mechanical engineering
-
మరో భారతీయ విద్యార్థి అమెరికాలో దుర్మరణం
న్యూయార్క్: ఎన్నో ఆశలతో అమెరికాలో అడుగుపెడుతున్న కొందరు భారతీయ విద్యార్థుల భవిత అర్ధంతరంగా ముగిసిపోతోంది. ఆ విషాదపర్వంలో మరో ఉదంతం తాజాగా చోటుచేసుకుంది. భారతీయ మూలాలున్న విద్యార్థి సమీర్ కామత్ సోమవారం సాయంత్రం ఇండియానా రాష్ట్రంలో విగతజీవిగా కనిపించారు. 23 ఏళ్ల సమీర్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో పీహెచ్డీ చేస్తున్నారు. క్రోవ్స్ గ్రో ప్రాంతంలోని స్థానిక నేచర్ ప్రిసర్వ్లో సమీర్ మృతదేహాన్ని కనుగొన్నట్లు వారెంట్ కౌంటీ అధికారి వెల్లడించారు. పోస్ట్‌మార్టమ్ నివేదిక వచ్చాకే మరణానికి కారణాలపై అంచనాకు రాగలమన్నారు. హైదరాబాద్ విద్యార్థిపై దాడి అమెరికాలో భారతీయ విద్యార్థులపై దాడుల పరంపర కొనసాగుతోంది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ మజహర్ అలీ అనే విద్యారి్థపై దుండుగులు దాడికి పాల్పడ్డారు. అతను ఇండియానా వెస్లియాన్ యూనివర్సిటీలో ఐటీలో మాస్టర్స్ చదువుతూ షికాగోలో నివసిస్తున్నాడు. ఈ నెల 4న ఇంటి సమీపంలో ముగ్గురు దండగులు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఇటీవల పలువురు భారత విద్యార్థులు అమెరికాలో హత్యకు గురవడం తెలిసిందే. -
'పైసా మే హై పరమాత్మ'.. కంప్యూటర్ సైన్స్ వైపు విద్యార్ధుల చూపు!
కంప్యూటర్ సైన్స్ (సీఎస్) కారణంగా మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కోర్స్‌లు ఉనికిని కోల్పోతున్నాయా? అందుకు కారణాలేంటి? డబ్బు కోసమే సీఎస్‌లో చేరుతున్నారా? విద్యార్ధులు ఏమంటున్నారు? ఈ ఏడాది తొలి 100 ఐఐటీ ర్యాంకర్లలో 89 మంది ఐఐటి బాంబేలో చేరారు. వారిలో ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ (సీఎస్)ను చదివేందుకు మొగ్గుచూపారు. అందుకు కారణం! ‘ఆర్థిక స్థిరత్వం, ఆకర్షణీయమైన ఉద్యోగ అవకాశాలేనని ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అప్లైడ్ మెకానిక్స్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ తెలిపారు. అంతేకాదు, డబ్బే అన్నీంటికి మూలం ‘సివిల్ ఇంజనీర్లు, మెకానికల్ ఇంజనీర్లతో పోలిస్తే ఐటీ సంబంధిత విభాగాల్లో ఉద్యోగం చేస్తున్న కంప్యూటర్ ఇంజనీర్ల మధ్య జీతం వ్యత్యాసం చాలా ఉంది. సీఎస్ గ్రాడ్యుయేట్లకు ఐటీ పరిశ్రమలో విస్తృతమైన అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఈ అంశాన్ని విశ్లేషించేందుకు సీఎస్, ఐటీ విభాగాల్లోకి మారిన ఐఐటీ సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్ధులు అభిప్రాయాల్ని సేకరించగా.. గ్రాడ్యుయేట్లు వారి కెరీర్ మార్పు గురించి స్పష్టత ఇచ్చారు. ఈ సందర్భంగా 2021లో ఐఐటీ- గౌహతి సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి, ప్రస్తుతం ఐటీ జాబ్ చేస్తున్న షరీబ్ తస్నీమ్ మాట్లాడుతూ.. ‘సివిల్ ఇంజినీరింగ్ చదివి ఐటీ ఉద్యోగాలు చేయడానికి రెండు ప్రధాన కారణాలున్నాయని అన్నారు. ముందుగా, మెకానికల్, ఎలక్ట్రానిక్, సివిల్ వంటి ఇతర విభాగాలతో పోలిస్తే కంప్యూటర్ సైన్స్ చదివి సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్న వారి జీతాలు ఎక్కువగా ఉన్నాయి. రెండవది, సివిల్ ఇంజనీర్లను రిక్రూట్ చేసే కంపెనీలు చాలా తక్కువనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో పనిచేస్తున్న ఐఐటి-ఢిల్లి 2019-21 మెకానికల్ బ్రాంచ్‌కు చెందిన ఎంటెక్ విద్యార్థి రిషబ్ మిశ్రా మాట్లాడుతూ ‘కోర్ పరిశ్రమలలో తక్కువ అవకాశాలు, నాన్-కోర్ కంపెనీల్లో ఆకర్షణీయమైన వేతనాలున్నాయి. అందుకే నేనూ ఐటీ విభాగానికి షిఫ్ట్ అయ్యాను. మెకానికల్ నుండి కంప్యూటర్ సైన్స్ వరకు మెరుగైన అవకాశాల్ని అందించేది కంప్యూటర్ సైన్స్ రంగమేనని చెప్పారు. -
ఏపీ విద్యార్థుల ప్రతిభ.. 15 రూపాయలకే.. 45 కిలోమీటర్ల ప్రయాణం
సాక్షి, అమరావతి: తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించేలా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఎస్ఆర్ఎం విద్యార్థులు రెట్రోఫిట్ ఎలక్ట్రిక్ బైక్‌ను రూపొందించారు. పాత బైక్‌కు లిథియమ్ అయాన్ బ్యాటరీని అమర్చి, వెనుక చక్రానికి మోటార్ బిగించడం ద్వారా వాహనం ముందుకు నడిచేలా తయారు చేశారు. 2 నెలల పాటు శ్రమించి వాయు, శబ్ధ కాలుష్యం లేని ఎలక్ట్రిక్ బైక్‌ను తయారుచేసినట్టు మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు రవితేజరెడ్డి, ఎ.చైతన్య, పాబోలు మోహన్ ఆదిత్య, కె.ప్రవీణ్, కె.యశస్విని, శ్రావ్య, వాసు, ప్రియాంక తెలిపారు. రెండు దశల పరీక్షల అనంతరం గురువారం వర్సిటీలో దీనిని ప్రదర్శించారు. పోర్టబుల్ బ్యాటరీ మెకానిజమ్ డిజైన్ పేటెంట్ కోసం దరఖాస్తు చేసినట్టు తెలిపారు. ఈ–బైక్ ప్రత్యేకతలు ఇలా.. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో నడిచే రెట్రోఫిట్ ఎలక్ట్రిక్ బైక్.. పూర్తిగా చార్జింగ్ అవడానికి రెండున్నర గంటల సమయం పడుతుంది. ఇందుకు రూ.15 మాత్రమే ఖర్చవుతుంది. ఒకసారి చార్జింగ్‌తో సుమారు 45 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తే 35 కిలోమీటర్లు మేర చార్జింగ్ వస్తుంది. రివర్స్ సదుపాయంతో పాటు ఎలక్ట్రిక్ బ్రేక్‌ను అమర్చారు. బైక్‌ను తయారుచేసిన విద్యార్థులను వైస్ చాన్సలర్ డి.నారాయణరావు, ఆచార్య వజ్జా సాంబశివరావు, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకట్ నోరి అభినందించారు. -
బుల్లెటు బండెక్కి డుగ్గుడుగ్గుమని వచ్చేత్తపా... వచ్చేత్తపా
బుల్లెటు బండి ఎక్కి డుగ్గు డుగ్గుమని వచ్చేత్తపా...వచ్చేత్తపా పాట ఎంత వైరల్ అయిందో చెప్పనక్కర్లేదు. ఈ పాటలో కొన్ని చరణాలు ఇలా ఉంటాయి... నువ్వు యాడంగ వస్తావురో/ చెయ్యి నీ చేతి కిస్తారో ఈ చరణాలను కొట్టాయంకు తీసుకువెళితే అక్కడ మస్త్‌గా సూట్ అవుతాయి. అయితే అక్కడ పాడుతున్నది పెళ్లికూతురు కాదు. ఎదురు చూస్తుంది పెళ్లికొడుకు కోసం కాదు. స్వయంగా బుల్లెట్ బండే! కొట్టాయంలో ఏ బుల్లెట్ బండికి ఏ ట్రబుల్ వచ్చినా బుల్లెట్ బండిపై రయిరయ్యిమని వచ్చి ట్రబుల్ షూట్ చేసి వెళుతుంటుంది ఆమె. అందుకే ‘బుల్లెట్ దివ్య’ అని కూడా ఆమెను పిలుచుకుంటారు. ‘నా బుల్లెట్ బండి తరచుగా ట్రబులిస్తోంది. మంచి మోకానిక్ ఉంటే చెప్పు...’ కొద్దిసేపటి తరువాత: ‘ఇదిగో బాబాయ్ మంచి మెకానిక్. ఈ అమ్మాయి చేయిపడితే ఇక తిరుగే ఉండదు’ ‘ఈ పాప బుల్లెట్‌బండి ఏం బాగుచేస్తుందయ్యా...నీ పిచ్చిగానీ....పదా వేరే మెకానిక్ దగ్గరికి’ ‘బాబాయ్... నా మాట విని కొద్దిసేపు ఓపిక పట్టు’ కొద్దిసేపటి తరువాత.... ‘నిజమే సుమీ...టకీమనీ చేసి పారేసింది. ఏదో మంత్రం వేసినట్లుగానే ఉంది. పేరేంటి పాపా నీది? దివ్యా! వెరీగుడ్నేమ్’ కేరళలోని కొట్టాయంలో ఇలాంటి సంభాషణలు వినిపించడం కొత్తేమీ కాదు. కమల్‌హాసన్ పాట గుర్తుంది కదా... రాజా చేయివేస్తే అది రాంగై పోదులేరా! దివ్య జోసెఫ్ చేయి పడితే చాలు రాంగ్గా మొరాయిస్తున్న బండ్లు రైటైపోతాయి. మళ్లీ ఫామ్‌లోకి వస్తాయి. ఇంతకీ దివ్య జోసెఫ్ మెకానిక్ ఎందుకు అయింది? తన కుటుంబ భారాన్ని మోయడానికి మాత్రం కాదు. మెకానిజం అంటే ఆమెకు పాషన్! నాన్న పులిక్కపరంబిల్ జోసెఫ్ మెకానిక్. ఆయనకు కొట్టాయంలో వర్క్‌షాప్ ఉంది. బడి అయిపోగానే దివ్య వచ్చేది ఇక్కడికే. ఇది తనకు మరో బడి. అక్కడ ఉన్న బుల్లెట్ బండ్లు తన తోబుట్టువులుగానే అనిపించేవి. చూస్తూ చూస్తూనే ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ నుంచి ఆయిల్ అండ్ కేబుల్ ఛేంజెస్ వరకు ఏ టూ జెడ్ అన్నీ నేర్చేసుకుంది. యంత్రవేగంతో బుల్లెట్ బండ్లను బాగుచేస్తుంది. ఒకానొక దశలో తల్లిదండ్రులు భయపడ్డారు, మెకానిజం ధ్యాసలో పడి చదువులో వెనకబడిపోతుందేమోనని! కానీ అలా ఎప్పుడూ జరగలేదు. చదువులో దివ్య ఎక్కడా తగ్గలేదు. దీంతో వారు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ప్రస్తుతం దివ్యా జోసెఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతోంది. బుల్లెట్ బండ్ల సర్వీస్ ద్వారా వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని సోషల్ సర్వీస్ కు కూడా వెచ్చించాలని నిర్ణయించుకుంది. శభాష్ దివ్యా! -
కృత్రిమ గుండె తయారీపై..ఓయూలో పరిశోధన
ఉస్మానియా యూనివర్సిటీ: కృత్రిమ గుండె తయారీపై ఉస్మానియా విశ్వవిద్యాలయం దృష్టి సారించింది. ఇంజనీరింగ్ కాలేజీలోని సెంటర్ ఫర్ ప్రోడక్ట్ డిజైన్ డెవలఫ్‌మెంట్ ఆడిటివ్ మేనేజ్మెంట్ (సీపీడీడీఏఎం), ఉస్మానియా మెకానికల్ ఇంజ నీరింగ్ విభాగాలు సంయుక్తంగా ఈ పరిశోధన చేస్తున్నాయి. త్రీడీ ప్రింటింగ్ సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పటికే ఎముకలు, దంతాలు, మోకాలి చిప్పలు, ఏరోస్పేస్, ఆటోమొబైల్ వస్తువుల తయారీలో అనుభవం సంపాదించిన పరిశోధకులు.. తాజాగా కృత్రిమ గుండె తయారీపై దృష్టి సారించారు. గుండె ఆకృతి రూపకల్పనకు సంబంధించిన కార్యకలాపాలు ఇప్పటికే 50 శాతం పూర్తి చేశారు. మరో 6 నెలల్లో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే తయారుచేసిన గుండె పనితీరును ముందు జంతువులపై ప్రయోగించనున్నారు. ఆశించిన ఫలితాలు వచ్చిన తర్వాతే మానవులకు అమర్చనున్నారు. ఈ కృత్రిమ గుండె రూప కల్పన పరిశోధనలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ నేతృత్వంలో జరుగుతున్న ఈ పరిశోధనలో డాక్టర్ ఎల్.శివరామకృష్ణ, డాక్టర్ మధుసూదన్‌రాజు సహా మరో ముగ్గురు పరిశోధక విద్యార్థులు పాల్గొంటున్నారు. ఇప్పటికే అమెరికాలో కృత్రిమ గుండెను తయారు చేశారు. దానికి అమర్చిన బ్యాటరీ బరువు రెండున్నర కేజీలకుపైగా ఉంది. బ్యాటరీ బరువును 500 గ్రాములకు తగ్గించారు. గుండెకు సమీపంలో ఛాతీ లోపలే బ్యాటరీ అమర్చే వెసులుబాటును కల్పించేలా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. రూసా నిధులతో అభివృద్ధి: సీపీడీడీఏఎం డైరెక్టర్ శ్రీరామ్ వెంకటేశ్ ‘రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్ష అభియాన్ (రూసా) ప్రాజెక్టు ద్వారా వచ్చిన రూ.5.5 కోట్లతో వర్సిటీలో ఈ సీపీడీడీఏఎం అభివృద్ధి చేశాం. సహజమైన గుండె పనితీరుకు ఏ మాత్రం తీసి పోనివిధంగా దీన్ని తీర్చిదిద్దుతున్నాం. కేబుల్‌తో పనిలేకుండా ఛాతీ లోపల ఉన్న బ్యాటరీనీ ఎప్పుడంటే అప్పుడు రీచార్జి చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం. గుండెపైనే కాకుండా కాలేయం, ఊపిరితిత్తులపై కూడా పరిశోధనలు చేస్తున్నాం.’ చదవండి: ‘టి ఫైబర్’తో రైతు వేదికలకు ఇంటర్నెట్.. -
మెకానికల్‌లో సర్టిఫికేషన్స్ ఇవే..
ఇంజనీరింగ్ కోర్సులు చదువుతున్న/ఉత్తీర్ణులైన విద్యార్థులు మంచి ఉద్యోగం సాధించాలంటే అకడమిక్ సర్టిఫికెట్లతోపాటు ఆయా బ్రాంచ్‌ల్లో సర్టిఫికేషన్ కోర్సులు కూడా పూర్తి చేయాల్సిందే. అప్పుడే కోరుకున్న ఉద్యోగం దక్కుతుందని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు అందుబాటులో ఉన్న కొన్ని సర్టిఫికేషన్ కోర్సుల గురించి తెలుసుకుందాం.. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అతి పురాతన, సంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సు. మెకానికల్‌లో డిజైన్, డెవలప్మెంట్, టెస్టింగ్, ఇన్స్టాలేషన్ తదితర విభాగాల్లో ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతిక మార్పులు వస్తున్నాయి. ఇందులో రాణించాలంటే తాజా నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి. వీటి కోసం ప్రత్యేక సర్టిఫికేషన్ కోర్సులు ఉన్నాయి. అవి.. స్టాటిస్టికల్ ప్రాసెస్ కంట్రోల్ ట్రైనింగ్ కోర్సులు: ఈ కోర్సులు గణాంక పద్ధతుల ద్వారా ఒక ఉత్పత్తిని నాణ్యతతో రూపొందించడానికి ఉపయోగపడతాయి. ఉత్పత్తి, పర్యవేక్షణ, నియంత్రణ, నాణ్యతా ప్రమాణాలు పెంపొందించడానికి సంబంధించిన నైపుణ్యాలను పొందేలా కోర్సులు ఉంటాయి. ఎన్డీటీ కోర్సులు: ఉత్పత్తుల ప్రామాణికతను, నాణ్యతను పరీక్షించడానికి ఉపకరించేది ఎన్డీటీ (నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్) సర్టిఫికేషన్స్. ఉత్పత్తి, ప్రాసెసింగ్, హీట్ ట్రీట్మెంట్, ఆటోమొబైల్ లాంటి విభాగాల్లో ఎన్డీటీ ఇన్స్ట్రక్టర్ అవసరం ఉంటుంది. చాలావరకు ఎన్డీటీ సర్టిఫికేషన్ ప్రోగ్రాములు మూడు స్థాయిలో లెవల్- 1, లెవల్-2, లెవల్-3గా ఉంటాయి. లెవల్-1 సర్టిఫికేషన్ చేసినవారు ఒక ప్రొడక్ట్ తయారీ క్రమంలో అనుసరించాల్సిన పలు టెస్టింగ్ అంశాలను తెలుసుకుంటారు. వీరు లెవల్-2, -3 పూర్తిచేసినవారి పర్యవేక్షణలో పనిచేస్తారు. లెవల్-2లో స్వయంగా నిర్వహించాల్సిన టెస్టింగ్ అంశాలు ఉంటాయి. లెవల్-3 సర్టిఫికేషన్ చేసినవారు అభివృద్ధి, వివిధ విధానాలకు ఆమోదం తెలపడం వంటి విధులు నిర్వర్తించవచ్చు. మూడు దశల సర్టిఫికేషన్ చేస్తే తయారీ ప్రక్రియ నుంచి తుది రూపం వచ్చే వరకు అవసరమైన అన్ని అంశాలపై నైపుణ్యం లభిస్తుంది. ఆటోక్యాడ్ డిజైన్ సర్టిఫికేషన్: సాఫ్ట్వేర్ వినియోగం పెరిగిన క్రమంలో ఆటోక్యాడ్ డ్రాఫ్టింగ్ అండ్ డిజైన్‌లో సర్టిఫికేషన్ చేసిన వారికి నియామకాల్లో ప్రాధాన్యం ఉంటుంది. దీన్ని ఉపయోగించి 2డి డిజైన్, 3డి డిజైన్ మోడలింగ్ల్లో ప్రావీణ్యం పొందొచ్చు. కోర్సు పూర్తి చేసినవారు నిర్మాణం, ఆర్కిటెక్చరల్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, మెకానికల్ డిజైన్, యానిమేషన్ల్లో రాణించొచ్చు. మెకట్రానిక్స్ అండ్ రోబోటిక్స్: ఇది మెకానికల్ డిజైన్, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్, కంట్రోల్ సిస్టమ్స్ స్కిల్స్ మేళవింపు. ఇందులో మెకట్రానిక్స్-రోబోటిక్స్‌కు సంబంధించిన ఎలక్ట్రానిక్స్ అంశాలపై స్కిల్స్ నేర్పిస్తారు. రోబోటిక్స్ కోర్సులు: ప్రొడక్ట్‌ను రిమోట్ కంట్రోల్ సహాయంతో లేదా కంప్యూటర్ సూచనల మేరకు పనిచేసే విధంగా రూపొందించడంతోపాటు ఆ ప్రొడక్ట్ సరిగా పనిచేసేలా స్కిల్స్ బోధిస్తారు. -
సక్సెస్ స్పీక్స్
ఐఐటీ ఢిల్లీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్.. ప్లేస్‌మెంట్స్‌లో టాప్ కంపెనీలో ఆఫర్.. అయినా సమాజానికి నేరుగా సేవ చేసే అవకాశం సివిల్ సర్వీసెస్తోనేసాధ్యమన్న ఆలోచన.. తల్లిదండ్రుల సహకారం.. వెరసి సివిల్ సర్వీసెస్ఎగ్జామినేషన్లో జాతీయ స్థాయిలో 65వ ర్యాంకు సాధించారు కర్నూలుకు చెందిన వల్లూరి క్రాంతి రెడ్డి. -
Mechanical Engineering - Objective
1. Instantaneous centre of a body rolling without sliding on a stationary curved surface lies 1) at the point of contact 2) on the common normal at the point of contact 3) on the common tangent at the point of contact 4) at the center of curvature of the stationary surface. 2. In terms of Poisson's ratio(m), the ratio of Young's Modulus(E) to Shear Modulus(G) of elastic materials is 1) 2(1 + m ) 2) 2(1 - m) 3) 4) 3. A block of steel is loaded by a tangential force on its top surface while the bottom surface is held rigidly. The deformation of the block is due to 1) shear only 2) bending only 3) shear and bending 4) torsion 4. The total extension of the bar loaded as shown in the figure is A = Area of cross-section E = Modulus of Elasticity 1) 10 × 30/AE 2) 26 × 10/AE 3) 9 × 30/AE 4) 30 × 22/AE 5. The maximum bending moment in a simply supported beam of length L loaded by a concentrated load 'W' at the midpoint is given by 1) WL 2) 3) 4) 6. The mechanism used in a shaping machine is 1) a closed 4-bar chain having 4 revolute pair 2) a closed 6-bar chain having 6 revolute pair 3) a closed 4-bar chain having 2 revolute and 2 sliding pairs 4) an invasion of the single slider-crank chain 7. The speed of an engine varies from 210 rad/s to 190 rad/s. During cycle the change in kinetic energy is found to be 400Nm. The inertia of the fly wheel in Kgm2 is 1) 0.10 2) 0.20 3) 0.30 4) 0.40 8. The minimum number of teeth on the pinion to operate without interference in standard full height involute teeth gear mechanism with 200 pressure angle is 1) 14 2) 12 3) 18 4) 32 9. Axial operation claw clutches having self-locking tooth profile 1) can be disengaged at any speed 2) can be disengaged only unloaded 3) can be engaged only when unloaded 4) can work only with load. 10. The total number of instantaneous centers for a mechanism consisting of 'n' links is 1) 2) n 3) 4) 11. Sensitiveness of a governor is defined as 1) Range of speed/Mean speed 2) Mean speed/Range of speed 3) Mean speed × Range of speed 4) None 12. In a fillet welded joint, the weakest area of the weld is 1) toe 2) root 3) throat 4) face 13. Which of the following is not a friction clutch? 1) Disc or plate clutch 2) Cone clutch 3) Centrifugal clutch 4) Jaw clutch 14. The dimension of surface tension is 1) N/m2 2) J/m 3) J/M2 4) W/m 15. Kaplan turbine is 1) A high head mixed flow turbine. 2) A low head axial flow turbine. 3) An outward flow reaction turbine. 4) An impulse inward flow turbine. 16. What is the unit of dynamic viscosity of a fluid termed 'poise' equivalent to 1) dyne/cm2 2) gm - s/cm2 3) dyne - s/cm2 4) gm-cm/s 17. The pressure pascal corresponding to 3 cm column of Mercury is 1) 7988.6 2) 3994.3 3) 2662.8 4) 1331.4 18. An incompressible fluid flows radially outward from a line source in a steady manner. How does velocity in any radial direction vary? 1) r 2) r2 3) 1/r2 4) 1/r 19. For a given discharge in a channel at critical depth 1) the specific energy is minimum 2) the specific energy is maximum 3) the total energy is minimum 4) the total energy is maximum. 20. The drag force exerted by a fluid on a body immersed in the fluid is due to 1) pressure and viscous forces 2) pressure and gravity forces 3) pressure and surface tension forces 4) viscous and gravity forces. 21. For a given heat flow and for the same thickness, the temperature drop across the material will be maximum for 1) copper 2) steel 3) glass wool 4) Refractory brick 22. For an opaque surface, the absorptivity (a), transmissivity(t) and reflectivity(r) are related by the equation 1) a + r = t 2) r + a + t = 0 3) a + r = 1 4) a + r = 0 23. Heat pipe is widely used now a days because 1) it acts as an insulator 2) it acts as conductor and insulator 3) it acts as super conductor 4) it acts as fin 24. This substance has the minimum value of thermal conductivity 1) Air 2) Water 3) Plastic 4) Rubber 25. In case of liquids, what is the binary diffusion coefficient proportional to 1) pressure only 2) temperature only 3) volume only 4) all the above 26. If a closed system is undergoing an irreversible process, the entrophy of the system 1) must increase 2) always remains constant 3) must decrease 4) can increase, decrease or constant 27. Maximum theoretical work obtainable when a system interacts to equilibrium with a reference environment is called 1) Entropy 2) Enthalpy 3) Energy 4) Rothalpy 28. Which one of the following thermodynamic process approximates the steaming of food in a pressure cooker 1) Isoenthalpic 2) Isobaric 3) Isochoric 4) Isothermal 29. Change in internal energy in reversible process occuring in a closed system is equal to the heat transferred if the process occurs at constant 1) Pressure 2) Volume 3) Tempetature 4) Enthalpy 30. At critical point the enthalpy of vapourisation is 1) dependent on temperature only 2) maximum 3) minimum 4) zero 31. Global warming is caused by 1) Ozone 2) Carbondioxide 3) Nitrogen monoxide 4) Carbon 32. An industrial heat pump operates between the temperature of 270C and -130C. The rates of heat addition and heat rejection are 750W and 1000W respectively. The COP for the heat pump is 1) 7.5 2) 6.5 3) 4.0 4) 3.0 33. A heat pump operating on carnot cycle pumps heat from a reservoir at 300k to a reservoir at 600k. The coefficient of performance is 1) 1.5 2) 0.5 3) 2 4) 1 34. The refrigerant used for absorption refrigerator working heat from solar collectors is mixture of water and 1) Carbondioxide 2) Sulphurdioxide 3) Lithium bromide 4) freon 12 35. Which type of value is generally used in reciprocating refrigerant compressors 1) mushroom value 2) puppet value 3) plate value 4) throttle value 36. The most widely used reinforcement in modern day FRP tennis racket is 1) Glass 2) Carbon 3) Aluminium 4) Magnesium 37. For wire drawing operation, the work material should essentially be 1) ductile 2) tough 3) hard 4) malleable 38. Small amount of carbonaceous material sprinkled on the inner surface of mould cavity is called 1) backing sand 2) facing sand 3) green sand 4) dry sand 39. Which one of the following lubricants is most suitable for drawing mild steel wires? 1) Sodium stearate 2) Water 3) Lime water 4) Kerosene 40. The proportion of Acetylene and Oxygen used in gas welding is 1) 2:1 2) 1:1 3) 1:2 4) 3:4 Answers 1) 1 2) 1 3) 3 4) 2 5) 3 6) 4 7) 1 8) 3 9) 3 10) 4 11) 2 12) 3 13) 4 14) 3 15) 2 16) 3 17) 2 18) 4 19) 1 20) 1 21) 3 22) 3 23) 3 24) 1 25) 4 26) 4 27) 3 28) 3 29) 2 30) 4 31) 2 32) 3 33) 3 34) 3 35) 3 36) 2 37) 1 38) 2 39) 3 40) 2 -
ఉజ్వల కెరీర్‌కు దారిచూపే బ్రాంచ్‌లు
మెకానికల్ మెకానికల్ ఇంజనీరింగ్ ఒక విస్తృతమైన విభాగం. మెకానికల్, థర్మల్ పరికరాల పరిశోధన, రూపకల్పన, అభివృద్ధి తదితర కార్యకలాపాల్లో మెకానికల్ ఇంజనీర్లు పాల్గొంటారు. కొత్త మెకానికల్ వ్యవస్థల రూపకల్పనతో పాటు వాటిని పరీక్షించడం, నిర్వహించడం, ఉత్పత్తి కూడా మెకానికల్ ఇంజనీర్ల బాధ్యతే! ఇలాంటి సంప్రదాయ విధులు నేడు నానో టెక్నాలజీ, కాంపోజిట్ మెటీరియల్స్ అభివృద్ధి, బయోమెడికల్ అప్లికేషన్స్, పర్యావరణ పరిరక్షణ వరకు విస్తరించాయి. ఆటోమొబైల్ రంగం వృద్ధి పథంలో పయనిస్తుండటం, కేంద్ర ప్రభుత్వ ‘మేకిన్ ఇండియా’లో భాగంగా దేశీయంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అభివృద్ధి చెందనుంది. 2025 నాటికి దేశ జీడీపీలో ఈ రంగం వాటా 25 శాతం-30 శాతానికి పెరగనుందని, తొమ్మిది కోట్ల ఉద్యోగాల సృష్టి జరగనున్నట్లు అంచనాల నేపథ్యంలో మెకానికల్ ఇంజనీరింగ్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని చెప్పొచ్చు.కోర్ సబ్జెక్టులు: స్టాటిక్స్ అండ్ డైనమిక్స్ కంట్రోల్, థర్మో డైనమిక్స్ అండ్ హీట్ ట్రాన్స్ఫర్, ఫ్లూయిడ్ మెకానిక్స్, మెషీన్ డిజైన్, స్ట్రెంథ్ ఆఫ్ మెటీరియల్స్, మెటీరియల్స్ సైన్స్, థియరీ ఆఫ్ డిజైన్ వంటివి. అభిరుచి, నైపుణ్యాలు: మార్కెట్ అవసరాలకు తగినట్లు వినూత్న ఆలోచనలతో మెకానికల్ ఉత్పత్తులకు రూపకల్పన చేయడంనుంచి వాటిని మార్కెట్లో అమ్మేంత వరకు వివిధ దశల్లో మెకానికల్ ఇంజనీర్ల అవసరం ఉంటుంది. అందువల్ల యంత్ర పరికరాలపై ఆసక్తితో పాటు సృజనాత్మకత, కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, సమస్య పరిష్కార నైపుణ్యాలు అవసరం. అప్పుడే మెకానికల్ ఇంజనీరింగ్ కెరీర్లో రాణించవచ్చు.కెరీర్: కోర్సు పూర్తయ్యాక ఆటోమోటివ్,ఏరోస్పేస్, స్టీల్, పవర్ జనరేషన్, బయో మెకానికల్, మ్యానుఫ్యాక్చరింగ్ తదితర ప్రభుత్వ/ప్రైవేటు సంస్థల్లో అవకాశాలు పొందొ చ్చు. టాటా మోటార్స్, మహీంద్ర అండ్ మహీంద్ర, హోండా, అశోక్‌లే లాండ్,డీఆర్డీవో, ఇండియన్ ఆయిల్ తదితర సంస్థలను టాప్ రిక్రూటర్లుగా చెప్పుకోవచ్చు. సివిల్ ఇంజనీరింగ్ మిలిటరీ ఇంజనీరింగ్ తర్వాత అతిపురాతమైన బ్రాంచ్‌గా సివిల్ ఇంజనీరింగ్‌ను చెప్పొచ్చు. ఇది రోడ్లు, భవంతులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, వంతెనలు, కాలువలు వంటి నిర్మాణాలకు సంబంధించి ప్రణాళికల రచన, రూపకల్పన, నిర్వహణ, పర్యవేక్షణ వంటి అంశాలను వివరిస్తుంది. ఇందులో కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ ఇంజనీరింగ్, కోస్టల్ అండ్ ఓషన్ ఇంజనీరింగ్, ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీరింగ్, మెటీరియల్స్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ వంటి విభాగాలున్నాయి. స్మార్ట్ సిటీలు, పునరుత్పాదక ఇంధన వ్యవస్థలు, హై స్పీడ్ రైళ్లు తదితరాల్లో భారత్‌తో భాగస్వామ్యానికి స్పానిష్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. దీంతో దేశంలో మౌలిక వసతుల రంగంలో పెట్టుబడులు పెరగనున్నాయి. ఇలాంటి వాతావరణంలో సివిల్ ఇంజనీర్లకు డిమాండ్ పెరుగనుంది. కోర్ సబ్జెక్టులు: సర్వేయింగ్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, బిల్డింగ్ టెక్నాలజీ, స్ట్రక్చరల్ అనాలసిస్ అండ్ డిజైన్, డిజైన్ ఆఫ్ హైడ్రాలిక్ స్ట్రక్చర్స్, ఆర్కిటెక్చర్ అండ్ టౌన్ ప్లానింగ్.విధులు: ప్రాజెక్టుల రూపకల్పనకు సర్వే రిపోర్టులు, మ్యాపులు వంటి వాటిని పరిశీలించడం. ప్రమాణాల ఆధారంగా రవాణా, హైడ్రాలిక్ వ్యవస్థలు, నిర్మాణాలకు ప్రణాళికల రచన, రూపకల్పన. ప్రణాళికలకు తగినట్లే నిర్మాణాలు కొనసాగుతున్నాయా.. లేదా? అనేది చూడటం. నైపుణ్యాలు: నిర్మాణాలపై ఆసక్తి ఉండాలి. బృంద నైపుణ్యాలు, క్రిటికల్ థింకింగ్, ఊహాత్మక శక్తి, సృజనాత్మకత, మ్యాథమెటికల్ నైపుణ్యాలు, డ్రాయింగ్ స్కిల్స్, ప్రాజెక్టు మేనేజ్మెంట్ స్కిల్స్, రిపోర్టింగ్ స్కిల్స్. కెరీర్: రహదారులు, భవనాల శాఖ, నీటి పారుదల శాఖ, పంచాయతీరాజ్ విభాగం, ఇండియన్ రైల్వే, నేషనల్ హైవేస్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ బోర్డు, కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ తదితర విభాగాల్లో అవకాశాలు ఉంటాయి. ఎల్ అండ్ టీ; రిలయన్స్ ఇన్ఫ్రా; ఎల్ఎన్జే భిళ్వారా గ్రూప్ వంటివి టాప్ రిక్రూటర్లు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ భారత్‌లో ఎలక్ట్రానిక్స్రంగం వృద్ధి పథంలో పయనిస్తోంది. 2020 నాటికి ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ వస్తువుల ఉత్పత్తి విలువ 104 బిలియన్ డాలర్లకు చేరుకోనున్నట్లు అంచనా. ఇలాంటి పరిస్థితిలో ఎలక్ట్రానిక్స్ రంగంలో నైపుణ్యవంతులైన మానవ వనరులకు డిమాండ్ పెరిగింది. దేశంలో కేబుల్ సర్వీసుల డిజిటైజేషన్, పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ హా ర్డ్వేర్ టెక్నాలజీ పార్కుల ఏర్పాటు, ఎఫ్‌డీఐలకు ప్రోత్సాహక వాతావరణం ఉన్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్లకు అవకాశాలు పెరుగుతున్నాయి.కోర్ సబ్జెక్టులు: ఎలక్ట్రో మ్యాగ్నటిక్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అండ్ మెషీన్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్, మైక్రో ప్రాసెసర్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఆప్టికల్ సిస్టమ్స్, వీఎల్ఎస్ఐ. విధులు: కమ్యూనికేషన్ పరికరాలు, సర్వర్ల పనితీరును, సాంకేతికత పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం. నెట్‌వర్క్‌ల ఏర్పాటు,వాటి నిర్వహణ వంటివి ముఖ్య విధులు. నైపుణ్యాలు: ఎలక్ట్రానిక్స్ పరికరాలపై ఆసక్తితో పాటు మ్యాథమెటికల్ నైపుణ్యాలు, సృజనాత్మకత, లాజికల్ థింకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. కెరీర్: కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఏవియేషన్ అండ్ ఏవియానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, కమ్యూనికేషన్స్, ట్రాన్స్‌పోర్టేషన్, టెలీ కమ్యూనికేషన్స్, రేడియో, టీవీ, కంప్యూటర్ అప్లికేషన్స్ తదితరాలతో సంబంధమున్న సంస్థల్లో అవకాశాలుంటాయి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఇన్ఫోసిస్, టీసీఎస్, మోటరోలా, శాంసంగ్, టెక్ మహీంద్ర, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, డీఆర్డీవో, ఇస్రో వంటివి టాప్ రిక్రూటర్లు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్(సీఎస్ఈ).. సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ ప్రక్రియలకు సంబంధించిన కంప్యూటర్ ఆధారిత సమాచార వ్యవస్థల రూపకల్పన, నిర్మాణం, నిర్వహణ వంటి వాటిని వివరిస్తుంది. నేటి సాంకేతిక ప్రపంచంలో ‘కంప్యూటర్’ ప్రజల రోజువారీ జీవితంలో భాగమైపోయింది. ఈ క్రమంలో అన్ని కంపెనీలకూ కంప్యూటర్ ఇంజనీర్ల సేవలు అవసరమవుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఐటీ, అనుబంధ సేవలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. కేంద్ర గణాంకాల సంస్థ (సీఎస్‌వో) ప్రకారం జీడీపీలో కంప్యూటర్, దాని ఆధారిత సేవల వాటా 3.3శాతం. 2013-14లో ఈ రంగం 14.4 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది.ఈ నేపథ్యంలో సీఎస్ఈ పాపులర్ బ్రాంచ్‌గా కొనసాగుతోంది. పరిశోధనల పరంగా విస్తృత అవకాశాలు, దేశవిదేశాల్లో ఉన్నత వేతనాల కొలువుల నేపథ్యంలో ఈ బ్రాంచ్‌పై యువత క్రేజ్ పెంచుకుంది. సబ్జెక్టులు: కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అండ్ ఆర్గనైజేషన్; డేటాబేస్ సిస్టమ్స్; ఎలక్ట్రానిక్స్; ఆపరేటింగ్ సిస్టమ్స్; నెట్వర్కింగ్; ఫౌండేషన్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్స్; జావా ప్రోగ్రామింగ్ అండ్ వెబ్సైట్ డిజైన్; ఈ-కామర్స్-ఈఆర్పీ అండ్ మల్టీమీడియా అప్లికేషన్స్.ఇంజనీర్ విధులు: డేటాబేస్ మేనేజ్మెంట్, ఐటీ, ఎంబెడెడ్ సిస్టమ్స్, టెలీకమ్యూనికేషన్స్, సాఫ్ట్వేర్-హార్డ్‌వేర్, మల్టీమీడియా, వెబ్‌డిజైనింగ్, గేమింగ్.. వంటి విభాగాల్లో పనిచేయాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ రూపకల్పన, సాఫ్ట్వేర్ అభివృద్ధి, టెస్టింగ్ వంటి బాధ్యతలుంటాయి. నైపుణ్యాలు: కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్పై ఆసక్తి అవసరం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజింగ్ నైపుణ్యాలు, కంప్యూటింగ్ స్కిల్స్, లాజికల్ థింకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, బృంద స్ఫూర్తి అవసరం. కెరీర్: కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, కం ప్యూటర్ హార్డ్‌వేర్ సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీలు, కంప్యూటర్ నెట్వర్కింగ్ కంపెనీలు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ తదితర కంపెనీల్లో అవకాశాలుంటాయి. టాప్ రిక్రూటర్స్: టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, అసెంచర్, కాగ్నిజెంట్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, టెక్ మహీంద్ర. మెటలర్జికల్ ఇంజనీరింగ్ కార్లు, బైకుల దగ్గరి నుంచి విమానాల వరకు వాటికి ఉపయోగపడే లోహ ఉత్పత్తుల డిజైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఉత్పత్తులను వివరించే ఇంజనీరింగ్ విభాగం మెటలర్జికల్ ఇంజనీరింగ్. భిన్న లోహాలు.. వాటి మిశ్రమాలు, వివిధ రంగాల్లో ఆ లోహాల అనువర్తితాలకు సంబంధించిన విస్తృత పరిజ్ఞానాన్ని ఇది విద్యార్థికి అందిస్తుంది. లోహాలు, వాటి స్వభావాలను అధ్యయనం చేస్తుంది. కోర్ సబ్జెక్టులు: మెటీరియల్ సైన్స్, ఎలిమెంట్స్ ఆఫ్ ఫిజికల్ మెటలర్జీ, మెటలర్జికల్ థర్మోడైనమిక్స్, మినరల్ బెనిఫికేషన్, మెకానికల్ బిహేవియర్ అండ్ టెస్టింగ్ ఆఫ్ మెటీరియల్స్ వంటివి ఉంటాయి. విధులు, నైపుణ్యాలు: ముడి ఖనిజాల నుంచి అవసరమైన మూలకాలను సేకరించడంలో మెటలర్జికల్ ఇంజనీర్లు కీలకపాత్ర పోషిస్తారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిశ్రమలకు అవసరమైన మెటల్స్ను తయారు చేయడం; లోహాలు, వాటి మిశ్రమాలను పరీక్షించడం వంటి విధులు నిర్వహిస్తారు. విశ్లేషణ సామర్థ్యం, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, జియాలజీపై పట్టు ఉండాలి. అత్యాధునిక పరికరాలపై అవగాహన తప్పనిసరి.కెరీర్: సెయిల్, విశాఖ స్టీల్ ప్లాంట్, జిందాల్ స్టీల్ వర్క్స్, టిస్కో వంటివి టాప్ రిక్రూటర్లు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ) అనేది ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రో మ్యాగ్నటిజం గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ఇది విద్యుదుత్పత్తికి, పంపిణీకి, యంత్రాల నియంత్రణకు, కమ్యూనికేషన్స్‌కు అవసరమైన అప్లికేషన్ల రూపకల్పనను వివరిస్తుంది. విద్యుత్ యంత్రాల నిర్వహణ, నియంత్రణలో ఎలక్ట్రానిక్స్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఈ రెండింటి సమ్మేళనంగా ఉన్న ఈఈఈ కోర్సుకు ప్రాధాన్యత ఉంది. ఇది ఐసీల డిజైనింగ్, టెస్టింగ్, ఇండక్టర్స్, కెపాసిటర్స్పై ప్రధానంగా దృష్టిసారిస్తుంది. ఈ ఇంజనీరింగ్‌లో పవర్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్, మైక్రో ఎలక్ట్రానిక్స్, సిగ్నల్ ప్రాసెసింగ్, టెలీకమ్యూనికేషన్స్ వంటి విభాగాలున్నాయి. విద్యుదుత్పత్తిని 2020నాటికి 50 శాతం పెం చడం లక్ష్యంగా కేంద్రం చర్యలు తీసుకుంటున్న క్రమంలో ఈఈఈ ఇంజనీర్లకు భవిష్యత్తు ఆశాజనకమని చెప్పొచ్చు.కోర్ సబ్జెక్టులు: పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మెషీన్స అండ్ డిజైన్, ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలసిస్ అండ్ సింథసిస్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రోమాగ్నటిక్ ఫీల్డ్స్, కంప్యూటర్ ఎయిడెడ్ పవర్ సిస్టమ్ అనాలసిస్, యుటిలైజేషన్ ఆఫ్ పవర్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెటీరియల్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ వంటి కోర్ సబ్జెక్టులను కోర్సులో భాగంగా అధ్యయనం చేస్తారు. నైపుణ్యాలు: అనలిటికల్ స్కిల్స్, మ్యాథమెటికల్ నైపుణ్యాలు, బృంద స్ఫూర్తి, సూక్ష్మ పరిశీలన. కెరీర్: దేశంలో ఉత్పాదక సంస్థలు, విద్యుత్ పంపిణీ సంస్థలు, పవర్ కార్పొరేషన్లు, డిజైనింగ్ పరిశ్రమలు, నేచురల్ గ్యాస్ ప్లాంట్లు, పెట్రోలియం, స్టీల్, రసాయన పరిశ్రమల్లో అవకాశాలుంటాయి. బీహెచ్ఈఎల్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా లిమిటెడ్, ఐఓసీఎల్, ఓఎన్జీసీ, సెయిల్, గెయిల్, బీఈఎల్, హెచ్ఏఎల్, బీపీసీఎల్, డీఎంఆర్సీ, ఎన్‌హెచ్‌పీసీ, బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, పవర్‌గ్రిడ్ వంటివి టాప్ రిక్రూటర్లు. విద్యార్థుల ఆలోచనా ధోరణి పరంగా.. గత రెండు, మూడేళ్ల పరిస్థితిని విశ్లేషిస్తే ఈసీఈ, సీఎస్ఈ, ఈఈఈ, మెకానికల్, సివిల్ బ్రాంచ్‌లు పాపులర్ బ్రాంచ్‌లుగా భావించవచ్చు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ పరంగా చూసినా, ఈ బ్రాంచ్‌ల్లో బీటెక్ పూర్తిచేసిన అభ్యర్థులకు ఉన్నత అవకాశాలు లభిస్తున్నాయి. కంప్యూటర్ సైన్స్ అభ్యర్థికి ఎలాంటి స్కిల్స్ అవసరమో, ఐటీకి కూడా దాదాపు అలాంటి నైపుణ్యాలే ఉండాలి. సిలబస్‌లో రెండు బ్రాంచ్‌ల మధ్య తేడా చాలా తక్కువ ఉంటుంది. ఈ విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు గుర్తించాలి. నియామకాల విషయంలో పెద్దగా తేడా ఉండదు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పూర్తిచేస్తున్న వారిలో గూగుల్, ఫేస్బుక్, ఫ్లిప్‌కార్ట వంటి అత్యున్నత సంస్థల్లో లక్షల వేతనాలతో ఉద్యోగాలు వస్తాయని చాలా మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తుంటారు. అయితే ఇలాంటి అవకాశాలు దక్కేది లక్షకు పదిమందికి మాత్రమే అని గుర్తించాలి. మిగిలిన వారికి ఇతర ఐటీ సంస్థల్లో అవకాశాలుంటాయి. అందువల్ల బ్రాంచ్‌ను ఎంపిక చేసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. కోర్ బ్రాంచ్‌లు ఎప్పటికీ వన్నె తగ్గని బ్రాంచ్‌లు. జాబ్ మార్కెట్లో వీటికి ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. సీఎస్ఈ లేదా ఐటీ పూర్తిచేసిన వారిలో చాలా మందికి ఏడాదికి సగటున రూ.3.5 లక్షల వేతనాలు లభిస్తుంటే, కోర్ బ్రాంచ్‌ల్లో ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారికి ప్రారంభంలో రూ.5 లక్షల వరకు వేతనాలు ఉంటున్నాయి. ఇంజనీరింగ్ ఔత్సాహికులు ఈ విషయాన్ని గుర్తించాలి. డొమైన్ నాలెడ్జ్, టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులపై అవగాహన పెంచుకుంటే ఆసక్తికి అనుగుణంగా ఏ బ్రాంచ్ తీసుకున్నా అవకాశాలు అపారమన్నది వాస్తవం! అయితే ఆ అవకాశాలను అందుకోవాలన్న తపన, సరైన కార్యాచరణ ముఖ్యం! - వి.ఉమామహేశ్వర్, ప్లేస్మెంట్ ఆఫీసర్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఓయూ. -
విజ్ఞాన గనులుగా మారాలి
గెస్ట్ కాలమ్ ‘భారత్‌లో ఐఐఎం, ఐఐటీలు వంటి ఎన్నో ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే దేశంలో విద్యా సంస్థలన్నీ విజ్ఞాన కేంద్రాలుగా మారాలి. ఇవి డిగ్రీల ముద్రణ కేంద్రాలుగా కాకుండా.. భవిష్యత్తు తరాలకు మార్గనిర్దేశం చేసేలా విద్యార్థులను తీర్చిదిద్దాలి’ అని అంటున్నారు అమెరికాలోని ప్రముఖ యేల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్యామ్ సుందర్. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన ఆయన భారతీయ రైల్వేలో ఇంజనీర్‌గా పని చేసి ఆసక్తితో అకౌంటింగ్ రంగంలో ప్రవేశించారు. తర్వాత అకౌంటింగ్ థియరిస్ట్, ఎక్స్పరిమెంటల్ ఎకనామిస్ట్‌గా పేరు గడించి.. పలు అవార్డులు, ఫెలోషిప్‌లు పొందినప్రొఫెసర్ శ్యామ్ సుందర్‌తో ఇంటర్వ్యూ.. నాణ్యమైన విద్య ప్రపంచీకరణ నేపథ్యంలో మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి పోటీని దీటుగా ఎదుర్కోవడానికి గట్టి చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా యువ ప్రతిభావంతులను బోధన రంగంవైపు ఆకర్షించాలి. ఉన్నత విద్యాసంస్థలను లాభాలు ఆర్జించేవిగా పరిగణించకూడదు. నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వాలు భారీస్థాయిలో ప్రోత్సాహకాలు ఇవ్వడంతోపాటు పటిష్టమైన విధానాలను అమలు చేయాలి. లేకుంటేవిద్యార్థులకు సరైన విద్య అందక దేశ భవిష్యత్తు ఆందోళనకరంగా మారుతుంది. బోధనపై ఆసక్తి పెంచాలి ప్రస్తుతం సెకండరీ, హయ్యర్ సెకండరీ స్థాయిల్లోని విద్యార్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుంటే.. నాణ్యమైన ఉన్నత విద్యనందించేందుకు అధ్యాపకుల సంఖ్యను భారీగా పెంచాలి. మన దేశంలో ఏటా దాదాపు 50 లక్షల మంది గ్రాడ్యుయేట్లు బయటికొస్తున్నారని అంచనా. అలాగే కోటిన్నర మంది కొత్తగా వివిధ కోర్సుల్లో చేరుతున్నారు. ఈ అంచనాల ఆధారంగా స్టూడెంట్-టీచర్ నిష్పత్తిని 1:50గా చూసినా.. మనకు యూనివర్సిటీ/ కాలేజీ స్థాయిలో 30 లక్షల మంది అధ్యాపకులు అవసరం. ఒకసారి విధుల్లో చేరిన టీచర్లు 35ఏళ్లు పనిచేస్తారని భావించినా.. ప్రతి ఏటా కొత్తగా లక్ష మంది అధ్యాపకులు కావాలి. కాబట్టి ఈ కొరతను పూడ్చేందుకు దేశంలోని యంగ్ టాలెంట్‌ను ఆకర్షించేలా బోధన కు విశేష ప్రాధాన్యం ఇవ్వాలి. విద్యా సంస్థలు బోధ నపై ఆసక్తి ఉన్నవారిని గుర్తించి, ప్రోత్సహించాలి. మేధో సంపత్తి ఉన్నత విద్య వ్యాప్తి దిశగా చర్యలు చేపడుతున్న ప్రభుత్వాలు.. నాణ్యమైన విద్య అంటే మేధో సంపత్తిని పెంచడమని గుర్తించాలి. ఇన్స్టిట్యూట్ల విస్తరణ, భవంతుల నిర్మాణంతో లక్ష్యం పూర్తయిందని భావించకూడదు. కేవలం మౌలిక సదుపాయాలతో మెరుగైన విద్య లభించదు. నాణ్యమైన ఫ్యాకల్టీ కావాలి. బోధనలో నాణ్యతను మెరుగుపర్చాలి. ఐఐటీలు, ఐఐఎంలలో ఎంతో తెలివైన విద్యార్థులు అడుగుపెడుతున్నారు. కానీ బోధన, పరిశోధన, ఆవిష్కరణల పరంగా వారికి సరైన గెడైన్స్ లేని కారణంగా ఆశించిన స్థాయి ఫలితాలు ఉండటం లేదు. అందుకే స్మార్ట్ ఫోన్స్ అంటే యాపిల్, జియోమీ; విమానాల కోసం బోయింగ్; ఆయుధాలు, అణుశక్తి కేంద్రాల కోసం రష్యావైపు చూస్తున్నాం. మేక్ ఇన్ ఇండియా ఇటీవల ప్రకటించిన మేక్ ఇన్ ఇండియా మెరుగైన ఫలితాలు సాధించాలంటే.. రహదారులు, ఇంటర్నెట్, ఇంధనంతోపాటు నాణ్యమైన మానవ వనరులూ అవసరం. అందుకోసం మన విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడం, పరిశోధనలను ప్రోత్సహించడం ఎంతో అవసరం. ఇలాంటి చర్యలతోనే కొన్ని దశాబ్దాల క్రితం మనకంటే వెనుకంజలో ఉన్న చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలు నేడు మనల్ని అధిగమించే స్థాయికి చేరుకున్నాయి. ఆసక్తితో బహుళ రంగాల్లో నైపుణ్యం ప్రస్తుతం మనదేశంలో యువతలో ఎక్కువమంది ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, అకౌంటింగ్, మెడిసిన్.. ఇలా ఏదో ఒక రంగానికే పరిమితమవుతున్నారు. ఈ క్రమంలో కొందరు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారు. మరికొందరు అరకొర అవకాశాలతో సరిపుచ్చుకుంటున్నారు. కారణం వారిలోని ఆసక్తుల్లో వ్యత్యాసాలే. ఆసక్తి, పట్టుదల ఉంటే బహుళ రంగాల్లో నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు. ఇష్టం లేకున్నా ఇంజనీరింగ్‌లో లేదా మరే ఇతర కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థి తర్వాత దశలో తనకు నచ్చిన కోర్సులో చేరొచ్చు. తద్వారా భవిష్యత్‌ను ఉన్నతంగా మలచుకోవచ్చు. విభిన్న రంగాల్లో ప్రపంచ గమనాన్ని మార్చిన ప్రముఖుల స్ఫూర్తితో అడుగులు వేస్తే ఉన్నత శిఖరాలు అధిరోహించొచ్చు!! -
ఏపీ విజిలెన్స్ కమిషనర్‌గా ఎస్వీ ప్రసాద్
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు రేపటి నుంచి మూడేళ్లపాటు పదవిలో ఐఏఎస్ అధికారిగా ఉమ్మడి రాష్ట్రంలో 4 దశాబ్దాలు సేవలందించిన ప్రసాద్ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మొదటి విజిలెన్స్ కమిషనర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌గా ఉన్న ప్రసాద్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కమిషనర్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన బుధవారం నుంచి మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఎస్వీ ప్రసాద్ గత నాలుగు దశాబ్దాలుగా ఉమ్మడి రాష్ట్రంలో అనేక హోదాల్లో పనిచేశారు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన ప్రసాద్ ఆ తర్వాత అహ్మదాబాద్ ఐఐఎంలో ఎంబీఏ చదివారు. 1975లో అఖిల భారత సర్వీసులకు ఎంపికయ్యారు. మొదట గూడూరు సబ్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత పలు ప్రభుత్వ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. ఆయన ప్రతిభా పాటవాలను చూసి నలుగురు ముఖ్యమంత్రులు వారి పేషీల్లో వివిధ హోదాల్లో నియమించుకున్నారు. ఎన్టీ రామారావు, కోట్ల విజయభాస్కరరెడ్డి, ఎన్.జనార్దన్‌రెడ్డి, చంద్రబాబుల పేషీల్లో కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి హోదాల్లో పనిచేశారు. ఏపీ జెన్కో చైర్మన్‌గా, ఏపీఎస్ ఆర్టీసీ వైస్‌చైర్మన్‌తోపాటు పలు కార్పొరేషన్లకు చైర్మన్‌గా కూడా ఆయన సేవలందించారు. 2010లో తుపాను వచ్చిన సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శింగా ప్రసాద్ చూపిన చొరవను అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కొనియాడారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు కట్టబెట్టడంపై ఆయన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. -
మెకానికల్ ఇంజనీరింగ్‌తో మిన్నంటే అవకాశాలు!
ప్రతి ఇంజనీరింగ్ విభాగంలోనూ సమ్మిళితమై ఉండేదే మెకానికల్ ఇంజనీరింగ్. మెకానికల్ నిర్మాణాలు, ఉత్పత్తులు లేని ఏ ఇతర ఇంజనీరింగ్ విభాగాన్నీ ఊహించలేం. ఇది అంతటి విస్తృత, వైవిధ్యమైన బ్రాంచ్. ఆటోమోటివ్, ఎయిర్‌క్రాఫ్ట్, ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్స్ తదితర పరిశ్రమల్లో మెకానికల్ ఉత్పత్తుల అవసరం తప్పనిసరి. అందుకే మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులను అభ్యసించిన విద్యార్థులకు ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్‌లో.. హీట్ ఎక్ఛేంజర్స్, రిఫ్రిజిరేటర్లు, వెంటిలేషన్ సిస్టమ్స్, గ్యాస్ టర్బైన్స్, విండ్ టర్బైన్స్, బయోమెడికల్ పరికరాలు, ఆటోమొబైల్స్, వాహనాలు, రోబోటిక్స్, మెకట్రానిక్స్ తదితర యంత్ర పరికరాల డిజైన్, తయారీ విధానాలను విద్యార్థులు అధ్యయనం చేస్తారు. కొత్త ప్రొడక్ట్స్ డిజైనింగ్, రూపకల్పనతోపాటు ఎప్పటికప్పుడు కొత్త మెథడ్స్, మెటీరియల్స్‌ను అభివృద్ధి చేయడంలోనూ పాలుపంచుకుంటారు. పరిశ్రమల్లో ఉపయోగించే టూల్స్, మెషిన్స్, ఇతర మెకానికల్ ఉపకరణాల తయారీలో మెకానికల్ ఇంజనీర్లు కీలక భూమికను పోషిస్తారు. పరిశ్రమల్లో అన్నిరకాల యంత్రాల పనితీరు, వాటి మెకానిజం, డిజైన్, డెవలప్మెంట్, తయారీ, అమరిక, నిర్వహణ మెకానికల్ ఇంజనీర్ల కనుసన్నల్లోనే నడుస్తుంది. నైపుణ్యాలు మెకానికల్ ఇంజనీర్లకు విశ్లేషణాత్మక, డిజైనింగ్ నైపుణ్యాలు ఎంతో ప్రధానం. బృందంలో పనిచేసే నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు కూడా అవసరం. సృజనాత్మకత, కష్టపడి పనిచేసేతత్వం ఉన్న వారు ఈ విభాగంలో రాణిస్తారు. ఉన్నత విద్యావకాశాలు బీటెక్/బీఈ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు విస్తృత ఉన్నత విద్యావకాశాలున్నాయి. టర్బో మెషినరీ, ఏరోస్పేస్, ఏరోనాటికల్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, రొబోటిక్స్, టూల్ డిజైన్, క్యాడ్/క్యామ్, మెరైన్ ఇంజనీరింగ్ లేదా మెకట్రానిక్స్ తదితర విభాగాల్లో ఉన్నత విద్యనభ్యసించొచ్చు. గేట్ రాసి ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశం పొందడానికి అవకాశం ఉంది. పీజీఈసెట్ పరీక్ష ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ఎంఈ/ఎంటెక్ కోర్సుల్లో చేరొచ్చు. ఐటీ లేదా మేనేజ్మెంట్ విభాగాల్లోనూ ఉన్నత విద్యనభ్యసించొచ్చు. జీఆర్ఈ, జీమ్యాట్, టోఫెల్, ఐఈఎల్టీఎస్ తదితర పరీక్షలు రాసి విదేశాల్లోనూ ఉన్నత విద్యనభ్యసించొచ్చు. మెకానికల్ విద్యార్థుల కెరీర్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు విస్తృత అవకాశాలున్నాయి. మెకట్రానిక్స్, ఎనర్జీ సైన్స్ అండ్ టెక్నాలజీ, సాలిడ్ అండ్ ఫ్లూయిడ్ డైనమిక్స్, కంప్యుటేషనల్ సిమ్యులేషన్, మైక్రోఎలక్రోమెకానికల్ సిస్టమ్స్, నానో అండ్ మైక్రో మెకానిక్స్, ప్రొపల్షన్, సెన్సింగ్ అండ్ కంట్రోల్ డిజైన్, బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో అవకాశాలను అందుకోవచ్చు. మరో పదేళ్లలో గణనీయమైన వృద్ధి మెకానికల్ ఇంజనీరింగ్‌లో అప్లైడ్ సైంటిఫిక్, మ్యాథమెటికల్ అంశాలపై ఆసక్తి ఉన్నవారు రీసెర్చ్, బోధన దిశగా మంచి అవకాశాలను పొందొచ్చు. అంతేకాకుండా కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ (సీఎఫ్‌డీ)లోనూ ఉద్యోగాలు పుష్కలంగా ఉన్నాయి. కంప్యూటర్ ఎయిడెడ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ సంబంధిత కంపెనీలైన హానీవెల్, జీఈ, సైయంట్(గతంలో ఇన్ఫోటెక్) తదితర కంపెనీల్లో సీఎఫ్‌డీ నిపుణుల అవసరం ఉన్నప్పటికీ ప్రమాణాలకు తగిన సిబ్బంది లభించడం లేదు. మరో పదేళ్లలో ఆటోమొబైల్, పవర్, ఏరోస్పేస్ పరిశ్రమల్లో గణనీయమైన అభివృద్ధి చోటుచేసుకోనుంది. అన్ని విభాగాల్లో అవకాశాలు ఇంజనీరింగ్ అన్ని విభాగాల్లో మెకానికల్ ఇంజనీర్లకు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు ఏరోస్పేస్ పరిశ్రమలో పరిశోధనలు, డిజైన్స్, నిర్మాణం, ఆపరేట్స్, మెయింటనెన్స్ ఎయిర్‌క్రాఫ్ట్; ఆటోమోటివ్ పరిశ్రమ: డిజైన్స్, మాన్యుఫాక్చర్స్, మోటార్ వెహికిల్స్ డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ విభాగాల్లో ఉద్యోగాలుంటాయి. అలాగే కెమికల్, కన్స్ట్రక్షన్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, మెరైన్ తదితర పరిశ్రమల్లోనూ వివిధ విభాగాల్లో అవకాశాలు అందుకోవచ్చు. టాప్ రిక్రూటర్లు ‘‘టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రో టెక్నాలజీస్, అసెంచర్ తదితర ప్రముఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలు మెకానికల్ ఇంజనీర్ల కూడా ఉద్యోగాల్లో చేర్చుకుంటున్నాయి. ఫ్రెషర్ల ఎంపికలో సీఎస్ఈ/ఐటీ విద్యార్థులతో సమానంగా మెకానికల్ విద్యార్థులూ పోటీ పడుతున్నారు. కోర్ కంపెనీలైన మారుతి సుజుకీ, ఎంఅండ్ఎం, ఫియట్, హ్యూందాయ్, టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, ఎల్అండ్టీ, ఐటీసీ, ఇంటర్‌గ్రాఫ్ మొదలైన సంస్థ మెకానికల్ ఇంజనీర్లను నియమించుకుంటున్నాయి. మిధానీ, బెల్, బీహెచ్ఈఎల్, బీఈఎంఎల్, ఐఓసీఎల్, ఎన్టీపీసీ తదితర ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ అవకాశాలు దక్కుతున్నాయి. యూపీఎస్సీ, రాష్ట్ర స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, ఆర్ఆర్బీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ కొలువులనూ సొంతం చేసుకోవచ్చు’’ - వి. ఉమామహేశ్వర్, అసోసియేట్ ప్రొఫెసర్, మెకానికల్ ఇంజనీరింగ్ ప్లేస్మెంట్ ఆఫీసర్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఉస్మానియా యూనివర్సిటీ. -
గీతం ఇంజినీరింగ్ తొలి దశ ప్రవేశాలు పూర్తి
విశాఖపట్నం: గీతం ఇంజినీరింగ్ అడ్మిషన్ల మొదటి దశ కౌన్సెలింగ్ సోమవారంతో పూర్తయినట్టు గీతం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.పోతరాజు తెలిపారు. ఇంజినీరింగ్‌లోని కీలక బ్రాంచ్‌లలో సీట్లు పూర్తిగా భర్తీ అయినట్టు చెప్పారు. జూలై 7 నుంచి ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం తరగతులను ప్రారంభించేందుకు యూనివర్సిటీలో సన్నాహాలు చేస్తున్నామన్నారు. కౌన్సెలింగ్‌లో మొదటి రెండు రోజులు మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ఈఈఈ సీట్లు పట్ల అధిక శాతం మంది విద్యార్థులు ఆశక్తి చూపారన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ కోర్సులలో సీట్లు సోమవారం జరిగిన కౌన్సెలింగ్‌లో భర్తీ జరిగినట్టు వివరించారు. రెండో దశ కౌన్సెలింగ్‌లో హైదరాబాద్, బెంగళూరు క్యాంపస్‌లలో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ జరిపేందుకు వర్సిటీ ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఐటీ హబ్‌గా విశాఖ రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో విశాఖ నగరం ఐటీ హబ్‌గా మారనుందని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పోతరాజు తెలిపారు. ఇంజినీరింగ్‌లో నూతన ంగా ప్రవేశాలు పొందిన విద్యార్థులనుద్దేశించి సోమవారం మాట్లాడారు. టీసీఎస్, హెచ్‌సీఎల్ తదితర కంపెనీలతో గీతం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుందన్నారు. కంపెనీలకు అవసరమైన మానవ వనరులను గీతం అందిస్తుందని వివరించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.లక్ష్మీప్రసాద్, అడ్మిషన్ల డెరైక్టర్ ప్రొఫెసర్ కె.నరేంద్ర పాల్గొన్నారు. -
జెన్కో డెరైక్టర్‌గా జిల్లావాసి
మంథని, న్యూస్‌లైన్ : మంథనికి చెందిన కొండేల బలరామ్‌ను అత్యున్నత పదవి వరించింది. ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ అయిన జెన్కో డెరైక్టర్(థర్మల్)గా ఆయనను ప్రభుత్వం ఈ నెల 9న నియమించింది. మంథనిలోని భిక్షేశ్వరవీధికి చెందిన బలరామ్ ఇంటర్ వరకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివారు. ఉస్మానియా యూనివర్సిటీలో 1976లో మెకానికల్ ఇంజినీరింగ్ పట్టభద్రుడయ్యారు. 1978-79లో కన్సల్టింగ్ ఇంజినీర్ పానిపట్ అండ్ ఓబ్రా పవర్‌స్టేషన్‌లో శిక్షణ పొంది అక్కడే ఉద్యోగంలో చేరారు. 1980-81 ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బరోడాలో పనిచేశారు. 1981-87 ఎన్టీపీసీ కోబ్రా సూపర్ థర్మల్ ప్రాజెక్టులో సీనియర్ ఇంజినీర్‌గా విధులు నిర్వహించారు. 1987-2002 ప్లానింగ్ అండ్ మానిటరింగ్ డిపార్ట్మెంట్(నాగ్‌పూర్-ముంబయి) ఇన్చార్జిగా బాధ్యతలు పనిచేశారు. 2002-2007 డీజీఎం అండ్ ఏజీఎం రామగుండం స్టేజ్-2లో పనిచేశారు. 2007 నవంబర్-2009 సెప్టెంబర్ వరకు ప్రాజెక్ట్ ఇన్చార్జి ఎన్టీపీసీ(సిపాట్), 2012 నవంబర్ నుంచి సింగరేణి ఎన్టీపీసీలో విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జైపూర్ వద్ద ఎన్టీపీసీ నూతనంగా నిర్మిస్తున్న 1200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్‌గా డెప్యుటేషన్‌పై కొనసాగుతున్నారు. తాజాగా ఆయన జెన్కో డెరైక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టడంపై స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది. -
మేడారంలో పాలిటెక్నిక్ కాలేజీ
సాక్షి, హన్మకొండ ఏజెన్సీ వాసులకు సాంకేతిక విద్య అందుబాటులోకి రానుంది. మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లతో కళాశాల ప్రారంభం కానుంది. 6.54 కోట్లతో కళాశాల భవనాలను నిర్మించనున్నారు. మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మీడియాకు తెలిపారు. ప్రభుత్వం ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఏడు కళాశాలలు మంజూరు చేసింది. తెలంగాణ పరిధిలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు, వరంగల్ జిల్లా మేడారంలో నూతన కాలేజీలు ఏర్పాటు కానున్నారుు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో కోర్సులు ప్రారంభమవుతాయి. ఒక్కో విభాగానికి 60 సీట్లు కేటాయించారు. వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు ? ప్రస్తుతం పాలిటెక్నిక్ కోర్సులకు సంబంధించిన కౌన్సెలిం గ్ ప్రక్రియ ముగిసి తరగతులు ప్రారంభమయ్యాయి. దీం తో ఈ ఏడాది అడ్మిషన్లకు ఏఐసీటీఈ నుంచి అనుమతి లభించడం కష్టమే. వచ్చే ఏడాది నుంచి ఈ కళాశాలలో తరగతులు ప్రారంభమవుతాయి. నూతన భవనాల నిర్మా ణం పూర్తయ్యేంత వరకు మేడారంలో అందుబాటులో ఉన్న గిరిజన గురుకుల కళాశాల భవనాలు లేదా అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ భవనాల్లో కళాశాలను నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో రెండు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు ఉండగా, పరకాలలో 2008లో మరో కళాశాల మంజూరైంది. ఆ తర్వాత 2011లో చేర్యాలకు మరో కళాశాల మంజూరు చేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటిచింది. అయితే ఇప్పటి వరకు పరకాల కళాశాల అద్దె భవనాల్లో కొనసాగుతుండగా చేర్యాల కాలేజీ ప్రకటనలకే పరిమితమైంది. కాగా, మేడారం కళాశాలకు మాత్రం ప్రారంభంలోనే భారీగా నిధులు మంజూరు కావవడంతో ఈ కాలేజీ భవిష్యత్తుపై ఆశలు చిగురిస్తున్నాయి.