మంథని, న్యూస్‌లైన్ : మంథనికి చెందిన కొండేల బలరామ్‌ను అత్యున్నత పదవి వరించింది. ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ అయిన జెన్‌కో డెరైక్టర్(థర్మల్)గా ఆయనను ప్రభుత్వం ఈ నెల 9న నియమించింది. మంథనిలోని భిక్షేశ్వరవీధికి చెందిన బలరామ్ ఇంటర్ వరకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివారు. ఉస్మానియా యూనివర్సిటీలో 1976లో మెకానికల్ ఇంజినీరింగ్ పట్టభద్రుడయ్యారు. 1978-79లో కన్సల్టింగ్ ఇంజినీర్ పానిపట్ అండ్ ఓబ్రా పవర్‌స్టేషన్‌లో శిక్షణ పొంది అక్కడే ఉద్యోగంలో చేరారు. 1980-81 ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బరోడాలో పనిచేశారు. 1981-87 ఎన్టీపీసీ కోబ్రా సూపర్ థర్మల్ ప్రాజెక్టులో సీనియర్ ఇంజినీర్‌గా విధులు నిర్వహించారు.
1987-2002 ప్లానింగ్ అండ్ మానిటరింగ్ డిపార్ట్‌మెంట్(నాగ్‌పూర్-ముంబయి) ఇన్‌చార్జిగా బాధ్యతలు పనిచేశారు. 2002-2007 డీజీఎం అండ్ ఏజీఎం రామగుండం స్టేజ్-2లో పనిచేశారు. 2007 నవంబర్-2009 సెప్టెంబర్ వరకు ప్రాజెక్ట్ ఇన్‌చార్జి ఎన్టీపీసీ(సిపాట్), 2012 నవంబర్ నుంచి సింగరేణి ఎన్టీపీసీలో విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జైపూర్ వద్ద ఎన్టీపీసీ నూతనంగా నిర్మిస్తున్న 1200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్‌గా డెప్యుటేషన్‌పై కొనసాగుతున్నారు. తాజాగా ఆయన జెన్‌కో డెరైక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టడంపై స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది.
జెన్‌కో డెరైక్టర్‌గా జిల్లావాసి
Published Sun, Jan 12 2014 4:04 AM | Last Updated on Wed, Sep 5 2018 2:06 PM
Advertisement