కంప్యూటర్ సైన్స్ (సీఎస్) కారణంగా మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కోర్స్‌లు ఉనికిని కోల్పోతున్నాయా? అందుకు కారణాలేంటి? డబ్బు కోసమే సీఎస్‌లో చేరుతున్నారా? విద్యార్ధులు ఏమంటున్నారు?
ఈ ఏడాది తొలి 100 ఐఐటీ ర్యాంకర్లలో 89 మంది ఐఐటి బాంబేలో చేరారు. వారిలో ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ (సీఎస్)ను చదివేందుకు మొగ్గుచూపారు. అందుకు కారణం! ‘ఆర్థిక స్థిరత్వం, ఆకర్షణీయమైన ఉద్యోగ అవకాశాలేనని ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అప్లైడ్ మెకానిక్స్ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ తెలిపారు.
అంతేకాదు, డబ్బే అన్నీంటికి మూలం ‘సివిల్ ఇంజనీర్లు, మెకానికల్ ఇంజనీర్లతో పోలిస్తే ఐటీ సంబంధిత విభాగాల్లో ఉద్యోగం చేస్తున్న కంప్యూటర్ ఇంజనీర్ల మధ్య జీతం వ్యత్యాసం చాలా ఉంది. సీఎస్ గ్రాడ్యుయేట్లకు ఐటీ పరిశ్రమలో విస్తృతమైన అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
ఈ అంశాన్ని విశ్లేషించేందుకు సీఎస్, ఐటీ విభాగాల్లోకి మారిన ఐఐటీ సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్ధులు అభిప్రాయాల్ని సేకరించగా.. గ్రాడ్యుయేట్లు వారి కెరీర్ మార్పు గురించి స్పష్టత ఇచ్చారు. ఈ సందర్భంగా 2021లో ఐఐటీ- గౌహతి సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి, ప్రస్తుతం ఐటీ జాబ్ చేస్తున్న షరీబ్ తస్నీమ్ మాట్లాడుతూ.. ‘సివిల్ ఇంజినీరింగ్ చదివి ఐటీ ఉద్యోగాలు చేయడానికి రెండు ప్రధాన కారణాలున్నాయని అన్నారు.
ముందుగా, మెకానికల్, ఎలక్ట్రానిక్, సివిల్ వంటి ఇతర విభాగాలతో పోలిస్తే కంప్యూటర్ సైన్స్ చదివి సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్న వారి జీతాలు ఎక్కువగా ఉన్నాయి. రెండవది, సివిల్ ఇంజనీర్లను రిక్రూట్ చేసే కంపెనీలు చాలా తక్కువనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో పనిచేస్తున్న ఐఐటి-ఢిల్లి 2019-21 మెకానికల్ బ్రాంచ్‌కు చెందిన ఎంటెక్ విద్యార్థి రిషబ్ మిశ్రా మాట్లాడుతూ ‘కోర్ పరిశ్రమలలో తక్కువ అవకాశాలు, నాన్-కోర్ కంపెనీల్లో ఆకర్షణీయమైన వేతనాలున్నాయి. అందుకే నేనూ ఐటీ విభాగానికి షిఫ్ట్ అయ్యాను. మెకానికల్ నుండి కంప్యూటర్ సైన్స్ వరకు మెరుగైన అవకాశాల్ని అందించేది కంప్యూటర్ సైన్స్ రంగమేనని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment