గీతం ఇంజినీరింగ్ తొలి దశ ప్రవేశాలు పూర్తి | Admissions to complete the first phase of the song Engineering | Sakshi
Sakshi News home page

గీతం ఇంజినీరింగ్ తొలి దశ ప్రవేశాలు పూర్తి

Published Tue, Jun 17 2014 12:25 AM | Last Updated on Sat, Sep 2 2017 8:54 AM

Admissions to complete the first phase of the song Engineering

విశాఖపట్నం: గీతం ఇంజినీరింగ్ అడ్మిషన్ల మొదటి దశ కౌన్సెలింగ్ సోమవారంతో పూర్తయినట్టు గీతం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.పోతరాజు తెలిపారు. ఇంజినీరింగ్‌లోని కీలక బ్రాంచ్‌లలో సీట్లు పూర్తిగా భర్తీ అయినట్టు చెప్పారు. జూలై 7 నుంచి ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం తరగతులను ప్రారంభించేందుకు యూనివర్సిటీలో సన్నాహాలు చేస్తున్నామన్నారు.
 
కౌన్సెలింగ్‌లో మొదటి రెండు రోజులు మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ఈఈఈ సీట్లు పట్ల అధిక శాతం మంది విద్యార్థులు ఆశక్తి చూపారన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ కోర్సులలో సీట్లు సోమవారం జరిగిన కౌన్సెలింగ్‌లో భర్తీ జరిగినట్టు వివరించారు. రెండో దశ కౌన్సెలింగ్‌లో హైదరాబాద్, బెంగళూరు క్యాంపస్‌లలో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ జరిపేందుకు వర్సిటీ ఏర్పాట్లు చేస్తోందన్నారు.
 
ఐటీ హబ్‌గా విశాఖ
 
రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో విశాఖ నగరం ఐటీ హబ్‌గా మారనుందని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పోతరాజు తెలిపారు. ఇంజినీరింగ్‌లో నూతన ంగా ప్రవేశాలు పొందిన విద్యార్థులనుద్దేశించి సోమవారం మాట్లాడారు. టీసీఎస్, హెచ్‌సీఎల్ తదితర కంపెనీలతో గీతం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుందన్నారు. కంపెనీలకు అవసరమైన మానవ వనరులను గీతం అందిస్తుందని వివరించారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.లక్ష్మీప్రసాద్, అడ్మిషన్ల డెరైక్టర్ ప్రొఫెసర్ కె.నరేంద్ర పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement