ఏపీ ఉన్నత విద్యామండలే కౌన్సెలింగ్ చేయాలి: సుప్రీం | engineering-admissions-to-be-according-to-bifurcation-act-says-supreme-court | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 11 2014 2:50 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ అడ్మిషన్లు విభజన చట్టానికి లోబడే ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆగస్టు 31 లోగా కౌన్సెలింగ్‌ పూర్తికావాలని, సెప్టెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభం కావాలని తెలిపింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో మాత్రం తాము జోక్యం చేసుకోబోమని చెప్పింది. అక్టోబరు 31 వరకూ కౌన్సెలింగ్‌ పొడిగించాలన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అలాగే స్థానికత అంశాన్ని కూడా పక్కనపెట్టింది. ఇక ఏపీ ఉన్నతవిద్యామండలి మాత్రమే కౌన్సెలింగ్ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది: ఏపీ తరఫు న్యాయవాది శ్రీనివాస్ తెలిపారు. 371-డి కింద ఇచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే అడ్మిషన్లు నిర్వహించాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. పునర్విభజన చట్టం సెక్షన్‌ 95 ప్రకారమే అడ్మిషన్లు నిర్వహించాలందని, అక్టోబర్‌ 31 వరకు పొడిగించాలని కోరితే కేసు డిస్మిస్ చేస్తానని సుప్రీం హెచ్చరించిందని శ్రీనివాస్ తెలిపారు. 371-డి కింద ఇచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే స్థానికత నిర్ధారణ అవుతుందని ఆయన అన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement