కాకతీయ యూనివర్సిటీ అర్థశాస్త్ర ఆచార్యులు మంద అశోక్ కుమార్ కూతురు మంద అపూర్వ సివిల్స్ ఫలితాలలో 646 ర్యాంకు సాధించారు. మంద అపూర్వ ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం ఎంటెక్ చేస్తున్నారు. హనుమకొండ ఎక్సైజ్ కాలనీలో నివసిస్తున్న అపూర్వ తల్లి మంద రజనీ దేవి ప్రభుత్వ టీచర్ గా భీమదేవరపల్లి మండలం మాణిక్య పూర్లో పనిచేస్తున్నారు.
మందా అపూర్వకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు పెద్దన్నయ్య అరుణ్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా, చిన్న అన్నయ్య అభినవ్ పూణేలో ఫార్మసీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇక, మంద అపూర్వ సివిల్స్‌లో ర్యాంక్ సాధించడంపై పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment