ఇంజనీరింగ్‌ సీట్లు పెరగవా? | Concern among students who have made donation for management quota seats | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌ సీట్లు పెరగవా?

Published Fri, Jul 12 2024 4:57 AM | Last Updated on Fri, Jul 12 2024 4:57 AM

Concern among students who have made donation for management quota seats

కొత్త సీట్లపై అధికారుల అభ్యంతరం 

కంప్యూటర్‌ కోర్సులకు ఫ్యాకల్టీ ఎక్కడన్న ప్రశ్నలు..   సీట్ల పెంపు సరికాదంటూ ప్రభుత్వానికి నివేదిక 

ఇప్పటికే మేనేజ్‌మెంట్‌ సీట్ల అమ్మకం 

డబ్బులు కట్టిన విద్యార్థుల్లో ఆందోళన 

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌లో కొత్త సీట్లపై నెలకొన్న పేచీ ఇప్పట్లో తేలేట్టు లేదు. తొలి దశ కౌన్సెలింగ్‌ ముగిసే నాటికి దీనిపై స్పష్టత రావడం కష్టమని అధికార వర్గాలే అంటున్నాయి. దీంతో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల కోసం డొనేషన్‌ కట్టిన విద్యార్థుల్లో ఆందోళన కన్పిస్తోంది. సీట్లు వస్తా యో? రావో? తెలియని అయోమయ స్థితిలో పలువురు తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాల చుట్టూ తిరుగుతున్నారు. 

రాష్ట్రంలోని దాదాపు వంద కాలేజీలు ఈ ఏడాది సీట్ల పెంపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇతర బ్రాంచీలు తగ్గించుకుని కంప్యూటర్‌ కోర్సుల్లో సీట్లు పెంచాలని కోరాయి. కొత్తగా వచ్చేవి 10 వేలు, బ్రాంచీ మార్పుతో వచ్చే సీట్లు మరో పది వేలు... మొత్తంగా 20 వేల సీట్లు పెరుగుతాయని కాలేజీలు ఆశించాయి. ఇవన్నీ కంప్యూటర్‌ సైన్స్, అనుబంధ కోర్సులే.  

ఇప్పట్లో అనుమతి లేనట్టేనా?
బ్రాంచీల మార్పు, కొత్త సెక్షన్లకు ప్రైవేటు కాలేజీలు చేసిన దరఖాస్తులను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనుమతించింది. కానీ రాష్ట్రంలోని వర్సిటీలు మాత్రం అనుమతించేందుకు వెనుకాడుతున్నాయి. తొలి విడత కౌన్సెలింగ్‌లో 173 కాలేజీల్లోని 98,296 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కన్వీనర్‌ కోటా కింద 70,307 సీట్లు భర్తీ చేయాల్సి ఉంటుంది. వీటిల్లో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ కోర్‌ గ్రూపుతో పాటు, సైబర్‌ సెక్యూరిటీ, డేటాసైన్స్, ఆరిï్టœíÙయల్‌ ఇంటెలిజెన్స్‌ సహా పలు కంప్యూటర్‌ కోర్సుల్లోని సీట్లే 48 వేలున్నాయి. 

ఎల్రక్టానిక్స్‌–కమ్యూనికేషన్‌లో 9618, ఎలక్ట్రికల్‌లో 3602, మెకానికల్‌లో 2499 సీట్లు ఉన్నాయి. గత ఐదేళ్లతో పోలిస్తే ఈ బ్రాంచీల్లో సగటున 50 శాతం సీట్లు తగ్గాయి. ఇప్పుడు మొత్తం కంప్యూటర్‌ కోర్సులనే అనుమతిస్తే భవిష్యత్‌లో సంప్రదాయ కోర్సులే ఉండే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వానికి పంపిన నివేదికలోనూ ఇదే అంశాన్ని అధికారులు ప్రస్తావించినట్టు తెలిసింది. 

మెకానికల్, ఈఈఈ, ఈసీఈ, సివిల్‌ కోర్సులు చేసినప్పటికీ సాఫ్ట్‌వేర్‌ అనుబంధ అప్లికేషన్లు ఆన్‌లైన్‌లో నేర్చుకోవచ్చని, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల వైపు వెళ్లే అవకాశం ఉందని వర్సిటీలు భావిస్తున్నాయి. ఈ కారణంగానే ఆ బ్రాంచీల రద్దును అంగీకరించేందుకు వర్సిటీ అధికారులు ఏమాత్రం ఇష్టపడటం లేదు. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఓ అధికారి తెలిపారు. ఈ కారణంగానే కొత్తగా రావాల్సిన 20 వేల సీట్లు తొలి కౌన్సెలింగ్‌లో ఇప్పటికీ చేర్చలేదని చెబుతున్నారు.
 
ఫ్యాకల్టీ ఎక్కడ...?  
సీఎస్‌ఈని సమర్థవంతంగా బోధించే ఫ్యాకల్టీ కొరత తీవ్రంగా ఉందని అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఉన్న సెక్షన్లకు బోధకులు సరిపోవడం లేదని, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్స్‌ బ్రాంచీలు బోధించే వారితో క్లాసులు చెప్పిస్తున్నారని తనిఖీ బృందాలు పేర్కొంటున్నాయి. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్స్‌ కోర్సులకు ఇప్పటికీ ప్రత్యేక శిక్షణ పొందిన వాళ్లు లేరని అధికారులు అంటున్నారు. 

వివిధ రంగాల్లో నిపుణులైన సాఫ్ట్‌వేర్‌ నేపథ్యం ఉన్న ఉద్యోగుల చేత, లేదా కొన్ని చాప్టర్స్‌ను ఆన్‌లైన్‌ విధానంలో ఎన్‌ఆర్‌ఐల చేత బోధించే వెసులుబాటు కల్పించినప్పటికీ ఎవరూ ముందుకు రావడం లేదని తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సెక్షన్లు, కంప్యూటర్‌ సీట్ల పెంపునకు అనుమతించడం సరైన విధానం కాదని అధికారులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించినట్టు ఓ అధికారి చెప్పారు. 

ముగిసిన స్లాట్‌ బుకింగ్‌... ఆప్షన్లే తరువాయి 
తొలి విడత ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌కు గురువారంతో స్లాట్‌ బుకింగ్, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముగి సింది. ఇప్పటి వరకూ 97,309 మంది రిజి్రస్టేష న్‌ చేసుకున్నారు. 33,922 మంది 16,74,506 ఆప్షన్లు ఇచ్చారు. కొంత మంది అత్యధికంగా 942 ఆప్షన్లు ఇచ్చారు. ఈ నెల 15వ తేదీతో ఆప్షన్లు ఇచ్చే గడువు ముగుస్తుంది. 

ఈ తేదీనాటికి మరికొన్ని ఆప్షన్లు వచ్చే వీలుందని తెలుస్తోంది. ఆప్షన్లు ఇచ్చిన వాళ్లలో 78 శాతం కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ బ్రాంచీకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికీ కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లు పెరుగుతాయనే విద్యార్థులు భావిస్తున్నారు. పెరిగే సీట్లపై అధికారులు స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని, అప్పుడే ర్యాంకును బట్టి ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement