civil
-
TG Highcourt: ఏటూరు నాగారం ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో విచారణ
-
విమానాలకు బాంబు బెదిరింపులపై దర్యాప్తు చేస్తున్నాం
-
గ్రేటర్లో కంటోన్మెంట్ సివిల్ ఏరియాల విలీనం
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్‌వాసుల చిరకాల కోరిక నెరవేరింది. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సివిల్ ఏరియాలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలపై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా రక్షణ శాఖ మంత్రి వద్దకు ఈ అంశాన్ని తీసుకెళ్లారు.మార్చి 5న రాష్ట్ర పర్యటనకు వచి్చన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి స్వయంగా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటివరకు కొనసాగుతున్న కంటోన్మెంట్ బోర్డులన్నింటినీ రద్దు చేసి మున్సిపాలిటీల్లో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇటీవలే రక్షణ శాఖకు లేఖ రాశారు.ఈనెల 25 రక్షణ శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లోనూ విలీన ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం సంబంధిత విధి విధానాలపై రక్షణ శాఖ లేఖ రాసింది. దీని ప్రకారం కంటోన్మెంట్‌లోని సివిల్ ఏరియాలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తారు. అక్కడి ప్రజలకు నిర్దేశించిన సౌకర్యాలు, మౌలిక వసతులన్నీ ఉచితంగా జీహెచ్ఎంసీకి బదిలీ చేస్తారు. కంటోన్మెంట్ బోర్డు ఆస్తులు, అప్పులన్నీ మున్సిపాలిటీకి బదిలీ అవుతాయి. అక్కడ ఇప్పటికే లీజులు ఇచ్చినవి కూడా మున్సిపాలిటీకి బదిలీ అవుతాయి. మిలిటరీ స్టేషన్ మినహా కంటోన్మెంట్‌లోని నివాస ప్రాంతాలకు జీహెచ్ఎంసీ పరిధి వర్తిస్తుంది. తన పరిధిలో ఉన్న వాటిపై పన్నులను విధిస్తుంది. కేంద్ర ప్రభుత్వం పేరిట హక్కుగా ఉన్న భూములు, ఆస్తులు కేంద్రానికే దక్కుతాయి. ఈ ప్రాంతాలను విభజించేటప్పుడు, సాయుధ దళాల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. -
ఈ లిబియాకు ఏమైంది? వెన్నాడుతున్న గడాఫీ అరాచకాలే కారణమా?
ఉత్తర ఆఫ్రికా దేశమైన లిబియాలో ‘డేనియల్’ తుఫాను సంభవించిన తర్వాత ముంచెత్తిన వరదలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. లిబియా ఒక చిన్న దేశం. అయితే అనునిత్యం ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తోంది. ఈ దేశం అక్కడి గత నియంత ముఅమ్మర్ అల్ గడాఫీ కారణంగా చర్చల్లో నిలిచింది. అలాగే సమృద్ధిగా ఉన్న చమురు సంపద కారణంగానూ పేరొందింది. గడాఫీ హత్య తర్వాత అంతర్యుద్ధం 2011, అక్టోబర్ 20న గడాఫీ హత్య తర్వాత ఇక్కడ అంతర్యుద్ధం ప్రారంభమైంది. ఇది చాలా కాలం పాటు కొనసాగింది. దీని తరువాత ఇస్లామిక్ స్టేట్ ఇక్కడకు వచ్చి దేశాన్ని సర్వనాశనం చేసింది. ఇప్పుడు దర్నా నగరాన్ని తాకిన వరద సర్వం తుడిచిపెట్టుకుపోయేలా చేసింది. లిబియా విధ్వంసం కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా మొదలైన గడాఫీ శకం గడాఫీ 27 ఏళ్ల వయసులో తిరుగుబాటుకు పాల్పడి లిబియాలో అధికారంలోకి వచ్చాడు. గడాఫీ ఈ దేశాన్ని 42 సంవత్సరాలు పాలించాడు. ‘బ్రిటన్ రాణి 50 ఏళ్లు, థాయ్‌లాండ్ రాజు 68 ఏళ్లు పాలించగలిగినప్పుడు నేనెందుకు పాలించలేను’ అని గడాఫీ తరచూ అంటుండేవాడు. గడాఫీ 1942 జూన్ 7న లిబియాలోని సిర్టే నగరంలో జన్మించాడు. 1961లో బెంఘాజీలోని మిలిటరీ కాలేజీలో చేరాడు. శిక్షణ పూర్తయిన తర్వాత లిబియా సైన్యంలో చేరాడు. అనేక ఉన్నత స్థానాల్లో పనిచేశాడు. గడాఫీ సైన్యంలో ఉన్న సమయంలో అక్కడి రాజు ఇద్రీస్‌తో విభేదాలు వచ్చాయి. దీంతో గడాఫీ సైన్యాన్ని విడిచిపెట్టాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే బృందంలో చేరాడు. 1969 సెప్టెంబర్ 1న తిరుగుబాటుదారులతో కలిసి గడాఫీ నాటి రాజు ఇద్రిస్ నుంచి అధికారాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అంతులేని గడాఫీ అరాచకాలు గడాఫీ అధికారం చేపట్టిన తర్వాత లిబియా నుంచి సహాయం అందుకుంటున్న అమెరికన్, బ్రిటీష్ సైనిక స్థావరాలను మూసివేయాలని గడాఫీ ఆదేశించాడు. లిబియాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ కంపెనీలు వారికి లభిస్తున్న ఆదాయంలో ఎక్కువ వాటా ఇవ్వాలని ఆదేశించాడు. గ్రెగోరియన్ క్యాలెండర్ స్థానంలో ఇస్లామిక్ క్యాలెండర్ అమలు చేశాడు. మద్యం విక్రయాలపై నిషేధం విధించాడు. 1969 డిసెంబర్లో, అతని రాజకీయ ప్రత్యర్థులు అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నించినప్పుడు, వారందరినీ హత్యచేశాడు. ఇటాలియన్లను, యూదు సమాజానికి చెందిన ప్రజలను లిబియా నుండి బహిష్కరించాడు. లిబియా ఆర్థిక వ్యవస్థ పతనం ప్రత్యర్థులను అణచివేసేందుకు గడాఫీ చేపట్టిన విధానాలే అతని పతనానికి కారణంగా నిలిచాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత గడాఫీ క్రమంగా అనేక దేశాల ప్రభుత్వాలపై ఆంక్షలు విధిస్తూనే ఉన్నాడు. ఫలితంగా జనం అతనిని వెర్రివాడు అని పిలిచేవారు. గడాఫీ ప్రవర్తన కారణంగా లిబియా ఆర్థిక వ్యవస్థ పతనమయ్యింది. సిర్టేలో గడాఫీ హతం అనంతరం లిబియా పేరు పలు ఉగ్రవాద దాడులతో ముడిపడి కనిపించింది. 1986లో వెస్ట్ బెర్లిన్ డ్యాన్స్ క్లబ్‌పై జరిగిన బాంబు దాడిలో లిబియా పేరు వినిపించింది. దీంతో నాటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ చర్యలు చేపట్టి, ట్రిపోలీలోని గడాఫీ నివాసంపై దాడి చేశారు. నాటి నుంచి యూఎన్ఓ గడాఫీ తిరుగుబాటుదారులకు మద్దతు ఇవ్వడం మొదలుపెట్టింది. నాటో కూటమి కూడా లిబియాపై వైమానిక దాడులు చేయడం ప్రారంభించింది. జూన్ 2011లో గడాఫీ కేసు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు చేరింది. గడాఫీ, అతని కుమారుడు సైఫ్ అల్-ఇస్లాంలకు కోర్టు వారెంట్లు జారీ చేసింది. 2011, జూలైలో ప్రపంచంలోని 30 దేశాలు లిబియాలో తిరుగుబాటు ప్రభుత్వాన్ని గుర్తించాయి. 2011, అక్టోబరు 20న గడ్డాఫీ తన స్వస్థలమైన సిర్టేలో హతమయ్యాడు. చెలరేగిపోయిన లిబియా నేషనల్ ఆర్మీ గడాఫీ మరణానంతరం ఐక్యరాజ్యసమితి ‘నేషనల్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ (టీఎన్సీ)’ని చట్టబద్ధమైన ప్రభుత్వంగా ప్రకటించింది. టీఎన్సీ 2012లో జనరల్ నేషనల్ కాంగ్రెస్‌కు అధికారాన్ని అప్పగించింది. దీని తరువాత లిబియాలోని టోబ్రూక్ డిప్యూటీస్ కౌన్సిల్ కూడా ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. కాగా 2014 నుండి జనరల్ హఫ్తార్‌కు చెందిన ‘లిబియన్ నేషనల్ ఆర్మీ’ లిబియాలో తన ప్రభావాన్ని పెంచుకుంది. 2016లో ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంతో లిబియాలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడింది. అయితే కొన్ని లిబియా గ్రూపులు దానిని అంగీకరించడానికి నిరాకరించాయి. ఇంతలోనే లిబియా రాజధాని ట్రిపోలీని స్వాధీనం చేసుకునేందుకు లిబియా నేషనల్ ఆర్మీ.. విమానాశ్రయంపై దాడి చేసింది. జనరల్ హఫ్తార్ తన సైన్యాన్ని ట్రిపోలీపై దాడి చేయాలని ఆదేశించాడు. ఈ విధంగా అతని సైన్యం..ఇతర సమూహాల మధ్య చాలా కాలంగా ఘర్షణ వాతావరణం కొనసాగింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు హతం గడాఫీ మరణానంతరం ప్రారంభమైన అంతర్యుద్ధాన్ని సద్వినియోగం చేసుకున్న ఇస్లామిక్ స్టేట్ ఈ దేశంలోకి ప్రవేశించింది. రాజధాని ట్రిపోలీకి తూర్పున 450 కి.మీ దూరంలో ఉన్న సిర్టే నగరంలో తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది. ఇస్లామిక్ స్టేట్ ఇక్కడ ఊచకోతలకు పాల్పడింది. అయితే 2022లో అక్టోబర్‌లో ఖలీఫా హిఫ్తార్ దళాలు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అంతమొందించాయి. తాజా వరదల్లో వేలాదిమంది మృతి తాజాగా లిబియాలోని దర్నాను తాకిన సునామీ తరహా వరద నగరంలోని అనేక ప్రాంతాలను ముంచెత్తింది. ట్రిపోలీలో సంభవించిన వరదల్లో 2,300 మంది మరణించారని చెబుతున్నారు. దర్నాతో సహా దేశంలోని పశ్చిమ ప్రాంతంలో సంబంధిత అధికారులు 5,300కు మించిన మృతదేహాలను వెలికితీశాని సమాచారం. కాగా వరదల్లో వేలాది మంది గల్లంతయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 34 వేల మంది నిరాశ్రయులయ్యారని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: పాక్ ఆ బంకర్లలో ఏమి దాస్తోంది? -
కొత్త కోర్టులతో సత్వర న్యాయం అందాలి
విజయనగరం లీగల్: విజయనగరం జిల్లాలో కొత్తగా ఏర్పాటైన న్యాయస్థానాల ద్వారా ప్రజలకు సత్వర న్యాయం అందాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు అభిలషించారు. ఈ దిశగా న్యాయాధికారులు, న్యాయవాదులు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. విజయనగరంలోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో కొత్తగా మంజూరైన అదనపు సీనియర్ సివిల్ కోర్టుని ఆదివారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి, జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ ఉపమాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ దుప్పల వెంకటరమణ ప్రారంభించారు. న్యాయసేవా సదన్‌లో ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కార్యాలయాన్ని జస్టిస్ ఏవీ శేషసాయి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ యువ న్యాయవాదులకు తగిన శిక్షణ ఇచ్చి మెరికల్లాంటి న్యాయవాదులను అందించాలని సీనియర్ న్యాయవాదులకు సూచించారు. న్యాయవాదులు, న్యాయాధికారులు పరస్పరం గౌరవించుకోవడం ద్వారా సమాజానికి మేలు చేయగలమన్నారు. జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ మాట్లాడుతూ జిల్లా కోర్టు భవన సముదాయాలకు రూ.99 కోట్లతో మంజూరైన కొత్త భవనాలను నాణ్యతగా నిరి్మంచేలా బార్ కౌన్సిల్, యంత్రాంగం తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లా జడ్జి బి.సాయి కళ్యాణచక్రవర్తి, రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు తదితరులు పాల్గొన్నారు. -
'పైసా మే హై పరమాత్మ'.. కంప్యూటర్ సైన్స్ వైపు విద్యార్ధుల చూపు!
కంప్యూటర్ సైన్స్ (సీఎస్) కారణంగా మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కోర్స్‌లు ఉనికిని కోల్పోతున్నాయా? అందుకు కారణాలేంటి? డబ్బు కోసమే సీఎస్‌లో చేరుతున్నారా? విద్యార్ధులు ఏమంటున్నారు? ఈ ఏడాది తొలి 100 ఐఐటీ ర్యాంకర్లలో 89 మంది ఐఐటి బాంబేలో చేరారు. వారిలో ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ (సీఎస్)ను చదివేందుకు మొగ్గుచూపారు. అందుకు కారణం! ‘ఆర్థిక స్థిరత్వం, ఆకర్షణీయమైన ఉద్యోగ అవకాశాలేనని ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అప్లైడ్ మెకానిక్స్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ తెలిపారు. అంతేకాదు, డబ్బే అన్నీంటికి మూలం ‘సివిల్ ఇంజనీర్లు, మెకానికల్ ఇంజనీర్లతో పోలిస్తే ఐటీ సంబంధిత విభాగాల్లో ఉద్యోగం చేస్తున్న కంప్యూటర్ ఇంజనీర్ల మధ్య జీతం వ్యత్యాసం చాలా ఉంది. సీఎస్ గ్రాడ్యుయేట్లకు ఐటీ పరిశ్రమలో విస్తృతమైన అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఈ అంశాన్ని విశ్లేషించేందుకు సీఎస్, ఐటీ విభాగాల్లోకి మారిన ఐఐటీ సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్ధులు అభిప్రాయాల్ని సేకరించగా.. గ్రాడ్యుయేట్లు వారి కెరీర్ మార్పు గురించి స్పష్టత ఇచ్చారు. ఈ సందర్భంగా 2021లో ఐఐటీ- గౌహతి సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి, ప్రస్తుతం ఐటీ జాబ్ చేస్తున్న షరీబ్ తస్నీమ్ మాట్లాడుతూ.. ‘సివిల్ ఇంజినీరింగ్ చదివి ఐటీ ఉద్యోగాలు చేయడానికి రెండు ప్రధాన కారణాలున్నాయని అన్నారు. ముందుగా, మెకానికల్, ఎలక్ట్రానిక్, సివిల్ వంటి ఇతర విభాగాలతో పోలిస్తే కంప్యూటర్ సైన్స్ చదివి సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్న వారి జీతాలు ఎక్కువగా ఉన్నాయి. రెండవది, సివిల్ ఇంజనీర్లను రిక్రూట్ చేసే కంపెనీలు చాలా తక్కువనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో పనిచేస్తున్న ఐఐటి-ఢిల్లి 2019-21 మెకానికల్ బ్రాంచ్‌కు చెందిన ఎంటెక్ విద్యార్థి రిషబ్ మిశ్రా మాట్లాడుతూ ‘కోర్ పరిశ్రమలలో తక్కువ అవకాశాలు, నాన్-కోర్ కంపెనీల్లో ఆకర్షణీయమైన వేతనాలున్నాయి. అందుకే నేనూ ఐటీ విభాగానికి షిఫ్ట్ అయ్యాను. మెకానికల్ నుండి కంప్యూటర్ సైన్స్ వరకు మెరుగైన అవకాశాల్ని అందించేది కంప్యూటర్ సైన్స్ రంగమేనని చెప్పారు. -
ఇంజినీర్ చెంప చెల్లుమనిపించిన మహిళా ఎమ్మెల్యే.. వీడియో వైరల్..
మహారాష్ట్ర: మహారాష్ట్రకు చెందిన మహిళా ఎమ్మెల్యే ఓ సివిల్ ఇంజినీర్‌పై చేయి చేసుకున్నారు. అందరూ చూస్తుండగానే అధికారి చెంప చెల్లుమనిపించారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. నిర్మాణాలను కూల్చివేసిన ఘటనలో ఎమ్మెల్యే ఫైర్ అయినట్లు తెలుస్తోంది. థాణే జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని మీరా భయందర్ ఎమ్మెల్యే గీతా జైన్. అయితే.. భయందర్ మున్సిపల్ కార్పొరేషన్లో కొన్ని నిర్మాణాలను కూల్చివేసిన వ్యవహారంలో సివిల్ ఇంజినీర్‌ను ఆమె ప్రశ్నించారు. అధికారులను బూతులు తిడుతూ కోపగించుకున్నారు . నిర్మాణాలను కూల్చివేసిన కారణంగా పిల్లలతో సహా నిర్వాసితులు రానున్న వర్షాకాలంలో రోడ్లపైనే ఉండాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అధికారులు చెప్పిన సమాధానానికి సంతృప్తి చెందని ఎమ్మెల్యే.. అధికారి చెంప చెల్లుమనిపించారు. భయందర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు బీజేపీ తరుపున మాజీ మేయర్‌గా గీతా జైన్ పనిచేశారు. 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం బీజేపీ-శివసేన ప్రభుత్వానికి మద్దతునిస్తున్నారు. आमदार गीता जैन ताई ही कुठली पद्धत आहे अधिकाऱ्यावर हात उचलून प्रश्न सोडवण्याची.अधिकारी चुकला असेल तर सरकार मधे आहात कायदेशीर कार्यवाही करा कायदा हातात घेण्याचा अधिकार तुम्हाला कोणी दिला आहे ? @CMOMaharashtra यांच्यावर कार्यवाही करणार की आमदारांना कायदा हातात घेण्याची सूट आहे ? pic.twitter.com/ndJGyhLVyR — Suraj Chavan (सूरज चव्हाण) (@surajvchavan) June 20, 2023 ఇదీ చదవండి: మమత ప్రభుత్వానికి షాక్..! కేంద్ర బలగాల మోహరింపుపై సుప్రీం ఓకే.. -
సివిల్స్‌లో కేయూ ప్రొఫెసర్ మంద అశోక్ కుమార్ కూతురుకు 646 ర్యాంక్
కాకతీయ యూనివర్సిటీ అర్థశాస్త్ర ఆచార్యులు మంద అశోక్ కుమార్ కూతురు మంద అపూర్వ సివిల్స్ ఫలితాలలో 646 ర్యాంకు సాధించారు. మంద అపూర్వ ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం ఎంటెక్ చేస్తున్నారు. హనుమకొండ ఎక్సైజ్ కాలనీలో నివసిస్తున్న అపూర్వ తల్లి మంద రజనీ దేవి ప్రభుత్వ టీచర్ గా భీమదేవరపల్లి మండలం మాణిక్య పూర్లో పనిచేస్తున్నారు. మందా అపూర్వకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు పెద్దన్నయ్య అరుణ్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా, చిన్న అన్నయ్య అభినవ్ పూణేలో ఫార్మసీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇక, మంద అపూర్వ సివిల్స్‌లో ర్యాంక్ సాధించడంపై పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. -
అమెరికాలో అంతర్యుద్ధం..అధ్యక్షుడిగా ఎలన్ మస్క్!
కొత్త ఏడాది అనంగానే పలువురు రాబోయే ఏడాదిలో ఏమి జరుగుతుందో తమదైన శైలిలో భవిష్యత్తు గురించి చెప్పేస్తుంటారు జ్యోతిష్యులు. అందరూ కూడా తమకు ఈ కొత్త ఏడాదిలో మంచి జరగాలని రకరకాలుగా సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో రష్యా మాజీ అధ్యక్షుడు, పుతిన్ సన్నిహితుడు, రష్యా భద్రతామండలి డిప్యూటీ చైర్మన్ దిమిత్రి మెద్వేదేవ్ ఏకంగా 2023లో అమెరికా ఎలా ఉంటుందో జోస్యం చెప్పారు. ఈ మేరకు మెద్వెదేవ్ ట్విట్టర్లో.. అమెరికాలో అంతర్యుద్ధం జరుగుతోందని, ఫలితంగా కాలిఫోరియా, టెక్సాస్ రాష్టాలు స్వతంత్ర రాష్టాలుగా విడిపోయే పరిస్థితి ఏర్పడుతుందంటూ..సంచలన విషయాలు చెప్పారు. దీంతో అధ్యక్ష ఎన్నికల్లో ట్విట్టర్ బాస్ ఎలన్ మస్క్ అమెరికా అధ్యక్షుడవుతారని ట్విట్టర్ వేదికగా జోస్యం చెప్పారు. అంతేగాదు ఆంగ్లో సాక్సన్ స్నేహితులకు వారి పిల్లలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ఒక రష్యా అత్యున్నతాధికారి ఇలా వింతగా జోస్యం చెప్పడం నెటిజన్లను ఆశ్చర్యచకితులను చేసింది. ఈ ట్విట్టర్ పోస్ట్ నెట్టింట దావానలంలా వైరల్ అయ్యింది. ఈ పోస్ట్ ఎలన్ మస్క్ దృష్టికి రావడమే కాదు ఆయన ఈ విషయంపై వెంటనే స్పందించారు కూడా. ఈ మేరకు మస్క్ రష్యా అధికారి మెద్వెదేవ్ ఒక పురాణకథను వల్లించారంటూ సెటైర్ వేశారు. తెలివితేటల పరంగానూ, రాజీకయపరంగానూ చూసినా.. ఇది అత్యంత అవాస్తవమైనా, అసంబద్ధమైన అంచనా. ఇది అతని అవగాహన లేమికి నిదర్శనం అంటూ ఎలన్ మస్క్ రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్కి గట్టి కౌంటరిచ్చారు. 8. Civil war will break out in the US, California. and Texas becoming independent states as a result. Texas and Mexico will form an allied state. Elon Musk’ll win the presidential election in a number of states which, after the new Civil War’s end, will have been given to the GOP — Dmitry Medvedev (@MedvedevRussiaE) December 26, 2022 (చదవండి: బయల్దేరే సమయానికి మంచు తుపాను...ఏకంగా 18 గంటల పాటు కారులో) -
సివిల్స్ టాప్ 20 ర్యాంక్: ఆడుతూపాడుతూ సివిల్స్ పరీక్షలకు సిద్ధమయ్యా
సాక్షి, హైదరాబాద్: ఆడుతూపాడుతూ సన్నద్ధమైన ఓ యువతి ఇప్పుడు దేశంలోనే అత్యున్నత సర్వీస్ అయిన సివిల్స్‌లో మెరిసింది. టాప్ 20 ర్యాంక్ సాధించి సత్తా చాటింది. అది కూడా తొలి ప్రయత్నంలోనే సాధించడం విశేషం. ఆమెనే తెలంగాణకు చెందిన శ్రీజ. సివిల్స్‌లో ఆలిండియా 20వ ర్యాంకు వచ్చిన పి.శ్రీజ స్వస్థలం వరంగల్. హైదరాబాద్‌లోని ఉప్పల్ సమీపంలోని సాయినగర్‌లో నివాసం ఉంటున్నారు. తండ్రి శ్రీనివాస్ హబ్సిగూడలోని వాహనాల షోరూంలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తుండగా.. తల్లి శ్రీలత నర్సుగా పనిచేస్తున్నారు. శ్రీజ ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివింది. తాజాగా తన తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో 20వ ర్యాంకు సాధించింది. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఎంబీబీఎస్ చేశానని.. పేదలకు మరింత సేవ చేయాలన్న ఆలోచనతో సివిల్స్‌కు సిద్ధమయ్యానని శ్రీజ తెలిపింది. (చదవండి: మా సంస్థ అంకిత భావాన్ని గుర్తించి ఈ అవార్డును అందించినందుకు మనసారా కృతజ్ఞతలు: స్వేరోస్) ‘‘పెద్దగా ఒత్తిడికి గురికాకుండా ఆడుతూపాడుతూ సివిల్స్ పరీక్షలకు సిద్ధమయ్యా. అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవడంతో ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల్లో.. ఇంటర్వ్యూలో ఎలాంటి తడబాటు లేకుండా నిలిచా. కోచింగ్, తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం నా విజయానికి తోడ్పడ్డాయి..’’ అని పేర్కొంది. (చదవండి: అవార్డు మరింత స్ఫూర్తినిస్తుంది: అరుణ్ డేనియల్ ఎలమటి) -
పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో తొలి హిందూ మహిళగా సనా
ఇస్లామాబాద్: పాకిస్తాన్ దేశ అత్యున్నత పబ్లిక్ సర్వీస్ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించిన తొలి హిందూ మహిళగా సనా రామ్‌చంద్ గుల్వానీ చరిత్ర సృష్టించారు. అత్యంత క్లిష్టమైన పరీక్షగా భావించే ఈ పరిక్షలో ఉత్తీర్ణత సాధించి అందరి ప్రశంసలను అందుకున్నారు. (చదవండి: స్పేస్ఎక్స్ టూరిజంలా త్వరలో మూన్ టూరిజం) పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లోని సింధు గ్రామీణ్‌లో చోటు సంపాదించి సెంట్రల్ సూపిరియర్ సర్వీస్‌లో సనా స్థానం కైవసం చేసుకుంది. ఈ పరీక్ష భారత్‌లోని సివిల్స్ పరీక్ష మాదిరి అత్యంత క్లిష్టమైన పరీక్ష. సనా.. షహీద్ మొహతర్మ బెనజీర్ భుట్టో మెడికల్ యూనివర్సిటీ నుండి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆ తర్వాత యూరాలజిస్ట్‌గా చదువును కొనసాగించారు. తదనంతరం ఫెడరల్ సర్వీస్ కమిషన్‌లో చేరారు. (చదవండి: ఎలన్ మస్క్: రష్యాకు హ్యాండ్.. భారత్ కోసమేనా?) -
పదోన్నతి...జీతానికి కోతే గతి
సాక్షి, హైదరాబాద్ : పోలీసుశాఖలో పనిచేస్తూ సివిల్ కానిస్టేబుల్, ఎస్సైలుగా ఎంపికైన వారికి కొత్తగా వేతన కష్టాలు చుట్టుముట్టాయి. పదోన్నతి దక్కినందుకు సంబరపడాలో వేతనం తగ్గుతున్నందుకు బాధపడాలో తెలియని అయోమయంలో పడ్డారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (టీఎస్ఎస్పీఆర్బీ) ఆధ్వర్యంలో ఒకేసారి దాదాపు 18 వేల పోస్టుల ఫలితాలు ప్రకటించింది. వీరిలో 1,200 మంది ఎస్సైలకు శిక్షణ ప్రారంభమైంది. త్వరలోనే 16 వేల మందికి పైగా కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభం కానుంది. అయితే సివిల్ కానిస్టేబుల్, సివిల్ ఎస్సైలకు ఎంపికైన కానిస్టేబుళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఇటీవల టీఎస్ఎస్పీఆర్బీ నిర్వహించిన పరీక్షల్లో ఆర్మ్డ్ రిజర్వుడు (ఏఆర్), తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ) బలగాల్లో పనిచేసే కానిస్టేబుళ్లు కూడా ఉన్నారు. వీరిలో 2016 అంతకుముందు ఎంపికైనవారున్నారు. ఆ లెక్కన వీరందరి జీతం రూ.30 వేలకు కాస్తా అటుఇటుగా ఉంది. పాత కొలువులకు రాజీనామా చేసి.. ఇటీవల వెలువడిన ఫలితాల్లో దాదాపు 1,500 మంది ఏఆర్, టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్లు సివిల్ కానిస్టేబుళ్లు, ఎస్సైలుగా ఎంపికయ్యారు. వీరంతా సివిల్‌కు రావాలంటే వీరంతా తమ పాత ఉద్యోగాలకు రాజీనామా చేసి, సంబంధిత విభాగం నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) తీసుకురావాలి. అప్పుడు వీరంతా తిరిగి కానిస్టేబుల్, ఎస్సై శిక్షణకు వెళతారు. శిక్షణకాలంలో వీరందరినీ ట్రైనీ కేడెట్లుగానే పరిగణిస్తారు. ఆ సమయంలో నెలకు రూ.9,000 స్టైపెండ్ కింద ఇస్తారు. వీరిలో చాలామంది వివాహితులు. కొందరికి పిల్లలు కూడా ఉన్నారు. శిక్షణకాలంలో ఇంత తక్కువ వేతనంతో ఎలా మనగలగాలి? అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వీరిలో ఎస్సైకి ఎంపికైన అభ్యర్థులు ర్యాంకు పెరిగింది కాబట్టి.. ఎలాగోలా సర్దుకునేందుకు సిద్ధపడ్డారు. కానీ, సివిల్‌కానిస్టేబుల్‌కు ఎంపికైన ఏఆర్, టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్లు మాత్రం కుటుంబపోషణ భారంగా మారుతుందని వాపోతున్నారు. తామందరం ఇప్పటికే శిక్షణ తీసుకుని, కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న కారణంగా తిరిగి 9 నెలల సుదీర్ఘ శిక్షణ అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. గతంలో 2016లో నూ ఇలాంటి సమస్యే ఎదురైనపుడు ఏఆర్, టీఎస్ఎస్పీ, కానిస్టేబుళ్లకు కేవలం 3 నెలల తరగతులు బోధించి వెంటనే సివిల్ కానిస్టేబుళ్లుగా పోస్టింగ్ ఇచ్చారని గుర్తుచేస్తున్నారు. తమకు తిరిగి అదే వెసులుబాటు కల్పించాలని డీజీపీకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు పలువురు కానిస్టేబుళ్లు డీజీపీ కార్యాలయానికి వస్తూ వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. -
కోడ్ అతిక్రమిస్తే సీ విజిల్లో పడతారుగా...
సాక్షి, జనగామ: ముందస్తు ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ అనేక ఆంక్షలు విధిస్తుంది. సాంకేతికతను వినియోగిస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా అభ్యర్థుల ప్రచార కదలికలపై కన్నేసింది. కోడ్ ఉల్లంఘనలపై అధికారులు పర్యవేక్షిస్తుండగా ఈసారి పనిలో పనిగా సామాన్యపౌరులకు ఆ బాధ్యతలు అప్పగించింది. దీంతో ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతుంది. కోడ్ అతిక్రమిస్తున్న రాజకీయపార్టీలపై సీ విజిల్ యాప్, ఈసీ వెబ్సైట్, ఈ మెయిల్ ద్వారా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొస్తున్నారు. కోడ్ అమలులోకి వచ్చిన నాటినుంచి జనగామ జిల్లావ్యాప్తంగా సీ విజిల్ యాప్‌లో 56 ఫిర్యాదులు అందాయి. వీటిలో 55 కేసులకు సంబంధించి విచారణ జరుపుతుండగా ఒకటి మాత్రం ఎఫ్ఐఆర్ బుక్‌చేశారు. ఓటింగ్ రోజు జాగ్రత్త పోలింగ్ స్టేషన్ దగ్గరలో కోడ్‌కు వ్యతిరేఖంగా ప్రచారం చేస్తే ఏ పోలీస్ అధికారి అయినా సామగ్రిని స్వాధీనం చేసుకోవచ్చు, మూడు నెలల జైలు లేదా జరిమానా విధించవచ్చు. ఓటు వేసే సమయంలో నియమ నిబంధనలు పాటించని వారికి మూడు నెలల జైలలు శిక్ష లేదా జరిమానా పడుతుంది. పోలింగ్ బూత్ వద్దకు చేరవేసేందుకు అక్రమంగా వాహనాలు సమకూర్చడం నేరమే. అధికార దుర్వినియోగం చేస్తే శిక్షార్హులే. అందుకు రూ.500 జరిమానా విధిస్తారు. పోలింగ్‌రోజు, కౌంటింగ్‌రోజు మద్యం అమ్మడం, అందించడం నేరం. అందుకు ఆరు నెలల జైలు శిక్ష లేదా రెండు వేల రూపాయల వరకు జరిమానా పడుతుంది. ముందే అవగాహన.. పెద్ద ఎత్తున ప్రచారం.. ఎలక్షన్ నియమావళి ఉల్లంఘనపై సీ విజిల్, వెబ్సైట్, ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదుచేసే విధానంపై ఎన్నికల అధికారులు జిల్లావ్యాప్తంగా ప్రచారం చేశారు. సీ విజిల్ కోసం నియమించిన నోడల్ అధికారుల ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిత్యం అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. సత్వర పరిష్కారం.. సీ విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులు చేసిన 100 నిమిషాల్లో సమస్యను పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. యాప్ ద్వారా ఫిర్యాదులు చేసే వారి వివరాలు అడ్రస్ తెలుసుకుంటారు. దీంతో సంబంధిత అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నారు. యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వాస్తవమయితే కేసు నమోదు చేయడంతో పాటు ఫిర్యాదుచేసిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచేందుకు సంబంధిత అధికారులకు ఎలక్షన్ కమిషన్ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. -
కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్ ఉండదు..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: నాన్న స్ఫూర్తితో సివిల్స్‌కు ప్రయత్నించాను. మా నాన్నగారు ఫ్యాక్షన్ పడగవిప్పిన సమయంలో రాయలసీమలో పోలీసు అధికారిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన పనితీరు, ఫ్యాక్షన్‌ను అణగదొక్కడానికి ఆయన తీసుకుంటున్న చర్యలు నన్ను పోలీసు కావడానికి ప్రేరేపించాయి. డిగ్రీ చదువుతున్నప్పుడే సివిల్స్‌కు వెళ్లాలన్న నిర్ణయం తీసుకున్నాను. మావోయిస్టు ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పనిచేశాను. అక్కడ యువతను మావోయిజం వైపు నుంచి మళ్లించేందుకు వారికి ఉపాధి కల్పించే దిశగా తీసుకున్న చర్యలు విజయవంతం కావడం నాకు ఇప్పటికీ గుర్తుండిపోయే అంశం. నేడు యువత సోషల్‌మీడియా ఉచ్చులో పడి చెడిపోతోంది. సోషల్‌మీడియాలో ఉన్న మంచిని స్వీకరించవచ్చు గాని నేరం ఎలా చేయాలో మీడియాలో చూసి నేర్చుకుని ఆ వైపుగా యువత వెళ్లడం బాధ కలిగిస్తోంది. సోషల్ మీడియాలో వెయ్యి మంది స్నేహితులు ఉండటం కన్నా బయట మంచి స్నేహితులు నలుగురైదుగురు ఉంటే యువత తమ భవితను ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటుందని అభిప్రాయపడుతున్న పశ్చిమగోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఎం.రవిప్రకాష్ సాక్షి ప్రతిని«ధితో పంచుకున్న అంతరంగం ఆయన మాటల్లోనే. కుటుంబ నేపథ్యం : తండ్రి రామచంద్రయ్య రిటైర్డ్ అదనపు ఎస్పీ, తల్లి సరోజనమ్మ, భార్య సుకన్య, కుమారుడు సూర్య చదువు : డిగ్రీ బీఎస్సీ (పీసీజెడ్) తిరుపతిలో, ఎంఎస్సీ మైక్రో బయోలజీ. డిగ్రీ చదివేనాటి నుంచే సివిల్ సర్వీస్ పట్ల ఆసక్తి, హైదరాబాద్‌లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కు శిక్షణ తీసుకున్నాను. వ్యక్తిగతం: సొంత జిల్లా చిత్తూరు. చదువు అంతా కడప, అనంతపురం, చిత్తూరులోనే సాగింది. నాన్న రామచంద్రయ్య పోలీస్ అధికారిగా పనిచేయటంతో పోలీస్ అవ్వాలనే కోరిక ఉండేది. చేస్తే పోలీస్ అధికారిగానే పనిచేయాలనే లక్ష్యం ఉండేది. అప్పట్లో రాయలసీమలో ఫ్యాక్షన్ అధికంగా ఉండేది. తండ్రి సిన్సియర్ ఆఫీసర్‌గా చేయటంతో అదేస్థాయిలో తానూ చేయాలనే బలమైన కాంక్ష ఉండేది. కెరీర్ : ఎక్కువగా మావోయిస్ట్ ప్రాబల్యం ఉన్న తెలంగాణలోనే చేశాను. సిరిసిల్ల, పెద్దపల్లి, తాడిపత్రిలో డీఎస్పీగా పనిచేశా. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో మావోయిస్టు ప్రభావం తీవ్రస్థాయిలో ఉండేది. చాలా ఆపరేషన్స్‌లో పాల్గొన్నా. మావోయిస్టు ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా పనిచేసి మంచి ఫలితాలు సాధించా. అచీవ్మెంట్స్: కఠిన సేవా పతకం 2005లోనూ, ముఖ్యమంత్రి శౌర్యపతకం 2009లోనూ ప్రభుత్వం అందించింది. ఇవికాకుండా అనేక మెడల్స్ అందుకున్నాను. హాబీలు: షటిల్ బ్యాడ్మింటన్, బుక్ రీడింగ్, స్మిమ్మింగ్ అంటే బాగా ఇష్టం. పోలీస్ అధికారిగా బాధ్యతలు చేపట్టటంతో భారత చట్టాలు, జడ్జిమెంట్స్, ఫోరెన్సిక్ సైన్స్, ఫోరెన్సిక్ మెడిసిన్ వంటి పుస్తకాలను చదవటం అలవాటయింది. ఇక చార్లెస్ డికిన్స్ రాసిన డేవిడ్ కాపర్ఫీల్డ్, డిటెక్టివ్ పుస్తకం షెర్లాక్ హŸమ్స్ అంటే చాలా మక్కువ. ‘మావూరికి రండి’ : సిరిసిల్లలో పనిచేసే రోజులు బాగా సంతృప్తి నిచ్చాయి. యువత మావోయిస్టు భావజాలానికి ప్రభావితులు కాకుండా కట్టడి చేయటం గుర్తుండిపోతుంది. ప్రధానంగా ‘మావూరికి రండి’ కార్యక్రమం అద్భుతమైంది. సిరిసిల్లలో పనిచేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులు భయపడే రోజులవి. గ్రామస్తులే ఉద్యోగులకు రక్షణ వలయంగా ఉండేవారు. ఇళ్లు సైతం అద్దెలు లేకుండా గ్రామస్తులే ఏర్పాటు చేసేవారు. వీఆర్వోలు, పంచాయతీ సెక్రటరీలు, ఉపాధ్యాయులు, వ్యవసాయ శాఖ ఉద్యోగులు ఇలా అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు స్వేచ్ఛగా పనిచేసేలా చేయటం మంచి అచీవ్‌మెంట్‌గా మిగిలిపోయింది. ఫీల్ గుడ్: మారుమూల గ్రామాల్లోని యువతకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించి సెక్యూరిటీ గార్డులుగా హైదరాబాద్‌లో ఉద్యోగాలు ఇప్పించాం. 5వేల మంది యువతకు సెక్యూరిటీ గార్డులుగా ఉపాధి కల్పించటం సంతృప్తినిచ్చింది. గుంటూరులో పనిచేసే కాలంలో గిరిజన తండాలోని యువతకు ఉద్యోగ సాధనకు శిక్షణ ఇప్పించా. బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ వంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో 100మందికి చోటు కల్పించటం మర్చిపోలేను. చింతూరు, రంపచోడవరంలో జనమైత్రిలో భాగంగా యువతకు ఉపాధి, ఉద్యోగ శిక్షణలు ఇవ్వటం. భగవంతుడి సేవ: తూర్పుగోదావరి జిల్లాలో మూడేళ్లు పనిచేశా. గోదావరి పుష్కరాల్లో పనిచేశాను. భద్రాచలం నుంచి సఖినేటిపల్లి, అంతర్వేది వరకూ ఉన్న 500 ఘాట్లలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం (రాజమండ్రి నా పరిధిలోకి రాదు). పుష్కరాల్లో పనిచేయటం, భగవంతుని సేవగా భావించాను. కలచివేసింది: మహబూబ్‌నగర్‌లో పనిచేసే రోజుల్లో మావోయిస్టులు ఇద్దరు కానిస్టేబుల్స్‌ను చంపటం తీవ్రంగా బాధించింది. కోర్టు సమన్లు ఇచ్చేందుకు వెళ్లిన నిరాయుధులైన కానిస్టేబుళ్లను కిరాతకంగా హతమార్చటం కలచివేసింది. అదేస్థాయిలో విజయవాడ పడమటలో ఒక మహిళను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, హత్య చేయటం సమాజంలో నైతిక విలువలు దిగజారిపోయాయి అనేం దుకు నిదర్శనంగా ఉన్నాయి. యువతకు సందేశం: సమాజంలో రోజురోజుకూ మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. సోషల్ మీడియా ప్రభావంతో యువత, విద్యార్థులు పెడదారి పట్టటం ఆందోళన కలిగిస్తోంది. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. భవిష్యత్తులో ఉన్నతంగా ఎదిగేందుకు యువత తమ శక్తిని వినియోగించాలి. నేడు అధికంగా క్రిమినల్ కేసుల్లో యువత ఉంటోంది. హత్యలు, అత్యాచారాలు, జూదం, ట్రాప్‌లు వంటివాటిలో ఉండడం మానుకోవాలి. క్రిమినల్ కేసులు నమోదైతే భవిష్యత్తు నా«శనం అవుతుంది. -
నేడు సివిల్స్ పరీక్ష
హాజరు కానున్న 2,681 మంది అభ్యర్థులు అనంతపురం అర్బన్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో ఆదివారం అనంతపురంలోని ఎనిమిది కేంద్రాల్లో సివిల్ సర్వీసెస్ (ప్రిలిమనరీ) పరీక్ష జరగనుంది. ఇందుకు సంబంధించి అధికార యంత్రాగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. సివిల్స్ పరీక్షకు జిల్లావ్యాప్తంగా 2,681 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పేపర్–1 ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు జరుగుతుంది. పేపర్–2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 గంటల వరకు ఉంటుంది. పరీక్షల నిర్వహణకు 32 మంది అధికారులను నియమించారు. ఇందులో ఎనిమిది మంది లైజన్ ఆఫీసర్లు, ఎనిమిది రూట్ అధికారులు, ఎనిమిది పరిశీలకులు, ఎనిమిది మంది అసిస్టెంట్ సూపర్వైజర్లు ఉంటారు. అరగంట ముందే ఉండాలి అభ్యర్థులు పరీక్ష సమయానికి అర్ధ గంట ముందుగానే కేంద్రంలోకి చేరుకోవాలి. ఉదయం పరీక్షకు 9.10 గంటల్లోగా, మధ్యాహ్నం పరీక్షకు 2.10 గంటల్లోగా కేంద్రంలోకి చేరుకోవాల్సి ఉంటుంది. వెంట ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు. -
ఐదు కొత్త జిల్లాల్లో ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు!
♦ కేంద్రానికి రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు ♦ ఒక్కో పాలిటెక్నిక్‌కు రూ.12.3 కోట్లు ♦ 2018–19 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐదు జిల్లాలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకరించింది. సబ్మిషన్ స్కీం ఆఫ్ పాలిటెక్నిక్స్ కింద కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఒక్కో పాలిటెక్నిక్ ఏర్పా టుకు రూ. 12.3 కోట్ల చొప్పున మంజూరు చేయ నుంది. ఇందులో పాలిటెక్నిక్‌ల భవన నిర్మాణాలకు రూ. 8 కోట్ల చొప్పున, పరికరాలు, వసతుల కల్పనకు రూ. 4.3 కోట్ల చొప్పున నిధులను ఇవ్వనుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 5 జిల్లాల్లో పాలిటెక్నిక్‌లు లేవు. మహబూబాబాద్ ఆసిఫాబాద్, నాగర్ కర్నూలు, కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లో కొత్త పాలిటెక్నిక్‌ల ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రతిపాద నలు సిద్ధం చేస్తోంది. అవి పూర్తి కాగానే కేంద్రానికి అందజేయనుంది. కేంద్రం నుంచి ఆమోదం లభించ గానే 2018–19 విద్యా సంవత్సరం నుంచి వాటిని అమల్లోకి తేనుంది. కొత్తగా ఏర్పాటు చేసే పాలి టెక్నిక్‌లకు అవసరమైన భూమి, వాటిల్లో నియమించే అధ్యాపకుల జీతభత్యాలను రాష్ట్ర ప్రభుత్వమే భరిం చాల్సి ఉంటుంది. కొత్తగా రానున్న 5 పాలిటెక్నిక్‌లలో 3 చొప్పున (సివిల్, ఎలక్ట్రికల్, మరొకటి) కోర్సులను ప్రవేశపెట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది నుంచే హుస్నాబాద్ పాలిటెక్నిక్‌లో తరగతులు హుస్నాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 2017–18 విద్యా సంవత్సరం నుం చే తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22న నిర్వహించనున్న పాలీసెట్–2017 ద్వారా ఆ కాలేజీలో సివిల్‌లో 60 సీట్లు, ఎలక్ట్రికల్‌లో 60 సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు హుస్నా బాద్ పాలిటెక్నిక్‌కు ఏఐసీటీఈ ఆమోదం తెలి పింది. ఈ విద్యా సంవత్సరంలో హుస్నాబాద్‌తో పాటు సికింద్రాబాద్ పాలిటెక్నిక్‌లో తరగతుల ప్రారంభానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఏఐసీటీఈకి ప్రతిపాదనలు పంపింది. సికింద్రాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌కు సొంత భవనం లేకపోవడంతో 2017–18లో ప్రవేశాలకు అనుమతి ఇవ్వలేదు. -
సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటే చర్యలు
జిల్లా ఎస్పీ రవిప్రకాష్ పిఠాపురం రూరల్ : పోలీసులు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటే ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ రవిప్రకాష్ హెచ్చరించారు. పిఠాపురం రూరల్ పోలీసు స్టేషన్‌ను ఆదివారం రాత్రి ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలీసులు ప్రజలతో స్నేహ సంబంధాలు పెంచుకోవాలన్నారు. పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు ఫిర్యాదులను పరిష్కరించడంతో పాటు సివిల్ వివాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. సివిల్ దందాలో పోలీసుల పాత్ర ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. గత నెల 27న చిత్తూరులో జరిగిన బాంబు పేలుడు సంఘటనలో మావోయిస్టు దళ కమిటీ సభ్యులు హరిభూషణ్‌తో పాటు ఐతు చనిపోయినట్టు గుర్తించామన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తమకు లభించాయని చెప్పారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కన్నయ్య, మోహన్‌లకు కాకినాడలో మెరుగైన చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. అక్రమ పశు వధ, రవాణాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఇటీవల కొత్తపల్లి పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ ఆత్మాహత్యాయత్నం సంఘటనలో ఆ స్టేషన్ ఎస్ఐ చైతన్యకుమార్పై సర్పవరం పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. రికార్డులు సక్రమంగా నిర్వహించని పిఠాపురం రూరల్ ఎస్ఐ వి.సుభాకర్కు మెమో జారీ చేస్తున్నట్టు తెలిపారు. -
40.54 లక్షల పెండింగ్ కేసులు
24 హైకోర్టుల్లో 1,079 మంది న్యాయమూర్తులకు గాను 608 మందే... • న్యాయమూర్తుల కొరత 44 శాతం • పెండింగ్ కేసుల్లో సివిల్ 29,31,352, క్రిమినల్ 11,23,178 • హైకోర్టులో జడ్జీల ఖాళీలు, అపరిష్కృత కేసులపై సుప్రీం నివేదిక న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో పెండింగ్ కేసులు, న్యాయమూర్తుల ఖాళీలపై సుప్రీంకోర్టు వార్షిక నివేదికలో విస్మయకర వాస్తవాలు వెలుగుచూశాయి. సుప్రీంకోర్టు వెల్లడించిన వివరాల మేరకు మొత్తం 24 హైకోర్టుల్లో 40.54 లక్షల కేసులు అపరిష్కృతంగా ఉండగా, 44 శాతం న్యాయమూర్తుల కొరతతో కోర్టులు తంటాలు పడుతున్నాయి. న్యాయమూర్తుల నియామకంపై సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం మధ్య సంఘర్షణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యత సంతరించుకుంది. ‘భారత న్యాయవ్యవస్థ వార్షిక నివేదిక 2015–16’ పేరిట గతేడాది జూన్30 వరకూ హైకోర్టుల్లోని న్యాయమూర్తుల ఖాళీలు, పెండింగ్ కేసుల వివరాల్ని సుప్రీంకోర్టు ఇందులో పొందుపరిచింది. సుప్రీం నివేదిక ప్రకారం... మొత్తం 24 హైకోర్టులకు కేటాయించిన న్యాయమూర్తుల సంఖ్య 1,079 కాగా, కేవలం 608 మందే విధులు నిర్వర్తిస్తున్నారు. ఉండాల్సిన న్యాయమూర్తుల సంఖ్య కంటే ఇది 43.65 శాతం తక్కువ. ఇక 40.54 లక్షల అపరిష్కృత కేసుల్లో సివిల్ కేసుల సంఖ్య 29,31,352 కాగా, క్రిమినల్ కేసులు 11,23,178. మొత్తం కేసుల్లో పదేళ్లకు పూర్వం నుంచి అపరిష్కృతంగా ఉన్న కేసులు 7,43,191. హైదరాబాద్‌లో 2.78 లక్షల కేసులు: అలహాబాద్ తర్వాతి స్థానం మద్రాసు హైకోర్టుది... అక్కడ అపరిష్కృత కేసులు 3,02,846 కాగా... 75 మంది న్యాయమూర్తులకుగాను 38 మందే ఉన్నారు. బాంబే హైకోర్టులో 2,98,263 కేసులు అపరిష్కృతంగా ఉండగా, అందులో 53,511 కేసులు పదేళ్లకు పూర్వం నాటివి.ఈ కోర్టుకు 94 మంది న్యాయమూర్తుల్ని కేటాయించగా 64 మందితోనే పనిచేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ హైకోర్టులో గతేడాది జూన్ 30 నాటికి 40 శాతం మేర న్యాయమూర్తుల కొరత ఉండగా... 60 మందికి గాను కేవలం 35 మంది న్యాయమూర్తులతోనే విధులు నిర్వర్తిస్తోంది. ఏపీ, తెలంగాణల ఉమ్మడి హైకోర్టులో 2,78, 695 కేసులు అపరిష్కృతంగా ఉండగా ఇందులో 24,606 కేసులుS పదేళ్లనాటివి. న్యాయమూర్తుల విషయానికొస్తే 61 మంది అవసరం కాగా కేవలం 25 మందితో నడుస్తోంది. పంజాబ్, హరియాణా, మధ్యప్రదేశ్, కర్ణాటక హైకోర్టుల్లో కూడా 2.5 లక్షలకు పైగా కేసులు పరిష్కారానికి నోచుకోకుండా ఉన్నాయి. గుజరాత్లో 52 మంది న్యాయమూర్తులకు 33 మందే ఉండగా... అపరిష్కృత కేసుల సంఖ్య 92,393గా ఉంది. చత్తీస్‌గఢ్ హైకోర్టులో 8 మంది న్యాయమూర్తులే దేశంలో చత్తీస్‌గఢ్ హైకోర్టులో అత్యంత తక్కువగా 37 శాతం మాత్రమే న్యాయమూర్తులున్నారు. ఈ హైకోర్టుకు 22 మంది అవసరం కాగా ప్రస్తుతం 8 మందే పనిచేస్తున్నారు. ఇక పెండింగ్ కేసులు మాత్రం 54 వేలకు పైనే ఉన్నాయి. అలహాబాద్ టాప్ అపరిష్కృత కేసులు, న్యాయమూర్తుల ఖాళీల్లో అలహాబాద్ హైకోర్టు ముందంజలో ఉంది. కేటాయించిన న్యాయమూర్తుల్లో సగం కంటే తక్కువ మందితో పనిచేయడంతో పాటు, దేశం మొత్తం పెండింగ్ కేసుల్లో నాలుగో వంతు ఈ హైకోర్టులోనే ఉండడం విశేషం. మొత్తం 9.24 లక్షల కేసులు అపరిష్కృతంగా ఉండగా... 3 లక్షలకు పైగా కేసులు 10 ఏళ్లకు ముందటివి. అలహాబాద్ హైకోర్టులో మొత్తం 160 మంది జడ్జీలు ఉండాల్సి ఉండగా 78 మందే ఉన్నారు. -
ధాన్యం కొనుగోలు కేంద్రాలు సక్రమంగా నిర్వహించాలి : జేసీ
కాకినాడ సిటీ : ధాన్యం కొనుగోలు కేంద్రాలను సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత కేంద్రాల ఇన్ చార్జిలదేనని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక అంబేడ్కర్‌భవన్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బందికి పౌరసరఫారాల సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహించారు. ఈసందర్భంగా జేసీ మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర చెల్లించడానికి కేంద్రాల ఇన్ చార్జిలు బాధ్యతతో పనిచేయాలన్నారు. కేంద్రాల్లో రిజిస్టర్లు నిర్వహించాలని చెప్పారు. ధాన్యం సాధరణ రకం 75కిలోలు రూ.1102.50పైసలు, వంద కిలోలు రూ.1470, గ్రేడ్–ఎ రకం 75కిలోలు రూ.1132.50పైసలు, వంద కిలోలు రూ.1510 మద్దతు ధరగా ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. జిల్లా వ్యాప్తంగా 251 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నటు తెలిపారు. ఈకార్యక్రమంలో ఆర్డీఓలు అంబేడ్కర్, సుబ్బారావు, గణేష్‌కుమార్, విశ్వేశ్వరరావు, పౌరసరఫరాల సంస్థ డీఎం కె.కృష్ణారావు, డీఎస్ఓ ఉమామహేశ్వరరావు, మార్కెటింగ్ శాఖ ఏడీ కేవీఆర్ఎన్ కిషోర్, డీసీఓ ప్రవీణ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురంలో పత్తి కొనుగోలు కేంద్రం కాకినాడ సిటీ: కాట¯ŒS కార్పొరేష¯ŒS ఆఫ్ ఇండియా(గుంటూరు) ఆధ్వర్యంలో పిఠాపురంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. కనీస మద్దతు ధర, ముందస్తు ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టరేట్లో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల రెండోవారంలో పిఠాపురంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నారని ఇందుకు మార్కెటింగ్‌శాఖ సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కనీస మద్దతు ధర రూ.4160 ఉందన్నారు. అలాగే ఏలేరు ఆధునికీకరణ, ఏడీబీ రోడ్, కెనాల్‌రోడ్ భూసేకరణ పనులపై ఆయా శాఖల అధికారులతో ఆయన కలెక్టరేట్లో సమీక్షించారు. రాజానగరం– సామర్లకోట ఏడీబీరోడ్డు భూసేకరణకు సర్వే పూర్తయిందని, వారం రోజుల్లో ప్రిలిమినరీ నోటిఫికేష¯ŒS జారీ చేయాలని పెద్దాపురం ఆర్డీఓను ఆదేశించారు. -
ప్రభుత్వాస్పత్రికి ఎన్టీపీసీ చేయూత
రూ.25 లక్షల వైద్య పరికరాల పంపిణీ ఆస్పత్రిని సందర్శించిన ఈడీ మహాపాత్ర కోల్‌సిటీ : గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి రామగుండం ఎన్టీపీసీ చేయూత అందిస్తోంది. ఎన్టీపీసీ ఈడీ ప్రశాంత్‌కుమార్ మహాపాత్ర శనివారం ప్రభుత్వాస్పత్రిని సందర్శించారు. ఐసీయూ, ఎస్ఎన్సీయూ విభాగాలను పరిశీలించిన ఈడీ ఆస్పత్రి అధికారులను అభినందించారు. ఎన్టీపీసీ, సీఎస్ఆర్ విభాగం ద్వారా రూ.25 లక్షలతో కొనుగోలు చేసిన రెండు ఐసీయూ వెంటిలేటర్లు, నాలుగు మల్టీప్యారా మీటరు, వైద్య పరికరాలను ఈడీ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ సూర్యశ్రీకి అందజేశారు. పేదలకు కార్పొరేట్ స్థాయి సేవలందాలనే ఉద్దేశంతో చేయూతను అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఎస్ఆర్ హెచ్ఆర్ ఏజీఎం ఎం.ఎస్.రమేష్‌తోపాటు రఫిక్ ఇస్తాం, రాంకిషన్, విఠల్‌కుమార్, ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
11న జాతీయ లోక్ అదాలత్
► జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుమలత కర్నూలు(లీగల్): జాతీయ లోక్ అదాలత్‌ను ఈనెల 11న శనివారం జిల్లా వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.సుమలత తెలిపారు. బుధవారం సాయంత్రం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు పెండింగ్ కేసుల పరిష్కారానికి నిర్వహించే లోక్ అదాలత్‌లో క్రిమినల్, సివిల్, ఇన్సూరెన్స్, బ్యాంకు కేసులు, ప్రీ లిటిగేషన్, కుటుంబ కేసులను పరిష్కరిస్తామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 38,490 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని.. ఇందులో 15,510 క్రిమినల్ కేసులు, 15 వేలకు పైబడి సివిల్ కేసులు ఉన్నట్లు చెప్పారు. లోక్ అదాలత్‌లో జరిగే కేసుల పరిష్కారానికి అప్పీళ్లు ఉండవని.. ఇరువురు కక్షిదారులు సామరస్యంగా తమ సమస్యను పరిష్కరించుకోవచ్చన్నారు. లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకుంటే సివిల్ కేసుల్లో కోర్టు ఫీజు వాపసు పొందవచ్చని, అలాగే చెక్కు బౌన్స్ కేసుల్లో రాజీ అయితే చెల్లించాల్సిన కోర్టు ఫీజు రాయితీ ఉంటుందన్నారు. కర్నూలులో ఏర్పాటు చేస్తున్న 3 బెంచ్‌లలో న్యాయాధికారులు వీవీ శేషుబాబు, ఎంఏ సోమశేఖర్, ఎం.బాబు వీలైనన్ని కేసుల పరిష్కరానికి కృషి చేస్తారన్నారు. విలేకరుల సమావేశంలో లోక్ అదాలత్ కార్యదర్శి ఎంఏ సోమశేఖర్ పాల్గొన్నారు. -
ఎకానమీపై పట్టు ఇలా..
సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షల్లో జనరల్ స్టడీస్‌లో ఎకానమీ కీలకాంశం. వివిధ సర్వీస్ కమిషన్లు నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షలో ఎకానమీకి సంబంధించి 15 నుంచి 20 ప్రశ్నలు కచ్చితంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎకానమీని ఎలా అధ్యయనం చేయాలో తెలుసుకుందాం.. వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి ఎకానమీలో భాగంగా కింది అంశాల అధ్యయనం ప్రిలిమినరీ పరీక్షతోపాటు మెయిన్సకు కూడా ఉపకరిస్తుంది. పెట్టుబడిదారీ, సామ్యవాద, మిశ్రమ ఆర్థిక వ్యవస్థలు. పంచవర్ష ప్రణాళికలు - సమ్మిళిత వృద్ధి - నీతి ఆయోగ్. భారత ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు. జాతీయాదాయం-వివిధ భావనలు-జాతీయాదాయం లో వివిధ రంగాల వాటా - జాతీయ, తలసరి ఆదాయం. బ్యాంకింగ్ రంగం - జాతీయీకరణ - కేంద్ర బ్యాంకు - పరిమాణాత్మక, గుణాత్మక పరపతి సాధనాలు. పేదరికం - నిరుద్యోగం - నిరుద్యోగ కొలమానాలు - శ్రామిక శక్తి - ద్రవ్యోల్బణం. స్వయం ఉపాధి, వేతన ఉపాధి కార్యక్రమాలు - సామాజిక భద్రతా పథకాలు. అంతర్జాతీయ వాణిజ్యం - ఎగుమతులు, దిగుమతులు - చెల్లింపుల శేషం - మూల్యహీనీకరణ - కరెంట్ అకౌంట్ లోటు - మూలధన ఖాతా. భారతదేశంలో పన్నుల వ్యవస్థ - బడ్జెటరీ విధానం - ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం - రెవెన్యూ, మూలధన ఖాతా - ఎఫ్.ఆర్.బి.ఎం. చట్టం. ఆర్థిక సంస్కరణలు - పారిశ్రామిక, బీమా, బ్యాంకింగ్, మూలధన మార్కెట్. ద్రవ్య విధానం, కోశ విధానం. వ్యవసాయ రంగం - హరిత విప్లవం - వ్యవసాయ పరపతి - మద్ధతు ధరలు. పారిశ్రామిక రంగం - ఎంఎస్ఎంఈ రంగం - పారిశ్రామిక పరపతి సంస్థలు - విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు - ప్రత్యేక ఆర్థిక మండళ్లు. సేవా రంగం - జాతీయాదాయంలో సేవా రంగం వాటా - పర్యాటక రంగం. ఐఎంఎఫ్ - ప్రపంచ బ్యాంకు - ఐడీఏ ప్రపంచ వాణిజ్య సంస్థ. మానవాభివృద్ధికి సంబంధించి యూఎన్డీపీ, వివిధ కొలమానాలు. ప్రణాళికలు - సమ్మిళిత వృద్ధి - నీతి ఆయోగ్ వివిధ పోటీ పరీక్షల ప్రిలిమినరీ ప్రశ్న పత్రాల్లో ప్రణాళికల లక్ష్యాలు, ప్రణాళికల్లో సాధించిన విజయాలు, సమ్మిళిత వృద్ధి సాధనకు వేటిపై దృష్టి సారించాలి అనే అంశాలకు సంబంధించిన ప్రశ్నలున్నాయి. ప్రణాళికా సంఘం, జాతీయ అభివృద్ధి మండలితోపాటు నీతి ఆయోగ్ ఏర్పాటు ఉద్దేశం, ప్రణాళికా యుగంలో ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రశ్నలు అడిగారు. ఆయా అంశాలకు సంబంధించి ఇచ్చిన ప్రశ్నలు ఈ విధంగా ఉన్నాయి. 1. పన్నెండో పంచవర్ష ప్రణాళిక ముఖ్య ఉద్దేశం? (2014 సివిల్స్) 1) సమ్మిళిత వృద్ధి, పేదరికం తగ్గింపు 2) సమ్మిళిత, సుస్థిర వృద్ధి 3) నిరుద్యోగం తగ్గింపునకు సుస్థిర, సమ్మిళిత వృద్ధి 4) వేగవంతమైన, సుస్థిర, అధిక సమ్మిళిత వృద్ధి 2. ఎనిమిదో పంచవర్ష ప్రణాళికను ఎప్పుడు మొదలు పెట్టారు? (2008, ఏపీపీఎస్సీ) 1) జనవరి 1, 1989 2) జనవరి 1, 1990 3) ఏప్రిల్ 1, 1992 4) ఏప్రిల్ 1, 1991 జాతీయాదాయం జాతీయాదాయానికి సంబంధించి స్వాతంత్య్రానికి పూర్వం, స్వాతంత్య్రానంతరం అంచనాలు, జాతీయాదాయ కమిటీ, కేంద్ర గణాంక సంస్థతోపాటు జాతీయాదాయ భావనలైన స్థూల జాతీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి, నికర జాతీయోత్పత్తి, నికర దేశీయోత్పత్తి, ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద నికర జాతీయోత్పత్తి, తలసరి ఆదాయం, జీడీపీ డిఫ్లేటర్ లాంటి అంశాలకు సంబంధించిన ప్రశ్నలు అనేక ప్రశ్న పత్రాల్లో కనిపిస్తాయి. గత రెండేళ్ల కాలంలో జాతీయ, తలసరి ఆదాయాల గణాంకాలను మార్కెట్, స్థిర ధరల వద్ద పరిశీలించాలి. జాతీయాదాయ లెక్కింపులో ఎదురయ్యే సమస్యలతోపాటు, జాతీయాదాయాన్ని లెక్కించేందుకు ఉపయోగించే ఉత్పత్తి, ఆదాయ, వ్యయ పద్ధతులకు సంబంధించి నోట్స్ రూపొందించుకోవాలి. గినీ సూచీ, లారేంజ్ నిష్పత్తి లాంటి పదాల పట్ల అవగాహన అవసరం. గత ప్రశ్న పత్రాల్లో ఆయా అంశాలపై వచ్చిన ప్రశ్నలు కింది విధంగా ఉన్నాయి. 1.భారతదేశంలో జాతీయాదాయాన్ని దేని సహాయంతో లెక్కిస్తారు? 2008, ఏపీపీఎస్సీ) 1) ఆదాయ పద్ధతి 2) ఉత్పత్తి పద్ధతి 3) వ్యయ పద్ధతి 4) అన్ని పద్ధతులు 2.జాతీయాదాయం? (ఎస్ఎస్సీ ఎఫ్‌సీఐ పరీక్ష, 2012) 1) నికర జాతీయోత్పత్తి - పరోక్ష పన్నులు + సబ్సిడీలు 2) స్థూల జాతీయోత్పత్తి - ప్రత్యక్ష పన్నులు 3) స్థూల దేశీయోత్పత్తి - దిగుమతులు 4) నికర దేశీయోత్పత్తి + ఉత్పత్తులు బ్యాంకింగ్ రంగం ఎకానమీకి సంబంధించి బ్యాంకింగ్ రంగాన్ని ప్రాధాన్యత కలిగిన అంశంగా పరిగణించాలి. పోటీ పరీక్షల్లో బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన పదకోశాలను అధికంగా ఇచ్చారు. లీడ్ బ్యాంక్ పథకం, ప్రాధాన్యతా రంగ రుణం, నిరర్థక ఆస్తులు, బ్యాంక్ రేటు, బహిరంగ మార్కెట్ చర్యలు, నగదు నిల్వల నిష్పత్తి, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, రెపోరేటు, రివర్స రెపోరేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ లాంటి పదాలపై విద్యార్థులకు ఉన్న అవగాహనను తెలుసుకునే ప్రశ్నలు, బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ప్రధానంగా ఉంటాయి. వీటితోపాటు నరసింహం కమిటీ, నాయక్ కమిటీ సిఫార్సులతో పాటు, జన్‌ధన్ యోజన, బ్రిక్స్బ్యాంక్, పేమెంట్స్ బ్యాంక్స్ లాంటి అంశాలకు సంబంధించి సమగ్ర నోట్స్ రూపొందించుకోవాలి. 1.రిజర్వబ్యాంక్ బ్యాంకు రేటు తగ్గింపు దేనికి దారి తీస్తుంది? (2011, సివిల్స్) 1) మార్కెట్లో అధిక ద్రవ్యత్వం 2) మార్కెట్లో తక్కువ ద్రవ్యత్వం 3) మార్కెట్ ద్రవ్యత్వంలో మార్పు ఉండదు 4) వాణిజ్య బ్యాంకులు అధిక డిపాజిట్లు సమీకరించుకోవడానికి అవకాశం డిగ్రీ స్థాయిలో ఎకానమీ అభ్యసించని విద్యార్థులు మొదటగా భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు, ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలపై అవగాహన ఏర్పర్చు కోవాలి. సిలబస్‌ను దృష్టిలో ఉంచుకొని వివిధ పద కోశాలను అవగాహన చేసుకోవాలి. దీనివల్ల వివిధ అంశాల అధ్యయనం సులువవుతుంది. జాతీయాదాయం, పేదరికం, నిరుద్యోగం, బడ్జెట్‌లాంటి అంశాలను అధ్యయనం చేసే క్రమంలో తాజా గణాంకాలపై దృష్టి సారించాలి. -
రేషన్ బియ్యం పట్టివేత
మల్లాపూర్: మల్లాపూర్ మండలం సాతారం, చిట్టాపూర్ శివార్లలో గురువారం ఉదయం రేషన్ దుకాణాల నుంచి అక్రమంగా తరలిస్తున్న బియ్యం, గోధుమలు, కిరోసిన్‌ను ఎస్సై షేక్ జానీపాషా నేతృత్వంలో పోలీసు సిబ్బంది దాడులు చేసి పట్టుకున్నారు. రాయికల్ మండలం ఇటీక్యాలకు చెందిన డీలర్ నారాయణ దుకాణం నుంచి మెట్‌పల్లికి చెందిన లింబాద్రి నాలుగు క్వింటాళ్ల బియ్యం, 16 క్వింటాళ్ల గోధుమలు కొనుగోలు చేసి తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మరో ఘటనలో గొర్రెపల్లి నుంచి మెట్‌పల్లికి చెందిన శేఖర్ అనేవ్యక్తి 200 లీటర్ల కిరోసిన్ తరలిస్తుండగా చిట్టాపూర్ శివారులో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆరుగురిపై కేసు నమోదు చేశామని, సరకులతో పాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నామని ఎస్సై తెలిపారు. కిరోసిన్ ట్యాంకర్ సీజ్ జగిత్యాల అర్బన్: అదనంగా కిరోసిన్‌ను తరలించిన పౌరసరఫరాల శాఖ ట్యాంకర్‌ను అధికారులు సీజ్‌చేశారు. గురువారం పట్టణంలోని వేంకటేశ్వర ఆటో సర్వీస్ హోల్‌సేల్ కిరోసిన్ డీలర్ దుకాణం వద్దకు కిరోసిన్ పోసేందుకు వచ్చిన ట్యాంకర్లో ఉండాల్సిన 10,048 లీటర్ల కన్నా 3,591 లీటర్లు అదనంగా ఉండడంతో దాడిచేసి అధికారులు ట్యాంకర్‌తోపాటు కిరోసిన్‌ను సీజ్ చేశారు. దాడుల్లో ఏజీపీవో కాశీవిశ్వనాథం, డిప్యూటీ తహశీల్దార్ అంజయ్య, కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. రెండు రేషన్ దుకాణాలపై 6ఏ కేసు బోయినపల్లి: మండలంలోని అనంతపెల్లి, బూర్గుపెల్లి గ్రామాల్లో రేషన్ దుకాణాల నిర్వాహకులపై 6ఏ కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ డివిజన్ ఏఎస్వో కె. శ్రీనివాస్ గురువారం తెలిపారు. సివిల్ సప్లై అధికారులు రేషన్ దుకాణాల్లో జరిపిన తనిఖీల్లో నిర్వాహకులు సుమారు వంద లీటర్ల కిరోసిన్ తక్కువగా తీసుకుని ట్యాంకర్ వారికే అమ్మినట్లు తేలడంతో కేసులు నమోదు చేశామన్నారు. -
బాలికల పాఠశాలను సందర్శించిన సివిల్ జడ్జి
-
అసాధ్యం కాదు..
సివిల్స్ సాధించడం అనేది అందరికి సాధ్యమయ్యే అంశమే. దీనికి ముందుగా పరీక్ష విధానంపై తగిన అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరం. విద్యార్థులు తాము అభ్యసించిన అంశాలను షార్ట్స్ నోట్స్‌గా రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. తద్వారా తమ నైపుణ్యాలు, సంగ్రహణ శక్తి పెరుగుతాయి. గ్రామీణ యువతకు మార్గదర్శకత్వం అవసరం గ్రామీణ యువతలో సైతం సివిల్స్‌ను సాధించే సత్తా ఉంది. వీరికి తగిన మార్గదర్శకం అందించాల్సిన అవసరం ఉంది. నిత్యం అంశాలను అభ్యసించే సమయంలో రోజులో ఎన్ని గంటలకు చదివామనే విషయం కంటే సంబంధిత అంశాన్ని ఎంత క్షుణ్ణంగా, లోతుగా తెలుసుకోగలిగామనేది ప్రధానం. ప్రణాళికాబద్ధంగా చదవాలి కాలం వృథా కాకుండా ప్రణాళికా బద్ధంగా విభజించుకుంటూ సాధన సాగించాల్సి ఉంటుంది. మనకు సాంకేతికత సహకారంతో అందుబాటులో ఉన్న అనంత సమాచారాన్నుంచి, అవసరమైన విషయాలను సేకరించుకోవాల్సి ఉంటుంది. ఎంత ఎక్కువ సేపు చదివామనే విషయం కంటే ప్రతి అంశంలో ఎంత పట్టు సాధించామన్నదే ముఖ్యం. గ్రామీణ విద్యార్థుల్లో ఉండే భయాన్ని పారద్రోలితే వీరు సులభంగా విజయం సాధిస్తారు. నిజాయతీకి నిజమైన పరీక్ష ఇంటర్వ్యూలో మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవడం, ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథంతో పనిచేయడం ఎంతో అవసరం. స్పష్టమైన సమాధానాలను ఇవ్వడంతో పాటు, ఒత్తిడిని దరి చేరనివ్వకుండా సమాధానాలు ఇవ్వడం ప్రధానం. ఒక విధంగా చెప్పాలంటే ఇది మన నిజాయితీకి నిజమైన పరీక్షగా నిలుస్తుంది. - రెడ్డి వేదిత, సివిల్స్ 71వ ర్యాంకర్