సాక్షి, హైదరాబాద్: అర్హతలున్నా ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ‘బీ’కేటగిరీలో సీట్లివ్వడానికి నిరాకరిస్తున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దర ఖాస్తులను తీసుకునేందుకూ ఇష్టపడటం లేదని, తిరస్కరణకు కారణాలూ చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ర్యాంకు తక్కువొచ్చిన వారికి సీటు ఖాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్ర వేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ)కి ఈ తరహా ఫిర్యాదులు గత వారం రో జులుగా 54 అందాయి.
ఇందులో ఒకటికి మించి ఎక్కువ కాలేజీల్లో దరఖాస్తు చేసిన వారు కూడా ఉన్నారు. టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ ఒకే దరఖాస్తును పరిగ ణనలోకి తీసుకుంటే 28 ఫిర్యాదులు అందినట్లు గు ర్తించింది. ప్రైవేటు కాలేజీలు తిరస్కరించిన అభ్య ర్థులంతా నేరుగా టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీకి తమ దరఖాస్తులను పంపారు. వాటిని ఆయా కాలేజీలకు టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ పంపింది. ర్యాంకు ప్రకారం సీటెందు కు ఇవ్వలేదని వివరణ కోరింది.
టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ కార్యాలయాన్ని ఆశ్రయించిన వారిలో జేఈఈ మెయిన్స్ ర్యాంకు పొందిన వారూ ఉన్నారు. నిబంధనల ప్రకారం ‘బీ’కేటగిరీ ఇంజనీరింగ్ సీట్లను తొలుత జేఈఈ ర్యాంకులు పొందిన వారికి, ఆ త ర్వాత ఎంసెట్ ర్యాంకులు, ఇంకా మిగిలితే ఇంటర్ మార్కుల్లో మెరిట్ ఆధారంగా కేటాయించాలి. కానీ ప్రైవేటు కాలేజీలు ఇష్టానుసారం సీట్లను అమ్ముకుంటున్నాయనే ఆరోపణలున్నాయి.
పారదర్శకత లేకనే...: తమకు అందిన దరఖాస్తుల్లో మెరిట్ ప్రకారం సీట్లిచ్చామని కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. కానీ దరఖాస్తుల విషయంలో ఎలాంటి పారదర్శకత లేకపోవడంతో ర్యాంకు ఉన్న అభ్యర్థుల దరఖాస్తులు యాజమాన్యాలు లెక్కల్లో చూపించట్లేదు. లక్షల రూపాయల డొనేషన్ తీసుకున్న వారి జాబితానే ఉన్నత విద్యామండలికి పంపుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.
ఈసారి ఉపేక్షించేదే లేదు...
‘బి’కేటగిరీ సీట్ల విషయంలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలను కోరాం. మాకు అందిన ప్రతి దరఖాస్తును ఆయా కాలేజీలకు పంపాం. వారికి అర్హత ఉన్నప్పుడు సీటు ఇవ్వకపోతే ఉపేక్షించే ప్రశ్నే లేదు. యాజమాన్య కోటా సీట్ల భర్తీపై పూర్తి వివరాలను 15వ తేదీలోగా ఉన్నత విద్యామండలికి సమర్పించాలి. ఎవరికి అన్యాయం జరిగినా కఠిన చర్యలు తప్పవు.
– పి. స్వరూప్‌రెడ్డి, టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment