Computer science
-
కాలేజీలు తగ్గినా.. సీట్లు పైకే
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య తగ్గుతున్నా, సీట్లు మాత్రం ఏటా పెరుగుతున్నాయి. ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థుల సంఖ్యా ఏయేటికాయేడు పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో 2020–21లో 186 ఇంజనీరింగ్ కాలేజీలుంటే, 2024–25 విద్యా సంవత్సరానికి అవి 174కు తగ్గాయి. 20–21లో 98,988 ఇంజనీరింగ్ సీట్లు ఉంటే, ఈ ఏడాది సీట్లు 1,12,069కు పెరిగాయి. ఇంజనీరింగ్‌లో చేరేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూ, ఇది ఈ సంవత్సరం లక్ష దాటింది. చిన్న పట్టణాల్లో కాలేజీలు క్రమంగా మూతపడుతున్నాయి. ఇక్కడ విద్యార్థులు చేరేందుకు ఇష్టపడటం లేదని ప్రవేశాల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విద్యార్థులు ఇంటర్ నుంచే హైదరాబాద్‌లో చదివేందుకు వస్తున్నారు. ఇదే ట్రెండ్ ఇంజనీరింగ్‌లోనూ కొనసాగుతోంది. దీంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కాలేజీల్లో ఎక్కువగా సీట్లు భర్తీ అవుతున్నాయి.ఎక్కువ మంది ఇంజనీరింగ్ వైపే..రాష్ట్రవ్యాప్తంగా ఏటా 4.5 లక్షల మంది ఇంటర్మిడియట్ పాసవుతున్నారు. ఇందులో 75 శాతంపైగా ఎంపీసీ గ్రూపు విద్యార్థులే ఉంటున్నారు. వీరిలో లక్ష మంది వరకూ రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరుతున్నారు. ఎన్ఐటీలు, అడ్వాన్స్డ్ ద్వారా ఐఐటీల్లో చేరేవాళ్లు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర సంస్థల్లో చేరేవాళ్లు మరో 10 వేల మంది వరకూ ఉంటారని అంచనా. ఈ ఏడాది ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగానికి 2.40 లక్షల మంది దరఖాస్తు చేశారు. వీరిలో 1.80 లక్షల మంది పాసయ్యారు. కనీ్వనర్ కోటా కింద 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లు కలిపి మొత్తం 86,943 సీట్లు ఉన్నాయి. వీటిలో 75,107 సీట్లు భర్తీ చేశారు. దాదాపు 31 వేల బీ కేటగిరీ సీట్లు భర్తీ అయ్యాయి. రాష్ట్రంలోని ఇప్పటికే ఉన్న ప్రైవేటు వర్సిటీలు, కొత్తగా మంజూరైన మరో ఐదు ప్రైవేటు వర్సిటీలు, డీమ్డ్ వర్సిటీల క్యాంపస్‌లలో కనీసం 10 వేల మంది చేరినట్టు అంచనా. బాసర ఆర్జీయూకేటీ, హెచ్‌సీయూలోని సీఆర్‌రావు విద్యా సంస్థతో పాటు తమిçళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని డీమ్డ్ వర్సిటీల్లో మరో 10 వేల మంది చేరే వీలుంది. ఎందుకీ క్రేజ్ఇంజనీరింగ్ తర్వాత ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడాలని విద్యార్థులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను బట్టి చూస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో చేరే వారే ఎక్కువగా ఉంటున్నారు. దీంతో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, దాని అనుబంధ కోర్సుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. మరోవైపు రాష్ట్రంలో ఐటీ కంపెనీల నియామకాలన్నీ కంప్యూటర్ కోర్సులు చేసినవారితోనే జరుగుతున్నాయి. డిగ్రీ, ఇతర కోర్సుల్లోనూ కంప్యూటర్ అనుబంధం ఉంటే తప్ప ఐటీ ఉద్యోగాలకు వెళ్లలేని పరిస్థితి ఉంది.దీంతో విద్యార్థుల డిమాండ్‌కు తగ్గట్టుగా ప్రైవేటు కాలేజీలు కూడా కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో సీట్లు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కాగా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కాలేజీల్లోనే మంచి ఫ్యాకల్టీ ఉంటుందని విద్యార్థులు భావిస్తున్నారు. దీంతో పాటు అన్ని బ్రాంచీల్లోనూ మార్పు అనివార్యమవుతోంది. ఐటీ ఆధారిత బోధన విధానం తప్పనిసరి అవుతోంది. అందుకే విద్యార్థుల్లో ఇంజనీరింగ్‌పై క్రేజ్ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఏఐ ప్రభావమే మార్చేస్తోంది ఇంజనీరింగ్‌లోని అన్ని బ్రాంచీల్లోనూ ఆరి్టఫిíÙయల్ టెక్నా లజీ దూసుకొస్తోంది. కంప్యూటర్ సైన్స్‌లోనే కాదు... సివిల్, మెకానికల్, ఎలక్రి్టకల్‌లోనూ ఏఐ లేకుండా ముందుకెళ్లడం కష్టం. అందుకే బ్రాంచీ ఏదైనా ఏఐ మీద విద్యార్థులు దృష్టి పెడుతున్నారు. ఇంజనీరింగ్ చేస్తూనే... ఏఐ నేర్చుకుంటున్నారు. దీనిద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు. అందుకే ఎక్కువ మంది ఇంజనీరింగ్‌లో చేరుతున్నారు. – డాక్టర్ కె.విజయకుమార్‌రెడ్డి రెక్టార్, జేఎన్టీయూహెచ్ -
సీట్లు రానివారికా... అందరికా
ఇంజనీరింగ్ కాలేజీల్లో పెరిగిన సీట్లు ఎవరికి దక్కుతాయి? కౌన్సెలింగ్ ఎలా నిర్వహిస్తారు? అనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు. మొదట్లో డిమాండ్ లేని కోర్సులు రద్దు చేసుకున్న ప్రైవేట్ కాలేజీలకు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌లలో సీట్లు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. దీనిపై కాలేజీ యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించడం, తాజాగా సీట్ల పెంపునకు అనుకూలంగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం తెలిసిందే. మాప్‌ఆప్ కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పించాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో పెరిగిన సీట్లపై విద్యార్థులు ఆశలు పెట్టుకున్నారు.– సాక్షి, హైదరాబాద్కౌన్సెలింగ్ ఎలా ?ష్ట్రవ్యాప్తంగా కన్వీనర్ కోటాకింద 86 వేల ఇంజనీరింగ్ సీట్లు ఉండగా, ఇందులో ఈ ఏడాది 79 వేల సీట్లు భర్తీ అయ్యాయి. మూడు దశలతోపాటు, ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. అంతిమంగా స్పాట్ అడ్మిషన్లు కూడా పూర్తయ్యాయి. సీట్లు వచ్చిన విద్యార్థులు సంబంధిత కాలేజీల్లోనూ రిపోర్టు చేసి, సర్టిఫికెట్లు కూడా ఇచ్చారు. సీట్లు రానివారు ఇతర రాష్ట్రాల్లోని కాలేజీల్లో, దోస్త్ ద్వారా డిగ్రీలోనూ చేరారు. ఈ దశలో కౌన్సెలింగ్ నిర్వహించడం కష్టమని అధికారులు భావిస్తున్నారు. కేవలం మిగిలిపోయిన విద్యార్థులకు మాత్రమే కౌన్సెలింగ్ చేపట్టాలా? మొత్తం అభ్యర్థులకూ ఆప్షన్లు ఇచ్చే అవకాశం ఇవ్వాలా? అనే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. ఎక్కడా సీటు రాని వారు మాత్రమే ప్రస్తుతం మిగిలిపోయారు. వీరికన్నా ఎక్కువ ర్యాంకు వచ్చిన వారు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌కు ప్రయత్నించినా, ఆఖరుకు సివిల్, మెకానికల్, ఈఈఈలో చేరారు. ఇప్పుడు 3 వేల సీట్లు పెరిగితే, అందులో 2,100 కన్వీనర్ కోటా కింద ఉంటాయి. కేవలం సీట్లు రాని వారికే వీటిని కేటాయిస్తే, అంతకన్నా ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి అన్యాయం జరుగుతుందని అధికారులు అంటున్నారు.యూటర్న్ కష్టమేఇప్పటికే 79 వేల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరారు. పెరిగిన సీట్లకు వీరు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తే కౌన్సెలింగ్ ప్రక్రియ మళ్లీ మొదటికొస్తుంది. వివిధ కాలేజీల్లో పలు గ్రూపుల్లో చేరిన వారు కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేరేందుకు ప్రయత్నిస్తారు. దీనివల్ల ఇప్పటికే చేరిన కాలేజీల్లో మళ్లీ సీట్లు ఖాళీ అవుతాయి. వీటికి మరో దఫా కౌన్సెలింగ్ చేపట్టాలి. మొత్తం మీద కౌన్సెలింగ్ ప్రక్రియ మళ్లీ మొదటి నుంచి చేపట్టడమే అవుతుందని సాంకేతిక విద్య విభాగం చెబుతోంది. ఇదే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే, ప్రైవేట్ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీ పూర్తయింది. ఉన్నత విద్యామండలి ర్యాటిఫికేషన్ చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. కోర్టు తీర్పు ద్వారా పెరిగిన సీట్లకు కౌన్సెలింగ్ చేపడితే ర్యాటిఫికేషన్ ప్రక్రియ వాయిదా వేయాల్సి ఉంటుంది. పరిస్థితి అంతా గందరగోళంగానే ఉందని సాంకేతిక విద్యకు చెందిన ఓ ఉన్నతాధికారి అన్నారు. ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వాలని అధికారులు, విద్యార్థులు కోరుతున్నారు. -
75,200 ఇంజనీరింగ్ సీట్ల భర్తీ
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ తొలి దశ సీట్ల కేటాయింపు శుక్రవారం చేపట్టారు. సాంకేతిక విద్య విభాగం ఇందుకు సంబంధించిన వివరాలను సాయంత్రం వెల్లడించింది. మొత్తం 175 కాలేజీలు కౌన్సెలింగ్‌లో పాల్గొన్నాయి. కనీ్వనర్ కోటా కింద 78,694 సీట్లు అందుబాటులో ఉండగా, వీటిల్లో 75,200 సీట్లు భర్తీ చేశారు. 3,494 సీట్లు మిగిలిపోయాయి. మొత్తం 95.56 శాతం సీట్లు భర్తీ చేసినట్టు అధికారులు తెలిపారు. 95,735 మంది 62,60,149 ఆప్షన్లు ఇచ్చారు. 20,535 సరైన ఆప్షన్లు ఇవ్వలేదు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 6,038 మందికి సీట్లు వచ్చాయి. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 23వ తేదీలోగా ఆన్లైన్ రిపోరి్టంగ్ చేయాలని సూచించారు. ముందుకు రాని టాపర్స్ ఈఏపీ సెట్లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఈసారి కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపలేదు. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొందడానికే ప్రాధాన్యమిచ్చారు. వందలోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులు కేవలం ఒక్కరే తొలి కౌన్సెలింగ్‌లో సీటు కోసం పోటీ పడ్డారు. 201 నుంచి 500 ర్యాంకులు వచి్చన వాళ్ళు కూడా 10 మందే ఉన్నారు. ఆఖరుకు వెయ్యిలోపు ర్యాంకర్లు కూడా 74 మంది మాత్రమే కని్పంచారు. 5 వేలు పైబడిన ర్యాంకు వచ్చిన వాళ్ళే రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల కోసం ప్రయత్నించారు. 53 వేల సీట్లు కంప్యూటర్ కోర్సుల్లోనేభర్తీ అయిన 75,200 సీట్లల్లో 53,517 సీట్లు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇతర కంప్యూటర్ సైన్స్ అనుబంధ గ్రూపుల్లోనే ఉన్నాయి. వివిధ విభాగాలుగా ఉన్న ఆరి్టఫిíÙయల్ ఇంటలిజెన్స్ బ్రాంచీలో వందశాతం సీట్లు భర్తీ అయ్యాయి. సీఎస్ఈలో 99.80 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఐటీ, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్ కోర్సుల్లోనూ 97 శాతంపైగా సీట్లుకేటాయించారు. సివిల్, మెకానికల్, ఎలక్రి్టకల్ ఇంజనీరింగ్‌ల్లో సీట్లు తక్కువగా ఉన్నా మిగిలిపోయాయి. -
2,640 ఇంజనీరింగ్‌లో పెరిగిన సీట్లు..
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో సీట్లు మరో 2,640 పెరిగాయి. ఇవన్నీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఏఐఎంఎల్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ బ్రాంచీలకు సంబంధించినవే కావడం గమనార్హం. కాగా కొత్త వాటితో కలుపుకొని మొత్తం 1,01,661 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో 72,741 సీట్లు కన్వీనర్ కోటా కింద ఉంటాయి. వాస్తవానికి కొత్తగా 20 వేల సీట్ల పెంపునకు కాలేజీలు దరఖాస్తు చేశాయి. అయితే ఇంత పెద్ద సంఖ్యలో సీట్లు పెంచడాన్ని అధికారులు వ్యతిరేకించారు. అన్ని సదుపాయాలు, ఫ్యాకల్టీ ఉన్న 20 కాలేజీల్లో కూడా ప్రతీ బ్రాంచిలో 120 సీట్లకు మించి పెంచడం సరికాదని ప్రభుత్వానికి సూచించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కేవలం 2,640 సీట్లకు మాత్రమే అనుమతి తెలిపింది. సీట్ల పెరుగుదల నేపథ్యంలో ఈ నెల 17 వరకు ఆప్షన్లు ఇచ్చుకునే వెసులుబాటు కల్పించినట్టు సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన తెలిపారు. ఇప్పటివరకు 95,383 మంది ఆప్షన్లు ఇచ్చారని వెల్లడించారు. మరో 4 వేల సీట్లకు చాన్స్..కొత్త కంప్యూటర్ కోర్సులు వచ్చిన నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) వంటి బ్రాంచీలకు ఆదరణ తగ్గింది. దీంతో ఈ కోర్సుల స్థానంలో సీఎస్ఈ, ఇతర కంప్యూటర్ కోర్సులకు అనుమతించే అంశాన్ని అధికారులు పరి శీలిస్తున్నారు. ఇదే జరిగితే మరో 4 వేల సీట్లు వచ్చే అవకాశం ఉంది. మరో విడత కౌన్సెలింగ్‌కు ఈ సీట్లు అందుబాటులోకి వచ్చే వీలుంది. కాగా ఈ ఏడాది సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీలు రద్దు చేయాలని పలు కాలేజీలు దరఖాస్తు పెట్టుకున్నాయి. ఈ సీట్లు 3 వేల వరకూ ఉన్నాయి. అయితే యూనివర్సిటీలు గుర్తించిన సీట్లు మాత్రం 1,770 సీట్లు మాత్రమే. వీటి స్థానంలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సీట్లు ఇచ్చే విషయంలో ప్రభుత్వం విముఖతతో ఉంది. సీఎస్ఈ, ఇతర కంప్యూటర్ నాన్ కోర్ గ్రూపులు కలిపి 48 వేల కన్వీనర్ కోటా సీట్లుండగా, మెకానికల్‌లో 2,979, సివిల్‌లో 3,132, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో 4,202 సీట్లు మాత్రమే ఉన్నాయి. వాస్తవానికి ఈ సీట్లలో కూడా ఏటా 40 శాతం మించి ప్రవేశాలు ఉండటం లేదు. ఈ నేపథ్యంలోనే ఉన్న ఆ కొన్ని సీట్లను తగ్గించేందుకు ప్రభుత్వం అంగీకరించడం లేదు. కొత్త సీట్లపై తర్జనభర్జన..వాస్తవానికి కొత్త సీట్ల విషయంలో ప్రభుత్వం తర్జనభర్జన పడింది. సీట్లు పెంచడం వల్ల పడే ఆర్థిక భారంపై ఆరా తీసింది. కన్వీనర్ కోటా కింద కేటాయించే ప్రతి సీటుకు రూ.35 వేల వరకూ ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలి. 10 వేల లోపు ర్యాంకు వస్తే మొత్తం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం సగటున ఏడాదికి రూ.35 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేశారు. నాలుగేళ్లకు రూ. 100 కోట్ల భారం పడుతుందని లెక్కగట్టారు. -
ఇంజనీరింగ్ సీట్లు పెరగవా?
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో కొత్త సీట్లపై నెలకొన్న పేచీ ఇప్పట్లో తేలేట్టు లేదు. తొలి దశ కౌన్సెలింగ్ ముగిసే నాటికి దీనిపై స్పష్టత రావడం కష్టమని అధికార వర్గాలే అంటున్నాయి. దీంతో మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం డొనేషన్ కట్టిన విద్యార్థుల్లో ఆందోళన కన్పిస్తోంది. సీట్లు వస్తా యో? రావో? తెలియని అయోమయ స్థితిలో పలువురు తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాల చుట్టూ తిరుగుతున్నారు. రాష్ట్రంలోని దాదాపు వంద కాలేజీలు ఈ ఏడాది సీట్ల పెంపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇతర బ్రాంచీలు తగ్గించుకుని కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు పెంచాలని కోరాయి. కొత్తగా వచ్చేవి 10 వేలు, బ్రాంచీ మార్పుతో వచ్చే సీట్లు మరో పది వేలు... మొత్తంగా 20 వేల సీట్లు పెరుగుతాయని కాలేజీలు ఆశించాయి. ఇవన్నీ కంప్యూటర్ సైన్స్, అనుబంధ కోర్సులే. ఇప్పట్లో అనుమతి లేనట్టేనా?బ్రాంచీల మార్పు, కొత్త సెక్షన్లకు ప్రైవేటు కాలేజీలు చేసిన దరఖాస్తులను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనుమతించింది. కానీ రాష్ట్రంలోని వర్సిటీలు మాత్రం అనుమతించేందుకు వెనుకాడుతున్నాయి. తొలి విడత కౌన్సెలింగ్‌లో 173 కాలేజీల్లోని 98,296 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కన్వీనర్ కోటా కింద 70,307 సీట్లు భర్తీ చేయాల్సి ఉంటుంది. వీటిల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్ గ్రూపుతో పాటు, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్, ఆరిï్టœíÙయల్ ఇంటెలిజెన్స్ సహా పలు కంప్యూటర్ కోర్సుల్లోని సీట్లే 48 వేలున్నాయి. ఎల్రక్టానిక్స్–కమ్యూనికేషన్లో 9618, ఎలక్ట్రికల్‌లో 3602, మెకానికల్‌లో 2499 సీట్లు ఉన్నాయి. గత ఐదేళ్లతో పోలిస్తే ఈ బ్రాంచీల్లో సగటున 50 శాతం సీట్లు తగ్గాయి. ఇప్పుడు మొత్తం కంప్యూటర్ కోర్సులనే అనుమతిస్తే భవిష్యత్‌లో సంప్రదాయ కోర్సులే ఉండే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వానికి పంపిన నివేదికలోనూ ఇదే అంశాన్ని అధికారులు ప్రస్తావించినట్టు తెలిసింది. మెకానికల్, ఈఈఈ, ఈసీఈ, సివిల్ కోర్సులు చేసినప్పటికీ సాఫ్ట్వేర్ అనుబంధ అప్లికేషన్లు ఆన్లైన్లో నేర్చుకోవచ్చని, సాఫ్ట్వేర్ ఉద్యోగాల వైపు వెళ్లే అవకాశం ఉందని వర్సిటీలు భావిస్తున్నాయి. ఈ కారణంగానే ఆ బ్రాంచీల రద్దును అంగీకరించేందుకు వర్సిటీ అధికారులు ఏమాత్రం ఇష్టపడటం లేదు. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఓ అధికారి తెలిపారు. ఈ కారణంగానే కొత్తగా రావాల్సిన 20 వేల సీట్లు తొలి కౌన్సెలింగ్‌లో ఇప్పటికీ చేర్చలేదని చెబుతున్నారు. ఫ్యాకల్టీ ఎక్కడ...? సీఎస్ఈని సమర్థవంతంగా బోధించే ఫ్యాకల్టీ కొరత తీవ్రంగా ఉందని అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఉన్న సెక్షన్లకు బోధకులు సరిపోవడం లేదని, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్స్ బ్రాంచీలు బోధించే వారితో క్లాసులు చెప్పిస్తున్నారని తనిఖీ బృందాలు పేర్కొంటున్నాయి. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ కోర్సులకు ఇప్పటికీ ప్రత్యేక శిక్షణ పొందిన వాళ్లు లేరని అధికారులు అంటున్నారు. వివిధ రంగాల్లో నిపుణులైన సాఫ్ట్వేర్ నేపథ్యం ఉన్న ఉద్యోగుల చేత, లేదా కొన్ని చాప్టర్స్‌ను ఆన్లైన్ విధానంలో ఎన్ఆర్ఐల చేత బోధించే వెసులుబాటు కల్పించినప్పటికీ ఎవరూ ముందుకు రావడం లేదని తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సెక్షన్లు, కంప్యూటర్ సీట్ల పెంపునకు అనుమతించడం సరైన విధానం కాదని అధికారులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించినట్టు ఓ అధికారి చెప్పారు. ముగిసిన స్లాట్ బుకింగ్... ఆప్షన్లే తరువాయి తొలి విడత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు గురువారంతో స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగి సింది. ఇప్పటి వరకూ 97,309 మంది రిజి్రస్టేష న్ చేసుకున్నారు. 33,922 మంది 16,74,506 ఆప్షన్లు ఇచ్చారు. కొంత మంది అత్యధికంగా 942 ఆప్షన్లు ఇచ్చారు. ఈ నెల 15వ తేదీతో ఆప్షన్లు ఇచ్చే గడువు ముగుస్తుంది. ఈ తేదీనాటికి మరికొన్ని ఆప్షన్లు వచ్చే వీలుందని తెలుస్తోంది. ఆప్షన్లు ఇచ్చిన వాళ్లలో 78 శాతం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచీకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికీ కంప్యూటర్ సైన్స్ సీట్లు పెరుగుతాయనే విద్యార్థులు భావిస్తున్నారు. పెరిగే సీట్లపై అధికారులు స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని, అప్పుడే ర్యాంకును బట్టి ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. -
సీట్లు పెరిగినా.. సీఎస్‌ఈకే డిమాండ్
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈసారి సీట్లు భారీగా పెరిగాయి. ఇప్పటివరకూ రెండు దశల కౌన్సెలింగ్ చేపట్టారు. వీటిల్లో 59,917 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. గత ఏడాది 57,152 సీట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో పోలిస్తే ఈ సంవత్సరం 2,765 సీట్లు పెరిగాయి. ఐఐటీల్లో స్వల్పంగా సీట్లు పెరిగితే, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ప్రభుత్వ నిధులతో నడిచే జాతీయ కాలేజీల్లో కొత్త కోర్సులను చేర్చారు. వీటిల్లోనూ ఎక్కువగా కంప్యూటర్ సైన్స్ కోర్సులే ఉన్నాయి. మరికొన్ని కోర్సులకు అనుమతి రావాల్సి ఉంది. కొన్ని జాతీయ కాలేజీల్లో కొత్త కోర్సులతో ప్రత్యేక సెక్షన్లు ఏర్పాటు చేసే వీలుంది. దీంతో ఆఖరి దశ కౌన్సెలింగ్ నాటికి మరికొన్ని సీట్లు అందుబాటులోకి వచ్చే వీలుంది. దీనిపై త్వరగా నిర్ణయం వెల్లడించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒకవైపు సీట్లు పెరిగినా... ప్రధాన కాలేజీల్లో డిమాండ్ మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోసం అన్ని ప్రాంతాల్లోనూ విద్యార్థులు పోటీ పడుతున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు సంపాదించిన వారి మధ్య కూడా ఈసారి పోటీ కన్పిస్తోంది. జాతీయ స్థాయిలో డిమాండ్ జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ)కు భారీగా డిమాండ్ కని్పస్తోంది. జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్‌లో ఇది స్పష్టంగా కన్పిస్తోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ఎక్కువ మంది సీఎస్‌ఈకే దరఖాస్తు చేశారు. గత ఏడాది కన్నా కటాఫ్ పెరిగినప్పటికీ టాప్ కాలేజీల్లో పోటీ మాత్రం ఈసారి కాస్త ఎక్కువగానే కని్పస్తోంది. వాస్తవానికి దేశంలోని 23 ఐఐటీల్లో గత ఏడాది 17,385 ఇంజనీరింగ్ సీట్లు ఉంటే, ఈ సంవత్సరం 17,740 సీట్లు అందుబాటులోకి వచ్చాయి.జాతీయ కాలేజీల్లోనూ ఈసారి కొన్ని కొత్త కోర్సులను ప్రవేశ పెడుతున్నారు. వీటిల్లో కొన్నింటికి అనుమతులు రాగా.. మరికొన్నింటికి రావాల్సి ఉంది. ఆఖరి దశ కౌన్సెలింగ్ వరకూ ఎన్ఐటీల్లో సీట్లు పెరిగే వీలుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం 121 విద్యాసంస్థల్లో ఈ ఏడాది 59,917 సీట్లు భర్తీ చేయబోతున్నారు. ఇప్పటికే రెండు దశల కౌన్సెలింగ్ పూర్తికాగా, మరో మూడు దశలు ఉంది. టాప్ కాలేజీల్లోనూ... దేశంలోని ప్రధాన ఐఐటీలు, ఎన్ఐటీల్లో కంప్యూటర్ సైన్స్‌కు పోటీ ఎక్కువగా ఉంది. అయితే, దూర ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో పెద్దగా పోటీ కన్పించలేదు. ఈ ప్రాంతాల్లో లక్షల్లో ర్యాంకులు వచి్చన వాళ్లకూ సీట్లు దక్కుతున్నాయి. తిరుపతి ఐఐటీలో సీట్లు ఈసారి 244 నుంచి 254కు పెరిగాయి. అయితే, సీఎస్ఈ ఓపెన్ కేటగిరీలో బాలురకు 4,522, బాలికలకు 6,324 ర్యాంకు వరకే సీట్లు వచ్చాయి. ఈసారి ఇక్కడ నాలుగేళ్ల ఇంజనీరింగ్ ఫిజిక్స్ కోర్సును అందుబాటులోకి తెచ్చారు. అయినప్పటికీ సీఎస్ఈ వైపే పోటీ కని్పంచింది. వరంగల్ ఎన్ఐటీలో కూడా సీట్లు 989 నుంచి 1049కు పెరిగాయి. ఇక్కడ 60 సీట్లతో ఏఐ అండ్ డేటా సైన్స్ కోర్సును ప్రవేశ పెట్టారు.అయితే, సీఎస్ఈకి ఇక్కడ బాలురకు ఓపెన్ కేటగిరీలో 201, బాలికలకు 3,527 ర్యాంకు వరకే సీట్లు వచ్చాయి. ఐఐటీ గాం«దీనగర్‌లో 288 నుంచి 370కు గత ఏడాదే పెంచారు. ఈసారి కొత్తగా 30 సీట్లు అదనంగా ఇచ్చారు. ఇక్కడ కూడా 90 శాతం మంది సీఎస్‌ఈకే దరఖాస్తు చేశారు. ఐఐటీ బాంబే 1,358 నుంచి 1,368కి, ధార్వాడ్‌లో 310 నుంచి 385కు, భిలాయ్‌లో 243 నుంచి 283కు, భువనేశ్వర్‌లో 476 నుంచి 496కు, ఖరగ్‌పూర్‌లో 1,869 నుంచి 1,889కి, జోథ్‌పూర్‌లో 550 నుంచి 600కు, పట్నాలో 733 నుంచి 817కు, గువాహటిలో 952 నుంచి 962కు సీట్లు పెరిగాయి. ఈ పెరిగిన సీట్లతో పోలిస్తే సీఎస్సీ కోసం పోటీ పడిన విద్యార్థుల సంఖ్య రెట్టింపు కన్పిస్తోంది. -
జోసా కౌన్సెలింగ్‌లో జోష్
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపులో ఈ ఏడాది భారీ మార్పు కన్పిస్తోంది. గత ఏడాది కన్నా ఈసారి కటాఫ్ బాగా పెరిగింది. దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో సీట్ల భర్తీకి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ చేపట్టింది. ఇందులో భాగంగా గురువారం తొలిదశ సీట్లు కేటాయించింది. అయితే ఈసారి ఐఐటీల్లో 900 సీట్లు అదనంగా పెరిగాయి. దీంతో సీట్ల కేటాయింపు కటాఫ్ పెరిగింది. ముంబై ఐఐటీలో బాలికల విభాగంలో గత ఏడాది 305 ర్యాంకుకు సీటు వస్తే, ఈసారి 421వ ర్యాంకు కూడా సీటు వచ్చింది. హైదరాబాద్ ఐఐటీలో బాలుర విభాగంలో 585 ర్యాంకుకు సీటు వస్తే, ఈసారి 649 ర్యాంకు వరకూ సీటు వచ్చింది. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీ (నిట్)ల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగింది. వరంగల్ నిట్‌లో బాలుర విభాగంలో 1664 ర్యాంకుకు గత ఏడాది సీటొస్తే, ఈసారి 2698 ర్యాంకుకు సీటు వచ్చింది. బాలికల విభాగంలో పోయినసారి 3593 ర్యాంకుకు సీటొస్తే, ఈసారి 4625 ర్యాంకుకు కూడా సీటు వచ్చింది. ఇక ఏపీ నిట్‌లో బాలికల విభాగంలో గత ఏడాది 17873 కటాఫ్ ఉంటే, ఈసారి ఇది 23130కి పెరిగింది. జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన వారికి ఐఐటీలు మినహా అన్ని జాతీయ కాలేజీల్లో ర్యాంకును బట్టి సీటు కేటాయిస్తారు. ఐఐటీల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా సీట్లు ఇస్తారు. జోసా మొత్తం ఐడు రౌండ్ల కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. ముంబై ఐఐటీలోనే టాపర్లుజేఈఈ అడ్వాన్స్‌డ్‌లో టాప్ ర్యాంకులు పొందిన విద్యార్థుల్లో ఎక్కువ మంది ముంబై ఐఐటీకే ప్రాధాన్యమిచ్చారు. టాపర్లంతా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వైపే మొగ్గు చూపారు. ఓపెన్ కేటగిరీలో ముంబై ఐఐటీలో తొలి ర్యాంకు మొదలుకుని 68వ ర్యాంకు వరకూ సీట్లు వచ్చాయి. బాలికల విభాగంలోనూ 7వ ర్యాంకు సహా 421వ ర్యాంకు వరకూ సీట్లు పొందారు. తర్వాత స్థానంలో ఢిల్లీ ఐఐటీ ఉంది. ఇక్కడ 116లోపు ర్యాంకు వరకూ సీట్లు దక్కాయి. కాన్పూర్ ఐఐటీలోనూ పోటీ ఎక్కువగానే ఉంది. ఓపెన్ కేటగిరీలో 226 ర్యాంకుతో ప్రారంభమై 414 ర్యాంకుతో ముగిసింది. హైదరాబాద్ ఐఐటీలో సీఎస్సీ ఓపెన్ కేటగిరీలో 431వ ర్యాంకుతో మొదలై 649వ ర్యాంకు వరకూ సీట్లు వచ్చాయి. చివరి కౌన్సెలింగ్ వరకు చూడాలి గత కొన్నేళ్ళతో పోలిస్తే ఈసారి జోసా కౌన్సెలింగ్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. కటాఫ్ ఊహించని విధంగా పెరిగింది. సీట్లు పెరగడమే దీనికి కారణం. విద్యార్థులు చివరి కౌన్సెలింగ్ వరకూ వేచి చూస్తే తప్పకుండా మంచి అవకాశాలు రావచ్చు. రెండో దశ కౌన్సెలింగ్ నుంచి ఆప్షన్లు ఇచ్చే ముందు సీట్ల కేటాయింపుపై కొంత కసరత్తు చేయాలి. – ఎంఎన్ రావు (గణిత శాస్త్ర నిపుణులు) -
విద్యా వ్యవస్థలో మరో విప్లవం
రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థికి కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలన్న సంకల్పంతో సీఎం జగన్ విభిన్న ప్రాజెక్టులతో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు సుకొస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో పునాది స్థాయిలోనే కంప్యూటర్ విద్యను అందిస్తే.. భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే యువతగా విద్యార్థులు తలెత్తుకొని జీవించగలరనే నమ్మకంతో మరో కీలక ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అమెజాన్ ఇండియాతో జతకడుతూ ‘అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ ప్రోగ్రాం’ కింద వరుసగా రెండో ఏడాది కూడా ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర జిల్లాల విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి కంప్యూటర్ సైన్స్ పాఠాలు పాఠశాల స్థాయిలో 6వ తరగతి నుంచి బోధించేందుకు అడుగులు పడనున్నాయి. వెనక బాటు జిల్లాలుగా ఉన్న ఈ ప్రాంత భవిష్యత్తు సార థులైన విద్యార్థులకు ప్రభుత్వం ఈ గొప్ప అవకాశం కల్పిస్తోంది. 2024–25 విద్యా సంవత్సరం నాటికి 10 వేల మంది ఏపీ విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్ విద్యతో సాధికారత కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమెజాన్ ఇండియాతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. 2026–27 నాటికి సంపూర్ణంగా ఈ ప్రయోజనాలను లక్ష మందికి అందించాలన్నదే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఇందులో భాగంగా విజయవాడలో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి, సమగ్రశిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు సమక్షంలో ఒప్పంద సంతకాలు జరిగాయి. రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రపంచ బ్యాంకు భాగస్వామ్యంతో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన ఈ బృహత్తర కార్యానికి అనేక సంస్థలు మందుకువచ్చాయి. అమెజాన్ ఇండియా ఫండ్స్, సమగ్ర శిక్షతో పాటు ప్రపంచబ్యాంక్ టెక్నికల్ సపోర్ట్ సిస్టమ్, లీడర్షిప్ ఫర్ ఈక్విటీ, క్వెస్ట్ అలయన్స్ అనే ఎన్జీవో ఇందులో ఉన్నాయి. వీరందరి భాగస్వామ్యంతో ఉత్తరాంధ్ర విద్యార్థుల భవితను తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. ‘కంప్యూటేషనల్ థింకింగ్ అండ్ 21 సెంచరీ స్కిల్స్’పై శిక్షణా కార్యక్రమం ద్వారా తరగతి గదుల్లో కంప్యూటర్ సైన్స్ పాఠ్యాంశాలను సమర్థవంతంగా అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. కేవలం విద్యార్థులకే కాకుండా ఉపాధ్యాయులకు కూడా బోధన, సాంకేతిక, నాయకత్వ నైపుణ్యాలపై శిక్షణ ఇస్తారు. 10 వేల మంది నుంచి లక్ష వరకూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు కంప్యూ టర్ సైన్స్ పాఠ్యాంశాలు సులువుగా అర్థమయ్యేలా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. పైలట్ ప్రాజెక్టు కింద ఉత్తరాంధ్రలో 10 వేల మంది విద్యార్థులకు ఈ తరగతులు అందుబాటులోకి రానున్నాయి. ఏపీలో లక్ష మందికి ఈ విద్యను చేరువ చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఎస్సీఈఆర్టీతో కలిసి పాఠశాలల్లో కంప్యూటేషనల్ థింకింగ్ క్లబ్‌లు ఏర్పాటు చేయనుంది. విద్యార్థులకు కంప్యూటర్ సై న్స్ పాఠాల బోధన, ప్రాక్టికల్‌గా శిక్షణ ఇలా విభిన్న అంశాల్లో తరగతులు నిర్వహించి పిల్లల్ని నిష్ణాతుల్ని చేయనుంది. ఎక్సలెన్స్ కోర్సుల అనుసంధానం కంప్యూటర్ సైన్స్ టీచింగ్ ఎక్సలెన్స్ కోర్సులను అనుసంధానం చేయడం ద్వారా డిజిటల్ యుగానికి అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు అందించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సాంకేతిక విద్యను చేరువ చేస్తున్నాం. దీనివల్ల విద్యార్థుల ఉన్నత చదువులకు ఈ ప్రోగ్రాం ఒక పునాదిలా మారుతుంది. – బి.శ్రీనివాసరావు, సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ ప్రతి విద్యార్థికి అవకాశం అమేజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులందరినీ సాంకేతిక విద్యను చేరువ చేయాలన్నదే అమేజాన్ ఇండియా లక్ష్యం. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో అడుగులు వేస్తున్నాం. విద్యార్థులకు వారి కెరీర్లకు అవ సరమైన నైపుణ్యాల్ని అందిస్తాం. బెస్ట్ కెరీర్‌కు కంప్యూటర్ సైన్స్ విద్య ఎంతో దోహద పడు తుంది. రెండేళ్లలో దేశ వ్యాప్తంగా 1.5 మిలి యన్ మంది విద్యార్థులకు, 8 వేల మంది టీచర్లకు కంప్యూటర్ సైన్స్ విద్య అందించాం. – అక్షయ్ కశ్యప్, అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ ఇండియా లీడర్ -
ప్రభుత్వ బడికి ఫ్యూచర్ స్కిల్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల్లో ఓవైపు నైపుణ్యాభివృద్ధిని పెంపొందిసూ్తనే.. మరోవైపు వారిని ‘ఫ్యూచర్ స్కిల్ ఎక్స్పర్ట్స్’గా వినియోగించుకునేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ మేరకు బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అవకాశం ఇవ్వనున్నారు. వీరికి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్న్‌షిప్‌కు అవకాశం కల్పిస్తూ నెలకు రూ.12 వేల స్టైఫండ్ ఇవ్వాలని అధికారులు తాత్కాలికంగా ప్రతిపాదించారు. ఆయా కోర్సులు అభ్యసిస్తున్నవారితో హైస్కూళ్ల విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆధునిక సాంకేతిక వినియోగంపై శిక్షణ అందించనున్నారు. ఈ మేరకు ఏడాది పొడవునా ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఫ్యూచర్ స్కిల్ ఎక్స్పర్ట్స్’ సేవలు అందేలా పాఠశాల విద్యాశాఖతో కలిసి ఉన్నత విద్యా మండలి సంయుక్త కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ), మెకానికల్ బ్రాంచ్ విద్యార్థులను పరిశీలిస్తారు. ఇంటర్న్‌షిప్‌కు వచ్చే దరఖాస్తులను బట్టి రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేయాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ఈ ప్రోగ్రామ్‌ను జనవరి నుంచి అమలు చేసేలా కసరత్తు చేస్తోంది. వర్చువల్ విధానంలో మరో ఇంటర్న్‌షిప్.. రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ హైస్కూల్‌ను సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలతో జత చేయనున్నారు. ఇప్పటికే కళాశాలల మ్యాపింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. హైస్కూల్లో ఇంటర్న్‌గా చేసూ్తనే వర్చువల్ విధానంలో కూడా మరో ఇంటర్న్‌షిప్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు. భవిష్యత్తులో బోధన రంగంలో రాణించాలనుకునే వారికి, జాబ్ మార్కెట్ ఓరియెంటెడ్ కోర్సులు నేర్చుకోవాలనుకునే వారికి రెండు విధాల ఇంటర్న్‌షిప్ ఉపయోగపడనుంది. వాస్తవానికి విద్యార్థి దశలోనే ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాన్ని సాధించడానికి ప్రభుత్వం ఉన్నత విద్యలో ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ప్రతి విద్యార్థి తమ కోర్సు చివరి ఏడాదిలో ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఏటీఎల్ మెంటార్షిప్.. ‘ఉన్నత విద్యలో కమ్యూనిటీ సర్వీస్’ ప్రాజెక్టు కింద ఇంజనీరింగ్ విద్యార్థులు ఇప్పటికే హైస్కూల్ బాటపడుతున్నారు. రెండు నెలల ఈ ప్రాజెక్టులో భాగంగా హైస్కూళ్లలో ‘అటల్ టింకరింగ్ ల్యాబ్‌్స (ఏటీఎల్)’కు మెంటార్షిప్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలోనే 577 హైస్కూళ్లలో ఏటీఎల్స్ను ఏర్పాటు చేసింది. కానీ, గత టీడీపీ ప్రభుత్వం వాటిని నిరుపయోగంగా వదిలేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘ఏటీఎల్’ అవసరాన్ని గుర్తించి వినియోగంలోకి తెచ్చింది. ఇందులో భాగంగానే ఆయా హైస్కూళ్లను ఇంజనీరింగ్ కాలేజీలతో మ్యాపింగ్ చేస్తోంది. వివిధ బ్రాంచ్‌ల విద్యార్థుల సహాయంతో ‘ఏటీఎల్’కు జీవం పోస్తోంది. ఐక్యరాజ్యసవిుతికి చెందిన యునిసెఫ్‌తో కలిసి పనిచేస్తున్న పూణే సంస్థ.. విజ్ఞాన్ ఆశ్రమ్‌కు చెందిన సోర్స్ పర్సన్స్‌తో ఎంపిక చేసిన ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చి మరీ ఏటీఎల్ ద్వారా పాఠశాల విద్యార్థులను నూతన ఆవిష్కరణల వైపు నడిపిస్తోంది. ఈ కోర్సుల్లోనే శిక్షణ.. ఫ్యూచర్ స్కిల్ ప్రోగ్రామ్‌లో భాగంగా విద్యార్థులకు ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్స్ (ఐవోటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), బ్లాక్‌చైన్ టెక్నాలజీ, వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), మెటావర్స్/వెబ్ 3.0, 3డీ మోడలింగ్ అండ్ ప్రింటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, బిగ్ డేటా/డేటా ఎనలిస్ట్, రోబోటిక్స్‌లో బేసిక్స్ బోధించనున్నారు. ఇందులో భాగంగానే ప్రత్యేక పాఠ్య ప్రణాళిక (కరిక్యులమ్)ను సైతం రూపొందిస్తున్నారు. దీని ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థుల సహాయంతో బేసిక్స్ నేర్పిసూ్తనే.. పాఠశాల ఉపాధ్యాయులకు డిజిటల్ పరికరాలపై విద్యా బోధన, హైçస్యూల్ విద్యార్థులకు ట్యాబ్స్ వినియోగంపై శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే కొత్త కంటెంట్ ఇన్స్టాల్ చేసి అందించనున్నారు. చదువుతో పాటే సంపాదన దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర విద్యార్థులు చదువుతో పాటే సంపాదించనున్నారు. ప్రభుత్వ హైస్కూళ్లలో స్టైఫండ్‌తో కూడిన ఇంటర్న్‌షిప్ ఓ గొప్ప మార్పునకు నాంది. అందుబాటులోని మానవ వనరుల సమర్థవంత వినియోగానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యావ్యవస్థలో చేపట్టిన విప్లవాత్మక మార్పులతోనే ప్రభుత్వ బడుల్లో డిజిటల్ లిటరసీ పెరుగుతోంది. పేదింటి విద్యార్థులు స్మార్ట్ ప్యానల్స్‌పై పాఠాలు వింటున్నారు. ట్యాబ్‌ల్లో పాఠాలు చదువుతున్నారు. వీటి ద్వారా మరింత నాణ్యమైన సాంకేతిక పాఠాలను నేర్పించేందుకు ఇంజనీరింగ్ విద్యార్థులను హైస్కూళ్లలో ఇంటర్న్‌షిప్‌నకు ఆహ్వానిస్తున్నాం. తద్వారా పాఠశాలల్లోని కంప్యూటర్ ల్యాబ్స్, ఏటీఎల్స్ పూర్తిస్థాయిలో పనిచేస్తాయి. – ఆచార్య హేమచంద్రారెడ్డి, చైర్మన్, ఉన్నత విద్యా మండలి -
కొత్త కోర్సులు సరే.. ఫ్యాకల్టీ ఎక్కడ?
రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ కోర్సులపై యూనివర్సిటీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. కొత్తగా వచ్చిన కోర్సులకు సంబంధించిన అధ్యాపకుల వివరాలు తెలియజేయాలని కాలేజీలకు సూచిస్తున్నాయి. కొన్ని కాలేజీల్లో పెరిగిన సీట్లకు సరిపడా ఫ్యాకల్టీ లేదని, సంబంధిత సబ్జెక్టుల్లో నైపుణ్యం ఉన్న వారు అస్సలు లేరని పలు సంఘాల నుంచి ఫిర్యాదులొచ్చిన నేపథ్యంలో ఈ చర్యలకు ఉపక్రమించడం గమనార్హం. మరోవైపు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) సైతం కంప్యూటర్ కోర్సుల్లో నాణ్యత పెంచాలని సూచించింది. వివిధ రంగాల నుంచి నిపుణులను బోధకులుగా తీసుకోవాలని తెలిపింది. వాస్తవానికి అనుబంధ గుర్తింపు ఇచ్చే సమయంలో ఇలాంటి వాటిపై యూనివర్సిటీలు దృష్టి సారించాయి. అయితే, తమకు కొంత సమయం కావాలని, సీట్లు పెరిగిన తర్వాత అర్హత గల అధ్యాపకులను నియమించుకుంటామని కాలేజీలు తెలిపాయి. కానీ ఇది ఆచరణలో కనిపించడం లేదని యూనివర్సిటీ అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. –సాక్షి, హైదరాబాద్ భారీగా పెరిగిన సీట్లు ఈ విద్యా సంవత్సరంలో కంప్యూటర్ సైన్స్ కోర్సులు భారీగా పెరిగాయి. వందకుపైగా కాలేజీలు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో డిమాండ్ లేదని గుర్తింపు ఇచ్చే వర్సిటీలకు తెలిపాయి. వీటిని తగ్గించి, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్ వంటి బ్రాంచీల్లో సీట్లు పెంచుకున్నాయి. నిజానికి ఈ ఏడాది కొత్తగా కంప్యూటర్ సైన్స్ కోర్సులో 7,635 సీట్లు మంజూరయ్యాయి. డిమాండ్ లేని కోర్సులను రద్దు చేసుకోవడం వల్ల మరో 6,390 సీట్లు అదనంగా మార్పిడి రూపంలో పెరిగాయి. ఈ విధంగా 14,565 సీట్లు కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ విభాగాల్లో అదనంగా వచ్చి చేరాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి బ్రాంచీలను బోధించే వారు అవసరమైన మేర ఉన్నారు. కానీ కొత్తగా వచ్చిన కంప్యూటర్ కోర్సులను బోధించే అనుభవజు్ఞల కొరత రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీలను వేధిస్తోంది. సరైన ఫ్యాకల్టీ లేకపోవడంతో సీఎస్ఈ బ్రాంచీలో బోధించే వారినే కొత్త కోర్సులకు వాడుతున్నారు. వారికి అవసరమైన శిక్షణ కూడా ఇవ్వకపోవడంతో కొత్త కోర్సుల్లో బోధన నాణ్యత లోపిస్తోందని కాలేజీ అధ్యాపక సంఘా నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అనుభవంపై ఆరా కొత్త కోర్సుల్లో మాస్టర్ డిగ్రీ చేసిన వారితోనైనా బోధించేలా చూడాలని యూనివర్సిటీలు కోరుతున్నాయి. ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ విభాగాల్లో కంప్యూటర్ కోర్సులు చేసిన వాళ్లు అధ్యాపకులుగా పనిచేయడానికి ముందుకు రావడం లేదు. వారంతా సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డారు. ఈ కారణంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ) బోధించే అధ్యాపకులున్న కాలేజీల్లో అదనపు కొత్త సబ్జెక్టులనైనా ప్రొఫెషనల్స్‌తో బోధించేందుకు ప్రయత్నించాలని వర్సిటీలు సూచిస్తున్నాయి. ఎంఎస్, ఇతర మాస్టర్ డిగ్రీలు చేసి, కనీసం అయిదేళ్లుగా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న వారితో బోధన సమంజసమని యూనివర్సిటీలు భావిస్తున్నాయి. ఇలాంటి మార్పు ఎన్ని కాలేజీలకు అవసరమనేది క్షేత్రస్థాయి కాలేజీల వివరాలు పరిశీలించాక ఓ అవగాహనకు వచ్చే వీలుందని ఓ యూనివర్సిటీ వీసీ తెలిపారు. కొత్త కోర్సులను నిర్వహిస్తున్న కొన్ని కాలేజీలను దసరా తర్వాత ప్రత్యక్షంగా పరిశీలించి, నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. -
ఇంజినీర్ విద్యార్ధి ఏఐ టెక్నాలజీ.. అమెరికన్ సైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్‌లోకి..
మనిషి అనుకుంటే సాధించలేనిది లేదని పుస్తకాల్లో చదువుకున్నాం. బుర్రకు పదునుపెడితే మనిషి మహానుభావుడవుతాడు.. తద్వారా గొప్ప అద్భుతాలను సృష్టిస్తాడు. దీనికి నిదర్శనమే వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VIT) విద్యార్ధి 'ప్రియాంజలి గుప్తా'. ఈమె గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VIT) విద్యార్ధి 'ప్రియాంజలి గుప్తా' కంప్యూటర్ సైన్స్ చదువుతోంది. ఈమె అమెరికన్ సైన్ లాంగ్వేజ్‌ని రియల్ టైమ్‌లో ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేసే ఒక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) రూపొందించింది. డేటా సైన్స్‌లో నైపుణ్యం కలిగి ప్రియాంజలి టెన్సార్‌ఫ్లో ఆబ్జెక్ట్ డిటెక్షన్ APIని ఉపయోగించి కొత్త మోడల్‌ను అభివృద్ధి చేసింది. ఇది ssd_mobilenet అనే ప్రీ-ట్రైన్డ్ మోడల్ ద్వారా సంకేతాలను అనువదించగలదు. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదీ చదవండి: ఎక్స్(ట్విటర్)లో మరో అప్డేట్? ఎలాన్ మస్క్ కొత్త వ్యూహం! వీడియోలో గమనించినట్లయితే.. తాను రూపొందించిన ఏఐ డెమోలో ఆరు సంజ్ఞలను ప్రదర్శించింది. అవి హలో, ఐ లవ్ యు, ప్లీజ్, యస్, నో, థాంక్స్ వంటివి ఉన్నాయి. భవిషత్తులో మరిన్ని సంజ్ఞలు రూపొంచే అవకాశం ఉంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కారు కొడుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. Priyanjali Gupta, Indian student from VIT university, Tamil Nadu has developed an algorithm that instantly translates sign language. 👏 pic.twitter.com/jvF1i1xTeA — Indian Tech & Infra (@IndianTechGuide) September 18, 2023 -
19 వేల సీట్లకు 17 నుంచి కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ సీట్లు ఇంకా 19,049 మిగిలాయి. ఆదివారం మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ లెక్క తేలినట్టు సాంకేతిక విద్య విభాగం వెల్లడించింది. ఇందులో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సీట్లు 3,034 వరకూ ఉన్నాయి. ఈసారి సంప్రదాయ కోర్సులైన సివిల్, మెకానికల్ సీట్లను అన్ని కాలేజీలు ముందే భారీగా తగ్గించుకున్నాయి. ఈ బ్రాంచీల్లో మొత్తం 7 వేల సీట్లకు కోత పడింది. ఈ మేరకు కంప్యూటర్ సైన్స్ దాని అనుబంధ కోర్సుల్లో సీట్లు పెరిగాయి. ఇవి కాకుండా మరో 7 వేల వరకూ కొత్తగా కంప్యూటర్ సైన్స్ సంబంధిత బ్రాంచీల్లో సీట్లు పెరిగాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కన్వినర్ కోటా కింద 83,766 ఇంజనీరింగ్ సీట్లు ఉంటే, ఇందులో కంప్యూటర్ సైన్స్ కోర్సులే 56,811 ఉన్నాయి. ఈ విధంగా కంప్యూటర్ బ్రాంచీల్లో సీట్లు పెరగడంతో టాప్ 20 కాలేజీల్లో సీట్లు వంద శాతం భర్తీ అయ్యాయి. అంతగా పేరులేని, గ్రామీణ ప్రాంతాలకు చేరువలో ఉండే కాలేజీల్లో మాత్రం కంప్యూటర్ కోర్సుల్లో కూడా సీట్లు మిగిలిపోయాయి. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రాకల్స్, సివిల్, మెకానికల్ బ్రాంచీల్లో సీట్లు తక్కువే (కాలేజీలు తగ్గించుకోవడం వల్ల) ఉన్నప్పటికీ, చివరకు వాటిల్లోనూ భారీగా సీట్లు మిగిలాయి. ఇలా మిగిలిపోయిన సీట్లకు ఈ నెల 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. -
కంప్యూటర్ సైన్స్‌లో పెరిగాయ్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీ లలో కంప్యూటర్ సైన్స్ కోర్సులకు సంబంధించిన సీట్లు భారీగా పెరిగాయి. ప్రైవేటు కాలేజీల విజ్ఞప్తి మేరకు పెద్దగా డిమాండ్ లేని బ్రాంచీల నుంచి ఇతర బ్రాంచీలకు 7,635 సీట్లను మార్చగా.. అద నంగా 6,930 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో చాలా వరకు కంప్యూటర్ సైన్స్ బ్రాంచీలకు సంబంధించిన సీట్లేకావడం గమనార్హం. మొత్తంగా డిమాండ్ ఉన్న బ్రాంచీలకు సంబంధించి ఈసారి (2023–24) కొత్తగా 14,565 ఇంజనీరింగ్ సీట్లను ఎంసెట్ కౌన్సెలింగ్‌లో చేర్చుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన సీట్లలో దాదాపు 10,195 సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. ఇలా ఇంజనీరింగ్‌లో సీట్ల పెంపుతో రూ.27.39 కోట్ల మేర అదనంగా ఫీజు రీయింబర్స్మెంట్ భారం పడుతుందని ప్రభుత్వం పేర్కొంది. విద్యార్థుల నుంచి డిమాండ్ లేని బ్రాంచీలు, సీట్లు రద్దు చేసుకుని.. ఆ మేర డిమాండ్ ఉన్న కోర్సుల్లో పెంచుకోవడానికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఇటీవల అనుమతించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వందకుపైగా కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. సుమారు 50కిపైగా కాలేజీలు సీఎస్సీ, ఇతర కంప్యూటర్ కోర్సుల్లో భారీగా సీట్లు పెంచుకున్నాయి. మొత్తం 1.15 లక్షలకు చేరిన సీట్లు.. రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశ ఎంసెట్ కౌన్సెలింగ్‌లో 66,112 సీట్లను అందుబాటులో పెట్టారు. తాజాగా పెరిగిన సీట్లను కూడా చేరిస్తే ఈ సంఖ్య 80,677 సీట్లకు పెరుగుతోంది. యాజమాన్య కోటా సీట్లనూ కలిపితే రాష్ట్రంలో 1.15 లక్షల ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్‌తోపాటు మరికొన్ని కంప్యూటర్ కోర్సుల్లో గత సంవత్సరం 41,506 సీట్లు అందుబాటులో ఉండగా.. ఈసారి 56 వేల వరకూ చేరనున్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌తోపాటు ఇతర బ్రాంచీల్లో గత ఏడాది 29,780 సీట్లు ఉండగా.. ఈసారి 22,145 సీట్లకు తగ్గిపోనున్నాయి. ఎంసెట్ షెడ్యూల్లో మార్పు ఇప్పటికే ఎంసెట్ మొదటి విడత కౌన్సెలింగ్ చివరి దశకు చేరకుంది. ఈ నెల 12న సీట్ల కేటా యింపు జరగాల్సి ఉంది. కొత్త సీట్లకు అనుమతి ఇవ్వడంతో.. వాటిని అందుబాటులోకి తెచ్చేందుకు ఎంసెట్ షెడ్యూల్లో మార్పులు చేశారు. దీని ప్రకారం ఈ నెల 8 వరకూ అభ్యర్థులు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. 9న సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 12 వరకు ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం కల్పించారు. ఈ నెల 16న సీట్ల కేటాయింపు చేపడతారు. సీటు వచ్చిన అభ్యర్థులు ఈ నెల 22వ తేదీలోగా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రెండో దశ ఎంసెట్ కౌన్సెలింగ్ ఈ నెల 24 నుంచి మొదలవుతుంది. పెంపు మంచి నిర్ణయం.. ఇంజనీరింగ్ సీట్ల పెంపు నిర్ణయం ఆహ్వాని ంచదగ్గ పరిణామం. దీనివల్ల అదనంగా 10వేల మందికిపైగా సీట్లు పొందే అవ కాశం వస్తుంది. డిమాండ్ ఉన్న కోర్సుల్లో చేరాలనుకునే వారికి ఇది ప్రయోజనకరం. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఫ్యాకల్టీకి ఉద్యోగ భద్రత కల్పించాలి సంప్రదాయ బ్రాంచీల్లో సీట్లు తగ్గించడం వల్ల కొన్ని సెక్షన్లు రద్దవు తాయి. ఈ కారణంగా ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న అధ్యాపకులను తొలగించే ప్రమాదం ఉంది. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. అవసరమైతే వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి మిగతా బ్రాంచీల్లో బోధించే నైపుణ్యం కల్పించాలి. – వి.బాలకృష్ణ, సాంకేతిక, వృత్తి విద్యా ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
'పైసా మే హై పరమాత్మ'.. కంప్యూటర్ సైన్స్ వైపు విద్యార్ధుల చూపు!
కంప్యూటర్ సైన్స్ (సీఎస్) కారణంగా మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కోర్స్‌లు ఉనికిని కోల్పోతున్నాయా? అందుకు కారణాలేంటి? డబ్బు కోసమే సీఎస్‌లో చేరుతున్నారా? విద్యార్ధులు ఏమంటున్నారు? ఈ ఏడాది తొలి 100 ఐఐటీ ర్యాంకర్లలో 89 మంది ఐఐటి బాంబేలో చేరారు. వారిలో ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ (సీఎస్)ను చదివేందుకు మొగ్గుచూపారు. అందుకు కారణం! ‘ఆర్థిక స్థిరత్వం, ఆకర్షణీయమైన ఉద్యోగ అవకాశాలేనని ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అప్లైడ్ మెకానిక్స్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ తెలిపారు. అంతేకాదు, డబ్బే అన్నీంటికి మూలం ‘సివిల్ ఇంజనీర్లు, మెకానికల్ ఇంజనీర్లతో పోలిస్తే ఐటీ సంబంధిత విభాగాల్లో ఉద్యోగం చేస్తున్న కంప్యూటర్ ఇంజనీర్ల మధ్య జీతం వ్యత్యాసం చాలా ఉంది. సీఎస్ గ్రాడ్యుయేట్లకు ఐటీ పరిశ్రమలో విస్తృతమైన అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఈ అంశాన్ని విశ్లేషించేందుకు సీఎస్, ఐటీ విభాగాల్లోకి మారిన ఐఐటీ సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్ధులు అభిప్రాయాల్ని సేకరించగా.. గ్రాడ్యుయేట్లు వారి కెరీర్ మార్పు గురించి స్పష్టత ఇచ్చారు. ఈ సందర్భంగా 2021లో ఐఐటీ- గౌహతి సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి, ప్రస్తుతం ఐటీ జాబ్ చేస్తున్న షరీబ్ తస్నీమ్ మాట్లాడుతూ.. ‘సివిల్ ఇంజినీరింగ్ చదివి ఐటీ ఉద్యోగాలు చేయడానికి రెండు ప్రధాన కారణాలున్నాయని అన్నారు. ముందుగా, మెకానికల్, ఎలక్ట్రానిక్, సివిల్ వంటి ఇతర విభాగాలతో పోలిస్తే కంప్యూటర్ సైన్స్ చదివి సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్న వారి జీతాలు ఎక్కువగా ఉన్నాయి. రెండవది, సివిల్ ఇంజనీర్లను రిక్రూట్ చేసే కంపెనీలు చాలా తక్కువనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో పనిచేస్తున్న ఐఐటి-ఢిల్లి 2019-21 మెకానికల్ బ్రాంచ్‌కు చెందిన ఎంటెక్ విద్యార్థి రిషబ్ మిశ్రా మాట్లాడుతూ ‘కోర్ పరిశ్రమలలో తక్కువ అవకాశాలు, నాన్-కోర్ కంపెనీల్లో ఆకర్షణీయమైన వేతనాలున్నాయి. అందుకే నేనూ ఐటీ విభాగానికి షిఫ్ట్ అయ్యాను. మెకానికల్ నుండి కంప్యూటర్ సైన్స్ వరకు మెరుగైన అవకాశాల్ని అందించేది కంప్యూటర్ సైన్స్ రంగమేనని చెప్పారు. -
డిగ్రీకి డిమాండ్ పెరిగేనా?
విద్యార్థులను డిగ్రీ కోర్సుల వైపు మళ్లించేందుకు దేశవ్యాప్తంగా కసరత్తు జరుగుతోంది. ఇందులోభాగంగా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. మార్కెట్ అవసరాలకు అనువైన కోర్సులను తెస్తున్నారు. ఈ ఏడాది ఇంటర్మిడియెట్ 2.95 లక్షల మంది పాసయ్యారు. రాష్ట్రంలో 1.10 లక్షల ఇంజనీరింగ్ సీట్లుండగా, వీటిలో ఏటా 90 వేల మంది వరకు చేరుతున్నారు. మిగతా వాళ్లంతా డిగ్రీ వైపే మొగ్గు చూపుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు, ఇంజనీరింగ్‌తో సమానమైన కంప్యూటర్ సైన్స్, డేటాసైన్స్ కోర్సులను ఉన్నత విద్యామండలి తెస్తోంది. ఈ ఏడాది నుంచి 11 డిగ్రీ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్‌ను ఆనర్స్ కోర్సుగా అందిస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలు ఏమేరకు ఫలితాలిస్తాయన్నది వేచి చూడాలని, ఇది అనేక అంశాలపై ఆధారపడి ఉందని అధికారులు చెబుతున్నారు. - సాక్షి , హైదరాబాద్ రాష్ట్రంలో మొత్తం 1,073 డిగ్రీ కాలేజీలుండగా, 4,68,880 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏటా వీటిలో సగం కూడా భర్తీ అవ్వడం లేదు. దీంతో గత ఏడాది 3,86,544కు సీట్లను కుదించారు. అయినా భర్తీ అయినవి 2,12,818 మాత్రమే. ఈ నేపథ్యంలో అధికారులు ఈసారి మరో 82,336 సీట్లకు కోత పెట్టారు. కొత్త కోర్సులు పెట్టుకుంటే తప్ప సీట్లకు అనుమతించలేమని ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. కంప్యూటర్ సైన్స్, బీకాం కంప్యూటర్స్, డేటా సైన్స్ వంటి కోర్సులు కేవలం ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనే ఎక్కువగా పెడుతున్నారు. హైదరాబాద్ వంటి నగర ప్రాంతాల్లో ఉండే కాలేజీలు కొత్త కోర్సులను పెడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కాలేజీలు మాత్రం దీన్ని సాహసంగానే భావిస్తున్నాయి. కంప్యూటర్ కోర్సులు తెచ్చినా, అత్యధిక వేతనాలిచ్చి ఫ్యాకల్టీ సమకూర్చడం, మౌలిక వసతులు ఏర్పాటు చేయడం కష్టమనే ధోరణితో ఉన్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో కాలేజీల్లోని సీట్లు మిగిలిపోతున్నాయి. విద్యార్థులు కూడా ఇంటర్ తర్వాత రాజధాని బాట పడుతున్నారు. డిగ్రీతోపాటు ఉపాధి లభించే కొన్ని సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకోవచ్చనే యోచనతో ఉన్నారు. కారణాలేంటి? ♦ సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) అధ్యయనం ప్రకారం రాష్ట్రంలో పేద, మధ్య తరగతి విద్యార్థులు చాలా వరకూ డిగ్రీ తర్వాత ఏదో ఒక ఉపాధిని ఎంచుకుంటున్నారు. కరోనా తర్వాత ఈ పరిస్థితి స్పష్టంగా కన్పిస్తోంది. ♦ ఇంజనీరింగ్‌లో సాఫ్ట్వేర్ రంగంలో సులభంగా స్థిరపడొచ్చని విద్యార్థులు భావిస్తున్నారు. దీంతో సీఎస్ఈ, ఇతర కంప్యూటర్ సైన్స్ కోర్సుల వైపు వెళ్తున్నారు. గత ఐదేళ్లలో 90 శాతం విద్యార్థుల కౌన్సెలింగ్ ఆప్షన్లు ఈవిధంగానే ఉన్నాయి. ♦ డిగ్రీలో కామర్స్ వైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అకౌంటింగ్‌తోపాటు, కంప్యూటర్ కోర్సులూ దీనికి అనుసంధానమై ఉన్నాయి. దీంతో ప్రైవేటు సెక్టార్లో డిగ్రీ తర్వాత స్థిరపడే వీలుందని భావిస్తున్నారు. గత ఏడాది దోస్త్‌లో కూడా 37 శాతం మంది విద్యార్థులు కామర్స్‌ను ఎంచుకున్నారు. ♦ లైఫ్ సైన్స్కూ ఓ మోస్తరు డిమాండ్ పెరుగుతోంది. కార్పొరేట్ సెక్టార్లో ఉపాధికి అవకాశాలున్నాయని విద్యార్థులు అంచనా వేస్తున్నారు. దీంతో 19 శాతం మంది లైఫ్ సైన్స్‌ను ఎంచుకుంటున్నారు. తర్వాత స్థానాల్లో ఆర్ట్స్, ఫిజికల్ సైన్స్ కోర్సులున్నాయి. డిమాండ్ పెరగొచ్చు ఈ ఏడాది కొత్త కోర్సులు తేవాలని అన్ని కాలేజీలకు చెప్పాం. డిమాండ్ లేని కోర్సుల్లో సీట్లు తగ్గించినా, డిమాండ్ ఉండే కోర్సుల్లో మార్పులు తెస్తే అనుమతిస్తాం. ఇంజనీరింగ్‌తో సమానంగా డిగ్రీ కోర్సులూ ఉపాధి మార్గాలు కావాలన్నదే మండలి లక్ష్యం. ఈ దిశగా గుణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం. డిగ్రీ కోర్సులకు మంచి ఆదరణ పెరుగుతుందనే విశ్వాసం ఉంది. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ కోర్సు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది నుంచి డిగ్రీలో కొత్తగా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సును ప్రవేశపెడుతున్నట్టు కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ ప్రకటించారు. ఇది ఇంజనీరింగ్‌లో సీఎస్సీ కోర్సుకు సమానమని తెలిపారు. గురువారం ‘దోస్త్’(డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ పేరుతో నాలుగేళ్ల ఆనర్స్ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. ప్రస్తుతానికి 11 ప్రభుత్వ డిగ్రీ, అటానమస్ కాలేజీలు ఈ కోర్సును ప్రవేశపెట్టేందుకు ముందుకొచ్చాయని, ఒక్కో కాలేజీలో 60 సీట్లతో అనుమతులిచ్చామని తెలిపారు. ఇదే తరహాలో ప్రైవేట్ కాలేజీలు ముందుకొస్తే వాటికీ అనుమతిస్తామన్నారు. కోర్సు ప్రత్యేకతలివీ... ► ప్రస్తుతానికి డిగ్రీలో బీఎస్సీ ఎంపీసీఎస్ (గణితం, ఫిజిక్స్, కంప్యూటర్) కోర్సును నిర్వహిస్తున్నారు. అంటే కంప్యూటర్ సిలబస్‌ను కేవలం ఒక సబ్జెక్టుగా చదువుతుండగా, ఇకపై ఏకంగా పూర్తిస్థాయి కంప్యూటర్ సైన్స్ కోర్సు అందుబాటులోకి వస్తుంది. ► ఈ కోర్సు సిలబస్, కరిక్యులం అంతా బీటెక్ సీఎస్ఈ కోర్సుతో సమానంగా ఉంటుంది. బీటెక్‌లో సీట్లు దక్కించుకోలేని వారు, ఎంసెట్‌కు హాజరుకాని వారు దోస్త్ ద్వారా ప్రవేశాలు పొందవచ్చు. ► విద్యార్థి కావాలనుకుంటే మూడేళ్లలోనే ఈ కోర్సు నుంచి వైదొలగవచ్చు. అప్పుడు ఆ విద్యార్థికి మూడేళ్ల డిగ్రీ పట్టా ఇస్తారు. ► నాలుగేళ్ల డిగ్రీ పూర్తిచేసే విద్యార్థులకు ఆనర్స్ డిగ్రీ పట్టాను జారీచేస్తారు. అమెరికా, యూకే అంతటా నాలుగేళ్ల యూజీ కోర్సులు ఉండగా, విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ కోర్సు ఉపయుక్తంగా ఉంటుంది. ► ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్‌ను బోధిస్తున్న అధ్యాపకులే బీఎస్సీ కంప్యూటర్‌సైన్స్ కోర్సుకు బోధిస్తారు. వారికి త్వరలోనే శిక్షణ ఇస్తారు. సెక్టార్ స్కిల్ కోర్సులు సైతం ఈ సంవత్సరం బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సుతోపాటు కొత్తగా సెక్టార్ స్కిల్ కౌన్సిల్ కోర్సులను సైతం ప్రవేశపెట్టనున్నారు. బీబీఏ రిటైలింగ్, బీఎస్సీ ఫిజికల్ సైన్స్, బీబీఏ–ఈకామర్స్ ఆపరేషన్స్, బీఏ కంటెంట్ అండ్ క్రియేటివ్ రైటింగ్, బీబీఏ లాజిస్టిక్స్ వంటి పూర్తిస్థాయి మూడేళ్ల డిగ్రీ కోర్సులను సైతం ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రవేశపెట్టనున్నారు. ఈ కోర్సులను సైతం ‘దోస్త్’ద్వారానే భర్తీచేస్తారు. -
ప్రమాణాల్లేకున్నా సీట్లు పెంచాలట! ఇంజనీరింగ్ కాలేజీల తీరిది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని చాలా ఇంజనీరింగ్ కాలేజీలు సంప్రదాయ కోర్సుల్లో సీట్లు తగ్గించుకొని డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లు ప్రవేశపెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే సరైన నాణ్యతా ప్రమాణాల్లేకుండానే డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్ల పెంపునకు దరఖాస్తు చేసుకున్నట్లు జేఎన్టీయూహెచ్ తాజా పరిశీలనలో వెల్లడైంది. పదేళ్ల నాటి కంప్యూటర్లు... జేఎన్టీయూహెచ్ పరిధిలో 145 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా వాటిల్లో దాదాపు 50 కాలేజీల్లో అన్ని సదుపాయాలున్నాయని అధికారులు చెబుతున్నారు. మిగిలిన కాలేజీలు సమర్పించిన సదుపాయాలకు సంబంధించిన వివరాలను పరిశీలించగా కంప్యూటర్ సైన్స్ కోర్సు బోధనకు కనీసం 10 మంది విద్యార్థులకు ఒక అత్యాధునిక కంప్యూటర్ ఉండాల్సి ఉండగా సెక్షన్ మొత్తానికి రెండు కంప్యూటర్లు కూడా లేవని తేలింది. అవి కూడా అతితక్కువ ప్రమాణాలతో ఉన్నాయని, సరికొత్త టెక్నాలజీ బోధించేందుకు ఏమాత్రం పనికి రావని అధికారులు గుర్తించారు. పదేళ్ల నాటి కాన్ఫిగరేషన్‌తో వాడే కంప్యూటర్లు కూడా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కంప్యూటర్ సైన్స్, డేటా అనాలసిస్, సైబర్ సెక్యూరిటీకి వాడే అత్యాధునిక సాఫ్ట్వేర్ రన్ కావడానికి ఉపకరించే ఆధునిక కంప్యూటర్ల స్థానంలో నాసిరకం వాటితోనే కాలేజీలు బోధన సాగిస్తున్నట్లు తేలింది. ఇక అధ్యాపకుల విషయానికొస్తే కంప్యూటర్ సైన్స్ వచ్చిన కొత్తలో ఉన్న వారే ఇప్పుడూ బోధకులుగా ఉన్నారు. వారు నైపణ్యాలను మెరుగుపరుచుకున్నట్లు ఎలాంటి ఆధారాలను యాజమాన్యాలు చూపలేదని తెలిసింది. ప్రతిరోజూ మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాలంటే ప్రముఖ కంపెనీల్లో అధ్యాపకులు శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఈ దిశగా ఎలాంటి కసరత్తు జరగలేదు. అన్ని సౌకర్యాలు, ఫ్యాకల్టీ ఉంటేనే గుర్తింపు.. ఈ నెల 18 నుంచి కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ప్రక్రియను మొదలుపెడతాం. ప్రతి కాలేజీని పూర్తిస్థాయిలో పరిశీలిస్తాం. నిబంధనల ప్రకారం అన్ని సౌకర్యాలు, ఫ్యాకల్టీ ఉంటేనే కాలేజీలకు గుర్తింపు ఇస్తాం. కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు పెంచాలని ఎక్కువ కాలేజీలే కోరుతున్నాయి. వాటి సామర్థ్యం, బోధన విధానాలను లోతుగా పరిశీలించే ఉద్దేశంతోనే ఈసారి అఫిలియేషన్ ప్రక్రియను ముందే చేపడుతున్నాం. – ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, జేఎన్టీయూహెచ్ వీసీ 78 కాలేజీల డొల్లతనం.. ఈసారి దాదాపు వంద ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు సీట్ల మార్పిడి కోసం దరఖాస్తు చేసుకున్నాయి. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా సివిల్‌లో 40 శాతం, మెకానికల్‌లో 35 శాతం, ఎలక్ట్రికల్‌లో 34 శాతం సీట్లు మాత్రమే భర్తీ కావడంతో ఈసారి ఆయా బ్రాంచీల్లో సెక్షన్లు, సీట్లు తగ్గించుకుంటామని కోరాయి. వాటి స్థానంలో సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ వంటి కోర్సుల్లో సీట్లు పెంచాలని విజ్ఞప్తి చేశాయి. అయితే ఆయా కాలేజీలు సమర్పించిన వివరాలను జేఎన్టీయూహెచ్ అధికారులు పరిశీలించగా ఎన్నో లోపాలు బయటపడ్డాయి. కంప్యూటర్ కోర్సులు కోరుతున్న వంద కాలేజీలకుగాను 78 కాలేజీల్లో అత్యాధునిక కంప్యూటర్లు లేవని, కంప్యూటర్ లాంగ్వేజ్‌పై పట్టున్న ఫ్యాకల్టీ లేదని తేలింది. -
ఊహించనివిధంగా సీఎస్సీ కటాఫ్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ జాతీయ ఇంజనీరింగ్ సంస్థల్లోనూ విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ (సీఎస్సీ) కోర్సులో చేరడానికి ఎక్కువగా మొగ్గుచూపిస్తున్నారు. తాజాగా ఐఐటీలు, ఎన్ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇతర విద్యా సంస్థల్లో జోసా నిర్వహించిన ఆరు రౌండ్ల కౌన్సెలింగ్‌లో ఇది స్పష్టమైంది. ప్రధాన ఐఐటీల్లో కంప్యూటర్ సైన్స్ కోర్సుల కటాఫ్ ర్యాంకులు ఊహించని విధంగా ఉన్నాయి. బాలికలకు సూపర్‌న్యూమరరీ సీట్లు కేటాయించడంతో వారి పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. ఓపెన్ కేటగిరీలో కొన్ని సంస్థల్లో వందలోపు ర్యాంకు వచ్చిన వారికి కూడా సీట్లు దక్కలేదు. ముంబై, కాన్పూర్, ఢిల్లీ ఐఐటీలలో పోటీ ఈసారి తీవ్రంగా ఉంది. పాలక్కడ్, భిలాయ్ ఐఐటీల్లో 5 వేల పైన ర్యాంకు వచ్చిన వారికీ సీటు దక్కడం విద్యార్థులకు కాస్తా ఊరటనిచ్చింది. ఎన్ఐటీల్లోనూ అదే జోరు.. జాతీయ ఇంజనీరింగ్ సంస్థల్లో (ఎన్ఐటీలు) ఈసారి కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సుకే డిమాండ్ కొనసాగింది. ఇతర బ్రాంచీలకన్నా సీఎస్సీ కోర్సులకు విద్యార్థులు 10 రెట్లు ఎక్కువగా ఆప్షన్లు ఇచ్చారు. అందులోనూ ఎన్ఐటీలను మొదటి ఐచ్చికంగా ఎంచుకున్నారు. దీంతో వరంగల్ నిట్‌లో ఓపెన్ కేటగిరీలో బాలురకు 2 వేల లోపు ర్యాంకు వరకే సీట్లు దక్కాయి. తిరుచనాపల్లిలో వెయ్యిలోపు ర్యాంకు వరకే సీట్లు వచ్చాయి. ఏపీ, కాలికట్, జలంధర్, సిక్కిం, హమీర్పూర్ ఎన్ఐటీల్లో 10 వేల పైబడ్డ ర్యాంకుల వరకు సీట్లు లభించాయి. బాలికలకు కొంత మెరుగు తాజాగా ఐఐటీ, ఎన్ఐటీలలో కటాఫ్ తీరును పరిశీలిస్తే బాలురకన్నా, బాలికల పరిస్థితి కాస్తా మెరుగ్గా కనిపించింది. ఆరు రౌండ్ల సీట్ల కేటాయింపు తర్వాత ముంబై ఐఐటీలో బాలికలకు 305 ర్యాంకు వరకూ సీటు వచ్చింది. తిరుపతిలో 5,901 వరకూ, భిలాయ్‌లో 7,176 వరకూ సీటు వచ్చింది. ఎన్ఐటీల విషయానికి వస్తే హమీర్పూర్ ఎన్ఐటీలో 18 వేల వరకూ కటాఫ్ ఉంటే, తిరుచనాపల్లిలో 1,852 బాలికల కటాఫ్‌గా ఉంది. దీంతో ఓపెన్ కేటగిరీలో బాలికలు సాధారణ పోటీతో సీట్లు దక్కించుకోవడం సాధ్యమైందని విశ్లేషకులు అంటున్నారు. కోవిడ్ తర్వాత జరిగిన జేఈఈ మెయిన్స్ పేపర్లు కఠినంగానే ఉన్నాయని చెబుతున్నారు. దీంతో ర్యాంకుల సాధనలోనూ ఈసారి పోటీ వాతావరణం కనిపించింది. -
కంప్యూటర్ సైన్స్ సీటు కోసం పోటాపోటీ
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 28న మొదలు కానున్న ఇంజనీరింగ్ రెండోవిడత కౌన్సెలింగ్‌లో విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ సీట్లు దక్కించుకునేందుకు ఎక్కువగా పోటీపడుతున్నారు. కన్వీనర్ కోటాతోపాటు మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం ఈసారి విపరీతమైన పోటీ కన్పిస్తోంది. చాలామంది తొలిదశ కౌన్సెలింగ్‌లో సీట్లు వచ్చినా, సీటు, కాలేజీ నచ్చని కారణంగా వదిలేసుకున్నారు. ఇలాంటివాళ్లు 17 వేలమంది వరకూ ఉన్నారు. ఇందులో చాలామంది కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సులను ఇష్టపడుతున్నారు. దీంతో రెండోవిడతలో సీటు వస్తుందనే ఆశతో ఉన్నారు. తాజాగా ప్రభుత్వం కంప్యూటర్ సైన్స్‌సహా పలు అనుబంధ కోర్సుల్లో 9,240 సీట్లకు అనుమతించింది. ఇది కూడా విద్యార్థులు ఆశలు రేకెత్తిస్తోంది. మరోవైపు ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలుకానుంది. ఇందులో సీటు వచ్చేవారు రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో కౌన్సెలింగ్ నుంచి తప్పుకునే అవకాశముంది. ఇది కూడా తమకు కలిసి వస్తుందని పలువురు విద్యార్థులు భావిస్తున్నారు. ఇదే సరైన సమయం... రాష్ట్రంలో తొలివిడత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు మొత్తం 71,286 సీట్లు కన్వీనర్ కోటా కింద సిద్ధంగా ఉండగా, 60,208 సీట్లు కేటాయించారు. విద్యార్థులు ఇచ్చిన ఆప్షన్ల మేరకు ఈ కేటాయింపు జరిగింది. ఈ నెల 13వ తేదీ నాటికి సీటు వచ్చినవారు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటే, కేవలం 43 వేల మంది మాత్రమే రిపోర్టింగ్ చేశారు. 17 వేలమంది సీటు వచ్చినా, అది తమకు నచ్చలేదని భావించారు. ఇలాంటివారిలో ఎక్కువమంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదా ఐటీ, ఆఖరుకు ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో సీట్లు ఆశపడుతున్నవారే ఉన్నారు. తొలిదశలో పెంచిన కంప్యూటర్ సైన్స్ కోర్సు సీట్లు 9,240 అందుబాటులోకి రాలేదు. అందుకే తమకు ఆశించిన సీటు రాలేదనే భావనతో వారు ఉన్నారు. 25 వేలలోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులు కూడా మెరుగైన కాలేజీ, సీటు కోసం తొలిదశలో వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టారు. కొంతమంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్(సీఎస్సీ)లో సీటు వచ్చినా, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, డేటా సైన్స్ వంటి కోర్సుల కోసం మొదటి విడతలో జాయిన్ అవ్వలేదు. మేనేజ్మెంట్కు పోటీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ సీట్లలో 30 శాతం మేనేజ్మెంట్ కోటా కింద ఉంటాయి. ఇందులో 15 శాతం ఎన్ఆర్ఐకి ఇవ్వాలి.నిబంధనలు ఎలా ఉన్నా, యాజమాన్యాలు నచ్చినవారికి, నచ్చిన రేటుకు అమ్ముకోవడం ఏటా జరిగే తంతే. కాలేజీని బట్టి కంప్యూటర్‌సైన్స్ సీట్ల రేట్లు రూ.10 నుంచి 16 లక్షల వరకూ పలుకుతున్నాయి. 40 వేలపైన ఎంసెట్ ర్యాంకు వచ్చినవారిలో చాలామంది మేనేజ్మెంట్లో కంప్యూటర్ సైన్స్ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. దీంతో సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, సీఎస్సీ కోర్సులకు డిమాండ్ బాగా కన్పిస్తోంది. ఈసారి ఆప్షన్లు కీలకమే రెండోవిడత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఈ నెల 28 నుంచి మొదలవుతుంది. తొలి విడత కన్నా, ఇది చాలా కీలకమైందని సాంకేతిక రంగం నిపుణులు అంటున్నారు. కొత్తగా 12 వేలకుపైగా సీట్లు పెరగడం, జేఈఈ ర్యాంకర్లు ఈసారి పోటీలో పెద్దగా ఉండకపోవడం వల్ల రాష్ట్రస్థాయి విద్యార్థులకు సానుకూలంగా ఉండే వీలుందని చెబుతున్నారు. 40 వేల లోపు ర్యాంకు విద్యార్థులు ఆచితూచి ఆప్షన్లు ఇచ్చుకోవడం మంచిదని చెబుతున్నారు. దాదాపు 5 వేల లోపు ర్యాంకుల్లో ఉన్న విద్యార్థులు ఎక్కువ మంది ఈసారి పోటీలో ఉండరని, 10 వేల లోపు ర్యాంకు విద్యార్థుల్లో 50 శాతం మాత్రమే ఉండే వీలుందని అంచనా వేస్తున్నారు. కాబట్టి 40 వేలలోపు ర్యాంకు విద్యార్థులు కోరిన కాలేజీ, సీటు కోసం పోటీపడేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు. ఆపై ర్యాంకు విద్యార్థులు కాలేజీ విషయం పక్కన పెట్టినా, కోరుకున్న సీటును ఎక్కడైనా పొందేందుకు ప్రయత్నించి సఫలం కావచ్చని చెబుతున్నారు. -
ఐఐటీలోనూ కంప్యూటర్ సైన్స్‌కే డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ల్లోనూ కంప్యూటర్ సైన్స్ కోర్సు(సీఎస్సీ) సీట్ల కోసం విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది. ఐఐటీల్లో ఈసారి కూడా పోటీ తీవ్రంగానే కన్పిస్తోంది. ఐఐటీల్లో ఈ ఏడాది దాదాపు 500 సీట్లు పెరిగే వీలున్నప్పటికీ, సీఎస్సీకి ప్రాధాన్యం ఇచ్చేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. అయితే రాష్ట్రస్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో మాదిరిగా కాకుండా ఐఐటీల్లో కంప్యూటర్ సైన్స్ కోర్సులో సీట్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. మొత్తం 23 ఐఐటీల్లో 16,598 ఇంజనీరింగ్ సీట్లు ఉండగా, ఇందులో బాలికలకు 1,567 సూపర్ న్యూమరరీ సీట్లు ఉన్నాయి. అన్నీ కలిపి సీఎస్సీలో ఉన్న సీట్లు 1,891 మాత్రమే. మిగతావన్నీ వివిధ రకాల కోర్సులవే. ఫలితంగా సీఎస్సీ కోసం ఒక్కోచోట పోటీ ఒక్కో రకంగా ఉంది. పోటీ తీవ్రంగా ఉన్న బొంబాయి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ కోర్సులో 171, ధన్‌బాద్ 139, కాన్పూర్ 129, ఢిల్లీ 99, రూర్కీలో 109 సీట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనరల్ కేటగిరీలో అబ్బాయిలు 6 వేలలోపు, అమ్మాయిలు 11 వేల లోపు ర్యాంకు వస్తేనే ఎక్కడో ఒకచోట కంప్యూటర్ సైన్స్ సీటు దక్కే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. బొంబాయిలో హీట్... జమ్మూలో కూల్ ఐఐటీ సీట్లు దక్కే ర్యాంకులను నిశితంగా పరిశీలిస్తే బొంబాయి ఐఐటీలో పోటీ తీవ్రంగా కన్పిస్తోంది. ఇక్కడ జనరల్ కేటగిరీలో బాలురకు 67వ ర్యాంకు వరకూ, బాలికలకు 361వ ర్యాంకు వరకూ మాత్రమే సీటు దక్కే అవకాశముందని కొన్నేళ్ల అంచనాలను బట్టి తెలుస్తోంది. జమ్మూ ఐఐటీలో మాత్రం పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఇక్కడ జనరల్ కేటగిరీ బాలురకు 5,238 వరకూ, బాలికలకు 10,552వ ర్యాంకు వరకూ కంప్యూటర్ సైన్స్ సీటు వచ్చే అవకాశం ఉంది. -
ఇంజనీరింగ్‌లో మరిన్ని కంప్యూటర్ సైన్స్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ మలి విడత కౌన్సెలింగ్‌లో కొత్తగా మరిన్ని కంప్యూటర్ సైన్స్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇదే క్రమంలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ సీట్లు తగ్గిపో నున్నాయి. దీనిపై సాంకేతిక విద్య విభాగం కసరత్తు ముమ్మరం చేసింది. కొత్తగా పెరిగే సీట్లలో ఎక్కువభాగం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి విభాగాల సీట్లే ఉండనున్నాయి. కొన్ని కాలేజీల్లో సైబర్ సెక్యూరిటీ సీట్లను పెంచనున్నారు. గత మూడేళ్లుగా డిమాండ్ లేని బ్రాంచీల్లో సీట్లను తగ్గించుకుని, వాటి స్థానంలో డిమాండ్ ఉన్న కోర్సుల సీట్లను పెంచుకునేందు కు అఖిల భారత సాంకేతిక విద్యశాఖ అనుమతించడంతో.. రాష్ట్రంలో కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సుల్లో 9,240 సీట్లు పెరగనున్నాయి. ఈ నెల 28 నుంచి ఇంజనీరింగ్ మలి విడత కౌన్సెలింగ్‌లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఆ సీట్లు సగానికన్నా తక్కువే.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 71,286 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులకు పెద్దగా డిమాండ్ లేని పరిస్థితి ఉంది. మొత్తం సీట్లలో వీటి సంఖ్య సగానికన్నా తక్కువే. ఇలా డిమాండ్ లేని కోర్సుల రద్దు, వాటి స్థానంలో కంప్యూటర్ సైన్స్ కోర్సులకు అనుమతితో పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం సివిల్ విభాగంలో 5 వేలు, మెకానికల్‌లో 4,615, ఈసీఈ 12,219, ఈఈఈ 5,778 సీట్లు మాత్రమే రెండో విడత కౌన్సెలింగ్‌లో ఉండబోతున్నాయి. మొత్తం కలిపి ఈ సీట్ల సంఖ్య 27,612 మాత్రమే. పెరిగే 9,240 కంప్యూటర్ కోర్సుల సీట్లను కలిపితే.. రెండో విడత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో మొత్తం సీట్ల సంఖ్య 80,526 సీట్లకు చేరనుంది. అంటే సంప్రదాయ కోర్సులు మూడో వంతుకు తగ్గిపోనున్నాయి. 52 వేలకుపైగా కంప్యూటర్ సైన్స్, సంబంధిత కోర్సుల సీట్లే ఉండనున్నాయి. ఇప్పటికే సీఎస్సీ సీట్లు 18,686, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీట్లు 7,737 వరకు ఉన్నాయి. ఇవి గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇంకా 17 వేల సీట్లు ఖాళీ.. ఇంజనీరింగ్ ఎంసెట్ తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. కేటాయించిన సీట్లలో 17 వేల మేర అధికార వర్గాలు తెలిపాయి. తొలి దశలో 71,286 సీట్లు అందుబాటులో ఉంటే, 60,208 సీట్లను కేటా యించారు. ఇందులో 43 వేల మంది మాత్రమే కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారని తెలిపాయి. మిగిలిన సీట్లలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సీట్లే ఎక్కువగా ఉన్నాయని అంచనా వేశాయి. ఈ సీట్లను రెండో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. -
కాస్త సరదాగా నేర్చుకుందాం...
కాలంతో పాటు ఆసక్తులు మారుతుంటాయి. అయితే అవి కాలక్షేప ఆసక్తులు కాకుండా భవిష్యత్ కార్యాచరణకు అవసరమైనవి అయితే ఎంతో బాగుంటుంది. ప్రస్తుతం జరుగుతున్నది అక్షరాలా అదే! బ్రిటిష్ సాప్ట్వేర్ డెవలపర్,రచయిత, పబ్లిక్ స్పీకర్ మార్టిన్ ఫౌలర్ ‘ప్రోగామ్ రాయడానికి అసాధారణమైన నైపుణ్యం అక్కర్లేదు’ అని ఎంతోమందికి చెప్పి పుణ్యం కట్టుకున్నాడు. ‘మీ హాబీస్ ఏమిటి?’ అనే ప్రశ్నకు ‘సినిమాలు చూడడం’ ‘సంగీతం వినడం’ ‘కవిత్వం రాయడం’ ‘ఫేస్బుక్లో పోస్ట్‌లు పెట్టడం’... ఇలాంటి సమాధానాలు ‘యూత్’ నుంచి రావడం ఎప్పుడూ ఉండేదే. అయితే ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న మాట... ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్! ‘సరదాగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నాను’ అని చెప్పేవారు పెరుగుతున్నారు. అయితే తమ చదువుకు కొనసాగింపుగానో, భవిష్యత్ ప్రణాళికలో భాగంగానో నేర్చుకోవడం లేదు. కాస్త సరదాగా మాత్రమే నేర్చుకుంటున్నారు. కోవిడ్ సృష్టించిన విరామసమయం ఎన్నో ‘డిజిటల్’ ఆసక్తులకు తెరతీసింది. అందులో ప్రోగామింగ్ లాంగ్వేజెస్ కూడా ఒకటి. యూత్ ఆసక్తి చూపుతున్న లాంగ్వేజెస్‌లలో టెక్ దిగ్గజం యాపిల్ అఫిషియల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ‘స్విఫ్ట్’లాంటివి ఉన్నాయి. ఈ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి స్విఫ్ట్ ప్రోగామింగ్ ఫర్ బిగినర్స్... మొదలైన ఆన్లైన్ కోర్సులను ఆశ్రయిస్తున్నారు. ఇక పైథాన్ సంగతి సరేసరి. ఇంట్రడక్షన్ టు ఫైథాన్ ప్రోగ్రామింగ్, పైథాన్ ఫ్రమ్ బిగినెర్ టు ఇంటర్మీడియట్ ఇన్ 30 మినిట్స్, ఎనాలసిస్ డాటా విత్ ఫైథాన్... మొదలైన ఫ్రీ ఆన్లైన్ కోర్సులు యువతను ఆకర్షిస్తున్నాయి. ఈ కోర్సులు పైథాన్ ప్రోగ్రామింగ్‌కు బేసిక్ ఇంట్రడక్షన్ గా పనిచేస్తున్నాయి. వీటి ద్వారా స్క్రిప్ట్, ఫంక్షన్స్ రాయడంలో మెలకువలు నేర్చుకుంటున్నారు. ఈ ఫ్రీ కోర్సు నేర్చుకోవడానికి 5 వారాల సమయం పడుతుంది. ‘టెక్నికల్ విషయాలు అంటే నాకు పెద్దగా ఆసక్తి లేదు’ అనే వాళ్లు కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ‘నేర్చుకున్నది ఏదీ వృథా పోదు’ అన్నట్లుగా తాము నేర్చుకుంటున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తమలోని సృజనను పదునుపెట్టడానికి పనికొస్తున్నాయి. ప్రోగామింగ్‌లో లాజిక్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఆర్గనైజేషన్... అనే కీలక అంశాలు తమను తాము మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. ప్రోగ్రామింగ్‌లో నిరూపించుకోవడానికి కంప్యూటర్ సైన్స్ పట్టాతో అట్టే పనిలేదని నిరూపించుకోవడానికి బిలాల్‌ను ఉదాహరణగా చూపవచ్చు. ముంబైకి చెందిన బిలాల్ ఫైనాన్స్ డిగ్రీ చేసిన విద్యార్థి. టెక్ విషయాలపై ఆసక్తితో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లు నేర్చుకున్నాడు. ఇదేమీ వృ«థా పోలేదు. చిన్నపాటి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చేలా చేసింది. తరువాత తానే ఒక సాఫ్ట్వేర్ ల్యాబ్‌ను మొదలుపెట్టాడు. పదవ తరగతి మధ్యలో మానేసిన వాళ్లు కూడా ప్రోగ్రామింగ్‌లో అద్భుత మైన ప్రతిభ చూపుతున్న ఉదాహరణలు మనకు ఉన్నాయి. వీరు మార్టిన్ ఫౌలర్ మాట విని ఉండకపోవచ్చు. అతడి ఉపన్యాసంతో ప్రభావితమైన అనేక మందిలో మనం లేకపోవచ్చు. అయితే ఆయన చెప్పిన ‘ప్రోగ్రాం రాయడానికి అసాధారణమైన నైపుణ్యం అక్కర్లేదు’ అనే మాటతో మాత్రం పూర్తిగా ఏకీభవిస్తారు. కొంతకాలం క్రితం గ్లోబల్ డిజిటల్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ ‘పే పాల్’ ఒక సర్వే నిర్వహించింది. స్కూల్, కాలేజీలలో చదివే 96 శాతం మంది అమ్మాయిలు కొత్త సాంకేతిక విషయాలు నేర్చుకోవడానికి అమిత ఆసక్తి చూపుతున్నారని చెప్పింది. ఈ సంతోషాన్ని రెట్టింపు చేసింది తాజా బైట్ ఎక్స్ఎల్ సర్వే. హైదరాబాద్‌కి చెందిన ఎడ్యుకేషనల్ టెక్నాలజీ సంస్థ ‘బైట్ ఎక్స్ఎల్’ డీప్ టెక్ ఇన్సైట్స్ 2021–2022 నివేదిక సాంకేతిక అంశాల పట్ల అమ్మాయిలు ఆసక్తి చూపుతున్నారని, నైపుణ్యం పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలియజేసింది. -
విద్యార్ధులకు అమెజాన్ అదిరిపోయే శుభవార్త
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంప్యూటర్ సైన్స్ విద్య రంగంలో భారత్‌లో పెద్ద ముందడుగు. ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ బృహత్తర కార్యక్రమాన్ని దేశీయంగా చేపట్టనుంది. అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ (ఏఎఫ్ఈ) ప్రోగ్రాంను పరిచయం చేయనుంది. ఇందులో భాగంగా తక్కువ ప్రాతినిధ్యం, వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే నాణ్యమైన కంప్యూటర్ సైన్స్ (సీఎస్) విద్యను అందిస్తారు. అలాగే భవిష్యత్తులో ఉద్యోగావకాశాలు పొందేందుకు సాయం చేస్తారు. తొలి ఏడాది లక్ష మందికిపైగా విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. ఇందుకోసం తెలంగాణ, కర్నాటక, ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశాలోని 900 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలను ఎంపిక చేస్తారు. 6–12 తరగతి విద్యార్థులకు.. అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ కార్యక్రమంలో భాగంగా 6–12 తరగతి విద్యార్థులకు బోధన ఉంటుంది. కోడింగ్ మూల సిద్ధాంతాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, నేచురల్ ల్యాంగ్వేజ్ ప్రాసెసింగ్ (వాయిస్ టెక్నాలజీ) వంటి భవిష్యత్ కేంద్రీకృత సాంకేతిక కోర్సులను భారతీయ భాషల్లో బోధిస్తారు. సాంకేతిక రంగంలో ఉన్న అవకాశాలను తెలుసుకునేందుకు విద్యార్థులకు అమెజాన్ నిపుణులను కలిసే అవకాశమూ ఉంటుంది. అమెజాన్ సైబర్ రోబోటిక్స్ చాలెంజ్ కార్యక్రమం ద్వారా ప్రోగ్రామింగ్ బేసిక్స్, కోడింగ్ నేర్చుకోవచ్చు. ఉపకార వేతనాలు, ఇంటర్న్షిప్స్, హాకథాన్స్, మార్గదర్శకత్వం సైతం లభిస్తుంది. సీఎస్‌ను మరింత ఆకర్షణీయంగా బోధించడానికి ఉపాధ్యాయులు, విద్యావేత్తలకు శిక్షణ ఇస్తారు. భారత్‌లో నాణ్యమైన సీఎస్‌ను పరిచయం చేసేందుకు కంపెనీ అంతర్జాతీయ నాలెడ్జ్ పార్ట్నర్ కోడ్.ఓఆర్జీ అనే స్వచ్చంద సంస్థతో కలిసి అమెజాన్ పనిచేస్తోంది. రాబోయే కాలంలో ఇతర రాష్ట్రాలకూ ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో.. ఏఎఫ్ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు విద్యారంగానికి సేవలు అందిస్తున్న లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థలతో అమెజాన్ భాగస్వామ్యం కుదుర్చుకోనుంది. ‘ఉపాధి రంగంలో కంప్యూటర్ సైన్స్ ఒక క్లిష్టమైన నైపుణ్యంగా మారింది. సీఎస్‌ను యువత ముందస్తుగా నేర్చుకోవడం ద్వారా ఉత్తమ భవిష్యత్తును నిర్మించుకునే అవకాశం ఉంటుంది’ అని అమెజాన్ ఇండియా హెడ్ అమిత్ అగర్వాల్ తెలిపారు. ‘నాణ్యమైన కోర్సు కంటెంట్ లేకపోవడం, స్థానిక భాషలో పరిమితంగా అధునాతన కంటెంట్ వంటివి సీఎస్ కెరీర్‌ను ఎంచుకోవాలనుకున్న వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు అడ్డంకులు. ప్రతిభ, అభిరుచి యువకులందరిలో విస్తరించినప్పటికీ అవకాశాలు పరిమితమే. ఏఎఫ్ఈతో సీఎస్ విద్యను ముందస్తుగా అందించడం ద్వారా ఈ అంతరాన్ని పరిష్కరించాలనేది మా లక్ష్యం’ అని పేర్కొన్నారు. చదవండి: వారం తిరగకుండానే మారిన జాతకాలు! మళ్లీ టాప్‌లోకి. -
కంప్యూటర్ కోర్సులకే డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ అనుబంధ కోర్సులు హాట్ కేకుల్లా మారాయి. ఎంసెట్ మొదటి దశ కౌన్సెలింగ్‌లో విద్యార్థులు ఎక్కువగా వీటినే ఎంచుకున్నారు. ఈ కోర్సుల్లో సీటు పొందిన వారిలో చాలా మంది సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న 78,270 ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సీట్ల భర్తీకి ఉన్నత విద్యా మండలి తాజాగా తొలిదశ కౌన్సెలింగ్ నిర్వహించింది. అభ్యర్థులు ఎంచుకున్న ఆప్షన్స్ ప్రకారం 61,169 సీట్లను కేటాయించింది. అయితే సీట్లు పొందిన అభ్యర్థుల సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు గురువారంతో ముగిసింది. మొత్తం 46,322 మంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినట్టు సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. ఏఐ, డేటా సైన్స్‌కు పోటీ కొత్తగా ప్రవేశపెట్టిన కంప్యూటర్ సైన్స్ కృత్రిమ మేథ, కృత్రిమ మేథ మెకానికల్ లెర్నింగ్, డేటా సైన్స్ తదితర కోర్సుల కోసం పెద్ద ఎత్తున విద్యార్థులు పోటీ పడ్డారు. ఆప్షన్స్ ఇచ్చిన వారిలో 60 శాతం పైగా ఈ కోర్సులను ఎంచుకున్న వారే ఉన్నారు. ర్యాంకు ప్రకారం ఆయా కోర్సుల్లో సీట్లు దక్కించుకున్న వారు తిరిగి చూడకుండా సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. అయితే నచ్చిన కాలేజీలో సీటు రాని కొద్దిమంది రిపోర్టింగ్ చేయలేదు. వారంతా మెరుగైన కాలేజీ కోసం రెండో దశ కౌన్సెలింగ్‌కు సిద్ధమవుతున్నారు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్సీ)లో 18,561 సీట్లు కేటాయిస్తే.. 13,942 మంది రిపోర్టింగ్ చేశారు. సైబర్ సెక్యూరిటీలో 1,634 సీట్లు ఉంటే, 1,192 మంది ప్రధాన కాలేజీల్లో సీట్లు ఖరారు చేసుకున్నారు. సివిల్‌లో 3,177 సీట్లు కేటాయిస్తే, 2,312 మంది, మెకానికల్‌లో 2,550 సీట్లకు 1,826 మంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. -
52 ఏళ్ల తరువాత క్షమాపణ : ఆమె ఏం చేసింది?
ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న ట్రాన్స్జెండర్లకు ఆమె ఒక విజయ పతాక. అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడి తానెంచుకున్న రంగంలో అత్యంత ప్రతిభావంతంగా ఎదిగి ట్రాన్ప్జెండర్ సమూహానికి ప్రజలకు ఉత్సాహాన్నిచ్చిన ధీర వనిత. కానీ ఇదంతా సాధించడానికి ట్రాన్స్‌జెండర్ మహిళకు అర్ధశతాబ్దానికి పైగా పోరాటం చేయాల్సి వచ్చింది. విశేష ప్రతిభ ఉన్నప్పటికీ కేవలం తాను ట్రాన్స్‌జెండర్ విమెన్ని అని ప్రకటించినందుకు ఉద్యోగాన్ని కోల్పోయింది. 1968 లోనే లింగమార్పిడి చేసుకున్న మహిళనని తనకు తాను ధైర్యంగా వెల్లడించింది. కానీ టెక్ దిగ్గజం ఐబీఎం ఒక యువ కంప్యూటర్ మేధావిని ఉద్యోగం నుంచి తొలగించింది. అయితే తదనంతర కాలంలో తన అసాధారణ ప్రతిభా పాటవాలతో ఒకపుడు తనను అవమానపరిచిన సంస్థే స్వయంగా పొరపాటును గ్రహించి క్షమాపణలు చెప్పే స్థాయికి ఎదిగింది. దీనికి తోడు ఎల్జీబీటీక్యూ హక్కులపై ప్రపంచవ్యాప్తంగా చైతన్యం పెరగడంతో ఐబీఎం ఆ వైపుగా స్పందించింది. ఆధునిక కంప్యూటర్ యుగానికి బాటలు వేసిన ఆమెకు సాంకేతిక ఆవిష్కరణల ద్వారా ప్రపంచాన్ని మార్చిన వ్యక్తులకు ఇచ్చే అరుదైన ఐబీఎం లైఫ్‌టైం ఎచీవ్మెంట్ అవార్డుతో సత్కరించింది. ఆమె పేరే లిన్ కాన్వే (82) గత నెలలో 1,200 మందికి పైగా ఉద్యోగులు హాజరైన ఆన్లైన్ ఈవెంట్‌కు ఆహ్వానించింది. ఈ వేడుకలో ఐబీఎం ఆమెను క్షమాపణ కోరింది. ఆమె పరిశోధన తమ విజయానికి ఎంతో తోడ్పడిందని, చేయకూడని పనిచేశామంటూ ఐబీఎం హెచ్ఆర్ హెడ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డయాన్ గెర్సన్ క్షమాపణ కోరడం విశేషం. అలాగే ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ, ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఆమెను అభినందనలతో ముంచెత్తారు. ఎవరీ లిన్ కాన్వే లిన్ ఆన్ కాన్వే. అమెరికన్ కంప్యూటర్ సైంటిస్ట్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఆవిష్కర్త, ట్రాన్స్‌జెండర్ పీపుల్ కోసం పనిచేస్తున్న ఉద్యమకర్త. మిచిగాన్ విశ్వవిద్యాలయంలో అత్యంత గౌరవనీయమైన ప్రొఫెసర్‌గా కూడా పనిచేశారు. అనేక అవార్డులు, రివార్డులు ఆమె సొంతం. అంతేనా ఇవాల్టి స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, చిప్ ఆవిష్కరణలు దశాబ్దాల తరబడి ఆమె చేసిన కృషి ఫలితమే. 1938లో న్యూయార్క్ లోని మౌంట్ వెర్నాన్లో అబ్బాయిగా పుట్టారు లిన్ చిన్నతనం నుంచే చదువులో రాణిస్తూ వచ్చారు. గణితం అన్నా, సైన్స్ అన్నా ప్రాణం.155 పాయింట్ల ఐక్యూతో అసాధారణ తెలివితేటలతో రాణించాడు. కానీ చిన్న వయసు నుంచే డిస్ఫోరియా అన లింగపరమైన సమస్య వెంటాడింది. అయినా చదువులోప్రతిభ కనబరుస్తూ కొలంబియా యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అప్లైడ్ సైన్స్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. 1964లో ఐబీఎం రీసెర్చ్ విభాగంలో జాయిన్ అయ్యారు. ఆర్కిటెక్చర్ బృందంలో అధునాతన సూపర్ కంప్యూటర్ రూపకల్పన చేయడంతోపాటు, గొప్ప పరిశోధకురాలిగా ఎదిగారు. 1964లో పెళ్లి చేసుకున్న లిన్‌కు (మహిళగా మారకముందు) ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. అయితే ఇంత జరుగుతున్నా ఆమెలోని జన్యుపరమైన లోపం కుదురుగా ఉండనీయలేదు. దీంతో 1967లో, మాన్హటన్కుచెందిన సెక్సాలజిస్ట్ డాక్టర్ హ్యారీ బెంజమిన్ ద్వారా లింగమార్పడి గురించి తెలుసుకున్నారు. అలా బెంజమిన్ సహాయంతో, ఆమె మగ నుండి ఆడకు శారీరకంగా పరివర్తనను ప్రారంభించారు. చివరకు 1969లో ఆపరేషన్ తరువాత పూర్తి మహిళగా అవతరించారు. దీనికి ఆమె కుటుంబం, సహచరుల మద్దతు లభించింది. కానీ ఐబీఎం మాత్రం జీర్ణించుకోలేకపోయింది. ఆమె వలన ఇతర ఉద్యోగులకు కూడా ఇబ్బంది అంటూ అప్పటి సీఈవో థామస్ జేవాట్సన్ లిన్‌ను తొలగించారు. దీంతో లిన్ కుటుంబాన్ని పోషించలేక ఇబ్బందులు పడ్డారు. చాలా ప్రమాదకరమైన ప్రయాణాన్ని ప్రారంభించడంతో కష్టపడాల్సి వచ్చిందని, ఎప్పటికి ఈ సమస్యల్ని అధిగమిస్తానో తెలియని స్థితిలో తీవ్ర నిరాశకు గురయ్యానని ఆమె చెప్పారు. అయినా దుఃఖాన్ని దిగమింగి తన పోరాటాన్ని కొనసాగించానన్నారు. చివరకు తన కొత్త అవతారాన్ని దాచి పెట్టి ఎంట్రీ లెవల్ కాంట్రాక్ట్ ప్రోగ్రామర్‌గా మళ్లీ ఉద్యోగంలో చేరానని ఆమె చెప్పారు. ఆ తరువాత తన ప్రతిభతో అమెరికా డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీలో ఉద్యోగాన్ని సాధించారు. దాదాపు 30ఏళ్ల పాటు తాను ట్రాన్స్జెండర్ననీ ఎవరికీ చెప్పలేదు. (కొద్దిమంది సన్నిహితులు, బంధువులు, హెచ్ఆర్ సిబ్బంది, భద్రతా క్లియరెన్స్ ఏజెన్సీలు మినహా). అయితే 1999లో కంప్యూటర్ రంగంలో ఆమె ఆవిష్కరణలపై చరిత్రకారుల పరిశోధించడం ప్రారంభించినప్పుడు ఆమె తన ఉనికిని బహిరంగపర్చారు. ఐబీఎంలో ఉద్యోగం కోల్పోయిన సంఘటనతో పాటు, తన లింగ మార్పిడి ప్రస్థానాన్ని ఆన్లైన్లో బహిర్గతం చేశారు. కంప్యూటర్ సైంటిస్టుగా ప్రస్థానం, పురస్కారాలు కాంట్రాక్ట్ ప్రోగ్రామర్‌గా ఉద్యోగంలో చేరిన లిన్ ఆ తరువాత తన కరియర్లో వెనుతిరిగి చూసింది లేదు. ఆధునిక స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, సిలికాన్ వ్యాలీలోని అనేక శక్తివంతమైన కంపెనీల అభివృధ్దితో ఆధునిక కంప్యూటర్ యుగానికి బాటలు వేశారు. ఇంటర్నెట్కు, అనేక టెక్ స్టార్టప్‌ల ఆవిర్భావానికి అపూర్వ సామర్ధ్యాన్నిచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో ఆమెది కీలక పాత్ర. 70 ల ప్రారంభంలో ప్రసిద్ధి చెందిన జిరాక్స్ పాలో ఆల్టో రిసెర్చ్ సెంటర్లో కంప్యూటర్ చిప్ డిజైన్‌ను ఆవిష్కరించిన ఘనత ఆమె సొంతం. 1980లలో ఇ-కామర్స్, మైక్రోప్రాసెసర్ చిప్ రూపకల్పనలో ఆమె సాధించిన పురోగతి సిలికాన్ వ్యాలీ మొట్టమొదటి స్టార్టప్‌లకు శక్తినిచ్చిందని ఫోర్బ్స్ ఆమెను ప్రశంసించింది. 1983లో మెషిన్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో చేసిన కృషికి మెరిటోరియస్ అచీవ్మెంట్ అవార్డు దక్కింది. 2014లో టైమ్ మ్యాగజైన్ ఆమెను అమెరికన్ సంస్కృతిలో అత్యంత ప్రభావవంతమైన ఎల్జీబీటీక్యూ వ్యక్తులలో ఒకరిగా పేర్కొంది. ఈ క్రమంలో ఆమె ఎల్జీబీటీ కార్యకర్తగా, రచయితగా మారారు. తమ లాంటి వాళ్లకోసం ఉద్యమిస్తూ..ఎంతో మంది ఎల్జీబీటీక్యూ హక్కుల కార్యకర్తలకు, సెలబ్రిటీలకు స్ఫూర్తిగా నిలిచారు. -
మేనేజ్ మెంట్ కోటా.. హాంఫట్
♦ అమ్మకానికి ‘యాజమాన్య’ సీట్లు ♦ నర్సాపూర్ ‘బీవీఆర్ఐటీ’ దందా ♦ కంప్యూటర్ సైన్స్ సీటుకు రూ. 11 లక్షల వరకు డొనేషన్ ♦ ఏజెంట్ల ద్వారానే విక్రయాలు ♦ అడ్వాన్స్ ఇచ్చిన వారికే సీటు రిజర్వు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలోని పేరున్న ఓ ఇంజనీరింగ్ కాలేజీ.. యాజమాన్య కోటా సీట్లను ‘అమ్మకానికి పెట్టింది’. ఒకవైపు ప్రభుత్వం కన్వీనర్ కోటా తరహాలోనే మేనేజ్మెంట్ సీట్లనూ ఆన్లైన్లోనే నింపాలని భావిస్తోంది. యాజమాన్యం ఇదేం పట్టించుకోకుండా ఏజెంట్లను పెట్టి వేలం పాట తరహాలో సీట్లను రూ. లక్షల డొనేషన్‌కు అమ్ముకుంటోంది. ప్రతిసారి ఎంసెట్ కింద సీట్ల భర్తీ ప్రక్రియను నర్సాపూర్‌లోని బీవీఆర్ఐటీ కాలేజీలోనే చేపట్టే సదరు కాలేజీ యాజమాన్యం ఈసారి డిమాండ్ పెరగటంతో పటిష్టమైన ఏజెంట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో సీట్ల అమ్మకాలకు తెరతీసింది. ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి మెరిట్ విద్యార్థులకు ప్రభుత్వం కౌన్సెలింగ్ నిర్వహించిన తర్వాత మేనేజ్మెంటు, ఎన్ఆర్ఐ కోటాల కింద ఉండే సీట్లను అమ్మాల్సి ఉండగా ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎంసెట్ కౌన్సెలింగ్‌కు ముందే ఇప్పటికే సీట్లను అమ్ముకున్నారు. నోటిఫికేషన్‌కు ముందే అమ్మకం! బీవీఆర్ఐటీలోని 8 ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల్లో 1110 సీట్లు ఉన్నాయి. ఇందులో 333 సీట్లు మేనేజ్మెంటు, ఎన్ఆర్ఐ కోటాల కింద వస్తాయి. వీటిని ఎంసెట్ కన్వీనర్ నోటిఫికేషన్ విడుదల చేశాక భర్తీ చేయాలి. కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌లో మేనేజ్మెంటు కోటా సీటును మొదటగా రూ 4.5 లక్షలకు అమ్మకానికి పెట్టగా క్రమంగా డిమాండు పెరగడంతో రూ 9 లక్షలకు చొప్పున అమ్ముకున్నారు. సీఎస్ బ్రాంచ్‌లో 90 సీట్లు యాజమాన్యం కోటా కింద వస్తుండగా మొత్తం అమ్మేశారని తెలిసింది. అడ్వాన్స్‌లు తీసుకుని.. కనీసం రూ. లక్ష ...ఆపైన అడ్వాన్స్‌గా చెల్లించిన వారికే సీటు రిజర్వ్ చేస్తున్నారు. ఇలా రిజర్వు చేసుకున్న వారికి ఒకవేళ కన్వీనర్ కోటాలో మంచి కాలేజ్‌లో సీటు వస్తే.. అడ్వాన్స్ మొత్తాన్ని తిరిగి ఇవ్వబోమనే డిమాండ్‌తోనే రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. ఈసీఈ బ్రాంచ్‌లో మేనేజీమెంటు కోటా సీటును మొదటగా రూ.3.50 లక్షలకు అమ్మగా డిమాండు పెరగడంతో రూ.6 లక్షలకు పెంచారని, ప్రస్తుతం అందులో సీట్లు లేవని అంటున్నారు. కాగా సీటును యాజమాన్యం నిర్ణయించిన ధర కు పొందినప్పటికి ఏటాప్రభుత్వం నిర్ణయించిన ఫీజును యథాతథంగా చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు. మేనేజ్మెంటు కోటా కింద సివిల్ ఇంజనీరింగ్, ఈఈఈ, కెమికల్ ఇంజనీరింగ్, బయో మెడికల్, ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్ బ్రాంచీలలో మాత్రమే ఒకటి రెండు సీట్లు ఉన్నాయని అంటున్నారు. కాగా సివిల్ ఇంజనీరింగ్, ఈఈఈ బ్రాంచీలలోని సీట్లు ఒకటి రెండు రోజుల్లో అయిపోతాయని తెలిసింది. మేనేజ్మెంటు కోటా కింద సివిల్ బ్రాంచ్‌లో సీటు రెండున్నర లక్షలకు, ఈఈఈ బ్రాంచ్‌లో సీటును లక్షన్నరకు అమ్ముతున్నారు. దీనిపై క్యాంపస్ డీజీఎం కాంతారావు వివరణ కోరగా..సీట్లు ఇంకా భర్తీ చేయలేదని, నోటిఫికేషన్ వచ్చాక భర్తీ చేస్తామని చెప్పారు. -
స్పైడర్ మ్యాన్ చెప్పిన పాఠం...
న్యూయార్క్: న్యూయార్క్‌లో విలన్లతో ఫైటింగులు వంటివి లేనప్పుడు స్పైడర్‌మ్యాన్ మెక్సికోలో కంప్యూటర్ సైన్స్ పాఠాలు చెబుతుంటాడు.. ఆ విషయం మీకు తెలుసా? ఇదేం సినిమాలో ఉంది అని బుర్ర గోక్కోకండి.. ఇది సినిమా కాదు.. జీవితం. ఈ ఫొటో చూడండి.. నేషనల్ అటానమస్ యూనివర్సిటీ ఆఫ్ మెక్సికోలో స్పైడర్ మ్యాన్ విద్యార్థులకు ఎలా చక్కగా పాఠాలు చెబుతున్నాడో.. ఇతడి పేరు మోయ్ వాజ్క్వెజ్ రేయిస్.. 2002లో అంట.. అప్పటికి మోయ్కు 12 ఏళ్లు.. తొలిసారిగా స్పైడర్ మ్యాన్ సినిమా చూశాడు.. అంతే.. ఆ పాత్రతో ప్రేమలో పడిపోయాడు. ఎంతగా అంటే.. చివరికి తాను స్పైడర్ మ్యాన్ డ్రస్‌లోనే తిరిగేటంత.. తన కోసం దాదాపు సినిమా స్థాయిలోనే మంచి డ్రస్ రెడీ చేయించుకున్నాడు. 2014 నుంచి ఇతడిలా స్పైడర్ మ్యాన్‌లాగే తిరుగుతున్నాడు. తన అభిమాన పాత్రకు సంబంధించిన కామిక్‌లు మరింతగా చదవడం ప్రారంభించాడు. అందులోని ఓ కామిక్‌లో స్పైడర్ మ్యాన్‌కు ఓ అకాడమీలో సబ్‌స్టిట్యూట్ టీచర్ ఉద్యోగం ఆఫర్ వస్తుంది. దీంతో మోయ్ ఆలోచనలో పడ్డాడు. ఇదేదో బాగానే ఉంది అనుకున్నాడు. అసలు స్పైడర్ మ్యాన్ కంప్యూటర్ సైన్స్ పాఠాలు చెబితే ఎలాగుంటుంది అని ఆలోచించాడు. మెక్సికో వర్సిటీలో చేరిపోయాడు. కంప్యూటర్ లాజిక్, హైయర్ ఆల్జీబ్రా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పాఠాలను బోధిస్తున్నాడు. తొలుత ఇంట్లోవాళ్లు భయపడ్డా.. వర్సిటీలోని విద్యార్థులు, సహ అధ్యాపకుల నుంచి వస్తున్న స్పందన చూసి.. ఇప్పుడు తెగ సంతోషపడిపోతున్నారు. ఇతడిని యూనివర్సిటీ లో అందరూ స్పైడ్మోయ్ అని ముద్దుగా పిలుచుకుంటారు. అయితే.. మోయ్ అన్ని రోజులు ఈ డ్రెస్‌లో క్లాసులకు వెళ్లడు. ముఖ్యమైన క్లాసులు చెప్పాలన్నా.. విద్యార్థులకు పరీక్షలున్నా.. వర్సిటీకి స్పైడర్ మ్యాన్ డ్రస్ వేసుకుని వెళ్తాడు. తద్వారా పరీక్షల సమయంలో విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడంతోపాటు క్లాసులు చెప్పే సమయంలో వారి దృష్టి తన వైపు ఉండేలా చూసుకుంటాడట. అటు విద్యార్థులు కూడా ఇతడి క్లాసులు మిస్సవరట. స్పైడర్ మ్యాన్ మాకు పాఠాలు చెబుతుంటాడు అని అందరికీ గొప్పగా చెప్పుకుంటారట. -
తెలుగుబ్లాగ్ల్లో విహరిద్దాం..
ఇంటర్నెట్.. ఈ రోజుల్లో సమస్త సమాచారం కోసం మనం ఆధారపడే సాధనం. అరచేతిలోకి స్మార్ట్‌ఫోన్ సైతం అందుబాటులోకి వచ్చిన తర్వాత నెట్ వినియోగం మరింత పెరిగింది. కాసింత సమయం దొరికితే చాలు.. ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టేస్తుంటారు. అయితే దీన్ని ఉపయోగించడానికి ఆంగ్లం అవసరం కావడంతో ఎక్కువ మంది ఆసక్తి చూపలేకపోతున్నారు. ఇలాంటి వారి కోసం అందుబాటులోకి వచ్చాయి తెలుగుబ్లాగులు. వీటిలో కథలు, పద్యాల నుంచి వైద్య సలహాల వరకు మనకు కావాల్సిన సమాచారం దొరుకుతుంది. ఇందులో యాడ్ అయితే చాలు.. మన మనసులోని భావాలు సైతం మాతృభాషలో అందరితో పంచుకోవచ్చు. ఇందుకు కావాల్సిందల్లా ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రమే. ఇంకెందుకు ఆలస్యం మీరు క్రియేట్ చేయండి ఓ బ్లాగ్.. * మాతృభాషలోనే సమస్త సమాచారం * సినిమాలు, ఆటలు,కవితలు లభ్యం * అందుబాటులో కథలు, వైద్య సలహాలు * వింతలు విశేషాలతో అబ్బురపరుస్తున్న వైనం నల్లగొండ కల్చరల్: తెలుగులో కూడలి, జల్లెడ.. వంటి పేర్లతో బ్లాగులు కనిపిస్తున్నాయి. వీటిలో మాతృభాషలోనే సమస్త సమాచారం దొరుకుతుంది. తెలుగులో ఎవరు బ్లాగ్ క్రియేట్ చేసుకున్నా తెలుగు కూడలి, జల్లెడలో యాడ్ కావచ్చు. ఈ బ్లాగ్‌ల్లో వంటింటి విషయాల నుంచి జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, వింతలు, విశేషాలు వంటి ఎన్నో నూతన విషయాలను క్షణాల్లో తెలుసుకునే అవకాశం ఉంది. సినిమా, సాహిత్యం, హాస్యం, సాంకేతికం, ఫొటోలు, రాజకీయాలు, పిల్లలకు ఉపయోగపడే నీతికథలు, ఆటలు, కబుర్లు, వార్తా విశేషాలు ఇలాంటివెన్నో తెలుగు భాషల్లో దొరికే బ్లాగ్స్పాట్ డాట్ కామ్‌ల్లో వెతుక్కోవచ్చు. బ్లాగ్ క్రియేట్ చేసుకోవడం ఇలా.. మనకు జీమెయిల్ అకౌంట్ ఉంటే చాలు.. ఉచితంగా తెలుగు లేదా ఇంగ్లిష్‌లో బ్లాగ్లు క్రియేట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మన జిల్లాలోని వింతలు విశేషాలతో, జిల్లా ఇతర సమాచారంతో కూడిన వెబ్‌సైట్‌ను క్రియేట్ చేయాలంటే కాస్త ఖర్చుతో కూడుకున్న పని. కానీ అదే సమాచారంతో నల్లగొండ డాట్ బ్లాగ్స్పాట్ డాట్ కామ్ పేరుతో ఓ బ్లాగ్ క్రియేట్ చేయాలనుకుంటే చాలా సులభం. కేవలం మనకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. దీని ద్వారా మన సమాచారాన్ని పొందుపర్చాలనుకున్నా సులువే. గూగుల్ సెర్చ్ ఇంజిన్ వాల్‌పేపర్‌లో కుడివైపున కనిపించే యాప్స్ ఆప్షన్‌ను క్లిక్ చే స్తే అందులో బ్లాగ్స్ అనే ఒక స్పాట్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మన మెయిల్ఐడీతో ఎంటర్ కావాలి. ఇక్కడి నుంచి తెలుగు లేదా ఇంగ్లిష్ బ్లాగ్‌ను ఎంచుకుని మనకు నచ్చిన విధంగా తయారు చేసుకోవచ్చు. మనకు నచ్చిన విషయాలను ప్రపంచానికి తెలిసే విధంగా పోస్ట్ చేయవచ్చు. నవలలు, కథల కోసం * డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.తెలుగువన్.కామ్ వెబ్సైట్లో కావల్సిననన్నీ నవలలు అందుబాటులో ఉంటాయి. ఈ సైట్లోకి వెళ్లి సాహిత్యం ఆప్షన్‌పై క్లిక్‌చేస్తే మనకు కావల్సిన నవలలు ఎంచుకోవచ్చు. డివోషనల్పై క్లిక్ చేస్తే భక్తి సమాచారం వస్తుంది. ఇదే సైట్లో పిల్లలకు సులభంగా అర్థమయ్యే నీతికథలు, కూరగాయల పేర్లు, పద్యాలు, ఆటలు కూడా ఉంటాయి. సైట్‌లోని కిడ్స్ ఆప్షన్‌లోకి వెళ్తే మనకు కావాల్సినవి ఎంచుకోవచ్చు. వార్తలు, పలు విశేష కథనాలు సైతం ఈ సైట్లో చదవవచ్చు. * డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.తెలుగుకార్నర్.కామ్ వెబ్సైట్లోకి వెళ్లితే తెలుగుకు సంబంధించి మరిన్ని వివరాలు లభ్యమవుతాయి. ఇందులో సుమతి, వేమన, భాస్కర శతకాలు.. నీతికథలు చదువుకోవచ్చు. తెలుగు ఆటలు, అంకెలు, గుణింతాలు, రాశులు.. ఈ వెబ్‌పేజీలో చూడవచ్చు. మనకు కావల్సిన ఆప్షన్ ఎంచుకుంటే మరో పేజీ ప్రత్యక్షమవుతుంది. అందులో పూర్తి సమాచారం ఉంటుంది. * డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఉపకారి.కామ్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కినిగె.కామ్, వాకిలి.. తదితర సైట్లలో తెలుగు సాహిత్యం, కథలు, నవలలు చదవవచ్చు. మాతృభాషను గౌరవిద్దాం * తెలుగు బ్లాగులను వినియోగించడం ద్వారా మాతృభాషను గౌరవించినట్లవుతుంది. * సమాచారమంతా తెలుగులో ఉండడం ద్వారా ఇంగ్లిష్ రాని వారికి సైతం సులభంగా అర్థమయ్యే రీతిలో ఉంటుంది. * పిల్లలకు పెద్దలకు అవసరమయ్యే కథలు, సాహిత్యం, పద్యాలు అన్నీ తెలుగు బ్లాగులు, సైట్లలో అందుబాటులో ఉంటాయి. * తెలుగు భాషలో ఉండే బ్లాగులు, సైట్లలో పిల్లలకు ఉపయోగకరమైన విషయాలూ ఉంటాయి. * నీతికథలు, బాలల ప్రపంచం, అక్బర్, బీర్బల్ వంటి కథలు అందులో ఉంటాయి. పిల్లల కోసం ప్రత్యేకంగా... * పిల్లలకథలు, బాలల ప్రపంచం, బొమ్మలు, బాలల సాహిత్యం, నీతి చంద్రికలు, చందమామ కథలు అక్బర్, బీర్బల్ కథలు, తెనాలి రామకృష్ణుని కథలు, అల్లావుద్దీన్ అద్భుత ద్వీపం లాంటి క థానికల సమాచారంతో కూడిన బ్లాగ్లు కూడలి, జల్లెడ, బ్లాగిల్లు, మౌలిక వంటి బ్లాగ్స్పాట్ డాట్ కామ్‌లలో మనకు అందుబాటులో ఉన్నాయి. ఇంకా పెద్దవారికి అవసరమైన సాహిత్య సమావేశాలు, ఆధ్యాత్మిక రంగాలు, యువతకు అవసరమైన క్రీడలు, సినిమాలు, బ్యూటీ టిప్స్, ఇంట్లో వాళ్లందరికీ అవసరమగు కొత్త కొత్త వంటకాలు మొదలుకుని ఆయుర్వేదం టిప్స్, వాటి ఉపయోగాలను వివరించే బ్లాగ్స్ కూడా దొరుకుతాయి. మాతృభాషలోనే కంప్యూటర్ విజ్ఞానం.. చాలా మంది ఇంటర్నెట్ వాడకం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చని కనెక్షన్ తీసుకుంటారు. తీరా అందులో ఏ సమాచారం చూసినా ఇంగ్లిష్‌లోనే ఉండడం తో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలాంటి వారు తెలుగు బ్లాగ్‌లోకి వెళ్తే ఎంతో సులువుగా అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. కంప్యూటర్ వాడకం నుంచి మొదలుకుని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వరకు అన్నింటి గురించి తెలిపే సైట్లు సైతం ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఫొటోషాప్ ద్వారా మన ఫొటోలు అందమైన లోకేషన్లకు యాడ్ చేస్తూ మనకు నచ్చిన ఫ్రేముల్లో చూసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో లభించే ఫీచర్లు, యాప్స్ వరకు చాలా అంశాలు కూడా ఈ బ్లాగ్ సైట్లలో మనకు లభిస్తాయి. ఇవే కాకుండా ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ ఫీచర్స్, గూగుల్ ఫీచర్స్ ఇలా చాలా విషయాలను సులువుగా తెలుసుకోవడానికి ఈ బ్లాగులు తోడ్పడుతున్నాయి. -
పరిశోధనల్లో కెరీర్‌కు పట్టంకట్టే జెస్ట్!
జాయింట్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (జెస్ట్).. దేశంలోని 20కిపైగా ప్రముఖ ఇన్స్టిట్యూట్లలో పరిశోధన కోర్సులను అభ్యసించడానికి మార్గం సుగమం చేసే పరీక్ష. జెస్ట్-2015 నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో పరీక్ష వివరాలు.. జెస్ట్ పరీక్ష ద్వారా ఫిజిక్స్, థియోరిటికల్ కంప్యూటర్ సైన్స్, న్యూరో సైన్స్ విభాగాల్లో పీహెచ్డీ/ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులోని స్కోర్ ఆధారంగా వివిధ ఇన్స్టిట్యూట్లు తాము నిర్దేశించిన అర్హతలున్న విద్యార్థులను తుది ఎంపిక కోసం పిలుస్తాయి. ఈ క్రమంలో జెస్ట్ స్కోర్ ఏడాదిపాటు చెల్లుబాటు అవుతుంది. రాత పరీక్ష: గ్రాడ్యుయేషన్, పోస్ట్‌గ్రాడ్యుయేషన్ స్థాయి సిలబస్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి. ఫిజిక్స్: రాత పరీక్షలో రెండు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో 25 ప్రశ్నలు ఇస్తారు. వీటిలో ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు. రెండో విభాగంలో 25 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. ఇందులో 40 శాతం ప్రశ్నలు బీఎస్సీ సిలబస్ నుంచి, 60 శాతం ఎంఎస్సీ సిలబస్ నుంచి వస్తాయి. సిలబస్: మ్యాథమెటికల్ మెథడ్స్, క్లాసికల్ మెకానిక్స్, ఎలక్ట్రోమాగ్నటిక్ థియరీ, క్వాంటమ్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్ అండ్ స్టాటిస్టికల్ ఫిజిక్స్, సాలిడ్ స్టేట్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, న్యూక్లియర్ అండ్ పార్టికల్ ఫిజిక్స్, అటామిక్ అండ్ ఆప్టికల్ ఫిజిక్స్, ప్రాబబిలిటీ థియరీ. థియోరిటికల్ కంప్యూటర్ సైన్స్: ఇందులో రెండు రకాలు ప్రశ్నలు ఉంటాయి. కొన్నిటికి స్వల్ప సమాధానాలు సరిపోతే, మరికొన్నిటికి దీర్ఘ సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. సంబంధిత అంశాలపై ప్రాథమిక భావనలను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఇస్తారు. అంతేకాకుండా కొన్ని ప్రశ్నలను సాధించడానికి మ్యాథమెటికల్ నైపుణ్యం కూడా అవసరం. సిలబస్: అనలిటికల్ రీజనింగ్ అండ్ డిడక్షన్, కాంబినోట్రిక్స్, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్, డిస్రిక్ట్ మ్యాథమెటిక్స్, గ్రూప్ థియరీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్. థియోరిటికల్ కంప్యూటర్ సైన్స్/న్యూరో సైన్స్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సెన్సైస్-చెన్నై: పీహెచ్డీ ఇన్థియోరిటికల్ కంప్యూటర్ సైన్స్ కోర్సును అందిస్తుంది. అర్హత: ఎంఎస్సీ/ఎంటెక్/ఎంఈ (కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత విభాగం)/ఎంసీఏ. నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్‌బీఆర్‌సీ)- గుర్గావ్ పీహెచ్డీ ఇన్ న్యూరోసైన్స్ కోర్సును అందిస్తుంది. అర్హత: ఎంఎస్సీ (ఫిజిక్స్/మ్యాథమెటిక్స్) లేదా బీఈ/బీటెక్/ఎంసీఏ. ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ/ఎంటెక్ పీహెచ్డీ: బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్/స్టాటిస్టిక్స్/మ్యాథమెటిక్స్/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఇంజనీరింగ్ లేదా బీఎస్సీ (ఫిజిక్స్/మ్యాథమెటిక్స్) లేదా బీఈ/బీటెక్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రికల్/ ఇన్స్ట్రుమెంటేషన్/ఇంజనీరింగ్ ఫిజిక్స్/కంప్యూటర్ సైన్స్/ఆప్టిక్స్ అండ్ ఫోటోనిక్స్). ఇంటిగ్రేటెడ్ ఎంటెక్-పీహెచ్డీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్): ఎంఎస్సీ (ఫిజిక్స్/అప్లయిడ్ ఫిజిక్స్) లేదా పోస్ట్ బీఎస్సీ (ఆనర్స్ ఇన్ ఆప్టిక్స్ అండ్ ఆప్టోఎలక్ట్రానిక్స్/ రేడియో ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్) లేదా బీఈ/బీటెక్ (సంబంధిత సబ్జెక్ట్లతో). ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ- ఫిజిక్స్ (ఐఐఎస్ఈఆర్)-తిరువనంతపురం: బ్యాచిలర్ డిగ్రీ ఇన్ (ఫిజిక్స్/ టెక్నాలజీ/ ఇంజనీరింగ్). ప్రతి ఇన్స్టిట్యూట్ అర్హత ప్రమాణాలు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి దరఖాస్తుకు ముందు సంబంధిత వివరాలను ముందుగా తెలుసుకోవడం మంచిది. పీహెచ్డీ-ఫిజిక్స్‌కు అర్హత ఎంఎస్సీ (ఫిజిక్స్) లేదా ఎంఎస్సీ/ఎంటెక్ (సంబంధిత విభాగాల్లో) లేదా ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్/అప్లయిడ్ ఫిజిక్స్/అప్లయిడ్ మ్యాథమెటిక్స్/ఆప్టిక్స్ అండ్ ఫోటోనిక్స్/ఇన్స్ట్రుమెంటేషన్/ఎలక్ట్రానిక్స్) లేదా బీఈ/బీటెక్ లేదా ఎంఎస్సీ (ఇంజనీరింగ్ ఫిజిక్స్/అప్లయిడ్ ఫిజిక్స్) లేదా బీటెక్ (ఇంజనీరింగ్ ఫిజిక్స్). ప్రతిభావంతులైన బీఎస్సీ మొదటి సంవత్సరం లేదా ఎంఎస్సీ (ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్/ఆస్ట్రానమీ/అప్లయిడ్ మ్యాథమెటిక్స్) విద్యార్థులు ఐయూసీఏఏలో రీసెర్చ్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు విధానం దరఖాస్తు: ఆన్లైన్లో. దరఖాస్తు రుసుం: రూ. 300(ఎస్సీ/ఎస్టీలకు రూ.150) దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 8, 2014. రాత పరీక్ష తేదీ: ఫిబ్రవరి 15, 2015. వెబ్సైట్: www.jest.org.in -
టెక్నోపెక్సస్ -14 పోస్టర్‌ను ఆవిష్కరించిన సీఎం
భీమారం : కిట్స్ కళాశాల కంప్యూటర్ సైన్స్ వి భాగం విద్యార్థి వి.ఇంద్రనీల్ రూపొందించిన టెక్నోపెక్సస్ పోస్టర్‌ను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఇటీవల వరంగల్ పర్యటన సందర్భంగా కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటిలో ఈ పోస్టర్‌ను కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోస్టర్లో పొందుపరిచిన సాంకేతిక అంశాల గురించి ము ఖ్యమంత్రికి ఇంద్రనీల్ వివరించారు. ఈనెల చివ రి వారంలో కిట్స్‌లో కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ సదస్సును పురస్కరించుకుని ఈ పోస్టర్‌ను రూపొందించినట్లు ఇంద్రనీల్ తెలిపారు. -
అవకాశాలకు ఆయువుపట్టు.. కంప్యూటర్ సైన్స్
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్యూటరీకరణ నిత్య జీవన ప్రక్రియలో ఓ భాగంగా మారింది. పాత విధానాలను ఆధునికీకరించడం ఎంత ముఖ్యమో.. అన్ని విభాగాల్లో కంప్యూటరీకరణ అంతే ప్రధానం. అభివృద్ధిలో భాగంగా వైఫై, ఆఫీస్ ఆటోమేషన్ సేవలు విస్తృతమవుతున్న తరుణంలో సంబంధిత సాంకేతిక నిపుణుల అవసరమూ ఏర్పడుతోంది. దాంతో ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ రంగం నిపుణులకు పుష్కలమైన అవకాశాలు లభిస్తున్నాయి. మనోజ్ కుమార్... ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ పూర్తిచేశాడు. క్యాంపస్ సెలక్షన్స్‌లో జరిగిన ఇంటర్వ్యూలోనే ఓ మల్టినేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఎంపికయ్యాడు. ఆశించిన ఉద్యోగం.. ఆకర్షణీ యమైన వేతనం సొంతం చేసుకున్నాడు. ‘మొదట్నుంచీ నాకు కంప్యూటర్లు, టెక్నాలజీ అంటే ఎంతో ఆసక్తి. కెరీర్లో త్వరగా స్ధిరపడడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌ను ఎంచుకు న్నాను.’ అంటున్న మనోజ్... తెలుగు మీడియం నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ.. నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సులో కష్టపడి చదివి నైపుణ్యాలు మెరుగుపర్చుకున్నాడు. తొలి ప్రయత్నంలోనే కొలువును సొంతం చేసుకున్నాడు. కాబట్టి ఇంజనీరింగ్‌లో చేరాలనుకునే విద్యార్థులు ఆసక్తి, అభిరుచికి తగిన కోర్సును ఎంచుకుంటే కెరీర్లో సులభంగా రాణించ డానికి అవకాశం ఉంటుంది. టెక్నాలజీపై ఆసక్తి, నైపుణ్యాలు ఉన్నవారికి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సరైన బ్రాంచ్. ప్రవేశం: బీఈ/బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సు కాల వ్యవధి నాలుగేళ్లు. రాష్ట్ర స్థాయి ఇంజనీరింగ్ కళాశాలల్లో ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీతోపాటు బిట్స్ తదితర విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధిత ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించాలి. ఏం చదువుతారు? కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో ప్రధానంగా విద్యార్థులు కంప్యూటర్‌కు సంబంధించిన భాగాలు, వాటి పనితీరు మొదలు సి, సి++, జావా తదితర ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, క ంప్యూటర్ నెట్వర్క్స్ వరకూ.. అన్ని రకాల సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ అంశాలను అధ్యయనం చేస్తారు. ‘అన్ని యూనివర్సిటీలు.. కోర్సు కాలంలో విద్యార్థి సాధించాల్సిన అన్ని నైపుణ్యాలను దృష్టిలో ఉంచుకుని కరిక్యులంను రూపొందిస్తాయి. తరగతి గదిలో చెప్పే అంశాలను క్షుణ్నంగా నేర్చుకుంటే కోచింగ్ సెంటర్లకు పరిగెత్తాల్సిన అవసరం ఉండదు’ అని ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి ఎం.వెంకట్ దాస్ సూచిస్తున్నారు. కొందరు విద్యార్థులు యాడ్ఆన్ కోర్సులకు అధిక ప్రాధాన్యతనిస్తూ బీఈ/బీటెక్ కరిక్యులంను అశ్రద్ధ చేయడమే కాకుండా తమ విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘సమయాన్ని వృథా చేసుకోవద్దు. కరిక్యులానికి అనుగుణంగా ఉన్న పుస్తకంలోని మొదటి చాప్టర్ నుంచి చివరి అధ్యాయం వరకు అన్ని అంశాలపై గట్టి పట్టు సాధించాలి. విద్యార్థులు.. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం ఉన్నవారు కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్‌ను మెరుగుపరచుకుంటే తప్పకుండా విజయం సాధిస్తారు’ అంటూ వెంకట్ దాస్ విశ్వాసం వ్యక్తం చేశారు. కావాల్సిన స్కిల్స్: సాఫ్ట్వేర్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది. దాంతోపాటే ఆ రంగంలో పనిచేయాలనుకునేవారు/ పనిచేస్తున్నవారు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. టె క్నాలజీతో ఎక్కువ సమయం పనిచేయూల్సి ఉంటుంది. చిన్నపాటి పొరపాట్లకు ఎక్కువ సమయం వృథా అయ్యే ప్రమాదం ఉంటుంది. సాఫ్ట్‌వేర్‌లో సమయ పాలన చాలా ముఖ్యం. కాబట్టి సూక్ష్మ పరిశీలనా నైపుణ్యాలుండాలి. ప్రతి అంశాన్నీ లోతుగా అధ్యయనం చేయూలి. నిర్దేశిత ఔట్పుట్ వచ్చేంత వరకు లేదా అప్పగించిన పని పూర్తయ్యేంతవరకు ఓర్పు, సహనంతో పనిచేయగలగాలి. ఉన్నత విద్య: కంప్యూటర్స్‌లో బీఈ/బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలూ విస్తృతమే. పీజీ స్థాయిలో మాస్టర్ ఇన్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ సైన్స్ వంటి టెక్నికల్ కోర్సుల్లో ఎంచుకున్న సబ్జెక్టులో నైపుణ్యాన్ని సాధించొచ్చు. ఐఐటీల్లో నేరుగా పీహెచ్డీ చేసే అవకాశమూ ఉంది. ఉన్నత అవకాశాల కోసం విదేశాల్లో ఎంఎస్ చేయొచ్చు. క్యాంపస్ రిక్రూట్మెంట్లు/ఉద్యోగాలు కంప్యూ టర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సును పూర్తి చేసిన విద్యార్థులకు దేశ, విదేశాల్లో మంచి అవకా శాలున్నాయి. మెకానికల్, సివిల్, బయోమెడికల్ ఇంజనీరింగ్ ఆధారిత కంపెనీలు కూడా టెక్నాలజీ విభాగంలో పనిచేయడానికి సీఎస్ఈ విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. ‘ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా, గూగుల్, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం తదితర సాఫ్ట్వేర్ కంపెనీలు అత్యధిక వేతనాలతో ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ప్రముఖ కంపెనీలు రూ.12 లక్షల వరకు వార్షిక వేతనం ఆఫర్ చేస్తున్నాయి. ఫ్యాకల్టీగా స్థిరపడాలనుకునే వారికీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయి’ అని వెంకట్ దాస్ వివరించారు. -
డీయూ కళాశాలల్లో ప్రవేశాలు మళ్లీ మొదలు
సాక్షి, న్యూఢిల్లీ:ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) పరిధిలోని కళాశాలల ప్రాంగణాలు మంగళవారం కళకళలాడాయి. తొలి కటాఫ్ జాబితాను సోమవారం రాత్రి ప్రకటించడంతో రిజిస్ట్రేషన్ కోసం విద్యార్థులు ఉదయం నుంచే కళాశాలల వద్దకు చేరుకున్నారు. దీంతో డీయూలోని ఉత్తర, దక్షిణ ప్రాంగణాలు కిటకిటలాడాయి. అన్ని కళాశాలల్లోనూ బీకామ్, ఎకనామిక్స్ ఆనర్స్, కంప్యూటర్‌సైన్స్ కోర్సులకు పోటీ ఎక్కువగా ఉంది. 100 శాతం మార్కులు ఉంటే గానీ కంప్యూటర్‌సైన్స్ (ఆనర్స్)లో ప్రవేశం సాధ్యం కాదంటూ ఆత్మారామ్ సనాతన్ ధర్మ,ఆచార్య నరేంద్ర దేవ్ కళాశాలలు ప్రకటించాయి. ఆచార్య నరేంద్ర దేవ్ కళాశాలలో సాధారణ కేటగిరీలోనే కాకుండా వికలాంగ విద్యార్థులకు కూడా కటాఫ్ మార్క్ 100 శాతంగానే ఉంది. డీయూ క్యాంపస్ కళాశాలల్లో 100 శాతం కటాఫ్ గతంలో రెండు విద్యా సంవత్సరాల్లో విద్యార్థులకు అనుభవంలోకి వచ్చింది, అయితే క్యాంపస్ వెలుపలి కళాశాలల్లో కటాఫ్ మార్క్ 100 శాతంగా ఉండడం ఇదే మొదటిసారి.మొదటి కటాఫ్ జాబితా ఆధారంగా ఈ నెల మూడో తేదీ వరకు అడ్మిషన్లు జరుగుతాయి. తొలి కటాఫ్ జాబితాలో ప్రవేశం లభించనిరాని వారు నిరాశకు గురికానవ సరం లేదు. ఈ ఏడాది మొత్తం ఎనిమిది టాఫ్ జాబితాలను విడుదల చేయనున్నట్లు డీయూ ప్రకటించింది. కాగా కేరళ, తమిళనాడు రాష్ట్రాలతోపాటు విదేశాల నుంచి కూడా విద్యార్థులు ప్రవేశాల కోసం డీయూకి వచ్చారు. అయితే తగిన వసతి లేకపోవడంతో వారంతా నానాయాతనకు గురయ్యారు. ఇక ఉద్యోగాలు చేస్తూ తమ పిల్లలకు ప్రవేశాలకోసం వచ్చిన తల్లిదండ్రుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. మరి కొన్ని రోజుల పాటు ఉండాల్సి రావడంతో ఏమిచేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. విధులకు మళ్లీ హాజరు కావాల్సి ఉండడం, ఇతర పనులు ఉండడం, తమ పిల్లలకు ప్రవేశం ఏమవుతుందనే ఆందోళనతో వారు గందరగోళానికి గురవుతున్నా రు. ఈ విషయమై బహ్రెయిన్ నుంచి నగరానికి వచ్చిన నైనికా దినేశ్ మాట్లాడుతూ ‘జూన్ 24వ తేదీనే ప్రవేశాలు ఉంటాయనే ఆశతో ఇక్కడికి వచ్చా. అయితే మధ్యలో నెలకొన్న పరిణామాల కారణంగా ఇక్కడే ఉండక తప్పలేదు’ అన ఆవేదన వ్యక్తం చేసింది. ఇక బెంగళూర్ నుంచి నగరానికి వచ్చిన కుల్వంత్ కిన్హా మాట్లాడుతూ ‘ప్రవేశాల ప్రక్రియ ఆలస్యమవడంతో హోటల్లో బస చేయా ల్సి వచ్చింది. అయితే ఎట్టకేలకు మొదలవడంతో కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టయింది. మా నాన్న కూడా నా వెంబడి వచ్చాడు. ఆయన ఉద్యోగి. విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. వాస్తవానికి మేమిద్దరం ఇక్కడే వారం రోజులపాటు ఉండాల్సి వస్తుందనుకోలేదు’ అని తన ఆవేదన వ్యక్తం చేశాడు. కటాఫ్‌పై విద్యార్థుల ఆందోళన న్యూఢిల్లీ: కటాఫ్ మార్కులను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ క్రాంతికారీ యువ సంఘటన్ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఢి ల్లీ విశ్వవిద్యాలయంలోని ఉత్తర ప్రాంగణంలోగల ఆర్ట్ ఫ్యాకల్టీ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు ‘కటాఫ్ తగ్గించండి-సీట్ల సంఖ్య తగ్గించండి’ అంటూ నినదించారు. కాగా డీయూ లో మొత్తం 54 వేల సీట్లు ఉండగా, దాదాపు 2.7 లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవడంతో వారికి అత్యంత ప్రతిష్టాత్మకమైన కళాశాలల్లో ప్రవేశం లభించలేదు. ఇటువంటి వారందరూ స్కూల్ ఆఫ్ లెర్నింగ్‌లో చేరడమే తప్ప మరో మార్గం లేదు. -
గీతం ఇంజినీరింగ్ తొలి దశ ప్రవేశాలు పూర్తి
విశాఖపట్నం: గీతం ఇంజినీరింగ్ అడ్మిషన్ల మొదటి దశ కౌన్సెలింగ్ సోమవారంతో పూర్తయినట్టు గీతం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.పోతరాజు తెలిపారు. ఇంజినీరింగ్‌లోని కీలక బ్రాంచ్‌లలో సీట్లు పూర్తిగా భర్తీ అయినట్టు చెప్పారు. జూలై 7 నుంచి ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం తరగతులను ప్రారంభించేందుకు యూనివర్సిటీలో సన్నాహాలు చేస్తున్నామన్నారు. కౌన్సెలింగ్‌లో మొదటి రెండు రోజులు మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ఈఈఈ సీట్లు పట్ల అధిక శాతం మంది విద్యార్థులు ఆశక్తి చూపారన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ కోర్సులలో సీట్లు సోమవారం జరిగిన కౌన్సెలింగ్‌లో భర్తీ జరిగినట్టు వివరించారు. రెండో దశ కౌన్సెలింగ్‌లో హైదరాబాద్, బెంగళూరు క్యాంపస్‌లలో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ జరిపేందుకు వర్సిటీ ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఐటీ హబ్‌గా విశాఖ రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో విశాఖ నగరం ఐటీ హబ్‌గా మారనుందని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పోతరాజు తెలిపారు. ఇంజినీరింగ్‌లో నూతన ంగా ప్రవేశాలు పొందిన విద్యార్థులనుద్దేశించి సోమవారం మాట్లాడారు. టీసీఎస్, హెచ్‌సీఎల్ తదితర కంపెనీలతో గీతం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుందన్నారు. కంపెనీలకు అవసరమైన మానవ వనరులను గీతం అందిస్తుందని వివరించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.లక్ష్మీప్రసాద్, అడ్మిషన్ల డెరైక్టర్ ప్రొఫెసర్ కె.నరేంద్ర పాల్గొన్నారు. -
ఐఐటీల్లో బీటెక్..బెస్ట్ బ్రాంచ్‌లు.. బెటర్ క్యాంపస్‌లు
జేఈఈ-అడ్వాన్స్డ్ ర్యాంకులు మరో రెండు రోజుల్లో వెల్లడి కానున్నాయి. ఐఐటీల్లో ప్రవేశానికి హాజరైన లక్షన్నర మంది అభ్యర్థుల భవితవ్యం తెలియనుంది. ఆన్లైన్ ఛాయిస్ ఫిల్లింగ్‌కు సమయం (జూన్ 20 నుంచి 24 వరకు) సమీపించింది. అందుబాటులోని సీట్ల సంఖ్యతో పోల్చితే తుది విజేతలుగా నిలిచేది కొందరే. ఆ కొందరిలోనూ ఎన్నో సందేహాలు. ఏ ఐఐటీలో చేరితే మంచిది? ఏ బ్రాంచ్‌కు ఏ ఐఐటీ బెస్ట్? తదితర సందేహాలు తలెత్తడం సహజం. ఈ నేపథ్యంలో.. గతేడాది (2013లో) ఇన్స్టిట్యూట్లు, బ్రాంచ్‌ల వారీగా క్లోజింగ్ ర్యాంకుల వివరాలు తెలుసుకుంటే కొంతమేర అవగాహన పొందొచ్చు. వివరాలు.. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బీటెక్ కోర్సులో జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకర్లలో అత్యధికుల ఫస్ట్ ఆప్షన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. గత కొన్నేళ్లుగా టాప్ ర్యాంకర్ల ఛాయిస్‌గా సీఎస్ఈ బ్రాంచ్ నిలుస్తోంది. గతేడాది జనరల్ సహా అన్ని కేటగిరీల ర్యాంకర్లలో టాప్-10లోపు విద్యార్థులు సీఎస్‌ఈకే మొగ్గు చూపారు. ఇక ఇన్స్టిట్యూట్ పరంగా సీఎస్ఈ బ్రాంచ్‌కు టాపర్ల బెస్ట్ క్యాంపస్‌గా నిలుస్తోంది ఐఐటీ-బాంబే. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, ఆర్ అండ్ డీ ఒప్పందాలు, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నిరంతరం సిలబస్‌లో మార్పులు, చేర్పులు, పూర్వ విద్యార్థుల విజయాలు వంటివి ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొనొచ్చు. బీటెక్ కోర్సులో చేరే విద్యార్థి తాను ఎంచుకున్న బ్రాంచ్‌కు సంబంధించి కోర్సు ముగిసే సమయానికి అంటే నాలుగేళ్ల తర్వాత భవిష్యత్తు అవకాశాలను అంచనా వేసి ఎంపిక చేసుకోవాలి. ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో భవిష్యత్తు అవకాశాల పరంగా ఆందోళన అనవసరం. కంప్యూటర్, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌ల రూపకల్పన, వాటి అనువర్తన చేయడం, పనిచేసే రంగాన్ని బట్టి తదనుగుణమైన సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్స్, అప్లికేషన్స్ రూపొందించడం వంటివి కంప్యూటర్ సైన్స్ నిపుణులు చేస్తారు. ప్రస్తుతం ప్రతి రంగంలో కంప్యూటరీకరణ చోటు చేసుకుంటున్న నేపథ్యంలో.. అవకాశాలు కోకొల్లలు. ఈ విభాగంలో అన్ని ఐఐటీల్లో అందుబాటులో ఉన్న మొత్తం సీట్ల సంఖ్య 923. ఎలక్ట్రికల్.. ఎవర్గ్రీన్ ఆధునికీకరణ, మౌలికసదుపాయాల కల్పన, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంపు దిశగా తీసుకుంటున్న చర్యల కారణంగా.. కోర్ సెక్టార్లో క్రేజీ బ్రాంచ్‌గా నిలుస్తోంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఎన్నో రకాల విద్యుత్ ఉత్పత్తి మార్గాలు ప్రధానంగా అణు విద్యుత్ ఉత్పత్తి, సౌర విద్యుత్ ఉత్పత్తి, జల విద్యుత్ ఉత్పత్తిలో ఎలక్ట్రికల్ ఇంజనీర్లదే కీలక పాత్ర. కేవలం విద్యుత్ ఉత్పత్తికే పరిమితం కాకుండా.. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తయారీలోనూ ఎలక్ట్రికల్ ఇంజనీర్ల ప్రమేయం ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవకాశాల పరంగానూ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎవర్గ్రీన్ బ్రాంచ్ అని పేర్కొనొచ్చు. అందుకే జేఈఈ అడ్వాన్స్డ్ టాపర్లలో రెండో ఛాయిస్‌గా ఈ బ్రాంచ్ నిలుస్తోంది. గత ఏడాది ఏడో ర్యాంకు అభ్యర్థి ఐఐటీ-బాంబేలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌ను ఎంచుకోవడమే ఇందుకు నిదర్శనంగా పేర్కొనొచ్చు. అదేవిధంగా ఇతర ఐఐటీల్లోనూ ఓపెనింగ్ ర్యాంకుల పరంగా తొలి వందలోపు ర్యాంకర్ల ఛాయిస్‌గా నిలిచింది ఎలక్ట్రికల్. ఇన్స్టిట్యూట్ పరంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌కు కూడా ఐఐటీ-బాంబేనే క్రేజీ క్యాంపస్. క్లోజింగ్ ర్యాంకులే ఇందుకు నిదర్శనం. మొత్తం ఐఐటీలు, ఐఎస్ఎం-ధన్బాద్లో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య 1070. మెకానికల్ ఇంజనీరింగ్ ఐఐటీల్లో ఓపెనింగ్, క్లోజింగ్ ర్యాంకుల ఆధారంగా గత నాలుగైదేళ్ల గణాంకాలను విశ్లేషిస్తే.. ర్యాంకర్ల మూడో ముఖ్య ఛాయిస్‌గా నిలుస్తున్న బ్రాంచ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఈ బ్రాంచ్ విషయంలోనూ ఐఐటీ-బాంబేకే ర్యాంకర్ల ప్రాధాన్యం. గతేడాది ఈ క్యాంపస్‌లో ఓబీసీ మినహాయించి అన్ని కేటగిరీల్లోనూ 50లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులతో ఓపెనింగ్ ర్యాంకులు మొదలవగా.. క్లోజింగ్ ర్యాంకుల విషయంలోనూ ఐదొందల లోపు ర్యాంకులతో సీట్లు భర్తీ అయ్యాయి. దేశంలో ఉత్పత్తి రంగం, ఆర్ అండ్ డీ కార్యకలాపాల విస్తరణ, ఆటోమొబైల్-మెకానికల్ రంగాల వృద్ధి తదితర కారణాలతో ఉద్యోగావకాశాలు ఎక్కువ ఉండటంతో విద్యార్థు లు ఈ బ్రాంచ్‌ను ఎంచుకుంటున్నారు. మొత్తం అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య 1125. కెమికల్ ఇంజనీరింగ్ పదకొండు ఐఐటీలు, ఐఎస్ఎం-ధన్‌బాద్‌లలో 800 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్న కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ పట్ల కూడా టాప్ ర్యాంకర్స్ ఆసక్తి చూపుతున్నారు. గత రెండేళ్లుగా ఆయా ఐఐటీల్లోని ఓపెనింగ్ ర్యాంకుల కోణంలో పరిశీలిస్తే.. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ బ్రాంచ్‌ల తర్వాత స్థానంలో నిలుస్తున్న బ్రాంచ్ ఇది. పారిశ్రామిక అభివృద్ధి, వివిధ ఉత్పత్తుల తయారీ, అందులో కెమికల్ ఇంజనీర్ల ప్రమేయం తప్పనిసరైన నేపథ్యంలో అవకాశాల విషయంలోనూ ఢోకాలేని బ్రాంచ్.. కెమికల్ ఇంజనీరింగ్. ఫార్మాస్యూటికల్ సంస్థలు, డ్రగ్ ఫార్ములేషన్ విభాగాలు, ఇతర రసాయన పరిశోధన సంస్థల్లో కెమికల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులకు అవకాశాలు ఖాయం. ఐఐటీల వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఈ కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులు కంపెనీల దృష్టిలో హాట్‌కేక్‌లుగా నిలుస్తున్నారు. సగటున రూ. 20లక్షలకుపైగా వార్షిక వేతనం ఖరారవుతోంది. సివిల్ ఇంజనీరింగ్ ఎన్నో ఏళ్లుగా ఐఐటీ బీటెక్ ఔత్సాహిక విద్యార్థులు ఆసక్తి చూపుతున్న మరో కోర్ బ్రాంచ్.. సివిల్ ఇంజనీరింగ్. పన్నెండు ఐఐటీలు, ఐఎస్ఎం-ధన్బాద్లో అందుబాటులో ఉన్న 891 సీట్ల కోసం పోటీ తీవ్ర స్థాయిలో ఉంది. ఐఐటీ-బాంబేలో గతేడాది ఓపెన్ కేటగిరీలో 400 ర్యాంకుకు తొలి సీటు లభించగా.. ఇదే విభాగంలో క్లోజింగ్ ర్యాంకు 1688గా నమోదవడమే ఇందుకు నిదర్శనం. రిజర్వ్డ్ కేటగిరీల్లో ఇంతకంటే తక్కువ ర్యాంకులో ఓపెనింగ్, క్లోజింగ్ ర్యాంకులు ఉండటం గమనార్హం. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తుండటం, జాతీయ రహదారుల విస్తరణ, ఇతర ప్రాజెక్టుల నిర్మాణం తదితర కారణాలతో సివిల్ ఇంజనీరింగ్ ఆకర్షణీయ బ్రాంచ్‌గా నిలుస్తోంది. అంతేకాకుండా సమీప భవిష్యత్తులో మరిన్ని అవకాశాలకు కేరాఫ్‌గా నిలవనుంది. ప్రధానంగా 12వ ప్రణాళిక కాలంలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక కేటాయింపులు చేయడంతో పలు పథకాలు అమలు కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కోర్సులో చేరి.. నాలుగేళ్ల తర్వాత సర్టిఫికెట్ అందుకునే వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, వేతనాల విషయంలో ఎలాంటి ఢోకా లేదు. ప్రైవేటు సెక్టార్‌తోపాటు, వివిధ ప్రభుత్వ రంగ కంపెనీల్లోనూ సివిల్ ఇంజనీర్లకు అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఇంజనీరింగ్ ఫిజిక్స్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌ల సమ్మేళనంగా ఉండే ఇంజనీరింగ్ ఫిజిక్స్ బ్రాంచ్‌పై కూడా ర్యాంకర్లలో ఆసక్తి నెలకొంది. కేవలం ఆరు ఐఐటీ క్యాంపస్‌లు(బాంబే, హైదరాబాద్, గువహటి, చెన్నై, ఢిల్లీ, వారణాసి) మాత్రమే ఈ కోర్సును అందిస్తున్నాయి. మొత్తం 198 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అత్యధికంగా ఢిల్లీ ఐఐటీలో 63 సీట్లు ఉండగా.. అత్యల్పంగా హైదరాబాద్ ఐఐటీలో 10 సీట్లు లభిస్తున్నాయి. ఐఐటీ-వారణాసిలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సు అందుబాటులో ఉంది. భౌతిక శాస్త్ర సిద్ధాంతాలు, సూత్రాలు, భావనలు.. అదే విధంగా మ్యాథమెటికల్ న్యూమరిక్స్ ఆధారంగా ఇంజనీరింగ్ ఉత్పత్తుల ప్రక్రియకు సంబంధించి శిక్షణ కల్పించే ఈ కోర్సు సైన్స్ ఔత్సాహిక విద్యార్థులకు బాగా కలిసొస్తుంది. ఇంజనీరింగ్‌లో ఆర్ అండ్ డీ దిశగా లక్ష్యాలు ఏర్పరచుకున్న వారికి బాగా సరితూగే కోర్సు ఇంజనీరింగ్ ఫిజిక్స్ అని నిపుణుల అభిప్రాయం. కోర్సు పూర్తి చేసుకున్న వారికి ఇస్రో, బార్క్, డీఆర్డీఓ వంటి పరిశోధన సంస్థల్లో ఉపాధి గ్యారంటీ. ఆసక్తి ఉంటేనే కెమికల్ ఇంజనీరింగ్ ఐఐటీల్లో ఏ బ్రాంచ్‌లో సీటు వచ్చినా బంగారు భవిష్యత్తు ఖాయం అనేది నిస్సందేహం. అయితే కొన్ని కోర్ బ్రాంచ్‌ల విషయంలో విద్యార్థుల ఆసక్తి మీదే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా అధికశాతం ఓర్పు, నేర్పుతో ప్రయోగశాలల్లో నిరంతర పరిశోధనల్లో గడపాల్సిన కెమికల్ ఇంజనీరింగ్‌లో ఇది ఎంతో ముఖ్యం. కాబట్టి జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదలయ్యాక విద్యార్థులు ఆన్లైన్ ఛాయిస్ ఫిల్లింగ్ సమయంలో కోర్సు, క్యాంపస్ విషయంలో ఆచితూచి వ్యవహరించి ప్రాధమ్యాలు పేర్కొనాలి. ప్రస్తుతం ఐఐటీల్లో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు సగటున రూ. 15 నుంచి రూ. 20 లక్షల వరకు వార్షిక వేతనంతో క్యాంపస్ రిక్రూట్మెంట్లు లభిస్తున్నాయి. అయితే కెమికల్ ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థులు బీటెక్ సర్టిఫికెట్‌తోనే పరిమితం కాకుండా భవిష్యత్తులో మరిన్ని సమున్నత స్థానాలు సొంతం చేసుకోవాలి. - ప్రొఫెసర్॥వి.ఆర్. పెద్దిరెడ్డి, డీన్ (కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్), ఐఐటీ-భువనేశ్వర్ కొత్త ఐఐటీల్లో ముందంజలో హైదరాబాద్ కేంద్ర ప్రభుత్వం 2008లో ఏర్పాటు చేసిన కొత్త ఐఐటీల్లో.. ఇతర ఇన్స్టిట్యూట్లతో పోల్చితే ఐఐటీ-హైదరాబాద్ అకడెమిక్స్, రీసెర్చ్ అన్ని కోణాల్లో శరవేగంగా ముందుకు దూసుకుపోతోంది. పాత ఐఐటీలతో పోటీ పడుతోంది. అకడెమిక్స్ కోణంలో ఇంజనీరింగ్ ఫిజిక్స్ వంటి ప్యూర్ కోర్ బ్రాంచ్‌లను సైతం ప్రారంభించింది. అటు రీసెర్చ్ పరంగానూ పలు అంతర్జాతీయ ఇన్స్టిట్యూట్లు, పరిశ్రమలతో ఒప్పందాల ద్వారా స్పాన్సర్డ్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాం. అయితే ఐఐటీ ప్రవేశాల్లో ప్రత్యేకంగా స్థానిక కోటా అమలులో లేనందున ఇక్కడి విద్యార్థులు.. ఈ ఇన్స్టిట్యూట్లో గతంలో లభించిన ర్యాంకుల ఆధారంగా ప్రాధమ్యాలను పేర్కొనడం మంచిది. ఒకసారి ఐఐటీలో అడుగుపెట్టిన విద్యార్థులు.. నిరంతర అభ్యసనం, అన్వేషణలతో ముందుకు కదిలితేనే మంచి భవిష్యత్తు లభిస్తుంది. - ప్రొఫెసర్ ఫయాజ్ అహ్మద్ ఖాన్, డీన్, అకడెమిక్స్, ఐఐటీ-హైదరాబాద్ ఎన్నటికీ వన్నె తగ్గని కోర్ బ్రాంచ్‌లు ఐఐటీ అడ్వాన్స్డ్ ఫలితాల్లో విజయం సాధించిన విద్యార్థులు ముందుగా గుర్తించాల్సింది కోర్ బ్రాంచ్‌ల ప్రాధాన్యం. నేటి పోటీ ప్రపంచంలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఎన్నో కొత్త బ్రాంచ్‌లు రూపొందుతున్నప్పటికీ.. వాటికి మూలం కోర్ బ్రాంచ్‌ల నుంచే మొదలవుతుంది. కాబట్టి విద్యార్థులు.. ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ తదితర కోర్ బ్రాంచ్‌లవైపు మొగ్గు చూపితే భవిష్యత్తులో.. వారి ఆసక్తికి అనుగుణంగా అనుబంధ స్పెషలైజేషన్లలో పీజీ, పీహెచ్‌డీలు చేసే అవకాశాలు ఉన్నాయి. పదివేల లోపులోనే ఉండే సీట్ల ఎంపిక క్రమంలో.. ఆన్లైన్ ఛాయిస్ ఫిల్లింగ్‌లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అభ్యర్థులు తమకు నచ్చిన ఇన్స్టిట్యూట్, బ్రాంచ్‌లకు గతంలోని చివరి ర్యాంకులను పరిశీలించి వాటిని తమ ప్రస్తుత ర్యాంకుతో బేరీజు వేసుకుని ఆన్లైన్ ఛాయిస్ ఫిల్లింగ్‌కు ఉపక్రమించాలి. ప్రాధమ్యాల ఎంపిక విషయంలో ఎలాంటి పరిమితులు లేనందున దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. - ప్రొఫెసర్॥అశోక్ ఝున్‌ఝున్‌వాలా ప్రొఫెసర్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (ఐఐటీ-మద్రాస్), ఐఐఐటీ-హైదరాబాద్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు. విభిన్న దృక్పథంతో అడుగు పెట్టాలి ఐఐటీల్లో ప్రవేశించాలనుకునే విద్యార్థులు ఇప్పటి నుంచే తమ ఆలోచన దృక్పథాన్ని మార్చుకోవాలి. ఇప్పటి వరకు స్పూన్ ఫీడింగ్ ద్వారా అకడెమిక్స్ను ఔపోసన పట్టిన విద్యార్థులు.. ఐఐటీల్లో చేరాక స్వీయ అభ్యసనం, రెగ్యులర్ నాలెడ్జ్ అప్డేషన్ చేసుకుంటూ ముందుకు సాగితేనే సంబంధిత బ్రాంచ్‌పై పట్టు లభిస్తుంది. అంతేకాకుండా విభిన్న సంస్కృతుల నుంచి వచ్చే సహచర విద్యార్థులతో, అదే విధంగా ఫ్యాకల్టీ సభ్యులతో మమేకమయ్యేలా తమను తాము తీర్చిదిద్దుకోవాలి. ఐఐటీల్లో నియమ నిబంధనలు.. తొలినాళ్లలో తాజా విద్యార్థులను కొంత ఆందోళనకు గురి చేస్తాయి. కానీ వాటికి భయపడకూడదు. తాము ఐఐటీలో చేరిన లక్ష్యాన్ని నిరంతరం స్ఫురించుకుంటే ఎన్ని సవాళ్లు ఎదురైనా ఇట్టే అధిగమించి.. అద్భుత ఫలితాలు సాధించొచ్చు. - ప్రొఫెసర్॥వి. రాజ్‌కుమార్, వైస్ చాన్స్‌లర్-ఆర్జీయూకేటీ (మాజీ డీన్ అకడెమిక్ అఫైర్స్- ఐఐటీ ఖరగ్‌పూర్) బ్రాంచ్ ఏదైనా.. బాంబేకే ప్రాధాన్యం గత కొన్నేళ్లుగా ఐఐటీ ర్యాంకర్లలో అధికశాతం విద్యార్థులు ఆసక్తి చూపుతున్న ఇన్స్టిట్యూట్ ఐఐటీ-బాంబే. బీటెక్‌లో ఏ బ్రాంచ్ అయినప్పటికీ మెజారిటీ విద్యార్థుల ఓటు బాంబేకే ఉంటోంది. ఇందుకు ఎన్నో కారణాలు. ఇక్కడ పాటిస్తున్న అకడెమిక్ ప్రమాణాలు, నిరంతర ఆర్ అండ్ డీ, గ్రాడ్యుయేట్ స్థాయి నుంచే రీసెర్చ్ ఓరియెంటేషన్ బోధన, పలు అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాల ద్వారా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందడమే ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొనొచ్చు. అంతేకాకుండా ఇక్కడ చేరే ప్రతిభావంతులైన విద్యార్థులకు పూర్వ విద్యార్థుల నుంచి ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా లభిస్తున్నాయి. ఈ క్రమంలో ఐఐటీ బాంబే హెరిటేజ్ ఫౌండేషన్ పేరుతో ఎన్నో రకాల స్కాలర్షిప్లను అందిస్తున్నారు. ఇలా.. ఆర్థిక ప్రోత్సాహకాలు.. అకడెమిక్స్‌లో నాణ్యతలే ఐఐటీ-బాంబేపై మెజారిటీ విద్యార్థుల ఆసక్తికి కారణం. - ప్రొఫెసర్॥కె.వి. కృష్ణారావు, సివిల్ ఇంజనీరింగ్, ఐఐటీ-ముంబై -
మైక్రోసాఫ్ట్ గుర్తించిన అతిచిన్న టెక్నాలజీ స్పెషలిస్ట్...
తొమ్మిదేళ్ళ ప్రాయంలోనే ప్రణవ్ కళ్యాణ్ మైక్రోసాఫ్ట్ సర్టిఫికెట్ టెక్నాలజీ (ఎం.సి.టి.ఎస్.) నిర్వహించిన ఎ.ఎస్.పి.నెట్. ఫ్రేమ్‌వర్క్ 3.5 ఆధారిత పరీక్షలో ఉత్తీర్ణుడై అతిపిన్న ప్రోగ్రామర్‌గా గుర్తింపు పొందాడు. దీనిని ప్రపంచంలోనే అత్యంత కష్టమైన కంప్యూటర్ పరీక్షగా భావిస్తారు. ఇప్పటికే పిన్న వయసులో కంప్యూటర్ సైన్స్‌లో అసాధారణ ప్రతిభను కనబర్చిన వ్యక్తుల వికీపీడియా జాబితాలో ప్రణవ్ స్థానం పొందాడు. ప్రణవ్ రెండు సంవత్సరాల వయసులోనే బొమ్మలతో కాకుండా కంప్యూటర్‌పై ఆసక్తి చూపేవాడు. లాస్‌ఏంజిలెస్‌లోని బ్యాంక్ ఆఫ్ అమెరికాలో పనిచేసే ఈ చిన్నది తండ్రి కళ్యాణ్‌కుమార్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ పైన ప్రణవ్‌కు ఉన్న ఆసక్తి చూసి ఎం.సి.టి.ఎస్. పరీక్షకు సిద్ధం చేశారు. ఆరేళ్ల ప్రాయం నుంచి ప్రణవ్ హెచ్టిఎమ్ఎల్ ప్రోగ్రామ్ని నేర్చుకోవడం ప్రారంభించి, రానురాను కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో ఆసక్తి పెంచుకున్నాడు. ప్రణవ్ లెక్కల్లో చాలా చురుగ్గా ఉంటాడని, 18 నెలల పాటు ఎం.సి.టి.ఎస్. పరీక్షకు సిద్ధమయ్యాడని అతని తండ్రి తెలిపారు. శని, ఆదివారాల్లో ఎనిమిది గంటల పాటు కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌కు సమయం కేటాయించేవాడని ఆయన అన్నారు. ‘భవిష్యత్తులో ఏం అవుతావు’ అని అడిగితే... ‘కంప్యూటర్ ప్రోగ్రామర్గానే కాకుండా అంతరిక్ష వ్యోమగామి కూడా కావాలనుకుంటున్నాను’ అని ప్రణవ్ బదులిచ్చాడు. -
8న బళ్లారిలో కే-సెట్
= 32 సబ్జెక్టులకు ఐదు కేంద్రాల్లో పరీక్షలు = వీఎస్కేయూ వీసీ మంజప్ప హొసమనె సాక్షి, బళ్లారి : బళ్లారి నగరంలో ఈనెల 8వ తేదీన కేసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం(వీఎస్కేయూ)వైస్ చాన్స్‌లర్ మంజప్ప హొసమనె తెలిపారు. నగర శివార్లలోని వీఎస్కేయూలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 నోడల్ కేంద్రాల్లో కేసెట్ పరీక్షలు జరుపుతున్నారని, అందులో భాగంగా బళ్లారి నగరంలోని సరళాదేవి సతీష్‌చంద్ర అగర్వాల్,ప్రభుత్వ ఎక్స్ మున్సిపల్ పీయూ కళాశాల, బసవరాజేశ్వరి పబ్లిక్ స్కూల్ అండ్ కాలేజీ, వాసవీ పీయూ కళాశాల, గాంధీనగర్ చైతన్య పీయూ కళాశాల కేంద్రాల్లో 32 సబ్జెక్ట్‌లకు సంబంధించి పరీక్షలు జరుగుతాయన్నారు. సబ్జెక్టులవారిగీ కేంద్రాలు కన్నడ, కెమికల్ సైన్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ కోర్సులకు సంబంధించి సరళాదేవి కళాశాలలో, కన్నడ, లైబ్రరీ సైన్స్, హిందీ, ఫిజికల్ సైన్స్, ఇంగ్లిష్, ఫిజికల్ ఎడ్యుకేషన్, సైకాలజీకి సంబంధించి ఎక్స్ మున్సిపల్ కళాశాలలో, ఎకనామిక్స్ సోషియల్ వర్క్, లైఫ్ సైన్స్, మేనేజ్మెంట్ మాస్ కమ్యూనికేషన్, ఉర్దూ బసవరాజేశ్వరీ పీయూ కళాశాలలో, సోషియాలజీ, మేథమెటికల్ సైన్స్, ఎలక్ట్రానిక్ సైన్స్, పర్యావరణ పరిరక్షణ సమితి ఎగ్జామ్స్, అర్థ్ సైన్స్, లా, హోంసైన్స్ వాసవీ పీయూ కళాశాలలో, హిస్టరీ, ఎడ్యుకేషన్, పొలిటికల్ సైన్స్, జియోగ్రఫి, సాంస్కృతికం, ఫ్లో లిటరేచర్, పబ్లిక్ అడ్మిస్ట్రేషన్ చైతన్య కళాశాలలో ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం బళ్లారి సెంటర్లలో 3626 మంది విద్యార్థులకు హాల్ టికెట్లు అందజేశారన్నారు. ఫస్ట్, సెకెండ్ పేపర్లు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మూడవ పేపర్ మధ్యాహ్నం 1.30 నుంచి 4 గంటల వరకు నిర్వహిస్తామన్నారు.