engineering admissions
-
మెరిట్ ఉన్నోళ్లకే మేనేజ్మెంట్ సీటు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ సీట్ల బేరసారాలకు చెక్ పెట్టేందుకు ఉన్నత విద్యామండ లి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. యాజమాన్య కోటా సీట్లను కూడా ఆన్లైన్ విధానంలోనే భర్తీ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం కన్వినర్ కోటా సీట్లను ఈ తరహాలో కేటాయిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియను సమూలంగా మార్చాలని అధికారులు నిర్ణయించారు. దీనిపై ఇప్పటికే ఉన్నత స్థాయిలో చర్చలు జరిగాయి. కొన్ని కాలేజీల మేనేజ్మెంట్ల అభిప్రాయాలను అధికారులు సేకరిస్తున్నారు. కొంతమంది ఆన్లైన్ విధానాన్ని సమర్థిస్తున్నట్టు కౌన్సిల్ వర్గాలు తెలిపాయి. ఆన్లైన్ సీట్ల భర్తీ వ్యవహారంపై త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు మండలి అధికారులు తెలి పారు. ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చిన వెంట నే విధివిధానాలను రూపొందిస్తామన్నా రు. ప్రభుత్వం కూడా ఆన్లైన్ సీట్ల భర్తీపై పట్టుదలగా ఉందని మండలి ఉన్నతాధికారులు చెప్పారు.ఏటా రూ. కోట్ల వ్యాపారం రాష్ట్రంలో దాదాపు 1.16 లక్షల ఇంజనీరింగ్ సీట్లున్నాయి. ప్రస్తుతం 70 శాతం సీట్లను కన్వినర్ కోటా కింద భర్తీ చేస్తున్నారు. దాదాపు 38 వేల సీట్లను యాజమాన్య కోటా కింద కాలేజీలే నింపుకుంటున్నాయి. నిబంధనల ప్రకారం 15% బీ కేటగిరీ కింద భర్తీ చేయాలి. ప్రభుత్వం నిర్ణ యించిన మేరకే ఈ కేటగిరీకి ఫీజులు వసూలు చేయాలి. వీరికి ఎలాంటి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. అయితే, జేఈఈ, ఈఏపీసెట్, ఇంటర్ మార్కుల మెరిట్‌ను పరిగణలోనికి తీసుకోవాలి. కాలేజీలు మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. కౌన్సెలింగ్ తేదీలకు ముందే ఒక్కో సీటును రూ.7 నుంచి 18 లక్షల వరకూ అమ్ముకుంటున్నాయనే ఫిర్యాదులున్నాయి. ఏటా ఈ తరహా సీట్ల అమ్మకంతో రూ.వందల కోట్ల వ్యాపారం జరుగుతోందనే ఆరోపణలున్నాయి. ప్రతీ సంవత్సరం ఉన్నత విద్యామండలికి వందల కొద్దీ ఫిర్యాదులు వస్తున్నాయి. యాజమాన్య కోటా సీట్లను ఆన్లైన్ ద్వారా భర్తీ చేయా లని విద్యార్థి సంఘాలతోపాటు విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాదే దీనిపై ఆలోచన చేసినా, కాలేజీ యాజమాన్యాలు అడ్డుకున్నట్టు తెలిసింది.ఎన్‌ఆర్‌ఐలకే సీ’కేటగిరీయాజమాన్య కోటాలో 15% ప్రవాస భారతీయులకు కేటాయిస్తారు. ఈ కోటాలో సీటు పొందే వాళ్లు ఏడాదికి 5 వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఐలు సిఫార్సు చేసిన వాళ్లకు సీట్లు ఇవ్వడం ఇప్పటి వరకూ ఉంది. ఇక నుంచి నేరుగా ఎన్ఆర్ఐ పిల్లలకు మాత్రమే ఈ కేటగిరీ కింద సీట్లు ఇవ్వాలనే నిబంధనను తేవాలని మండలి భావిస్తోంది. ఒకవేళ ఎన్ఆర్ఐలు లేక సీట్లు మిగిలితే... ఆ సీట్లను బీ కేటగిరీ కిందకు మార్చాలని భావిస్తున్నారు. ఏటా ఇంజనీరింగ్ సీట్ల కోసం అనేక రకాలుగా సిఫార్సులు వస్తున్నాయి. కొన్ని కాలేజీలు వీటిని తప్పించుకోవడానికి ఆన్లైన్ విధానం సరైందిగా భావిస్తున్నాయి. ఆన్లైన్ సీట్ల భర్తీని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలులోకి తెచి్చంది. దీనిపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. కచ్చితంగా అమలు చేస్తాం..ఇంజనీరింగ్ యాజమాన్య కోటా సీట్లను వచ్చే విద్యా సంవత్సరం నుంచిఅమలు చేస్తాం. సీట్ల అమ్మకానికి తెరవేయాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. మేనేజ్మెంట్ కోటా సీట్లయినా మెరిట్ ఉన్నవాళ్లకే కేటాయించేలా చేస్తాం. – వి.బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
పోటీ పరీక్షలు.. ప్రమాణాలు పాతాళంలో
దేశంలో ఇంజనీరింగ్, మెడికల్, లా తదితర కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం కటాఫ్ మార్కులు తగ్గించుకుంటూపోతున్నారు. నాణ్యత ప్రమాణాలతో రాజీ పడుతున్నారు. జీరో మార్కులు వచ్చిన వారు కూడా ఇంజనీరింగ్, మెడికల్, లా కోర్సుల్లో అడ్మిషన్ పొందే పరిస్థితి ఉంది. సీట్ల భర్తీ కోసం కటాఫ్‌లు తగ్గించుకుంటూ పోవడం వల్ల ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రమాణాలు పడిపోతాయి. ఇది దీర్ఘకాలంలో ప్రతికూల పరిణామాలకు దారితీస్తుంది. కాబట్టి ప్రొఫెషనల్ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు కనీస ప్రమాణాలు పాటించాలని చెబుతున్నారు.. కెరీర్స్360 ఫౌండర్ చైర్మన్ మహేశ్వర్ పెరి. ప్రస్తుతం ప్రొఫెషనల్ కోర్సుల్లో పడిపోతున్న ప్రమాణాలపై ఆయన అందిస్తున్న విశ్లేషణాత్మక కథనం.. దేశ అత్యున్నత న్యాయస్థానం.. సుప్రీంకోర్టు ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ (ఏఐబీఈ) కటాఫ్‌ను తగ్గించేందుకు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఏఐబీఈ కటాఫ్‌ను తగ్గించడం వల్ల న్యాయ విద్యలో ప్రమాణాలు పడిపోతాయని పేర్కొంది. ‘‘పరీక్ష నిర్వాహకులు.. ఏఐబీఈ జనరల్ కేటగిరీ కటాఫ్ 45 మార్కులు, ఎస్సీ/ఎస్టీలకు కటాఫ్ 40 మార్కులుగా నిర్ణయించారు.ఆ మాత్రం కూడా స్కోర్ చేయకుంటే లాయరుగా ఎలా రాణించగలరు. మీరు దాన్ని ఇంకా 40, 35కు తగ్గించాలని కోరుతున్నారు.. దయచేసి చదవండి’’ అంటూ ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ప్రధాన న్యాయమూర్తి మనందరి తరఫున మాట్లాడుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్షల్లో పడిపోతున్న ప్రమాణాలు, అర్హత మార్కులు, తగ్గుతున్న ఉత్తీర్ణత ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. నేషనల్ లా యూనివర్సిటీలు2022 సర్క్యులర్‌లో నేషనల్ లా యూనివర్సిటీల కన్సారి్టయం ప్రతి కే టగిరీలో అందుబాటులో ఉన్న సీట్లకు ఐదు రెట్ల మంది విద్యార్థులను కౌన్సెలింగ్‌కు పిలవాలని నిర్ణయించింది. దీని అర్థమేమిటంటే.. వారు కనీస ప్రమాణాలను కూడా వదిలేసి ప్రతి సీటుకు ఐదుగురిని పిలవాలని నిర్దేశించారు. ప్రవేశానికి కనీస మార్కులు నిర్దేశించకపోవడం వల్ల కనీసం నాణ్యత లేని విద్యార్థి కూడా అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. 2023లో 40 వేల కంటే ఎక్కువ ర్యాంకు వచి్చన విద్యార్థులు సైతం ఎన్ఆర్ఐ కోటాలో నేషనల్ లా యూనివర్సిటీల్లో ప్రవేశం పొందే వీలు కలిగింది. 150కు 15–17 మార్కుల(10 శాతం మార్కులు)మధ్య వచి్చన విద్యార్థులు కూడా జాతీయ లా వర్సిటీల్లో ఎన్ఆర్ఐ కోటా ద్వారా అడ్మిషన్ పొంది.. ఈ దేశంలో లాయర్‌గా మారే అవకాశం ఏర్పడింది. నీట్ పీజీ 2023 2023లో నీట్ పీజీకి హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్య.. 2,00,517. ఆ ఏడాది అందుబాటులో ఉన్న మొత్తం సీట్లు 47,526. మొత్తం 800 మార్కులకు పరీక్ష జరిగింది. 2023లో తొలుత కటాఫ్ 291 మార్కులు(36 శాతం). ఆ తర్వాత కౌన్సెలింగ్ కొనసాగుతున్న కొద్దీ కటాఫ్‌ను తగ్గించుకుంటూ వచ్చి.. చివరకు జీరోగా నిర్ణయించారు. అంటే.. పరీక్షకు హాజరైతే చాలు.. మెడికల్ పీజీలో ప్రవేశం పొందొచ్చన్నమాట! ఇది ఒకరకంగా ప్రవేశ పరీక్షను చంపివేయడంలాంటిదే!! ప్రస్తుతం పలు మెడికల్ కాలేజీల్లో పీజీ చదువుతున్న విద్యార్థుల్లో జీరో మార్కులు వచి్చన వారుకూడా ఉండొచ్చు. నీట్ యూజీ ⇒ 2020లో మొత్తం 13,66,945 మంది విద్యార్థులు నీట్ యూజీ పరీక్షకు హాజరైతే.. కటాఫ్ 147( మొత్తం 720 మార్కులకు(20.4 శాతం)గా నిర్ణయించారు. ఆ సంవత్సరం మొత్తం మెడికల్ సీట్ల సంఖ్య 93,470. కానీ డెంటల్ సీట్లు భర్తీ కాకపోవడంతో డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆ ఏడాది కటాఫ్‌ను 113కు తగ్గించింది. దీంతో 15.7 శాతం మార్కులు వచి్చన వారికి కూడా సీటు లభించింది. ⇒ అదే విధంగా 2021లో మొత్తం 15,44,273 మంది విద్యార్థులు నీట్ యూజీ పరీక్ష రాశారు. మొత్తం మెడికల్ సీట్లు 99,695 ఉన్నాయి. ఆ ఏడాది కటాఫ్ 138(19.2 శాతం). కాని ఆయుష్ సీట్లు భర్తీ కాకపోవడంతో ఆయుష్ అడ్మిషన్స్ సెంట్రల్ కౌన్సిలింగ్ కమిటీ కటాఫ్‌ను 122కు తగ్గించింది. అంటే 17% మార్కులు సాధించిన విద్యార్థులు కూడా సీటు పొందొచ్చు. ఇలా సీట్లు భర్తీ చేయడం కోసం కటాఫ్ తగ్గిస్తూ నాణ్యత విషయంలో రాజీపడుతున్నారు. నీట్ ఎండీఎస్ 2023ఈ పరీక్షను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ మెడికల్ సైన్సెస్.. ఎండీఎస్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహిస్తుంది. ఈ పరీక్షకు కేటాయించిన మొత్తం మార్కులు 960. మొత్తం సీట్లు 6,937. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య 23,847. దీనికి కూడా సీట్ల భర్తీ కోసం 2021 నుంచి కటాఫ్ తగ్గించుకుంటూ వస్తున్నారు. నీట్ సూపర్ స్పెషాలిటీదేశంలో నీట్ సూపర్ స్పెషాలిటీలో మొత్తం సీట్ల సంఖ్య 4,243. ఈ పరీక్షకు 2023లో వచ్చిన దరఖాస్తులు 19,944. 2023లో మొదటి రౌండ్లో కటాఫ్ 50 పర్సంటైల్‌గా నిర్ణయించారు. సీట్లు భర్తీకాలేదు. దీంతో రెండో రౌండ్లో కటాఫ్‌ను 20 పర్సంటైల్‌కు తగ్గించారు. అయినా సీట్లు నిండలేదు. ఇక చివరగా స్పెషల్ రౌండ్లో అర్హతను జీరో పర్సంటైల్‌గా నిర్ణయించారు.మెడికల్, లాకే పరిమితం కాలేదు..వాస్తవానికి ఈ అర్హత మార్కులు తగ్గింపు అనేది లా, మెడికల్‌కే పరిమితం కాలేదు. 2018 జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సంబంధించి కేంద్ర విద్యాశాఖ ఐఐటీల్లో ప్రతి విభాగం, ప్రతి కేటగిరీకి సంబంధించి సీట్ల సంఖ్యకు రెట్టింపు సంఖ్యలో విద్యార్థులు అందుబాటులో ఉండేలా కటాఫ్‌ను తగ్గించాలని ఆదేశించింది. అంటే.. ఐఐటీల్లో అందుబాటులో ఉన్న మొత్తం 10వేల సీట్లకు 20 వేలమంది విద్యార్థులను జోసా కౌన్సెలింగ్ పిలుస్తారు. దీనికోసం అడ్మిషన్ బోర్డు అర్హత మార్కులను 35 శాతం నుంచి 25 శాతానికి తగ్గించింది. ఏకంగా 10 శాతం తగ్గించారు. దీంతో తొలుత మెరిట్ లిస్ట్‌లో 18,138 మంది మాత్రమే ఉండగా.. కొత్తగా 13,842 మంది విద్యార్థులను అర్హులుగా ప్రకటించారు. ఇలా మొత్తంగా పదివేల సీట్ల కోసం 31,980 మంది విద్యార్థులు జోసా కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు. -
ఇంజనీరింగ్ సీట్లు పెరగవా?
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో కొత్త సీట్లపై నెలకొన్న పేచీ ఇప్పట్లో తేలేట్టు లేదు. తొలి దశ కౌన్సెలింగ్ ముగిసే నాటికి దీనిపై స్పష్టత రావడం కష్టమని అధికార వర్గాలే అంటున్నాయి. దీంతో మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం డొనేషన్ కట్టిన విద్యార్థుల్లో ఆందోళన కన్పిస్తోంది. సీట్లు వస్తా యో? రావో? తెలియని అయోమయ స్థితిలో పలువురు తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాల చుట్టూ తిరుగుతున్నారు. రాష్ట్రంలోని దాదాపు వంద కాలేజీలు ఈ ఏడాది సీట్ల పెంపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇతర బ్రాంచీలు తగ్గించుకుని కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు పెంచాలని కోరాయి. కొత్తగా వచ్చేవి 10 వేలు, బ్రాంచీ మార్పుతో వచ్చే సీట్లు మరో పది వేలు... మొత్తంగా 20 వేల సీట్లు పెరుగుతాయని కాలేజీలు ఆశించాయి. ఇవన్నీ కంప్యూటర్ సైన్స్, అనుబంధ కోర్సులే. ఇప్పట్లో అనుమతి లేనట్టేనా?బ్రాంచీల మార్పు, కొత్త సెక్షన్లకు ప్రైవేటు కాలేజీలు చేసిన దరఖాస్తులను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనుమతించింది. కానీ రాష్ట్రంలోని వర్సిటీలు మాత్రం అనుమతించేందుకు వెనుకాడుతున్నాయి. తొలి విడత కౌన్సెలింగ్‌లో 173 కాలేజీల్లోని 98,296 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కన్వీనర్ కోటా కింద 70,307 సీట్లు భర్తీ చేయాల్సి ఉంటుంది. వీటిల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్ గ్రూపుతో పాటు, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్, ఆరిï్టœíÙయల్ ఇంటెలిజెన్స్ సహా పలు కంప్యూటర్ కోర్సుల్లోని సీట్లే 48 వేలున్నాయి. ఎల్రక్టానిక్స్–కమ్యూనికేషన్లో 9618, ఎలక్ట్రికల్‌లో 3602, మెకానికల్‌లో 2499 సీట్లు ఉన్నాయి. గత ఐదేళ్లతో పోలిస్తే ఈ బ్రాంచీల్లో సగటున 50 శాతం సీట్లు తగ్గాయి. ఇప్పుడు మొత్తం కంప్యూటర్ కోర్సులనే అనుమతిస్తే భవిష్యత్‌లో సంప్రదాయ కోర్సులే ఉండే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వానికి పంపిన నివేదికలోనూ ఇదే అంశాన్ని అధికారులు ప్రస్తావించినట్టు తెలిసింది. మెకానికల్, ఈఈఈ, ఈసీఈ, సివిల్ కోర్సులు చేసినప్పటికీ సాఫ్ట్వేర్ అనుబంధ అప్లికేషన్లు ఆన్లైన్లో నేర్చుకోవచ్చని, సాఫ్ట్వేర్ ఉద్యోగాల వైపు వెళ్లే అవకాశం ఉందని వర్సిటీలు భావిస్తున్నాయి. ఈ కారణంగానే ఆ బ్రాంచీల రద్దును అంగీకరించేందుకు వర్సిటీ అధికారులు ఏమాత్రం ఇష్టపడటం లేదు. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఓ అధికారి తెలిపారు. ఈ కారణంగానే కొత్తగా రావాల్సిన 20 వేల సీట్లు తొలి కౌన్సెలింగ్‌లో ఇప్పటికీ చేర్చలేదని చెబుతున్నారు. ఫ్యాకల్టీ ఎక్కడ...? సీఎస్ఈని సమర్థవంతంగా బోధించే ఫ్యాకల్టీ కొరత తీవ్రంగా ఉందని అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఉన్న సెక్షన్లకు బోధకులు సరిపోవడం లేదని, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్స్ బ్రాంచీలు బోధించే వారితో క్లాసులు చెప్పిస్తున్నారని తనిఖీ బృందాలు పేర్కొంటున్నాయి. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ కోర్సులకు ఇప్పటికీ ప్రత్యేక శిక్షణ పొందిన వాళ్లు లేరని అధికారులు అంటున్నారు. వివిధ రంగాల్లో నిపుణులైన సాఫ్ట్వేర్ నేపథ్యం ఉన్న ఉద్యోగుల చేత, లేదా కొన్ని చాప్టర్స్‌ను ఆన్లైన్ విధానంలో ఎన్ఆర్ఐల చేత బోధించే వెసులుబాటు కల్పించినప్పటికీ ఎవరూ ముందుకు రావడం లేదని తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సెక్షన్లు, కంప్యూటర్ సీట్ల పెంపునకు అనుమతించడం సరైన విధానం కాదని అధికారులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించినట్టు ఓ అధికారి చెప్పారు. ముగిసిన స్లాట్ బుకింగ్... ఆప్షన్లే తరువాయి తొలి విడత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు గురువారంతో స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగి సింది. ఇప్పటి వరకూ 97,309 మంది రిజి్రస్టేష న్ చేసుకున్నారు. 33,922 మంది 16,74,506 ఆప్షన్లు ఇచ్చారు. కొంత మంది అత్యధికంగా 942 ఆప్షన్లు ఇచ్చారు. ఈ నెల 15వ తేదీతో ఆప్షన్లు ఇచ్చే గడువు ముగుస్తుంది. ఈ తేదీనాటికి మరికొన్ని ఆప్షన్లు వచ్చే వీలుందని తెలుస్తోంది. ఆప్షన్లు ఇచ్చిన వాళ్లలో 78 శాతం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచీకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికీ కంప్యూటర్ సైన్స్ సీట్లు పెరుగుతాయనే విద్యార్థులు భావిస్తున్నారు. పెరిగే సీట్లపై అధికారులు స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని, అప్పుడే ర్యాంకును బట్టి ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. -
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు వేళాయె..
● రేపటి నుంచి స్లాట్ బుకింగ్‌కు అవకాశం ● 6వ తేదీ నుంచి తొలి దశ సర్టిఫికెట్ల పరిశీలన ● మూడు విడతల్లో నిర్వహణకు ఏర్పాట్లు ● ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాలలో సెంటర్ ఖమ్మంసహకారనగర్: ఎప్‌సెట్(ఎంసెట్)లో అర్హత సాధించిన విద్యార్థులకు ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించేందుకు ఈనెల 4వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. విద్యార్థుల కోసం ఖమ్మంలోని ఎస్ఆ ర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో కౌన్సెలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈనెల 4వ తేదీన రిజిస్ట్రేషన్ల నమోదు(స్లాట్ బుకింగ్) మొదలుకానుండగా, తొలి విడత సర్టిఫికెట్ల పరిశీలన 6వ తేదీన ప్రారంభమవుతుంది. ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అభ్యర్థులు తమకు నచ్చిన తేదీ, సమయం ప్రకారం కౌన్సలింగ్‌కు స్లాట్ బుకింగ్ చేసుకుని హాజరుకావాల్సి ఉంటుంది. జిల్లాలో ఎనిమిది ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. అయితే, జిల్లా విద్యార్థులు రాష్ట్రంలో ఎక్కడి కళాశాలనైనా వెబ్ ఆప్షన్ల ద్వారా ఎంచుకునే అవకాశం ఉంది. 2024–25వ విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్ ప్రవేశాల వివరాల కోసం http://tgeapcet.nic.in వెబ్సైట్లో సమీపంలోని కౌన్సెలింగ్ కేంద్రంలో సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.దశల వారీగా కౌన్సెలింగ్ ఇలా...మొదటి విడత కౌన్సిలింగ్ కోసం ఈనెల 4వ తేదీ గురువారం నుంచి 12వ తేదీ వరకు స్లాట్ బుక్ చేసుకుంటే 6నుంచి 13వ తేదీ వరకు సర్టిఫికెట్లు పరిశీలిస్తారు. ఆతర్వాత 8నుంచి 15వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, 19వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఆపై 19నుంచి 23వ తేదీ వరకు ఫీజు చెల్లించి కళాశాలల్లో రిపోర్ట్చేయాల్సి ఉంటుంది. ఇక రెండో విడతలో ఈనెల 26న స్లాట్ బుకింగ్, 27వ తేదీన సర్టిఫికెట్ల పరిశీలన, 27, 28వ తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదు, 31వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఆపై 31 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు ఫీజు చెల్లించి కళాశాలల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అలాగే, చివరి దశ కౌన్సెలింగ్‌లో భాగంగా ఆగస్టు 8న స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థుల సర్టిఫికెట్లను 9వ తేదీన పరిశీలిస్తారు. ఆయా విద్యార్థులు 9, 10వ తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేస్తే 13న సీట్ల కేటాయింపు జరుగుతుంది. అనంతరం 13నుంచి 17వ తేదీ వరకు ఫీజు చెల్లించి కళాశాలల్లో రిపోర్ట్చేయాల్సి ఉంటుంది. ఇక మూడు దశల్లో విద్యార్థులు కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేశాక కళాశాల మార్చుకోవాలనుకుంటే ఆగస్టు 16, 17వ తేదీల్లో అవకాశం కల్పించారు.అభ్యర్థులు ఏమేం తీసుకురావాలి..నిర్ణీత తేదీల్లో కౌన్సెలింగ్ హాజరయ్యే విద్యార్థులు అన్ని ఒరిజనల్ సర్టిఫికెట్లతో పాటు రెండు జిరాక్స్ సెట్లు వెంట తెచ్చుకోవాలి. ఈమేరకు టీజీఎప్‌సెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, ఆధార్‌కార్డు, ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ మార్కుల మెమోలు, ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, ఇంటర్ టీసీ, ఈ ఏడాది ఏప్రిల్ 01వ తేదీ తర్వాత తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం, స్లాట్ బుక్ చేసుకున్న రశీదుతో పాటు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులైతే ఈ ఏడాదికి తీసుకున్న సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. మధ్యవర్తుల మాటలు నమ్మెద్దుఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలను ఎంపిక చేసుకోవాలి. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో మధ్యవర్తుల మాటలు నమ్మొద్దు. ఏమైనా సందేహాలుంటే హెల్ప్‌లైన్ సెంటర్లో నేరుగా సంప్రదించవచ్చు. వెబ్ ఆప్షన్లు పెట్టుకునే సమయాన జాగ్రత్తలు తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన ఽఫోన్ నంబర్ ఉపయోగంలో ఉండేలా చూసుకోవాలి.– మాదాల సుబ్రహ్మణ్యం, ఎప్‌సెట్ హెల్ప్‌లైన్ సెంటర్, కో ఆర్డినేటర్ -
ఇంజినీర్ల నైపుణ్యాలకు ప్రత్యేక అకాడమీ
ఇంజినీర్లకు నైపుణ్యాలు అందించేందుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ సంస్థ ప్రత్యేక అకాడమీ ప్రారంభిస్తున్నట్లు సంస్థ ప్రెసిడెంట్, అకౌంటబుల్ మేనేజర్ అశోక్ గోపీనాథ్ తెలిపారు. జీఎంఆర్ గ్రూప్ ఆధ్వర్యంలోని ఈ అకాడమీ కోసం రూ.50 కోట్లు వెచ్చించనున్నట్లు ఆయన తెలిపారు. ‘దేశంలోని విమానయాన సంస్థలకు శిక్షణ పొందిన మానవ వనరుల కొరత ఎదురవుతోంది. ఎయిర్‌క్రాఫ్ట్ నిర్వహణలో భాగంగా భవిష్యత్తులో ఇంజినీర్లకు గిరాకీ ఏర్పడుతుంది. వారికి నైపుణ్యాలు అందించేందుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఆధ్వర్యంలో జీఎంఆర్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్‌ను ఏర్పాటు చేస్తున్నాం. జులై నెలలో కోర్సులు ప్రారంభించాలని ఇన్స్టిట్యూట్ యోచిస్తోంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌తో 10+2 పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ కోర్సుల్లో చేరడానికి అర్హులు. కొత్త అకాడమీను హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేస్తున్నాం. కోర్సులో భాగంగా రెండు సంవత్సరాలపాటు అకడమిక్ స్టడీ ఉంటుంది. మరో రెండేళ్లు ఉద్యోగ శిక్షణ అందిస్తాం. ఇండిగో, ఎయిరిండియా, ఆకాసా వంటి విమానయాన సంస్థలు ఇప్పటికే 1,200 కంటే ఎక్కువ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఆర్డర్ చేశాయి. పరిశ్రమల అంచనా ప్రకారం, వచ్చే ఐదేళ్లలో భారతదేశానికి దాదాపు 5,000 మంది ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్లు అవసరం’ అన్నారు. దిల్లీ, హైదరాబాద్, గోవా విమానాశ్రయాలను జీఎంఆర్ నిర్వహిస్తోంది.ఇదీ చదవండి: పైలట్ల కొరత తీర్చేందుకు ప్రత్యేక శిక్షణఇదిలాఉండగా, పైలట్లుగా స్థిరపడాలనుకునే వారికి ఎయిరిండియా ఇప్పటికే ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. అందుకోసం మహారాష్ట్రలోని అమరావతిలో ఏడాదికి 180 మందికి శిక్షణ ఇచ్చేందుకు అకాడమీను ఏర్పాటు చేస్తోంది. అందులో ట్రెయినింగ్ పూర్తిచేసిన వారిని నిబంధనల ప్రకారం నేరుగా సంస్థలో పైలట్లుగా నియమించుకుంటామని ప్రకటించింది. -
TG: ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
సాక్షి,హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమో విద్యార్థులు బీటెక్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశాలకు పొందడం కోసం ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. అడ్మిషన్ల ప్రక్రియ మూడు విడతల్లో జరగనుంది. జూన్ 27 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభంజూన్ 30 నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్లుజులై 12న మొదటి విడత సీట్ల కేటాయింపుజులై 19 నుంచి రెండో విడత కౌన్సెలింగ్జులై 24న రెండో విడత సీట్ల కేటాయింపుజులై 30 నుంచి తుది విడత కౌన్సెలింగ్ఆగస్టు 5న తుది విడత సీట్ల కేటాయింపుఇంటర్నల్ స్లైడింగ్ ఆన్లైన్లో కన్వీనర్ ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. ఆగస్టు 12 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆగస్టు 16న ఇంటర్నల్ స్లైడింగ్ సీట్లు కేటాయిస్తారు. ఆగస్టు 17న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల చేస్తారు. పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదీ..తెలంగాణలో రెండు విడతల్లో పాలిసెట్ కౌన్సెలింగ్ జరగనుంది.జూన్ 20 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభంజూన్ 22 నుంచి తొలి విడత వెబ్ ఆప్షన్లుజూన్ 30న మొదటి విడత సీట్ల కేటాయింపుజులై 7 నుంచి రెండో విడత కౌన్సెలింగ్జులై 9న రెండో విడత వెబ్ ఆప్షన్లుజులై 13న రెండో విడత సీట్ల కేటాయింపు పాలిసెట్‌లోనూ ఇంటర్నల్ స్లైడింగ్‌ను కన్వీనర్ ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. జులై 21 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్‌కు అవకాశం ఉంటుంది. జులై 23న స్పాట్ అడ్మిషన్ మార్గదర్శకాలు విడుదలవుతాయి. -
ఇంజనీరింగ్‌లో పెరిగిన ప్రవేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ సంవత్సరం విద్యార్థుల ప్రవేశం పెరిగింది. అన్ని దశల ప్రవేశాల ప్రక్రియ ముగియడంతో ఈ ఏడాది కాలేజీల్లో ప్రవేశాలపై ఉన్నత విద్యా మండలి ఓ నివేదిక రూపొందించింది. దాని ప్రకారం.. 177 కాలేజీల్లో 1.10 లక్షల సీట్లకు సాంకేతిక విద్యా విభాగం కౌన్సెలింగ్ నిర్వహించింది. 2021–22లో కన్వీనర్, యాజమాన్య కోటా కలిపి 70 వేల మంది ఇంజనీరింగ్‌లోని వివిధ బ్రాంచ్‌ల్లో చేరగా.. ఈ ఏడాది (2022–23) ప్రవేశాల సంఖ్య 80 వేలు దాటింది. అయినప్పటికీ 30 వేల సీట్లు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ఈ ఏడాది 61,972 సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ చేశారు. మిగతావి యాజమాన్య కోటా కింద భర్తీ అయ్యాయి. కంప్యూటర్ కోర్సుల్లోనే పెరుగుదల అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఈ ఏడాది డిమాండ్ లేని కోర్సులు తగ్గించుకుని, డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది. దీంతో దాదాపు వంద కాలేజీలు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల్లో 10 వేల సీట్లు తగ్గించుకున్నాయి. వీటి స్థానంలో సీఎస్సీ, ఇతర కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు పెంచుకున్నాయి. ఇప్పుడివన్నీ భర్తీ అయ్యాయి. కన్వీనర్ కోటా కింద భర్తీ అయిన 61,972 సీట్లలో 45 వేలకుపైగా సీట్లు కంప్యూటర్ సంబంధిత కోర్సులవే ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ (ఈసీఈ)లో 12,503 సీట్లుంటే, 10,789 సీట్లు భర్తీ అయ్యాయి. మెకానికల్‌లో 4,653 సీట్లకు గాను 1,249 మంది చేరగా, సివిల్‌లో 5,060 సీట్లు ఉంటే, ప్రవేశాలు పొందిన విద్యార్థుల సంఖ్య 1,683 మంది మాత్రమే కావడం గమనార్హం. యాజమాన్య కోటాలోనూ కంప్యూటర్ కిక్ రాష్ట్రవ్యాప్తంగా యాజమాన్య కోటాలో 30 వేలకు పైగా సీట్లు ఉండగా.. ఇందులోనూ 18 వేల సీట్లు కంప్యూటర్ సంబంధిత కోర్సుల్లోనే భర్తీ అయ్యాయి. ఈ కోటా కింద ఒక్కో సీటు కనిష్టంగా రూ.8 లక్షల నుంచి గరిష్టంగా రూ.16 లక్షల వరకూ అమ్ముడుపోయింది. వాస్తవానికి ఎంసెట్ ఫలితాల వెల్లడి తర్వాత యాజమాన్య కోటా కోసం విద్యార్థుల తల్లిదండ్రులు ఎగబడ్డారు. స్పాట్ అడ్మిషన్ల దశలో టాప్ టెన్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ సీటు ఒక్కటీ మిగల్లేదు. ఆఖరి దశలో సీటు పొందాలనుకునే వారు రెండవ ఆప్షన్‌గా ఎలక్ట్రానిక్స్‌ను ఎంపిక చేసుకున్నారు. ముందు వరుసలో సీట్లు రిజర్వు చేసుకున్న వాళ్లల్లో ఎక్కువ మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులకు ప్రాధాన్యమిచ్చారు. ఇక సివిల్, మెకానికల్ బ్రాంచీల్లో సీట్లను భర్తీ చేసుకునేందుకు కాలేజీలు తంటాలు పడాల్సి వచ్చింది. ఆఖరి దశలో ఎలాంటి అదనపు ఫీజు లేకుండానే కొన్ని కాలేజీలు సీట్లు ఇచ్చాయి. -
టాప్‌గేర్‌లో ఎంసెట్... రివర్స్‌లో జేఈఈ
సాక్షి, హైదరాబాద్: రానురాను జాతీయస్థాయి ఇంజనీరింగ్ కాలేజీలవైపు మొగ్గుచూపే విద్యార్థులు తగ్గిపోతున్నారు. ఏటా జేఈఈ రాసే విద్యార్థుల సంఖ్య తగ్గుతుండగా, స్థానిక ఎంసెట్ రాసేవారి సంఖ్య పెరుగుతుండటమే దీనికి నిదర్శనం. ఇంటరీ్మడియెట్ నుంచే విద్యార్థులు ఎంసెట్‌ను లక్ష్యంగా పెట్టుకుంటున్నారని ఉన్నత విద్యామండలి వర్గాలు అంటున్నాయి. 2014లో జేఈఈ మెయిన్స్ రాసినవారి సంఖ్య 12.90 లక్షలుంటే, 2022లో ఈ సంఖ్య 9.05 లక్షలకు తగ్గింది. వాస్తవానికి మన రాష్ట్రం నుంచి 2014లో జేఈఈ (సంయుక్త ప్రవేశ పరీక్ష) రాసిన వారి సంఖ్య 2 లక్షల వరకూ ఉంటే, ఇప్పుడు 1.30 లక్షలకు పడిపోయింది. 2018లో రాష్ట్రంలో 1.47 లక్షల మంది ఎంసెట్ రాయగా, 2022 నాటికి ఇది 1.61 లక్షలకు పెరిగింది. ఎంసెట్ ద్వారా విద్యార్థులు రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొందితే, జేఈఈ మెయిన్స్ ద్వారా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో, అడ్వాన్స్డ్ ద్వారా ఐఐటీల్లో సీట్లు దక్కించుకుంటారు. మార్పునకు కారణాలేంటి? సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) సర్వే ప్రకారం గ్రాడ్యుయేషన్ తర్వాత విద్యార్థులు ఎక్కువగా ఉపాధి వైపే మొగ్గుతున్నారు. ఏదో ఒక ఉద్యోగం కోసం వెతుక్కునే వారి సంఖ్య అబ్బాయిల్లో పెరుగుతోంది. కోవిడ్ తర్వాత ప్రతీ కుటుంబంలోనూ ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ వంటి సాంకేతిక పట్టాతో సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎంఎస్ కోసం అమెరికా, బ్రిటన్, ఆ్రస్టేలియా వంటి దేశాలకు వెళ్లినా, చదువుకన్నా ఉపాధి వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు అంతర్జాతీయ సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో జేఈఈ వంటి విపరీతమైన పోటీ ఉండే పరీక్షలపై ఆసక్తి చూపడం లేదు. స్థానిక ఎంసెట్‌తో ఏదో ఒక కాలేజీలో సీటు తెచ్చుకోవడానికే ఇష్టపడుతున్నారు. కాలేజీల తీరులోనూ మార్పు సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడాలనుకునే విద్యార్థులు సాధారణంగా ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ కోర్సులనే ఎంచుకుంటున్నారు. ఎంసెట్‌లో 30 వేల ర్యాంకు వచి్చనా ఏదో ఒక కాలేజీలో సీఎస్ఈలో సీటు దొరుకుతుంది. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఏదో ఒక ప్రైవేటు సంస్థలో చేరి ఉపాధి అవకాశాలున్న కోర్సుల్లో శిక్షణ తీసుకుంటున్నారు. దీంతో సులువుగానే సాఫ్ట్వేర్ రంగం వైపు వెళ్తున్నారు. దీనికితోడు రాష్ట్రంలో కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో సీట్లు పెరుగుతున్నాయి. డిమాండ్ లేని సివిల్, మెకానికల్ సీట్లు తగ్గించుకుని, సీఎస్ఈ, దాని అనుబంధ కంప్యూటర్ కోర్సుల్లో సీట్లను కాలేజీలు పెంచుకున్నాయి. ఈ సీట్లే ఇప్పుడు 58 శాతం అందుబాటులో ఉన్నాయి. కాబట్టి జేఈఈ కోసం పోటీ పడాలనే ఆలోచన విద్యార్థుల్లో సన్నగిల్లుతోంది. దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్‌కు హాజరవుతున్న విద్యార్థులు ఇలా.... -
ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కాలేజీలకు ఏఆర్ఎఫ్సీ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీలకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ(ARFC) కమిటీ కీలక ఆదేశాలు జారీ చేసింది. నిర్ణయించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ప్రెస్‌నోట్ రిలీజ్ చేసింది. ఈ మేరకు అధిక ఫీజులు వసూలు చేస్తే ఊపేక్షించేది లేదని కమిటీ పేర్కొంది. అదనంగా ఫీజులు వసూలు చేస్తే రూ. 2 లక్షలు జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చింది. ARFC ద్వారా వచ్చి బీ-కేటగిరీ దరఖాస్తులను పరిశీలించాలి. అర్హులైన వారికి కచ్చితంగా సీటు ఇవ్వాల్సిందే. అలా కాకుండా మెరిట్ లేనివారికి సీటు కేటాయిస్తే రూ. 10 లక్షలు జరిమానా విధిస్తామని పేర్కొంది. -
ఇంజనీరింగ్ ఫిజులను ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం
-
ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ వాయిదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫీజులపై స్తబ్దత కారణంగా ఈ నెల 28 నుంచి జరగాల్సిన ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ వాయిదా పడింది. ఈ కౌన్సెలింగ్‌ను వచ్చే నెల 11 నుంచి చేపడతామని సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ ఓ ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి అక్టోబర్ 16న సీట్ల కేటాయింపు ఉంటుందని వివరించారు. రాష్ట్రంలో ఈ నెల 6న తొలి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు చేపట్టారు. మొత్తం 71,286 సీట్లుంటే.. విద్యార్థుల ఆప్షన్లకు అనుగుణంగా 60,208 సీట్లను భర్తీ చేశారు. 11,078 సీట్లు మిగిలిపోయాయి. వీటికితోడు కొత్తగా అందుబాటులోకి వచ్చిన కంప్యూటర్ కోర్సుల సీట్లను కలిపి రెండో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేయాల్సి ఉంది. అన్నీ కలిపి 25 వేలకుపైగా సీట్లు ఉండవచ్చని అంచనా వేశారు. ఫీజుల నిర్ధారణలో జాప్యం రెండో విడత కౌన్సెలింగ్ నాటికి ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులను నిర్ధారించాలనుకున్నారు. ఇందుకు అనుగుణంగానే ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఎఫ్ఆర్సీ) కసరత్తు చేసింది. జూలైలోనే ఎఫ్ఆర్సీ రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల ఆడిట్ నివేదికలను పరిశీలించి, ఫీజులను నిర్ణయించింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా 2019–22 బ్లాక్ పీరియడ్‌లో ఉన్న ఫీజులనే కొనసాగించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కానీ ఈ నిర్ణయంపై 81 కాలేజీలు కోర్టును ఆశ్రయించడం, కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో ఎఫ్ఆర్సీ తిరిగి కాలేజీల ఆడిట్ నివేదికలను పరిశీలించింది. తొలిదశ ఆడిట్ నివేదికల పరిశీలనలో తప్పులు జరిగాయని, మళ్లీ పరిశీలించి వాటిని సరిచేశామని ప్రకటించింది. ఈ మేరకు చాలా కాలేజీల ఫీజులు తగ్గుతున్నట్టు ఎఫ్ఆర్సీ వర్గాలు తెలిపాయి. మరోవైపు రెండో విడత చర్చల్లో తమ వాదన వినిపించేందుకు సరైన సమయం ఇవ్వలేదని కొన్ని కాలేజీలు ఎఫ్ఆర్సీకి అప్పీలు చేశాయి. దీనితో ఆయా కాలేజీల ప్రతినిధులతో మరో దఫా చర్చించాలని నిర్ణయించారు. ఫీజుల వ్యవహారం తేలకుండా కౌన్సెలింగ్‌కు వెళ్లడం సరికాదని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఈ మేరకు కౌన్సెలింగ్ వాయిదా పడింది. -
ఇంజనీరింగ్ విద్యార్థుల పేరెంట్స్‌కు బిగ్ షాక్..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంజనీరింగ్ విద్యార్థుల పేరెంట్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఈ ఏడాది ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు భారీగా పెరిగినట్టు తెలుస్తోంది. కాగా, ఫీజులపై జీవో ఇవ్వకుండానే ప్రభుత్వం కౌన్సెలింగ్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలో హైకోర్టు నుంచి 79 కాలేజీలు మధ్యంతర ఉత్తర్వులు పొందాయి. TSAFRC వద్ద అంగీకరించిన ఇంజనీరింగ్ ఫీజులకు హైకోర్టు అనుమితి ఇచ్చింది. దీంతో, 36 ఇంజనీరింగ్ కాలేజీల్లో వార్షిక ఫీజు రూ. లక్ష దాటింది. దీంతో, 10వేలు ర్యాంకు దాటిన బీసీ, ఈబీసీ విద్యార్థులపై ఫీజుల బారం పడనుంది. కాగా, రేపు(మంగళవారం) నుంచి తొలి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు జరుగనుంది. ఈ మేరకు ఈ నెల 13 వరకు ఫీజు చెల్లింపునకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఇదిలా ఉండగా.. సీబీఐటీలో లక్షా 73వేలు, వాసవి, వర్ధమాన్, సీవీఆర్, బీవీఆర్ ఐటీ మహిళా కాలేజీల్లో లక్షా 55వేలు, శ్రీనిధి, వీఎన్ఆర్ జ్యోతి వంటి కాలేజీల్లో లక్షా 50వేలపై చొప్పున ఫీజులు పెంచినట్టు సమాచారం. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో మిగతా కాలేజీలు సైతం ఫీజులను భారీగా పెంచే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: రెవెన్యూలో పదోన్నతులు! -
తెలంగాణలో భారీగా పెరిగిన ఇంజనీరింగ్ ఫీజులు
-
జేఈఈ.. ఆసక్తి తగ్గుతుందోయీ!
సాక్షి, హైదరాబాద్: కేంద్రం అధీనంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇతర సంస్థల్లో ప్రవే శాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ)పై విద్యార్థుల్లో క్రమంగా ఆసక్తి తగ్గుతోంది. 2014లో జేఈఈ మెయిన్స్ కోసం దేశవ్యాప్తంగా 13.57 లక్షలమంది దర ఖాస్తు చేసుకోగా గతేడాది ఈ సంఖ్య 10.48 లక్షలకు తగ్గింది. దరఖాస్తు చేసిన వారి లోనూ దాదాపు లక్ష మంది పరీక్ష రాసేం దుకు ఇష్టపడట్లేదు. రాష్ట్రాల ఎంసెట్ పేపర్ల తో పోలిస్తే జేఈఈ పరీక్ష పేపర్లు విశ్లేష ణాత్మకంగా ఉండటం, ప్రశ్నలు ఎక్కువ భాగం సుదీర్ఘంగా ఉండటం కూడా కారణ మని నిపుణులు అంటున్నారు. దీంతో విద్యా ర్థులు ఎక్కువగా రాష్ట్రాల సెట్లపై దృష్టి పెడుతున్నారని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రస్థాయి, కేంద్రస్థాయి సిలబస్‌లో ఉన్న కొన్ని చిక్కులవల్ల కూడా జేఈఈని విద్యా ర్థులు కఠినంగా భావిస్తూ క్రమంగా పరీక్షకు దూరమవుతున్నట్లు ఉందని చెబుతున్నారు. రాష్ట్రాల్లోనూ పెరిగిన వనరులు రాష్ట్ర పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో విసృ ్తత మౌలిక వసతులు, నాణ్యమైన ఉపాధి కోర్సుల్లో సీట్లు పెరగడం కూడా జేఈఈ హాజరు తగ్గడానికి ఓ కారణమని ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంక టరమణ తెలిపారు. అనేక రాష్ట్రాల్లో లా, టీచింగ్, ఎంబీఏ వంటి కోర్సుల వైపు విద్యా ర్థులు మళ్లుతున్నారని పేర్కొన్నారు. అలాగే ఇంజనీరింగ్ తర్వాత విదేశీ విద్యకు వెళ్లాలనే ఆలోచన ఉన్నవారు జేఈఈ వంటి కష్టమైన పరీక్షల వైపు వెళ్లేందుకు ఇష్టపడటం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. సైన్స్ కోర్సుల ప్రాధాన్యత పెరగడం వల్ల ఉపాధి అవకా శాలు మెరుగవుతున్నాయని, వాటి ఆధారం గా విదేశీ విద్య, అక్కడ ఉపాధి అవకా శాలు మెరుగవుతాయనే ఆలోచన కూడా జేఈఈకి విద్యార్థులు క్రమంగా దూరం జరగడానికి కారణమవుతోందని ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ప్రొ.పాపిరెడ్డి చెప్పారు. పట్టు సాధించలేక... కరోనా లాక్డౌన్ సమయంలో కోచింగ్ సెంటర్లు మూతపడటం వల్ల విద్యార్థులు పెద్దగా సన్నద్ధమవ్వలేకపోయారని, ఈ ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోందని జేఈఈ గణిత శాస్త్ర అధ్యాపకుడు సత్యా నంద్ విశ్లేషించారు. 2021లో అన్ని రాష్ట్రా ల్లోనూ తొలుత ఆన్లైన్ క్లాసులే జరగడంతో జేఈఈకి సిద్ధం కావడంపై పట్టు సాధించ లేకపోయామనే భావన విద్యార్థుల్లో ఉందని ఓ ప్రైవేటు కాలేజీలో రసాయనశాస్త్ర అధ్యా పకుడిగా పనిచేస్తున్న కొసిగి రామనాథం తెలిపారు. పరీక్షకు హాజరయ్యేవారిలో 30 శాతం మాత్రమే సీరియస్‌గా ప్రిపేపర్ అవు తున్నారని, మిగతావారు అరకొరగా సన్నద్ధ మయ్యే వాళ్లేనని 15 ఏళ్లుగా జేఈఈ కోచింగ్ ఇస్తున్న శ్యామ్యూల్ అభిప్రాయపడ్డారు. -
కొత్త సీట్ల సంగతి తేలేదెప్పుడో?
సాక్షి, హైదరాబాద్: కంప్యూటర్ ఇంజనీరింగ్ అదనపు సీట్లపై సస్పెన్స్ కొనసాగుతుండటంతో ఎంసెట్ రెండోదశ కౌన్సెలింగ్‌పై సాంకేతిక విద్యామండలి ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతోంది. మరోపక్క వచ్చేనెలాఖరులోగా ఇంజనీరింగ్ కాలేజీల్లో తరగతులు మొదలు పెట్టాలని అఖిలభారత విద్యామండలి పేర్కొంది. అయితే ఇంజనీరింగ్ సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తి అయితే తప్ప ఇది సాధ్యమయ్యే పరిస్థితిలేదు. వాస్తవానికి రెండోవిడత కౌన్సెలింగ్ ప్రక్రియను అక్టోబర్ మొదటివారంలోనే చేపట్టాలని అధికారులు తొలుత భావించారు. అయితే ఈలోగా కంప్యూటర్ సైన్స్ విభాగంలో కొత్త సీట్ల అనుమతిపై హైకోర్టు ప్రైవేటు కాలేజీలకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో మరో 3,500 సీట్లు పెరగవచ్చనే సంకేతాలు వెలువడ్డాయి. అదేవిధంగా ఇంకో 500 సీట్లను ఈడబ్ల్యూఎస్ కోటా కింద భర్తీ చేయాల్సి ఉం టుంది. అదేవిధంగా జేఈఈ ర్యాంకులను పరిగణ నలోనికి తీసుకోవాలని, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొందేవారి వల్ల ఇక్కడ ఖాళీ అయ్యే సీట్లను భర్తీ చేయాలని ఉన్నత విద్యామండలి అధికారులు భావిస్తున్నారు. కన్వీనర్ కోటా కింద భర్తీ చేసే కొత్త సీట్ల ఫీజును ప్రభుత్వం రీయింబర్స్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల దాదాపు రూ.25 కోట్ల భారం పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో రెండోదశ కౌన్సెలింగ్ ప్రక్రియ ముందుకు సాగడంలేదు. కొత్త సీట్లు వస్తయో.. రావో.. తెలియకపోయినా వాటి కోసం కౌన్సెలింగ్ ఆపడం ఏమిటని ఉన్నత విద్యామండలి సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. పెరిగే సీట్లకు ముందే బేరం ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు పెరిగే సీట్లను ముందుగానే అమ్ముకుంటున్నాయి. హైకోర్టు తీర్పును చూపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నాయి. రూ.లక్షల్లో డొనేషన్లు వసూలు చేస్తూ, సీటు రాని పక్షంలో తిరిగి ఇచ్చేస్తామని చెబుతున్నాయి. అయితే ఇన్ని లక్షలు చెల్లించి, తీరా సీటు రాకపోతే పరిస్థితి ఏమిటనే ఆందోళన తల్లిదండ్రుల్లో కన్పిస్తోంది. -
60,941 ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద మొదటి దశ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. తొలి దశలో 61,169 సీట్లు ఎంసెట్ అర్హులకు కేటాయించినట్టు సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 23వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని స్పష్టం చేశారు. ఆయా కాలేజీల ఫీజుల వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల కోసం మొత్తం 71,216 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. 69,793 మంది వెబ్ ఆప్షన్స్ నమోదు చేశారు. అయితే ఇంజనీరింగ్ విభాగంలో 15 ప్రభుత్వ, రెండు ప్రైవేటు యూనివర్సిటీ కళాశాలలు, 158 ప్రైవేటు కాలేజీలతో కలిపి మొత్తం 175 ఇంజనీరింగ్ కాలేజీల్లో 74,071 సీట్లున్నాయి. మొదటి దశ కౌన్సెలింగ్ ద్వారా 60,941 సీట్లు (82.27 శాతం) భర్తీ చేశారు. ఫార్మసీలో 115 కాలేజీల్లో 4,199 సీట్లు అందుబాటులో ఉంటే 228 సీట్లను భర్తీ చేశారు. ఈడబ్ల్యూస్ కోటా కింద తొలిదశలో 5,108 సీట్లు (ఇంజనీరింగ్, ఫార్మా) కేటాయించారు. -
ఏపీ ఈసెట్ పరీక్ష నేడే
అనంతపురం విద్య: ఏపీ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ పరీక్ష (ఏపీ–ఈసెట్)–2021ను ఆదివారం నిర్వహించనున్నారు. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా 48 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఏపీ ఈసెట్ చైర్మన్ ప్రొఫెసర్ జింకా రంగజనార్ధన, కన్వీనర్ ప్రొఫెసర్ సి. శశిధర్ వెల్లడించారు. ఇందులో అర్హత సాధించిన వారికి బీటెక్ రెండో సంవత్సరంలోకి నేరుగా ప్రవేశం కల్పిస్తారు. 13 బ్రాంచీల్లో నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కు మొత్తం 34,271 మంది దరఖాస్తు చేశారు. ఆదివారం ఉ.9 నుంచి మ.12 గంటల వరకు ఏడు బ్రాంచ్‌లకు సంబంధించిన విద్యార్థులకు.. మ.3 నుంచి సా.6 గంటల వరకు ఆరు బ్రాంచ్‌ల విద్యార్థులకు పరీక్ష ఉంటుంది. అగ్రికల్చర్ ఇంజినీరింగ్ పరీక్షకు 420, సిరామిక్ టెక్నాలజీకి 6, కెమికల్ ఇంజినీరింగ్‌కు 371, సివిల్ ఇంజినీరింగ్‌కు 5,606, కంప్యూటర్ సైన్సెస్ అండ్ ఇంజినీరింగ్‌కు 2,249, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌కు 7,760, బీఎస్సీ (మేథమేటిక్స్)కు 58, ఈసీఈకి 6,330, మెకానికల్ ఇంజినీరింగ్‌కు 10,652, మెటలర్జికల్‌కు 147, మైనింగ్ ఇంజినీరింగ్‌కు 292, ఫార్మసీకి 140, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెన్‌టేషన్ ఇంజినీరింగ్‌కు సంబంధించి 140 దరఖాస్తులు అందాయి. సూచనలు, నిబంధనలు ఇవే.. ► ఉదయం సెషన్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు 7.30 గంటలకు, మధ్యాహ్నం సెషన్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు 1.30 గంటలకు ఆయా పరీక్ష కేంద్రాల వద్ద రిపోర్ట్ చేసుకోవాలి. ► క్యాలిక్యులేటర్లు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లకూడదు. ► బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేసిన నేపథ్యంలో చేతులకు గోరింటాకు, మెహందీ, టాటూ మార్కులు ఉండకూడదు. ► ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. ► పరీక్ష సమయం ముగిసేవరకూ కేంద్రం నుంచి బయటకు పంపరు. -
కన్వీనర్ కోటాలో 70వేలకు పైగా సీట్లు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీలో కన్వీనర్ కోటా ద్వారా కేటాయింపు జరిగే మొత్తం సీట్లు 70,030 అని, ఇందులో ఇంజనీరింగ్ 66,290 కాగా ఫార్మాసీ 3740 సీట్లు ఉన్నాయని టీఎస్ఎంసెట్ కన్వీనర్, సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. కన్వీనర్ కోటాలో సీట్ల కేటాయింపునకు విద్యార్థులు ఆప్షన్ల నమోదును ఈ నెల 16వ తేదీ (గురువారం) అర్ధరాత్రి 12 గంటల్లోగా పూర్తి చేసుకోవాలని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు సాధ్యమైనన్ని ఎక్కువ ఆప్షన్లు పెట్టుకోవాలని సూచించారు. ఎంసెట్‌లో ధ్రువపత్రాల పరిశీలన చేసుకున్న విద్యార్థులు 71,186 కాగా వారిలో ఇప్పటి వరకు 47,471 మంది ఆప్షన్లు ఎంపిక చేసుకున్నట్లు ఆయన వివరించారు. మంచి కాలేజీల్లో సీట్లు రావడానికి ఒక విద్యార్థి ఎన్ని ఆప్షన్లు అయినా పెట్టుకోవచ్చని, ఈసారి ఒక విద్యార్థి కౌన్సెలింగ్ కోసం ఏకంగా 1,186 ఆప్షన్లు ఇచ్చినట్లు తెలిపారు. 47,471 మంది మొత్తంగా 18,97,052 ఆప్షన్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కోర్సుల వారీగా కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను ఆయన వెల్లడించారు.. సీట్ల వివరాలు.. సీఎస్ఈ(16,801), ఈసీఈ(12,582), ఈఈఈ(6,366), సీఐవీ(5,766), ఎంఈసీ(5,355), సీఎస్ఎం(5,037), ఐఎన్ఎఫ్(4,713), సీఎస్డీ(3,003), సీఎస్సీ(1,638), సీఎస్ఓ(1,029), ఏఐడీ(420), ఎంఐఎన్(388), సీఎస్ఐ(336), ఏఐఎం(270), సీఎస్బీ(252), సీహెచ్ఈ(246), ఏఎన్ఈ(210), సీఎస్డబ్లు్య(210), ఈఐఈ(196), ఏఐ(126), సీఐసీ(126), ఈసీఎం(126), ఏయూటీ(84), సీఎస్ఎన్(84), ఎఫ్‌డీటీ(84), టీఈఎక్స్(80), డీటీడీ(60), ఎఫ్ఎస్పీ(60), ఎంఈటీ(60), బీఎంఈ(51), సీఎంఈ(42), సీఎస్జీ(42), సీఎస్టీ(42), ఈసీఐ(42), ఈటీఎం(42), ఎంసీటీ(42), ఎంఎంటీ(42), పీహెచ్ఈ(42), పీఎల్జీ(40), ఎంఎంఎస్(30), ఎంటీఈ(30), ఐపీఈ(28), ఏజీఆర్(24), బీఆర్జీ(22), బీఐఓ(21), పీహెచ్ఎం(3,220), పీహెచ్డీ(520) -
సాక్షి ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ‘ఎంసెట్’ మాక్ టెస్టులు, రిజిస్ట్రేషన్ చేసుకోండిలా..
సాక్షి, ఎడ్యుకేషన్: ఇంటర్ తర్వాత.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం ‘ఇంజనీరింగ్’..! ఇందు కోసం ప్రతి ఏడాది లక్షలాది మంది విద్యార్థులు ‘ఎంసెట్’ పరీక్ష కోసం ప్రిపేరవుతుంటారు. కోవిడ్ కారణంగా వాయిదా పడిన ఈ ప్రవేశ పరీక్షను త్వరలోనే నిర్వహించనున్నారు. ఒక వైపు కరోనా ప్రభావం..మరో వైపు భవిష్యత్‌కు దారి చూపే ప్రవేశ పరీక్ష! ఇలాంటి కష్ట సమయంలో తెలుగు విద్యార్థులకు అండగా నిలిచేందుకు సాక్షి ఎడ్యుకేషన్.కామ్ ముందుకు వచ్చింది. ఇంటి నుంచే ఆన్లైన్ మాక్ ఎంసెట్ పరీక్ష రాసి..తమ ప్రతిభను సమీక్షించుకొని..ప్రిపరేషన్‌ను మెరుగుపరచుకునేందుకు ఇదో చక్కని సదావకాశం. ఈ మాక్ టెస్టులను ప్రముఖ sakshieducation.com, Xplore సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి. https://special.sakshi.com/online-classes/eapcet-registration లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత...లాగిన్ ID, Password ను ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీకి పంపిస్తారు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థి మూడు ఆన్లైన్ టెస్టులకు హాజరుకావచ్చు. ఈ పరీక్షల ఫలితాలను ఆగస్టు 17వ తేదీన విడుదల చేస్తారు. అలాగే www.sakshieducation.com లో మార్కులను తెలుసుకోవడంతో పాటు ర్యాంక్ కార్డ్‌ను పొందవచ్చు. -
అడ్మిషన్లు అదుర్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మా తదితర కోర్సుల్లో సీట్ల భర్తీ ఈ విద్యా సంవత్సరంలో గణనీయంగా పెరిగింది. గత నాలుగైదేళ్లలో లేని విధంగా విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సుల వైపు దృష్టి సారించారు. కోవిడ్ కారణంగా విద్యా సంవత్సరంలో ప్రవేశాలు చాలా ఆలస్యమైనప్పటికీ.. అడ్మిషన్లు గతంలో కన్నా ఈసారి మెరుగ్గా ఉన్నాయి. ఉన్నత విద్యలో, సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రమాణాల మెరుగుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా విద్యార్థులు రాష్ట్ర విద్యాసంస్థల్లో చేరికకే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్ చేయడంతో పాటు జగనన్న వసతి దీవెన కింద వసతి, భోజనాల కోసం రూ.20 వేల వరకు ఏటా నిధులు సమకూరుస్తుండడం కూడా దీనికి కారణం. ఈ నేపథ్యంలోనే ఇంజనీరింగ్, ఫార్మా తదితర కోర్సుల్లోకి విద్యార్థులు ఎక్కువగా చేరుతున్నారు. ఈ ఏడాది కన్వీనర్ కోటా సీట్లు 73 శాతానికి పైగా భర్తీ అవ్వడం దీనికి తార్కాణం. 75,515 సీట్లు భర్తీ ఏపీ ఎంసెట్–2020 ప్రవేశాల ప్రక్రియ కోవిడ్ కారణంగా ఆలస్యమైన సంగతి తెలిసిందే. ఎంసెట్–2020 అడ్మిషన్లలో భాగంగా కౌన్సెలింగ్ ప్రక్రియ గత ఏడాది అక్టోబర్ చివర్లో ఆరంభమైంది. మొదటి విడత సీట్ల కేటాయింపు ఈ ఏడాది జనవరి 3న చేపట్టగా కన్వీనర్ కోటాలోని 1,04,090 సీట్లలో 72,867 సీట్లు భర్తీ అయ్యాయి. ఆదివారం మూడో విడత సీట్ల కేటాయింపు ముగియగా కన్వీనర్ కోటాలో 75,515 సీట్లు భర్తీ అవ్వగా 28,575 సీట్లు ఇంకా మిగిలాయి. ఈ కౌన్సెలింగ్‌లో ప్రభుత్వ వర్సిటీ కాలేజీల్లోని సీట్లు 90 శాతానికి పైగా భర్తీ కాగా ప్రైవేటు కాలేజీల్లోని సీట్లు భారీగా మిగిలాయి. కాలేజీలు తగ్గినా.. ప్రభుత్వం విద్యార్థుల ఉన్నత చదువులకు ఇబ్బంది లేకుండా అనేక పథకాలు అమలు చేస్తుండటంతో విద్యార్థులు రాష్ట్ర కాలేజీల్లో చేరేందుకు మొగ్గు చూపిస్తున్నారని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు ఉన్నత విద్య ప్రమాణాల పెంపుపై ప్రభుత్వం దృష్టిసారించడం కూడా ఇందుకు దోహదపడిందని, అనేక కాలేజీలను కౌన్సెలింగ్ నుంచి తప్పించినప్పటికీ భారీ సంఖ్యలో చేరికలు ఉండటం గమనార్హమని వారు చెబుతున్నారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ప్రమాణాలు లేని కాలేజీలు వాటిని సర్దుబాటు చేసుకొనేందుకు ప్రభుత్వం కొంత సమయమిచ్చింది. లోపాలు సరిదిద్దుకోని కాలేజీలపై ఈ విద్యాసంవత్సరం నుంచి చర్యలకు ఉపక్రమించింది. చేరికలు సున్నాకు పడిపోయిన 48 ఇంజనీరింగ్ కాలేజీలను ఈసారి కౌన్సెలింగ్ నుంచి తప్పించింది. అలాగే వర్సిటీలకు నిబంధనల మేరకు ఫీజులు చెల్లించని 82 కాలేజీలకు ఫస్టియర్ సీట్ల కేటాయింపును నిలిపివేసింది. బీఫార్మసీ, డీఫార్మాలో కూడా ఇలాంటి కాలేజీలకు అడ్మిషన్లు నిలిపివేసింది. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యల ఫలితంగా పలు కాలేజీల్లో సదుపాయాలు మెరుగుపడ్డాయి. కాలేజీలు అన్ని విధాలా అర్హతలున్న సిబ్బందిని నియమించుకున్నాయి. ల్యాబ్‌లు, లైబ్రరీలు, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేశాయి. -
ఇంజినీరింగ్‌లో ఇంకా సీట్లున్నాయ్..!
మచిలీపట్నం: ఇంజినీరింగ్ కాలేజీల్లో 2020–21 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్ పూర్తవుతోంది. జిల్లాలోని ఏఏ కాలేజీల్లో ఎంతమంది విద్యార్థులు సీట్లు ఎంపిక చేసుకున్నారనేది అధికారులు వెల్లడించారు. చాలా కాలేజీల్లో సీట్లు భారీగా మిగిలిపోయాయి. కొన్ని బ్రాంచిల్లో ఒకరిద్దరు విద్యార్థులు మాత్రమే కోరుకున్నారు. ఇలాంటి చోట్ల తరగతులు నిర్వహణ ఎలా ఉంటుందనేది విద్యాశాఖ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జిల్లాలో 32 కాలేజీల్లో ప్రవేశాలకు ఈ ఏడాది ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కన్వీనర్ కోటా కింద మొత్తం 11,555 సీట్లు అందుబాటులో ఉండగా, తొలివిడతలో 8,408 మంది సీట్లు కోరుకోగా, ఇందులో కొంతమంది విద్యార్థులు కాలేజీల్లో చేరలేదు. తాజాగా రెండో విడత కౌన్సెలింగ్ పూర్తయ్యే సరికి 8,698 మంది విద్యార్థులు సీటు పొందారు. ఫిబ్రవరి 1 నాటికి విద్యార్థులు కాలేజీల్లో చేరాలని అధికారులు స్పష్టం చేశారు. లేకుంటే సీటు రద్దు చేస్తామని ప్రకటించారు. కౌన్సెలింగ్‌లో సీటు కోరుకున్నప్పటికీ, ఎంత మంది కాలేజీలకు వచ్చి చేరుతారనేది తేలాల్సి ఉంది. రెండు విడుతల పూర్తి అయినప్పటికీ, కన్వీనర్ కోటాలోనే ఇంకా 2,857 సీట్లు ఖాళీ ఉన్నాయి.(చదవండి: త్వరలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ) ఇదిలా ఉంటే జిల్లాలోని 32 కాలేజీల్లో 9 చోట్ల వందమంది లోపే విద్యార్థులు చేరారు. కొన్ని బ్రాంచిల్లో అయితే ఒకరిద్దరు మాత్ర మే కోరుకున్నారు. మూడేళ్ల పాటు 25 శాతంపైన ప్రవేశాలు లేకుంటే, వాటికి గుర్తింపు వద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే జిల్లాలో మూడు కాలేజీలు ఈ విద్యా సంవత్సరంలో మూతపడ్డాయి. ఈ లెక్కన తక్కువ అడ్మిషన్లు నమోదు అయిన కాలేజీల పరిస్థితి వచ్చే ఏడాది ఎలా ఉంటుందోనని కళాశాల యాజమాన్యాల్లో సర్వత్రా చర్చసాగుతోంది. మరోవైపు, ఇంజినీరింగ్ విద్యలో సీఎస్ఈ బ్రాంచికు మంచి క్రేజ్ ఉంటుంది. కానీ గాంధీజీలో ఆరుగురు, అదే విధంగా శ్రీవాణి మైలవరంలో ఏడుగురు మాత్రమే చేరారు.లింగయాస్, పీపీడీవీ, డీజేఆర్ఎస్, మండవ వంటి కాలేజీల్లో మెకానికల్ బ్రాంచిలో ఒక్కొక్కొరు చొప్పున మాత్రమే విద్యార్థులు చేరారు. ఒక గ్రూపుకు తప్పనిసరిగా ఆరుగురు అధ్యాపకులు ఉండాలి. మరి ఒకరిద్దరు చేరిన చోట గ్రూపులను కొనసాగిస్తారా..లేదా..? అనేది తేలాల్సి ఉంది. వాసవి పెడన కాలేజీలో మిగతా గ్రూపుల్లో కొంతమేర పరువాలేకున్నా, సివిల్ ఇంజినీర్లో 8 మంది మాత్రమే చేరారు. ఇలాంటి కాలేజీలు చాలానే ఉన్నాయి. ఇదే ఇప్పుడు హాట్ టాఫిక్గామారింది. -
ఇంజనీరింగ్‌లో రెండు రకాల ఫీజులు
మేడ్చల్ సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో వార్షిక ఫీజు రూ. 89 వేలు.. అయినా కాలేజీ యాజమాన్యం మేనేజ్మెంట్ కోటాలో కంప్యూటర్ సైన్స్ సీటుకు వార్షిక ఫీజు కలుపుకొని నాలుగేళ్లకు రూ. 9 లక్షలు తీసుకుంటోంది.. ఘట్కేసర్ సమీపంలోని మరొక కాలేజీలో కంప్యూటర్ సైన్స్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సీటుకు రూ.12 లక్షల డొనేషన్‌తో పాటు ఏడాదికేడాది ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును వసూలు చేస్తోంది. సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని అగ్రశ్రేణి కాలేజీలతో పాటు, కొద్ది పేరున్న వాటిలో యాజమాన్య కోటా సీట్ల భర్తీలో కొనసాగుతున్న దందా ఇదీ.. యాజమాన్య కోటాకు ప్రత్యేక ఫీజు లేకపోయినా, కన్వీనర్ కోటా ఫీజునే యాజమాన్య కోటాలో వసూలు చేయాలన్న నిబంధన ఉన్నా కూడా అదేమి పట్టకుండా వసూళ్లకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రుల ఆశలతో కొన్ని కాలేజీల యాజమాన్యాలు వ్యాపారం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అసలు మేనేజ్మెంట్ కోటా పేరుతో యాజమాన్యాలు వసూలు చేస్తున్న ఫీజుకు హేతుబద్ధత ఏంటన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. యాజమాన్యాలు నిర్ణయించి వసూలు చేస్తున్నదే అధికారిక ఫీజు అన్న విధంగా పరిస్థితి తయారైంది. ఈ నేపథ్యంలో యాజమాన్య కోటా సీట్ల భర్తీ, ఫీజుల విధానంపైనా వివిధ కోణాల్లో ఆలోచనలు మొదలయ్యాయి. మెడికల్ తరహాలో రెండు రకాల ఫీజుల విధానం ప్రవేశపెట్టి, కన్వీనర్ ద్వారానే ఆ సీట్లను భర్తీ చేస్తే అడ్డగోలు వసూళ్ల దందాకు తెరపడుతుందన్న ఆలోచనలను అధికారులు చేస్తున్నారు. కన్వీనర్ కోటాలో ఉన్న ఫీజుపై 50 శాతం లేదా ఎంతో కొంత మొత్తాన్ని పెంచి యాజమాన్య కోటా ఫీజుగా ఖరారు చేస్తే యాజమాన్యాలకు ఊరటతో పాటు, యాజమాన్య కోటాలో సీట్లు కావాలనుకునే తల్లిదండ్రులపైనా భారం తగ్గుతుందన్న వాదనలున్నాయి. మరోవైపు కన్వీనర్ ద్వారా ప్రభుత్వమే ఆ సీట్లను భర్తీ చేస్తే ఎలాంటి అక్రమాలకు తావుండదని, మెరిట్ విద్యార్థులు టాప్ కాలేజీల్లో సీట్లు లభిస్తాయన్న ఆలోచనలు అధికారుల్లో ఉన్నాయి. అయితే అది అంత తొందరగా ఆచరణ రూపం దాల్చుతుందో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిబంధనలతో పారదర్శకత సాధ్యం కాదా? ఇంజనీరింగ్‌లో రెండు రకాల ఫీజుల విధానం ఆచరణలోకి వచ్చేందుకు సమయం పట్టనున్న నేపథ్యంలో ఇప్పుడున్న నిబంధనల ప్రకారం మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీలో పారదర్శకత ఉండేలా చూడటం సాధ్యం కాదా..? అంటే అవుతుందనే చెప్పవచ్చు.. ఇటు హైకోర్టు కూడా మేనేజ్మెంట్ కోటాలో పారదర్శకత ఉండాలని, మెరిట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించింది. అయితే అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా అవి అమలుకు నోచుకోవడం లేదు. ప్రభుత్వం ఏం చేసిందంటే.. యాజమాన్య కోటా సీట్ల భర్తీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు అనేక నిబంధనలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2011లో 74, 75 జీవోలను, 2012లో 66, 67 జీవోలను ప్రభుత్వం జారీ చేసింది. వాటిల్లోని వివిధ అంశాలపై యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించగా.. 2014 ఆగస్టు 14న 13, 14 జీవోలను జారీ చేసింది. అయితే జీవో 66, 67 ప్రకారమే యాజమాన్య కోటా సీట్లను ఆన్లైన్లో భర్తీ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. యాజమాన్య కోటాలో సీటు కోరుకునే ప్రతి విద్యార్థికి దరఖాస్తు దక్కేలా, ఆ దరఖాస్తుల నుంచి ప్రతిభ కలిగిన విద్యార్థులు ఎంపికయ్యేలా చర్యలు చేపట్టింది. మారదర్శకాలు ఇవీ.. బీ కేటగిరీ సీట్ల భర్తీకి సింగిల్ విండో తరహాలో అధికార యంత్రాంగం ఒక వెబ్ పోర్టల్‌ను తయారు చేయాలి. ఈ పోర్టల్‌లో ప్రతి కాలేజీకి ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వాలి. కాలేజీల్లోని ప్రతి కోర్సులో యాజమాన్య కోటాలో ఉండే సీట్ల వివరాలు అందుబాటులో ఉంచాలి. మరోవైపు పత్రికల్లో, ఈ పోర్టల్‌లో ఆయా కాలేజీలు ప్రకటనలివ్వాలి. విద్యార్థులు ఆ పోర్టల్‌కు వెళ్లి తమకు కావాల్సిన కాలేజీకి దరఖాస్తు చేసుకోవాలి. ఒకే కాలేజీలో రెండు, మూడు కోర్సులను ఎంచుకుంటే ప్రాధాన్య క్రమం ఇవ్వాలి. వాటి ఆధారంగా కాలేజీలు విద్యార్థులను ఎంపిక చేయాలి. సీట్లు పొందిన విద్యార్థుల జాబితాను కాలేజీలు తిరిగి వెబ్‌పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. మెరిట్ ప్రకారమే ఎంపిక చేశారని ఉన్నత విద్యామండలి భావిస్తే ఆన్లైన్లోనే ఆమోదించాలి. లేదంటే తిరస్కరించాలి. ఇంకా సీట్లు మిగిలితే రెండో జాబితాను రూపొందించాలి. ప్రభుత్వాన్ని సమర్థిస్తూనే.. ప్రభుత్వ ఉత్తర్వులపై యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. జీవో 66, 67లను కోర్టు సమర్థిస్తూనే యాజమాన్యాలు కోరిన పలు అంశాలను ఆ జీవోల్లో చేర్చాలని సూచించింది. అందులో దరఖాస్తులు ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్లైన్లోనూ దరఖాస్తు చేసుకునే అవకాశంతో పాటు విద్యార్థిని ఇంటర్వ్యూ చేసే వీలుంది. అలాగే వారి ఆర్థిక స్థోమత తెలుసుకొని సీట్లను కేటాయించే అవకాశమివ్వాలని, ఒకవేళ యాజమాన్యం ఆ విద్యార్థిని తిరస్కరిస్తే అందుకు గల కారణాలను ఉన్నత విద్యా మండలికి తెలియజేయడం వంటి అంశాలను చేర్చాలని హైకోర్టు స్పష్టంచేసింది. అలాగే అప్పటివరకు 5 శాతమే ఉన్న ఎన్ఆర్ఐ కోటా సీట్లను కూడా 15 శాతం వరకు పెంచుకునే అవకాశం కల్పించింది. అమలుకు నోచుకోని ఉత్తర్వులు.. హైకోర్టు సూచించిన మేరకు 66, 74 జీవోలకు సవరణ చేస్తూ ప్రభుత్వం.. 2014 ఆగస్టు 14న జీవో 13ను జారీ చేసింది. అయితే ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించేందుకు చర్యలు చేపట్టాలని మార్గదర్శకాల్లో పేర్కొన్న అంశం ఇక్కడ లేకుండాపోయింది. దీనిపై కోర్టులో రివ్యూ పిటిషన్ వేసి, దానిని అమలు చేసేలా చర్యలు చేపట్టాల్సిన అధికారులు యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గే ఆన్లైన్ విధానాన్ని మళ్లీ తెచ్చేందుకు చర్యలు చేపట్టడం లేదన్న వాదన వినిపిస్తోంది. రెండు రకాల ఫీజుల విధానంతో అడ్డుకట్ట.. కోర్టు తీర్పులు యాజమాన్యాలకు అనుకూలంగా ఉన్నాయి. ఎన్ని చర్యలు చేపట్టినా సీట్లు అమ్ముకుంటున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆధారం లేకుండా ఏ చర్యలు చేపట్టే అవకాశం లేదు. రెండు రకాల ఫీజుల విధానంతో అడ్డగోలు వసూళ్లను అడ్డుకోవచ్చు. కన్వీనర్ కోటా ఫీజు కంటే యాజమాన్య కోటా ఫీజు కొంత పెంచి, కన్వీనర్ ద్వారా భర్తీ చేస్తే పారదర్శకత ఉంటుంది. తల్లిదండ్రులపై భారం తగ్గుతుంది. ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నా కార్యరూపం దాల్చడం లేదు. – తుమ్మల పాపిరెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ అలా చేస్తే అభ్యంతరం లేదు.. రెండు రకాల ఫీజుల విధానం తెస్తే మాకేమీ అభ్యంతరం లేదు. సీట్లు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు పోతాయి. సీట్ల భర్తీ వ్యవహారం కూడా కన్వీనరే చేస్తారు కనుక మాపై భారం తగ్గుతుంది. అయితే కన్వీనర్ కోటా కంటే యాజమాన్య కోటా ఫీజు రెట్టింపు ఉండేలా చూడాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆ విధానాన్ని తెస్తే స్వాగతిస్తాం.. – గౌతంరావు, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాల సంఘం చైర్మన్ -
ఇంజనీరింగ్‌లో 45 రకాల కోర్సులు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్ ఆప్షనకు ఆదివారం అర్ధరాత్రి నుంచే అవకాశం కలి్పంచేలా ఏర్పాట్లు చేసినా, సాంకేతిక కారణాలతో సోమవారం మధ్యాహ్నం 3 గంటల తరువాత మొదలైంది. ఈనెల 20తో సరి్టఫికెట్ల వెరిఫికేషన్, 22తో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తి చేసేలా, 24న సీట్ల కేటాయింపును ప్రకటించేలా అధికారులు ఇదివరకే షెడ్యూలు జారీ చేశారు. ఇక సోమవారం సాయంత్రం వరకు 57,530 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, అందులో 51,880 మంది సరి్టఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. వారిలో 10,032 మంది వెబ్ ఆప్షన్లను ఇచ్చుకున్నారు. కోర్సుల వివరాల్లో పలు మార్పులు, చేర్పుల తరువాత కనీ్వనర్ కోటాలో 72,998 సీట్లు అందుబాటులో ఉన్నాయని.. ఇంజనీరింగ్‌లో 69,116, ఫార్మసీలో 3,882 సీట్లున్నట్లు ప్రవేశాలు కమిటీ వెల్లడించింది. ఇంజనీరింగ్‌లో 45 రకాల కోర్సులను అనుమతించగా, ఫార్మసీలో రెండు కోర్సులను అనుమతించింది. కొత్త కోర్సులు, ప్రధాన బ్రాంచీల్లోని సీట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 126 సీట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డాటా సైన్స్ 168, సీఎస్ఈ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెరి్నంగ్) 5,310, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ అండ్ బ్లాక్ చెయిన్ టెక్నాలజీ 126, కంప్యూటర్ ఇంజనీరింగ్ 42, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ 252, సీఎస్ఈ(సైబర్ సెక్యూరిటీ) 1,806, సీఎస్ఈ (డాటా సైన్స్) – 3,213, సీఎస్‌ఐటీ 336, సీఎస్ఈ (నెట్ వర్క్స్) 126, సీఎస్ఈ (ఐవోటీ) 1,281, కంప్యూటర్ ఇంజనీరింగ్ 210, సీఎస్ఈ 16,681, ఈసీఈ 13,397, సివిల్ 6,378, ఈఈఈ 6,907, ఐటీ 4,650, మెకానికల్ 5,980, మైనింగ్ 328 సీట్లు. -
9 నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 9 నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాలు చేపట్టాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. గతేడాది విధానంలోనే ఈసారి కూడా ప్రవేశా లు చేపట్టాలని నిర్ణయించారు. రెండు దశల కౌన్సెలింగ్ తరువాత వచ్చే నెల 4న స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పించనున్నారు. స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలను https://tseamcet.nic.in వెబ్సైట్లో అందుబాటు లో ఉంచనున్నారు. నవంబర్ 5వ తేదీ నాటికి ప్రవేశాలు పూర్తయితే ఇంజనీరింగ్ తరగతులను నవంబర్ 10 లేదా 15వ తేదీ నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. అయితే దీనిపై అధికారిక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. (చదవండి: ‘అడ్వాన్స్డ్’లో తెలుగోళ్లు) సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 36 హెల్ప్‌లైన్ కేంద్రాలు కరోనా నిబంధనలు పాటిస్తూనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. ఇందుకోసం 36 హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. నిర్ణీత తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్ట నుంది. ప్రతి అర గంటకో స్లాట్ ఉండేలా కస రత్తు చేసింది. విద్యార్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో హెల్ప్‌లైన్ సెంటర్, తేదీ, సమయాన్ని పేర్కొంటూ ఆన్లైన్ ద్వారానే స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా సమయాల్లో సంబంధిత హెల్ప్‌లైన్ కేంద్రానికి వెళ్లి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసుకొనేలా కమిటీ ఏర్పాట్లు చేసింది. ప్రాసెసింగ్ ఫీజును ఎస్సీ, ఎస్టీలకు రూ. 600గా, ఇతర విద్యార్థులకు రూ. 1200గా నిర్ణయించింది. కౌన్సెలింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్సైట్లో బుధవారం అందుబాటులో ఉంచనుంది. (చదవండి: డబ్బులు ఎవ్వరికీ ఊరికే రావు: సజ్జనార్) -
తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్ : టీఎస్ ఈసెట్ ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యామండలి శుక్రవారం విడుదల చేసింది. ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ టి.పాపిరెడ్డి విడుదల చేశారు. ఫలితాల్లో 90.86 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం ప్రవేశానికి ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఎస్సీ (మ్యాథమెటిక్స్) అంశాల్లో గత నెల 31న నిర్వహించిన ఈ పరీక్షకు 28,037 రిజిస్టర్ చేసుకోగా 25,448 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యామండలి చైర్మన్ మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలోనూ పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేయడం శుభపరిణామం అని అన్నారు. పరీక్ష నిర్వహణ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనలు తెలిపారు. -
19న ఎంసెట్ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్–2020 నోటిఫికేషన్‌ను ఈనెల 19న జారీ చేయాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. ఈ నెల 21 నుంచి మార్చి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనుంది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్ష తన జరిగిన ఎంసెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం పాపిరెడ్డి మాట్లాడుతూ.. 20 జోనల్ కేంద్రాల పరిధిలోని 55 ప్రాంతాల్లో ఏర్పాటు చేసే 105 కేంద్రాల్లో ఈ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు పాపిరెడ్డి వెల్లడించారు. ఇందులో రాష్ట్రంలో 16 జోనల్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా, ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం కర్నూల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలోనూ జోనల్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌కు ఒక్కో దానికి రూ.800 పరీక్ష ఫీజుగా నిర్ణయించామని, ఎస్సీ, ఎస్టీలతోపాటు వికలాంగులకు ఫీజు సగానికి (రూ.400) తగ్గించినట్లు వెల్లడించారు. రెండింటికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు రూ.1,600 (ఎస్సీ, ఎస్టీ, వికలాంగులైతే రూ. 800) ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. మే 4, 5, 7 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్, 9, 11 తేదీల్లో అగ్రికల్చర్ ఎంసెట్ పరీక్ష ఉంటుందని, ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరో సెషన్లో పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని, ఈ నిబంధనను యథావిధిగా అమలు చేస్తామన్నారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రాలు అందుబాటులో ఉండేలా ఈసారి టెస్ట్ సెంటర్లను రీఆర్గనైజ్ చేశామని ఎంసెట్ కన్వీనర్, జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోవర్ధన్ వెల్లడించారు.} ప్రభుత్వం ఆమోదిస్తే ఈడబ్ల్యూఎస్... రాష్ట్రంలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) కోటా అమలుకు సంబంధించి అం«శం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఈసారి ప్రవేశాల్లో అమలు చేస్తామని పాపిరెడ్డి తెలిపారు. అయితే ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ కాలేదన్నారు. తాము మాత్రం ముందస్తుగా దాని అమలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించిన ప్రత్యేక కాలమ్‌ను విద్యార్థులు చేసుకునే దరఖాస్తులో పొందుపరుస్తున్నట్లు కన్వీనర్ వెల్లడించారు. ప్రభుత్వం జీవో మార్చితేనే కెమిస్ట్రీ మినహాయింపు అమలు.. ఇంజనీరింగ్‌లో చేరేందుకు మ్యాథ్స్, ఫిజిక్స్‌తోపాటు కెమిస్ట్రీ మాత్రమే కాకుండా ఇతర సబ్జెక్టులు చదివిన వారికి అవకాశం ఇవ్వాలని, కెమిస్ట్రీ తప్పనిసరి కాదని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) పేర్కొన్న అంశంపై ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి వివరణ ఇచ్చారు. ఏఐసీటీఈ ఆ నిబంధనను తీసుకువచ్చినా తాము రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే ఎంసెట్ నిర్వహిస్తున్నామని, రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు చేపడుతున్నామన్నారు. ఏఐసీటీఈ చేసిన మార్పులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను మార్చితే అమలు చేస్తామన్నారు. ఇదీ ఎంసెట్–2020 షెడ్యూలు.. 19–ఫిబ్రవరి : ఎంసెట్ నోటిఫికేషన్ 21–ఫిబ్రవరి నుంచి 30–మార్చి వరకు : ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ 31– మార్చి నుంచి 3–ఏప్రిల్ వరకు: ఆన్లైన్లో సబ్మిట్ చేసిన దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు అవకాశం 6–ఏప్రిల్ వరకు: రూ.500 ఆలస్య రుసుముతో ఆన్లైన్లో దరఖాస్తులకు అవకాశం 13–ఏప్రిల్ వరకు: రూ.1000 ఆలస్య రుసుముతో ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ 20–ఏప్రిల్ వరకు: రూ. 5 వేల ఆలస్య రుసుముతో ఆన్లైన్లో దరఖాస్తుకు చాన్స్ 17–ఏప్రిల్: హాల్‌టికెట్ల జనరేషన్ 27–ఏప్రిల్ వరకు..: రూ. 10 వేల ఆలస్య రుసుముతో ఆన్లైన్లో దరఖాస్తుల సబ్మిషన్ 20–ఏప్రిల్ నుంచి 1–మే వరకు: వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్ల డౌన్లోడ్ 4–మే, 5–మే, 7–మే: ఇంజనీరింగ్ ఎంసెట్ 9–మే, 11–మే: అగ్రికల్చర్ ఎంసెట్ -
రండి బాబూ..రండి!
సాక్షి, కర్నూలు : ఆళ్లగడ్డలోని భూమా శోభా నాగిరెడ్డి మెమోరియల్ కాలేజీ అండ్ టెక్నాలజీలో మొత్తం 231 సీట్లు కౌన్సెలింగ్‌లో పెట్టారు. అయితే ముగ్గురు విద్యార్థులు మాత్రమే సీట్లు పొందారు. ఓర్వకల్లు మండలంలో ఉన్న గీతాంజలి ఇంజినీరింగ్ కాలేజీలో 231 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించగా కంప్యూటర్ సైన్సు అండ్ ఇంజినీరింగ్‌లో 8మంది, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో కేవలం ఒక్క విద్యార్థికి మాత్రమే సీట్లు అలాట్ అయ్యాయి. జిల్లాలో ఈ రెండు కాలేజీలే కాదు ఆరు కళాశాలల్లో 50 శాతం సీట్లు భర్తీ కాలేదు. ఈ నేపథ్యంలో కొన్ని కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లి బతిమాలుతున్నాయి. తమ కళాశాలలో చేరాలని ప్రాధేయ పడుతున్నాయి. అయితే విద్యార్థులు ఉత్సాహం చూపడం లేదు. ఇంజినీరింగ్ విద్యకు ఒకప్పుడు చాలా డిమాండ్ ఉండేది. ఇటీవల కాలంలో బీటెక్ పూర్తి చేసినా కూడా ఉపాధి లేకపోవడం, చదువులో నాణ్యత లేకపోవడంతో ఆదరణ తగ్గుతోంది. ఈ విద్యా సంవత్సరం కొత్తగా రాయలసీమ యూనవర్సిటీలో ఇంజినీరింగ్ కళాశాలను ప్రారంభించారు. ఇది కాకుండా జిల్లాలో 14 ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఇప్పటి వరకు రెండు విడతల్లో కౌన్సెలింగ్ పూర్తయ్యింది. జి.పుల్లారెడ్డి, జి.పుల్లయ్య, రవీంద్ర, రాజీవ్ గాంధీ మెమోరియల్, డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి ఇంజినీరింగ్ ఉమెన్ కాలేజీల్లో అత్యధిక సీట్లు భర్తీ అయ్యాయి. మిగిలిన కాలేజీల్లో ఒకటి రెండు బ్రాంచ్‌లు మినహా మిగిలిన వాటిలో పెద్దగా సీట్లు భర్తీ కాకపోవడం గమనార్హం. జిల్లాలో 2,839 సీట్లు భర్తీ.. జిల్లాలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో 4,861 సీట్లు ఉన్నాయి. మొదటి, రెండో విడతల్లో కలిపి 2,839 మాత్రమే భర్తీ అయ్యాయి. సీట్లు వచ్చిన వారు కాలేజీల్లో చేరారు. తరగతులు కూడా మొదలు అయ్యాయి. మిగిలి పోయిన సీట్ల కోసం ఈ నెల 21, 22 తేదీల్లో మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహించారు. అయితే ఆశించిన స్థాయిలో చేరికలు లేవు. మొదటి విడత తరువాత కొన్ని కళాశాల యాజమాన్యాలను ప్రవేశ పరీక్ష రాసి అర్హత సాధించిన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి మరీ తమ కాలేజీల్లో చేరాలని కోరాయి. అయితే విద్యార్థులు ఆసక్తి చూపలేదు. -
టీ ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ మళ్లీ వాయిదా
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఎంసెట్ ఇంజనీరింగ్ వెబ్ కౌన్సెలింగ్ మళ్లీ వాయిదా పడింది. జూలై 1వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియ అయిదో తేదీకి వాయిదా పడింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థులు జూలై 5 నుంచి వెబ్ ఆప్షన్లు ద్వారా కోర్సు, కళాశాల ఎంపిక చేసుకోవచ్చు. కాగా కొన్ని కళాశాలలు కోర్టు కెళ్ళి ఫీజులు పెంచుకున్న విషయం తెలిసిందే. దీంతో కాలేజీలు ఫీజుల పెంపుపై ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లనుంది. ఈలోపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసి, ఆ కళాశాలల ఫీజుల వ్యవహారం తేలాకే వెబ్ ఆప్షన్లుకు అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు. -
ఈ సారికి ఎంసెటే!
సాక్షి, హైదరాబాద్: దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒకే ప్రవేశ పరీక్ష ద్వారా ఇంజనీరింగ్‌లో ప్రవేశాలు చేపట్టే అంశంపై స్పష్టత లేకుండా పోయింది. గతంలోనే కేంద్ర ప్రభుత్వం ఒకే పరీక్ష ద్వారా ప్రవేశాలు చేపట్టాలని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఎంసెట్‌ను రద్దు చేయాలా? అని అప్పట్లో అధికారులు ఆలోచించారు. అంతేకాకుండా కొన్ని రాష్ట్రాలు జేఈఈ మెయిన్స్ ఆధారంగానే ప్రవేశాలు చేపడుతున్నాయని, అన్ని రాష్ట్రాలు ఆ దిశగా చర్యలు చేపట్టాలన్న చర్చను కేంద్రం తీసుకువచ్చింది. అయితే ఆ తరువాత దానిపై మళ్లీ స్పందించలేదు. ఒకే పరీక్ష (జేఈఈ మెయిన్స్) ద్వారా ప్రవేశాలు చేపట్టే అంశంపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఇప్పటివరకు అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు. దీంతో రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ నిర్వహణవైపే అధికారులు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎంసెట్ స్కోర్‌తోపాటు ఇంటర్మీడియట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంది. ఈ నేపథ్యంలో ఈసారికి ఎంసెట్‌ను యథావిధిగా కొనసాగించే ఆలోచనలో అధికారులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కచ్చితమైన ఆదేశాలు జారీ చేసే వరకు ఎంసెట్‌ను కొనసాగించాలని భావిస్తున్నారు. జేఈఈలోనూ స్పష్టత కరువు: జేఈఈ మెయిన్స్‌ను ఇన్నాళ్లు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహించింది. అయితే ఇప్పుడు దీంతోపాటు యూజీసీ నెట్, నీట్ వంటి ప్రవేశ పరీక్షల నిర్వహణకు ఎన్టీఏను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఏ తమ పనిని కూడా కొనసాగిస్తోంది. ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఐఐటీ, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే విద్యా సంస్థల్లో 2019 ప్రవేశాలు చేపట్టేందుకు జేఈఈ మెయిన్స్ నోటిఫికేషన్‌ను జారీ చేసి, సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు దరఖాస్తులను కూడా స్వీకరించింది. జనవరి 6 నుంచి 20 వరకు మొదటి విడత జేఈఈ, ఏప్రిల్ 6 నుంచి 20 వరకు రెండో విడత జేఈఈ నిర్వహణకు చర్యలు చేపట్టింది. అయితే ఇందులో రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ ప్రవేశాలకు ప్రత్యేక ప్రవేశ పరీక్షపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే విద్యా సంస్థల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్స్ ఏటా రెండుసార్లు నిర్వహించే షెడ్యూలు జారీ చేయడం కూడా కొంత గందరగోళానికి కారణమైంది. రెండుసార్లు నిర్వహించే ఈ పరీక్షల ద్వారా జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో తక్కువగా ఉండే కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టవచ్చు, కానీ రాష్ట్రంలో లక్ష వరకు ఉండే సీట్లను రెండు పరీక్షల్లోని అర్హులను తీసుకొని ప్రవేశాలు చేపట్టడం గందరగోళానికి దారితీస్తుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. సమన్వయం కూడా సమస్యే... ఎన్టీఏ అనేది జాతీయ స్థాయి సంస్థ కావడం, రాష్ట్రంలోని ఉన్నత విద్య శాఖకు దానికి మధ్య సమన్వయం కుదరదని, వివరాలు తీసుకోవడం వంటి సమస్యలు ఎదురవుతాయని, ప్రస్తుతం ఉన్న వెయిటేజీ సమస్య కూడా వస్తుందని ఉన్నత విద్యాశాఖ భావిస్తోంది. అందుకే రాష్ట్రంలో 2019లో ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు ప్రస్తుతం ఉన్న విధానంలోనే (ఎంసెట్ ద్వారానే) ప్రవేశాలు చేపట్టాలన్న ఆలోచన చేస్తోంది. పైగా కేంద్ర ప్రభుత్వమే రెండుసార్లు జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎంసెట్‌తోనే ప్రవేశాలు చేపట్టడం మంచిదని భావిస్తోంది. మరోవైపు జేఈఈ మెయిన్స్ మొదటి దఫా పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ ముగిసిపోయినప్పటికీ, ఏప్రిల్ జరిగే జరిగే రెండో దఫా దరఖాస్తులను వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో స్వీకరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఏ విధానాన్ని అనుసరిస్తారన్న అంశంపై వీలైనంత త్వరగా ప్రభుత్వం అధికారికంగా స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. తద్వారా విద్యార్థుల్లో గందరగోళం తొలగిపోతుందని వెల్లడించారు. పైగా వచ్చే జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రిపరేషన్, ప్రాక్టికల్ పరీక్షలు, వార్షిక పరీక్షలు ఉంటాయి కనుక ముందుగా స్పష్టతిస్తే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆయా పరీక్షలకు సిద్ధం అవుతారని వివరించారు. -
ఇంజనీరింగ్‌లో 48,982 సీట్లే భర్తీ
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాల్లో భాగంగా చేపట్టిన ఎంసెట్ చివరి దశ సీట్ల కేటాయింపును ప్రవేశాల కమిటీ బుధవారం ప్రకటించింది. ఇంజనీరింగ్, బీఫార్మసీ, ఫార్మ్–డి కోర్సుల్లో కొత్తగా 2,781 మంది విద్యార్థులకు సీట్లు లభించగా, 7,168 మంది ఒక కాలేజీ నుంచి మరో కాలేజీకి తమ సీట్లను మార్చుకున్నారు. చివరి కౌన్సెలింగ్ ముగిసేనాటికి 190 ఇంజనీరింగ్ కన్వీనర్‌కోటాలో 66,058 సీట్లు ఉండ గా, అందులో 48,982 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 17,076 సీట్లు ఖాళీగానే ఉండిపోయాయి. ఇక 117 కాలేజీల్లో బీఫార్మసీ(ఎంపీసీ స్ట్రీమ్)లో 3,224 సీట్లు ఉండగా, 134 సీట్లే భర్తీ అయ్యాయి. మరో 3,090 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. 51 కాలేజీల్లో ఫార్మ్–డీలో 500 సీట్లు ఉండగా, 54 సీట్లు మాత్రమే భర్తీ కాగా 446 సీట్లు ఖాళీగానే ఉండిపోయాయి. సీట్లు పొందిన విద్యార్థులు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని, ఈ నెల 27లోగా ఫీజు చెల్లించాలని సూచించింది. జాయినింగ్ రిపోర్టును డౌన్లోడ్ చేసుకొని కాలేజీల్లో ఈ నెల 27లోగా చేరాలని పేర్కొంది. సీట్లు వద్దనుకునే వారు కూడా 27లోగానే ఆన్లైన్లో సీట్లను రద్దు చేసుకోవాలని వెల్లడించింది. రాష్ట్రంలోని 45 కాలేజీల్లో (12 వర్సిటీ కాలేజీలు, 33 ప్రైవేటు కాలేజీలు) వందశాతం సీట్లు భర్తీ అయ్యా యని కమిటీ తెలిపింది. -
రేపే ఇంజనీరింగ్ ప్రవేశాల నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాలకు సాంకేతిక విద్యా శాఖ కసరత్తు వేగవం తం చేసింది. శుక్రవారం(18న) ప్రవేశాల నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అదే రోజు ఎంసెట్ ఫలితాలను విడుదల చేసేందుకు జేఎన్టీయూహెచ్ చర్యలు చేపట్టింది. దీంతో ఈ నెల 26 నుంచి వెబ్ ఆప్షన్లను ప్రారంభించాలని భావిస్తోంది. 26 నుంచి సాధ్యం కాకపోతే 28 నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు ఇంజనీరింగ్ ప్రవేశాల కమిటీ గురువారం సమావేశమవ్వాలని నిర్ణయించింది. ఆ సమావేశానికి జేఎన్టీయూహెచ్ అధికారులు కూడా హాజరుకానున్నారు. ఎక్కువ శాతం ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు జేఎన్టీయూహెచ్ ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అనుబంధ గుర్తింపునకు సంబంధించి జేఎన్టీయూహెచ్ ఇచ్చే సమాచారాన్ని బట్టి షెడ్యూల్‌ను ఖరారు చేయాలని అధికారులు భావిస్తున్నారు. అనుబంధ గుర్తింపు ప్రక్రియ షురూ! జేఎన్టీయూహెచ్ పరిధిలోని ఆయా కాలేజీలకు అనుబంధ గుర్తింపు జారీ ప్రక్రియను మంగళవారం నుంచి ప్రారంభించింది. బుధవారం సాయంత్రం వరకు దాదాపు 110 కాలేజీలకు గుర్తింపును జారీ చేసినట్లు తెలిపింది. -
ఇంజనీరింగ్ సీట్లలో భారీ కోత
సాక్షి, న్యూఢిల్లీ : ఇంజనీరింగ్‌లో ఈ ఏడాది 80,000 సీట్లు తగ్గనున్నాయి. దీంతో 2018-19 విద్యా సంవత్సరం కలుపుకుని నాలుగేళ్లలో దాదాపు 3.1 లక్షల సీట్లు పడిపోనున్నాయి. 2012-13 నుంచి ఇంజనీరింగ్ అడ్మిషన్లు క్రమంగా తగ్గుతూ వస్తున్న క్రమంలో సీట్ల సంఖ్య పడిపోతున్నది. ప్రమాణాలకు అనుగుణంగా లేని 200 ఇంజనీరింగ్ కాలేజీల మూసివేతతో సీట్ల సంఖ్య తగ్గిందని ఏఐసీటీఈ పేర్కొంది. ఈ కాలేజీలు మూసివేతకు దరఖాస్తు చేసుకున్నాయి. ఈ కాలేజీలు కొత్తగా విద్యార్ధులను అడ్మిట్ చేసుకోకున్నా ప్రస్తుత బ్యాచ్ గ్రాడ్యుయేషన్ ముగిసేవరకూ కార్యకలాపాలు నిర్వహిస్తాయి. 2016 నుంచి ఇంజనీరింగ్ సీట్లు ఏటా తగ్గుతున్నాయి. ఈ ఏడాది పలు కాలేజీలు మూసివేత కోరుతూ దరఖాస్తు చేయడంతో 80,000 వరకూ ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య తగ్గనున్నదని ఏఐసీటీఈ చైర్పర్సన్ అనిల్ సహస్రబుధే చెప్పారు. మరోవైపు ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్ల సంఖ్య పెరిగింది. ఇక ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత పెంచేందుకు 2022 నాటికి అన్ని సాంకేతిక విద్యా సంస్థలు తమ ప్రోగ్రామ్లన్నింటికీ నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్(ఎన్బీఏ) నుంచి అక్రిడిటేషన్ పొందాలని ఏఐసీటీఈ నిర్ణయించింది. -
ఇప్పుడే ఒరిజినల్స్ ఇవ్వొద్దు
- తుది దశ కౌన్సెలింగ్ తర్వాతే ఇవ్వండి.. - ఇంజనీరింగ్ ప్రవేశాలపై విద్యార్థులకు ప్రవేశాల కమిటీ సూచనలు - స్పెషల్ ఫీజు కూడా తుది దశ కౌన్సెలింగ్ తర్వాతే చెల్లించండి - బెటర్ ఆప్షన్ అనుకుంటేనే తుది దశ కౌన్సెలింగ్‌కు వెళ్లండి! సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరే విద్యార్థులు తుది దశ కౌన్సెలింగ్ పూర్తయ్యే వరకు ఒరిజినల్ సర్టిఫికెట్లను కాలేజీల్లో ఇవ్వవద్దని ప్రవేశాల కమిటీ స్పష్టం చేసింది. ముందుగానే ఒరిజినల్స్ ఇస్తే తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపింది. కాలేజీల్లో చెల్లించాల్సిన స్పెషల్ ఫీజును (రూ.5,500, ఎన్బీఏ అక్రెడిటేషన్ ఉన్న కాలేజీలకు రూ.8,550) కూడా తుది దశ కౌన్సెలింగ్ తర్వాత చెల్లించాలని సూచించింది. ఇంజనీరింగ్ ప్రవేశాల మొదటి దశ కౌన్సెలింగ్‌లో భాగంగా 56,046 మంది విద్యార్థులకు గత నెల 28న ఎంసెట్ ప్రవేశాల కమిటీ సీట్లను కేటాయించింది. సీట్లు పొందిన వారంతా ఈనెల 7వ తేదీ వరకు కాలేజీల్లో చేరే అవకాశాన్ని కల్పించింది. అయితే ప్రవేశాలకు సంబంధించి తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతున్న సందేహాలను నివృత్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. తల్లిదండ్రులు తరచూ ప్రవేశాల కమిటీని అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. అందులోని ప్రధాన అంశాలివి.. ► సీటు లభించిన విద్యార్థులు వెబ్సైట్లో (http://ts eamcet.nic.in) ముందుగా అలాట్మెంట్ ఆర్డర్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. అనంతరం వెబ్సైట్లోనే కచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. తర్వాత వచ్చే అడ్మిషన్ నంబరు తీసుకోవాలి. అలాట్మెంట్ ఆర్డర్లో పేర్కొన్న ఫీజు (వర్తించే వారు, రీయింబర్స్మెంట్ రాని వారు) ఈనెల 7వ తేదీలోగా చెల్లించాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే ఆ సీటు రద్దు అవుతుంది. సీటు వచ్చిన కాలేజీల్లో చేరాలనుకునే వారు 7వ తేదీలోగా రిపోర్టు చేయాలి. ఈలోగా రిపోర్టు చేయకపోయినా ఆ సీటు రద్దు కాదు. ఒకవేళ రిపోర్టు చేసినా సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీలే ఇవ్వాలి. దీంతో తుది దశ కౌన్సెలింగ్‌లో మరో కాలేజీలో సీటు వచ్చినా వెళ్లిపోవచ్చు. ► కాలేజీలకు వెళ్లినపుడు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వొద్దు. ఫీజు చెల్లించిన చలానా కూడా ఒరిజినల్ కాకుండా కేవలం జిరాక్స్ కాపీలను మాత్రమే సబ్మిట్ చేయాలి. తుది దశ కౌన్సెలింగ్ తర్వాత ఆ కాలేజీలో చదవాలనుకుంటే ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలి. ► ముందుగా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇచ్చేస్తే.. తుది దశ కౌన్సెలింగ్‌లో విద్యార్థి కోరుకున్న కాలేజీలో సీటు లభించినా అందులో చేరేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ముందుగానే సర్టిఫికెట్లు ఇవ్వడం వల్ల వెళ్లిపోతామంటే యాజమాన్యాలు సర్టిఫికెట్లు తిరిగి ఇచ్చే అవకాశాలు తక్కువ. కాబట్టి ఈ జాగ్రత్త తప్పనిసరి. ► మొదట సీటు లభించిన కాలేజీ కంటే మెరుగైన కాలేజీలు ఉన్నాయనుకుంటేనే, వాటిల్లో మాత్రమే చివరి దశ కౌ¯ð్సలింగ్లో ఆప్షన్లు ఇచ్చుకోవాలి. చివరి దశ కౌన్సెలింగ్‌లో ఏదో ఓ కాలేజీలో ఆప్షన్లు ఇవ్వడం ద్వారా, అందులో సీటు లభిస్తే.. మొదట లభించిన సీటు ఆటోమెటిగ్గా రద్దు అవుతుంది. కాబట్టి తుది దశ కౌన్సెలింగ్ సమయంలో అప్షన్లను జాగ్రత్తగా చూసుకుని ఇవ్వాలి. ► తుది దశ కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు ఇచ్చినా సీటు రాకుంటే తొలి దశ కౌన్సెలింగ్‌లో వచ్చిన సీటు అలాగే ఉంటుంది. ► తుది దశ కౌన్సెలింగ్‌కు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. ఆ సమయంలో ఫ్రెష్‌గా ఆప్షన్లు ఇచ్చుకోవాలి. మొదటి కౌన్సెలింగ్‌లో ఇచ్చిన ఆప్షన్లు పని చేయవు. ► విద్యార్థులు చెల్లించే ఫీజు కన్వీనర్ పేరుతోనే ఉంటుంది. తుది దశ కౌన్సెలింగ్‌లో మరో కాలేజీలో సీటు వస్తే ఆ ఫీజును ఆ కాలేజీకి ట్రాన్స్ఫర్ చేస్తారు. రెండో సారి సీటు వచ్చిన కాలేజీలో ఫీజు తక్కువ ఉంటే మిగిలిన మొత్తాన్ని విద్యార్థికి తిరిగి చెల్లిస్తారు. ► మొదటి, రెండో దశల్లో సీట్లు వచ్చి, ఫీజు చెల్లించిన వారు ఆ సీట్లు వద్దనుకుంటే రద్దు చేసుకోవచ్చు. చెల్లించిన ఫీజును తుది దశ కౌన్సెలింగ్ తర్వాత మూడు నాలుగు రోజులకు తిరిగి ఇచ్చేస్తారు. ఆ తేదీలను తర్వాత ప్రకటిస్తారు. ► తుది దశ కౌన్సెలింగ్‌లో సీటు వచ్చిన కాలేజీలో ఏ బ్రాంచ్‌లో సీటు లభిస్తుందో అందులోనే చేరాలి. మరో బ్రాంచీకి మార్చుకుంటే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. ► కన్వీనర్ కోటాలో సీటు లభిస్తేనే.. అందులో ఫీజు రీయిం బర్స్మెంట్ వర్తించే వారికి మాత్రమే ఫీజు వస్తుంది. మేనేజ్మెంట్ కోటా, స్పాట్ అడ్మిషన్లలో చేరే వారికి ఫీజు రాదు. ► విద్యార్థులు మధ్యవర్తులను సంప్రదించవద్దు. తమ వివరాలను ఇతరులకు ఇవ్వవద్దు. పాస్వర్డ్ చెప్పవద్దు. నెట్ సెంటర్లలో లాగిన్ అయ్యాక వెళ్లిపోయేప్పుడు కచ్చితంగా లాగ్ అవుట్ చేయాలి. -
జూన్‌లోనే ఇంజనీరింగ్ ప్రవేశాలు!
జనవరి 1 నుంచి 31 వరకు ఇంజనీరింగ్ కాలేజీల అనుబంధ గుర్తింపునకు దరఖాస్తులు జనవరి 25 నుంచి ఫిబ్రవరి 25 వరకు కాలేజీల్లో నిజనిర్ధారణ కమిటీ తనిఖీలు ఏప్రిల్‌లోగా కాలేజీలతో సంప్రదింపులు పూర్తి మే నెలాఖరులోగా కాలేజీలకు అనుబంధ గుర్తింపు సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరంలో (2017–18) ఇంజనీరింగ్ ప్రవేశాల్లో ఆలస్యం కాకుండా ఉన్నత విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. జూన్‌లోనే ప్రవేశాల ప్రక్రియను చేపట్టేందుకు సిద్ధమైంది. ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వాల్సిన యూని వర్సిటీలను అందుకు సమాయత్తం చేసింది. ఇందులో భాగంగా జనవరి 1 నుంచే ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు దరఖాస్తుల ప్రక్రియను ప్రారం భించాలని జేఎన్టీయూహెచ్ నిర్ణయించింది. కాలేజీల అనుబంధ గుర్తింపునకు షెడ్యూల్ ఖరారు చేయ డంతోపాటు గుర్తింపు ఇచ్చే క్రమంలో అమలు చేయాల్సిన నిబంధనలపై ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో జేఎన్టీయూహెచ్ ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించింది. ఈసారి ఇంజనీరింగ్ ప్రవేశాల్లో తీసుకురావాల్సిన సంస్కరణలపైనా చర్చించింది. పీహెచ్డీ కలిగిన ప్రొఫెసర్లు ఉంటేనే కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇస్తామని తేల్చి చెప్పినట్లు తెలిసింది. ఎంటెక్ కోర్సులకు ప్రతి బ్రాంచ్‌కు పీహెచ్డీ అర్హతగల ఇద్దరు ప్రొఫెసర్లు ఉండాలని, బీటెక్‌లో ప్రతి బ్రాంచ్‌కు పీహెచ్డీ విద్యార్హతగల ప్రొఫెసర్ కచ్చితంగా ఉండేలా చర్యలు చేపట్టాలని... లేదంటే అనుబంధ గుర్తింపు ఇవ్వబోమని స్పష్టం చేసినట్లు తెలిసింది. మంజూరైన సీట్ల మేరకు కాకుండా, కాలేజీలో ఉన్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఫ్యాకల్టీ ఉండే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కాలేజీల యాజమాన్యాలు కోరగా అందుకు జేఎన్టీయూహెచ్ అంగీకరించినట్లు సమాచారం. ముందుగానే తనిఖీలు... వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతులిచ్చే ముందే కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియను ప్రారంభించేలా జేఎన్టీయూహెచ్ షెడ్యూల్ ఖరారు చేసింది. ఏఐసీటీఈతో సంప్రదించిన అధికారులు వారి సూచనల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్ మొదట్లో లేదా నెలాఖరులో ఏఐసీటీఈ గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను ఏఐసీటీఈ జారీ చేయనుంది. ఆ జాబితా సాంకేతిక విద్యాశాఖకు అందేలోపే అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసేలా జేఎన్టీయూ హెచ్ చర్యలు చేపట్టింది. జాబితా అందిన వెంటనే మే నెలలో కాలేజీలకు అనుబంధ గుర్తింపు పత్రాలను జారీ చేసి ప్రవేశాలకు సిద్ధంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు రూపొందించిన అనుబంధ గుర్తింపు షెడ్యూల్‌ను కాలేజీ యాజమాన్యాలకు తెలిపి అందుకు సిద్ధంగా ఉండా లని సూచించినట్లు తెలిసింది. జనవరి 1 నుంచి 31 వరకు కాలేజీల నుంచి అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తులను స్వీకరిస్తామని తెలియజేసినట్లు సమాచారం. అదే నెల 25 నుంచి ఫిబ్రవరి 25 వరకు నిజనిర్ధారణ కమిటీల (ఎఫ్ఎఫ్సీ) ఆధ్వర్యంలో కాలేజీల్లో వసతులపై తనిఖీలు చేపడతామని తెలియజేసినట్లు తెలిసింది. వీలైతే తనిఖీలను ఏఐసీటీఈ బృందాలతో కలిపి చేసేందుకు ప్రయ త్నిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ఏప్రిల్ నెలా ఖరులోగా కాలేజీల యాజమాన్యాలతో ఎఫ్ఎఫ్సీ నివేది కలపై చర్చలు జరిపి లోపాలను సవరించుకునేలా అవకాశం ఇవ్వను న్నట్లు తెలిసింది. అనుబంధ గుర్తింపు పత్రాలను మే మొదటి వారం నుంచి చివరిలోగా జారీ చేసి జూన్ 1కల్లా ప్రవేశాలకు సిద్ధంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలియవచ్చింది. -
ఫ్యాకల్టీ, సదుపాయాలు ఉంటేనే అడ్మిషన్లు: హైకోర్టు
తెలంగాణలో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల విషయమై హైకోర్టులో విచారణ ముగిసింది. ఫ్యాకల్టీతో పాటు ఇతర సదుపాయాలను ఆరు వారాల్లోగా సమకూర్చుకోవాలని కాలేజీల యాజమాన్యాలకు హైకోర్టు సూచించింది. అలా సమకూర్చుకున్న తర్వాత మాత్రమే అడ్మిషన్లకు అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది. హైకోర్టు ప్రతినిధితో పాటు ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని నియమించి, సదుపాయాలు పరిశీలించాలని స్పష్టం చేసింది. ఆ పరిశీలనలో ప్రమాణాలు లేవని తేలితే అడ్మిషన్లు రద్దు చేయాలని కూడా హైకోర్టు తన ఆదేశాలలో తెలిపింది. -
పది ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్థులు శూన్యం
♦ 110 ఇంజనీరింగ్ కాలేజీల్లో 50లోపే విద్యార్థులు ♦ 15 మందిలోపు విద్యార్థులు చేరినవి 56 కాలేజీలు ♦ 25 మందిలోపు విద్యార్థులు చేరినవి 79 కాలేజీలు ♦ 100 మందిలోపు విద్యార్థులు చేరినవి 160 కాలేజీలు ♦ 91 కాలేజీల్లో పూర్తిగా సీట్లు భర్తీ ♦ కన్వీనర్ కోటాలో ఇంజనీరింగ్ ప్రవేశాల తీరిది సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పది ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. ఐదులోపు విద్యార్థులు చేరిన కాలేజీల సంఖ్య 21. పది మందిలోపే విద్యార్థులు చేరిన కళాశాలలు 42. ఇక 56 కాలేజీల్లోనైతే 15 మందిలోపే విద్యార్థులు చేరారు. ఇదీ ఇటీవల చేపట్టిన ఇంజనీరింగ్‌లో కన్వీనర్ కోటా ప్రవేశాల తీరు. 79 కాలేజీల్లో 25 మందిలోపే విద్యార్థులు చేరగా, 110 కాలేజీల్లో 50 మందిలోపే చేరారు. 160 కాలేజీల్లో 100 మందిలోపే చేరినట్లు సాంకేతిక విద్యాశాఖ లెక్కలు వేసింది. మొత్తానికి 91 కాలేజీల్లో మాత్రమే కన్వీనర్ కోటాలో వంద శాతం సీట్లు భర్తీ అయినట్లు లెక్కతేల్చారు. 110 కళాశాలల భవితవ్యం అగమ్యగోచరం రాష్ట్రంలో జేఎన్టీయూహెచ్ అనుబంధ గుర్తింపు ఇచ్చిన కాలేజీలు, అనుబంధ గుర్తింపు ఇవ్వకపోయినా కోర్టు నుంచి అనుమతి పొందిన కళాశాలలు, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ పరిధిలో మొత్తంగా 304 కాలేజీల్లో ఇంజనీరింగ్ (బీటెక్) ప్రవేశాలను ఇటీవల చేపట్టింది. ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో కన్వీనర్ కోటా ప్రవేశాలను అధికారులు పూర్తి చేశారు. ప్రస్తుతం యాజమాన్యాలు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టాయి. ఈ నేపథ్యంలో సాంకేతిక విద్యాశాఖ కన్వీనర్ కోటా లెక్కలపై దృష్టి సారించింది. ఎన్ని కాలేజీల్లో ఎంత మంది విద్యార్థులు చేరారన్న లెక్కలు వేసింది. ఇందులో ఆశ్చర్యకరమైన అంశాలు బయటపడ్డాయి. ఒక్కో కాలేజీలో 50 మందిలోపే విద్యార్థులు చేరిన కాలేజీలు 110 ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఆయా కాలేజీల భవితవ్యం గందరగోళంగా మారింది. స్పాట్ అడ్మిషన్లు, యాజమాన్య కోటాలో ఎన్ని సీట్లు భర్తీ అవుతాయో తెలియదు. -
సీట్లు రాని విద్యార్థులకు మరో అవకాశం!
* మరో దఫా ఇంజనీరింగ్ ప్రవేశాలపై కసరత్తు * ‘మిగులు సీట్ల భర్తీ’ పేరుతో కౌన్సెలింగ్ * తేలాల్సి ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ వ్యవహారం * సీఎంతో చర్చించాకే తుది నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో సీట్లు రాని విద్యార్థుల కోసం ప్రభుత్వం మరో కౌన్సెలింగ్ నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కౌన్సెలింగ్ పూర్తయ్యాక ఆగస్టు 1 నుంచి క్లాసులు ప్రారంభం కావాలి. అప్పటికేమైనా సీట్లు మిగిలితే ప్రకటన ద్వారా నోటిఫై చేసి ఆగస్టు 15లోగా వాటిని భర్తీ చేయొచ్చన్న సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే కౌన్సెలింగ్ పేరుతో కాకుండా ‘మిగులు సీట్ల భర్తీ’ పేరుతో ఈ ప్రవేశాలను చేపట్టే అవకాశం ఉంది. మంగళవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో జరిగిన సమావేశంలో దీనిపై చర్చించినట్లు తెలిసింది. దా దాపుగా కౌన్సెలింగ్ నిర్వహణకు ఓ అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. అయితే ఫీ జు రీయింబర్స్‌మెంట్‌తో ఇది ముడిపడి ఉన్నం దున సీఎంతో చర్చించాకే అధికారికంగా నిర్ణయం ప్రకటించాలని భావిస్తున్నారు. 6 వేల వరకు అర్హులు మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు రాని విద్యార్థులు 9,321 మంది ఉండగా, చివరి దశ కౌన్సెలింగ్‌లో 7,675 మందికి సీట్లు వచ్చాయి. మరో 1,646 మందికి సీట్లు రాలేదు. మరోవైపు మొదటి కౌన్సెలింగ్‌లో సీట్లు వచ్చినా కాలేజీల్లో చేరని విద్యార్థులు, మొదటి, చివరి దశ కౌన్సెలింగ్‌లో సీట్లే రాని వారు మరో 4 వేలకు పైగా ఉన్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో వారి కోసం ప్రవేశాలు చేపట్టేందుకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. దీనికి వెబ్ కౌన్సెలింగ్ అనే పేరు మాత్రం ఉండదు. కానీ ప్రవేశాల ప్రక్రియలో మొత్తం అదే విధానాన్ని అమలు చేస్తారు. తద్వారా పారదర్శకంగా ఇంజనీరింగ్ ప్రవేశాలను పూర్తి చేయడంతోపాటు ఆప్షన్లు సరిగ్గా ఇచ్చుకోలేక నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేసేలా చర్యలు చేపట్టారు. నేడు లేదా రేపు పూర్తిస్థాయి షెడ్యూలు మిగులు సీట్ల భర్తీకి పూర్తిస్థాయి షెడ్యూలును బుధ లేదా గురువారం ప్రకటించే అవకాశం ఉంది. విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకోవాల్సిన తేదీలు, సీట్ అలాట్మెంట్ తేదీ, సెల్ఫ్ రిపోర్టింగ్ గ డువు ఖరారుపై చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే కాలేజీల్లో చేరి, సర్టిఫికెట్లు అందజేసిన విద్యార్థుల పరిస్థితిపై స్పష్టత రాలేదు. ఇదివరకే సీట్లు వచ్చి, ఫీజులు చెల్లించి, సర్టిఫికెట్లను అందజేసిన విద్యార్థులకు ఇపుడు కాలేజీని లేదా బ్రాంచీని మార్చుకునే (స్లైడింగ్) అవకాశం ఇస్తారా? కేవలం సీట్లు రాని విద్యార్థులకే ఈ అవకాశాన్ని కల్పిస్తారా? అన్నది తేలాల్సి ఉంది. -
కన్వీనర్ కోటాలోనే భారీగా మిగులు
ఇంజనీరింగ్ కన్వీనర్ కోటాలో సీట్లు 86,103 వెబ్ ఆప్షన్లు ఇచ్చింది 61,662 మందే హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాల్లో భాగంగా ఈసారి కన్వీనర్ కోటాలోనే 23,546 సీట్లకుపైగా మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. మొత్తంగా కన్వీనర్ కోటాలో 86,103 సీట్లు ఉండగా.. 62,457 మంది విద్యార్థులు మాత్రమే వెబ్ఆప్షన్లకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో 61,662 మంది మొదటి దశలో ఆప్షన్లు ఇచ్చుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారంతా రెండో దశలో ఆప్షన్లు ఇచ్చుకున్నా ఈసారి కన్వీనర్ కోటాలోనే 23,546 సీట్లు మిగిలిపోనున్నాయి. అసలు ఈసారి అందుబాటులో ఉండనున్న మొత్తం సీట్లు 1,34,783కాగా.. కన్వీనర్ కోటాలో 86,103 సీట్లు, యాజమాన్య కోటాలో 39,499 సీట్లు అందుబాటులోనున్నాయి. ఇక మైనారిటీ కాలేజీల్లోని 2,110 సీట్లను వాటి యాజమాన్యాలే కన్సార్షియంగా ఏర్పడి భర్తీ చేసుకుంటాయని, సొంత పరీక్ష ద్వారా ప్రవేశాలు చేపట్టే ఎస్డబ్ల్యూ-3లో 3,304 సీట్లు అందుబాటులో ఉంటాయని ఎంసెట్ ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు. మొదటి దశ ప్రవేశాల్లో భాగంగా ఈనెల 17 నుంచి చేపట్టిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. 22 రాత్రి వరకు ఆప్షన్లలో మార్పులతో పాటు కొత్త ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 24న సీట్లను కేటాయిస్తారు. వెబ్ఆప్షన్ల వివరాలు.. ►సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్న వారు 66,362 మంది ►ఆప్షన్లకు పాస్వర్డ్ జనరేట్ చేసుకున్నవారు 62,457 ► మొదటి దశలో ఆప్షన్లు ఇచ్చినవారు 61,133 ► పాస్వర్డ్ జనరేట్ చేసుకున్నా ఆప్షన్లు ఇవ్వని వారు 1,324 ► మొత్తం విద్యార్థులు ఇచ్చిన ఆప్షన్లు 22,91,583 ►ఒక విద్యార్థి అత్యధికంగా ఇచ్చిన ఆప్షన్లు 594 -
వెబ్ ఆప్షన్లకు వన్‌టైమ్ పాస్వర్డ్
-
వెబ్ ఆప్షన్లకు వన్‌టైమ్ పాస్వర్డ్
* 8వ తేదీ నుంచి ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు! * నేటి సాయంత్రానికి కాలేజీల జాబితా ఇస్తేనే సాధ్యం * లేదంటే వెబ్ ఆప్షన్లలో ఆలస్యం తప్పదు * కోర్టు తీర్పు వచ్చాకే ఇస్తామంటున్న జేఎన్టీయూహెచ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే వెబ్ ఆప్షన్ల ప్రక్రియలో వన్‌టైమ్ పాస్వర్డ్ విధానాన్ని అమలు చేయాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. వెబ్సైట్లో విద్యార్థులు తమ వివరాలను ఇవ్వగానే వారి మొబైల్ నంబర్‌కు వన్‌టైమ్ పాస్వర్డ్ వచ్చేలా, దానితో లాగిన్ అయి ఆప్షన్లు ఇచ్చుకునేలా చర్యలు చేపట్టింది. ఈ వన్‌టైమ్ పాస్వర్డ్ 20 నిమిషాల పాటు పనిచేస్తుంది. మళ్లీ ఆప్షన్లు ఇచ్చుకోవాలంటే మళ్లీ వన్‌టైమ్ పాస్వర్డ్ పొందాల్సి ఉంటుంది. 8 నుంచి మొదలయ్యేనా? ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియను బుధవారం (ఈనెల 8వ తేదీ) నుంచి చేపట్టాలని ఇంజనీరింగ్ ప్రవేశాల కమిటీ ఇప్పటికే నిర్ణయించింది. కానీ హైదరాబాద్ జేఎన్టీయూ నుంచి అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితా ఇంకా ప్రవేశాల క్యాంపు కార్యాలయానికి అందలేదు. అనుబంధ గుర్తింపు నిరాకరణ, కోర్సుల కోతపై కొన్ని కాలేజీల యాజమాన్యాలు ఇప్పటికే కోర్టును ఆశ్రయించడంతో... కోర్టు తీర్పు వచ్చాకే కాలే జీల జాబితాలు, సీట్ల వివరాలు ఇస్తామని జేఎన్టీయూహెచ్ చెబుతోంది. వాస్తవానికి ఈనెల 4వ తేదీనే కోర్టు తీర్పు వస్తుందని... 6వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభించాలని తొలుత ప్రవేశాల కమిటీ భావించింది. అలా జరగలేదు. తర్వాత సోమవారం కోర్టు తీర్పు వస్తుందని భావించి.. 8 నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభించాలని నిర్ణయించారు. కానీ కోర్టు తీర్పు మంగళవారం (7వ తేదీ) సాయంత్రానికి వాయిదా పడింది. అయితే కోర్టు తీర్పు వచ్చిన వెంటనే జేఎన్టీయూహెచ్ కాలేజీల జాబితాను తమకు అందజేస్తే 8వ తేదీ నుంచే వెబ్ ఆప్షన్లు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టవచ్చని ప్రవేశాల క్యాంపు కార్యాలయం అధికారి శ్రీనివాస్ తెలిపారు. జాప్యం జరిగితే మాత్రం 9వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభించడం సాధ్యమవుతుందని చెప్పారు. ఇదీ వన్‌టైమ్ పాస్వర్డ్ విధానం వెబ్ ఆప్షన్ల ప్రక్రియలో నాలుగు దశలు ఉంటాయి. ఇందుకు ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ బ్రౌజర్‌ను ఉపయోగించడం మంచిది. తొలుత జ్ట్టిఞట://్టట్ఛ్చఝఛ్ఛ్టి.జీఛి.జీ వెబ్సైట్లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లింక్‌ను ఓపెన్ చేయాలి. అందులో విద్యార్థి రిజిస్ట్రేషన్ నంబరు, హాల్‌టికెట్ నంబరు, ర్యాంకు, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి పాస్వర్డ్ జనరేట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అందులో పైబాక్సులో ఒక పాస్‌వర్డ్‌ను (అది 8 నుంచి 10 లెటర్లు ఉండాలి. అది క్యాపిటల్ లెటర్, నంబరు, సింబల్, అక్షరాలతో కూడినదై ఉండాలి) ఎంటర్ చేయాలి. రెండో బాక్సులో మరోసారి దాన్నే ఎంటర్ చేయాలి. మూడో బాక్సులో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్‌ను ఇచ్చి, సేవ్ పాస్‌వర్డ్‌ను నొక్కాలి. దాంతో మొబైల్ నంబర్‌కు రహస్య లాగిన్ ఐడీ వస్తుంది. తర్వాత హోంపేజీలో క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్లి ఈ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లతో లాగిన్ కావాలి. అక్కడ వన్‌టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) బటన్‌ను నొక్కితే మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసి వెబ్ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఈ ఓటీపీ 20 నిమిషాల పాటు పనిచేస్తుంది. ఇచ్చిన వెబ్ ఆప్షన్లు ఆటోమెటిక్‌గా సేవ్ అవుతాయి. మళ్లీ ఆప్షన్లను మార్పు చేసుకోవాలన్నా, మరిన్ని ఆప్షన్లు ఇచ్చుకోవాలన్నా మళ్లీ ఓటీపీని తీసుకుని ఎంటర్ చేయాలి. అఫిలియేషన్లపై నేడు ఉత్తర్వులు ఇంజనీరింగ్ కాలేజీలకు జేఎన్టీయూహెచ్ అనుబంధ గుర్తింపును నిరాకరించడం, సీట్ల కోతను సవాలు చేస్తూ పలు కాలేజీల యాజమాన్యాలు దాఖలు చేసిన పిటిషన్లపై నిర్ణయాన్ని హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. ఈ వ్యవహారంపై మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేస్తానని న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు పేర్కొన్నారు. నిర్దేశించిన ప్రమాణాలు, నిబంధనల మేర బోధనా సిబ్బంది, సౌకర్యాలు లేవనే కారణంతో పలు కాలేజీలకు అఫిలియేషన్ ఇచ్చేందుకు జేఎన్టీయూహెచ్ నిరాకరించిన విషయం తెలిసిందే. దాంతోపాటు పలు కాలేజీల్లో సీట్లకు కోత వేసింది కూడా. దీనిని సవాలు చేస్తూ పలు కాలేజీలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వాటిపై కాలేజీల యాజమాన్యాల తరఫు న్యాయవాదులతో పాటు, జేఎన్టీయూ తరఫున అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. -
అర్హత మేరకే కాలేజీలకు పీజీ అడ్మిషన్లు
వచ్చే ఏడాది నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాలకూ ఇదే విధానం కాలేజీల పరిస్థితిపై పరిశీలనకు ఏపీ మంత్రి గంటా ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పక్కాగా చేపట్టాలని, అడ్డగోలు కాలేజీలను నియంత్రించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు దీనిపై సమావేశం నిర్వహించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి, జేఎన్టీయూ రిజిస్ట్రార్ జీవీఆర్ ప్రసాదరాజు ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు. వర్సిటీ ప్రతినిధులతో ఏర్పాటుచేసిన ఫ్యాక్టుఫైండింగ్ కమిటీలు (ఎఫ్ఎఫ్సీ) ఆయా కాలేజీల్లోని ఏర్పాట్లను పరిశీలించి ఇదివరకు ఇచ్చిన నివేదికలను పరిశీలించేందుకు కమిటీని నియమించింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాలరెడ్డి, సాంకేతిక విద్యాశాఖ మాజీ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంలను ఈ కమిటీలో సభ్యులుగా నియమించారు. ఈ కమిటీ కాలేజీల స్థితిగతులపై ఎఫ్ఎఫ్సీలు అందించిన నివేదికలను కొంతమేర పరిశీలించాయి. ఆయా కాలేజీల్లో సదుపాయాలను పరిశీలించి అర్హత మేరకు కాలేజీలకు సీట్లను కేటాయించాలి. సదుపాయాలు లేకుంటే వాటిని కౌన్సెలింగ్ నుంచి మినహాయించాలి. ఈ కమిటీ పరిశీలన పూర్తికాకముందే ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ ప్రారం భమవడం, శుక్రవారంతో సీట్లు కేటాయించనుండటంతో ఈ ఏడాదికి ఇంజనీరింగ్ యూజీ కోర్సులను పాతజాబితా మేరకే కొనసాగించాలని నిర్ణయించారు. పీజీ కోర్సుల ప్రవేశాలను పక్కాగా చేపట్టాలని మంత్రి గంటా అధికారులను ఆదేశించారు. ఎఫ్ఎఫ్సీ నివేదికలకు, అంతకు ముందు ఏపీ ఫీజులు, ప్రవేశాల నియంత్రణ మండలి (ఏఎఫ్ఆర్సీ) ఇచ్చిన నివేదికలకు చాలా తేడాలున్నాయని కమిటీ సభ్యులు మంత్రికి వివరించారు. దీంతో కాలేజీలన్నిటిపైనా క్షుణ్ణంగా క్షేత్రస్థాయి తనిఖీలు చేయించాలని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ను మంత్రి ఆదేశించారు. ముందుగా పీజీ కాలేజీల్లో ఈ పరిశీలనను చేపట్టించాలని, దాన్ని బట్టి కాలేజీలకు సీట్ల సంఖ్యను నిర్దేశించి అడ్మిషన్లు ఇవ్వాలని సూచించారు. ఫీజు రీయింబర్స్‌మెంటు నిధుల కోసమే ఎక్కువ కాలేజీలు సీట్ల సంఖ్యను పెంచుకొంటున్నాయని రిపోర్టులు వచ్చిన నేపథ్యంలో కాలేజీలన్నిటినీ తనిఖీ చేశాకే అడ్మిషన్లను చేపట్టాలని మంత్రి ఆదేశించారు. అసిస్టెంటు ప్రొఫెసర్లకు ఎంటెక్, అసోసియేట్ ప్రొఫెసర్లకు, ప్రొఫెసర్లకు పీహెచ్డీ తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. అధ్యాపకుల ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు పరిశీలన చేపట్టాలని నిర్దేశించారు. -
ఇంజనీరింగ్ ప్రవేశాలకు నోటిఫికేషన్
ఈనెల 18 నుంచి 23 వరకు సర్టిఫికెట్ల పరిశీలన * కాలేజీలు, సీట్ల వివరాలు తేలాకే వెబ్ ఆప్షన్ల ప్రక్రియ సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం ఎంసెట్ (ఎంపీసీ స్ట్రీమ్) ప్రవేశాల కమిటీ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులకు లోబడి ఈ నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను నిర్వహించనున్నట్లు కమిటీ పేర్కొంది. ప్రతి రోజు రెండు దశలుగా వెరిఫికేషన్‌ను చేపట్టనుంది. ఉదయం 9కి మొదటి పరిశీలన ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 12:30కి రెండో దశ పరిశీలన చేపడతారు. ఎంసెట్‌లో విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టే హెల్ప్‌లైన్ కేంద్రాలు, ఇతర వివరాలను వెబ్సైట్లో (జ్ట్టిఞట://్టట్ఛ్చఝఛ్ఛ్టి.జీఛి.జీ) పొందవచ్చని పేర్కొంది. కాలేజీలకు గుర్తింపు ప్రక్రియపై శుక్రవారం హైకోర్టు జారీచేసిన ఉత్తర్వుల అనంతరం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, ఎంసెట్ ప్రవేశాల కమిటీ అధికారులు సమావేశమై చర్చించారు. తర్వాత నోటిఫికేషన్‌ను జారీ చేశారు. కాలేజీల యాజమాన్యాలకు ఈనెల 27 వరకు గడువు ఇచ్చినందున, కాలేజీలు, సీట్ల వివరాలు ఆ తరువాతే తేలనున్నాయి. అవి వచ్చాకే వెబ్ ఆప్షన్ల ప్రక్రియను చేపట్టనున్నారు. విద్యార్థులకు సూచనలు.. వెరిఫికేషన్‌కు హాజరయ్యే విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు రెండు సెట్ల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు వెంట తెచ్చుకోవాలి. అలాగే ఎంసెట్ ర్యాంకు కార్డు, హాల్‌టికెట్, ఇంటర్మీడియెట్ మార్కుల మెమో, పాస్ సర్టిఫికెట్, పదో తరగతి మార్కుల మెమో, ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, జనవరి 1వ తేదీ తరువాత జారీచేసిన ఆదాయం ధ్రువీకరణ పత్రం తదితర సర్టిఫికెట్లను వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు కింద ఓసీ, బీసీ విద్యార్థులు రూ. 800, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. కాలేజీలు, సీట్లు, కాలేజీ వారీగా ఫీజుల వివరాలను వెబ్ ఆప్షన్ల ప్రారంభానికి ముందు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. వికలాంగులు, ఎన్సీసీ కోటా, ఆంగ్లోఇండియన్, స్పోర్ట్ కోటా విద్యార్థులకు ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు హైదరాబాద్ మాసాబ్‌ట్యాంకులోని సాంకేతిక విద్యా భవన్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపడతారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ విద్యార్థులకు 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ర్యాంకుల వారీగా నిర్ణీత హెల్ప్‌లైన్ కేంద్రంలో వెరిఫికేషన్ ఉంటుంది. -
జూన్ 9 నుంచి గీతం ఇంజనీరింగ్ అడ్మిషన్ కౌన్సెలింగ్
సాగర్‌నగర్ (విశాఖపట్నం) : గీతం వర్సిటీ విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు క్యాంపస్‌లలో ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులలో ప్రవేశానికి జూన్9 వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు అడ్మిషన్ల డెరైక్టర్ కె. నరేంద్ర తెలిపారు. ఆన్లైన్ విధానంలో జరిగే ఈ అడ్మిషన్ కౌన్సెలింగ్ కోసం విశాఖ, హైదరాబాద్ సిటీ, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ రూద్రారం గీతం ప్రాంగణం, బెంగళూరు సిటీ , కర్ణాటకలోని దొడ్డబళ్ళాపూర్ ప్రాంగణంలో కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. జూన్9వ తేదీన 1నుంచి 5000 ర్యాంకు వరకు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. అలాగే 10వ తేదీన 5001 నుంచి 9500 ర్యాంకు వరకు, 11వ తేదీన 9501 నుంచి 14000 వరకు, 12వ తేదీన 14001 నుంచి 18500 వరకు, 13వ తేదీన 18501 నుంచి 23000 ర్యాంకు వరకు, 14వ తేదీన 23001 నుంచి 28000 ర్యాంకు వరకు అడ్మిషన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ప్రకటించారు. 14వ తేదీన మధ్యాహ్నం ఎం.ఫార్మసీ, ఎంటెక్ కోర్సులకు అడ్మిషన్ కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. విద్యార్థులు గీతం విశ్వవిద్యాలయం వెబ్సైట్ www.gitam.edu నుంచి కౌన్సెలింగ్ కాల్ లెటర్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన సూచించారు. -
ఇంజినీరింగ్ అడ్మిషన్ల కొనుగోలు దందా
కోదాడటౌన్ :ఇంజినీరింగ్ అడ్మిషన్ల కొనుగోలు దందాలో కీలకంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు పోలీసులకు చిక్కారు. కోదాడ కేంద్రంగా రెండేళ్లుగా జరుగుతున్న ఈ వ్యాపారం నిర్వహిస్తున్న వీరిద్దరు శని వారం హైదరాబాద్‌లో పట్టుబడ్డారు. నిందితులది అస్సాం రాష్ర్టం కాగా వారిద్దరూ కోదాడలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఎంటెక్ చేస్తున్నారు. వారి వద్ద భారీ ఎత్తున నకిలీ సర్టిఫికెట్లు లభ్యమాయ్య యి. వీరిని నమ్ముకుని అడ్మిషన్ల కోసం కొన్ని ఇంజి నీరింగ్ కళాశాలల నిర్వాహకులు లక్షల రూపాయలు ముట్టజెప్పగా వారికి ముందస్తుగా కొన్ని విద్యార్హత సర్టిఫికెట్లు ఇచ్చినట్లు సమాచారం. కాగా వీటిలో ఎక్కువగా నకిలీ సర్టిఫికెట్లు ఉన్నాయని తేలడంతో డబ్బులు ముట్టజెప్పిన కళాశాలల నిర్వాహకులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే కౌన్సెలింగ్ అనుమతి రాక నానా ఇబ్బందులు పడుతున్న కళాశాలల యాజమాన్యాలు ఇతర రాష్ట్రాల విద్యార్థులపైనే ఆశలు పెట్టుకున్నాయి. ఇంతలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం వెలుగు చూడడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అంతేకాకుండా పోలీస్ ఉన్నతాధికారులు కోదాడపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రత్యేక బృందాలను దర్యాప్తు కోసం కోదాడకు పంపారు. అసలేం జరిగిందంటే.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఒక్క కోదాడలోనే ఉత్తర భారతదేశానికి చెందిన విద్యార్థులు సుమారు 2 వేల మంది ఇం జినీరింగ్, పాలిటెక్నిక్, బీఫార్మసీ కోర్సుల్లో చేరారు. కొన్ని కన్సల్టెన్సీలు ఉత్తరాది నుంచి విద్యార్థులను తీసుకువచ్చి ఇక్కడి కళాశాలల్లో చేర్పించాయి. అం దుకు గాను ఒక్కో విద్యార్థి నుంచి రూ.30 నుంచి రూ.50 వేల వరకు కమిషన్ తీసుకున్నట్లు తెలిసిం ది. మొదట కోదాడకు చెందిన ఓ మైనార్టీ కళాశాల కొంతమంది బీహార్ విద్యార్థులను చేర్చుకుంది. వా రిని అనుసరించి ఇప్పుడు కోదాడలోని మరో నా లుగు కళాశాలలు పాలిటెక్నిక్,ఇంజినీరింగ్‌లో 2000 విద్యార్థులకు గడిచిన రెండేళ్ల నుంచి అడ్మిషన్లు ఇ చ్చాయి. విద్యార్థుల ఉండటానికి రెండు కళాశాలలు ప్రత్యేక హాస్టళ్లు, తరగతులను నిర్వహిస్తున్నాయి. భారీగా ఉపకార వేతనాలు బీహార్, చత్తీగఢ్, అస్సాం రాష్ట్రాల్లో వెనుకబడిన తరగతుల వారికి కల్యాణయోజన పథకం కింద కేం ద్రం భారీగా ఉపకార వేతనాలు ఇస్తుంది. ఉన్నత చదువులు చదవాలనే కోరిక ఉన్నవారి ఆత్రుతను ఇద్దరు ఎంటెక్ విద్యార్థులు అదునుగా భావించారు. నకిలీ సర్టిఫికెట్లను సృష్టించి విద్యార్థులను కళాశాల లకు అంటగట్టి వారి నుంచి కమిషన్ రూపంలో లక్ష ల రూపాయలు కాజేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఇంజినీరింగ్ అ డ్మిషన్ల కొనుగోలు దందా ఇప్పుడు తెలంగాణ రాష్ర్ట మంతటా విస్తరించింది. గతంలోనూ చాలా మంది నకిలీ సర్టిఫికెట్ల ద్వారా ఇక్కడి కోర్సుల్లో చేరి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీ సుల దర్యాప్తులో మరిన్ని వాస్తవాలు వెలుగుచూసే అవకా శాలున్నాయి. -
రెండో విడత కౌన్సెలింగ్‌కోసం మరోసారి సుప్రీంకు
నేడు పిటిషన్ దాఖలు చేయనున్న ఏపీ ఉన్నత విద్యామండలి హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి రెండో విడత కౌన్సెలింగ్‌కు అవకాశం కల్పించాలని మరోసారి సుప్రీంకోర్టును అర్థించాలని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈమేరకు గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. దాదాపు 70వేల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్నారని, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రెండో విడత కౌన్సెలింగ్‌కు అనుమతించాలని కోరనున్నారు. ఇందుకు సంబంధించి సమగ్ర వాదనలు వినిపించేందుకు ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇరు రాష్ట్రాల్లోనూ విద్యార్థులు నష్టపోతున్నందున రెండో విడత కౌన్సెలింగ్‌కోసం సహకారం అందించాలని రాష్ట్ర మానవవనరుల విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవా రం తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డితో గంటా ఫోన్లో మాట్లాడారు. నేటినుంచి ఏపీలో కేంద్రకమిటీ పర్యటన విభజన చట్టంలో పేర్కొన్న జాతీయ విద్యాసంస్థలను ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను పరిశీలించేందుకు కేంద్రకమిటీ గురువారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనుంది. తిరుపతి, విజయవాడ, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, కర్నూలు, అనంతపు రం జిల్లాల్లో ఈ కమిటీ పర్యటించనుంది. -
సాంకేతికమక
ఒంగోలు వన్‌టౌన్: ఇంజినీరింగ్ ప్రవేశాలపై గురువారం సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఇంజినీరింగ్ అభ్యర్థులకు పిడుగుపాటైంది. ప్రవేశాలలో రెండో విడత వెబ్ కౌన్సెలింగ్‌కు సుప్రీంకోర్టు నిరాకరించడంతో వేలాది మంది విద్యార్థులకు ప్రవేశాలు లభించే అవకాశం కనిపించడం లేదు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో అతి తక్కువ మంది విద్యార్థులు చేరినా రెండో విడత కౌన్సెలింగ్‌లో విద్యార్థులు చేరతారన్న ఆశతో ఎదురుచూస్తున్న ఇంజినీరింగ్ కళాశాలలకు తీవ్ర నిరాశ ఎదురైంది. రాష్ట్ర చరిత్రలోనే ఇటువంటి క్లిష్ట పరిస్థితి ఏర్పడడం ఇదే ప్రథమం. జిల్లాలో కూడా సుమారు నాలుగు వేల మంది ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత సాధించినప్పటికీ ప్రవేశాలు దొరకని పరిస్థితి ఏర్పడింది. రెండో విడత వెబ్ కౌన్సెలింగ్‌పై ఆశతో ఉన్న విద్యార్థులు, ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు రెండో విడత కౌన్సెలింగ్‌కు సుప్రీంకోర్టు తిరస్కరించడంతో తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ప్రకటనల వల్లే ఈ పరిస్థితి దాపురించిందని నిప్పులు చెరుగుతున్నారు. ప్రవేశాల విషయంలో తాపీగా నిర్ణయాలు తీసుకుని పొంతన లేని ప్రకటనలతో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇంజినీరింగ్ అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడిందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంపెడాశతో ఉన్న అభ్యర్థులు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆందోళనకు గురవుతున్నారు. మిగిలిన సీట్ల భర్తీ హుళక్కేనా... సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వులతో జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో మిగిలిపోయిన సీట్లు భర్తీకావడం అనుమానమే. జిల్లాలోని 17 ఇంజినీరింగ్ కళాశాలల్లో అన్ని కోర్సుల్లో కలిపి మొత్తం కన్వీనర్ కోటాలో 6,845 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మొదటి విడత వెబ్ కౌన్సిలింగ్లో 3,925 మంది విద్యార్థులకు మాత్రమే ప్రవేశాలు లభించాయి. కళాశాలల్లో ఇప్పటికి ఇంకా 2,920 సీట్లు ఖాళీగానే మిగిలిపోయాయి. అంటే జిల్లాలో కన్వీనర్ కోటాలోని మొత్తం 57.34 శాతం సీట్లు మాత్రమే భర్తీ కాగా 42.66 శాతం సీట్లు మిగిలిపోయాయి. జిల్లాలో ఒక్క కళాశాలలో మాత్రమే 100 శాతం సీట్లు భర్తీ కాగా, మూడు కళాశాలల్లో 90 శాతం పైగా ప్రవేశాలు జరిగాయి. ఒక కళాశాలలో 336 సీట్లుకు గాను కేవలం ముగ్గురు విద్యార్థులు మాత్రమే చేరారు. జిల్లాలోని కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లు గత అనుభవాల ప్రకారం రెండో విడత కౌన్సెలింగ్‌లోనే భారీగా భర్తీ అవుతున్నాయి. ఈ సారి రెండో విడత కౌన్సెలింగ్ లేకపోవడంతో ఆ సీట్లన్నీ మిగిలిపోయే ప్రమాదం పొంచిఉంది. జిల్లాలో 8 ఇంజినీరింగ్ కళాశాలల్లో 50 శాతం సీట్లలోపు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే కనీసం 80 శాతంసీట్లు భర్తీ కాకపోతే కళాశాల నిర్వహించడం యాజమాన్యాలకు ఆర్థిక భారమవుతుంది. విద్యార్థుల్లో భయం భయం... ఇంజినీరింగ్ ప్రవేశాలలో రెండో విడత వెబ్ కౌన్సెలింగ్‌కు సుప్రీంకోర్టు నిరాకరించడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వెబ్ కౌన్సెలింగ్ రాక పూర్వం విద్యార్థులు నేరుగా హెల్ప్‌లైన్ సెంటర్లలో కౌన్సెలింగ్‌కు హాజరై తమకు నచ్చిన కళాశాల, కోర్సులో ప్రవేశం పొందేవారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న వెబ్ ఆప్షన్ల వల్ల విద్యార్థులు తాము కోరుకున్న కళాశాలలో సీటు రాకపోయినా నచ్చిన బ్రాంచ్‌లో ప్రవేశం దక్కకపోయినా మళ్లీ నిర్వహించే రెండో విడత వెబ్ కౌన్సెలింగ్‌లో తాము కళాశాల మారేందుకు, తమ బ్రాంచ్‌ను మార్చుకునేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా కొంతమంది కేవలం రెండవ విడత వెబ్ కౌన్సెలింగ్‌ను నమ్ముకుని మొదటి విడత కౌన్సెలింగ్‌లో వచ్చిన కళాశాలల్లో ప్రవేశించలేదు. ప్రభుత్వమే రెండవ విడత వెబ్ కౌన్సెలింగ్ ఉంటుందని, మొదటి విడతలో సీటు లభించనివారు రెండవ విడత వెబ్ కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొందవచ్చని నమ్మబలికారు. మొదటి కౌన్సెలింగ్‌లో ప్రవేశం వచ్చిన కళాశాల నచ్చకపోతే కళాశాలలో చేరవద్దని, రెండవ విడత కౌన్సెలింగ్‌లో నచ్చిన కళాశాలలో చేరవచ్చని పేర్కొన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా మొదటి కౌన్సిలింగ్లో సీట్లు లభించిన కళాశాలలో ఇవ్వవద్దని, వాటిని తమవద్దనే ఉంచుకుని రెండో విడత కౌన్సెలింగ్‌లో అవసరమనుకుంటే బ్రాంచ్‌ను, కళాశాలను మార్చుకోవచ్చని ఊదరగొట్టారు. తీరా ఆచరణలోకి వచ్చేసరికి ఇవేమీ విద్యార్థులకు అక్కరకు రాకుండా పోయాయి. తాము కోరుకున్న కళాశాలలో ఇంజినీరింగ్ సీటు లభిస్తుందన్న ఆశతో కేవలం ఒక్క కళాశాలకే వెబ్ ఆప్షన్ ఇచ్చిన విద్యార్థులు ఆ కళాశాలలో సీటు లభించకపోవడంతో ప్రస్తుతం రెండో విడత కౌన్సెలింగ్‌కు అవకాశంలేదని తేలిపోవడంతో లబోదిబోమంటున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటే అసలు సమస్య ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వాలు చొరవచూపి సత్వర చర్యలు చేపట్టనందువల్లే ఇంజినీరింగ్ ప్రవేశంలో అసాధారణ జాప్యం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఎంసెట్ ఉమ్మడి ప్రవేశాల వల్ల సమస్యలు తలెత్తాయి. ఎంసెట్ ర్యాంకులు ప్రకటించిన మూడు నెలలకు కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మేనేజ్మెంట్ కోటా (బి కేటగిరీ) సీట్లులో ప్రవేశించే విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించదు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆగస్టు 31 నాటికి ఇంజినీరింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా అన్నింటిలో ప్రవేశాలు పూర్తి కావాలి. అయితే ఇక్కడి ఉన్నత విద్యా మండలి బి కేటగిరీలో ప్రవేశాలకు సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో మేనేజ్మెంట్ కోటాలో ప్రవేశాలపై నమ్మకంతో కన్వీనర్ కోటాలో ప్రవేశానికి ర్యాంకు వచ్చినా వెబ్ కౌన్సెలింగ్‌కు హాజరుకాని విద్యార్థులు కూడా తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకుని స్పాట్ అడ్మిషన్లకు అనుమతిస్తే తప్ప విద్యార్థులు ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరే అవకాశం లేదు. ఎంసెట్‌లో ర్యాంకు సాధించి ప్రస్తుతం అడ్మిషన్లు లభించని విద్యార్థులను హెల్ప్‌లైన్ సెంటర్ల ద్వారా కానీ, లేదా నేరుగా ఇంజినీరింగ్ కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్లుకు అనుమతించి వారికి ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తే తప్ప బలహీన వర్గాల విద్యార్థులు ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశించడం కష్టమే. ఈ విషయంలో ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుందో వేచి చూడాలి. -
సుప్రీం అనుమతిస్తేనే రెండో విడత కౌన్సెలింగ్
-
సుప్రీం అనుమతిస్తేనే రెండో విడత కౌన్సెలింగ్
* ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌పై నేడు ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ఇంజనీరింగ్ రెండో దశ కౌన్సెలింగ్‌పై సుప్రీంకోర్టు బుధవారం స్పష్టతనివ్వనుంది. మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ వ్యవహారాన్ని కూడా కోర్టు తేల్చనుంది. ఈ నేపథ్యంలో ఇందుకు విధించిన గడువును ఏపీ ఉన్నత విద్యా మండలి మరో వారం పొడిగించింది. మంగళవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీని ఈ నెల 15లోగా పూర్తి చేయాలని మొదట్లో భావించినప్పటికీ.. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఈ గడువును 23కు పొడిగించింది. నిజానికి మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తి కాగానే.. రెండో విడతకు ఏపీ మండలి సిద్ధమైంది. అయితే ఆగస్టు 31 తర్వాత కౌన్సెలింగ్ చేపడితే సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించినట్లవుతుందని, మళ్లీ కౌన్సెలింగ్ చేపట్టాలంటే కోర్టు అనుమతి తప్పనిసరన్న టీ సర్కార్ వాదనతో ఏపీ మండలి గందరగోళంలో పడింది. చివరకు మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీలోనూ ఇదే చిక్కు వచ్చిపడింది. దీంతో చేసేదేమీ లేక మూడు రోజుల కిందటే ఏపీ మండలి మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రెండో దశ కౌన్సెలింగ్‌కు అనుమతినివ్వాలంటూ అఫిడివిట్ దాఖలు చేసింది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పాలనాపర ఇబ్బందులున్నాయని, తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం(ఫాస్ట్) పథకానికి మార్గదర్శకాలు రూపొందించాల్సి ఉందని, ఇందుకు అక్టోబరు 31 వరకు గడువు ఇవ్వాలని తెలంగాణ సర్కారు సుప్రీంకోర్టును గతంలో కోరిన సంగతి తెలిసిందే. అయితే ఉమ్మడి ప్రవేశాలు అయినందున ఏపీ సర్కారు అభిప్రాయం మేరకు ఆగస్టు 31లోగా ప్రవేశాలను పూర్తి చేయాలని కోర్టు గతంలో ఆదేశించింది. కానీ, ఈ గడువులోగా తొలి విడత కౌన్సెలింగే పూర్తయింది. రెండో దశతోపాటు మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి ఇంకా చర్యలు చేపట్టాలి. ఈ నేపథ్యంలో తాము మరింత గడువు అడిగితే.. ఆగస్టు 31లోగా మొత్తం కౌన్సెలింగ్ పూర్తి చేస్తామన్న ఏపీ కౌన్సిల్ ఇప్పుడు కోర్టు అనుమతి లేకుండా రెండో విడతను ఎలా చేపడతుందని టీ సర్కారు ప్రశ్నించింది. దీనిపై అడ్వొకేట్ జనరల్ అభిప్రాయం కూడా తీసుకుంది. కోర్టు తీర్పు ప్రకారం గడువు ముగిసినందున మళ్లీ ఏం చేయాలన్నా కోర్టు అనుమతి అవసరమని ఏజీ పేర్కొనడంతో ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ టీ సాంకేతిక విద్యా కమిషనర్ ఇటీవలే ఏపీ మండలికి లేఖ రాశారు. దీంతో ఈ విషయంలో మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. బుధవారం వచ్చే తీర్పు మేరకు అధికారులు తదుపరి చర్యలు చేపట్టనున్నారు. మేనేజ్మెంట్ కోటాకు 30 వేల దరఖాస్తులు ఇంజనీరింగ్(బీటెక్) మేనేజ్మెంట్ కోటాలో సీట్ల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. మంగళవారం వరకు 30 వేలు దాటినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే మంగళవారం మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ షెడ్యూలును ఏపీ ఉన్నత విద్యా మండలి మార్చింది. దీంతో దరఖాస్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. పాత షెడ్యూలు ప్రకారం ఈ నెల 3వ తేదీతో ఆ ప్రక్రియ ముగిసింది. అయితే సీట్ల భర్తీకి తాజాగా సుప్రీంకోర్టు అనుమతి కోరిన నేపథ్యంలో షెడ్యూలును ఏపీ మండలి మార్చింది. ఈ నెల 12 వరకు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఈ ప్రకారం 14 నాటికి కాలేజీలకు మెరిట్ జాబితాలను అందజేయనుంది. విద్యార్థులకు 21లోగా ఇంటర్వ్యూలు నిర్వహించాలని, సీట్లు కేటాయించిన వారి వివరాలను 23లోగా పంపిం చాలని ఏపీ మండలి వర్గాలు పేర్కొన్నాయి. -
ఆప్షన్లు ఇచ్చిన 31వేల మంది
హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం ఆది, సోమవారాల్లో 31,600 మంది విద్యార్థులు తమ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. 1వ ర్యాంకు నుంచి 50 వేల ర్యాంకు వరకు 32,272 మందికి వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించగా సోమవారం సాయంత్రం 6 గంటల వరకు 31,600 మంది నమోదు చేసుకున్నారు. ఇక సోమవారం 75,001వ ర్యాంకు లక్ష ర్యాంకు వరకు 9,935 మంది విద్యార్థులను సోమవారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలువగా 6,627 మంది హాజరయ్యారు. మొత్తం ఒకటి నుంచి లక్షర్యాంకు వరకు 41,595 మందిని సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలువగా 29,351 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్నారు. 24న పాలిసెట్ సీట్లు కేటాయింపు,ఆప్షన్ల మార్పునకు అవకాశం పాలిసెట్ రాసి గతంలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకుని ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులు మళ్లీ తమ ఆప్షన్లను మార్చుకోవచ్చు. గతంలో వెరిఫికేషన్‌కు హాజరై ఆప్షన్లు ఇవ్వని వారు ఇపుడు ఆప్షన్లను ఇవ్వవచ్చు. ఒకటి నుంచి 76 వేల ర్యాంకు వరకు విద్యార్థులు ఈనెల 22న, 76,001వ ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు విద్యార్థులు ఈనెల 23 సాయంత్రం 5 గంటల వరకు ఆప్షన్ల నమోదు, మార్పులు చేసుకోవచ్చు. ఇక ఈనెల 24న రాత్రి 8 గంటల తరువాత సీట్లు కేటాయిస్తారు. ఆ వివరాలు జ్ట్టిఞట://ఞౌడఛ్ఛ్టి.జీఛి.జీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. ఇప్పటివరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకాని వారిని తరువాతి దశ కౌన్సెలింగ్‌కు అనుమతిస్తారు. ఈసెట్ ఆప్షన్ల నమోదు, మార్పునకు అవకాశం, 22న సీట్ల కేటాయింపు ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాల కోసం ఈసెట్ రాసి గతంలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకొని ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులు ఇపుడు మళ్లీ ఆప్షన్లు మార్చుకోవచ్చు. గతంలో ఆప్షన్లు ఇవ్వని వారు కూడా ఇపుడు ఆప్షన్లు ఇవ్వవచ్చు. ఒకటి నుంచి చివరి ర్యాంకు వరకున్న విద్యార్థులు ఈనెల 20, 21 తేదీల్లో ఆప్షన్ల నమోదు, మార్పునకు అవకాశం కల్పించినట్టు ప్రవేశాల క్యాంపు ముఖ్యాధికారి రఘునాథ్ తెలిపారు. 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ మార్పులను స్వీకరిస్తామని పేర్కొన్నారు. -
ఏపీ ఉన్నత విద్యామండలే కౌన్సెలింగ్ చేయాలి: సుప్రీం
-
ఏపీ ఉన్నత విద్యామండలే కౌన్సెలింగ్ చేయాలి: సుప్రీం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ అడ్మిషన్లు విభజన చట్టానికి లోబడే ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆగస్టు 31 లోగా కౌన్సెలింగ్ పూర్తికావాలని, సెప్టెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభం కావాలని తెలిపింది. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో మాత్రం తాము జోక్యం చేసుకోబోమని చెప్పింది. అక్టోబరు 31 వరకూ కౌన్సెలింగ్ పొడిగించాలన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అలాగే స్థానికత అంశాన్ని కూడా పక్కనపెట్టింది. ఇక ఏపీ ఉన్నతవిద్యామండలి మాత్రమే కౌన్సెలింగ్ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది: ఏపీ తరఫు న్యాయవాది శ్రీనివాస్ తెలిపారు. 371-డి కింద ఇచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే అడ్మిషన్లు నిర్వహించాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. పునర్విభజన చట్టం సెక్షన్ 95 ప్రకారమే అడ్మిషన్లు నిర్వహించాలందని, అక్టోబర్ 31 వరకు పొడిగించాలని కోరితే కేసు డిస్మిస్ చేస్తానని సుప్రీం హెచ్చరించిందని శ్రీనివాస్ తెలిపారు. 371-డి కింద ఇచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే స్థానికత నిర్ధారణ అవుతుందని ఆయన అన్నారు. -
గవర్నర్ గారూ.. న్యాయం చేయండి
-
నెలాఖరులోగా ఇంజనీరింగ్ అడ్మిషన్లు పూర్తి
-
నెలాఖరులోగా ఇంజనీరింగ్ అడ్మిషన్లు పూర్తి
ఆగస్టు నెలాఖరులోగా రెండు రాష్ట్రాల్లోను ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామని ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను ఈనెల 23వ తేదీ వరకు చేస్తామని ఆయన అన్నారు. బుధవారం నాడు ఎంసెట్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మరోసారి ఎంసెట్ కమిటీ సమావేశం నిర్వహించి, పూర్తి విధివిధానాలు నిర్ణయిస్తామని అన్నారు. ఈ నెలాఖరుకల్లా రెండు రాష్ట్రాల్లో అడ్మిషన్ల ప్రక్రియ మొత్తం పూర్తిచేసి, సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభిస్తామని ఆయన అన్నారు. ముందుగా విడుదల చేసిన షెడ్యూలు ప్రకారమే కౌన్సెలింగ్ ప్రక్రియ ఉంటుందన్నారు. -
గవర్నర్ గారూ.. న్యాయం చేయండి
ఇంజనీరింగ్ అడ్మిషన్లు, ఫీజు రీయింబర్స్మెంట్ తదితర అంశాలపై జోక్యం చేసుకోవాలని ఇరు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కాంగ్రెస్ నాయకులు కోరారు. కౌన్సెలింగ్ నుంచి మొదలుపెట్టి ఫీజులు ఇవ్వడం వరకు ప్రతి విషయంలోను రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు, విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్నాయని, ఇలాంటి తరుణంలో గవర్నర్ జోక్యం చేసుకుని విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి ప్రమాదం రాకుండా చూడాలని కోరారు. ఆలస్యం అయ్యేకొద్దీ వారు విద్యాసంవత్సరాన్ని నష్టపోవాల్సి వస్తుందని, అలాగే ఇప్పటికే రెండో సంవత్సరం, మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల ఫీజుల విషయం కూడా ప్రశ్నార్థకంగానే ఉందని చెప్పారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, బొత్స సత్యానారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, సి.రామచంద్రయ్య తదితరులున్నారు. -
ఇంజనీరింగ్‌లో బ్యాక్‌లాగ్‌ల భారం వదిలించుకోండి
పదో తరగతి, ఇంటర్మీడియట్లో 95 శాతం మార్కులతో పాసైన శ్రావణ్ ఇంజనీరింగ్ ఫస్టియర్‌లో రెండు సబ్జెక్టులు తప్పాడు. అప్పటివరకూ టాప్ మార్కులు సాధిస్తూ స్కూల్లో, కాలేజీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అతను.. ఫస్టియర్‌లోనే రెండు సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో ఒక్కసారిగా నిసృ్పహకు లోనయ్యాడు. అసలు తప్పు ఎక్కడ జరిగింది? ఇంతకుముందు వరకూ మంచి ర్యాంకులు తెచ్చుకున్నవారు ఇంజనీరింగ్‌లో ఎందుకు వెనుకంజ వేస్తున్నారు? ప్లేస్‌మెంట్స్‌కు వస్తున్న కంపెనీలు బ్యాక్‌లాగ్స్ ఉన్న విద్యార్థులను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడంలేదు? బ్యాక్‌లాగ్స్‌తో నష్టమేంటి? ఇంజనీరింగ్‌లో బ్యాక్‌లాగ్స్ లేకుండా చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం.. శ్రావణ్ ఫెయిల్ కావడానికి కారణాలను పరిశీలిస్తే.. - అతనికి కొన్ని సబ్జెక్టులు అర్థం కాలేదు. ఆయా సబ్జెక్టులను బోధించిన ప్రొఫెసర్లు తరగతి గదిలో ఈక్వేషన్లతో బోర్డు నింపేయడమే తప్ప వాటి గురించి ఎక్కువగా వివరించలేదు. - థియరీ, ఇంజనీరింగ్ సూత్రాలు.. పుస్తకాల్లో ఉన్నవి ఉన్నట్లుగా కాపీ చేస్తూ పోయారు. వాటికి ఆధారమైన బేసిక్ ప్రిన్సిపుల్స్‌ను మాత్రం వివరంగా చెప్పే ప్రయత్నం చేయలేదు. - బోర్డు మీద ప్రొఫెసర్ రాసినవే పాఠ్యపుస్తకాల్లో కూడా కనిపించడం, వాటిలో కూడా ఎక్కువ వివరణలు లేకపోవడం నిరుత్సాహపరచాయి. - పాఠ్యపుస్తకాల్లోని ఉదాహరణలకు, ప్రొఫెసర్ క్లాస్‌లో సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్‌కి, పరీక్షలో అడిగిన ప్రశ్నలకు సంబంధమే లేదు. - ఎక్స్పరిమెంట్ కోసం ల్యాబ్‌కి వెళ్లినా.. అసిస్టెంట్ ఇచ్చిన వాల్యూస్ రాసుకొని రావడమో లేదంటే బ్యాచ్‌లో ఒకరిద్దరు ఆ ప్రయోగం చేస్తే చూసి తెలుసుకోవాల్సి వచ్చింది. - క్లాసులో ఒకసారి ప్రొఫెసర్‌ను ఒక డౌట్ అడిగితే సంతృప్తికర సమాధానం రాలేదు. - క్లాస్‌లో లెక్చరర్ చెప్పేది ఎలాగూ అర్థం కావట్లేదు కాబట్టి ఫ్రెండ్స్‌తో కబుర్లు, కామెంట్లతో కాలక్షేపం జరిగేది. నిపుణులు ఏమంటున్నారు - ఇంజనీరింగ్ ఫస్టియర్‌లో విద్యార్థుల్లో కొంత ఆందోళన, ఆతృత ఉంటాయి. ఇంటి నుంచి దూరంగా వచ్చినందుకు బెంగ, తల్లిదండ్రులతో పాటు ఎవరి కట్టడి లేకపోవడంతో చదువుపై దృష్టి కేంద్రీకరించడంలో ఆలస్యం చేస్తారు. - టెన్త్, ఇంటర్ వరకూ బట్టీపట్టి, పుస్తకాల్లో ఉన్నది ఉన్నట్లుగా పరీక్షల్లో రాసేసి అత్యధిక మార్కులు తెచ్చుకున్నవారు కూడా ఇంజనీరింగ్‌లో కొంత ఇబ్బంది పడతారు. అందుకు కారణం.. ఇంజనీరింగ్‌లో నేర్చుకుంటూ చదవాల్సిన సబ్జెక్టులు ఎక్కువగా ఉండడమే. - ‘మా ప్రొఫెసర్ వద్ద ఉన్న సబ్జెక్ట్ అంతా నాకు చెప్పేస్తారు. అది చదివి గుర్తు పెట్టుకుని పరీక్షల్లో రాసేస్తాను. మార్కులు కొట్టేస్తా ను. ఇప్పటివరకూ మా టీచర్లు, లెక్చరర్లు ఇలాగే చెప్పారు, నేనూ అలాగే రాశాను. నిజానికి నాకు వచ్చింది కూడా ఆ పద్ధతిలో చదవడమే..’ ఇదీ సగటు ఇంజనీరింగ్ విద్యార్థి మన:స్థితి. - ఇంజనీరింగ్ సిలబస్‌లో ప్రతీ సబ్జెక్టుకి రెండు మూడు రిఫరెన్స్ పుస్తకాలను ఇస్తారు. ప్రతి విద్యార్థి కనీసం రెండు బుక్స్ అయినా చదివి అర్థం చేసుకుంటాడని సిలబస్ రూపొందించిన వారు భావిస్తారు. కానీ విద్యార్థులు ఆల్-ఇన్-వన్లు, గైడ్లు ఫాలో అవుతారు. దీంతో ఒకే కాన్సెప్ట్‌ను రెండు మూడు పద్ధతుల్లో చదివి ఒకటైనా సరిగ్గా అర్థం చేసుకోలేక ఇబ్బంది పడతారు. - బీటెక్ పూర్తిచేసిన కొందరు ఒకటి రెండేళ్లు ఉద్యోగం కోసం ప్రయత్నించి ఎక్కడా దొరక్కపోతే తమ ఇంటికి దగ్గరలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్‌గా చేరతారు. వారికొచ్చిన సబ్జెక్టే అంతంత మాత్రం.. కాబట్టి విద్యార్థుల సందేహాలకు సంతృప్తికర సమాధానం ఇవ్వలేరు. ప్రశ్నించడం తప్పు కాదు మీకు ఒక అంశం అర్థం కాలేదనుకుందాం. మీకు ఎలా అయితే అర్థం అవుతుందనుకుంటున్నారో.. నిర్మొహమాటంగా అలాంటి జవాబు దొరికే ప్రశ్న వేయండి. ‘మీరు ఉదాహరణ ఇవ్వగలరా? మీరు చెప్పే ఆ యంత్రం ఎలా ఉంటుందో ఇమేజ్ ఇవ్వగలరా? ఇప్పుడు రాసిన ఆ ఈక్వేషన్ ఎలా సాధించారు? ఈ సిద్ధాంతాన్ని నిజజీవితంలో ఎలా ఉపయోగిస్తాం?’ వంటి ప్రశ్నలు ప్రొఫెసర్‌ను అడగవచ్చు. నిజానికి మీకున్న అనుమానాలే క్లాసులో చాలా మందికి ఉంటాయి. మీరు చొరవ చూపడం వల్ల భవిష్యత్తులో అవసరమైన నాయకత్వ లక్షణాలు మీలో పెంపొందుతాయి. ప్రొఫెసర్‌ను ప్రశ్నించడం తప్పు కాదు. అలాగని అదే పనిగా అవసరం ఉన్నా లేకున్నా ప్రశ్నలు అడిగితే మీరు సమయాన్ని వృథా చేయడానికే ప్రశ్నలు వేస్తున్నారని భావించే అవకాశముంది. ప్రొఫెసర్ మానసిక స్థితి, క్లాసులో మిగిలిన సమయాన్ని బట్టి సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ప్రయత్నించండి. క్లాసులో కుదరదనుకుంటే లెక్చరర్‌ను స్టాఫ్ రూమ్‌లో విడిగా కలిసి, సందేహాలు తీర్చుకోండి. సాధారణంగా అధ్యాపకులు విద్యార్థులు తమను ప్రశ్నించాలని, వారి అనుమానాలను నివృత్తి చేయాలని కోరుకుంటారు. ఒక లెక్చరర్ సంతృప్తికర సమాధానం ఇవ్వకుంటే అదే సబ్జెక్టును డీల్ చేస్తున్న మరో ప్రొఫెసర్‌ను అడగండి. ఆ సమయంలో అదే సందేహం ఉన్న నలుగురైదుగురు కలిసి వెళితే ఆయా ప్రొఫెసర్లకు ఉత్సాహంగానూ ఉంటుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే.. మీరు ఆ సమస్యను అర్థం చేసుకోవడానికి, పరిష్కరించడానికి ఎంత శ్రమపడ్డారో తెలియజేసే రఫ్‌వర్క్, నోట్స్ వంటి ఆధారాలను కూడా చూపించండి. అప్పుడే మీ ప్రశ్నకు విలువ పెరుగుతుంది. అంకితభావం, నిబద్ధత సిలబస్ బుక్‌లో ప్రతి సబ్జెక్టుకి ఇచ్చిన పాఠ్యపుస్తకాన్ని ఫాలో అయ్యేందుకు ప్రయత్నించండి. ఒక రచయిత ఇచ్చిన వివరణపై మీకు అనుమానం వచ్చినా, సంతృప్తి చెందకపోయినా.. మరో రచయిత పుస్తకాన్ని పరిశీలించండి. అప్పుడు అన్నిరకాల ఇన్ఫర్మేషన్ ఒక్కచోట చేరడంతోపాటు ఆయా కాన్సెప్ట్‌ల బేసిక్స్ కూడా లభిస్తాయి. పాఠ్యపుస్తకాలు, రిఫరెన్స్ బుక్స్ చదవడం వల్ల మీ సందేహాలను తీర్చే వివరణలు, ఆయా సిద్ధాంతాలపై ఎక్కువ ఉదాహరణలు లభిస్తాయి. ఇవి మీరు ఆ కాన్సెప్ట్‌ను బాగా తెలుసుకోవడానికి, పరీక్షల్లో వివరణాత్మకంగా సమాధానాలు రాయడానికి ఉపయోగపడతాయి. ఒక సమస్యను సొంతంగా సాధించేందుకు మరీ ఎక్కువసార్లు ప్రయత్నించకండి. కాసేపటికి మీ మనసు దానిని వదిలేద్దామని పోరుపెడుతుంది. కొత్త కోణంలో ఆలోచించేందుకు నిరాకరిస్తుంది. అలాంటి సమయంలో స్నేహితుల సహాయం తీసుకోండి. గ్రూప్ స్టడీస్‌లో సమస్యను చర్చించండి. మీరు ఆలోచించని కోణంలో మీ స్నేహితుల నుంచి పరిష్కారం లభించే అవకాశముంది. ఇది మీతోపాటు గ్రూపులోని ఇతరులకూ సహాయం చేస్తుంది. పై పద్ధతులన్నీ జవాబులు పొందడంలో మీకు ఉపయోగపడకపోతే.. సబ్జెక్ట్ నిపుణుడిని కలిసి సమస్యను వివరించండి. ఒక సబ్జెక్ట్ అర్థం కాకపోవటంలో మీవైపు అనాసక్తి, ఇతర విషయాలపై దృష్టి మరలడం వంటి అంశాల ప్రభావం లేకుండా చూసుకోండి. ఏరోజు పాఠాలు ఆ రోజే ముఖ్యంగా ఏకాగ్రతను పెంచుకుంటూ ఏరోజు పాఠాలను ఆరోజే పూర్తిచేసుకోండి. సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోండి. కాలేజీకి హాజరు వంద శాతం ఉండేటట్లు చూసుకోండి. క్లాస్‌కు వెళ్లేముందు ఆ రోజు జరిగే అంశానికి సంబంధించి చదివి వెళ్లండి. లెక్చరర్ నోట్స్‌తోపాటు రిఫరెన్స పుస్తకాల సహాయంతో నోట్స్ సిద్ధం చేసుకోండి. ప్రతిరోజూ ఆ నోట్స్‌ను చదువుకుంటూ.. పరీక్షలప్పుడు పాత ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయండి. అలా చేస్తే.. మీకు సబ్జెక్ట్ ఫెయిల్ అవడం కాని, బ్యాక్‌లాగ్‌స సమస్య కాని ఉండదు. ఇంజనీరింగ్ విజయవంతంగా పూర్తి చేయాలంటే ఇంజనీరింగ్ విద్యను ఆచరణాత్మక విధానంలో అభ్యసించాలి. బట్టీ పట్టడం, గుర్తుపెట్టుకుని రాయడం వంటివి పనికిరావు. అనుభవపూర్వకంగా నేర్చుకుంటే తప్ప ఇంజనీరింగ్‌లో రాణించలేరు. కాబట్టి మీకు సందేహాలొస్తే మీరే చొరవగా లెక్చరర్లను అడిగి నివృత్తి చేసుకోవాలి. మీకు వచ్చిన సమస్యను మీరే పరిష్కరించుకోవాలి. అందుకు కావలసిన జ్ఞానాన్ని మీరే పెంపొందించుకోవాలి. ఎందుకంటే.. కాలేజీ పూర్తయి ఉద్యోగంలో అడుగుపెడితే ప్రతీరోజూ ఒక పరీక్షలానే ఉంటుంది. అక్కడ సమస్యలను పరిష్కరించడమే తప్ప పాఠాలు, పరీక్షలో మార్కులు ఉండవు. మీలాగే ఇంజనీరింగ్ కోర్సు చదివేటప్పుడు సగటు విద్యార్థిగా ఉండి, తరగతి గ దిలో మీ కంటే ఎక్కువగా ఇబ్బంది పడినవారు ఎంతో మంది ఇప్పుడు ఎంతో సమర్థంగా రోజువారీ బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు!! నాలుగు పద్ధతులు.. విద్యార్థులు ఏ విషయాన్నైనా నాలుగు పద్ధతుల్లో నేర్చుకుంటారని పరిశోధనల్లో తేలింది. వాటిలో మీకు ఏ పద్ధతిలో సబ్జెక్టు అర్థం అవుతుందో, మీరు త్వరగా నేర్చుకోగలరో గుర్తించాలి. అవి.. 1. నేను ఆచరణాత్మక, నిజజీవిత సంఘటనలను చూసి ప్రభావితమవుతాను. 2. నేను ఉదాహరణలతో వివరించినప్పుడు బాగా అర్థం చేసుకుంటాను. 3. నేను ఫార్ములాలు, సిద్ధాంతాలు కాకుండా ఒక యంత్రం పనిచేసే విధానం తెలుసుకోవడం వల్ల నేర్చుకుంటాను. 4. నాకు బొమ్మలు, ఫ్లో ఛార్టులు, ఇతర వివరణాత్మక అంశాలపై ఆసక్తి ఉంది. వాటి సహాయంతో పుస్తకాలను చదివిన దానికంటే ఎక్కువగా అర్థం చేసుకుంటాను. ప్రాక్టికల్‌గా నేర్చుకోవాలి ఇంజనీరింగ్‌లో బ్యాక్‌లాగ్స్.. విద్యార్థుల మానసిక సామర్థ్యంతోపాటు భవిష్యత్తు అవకాశాలపైనా ప్రతికూల ప్రభావం చూపుతాయి. విద్యార్థులపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి. దీని ప్రభావం తర్వాత సెమిస్టర్ పరీక్షలపై పడి విద్యార్థికి మోయలేని భారంగా మారతాయి. కేవలం పరీక్షల సమయంలో కష్టపడి పాసైనా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే.. బ్యాక్‌లాగ్స్ కారణంగా మార్కుల శాతమూ తగ్గిపోతుంది. చాలా కంపెనీలు ప్రథమ శ్రేణి మార్కులతోపాటు బ్యాక్‌లాగ్‌లు లేని విద్యార్థులకే ప్రాధాన్యతనిస్తున్నాయి. ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఉద్యోగం కోసం వెళ్లినప్పుడు మీ బ్యాక్‌లాగ్స్‌కు కారణాలను క ంపెనీలు ప్రశ్నించవు. ప్రస్తుత పోటీ వాతావరణంలో కంపెనీలకు ఆ అవసరమూ లేదు. మెరుగైన అకడమిక్ రికార్డు ఉన్నవారికే ఉద్యోగాలిస్తాయి. కాబట్టి విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. ఇంజనీరింగ్ ఏ క్లాసునూ నిర్లక్ష్యం చేయొద్దు. తరగతి గదిలో చురుగ్గా పాల్గొనాలి. సందేహాలుంటే అదే రోజు ప్రొఫెసర్‌ను సంప్రదించి నివృత్తి చేసుకోవాలి. విద్యార్థులు తమ బ్రాంచికి సంబంధించిన ప్రతి సబ్జెక్ట్‌పై సంపూర్ణ పట్టు సాధించడానికి ప్రయత్నించాలి. బేసిక్స్, ముఖ్య నియమాలు, సిద్ధాంతాలన్నింటినీ సమగ్రంగా తెలుసుకోవాలి. అంతేకానీ పరీక్షల సమయంలో బట్టీ పట్టడం, అప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాలని ప్రయత్నిస్తే ప్రయోజనం ఉండదు. ఇంజనీరింగ్‌లో ప్రతి అంశాన్నీ ప్రాక్టికల్‌గా నేర్చుకుంటేనే రాణించడానికి అవకాశం ఉంటుంది. ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం మొదటి సెమిస్టర్లోపు ఎలాంటి బ్యాక్‌లాగ్స్ లేకుండా జాగ్రత్త వహించాలి. అప్పటివరకు కోర్సులో ఎంత పర్సంటేజీ వచ్చింది? డిస్టింక్షన్ ఉందా? అని పరిశీలించుకుంటూ ముందుకు సాగాలి. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు కనీసం 60 శాతం మార్కులు సాధించడంపై దృష్టిసారించాలి. ఫైనల్ ఇయర్లో వీలైనన్ని ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలి. - డా.బి.సుధీర్ ప్రేమ్‌కుమార్ హెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, హైదరాబాద్ -
కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ జారీ
ఇంజనీరింగ్ ప్రవేశాలకు 7 నుంచి ధ్రువీకరణ పత్రాల పరిశీలన 23 వరకూ తనిఖీ.. ఉదయం 9 గంటల నుంచే ప్రక్రియ ప్రారంభం సాక్షి, హైద రాబాద్ : తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ అయింది. వచ్చే నెల 7వ తేదీ నుంచి 23వ తేదీ వరకు విద్యార్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేపట్టనున్నారు. దీనికోసం ఇరు రాష్ట్రాల్లో కలిపి 57 సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులు ర్యాంకులవారీగా ఆయా కేంద్రాలకు హాజరుకావాల్సిన తేదీలను ప్రకటించారు. ట్యూషన్ ఫీజు, సీట్ల వివరాలను ఆప్షన్ల ప్రక్రియ చేపట్టడానికి ముందు ప్రకటిస్తామని వెల్లడించారు. ‘ఫీజు రీయింబర్స్మెంట్’ వివాదం నేపథ్యంలో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ గందరగోళంగా మారిన విషయం తెలిసిం దే. ఈ అంశంపై స్పష్టత వచ్చేలోగానే... ఇప్పటికే ఆలస్యమవుతోందంటూ ప్రవేశాల ప్రక్రియను చేపట్టేందుకు ఉమ్మడిగా కొనసాగుతున్న రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ మేరకు ప్రవేశాల కోసం విద్యార్థుల ధ్రువీకరణపత్రాల పరిశీలన చేపట్టేందుకు ఎంసెట్ కన్వీనర్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు ఈ పరిశీలన చేపడుతున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దీని ప్రకారం... ఎంసెట్-2014 (ఎంపీసీ స్ట్రీమ్)లో అర్హత సాధించిన తెలంగాణ, ఏపీ విద్యార్థులు ర్యాంకుల వారీగా నిర్ణీత తేదీల్లో హెల్ప్‌లైన్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల తనిఖీకి హాజరు కావాలి. దీనికి సంబంధించిన వివరాలను ఎంసెట్ వెబ్సైట్లో (జ్ట్టిఞట://్ఛ్చఝఛ్ఛ్టి.జీఛి. జీ)అందుబాటులో ఉంచారు. ప్రవేశాలకు సంబంధించి పూర్తి వివరాలను ఆగస్టు 5వ తేదీ నుంచి వెబ్సైట్లో పొందవచ్చు. అన్ని పత్రాలతో హాజరుకావాలి.. విద్యార్థులు అన్ని ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో పాటు వాటికి సంబంధించిన మూడు సెట్ల ప్రతులను సహాయక కేంద్రాలకు తీసుకురావాల్సి ఉంటుంది. ఎంసెట్ ర్యాంక్ కార్డు, హాల్‌టికెట్, ఇంటర్మీడియట్ మెమో కమ్ పాస్ సర్టిఫికెట్, ఎస్సెస్సీ లేదా తత్సమాన మార్కుల మెమో, ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, 2014 జనవరి 1వ తేదీ తరువాత జారీ చేసిన ఆదాయ ధ్రువపత్రం, కుల ధ్రువీకరణ పత్రం, పీహెచ్/ఎన్సీసీ/స్పోర్ట్స్ తదితర అభ్యర్థులు సం బంధిత ధ్రువపత్రాలను తీసుకురావాలి. ఓసీ, బీసీ అభ్యర్థు లు రూ. 600, ఎస్సీ, ఎస్టీలు రూ. 300 ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ట్యూషన్ ఫీజు వివరాలు, కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉండే సీట్ల వివరాలను ఆప్షన్ల ప్రక్రియకు ముందుగా ప్రకటిస్తారు. ధ్రువపత్రాల పరిశీలన ఆయా తేదీల్లో ప్రతి రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతుంది. వికలాంగులు, ఎన్సీసీ, స్పోర్ట్స్ తదితర కేటగిరీల వారికి హైదరాబాద్‌లోని సాంకేతిక విద్యా భవన్లో సర్టిఫికెట్ల తనిఖీ ఉంటుంది. కాగా, ధ్రువపత్రాల పరిశీలన కోసం తెలంగాణలో 23, ఆంధ్రప్రదేశ్‌లో 34 హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి వెల్లడించారు. సవరణలు చేశాకే.. ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు (జీవోలు 66, 67, 74, 75) సవరణ చేసి... ఉత్తర్వులు జారీ చేశాకే తెలంగాణ, ఏపీల్లోని ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్లలో ప్రవేశాలు చేపట్టాలని ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. అంతవరకు యాజమాన్య కోటాలో ఎలాంటి ప్రవేశాలు చేపట్టడానికి వీల్లేదని పేర్కొంది. బహిష్కరిస్తాం..: పాలిటెక్నిక్ లెక్చరర్ల సంఘం ఎంసెట్ ప్రవేశాల అంశంలో ఏపీ ప్రభుత్వ ప్రోద్భలంతో ఉన్నత విద్యామండలి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నందున తెలంగాణలో హెల్ప్‌లైన్ కేంద్రాలను తె రవబోమని తెలంగాణ గెజిటెడ్ పాలిటెక్నిక్ ఆల్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ధ్రువపత్రాల పరిశీలనను బహిష్కరిస్తామని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని అసోసియేషన్ నాయకులు వై.నర్సయ్యగౌడ్, మనోహర్‌రెడ్డి, కేఎస్ చక్రవర్తి, సీహెచ్ మధుసూదన్‌రెడ్డి తదితరులు తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్‌కు, విద్యా మండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డికి తెలియజేశారు. బుధవారం సచివాలయంలో మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడుతూ.. ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీ సర్కార్‌ను బద్నాం చేసే కుట్ర: తెలంగాణ వికాస సమితి తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్రలో భాగంగానే ఇంజనీరింగ్ ప్రవేశాల నోటిఫికేషన్ జారీ చేశారని తెలంగాణ వికాస సమితి నాయకులు దేశపతి శ్రీనివాస్, పాపిరెడ్డి, వీరన్న, విజయభాస్కర్ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫీజులకు సంబంధించి ఎలాంటి జీవోలు జారీ చేయకుండా నోటిఫికేషన్‌ను విడుదల చేయడంలో ఆంతర్యమేమిటని వారు ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వంపై విద్యార్థులను ఉసిగొల్పేందుకే నోటిఫికేషన్ విడుదల చేశారని పేర్కొన్నారు. -
ఇతర రాష్ట్ర విద్యార్థులకు మిగులు సీట్లు!
* ఇంజనీరింగ్, మెడికల్‌లో ప్రవేశాలపై అధికారులకు సీఎం ఆదేశం * సీట్ల భర్తీపై నివేదిక సమర్పించండి * ఫీజు భారం వివరాలివ్వండి సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, మెడికల్‌లో ప్రవేశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర విద్యార్థులతో భర్తీ చేయగా మిగిలే సీట్లను ఇతర రాష్ట్ర విద్యార్థులతో భర్తీ చేసేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతోనూ చర్చించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచార శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. మిగులు సీట్ల భర్తీ విషయంలో సాధ్యాసాధ్యాలతో సత్వరమే ఒక నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు విద్యాశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. సచివాలయంలో మంగళవారం విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, సాంకేతిక, కళాశాల విద్యా కమిషనర్ శైలజా రామయ్యర్, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి, కార్యదర్శి ప్రొఫెసర్ సతీష్‌రెడ్డి తదితరులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. విభజన నేపథ్యంలో ప్రస్తుత ప్రవేశాల విధానం ఎలా ఉందని, దానివల్ల తెలంగాణ ప్రాంత విద్యార్థులకు ఏమైనా నష్టం ఉంటుందా? అనే అంశాలపై ఆరా తీశారు. ప్రవేశాల్లో రాష్ట్ర విద్యార్థులతో ముందుగా కన్వీన ర్ కోటా భర్తీ చేయండి. తరువాత మేనేజ్మెంట్ కోటా భర్తీ చేయండి. ఆ తర్వాత ఇతర రాష్ట్ర విద్యార్థులకు ప్రవేశాలు కల్పించే అవకాశం ఉందా? ఇప్పటివరకు మేనేజ్మెంట్ కోటాలో ఇతర రాష్ట్ర విద్యార్థులకు ఇస్తున్న నేపథ్యంలో... కన్వీనర్ కోటాలో మిగిలే సీట్లు వారికి ఇస్తే ఎలా ఉంటుంది? అది సాధ్యం అవుతుందా? అని సీఎం ప్రశ్నించారు. ఇందులో తొందరపాటు నిర్ణయాలు వద్దని, మేనేజ్‌మెంట్స్‌కు ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు రాకుండా చూసుకోవాలని అధికారులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. పదేళ్ల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పాత ప్రవేశాల విధానమే ఉంటుందని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న నేపథ్యంలో ఈ అంశంపై చ ర్చకు ప్రాధాన్యం ఏర్పడింది. అలాగే ప్రస్తుత ప్రవేశాలు పూర్తయ్యాక ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీని వెంటనే విభజించాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. ఫీజు రీయింబర్స్మెంట్ భారం తెలంగాణపై ఎంత ఉంటుందనే పూర్తి వివరాలు కావాలని ఆదేశించారు. ఇంజనీరింగ్, మెడికల్‌లో ప్రవేశాలను సకాలంలో పూర్తి చేసి తరగతులను ప్రారంభించాలని అధికారులకు సూచించారు. అనంతరం మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించారు. పదేళ్లపాటు పాత ప్రవేశాల విధానమేనని చట్టంలో ఉన్నందున రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందనే అంశాలపై చర్చించారు. భవిష్యత్తులో ఎంసెట్ పరిస్థితి ఏంటి? నిర్వహణ విధానం ఎలా ఉండాలి? పాత విధానంలో ప్రవేశాలు చేపట్టడం సాధ్యమేనా? ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి? రాష్ట్రస్థాయి వర్సిటీల పరిస్థితి ఏంటి? ఉమ్మడి రాష్ట్రాలకు సేవలు అందించడం కుదురుతుందా? తెలంగాణ విద్యార్థుల కోసం ఏం చేయవచ్చనే వివరాలను మంత్రి అడిగినట్లు తెలిసింది. -
15 తర్వాత ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు!
జూలై 15లోగా ప్రవేశాల పూర్తికి సాంకేతిక విద్యాశాఖ ఏర్పాట్లు ఆగస్టు ఒకటి నుంచి తరగతులు ప్రారంభించడానికి కసరత్తు హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం వచ్చే నెల 15 తర్వాత వెబ్ ఆప్షన్ల ప్రక్రియను చేపట్టేందుకు సాంకేతిక విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. వెబ్ ఆప్షన ్ల నుంచి మొదలుపెట్టి మొత్తం ప్రవేశాల ప్రక్రియను జూలై 15లోగా పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒకవేళ జూలై 15 నాటికి పూర్తి కాకపోయినా 25 నాటికి ఆ ప్రక్రియను పూర్తిచేసి ఆగస్టు ఒకటో తేదీ నుంచి తరగతులను ప్రారంభించాలని భావిస్తోంది. ఇందుకోసం జూన్ 9న ఎంసెట్ ర్యాంకులను వెల్లడించిన వెంటనే వెబ్ ఆప్షన్లకు సంబంధించిన చర్యలపై దృష్టి సారించాలని నిర్ణయించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై 31 నాటికే ప్రవేశాలను పూర్తిచేసి ఆగస్టు 1 నుంచి తరగతులను ప్రారంభించాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశించడంతో ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రవేశాల ప్రక్రియపై మరింత స్పష్టత అవసరమని అధికారులు భావిస్తున్నా.. వెబ్ ఆప్షన్లకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. వన్‌టైమ్ పాస్‌వర్డ్‌తో ఆప్షన్లు.. ఈసారి వెబ్ ఆప్షన్లకు వన్‌టైమ్ పాస్వర్డ్ విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. ఆప్షన్లు ఇచ్చే సమయంలో లాగిన్ కాగానే విద్యార్థి మొబైల్ నంబరుకు పాస్వర్డ్ వస్తుంది. ఆ నంబర్‌ను ఎంటర్ చేసి ఆప్షన్ల పేజీలోకి వెళ్లి ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఆ పాస్వర్డ్ 15 నిమిషాలపాటు మాత్రమే పని చేస్తుంది. ఆ సమయంలో విద్యార్థి ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత సమయం పూర్తికాగానే విద్యార్థి ఇచ్చిన ఆప్షన్లు ఆటోమేటిక్‌గా సేవ్ అవుతాయి. మళ్లీ లాగౌట్ అయి, లాగిన్ అయితేనే మరో పాస్వర్డ్ వస్తుంది. దానిని ఎంటర్ చేసి మళ్లీ మరిన్ని ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.. ఇచ్చిన ఆప్షన్లు మార్చుకోవచ్చు. ఇంజనీరింగ్ ప్రవేశాల్లో వెబ్ ఆప్షన్ల విధానం వల్ల ఇంటర్నెట్ కేంద్రాల నిర్వాహకులు విద్యార్థి స్క్రాచ్ కార్డులోని పాస్‌వర్డ్‌ను దొంగిలించడం, వారికి తెలియకుండానే కొన్ని కాలేజీల్లో ఆప్షన్లు ఇవ్వడం వంటి మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ వన్‌టైమ్ పాస్వర్డ్ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించారు. -
ఇంజనీరింగ్ అడ్మిషన్లలో మార్పులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియలో మార్పులు రానున్నాయి. ఆప్షన్ల నమోదులో స్క్రాచ్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఉన్నత విద్యాశాఖ పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశానికి ఫుల్స్టాప్ పెట్టాలని నిర్ణయించింది. సాంకేతిక విద్యాశాఖ ఏర్పాటు చేసే హెల్ప్‌లైన్ కేంద్రాల్లో మాత్రమే ఈ ఆప్షన్లు ఇచ్చుకునేలా చర్యలు చేపట్టేందుకు సమాయత్తమవుతోంది. అయితే ఈ విధానంతో విద్యార్థులపై ఆర్థిక భారం పడనుంది. గతేడాది రూ.600 ఉన్న కౌన్సెలింగ్ ఫీజు మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే ఒకసారి ఇచ్చిన ఆప్షన్లను మళ్లీ మార్చుకోవాలంటే అదనంగా డబ్బు చెల్లించి హెల్ప్‌లైన్ కేంద్రాల్లోనే మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియలో ఏయే మార్పులు తీసుకురావాలన్న అంశాలపై శుక్రవారం ఉన్నత విద్యాశాఖ అధికారులు, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ అజయ్‌జైన్, ఎంసెట్ అధికారులు, ప్రవేశాల క్యాంపు అధికారి రఘునాథ్ తదితరులు సమావేశమై చర్చించారు. ఆయా అంశాలపై త్వరలోనే మరోసారి చర్చించాక అధికారిక నిర్ణయం ప్రకటించనున్నారు. కొత్త మార్పులు ఇలా... విద్యార్థులు ఇంటర్నెట్ సెంటర్లలో కాకుండా ఆప్షన్లను హెల్ప్‌లైన్ కేంద్రాల్లోనే ఇచ్చుకోవాలి. ఒక్కోవిద్యార్థికి గంటన్నర సమయం ఇస్తారు. విద్యార్థితోపాటు ఒక్కరినే హెల్ప్‌లైన్ కేంద్రంలోకి అనుమతిస్తారు. దరఖాస్తు చేసుకునే సమయంలోనే విద్యార్థి తన తల్లిదండ్రులు లేదా గార్డియన్ ఫొటోల్ని అప్లోడ్ చేయాలి. ఆప్షన్ల సమయంలో ఆ ముగ్గురిలో ఎవరో ఒకర్నే విద్యార్థికి సాయంగా హెల్ప్‌లైన్ కేంద్రంలోకి అనుమతిస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేటప్పుడే విద్యార్థి.. ఆప్షన్ ఇచ్చుకునే హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ కేంద్రానికి మాత్రమే వెళ్లి ఆప్షన్ ఇవ్వాలి. ముందుగా సాంకేతిక విద్యాశాఖ అందజేసే ఫారంలో ఆప్షన్లను ఎంపిక చేసుకుని, తర్వాత ఆన్లైన్లో ఇవ్వాలి. మార్పు చేసుకోవాలంటే అదనంగా డబ్బు చెల్లించాల్సి వస్తుంది. హెల్ప్‌లైన్ కేంద్రాలను ప్రస్తుతమున్న 53 నుంచి 93 వరకు పెంచుతారు. మొత్తంగా 2,500 వరకు కంప్యూటర్లు అందుబాటులో ఉంచనున్నారు. ఇందుకు అదనంగా ఖర్చవుతుంది. దీంతో కౌన్సెలింగ్ ఫీజు పెంచడంతోపాటు ఆప్షన్లు మార్చుకోవాలంటే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు ఎంతనేది త్వరలో నిర్ణయిస్తారు.