సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీలో కన్వీనర్ కోటా ద్వారా కేటాయింపు జరిగే మొత్తం సీట్లు 70,030 అని, ఇందులో ఇంజనీరింగ్ 66,290 కాగా ఫార్మాసీ 3740 సీట్లు ఉన్నాయని టీఎస్‌ఎంసెట్ కన్వీనర్, సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. కన్వీనర్ కోటాలో సీట్ల కేటాయింపునకు విద్యార్థులు ఆప్షన్ల నమోదును ఈ నెల 16వ తేదీ (గురువారం) అర్ధరాత్రి 12 గంటల్లోగా పూర్తి చేసుకోవాలని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
విద్యార్థులు సాధ్యమైనన్ని ఎక్కువ ఆప్షన్లు పెట్టుకోవాలని సూచించారు. ఎంసెట్‌లో ధ్రువపత్రాల పరిశీలన చేసుకున్న విద్యార్థులు 71,186 కాగా వారిలో ఇప్పటి వరకు 47,471 మంది ఆప్షన్లు ఎంపిక చేసుకున్నట్లు ఆయన వివరించారు. మంచి కాలేజీల్లో సీట్లు రావడానికి ఒక విద్యార్థి ఎన్ని ఆప్షన్లు అయినా పెట్టుకోవచ్చని, ఈసారి ఒక విద్యార్థి కౌన్సెలింగ్ కోసం ఏకంగా 1,186 ఆప్షన్లు ఇచ్చినట్లు తెలిపారు. 47,471 మంది మొత్తంగా 18,97,052 ఆప్షన్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కోర్సుల వారీగా కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను ఆయన వెల్లడించారు..
సీట్ల వివరాలు..
సీఎస్‌ఈ(16,801), ఈసీఈ(12,582), ఈఈఈ(6,366), సీఐవీ(5,766), ఎంఈసీ(5,355), సీఎస్‌ఎం(5,037), ఐఎన్‌ఎఫ్(4,713), సీఎస్‌డీ(3,003), సీఎస్‌సీ(1,638), సీఎస్‌ఓ(1,029), ఏఐడీ(420), ఎంఐఎన్(388), సీఎస్‌ఐ(336), ఏఐఎం(270), సీఎస్‌బీ(252), సీహెచ్‌ఈ(246), ఏఎన్‌ఈ(210), సీఎస్‌డబ్లు్య(210), ఈఐఈ(196), ఏఐ(126), సీఐసీ(126), ఈసీఎం(126), ఏయూటీ(84), సీఎస్‌ఎన్(84), ఎఫ్‌డీటీ(84), టీఈఎక్స్(80), డీటీడీ(60), ఎఫ్‌ఎస్‌పీ(60), ఎంఈటీ(60), బీఎంఈ(51), సీఎంఈ(42), సీఎస్‌జీ(42), సీఎస్‌టీ(42), ఈసీఐ(42), ఈటీఎం(42), ఎంసీటీ(42), ఎంఎంటీ(42), పీహెచ్‌ఈ(42), పీఎల్‌జీ(40), ఎంఎంఎస్(30), ఎంటీఈ(30), ఐపీఈ(28), ఏజీఆర్(24), బీఆర్‌జీ(22), బీఐఓ(21), పీహెచ్‌ఎం(3,220), పీహెచ్‌డీ(520)
Comments
Please login to add a commentAdd a comment