2,857 Engineering Convener Quota Seats Vacant In AP, ముగిసిన రెండో విడత కౌన్సెలింగ్‌ - Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్‌లో ఇంకా సీట్లున్నాయ్‌..! 

Published Wed, Jan 27 2021 8:34 AM | Last Updated on Wed, Jan 27 2021 11:46 AM

Over 2500 Engineering Seats Vacant In Convenor Quota Andhra Pradesh - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మచిలీపట్నం: ఇంజినీరింగ్‌ కాలేజీల్లో 2020–21 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్‌ పూర్తవుతోంది. జిల్లాలోని ఏఏ కాలేజీల్లో ఎంతమంది విద్యార్థులు సీట్లు ఎంపిక చేసుకున్నారనేది అధికారులు వెల్లడించారు. చాలా కాలేజీల్లో సీట్లు భారీగా మిగిలిపోయాయి. కొన్ని బ్రాంచిల్లో ఒకరిద్దరు విద్యార్థులు మాత్రమే కోరుకున్నారు. ఇలాంటి చోట్ల తరగతులు నిర్వహణ ఎలా ఉంటుందనేది విద్యాశాఖ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జిల్లాలో 32 కాలేజీల్లో ప్రవేశాలకు ఈ ఏడాది ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కన్వీనర్‌ కోటా కింద మొత్తం 11,555 సీట్లు అందుబాటులో ఉండగా,  తొలివిడతలో 8,408 మంది సీట్లు కోరుకోగా, ఇందులో కొంతమంది విద్యార్థులు కాలేజీల్లో చేరలేదు.

తాజాగా రెండో విడత కౌన్సెలింగ్‌ పూర్తయ్యే సరికి 8,698 మంది విద్యార్థులు సీటు పొందారు. ఫిబ్రవరి 1 నాటికి విద్యార్థులు కాలేజీల్లో చేరాలని అధికారులు స్పష్టం చేశారు. లేకుంటే సీటు రద్దు చేస్తామని ప్రకటించారు. కౌన్సెలింగ్‌లో సీటు కోరుకున్నప్పటికీ, ఎంత మంది కాలేజీలకు వచ్చి చేరుతారనేది తేలాల్సి ఉంది. రెండు విడుతల పూర్తి అయినప్పటికీ,  కన్వీనర్‌ కోటాలోనే ఇంకా  2,857 సీట్లు ఖాళీ ఉన్నాయి.(చదవండి: త్వరలో గిరిజన ఇంజనీరింగ్‌ కాలేజీ)

ఇదిలా ఉంటే జిల్లాలోని 32 కాలేజీల్లో 9  చోట్ల వందమంది లోపే విద్యార్థులు చేరారు. కొన్ని బ్రాంచిల్లో అయితే ఒకరిద్దరు మాత్ర మే కోరుకున్నారు. మూడేళ్ల పాటు 25 శాతంపైన ప్రవేశాలు లేకుంటే, వాటికి గుర్తింపు వద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే  జిల్లాలో మూడు కాలేజీలు ఈ విద్యా సంవత్సరంలో మూతపడ్డాయి. ఈ లెక్కన తక్కువ అడ్మిషన్లు నమోదు అయిన కాలేజీల పరిస్థితి వచ్చే ఏడాది ఎలా ఉంటుందోనని కళాశాల యాజమాన్యాల్లో సర్వత్రా చర్చసాగుతోంది.

మరోవైపు, ఇంజినీరింగ్‌ విద్యలో సీఎస్‌ఈ బ్రాంచికు మంచి క్రేజ్‌ ఉంటుంది. కానీ గాంధీజీలో ఆరుగురు, అదే విధంగా శ్రీవాణి మైలవరంలో ఏడుగురు మాత్రమే చేరారు.లింగయాస్, పీపీడీవీ, డీజేఆర్‌ఎస్, మండవ వంటి కాలేజీల్లో మెకానికల్‌ బ్రాంచిలో ఒక్కొక్కొరు చొప్పున మాత్రమే విద్యార్థులు చేరారు. ఒక గ్రూపుకు తప్పనిసరిగా ఆరుగురు అధ్యాపకులు ఉండాలి. మరి ఒకరిద్దరు చేరిన చోట గ్రూపులను కొనసాగిస్తారా..లేదా..? అనేది తేలాల్సి ఉంది. వాసవి పెడన కాలేజీలో మిగతా గ్రూపుల్లో కొంతమేర పరువాలేకున్నా, సివిల్‌ ఇంజినీర్‌లో 8 మంది మాత్రమే చేరారు.  ఇలాంటి కాలేజీలు చాలానే ఉన్నాయి. ఇదే ఇప్పుడు హాట్‌ టాఫిక్‌గామారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement