపై చర్చించేందుకు సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో అక్టోబర్ 7న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించామని ఉన్నత విద్యామండలి చైర్మన్ పి.జయప్రకాశ్‌రావు తెలిపారు. బీ-కేటగిరీ సీట్లను ఆన్లైన్లో భర్తీ చేయాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. అయితే ఒకే అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ కళాశాలలకు దరఖాస్తు చేసుకున్నప్పుడు.. అతనికి కళాశాలలు అన్నింటిలో సీటు లభించినప్పుడు ఆయా సీట్లన్నీ బ్లాక్ అవుతున్నాయి. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు యాజమాన్యాలతో చర్చించి పరిష్కారం కనుక్కోవాలని ఉన్నత విద్యా మండలిని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో భేటీ అయిన యాజమాన్యాలు తామంతా ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదని, మరోసారి సమావేశానికి సమయం ఇవ్వాలని ఉన్నత విద్యా మండలిని కోరాయి. -
రెండు లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఖాళీ!
సంక్షోభం దిశగా ఇంజనీరింగ్ కళాశాలలు 2.17 లక్షల మంది అర్హులు ఉన్నా 1.30 లక్షల మందే వెరిఫికేషన్‌కు హాజరు గత ఏడాది మిగిలిన సీట్లు 1.75 లక్షలు.. ఈ ఏడాది మిగలనున్న 2 లక్షల సీట్లు విద్యార్థులు డీమ్డ్ వర్సిటీలు, పొరుగు రాష్ట్రాలకు వెళుతుండటమే కారణం రాష్ర్టంలో కాలేజీల డొల్లతనం, ఫీజుల భారం, ప్లేస్మెంట్లు దొరక్కపోవటమూ కారణమే గత ఏడాది పెద్ద సంఖ్యలో మూతపడ్డ ఇంజనీరింగ్, ఎంబీఏ, ఫార్మసీ కాలేజీలు ఈ ఏడాది కూడా విద్యార్థులు లేక మరిన్ని కాలీజీలు మూతపడే అవకాశం సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కళాశాలలు ఈ ఏడాది గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కన్వీనర్ కోటా, యాజమాన్య కోటా కలిపి రాష్ట్రంలో 3.40 లక్షల సీట్లు అందుబాటులో ఉండగా.. చేరేందుకు ఆసక్తి చూపుతున్న వారు లక్షా 30 వేల మంది మాత్రమే ఉండటం కళాశాలలను కలవరపెడుతోంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు గత ఏడాది 1.38 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా.. ఈ ఏడాది ఆ సంఖ్య మరింత తగ్గింది. దాదాపు 2.17 లక్షల మంది అర్హులైన విద్యార్థులు ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు 1,30,278 మంది మాత్రమే వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. గత ఏడాది దాదాపు 1.75 లక్షల సీట్లు మిగలగా ఈ ఏడాది 2 లక్షల పైచిలుకు సీట్లు మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. స్వయంకృతాపరాధం కారణంగానే కళాశాలలు ఇలాంటి సంక్షోభ పరిస్థితి ఎదుర్కొంటున్నాయని పలు యాజమాన్య సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయం నాటికి కోర్టుల్లో కేసులు వేస్తుండటంతో కాలాతీతమై ఏటా వేలాది మంది అభ్యర్థులు రాష్ట్రంలోని డీమ్డ్ వర్సిటీలతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని ప్రైవేటు వర్సిటీల వైపు వెళుతున్నారు. గత ఏడాది ఫీజుల నిర్ధారణలో జాప్యం జరిగి 30 వేల మంది బయటికివెళ్లగా.. ఈ ఏడాది కళాశాలల ఎత్తుగడలను ఊహించని ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ నిర్లక్ష్యం ప్రదర్శించటం.. కోర్టుల్లో కేసులు ఎదురుకావడంతో ప్రవేశాల షెడ్యూలు రెండు నెలలు ఆలస్యంగా మొదలైంది. దీంతో దాదాపు 40 వేల మంది విద్యార్థులు డీమ్డ్ వర్సిటీలకు, పొరుగు రాష్ట్రాలకు వెళ్లి ఉంటారని కళాశాలలు అంచనా వేస్తున్నాయి. ఏటా ఇంజనీరింగ్ కళాశాలలు ఆలస్యంగా ప్రారంభమవటం, ఉత్తీర్ణత శాతాలు ఆశాజనకంగా లేకపోవటం, ఫీజులు భారమవటం, ప్లేస్మెంట్లు దొరక్కపోవటం కారణంగా విద్యార్థులు సాంప్రదాయక డిగ్రీల వైపు మొగ్గుచూపుతున్నట్టు అంచనావేస్తున్నాయి. టాస్క్‌ఫోర్స్ తనిఖీల్లో ఇంజ నీరింగ్ కళాశాలల డొల్లతనం బయటపడటంతో రాష్ట్రంలోని విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యపై ఆసక్తి తగ్గినట్లు కనిపిస్తోందని విద్యావేత్తలు అంచనావేస్తున్నారు. ఈ ఏడాది కేవ లం అగ్రశ్రేణి క ళాశాలల్లోనే కన్వీనర్ కోటా, యాజమాన్య కోటా సీట్లు భర్తీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మూసివేత దిశగా కాలేజీలు... ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో వేలాది సీట్లు మిగిలిపోతుండటంతో పలు కళాశాలలు ఏకంగా మూసివేతకు దరఖాస్తు చేసుకున్నాయి. గత ఏడాది 678 ప్రైవేటు కళాశాలలు కౌన్సెలింగ్‌లో పాల్గొనగా 50 శాతానికి పైగా సీట్లు నిండిన కళాశాలలు కేవలం 339 మాత్రమే. కనీసం 50 శాతం సీట్లు నిండనిపక్షంలో కళాశాల నిర్వహణ కష్టమేనని యాజమాన్యాలు చెప్తున్నాయి. 2013-14కు కొత్త ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు రాష్ట్రవ్యాప్తంగా ఒకే ఒక్క దరఖాస్తు రాగా మూతపడిన కాలేజీలే ఎక్కువగానే ఉన్నాయి. ప్రవేశాలు లేక 14 ఇంజనీరింగ్ కళాశాలలు, 3 ఫార్మసీ, 40 ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు మూతపడ్డాయి. మరో 134 కాలేజీలు ఐటీ కోర్సును రద్దు చేసుకున్నాయి. పలు కళాశాలలు సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ, సివిల్ బ్రాంచీలను కూడా రద్దు చేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో కొత్త కళాశాలలు వద్దని, ఇన్‌టేక్ 420కి పరిమితం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసి ఏఐసీటీఈకి పంపింది. అయితే ఏఐసీటీఈ దానిని పరిగణనలోకి తీసుకోలేదు. ఈ ఏడాది కూడా రాష్ట్రంలో దాదాపు 2 లక్షల సీట్లు మిగిలిపోతుండటంతో మరిన్ని కళాశాలలు మూతపడే పరిస్థితి నెలకొంది. తొలివిడత కౌన్సెలింగ్ అనంతరం ఈ నెల 17న సీట్ల కేటాయింపు జాబితా వెలువడిన తరువాత కళాశాలల భవితవ్యం తేటతెల్లమవుతుంది.