ranks
-
నా పనితీరునూ మెరుగుపర్చుకోవాలి
సాక్షి, అమరావతి: మంత్రుల్లో ఎవరు ఏ స్థానంలో ఉన్నారో చెప్పడానికి వారికి ర్యాంకులు ఇచ్చినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరణ ఇచ్చారు. ఈ ర్యాంకులతో ప్రభుత్వ వైఫల్యాలు బయటపడడంతో స్పందించినట్లు తెలుస్తోంది. ఎవరినీ ఎక్కువ చేయడానికి, ఎవరినీ తక్కువ చేయడానికి ఈ ర్యాంకులు ఇవ్వలేదని శుక్రవారం ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. తమతో తాము పోటీ పడటంతో పాటు, ఒకరితో ఒకరు పోటీ పడి పనిచేయడానికి, పాలనలో వేగం పెంచేందుకే ఈ ప్రయత్నం చేసినట్లు తెలిపారు. ద్రస్తాల పరిష్కారంలో విడుదల చేసిన ర్యాంకులు ఎవరినీ ఎక్కువ చేయడానికి కాదన్నారు. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో తాను కూడా తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవాల్సి ఉందన్నారు. ‘పీపుల్ ఫస్ట్’ విధానంతో తాను, తన కేబినెట్ సహచర మంత్రులు పనిచేస్తున్నారని తెలిపారు. గ్రామ స్థాయిలో చిరు ఉద్యోగి నుంచి సీఎం వరకు అంతా కష్టపడి సమష్టిగా పనిచేస్తేనే ప్రజల సమస్యలు, కష్టాలు తీర్చగలుగుతామని, సమస్యల సుడిగుండంలో ఉన్న రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టగలుగుతామని పేర్కొన్నారు. ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొని సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. -
హీరోల్లో రెబల్ స్టార్ టాప్.. హీరోయిన్లలో ఎవరంటే?
ప్రముఖ ఆర్మాక్స్ మీడియా ప్రతినెల సినీ స్టార్లకు సంబంధించిన ర్యాంకులను ప్రకటిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో ఉన్న స్టార్ల జాబితాను వెల్లడిస్తుంది. అంతేకాకుండా మోస్ట్ అవైటేడ్ చిత్రాల వివరాలు కూడా ప్రకటిస్తుంది. తాజాగా డిసెంబర్ నెలకు సంబంధించిన వివరాలను ట్విటర్ వేదికగా పోస్ట్ చేసింది. డిసెంబర్-2024లో ఇండియాలో అత్యంత ఆదరణ ఉన్న హీరో, హీరోయిన్లు జాబితాను వెల్లడించింది.హీరోల్లో మొదటి ప్లేస్‌లో రెబల్ స్టార్..హీరోల విషయానికొస్తే దేశవ్యాప్తంగా అత్యంత ఆదరణ ఉన్న స్టార్స్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ నిలిచారు. ఆ తర్వాత రెండో స్థానంలో పుష్పరాజ్ అల్లు అర్జున్ చోటు దక్కించుకున్నారు. వీరిద్దరి తర్వాత మూడో ప్లేస్‌లో దళపతి విజయ్ ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్, జూనియర్ ఎన్టీఆర్, అజిత్ కుమార్, మహేశ్ బాబు, రామ్ చరణ్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ టాప్-10 లిస్ట్‌లో ఛాన్స్ కొట్టేశారు.హీరోయిన్లలో సమంత టాప్..హీరోయిన్ల విషయానికొస్తే సమంత టాప్ ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాత బాలీవుడ్ భామలు ఆలియా భట్, దీపికా పదుకొణె వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఆ తర్వాత వరుసగా పుష్ప భామ రష్మిక మందన్నా, తండేల్ హీరోయిన్ సాయి పల్లవి, త్రిష, నయనతార, కాజల్ అగర్వాల్, శ్రీలీల, శ్రద్ధాకపూర్ ఉన్నారు. ఈ జాబితాలను హీరో, హీరోయిన్ల క్రేజ్, ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఆధారంగానే వెల్లడించినట్లు తెలుస్తోంది. Ormax Stars India Loves: Most popular female film stars in India (Dec 2024) #OrmaxSIL pic.twitter.com/cRd7Jb4WsI— Ormax Media (@OrmaxMedia) January 19, 2025 Ormax Stars India Loves: Most popular male film stars in India (Dec 2024) #OrmaxSIL pic.twitter.com/Tniww2cO7Z— Ormax Media (@OrmaxMedia) January 19, 2025 -
సమంతను దాటేసిన శోభిత ధూళిపాళ్ల.. టాప్ ర్యాంక్‌లో ఎవరంటే?
ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ ఈ ఏడాది సినీతారల ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. 2024లో మోస్ట్ పాపులర్ నటీనటుల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో ఊహించని విధంగా యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ టాప్ ప్లేస్ దక్కించుకుంది. సందీప్ రెడ్డి వంగా తర్వాత వరుసగా బాడ్ న్యూజ్, విక్కీ విద్యా కా వో వాలా వీడియో, భూల్ భూలయ్యా -3 సినిమాల్లో నటించింది. దీంతో దీపికా పదుకొణె, షారూఖ్ ఖాన్ లాంటి స్టార్స్‌ను అధిగమించింది.ఈ లిస్ట్‌లో టాలీవుడ్ నుంచి ప్రభాస్, సమంత, శోభిత ధూళిపాళ్ల మాత్రమే చోటు దక్కించుకున్నారు. శోభిత టాప్-5లో నిలవగా.. సమంత 8, ప్రభాస్ పదోస్థానంలో నిలిచారు. ఈ ఏడాది కల్కి మూవీతో అలరించిన దీపికా పదుకొణె రెండో స్థానంతో సరిపెట్టుకుంది. టాప్ ప్లేస్ దక్కడం పట్ల త్రిప్తిడ డిమ్రీ ఆనందం వ్యక్తం చేసింది. ఇది నాకు దక్కిన గొప్ప గౌరవమని.. నా అభిమానుల మద్దతు వల్లే ఇది సాధ్యమైందని తెలిపింది.కాగా.. ఏడాది నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ది పర్ఫెక్ట్ కపుల్లో నటించిన ఇషాన్ ఖట్టర్ ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నారు. మరోవైపు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అక్కినేని వారి కోడలు శోభిత ధూళిపాళ్ల ఐదోస్థానంలో నిలిచింది. ఈ ఏడాది మంకీ మ్యాన్ మూవీతో శోభిత అలరించారు. ఆ తర్వాత వరుసగా శార్వరి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, సమంత, అలియా భట్, ప్రభాస్ నిలిచారు. అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ స్టార్స్- ఐఎండీబీ -2024ట్రిప్తి డిమ్రీదీపికా పదుకొణెఇషాన్ ఖట్టర్షారుఖ్ ఖాన్శోభితా ధూళిపాళ్లశార్వరిఐశ్వర్యరాయ్ బచ్చన్సమంతఅలియా భట్ప్రభాస్ -
హీరోల్లో రెబల్ స్టార్ టాప్ ప్లేస్.. హీరోయిన్లలో ఎవరంటే?
ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సంస్థ ప్రతినెల సినీస్టార్స్‌కు సంబంధించిన రేటింగ్స్ ఇస్తోంది. ఎప్పటిలాగే అక్టోబర్ నెలకు సంబంధించిన మోస్ట్ పాపులర్ హీరో, హీరోయిన్ల జాబితాను వెల్లడించింది. హీరోల్లో తొలిస్థానంలో రెబల్ స్టార్ నిలవగా.. నటీమణుల్లో సమంత టాప్ ప్లేస్ దక్కించుకుంది. హీరో, హీరోయిన్లకు సంబంధించి టాప్-10 ర్యాంకులను వెల్లడిస్తూ పోస్టర్స్‌ను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.హీరోల్లో ప్రభాస్ తర్వాత విజయ్, షారూఖ్ ఖాన్, జూనియర్ ఎన్టీఆర్, అజిత్ కుమార్ తొలి ఐదు స్థానాల్లో నిలిచారు. ఆ తర్వాత వరసగా అల్లు అర్జున్, మహేశ్ బాబు, సూర్య, రామ్ చరణ్, సల్మాన్ ఖాన్ చోటు దక్కించుకున్నారు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే ఇటీవల హన్నీ బన్నీ ప్రేక్షకులను అలరించిన సమంత టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఆ తర్వాత ఆలియా భట్, నయనతార, దీపికా పదుకొణె, త్రిష టాప్ ఫైవ్‌లో చోటు దక్కించుకున్నారు. కాజల్ అగర్వాల్, శ్రద్దాకపూర్, సాయిపల్లవి, రష్మిక, కత్రినా కైఫ్ టాప్ టెన్‌లో నిలిచారు.Ormax Stars India Loves: Most popular female film stars in India (Oct 2024) #OrmaxSIL pic.twitter.com/aa6SKu5kZB— Ormax Media (@OrmaxMedia) November 21, 2024Ormax Stars India Loves: Most popular male film stars in India (Oct 2024) #OrmaxSIL pic.twitter.com/t1qOxTGkKo— Ormax Media (@OrmaxMedia) November 21, 2024 -
దేశంలో ‘ఐఐఎస్సీ’ టాప్
సాక్షి, అమరావతి : దేశంలో అగ్రశ్రేణి వర్సిటీగా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) మరోసారి తన స్థానాన్ని నిలబెట్టుకుంది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ తాజా వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకుల ఓవరాలవిభాగంలో 251–300 మధ్య కొనసాగుతోంది. అయితే, గతేడాదితో 201–250 బాండ్ నుంచి స్వల్పంగా పడిపోయింది. ఫలితంగా వరల్డ్ టాప్–250లోకి ప్రవేశించలేకపోయింది. ఈ క్రమంలో 53.7–55.7 స్కోరు సాధించింది. పరిశోధన, ఇంటెన్సివ్ వర్సిటీలను ఐదు ప్రధాన అంశాల ఆధారంగా టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రపంచ ర్యాంకులు కేటాయిస్తోంది. వీటిల్లో బోధన, పరిశోధన వాతావరణం, పరిశోధన నాణ్యత, అంతర్జాతీయ అవుట్‌లుక్, ఇండస్ట్రీ ఆదాయం వంటి అంశాలను పరిశీలిస్తుంది. ఈ ఏడాది 115 దేశాలకు చెందిన 2,092 ఉత్తమ విద్యా సంస్థలకు ర్యాంకులను విడుదల చేసింది. గతేడాదితో పోలిస్తే 185 కొత్త ఎంట్రీలు వచి్చనట్లు పేర్కొంది. ఈ ఏడాది ర్యాంకుల్లో భారతీయ వర్సిటీలు కేవలం మిశ్రమ ఫలితాలు మాత్రమే చూశాయి. బెనారస్ హిందూ వర్సిటీ, భారతియార్ వర్సిటీ, ఐఐటీ గౌహతి వంటివి 2025లో భారతీయ టాప్–10 జాబితా నుంచి చోటుకోల్పోయాయి. ప్రపంచ వేదికపై బలమైన పోటీదారులు ఉండటంతోనే భారతీయ వర్సిటీలు కొంత వెనుకబడినట్లు విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. ఐఐటీల్లో కేవలం ఇండోర్ ఐఐటీ మాత్రమే మెరుగైన ప్రదర్శన కనబరిచింది. భారతీయ వర్సిటీల పురోగతి.. అన్నా వర్సిటీ, మహాత్మా గాంధీ వర్సిటీ, సవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్, శూలినీ వర్సిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ ర్యాంకులను మెరుగుపర్చుకుని 401–500 బాండ్లోకి చేరుకున్నాయి. ఈ సంస్థల్లో ప్రతి ఒక్కటి 46–49.2 మధ్య స్కోర్‌ను సాధించాయి. అయినప్పటికీ కొన్ని వర్సిటీలు వెనుకబడ్డాయి. ఇక్కడ జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ ర్యాంకు గతేడాదితో పోలిస్తే తగ్గింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–ఇండోర్, యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ (యూపీఈఎస్)తో కలిసి 501–600 ర్యాంకును పంచుకుంది. ఈ రెండు సంస్థలు గణనీయమైన పురోగతి ప్రదర్శించడం విశేషం. 601–800 బెల్ట్‌లో 14 భారతీయ విద్యా సంస్థలు నిలిచాయి. వీటిల్లో అలీఘర్ ముస్లిం వర్సిటీ, అమిటీ వర్సిటీ, బెనారస్ హిందూ వర్సిటీ, బిట్స్ పిలానీ, చిత్కారా వర్సిటీ, ఐఐటీ పాటా్న, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండ్రస్టియల్ టెక్నాలజీ (కేఐఐటీ), లవ్లీ ప్రొఫెషనల్ వర్సిటీ, పంజాబ్ వర్సిటీ, సింబయాసిస్ ఇంటర్నేషనల్ వర్సిటీ, థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, విట్ వర్సిటీ (తమిళనాడు) స్థానం దక్కించుకున్నాయి.జేఎన్టీయూ అనంతపురం.. ఎస్వీయూలకు చోటు.. ఇక 801–1000 మధ్య 22 భారతీయ విద్యా సంస్థలు ఉండగా.. మన రాష్ట్రం నుంచి జేఎన్టీయూ అనంతపురం, కేఎల్‌యూ (34.5–38.1)లకు మాత్రమే చోటుదక్కింది. అలాగే, 1,201–1,500 మధ్య 23 సంస్థలు ఉండగా.. తిరుపతి శ్రీ వేంకటేశ్వర వర్సిటీ–ఎస్వీయూ (25.2–30.6)తో పాటు తెలంగాణకు చెందిన ఉస్మానియా, ఎన్ఐటీ–నిట్ (25.2–30.6) ఉంది. 1,501 ప్లస్ విభాగంలో.. ఆచార్య నాగార్జున వర్సిటీ, గీతం, జీఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విజ్ఞాన్ (10.5–25.1) నిలిచాయి. ఇటీవల విద్యార్థుల ఆత్మహత్యలతో సంచలనం సృష్టించిన ఐఐటీ గౌహతి 801–1000 బెల్డ్కు దిగజారింది.అగ్రస్థానంలో ఆక్స్ఫర్డ్.. మరోవైపు.. ప్రపంచ అత్యుత్తమ వర్సిటీగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం వరుసగా తొమ్మిదో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)ని ఆరో స్థానానికి నెడుతూ స్టాన్ఫోర్డ్ వర్సిటీ రెండో స్థానానికి చేరుకుంది. ఈ ఏడాది బ్రెజిల్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విద్యా సంస్థలు టాప్–200లో చోటు దక్కించుకోవడం విశేషం. కానీ, ఆ్రస్టేలియాలోని టాప్–5 విశ్వవిద్యాలయాలు ర్యాంకింగ్స్‌లో పడిపోయాయి. చైనా విశ్వవిద్యాలయాలు అద్భుత ప్రదర్శనతో టాప్–10కి చేరువలోకి రావడం విశేషం. యూఎస్, యూకే ఉన్నత విద్యా రంగాల ప్రతిష్ట క్షీణిస్తున్నట్లు టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో సహజ, రష్మిక
సాక్షి, హైదరాబాద్: మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో భారత రైజింగ్ స్టార్స్, తెలంగాణ క్రీడాకారిణులు సహజ యామలపల్లి, భమిడిపాటి శ్రీవల్లి రష్మిక కెరీర్ బెస్ట్ర్యాంక్లను అందుకున్నారు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో 23 ఏళ్ల సహజ మూడు స్థానాలు ఎగబాకి 295వ స్థానంలో... 22 ఏళ్ల రషి్మక 22 స్థానాలు పురోగతి సాధించి 318వ స్థానంలో నిలిచారు. సహజ భారత నంబర్‌వన్‌గా కొనసాగుతుండగా... రషి్మక భారత మూడో ర్యాంకర్‌గా ఉంది. ఈ ఏడాది సహజ అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) సర్క్యూట్లో నిలకడగా రాణిస్తోంది. మొత్తం 23 టోర్నీల్లో పోటీపడింది. 29 మ్యాచ్‌ల్లో విజయం సాధించి, 22 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. లాస్ఏంజె లిస్లో జరిగిన ఐటీఎఫ్ డబ్ల్యూ15 టోర్నీలో సహజ సింగిల్స్ విభాగంలో టైటిల్ సాధించింది. మరోవైపు రష్మిక కూడా ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. 21 టోర్నీల్లో పాల్గొన్న రషి్మక 25 మ్యాచ్‌ల్లో గెలిచి, 21 మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. ఇండోర్‌లో జరిగిన ఐటీఎఫ్ డబ్ల్యూ35 టోర్నీలో సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. -
టాపర్ల ఎంపిక.. ఐఐటీ బాంబే..
సాక్షి, అమరావతి: జేఈఈ అడ్వాన్స్డ్ టాపర్లకు ఐఐటీ బాంబే (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–బాంబే)అగ్రగామి ఎంపికగా కొనసాగుతోంది. ఈ ఏడాది టాప్–10 జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకులు సాధించిన విద్యార్థులంతా ఐఐటీ–బాంబేలోనే ప్రవేశాలు పొందారు. మొదటి 25 ర్యాంకుల్లో 24 మంది, 50 ర్యాంకుల్లో 47 మంది, 1000లోపు ర్యాంకుల్లో 246 మంది ఐఐటీ–బాంబే నుంచే ఇంజనీర్లుగా ఎదిగేందుకు ప్రణాళిక వేసుకున్నట్టు తెలుస్తోంది. ఇంజనీరింగ్ విద్య, పరిశోధన రంగంలో అగ్రగామిగా ఐఐటీ బాంబే ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. అందుకే.. 2018లో కేంద్ర ప్రభుత్వం దీనికి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ హోదాను మంజూరు చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా జాతీయ సాంకేతిక విద్యను విస్తరించడంలో భాగంగా ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీలతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ పరీక్షలు నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఐఐటీ మద్రాస్ ‘జేఈఈ అడ్వాన్స్డ్–2024’ నివేదికను విడుదల చేసింది. అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహణ, జోసా కౌన్సెలింగ్‌లో కీలకంగా వ్యవహరించిన (జేఈఈ అడ్వాన్స్డ్ ఆర్గనైజింగ్ చైర్పర్సన్–2) ఆచార్య అన్నాబత్తుల రత్నకుమార్ ఏపీకి చెందిన వ్యక్తి కావడం విశేషం. 2024–25 విద్యా సంవత్సరానికి 2.50 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించగా.. 1.80 లక్షల మంది పరీక్షలు రాశారు. ఇందులో 17,695 మంది 23 ఐఐటీల్లో సీట్లు సాధించారు. వీరిలో భారతీయ పౌరసత్వ మూలాలున్న 88 మంది, ఇద్దరు విదేశీ విద్యార్థులు కూడా ఉన్నారు. బాంబే తర్వాత ఢిల్లీనే.. దేశంలోని 23 ఐఐటీల్లో ఐఐటీ బాంబే తర్వాత టాప్ ర్యాంకర్ల ఫేవరెట్ ఎంపికగా ఐఐటీ–ఢిల్లీ మారింది. ఇందులో టాప్–50 ర్యాంకర్లలో ఇద్దరు, టాప్–100లో 23 మంది, టాప్–200లో 50 మంది, టాప్–500లో 109, టాప్–1000లో 204 మంది ప్రవేశాలు పొందారు. ఆ తర్వాత తొలి వెయ్యి ర్యాంకుల్లో ఐఐటీ మద్రాస్‌లో 128 మంది, ఐఐటీ కాన్పూర్‌లో 117 మంది, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 82 మంది, ఐఐటీ గౌహతిలో 69 మంది, ఐఐటీ రూరీ్కలో 55 మంది, ఐఐటీ హైదరాబాద్‌లో 41 మంది, ఐఐటీ వారణాసిలో 23 మంది, ఐఐటీ ఇండోర్‌లో ఐదుగురు, ఐఐటీ గాం«దీనగర్‌లో ఒకరు ప్రవేశాలు పొందారు. మహిళా విద్యార్థులప్రవేశాలు ఇలా.. గడచిన నాలుగేళ్లతో పోలిస్తే ఐఐటీల్లో సీట్ల సంఖ్య క్రమేపీ పెరుగుతూ వస్తోంది. 2024–25 ప్రవేశాల్లో 23 ఐఐటీల్లో సూపర్ న్యూమరరీ సీట్లు 3,566 ఉండగా.. మొత్తం సీట్లు 17,760కు చేరాయి. వీటిలో 17,695 సీట్లు భర్తీ చేశారు. వీటిలో సుమారు 80 శాతం ప్రవేశాలు పురుషులే పొందుతున్నారు. ఏటా ఐఐటీల్లో ప్రవేశాలు పొందుతున్న మహిళలు మాత్రం కేవలం 3 వేల వరకు మాత్రమే ఉంటున్నారు. గడచిన ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం 73 మంది మాత్రమే అధికంగా ప్రవేశాలు తీసుకున్నారు. ఐఐటీలో అత్యధికంగా ఖరగ్‌పూర్‌లో 363, వారణాసిలో 301, బాంబేలో 278, రూర్కీలో 275, ఢిల్లీలో 246, కాన్పూర్‌లో 248, మద్రాస్‌లో 231 మందితో పాటు హైదరాబాద్‌లో 120, తిరుపతిలో 50 మంది మహిళలు ప్రవేశాలు పొందారు. తెలియకుంటే.. మిన్నకుంటే మేలు! జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో విద్యార్థులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తాము కలలుకన్న ఐఐటీల్లో సీట్లు సాధించేందుకు ప్రతి మార్కును లెక్కించుకుంటున్నారు. ఈ క్రమంలోనే మైనస్ మార్కులు ఉండటంతో తెలియని ప్రశ్నల జోలికి వెళ్లడం లేదు. ఇలా పేపర్–1 గణితంలో 7వ ప్రశ్నను 80.31 శాతం మంది విడిచిపెట్టేశారు. ఇలా ప్రశ్నలు1, 3, 4, 5, 14, 17కు సుమారు 60 శాతానికిపైగా విద్యార్థులు సమాధానాలు రాయలేదు. ఫిజిక్స్‌లో 7వ ప్రశ్నకు అత్యధికంగా 82.32 శాతం మంది సమాధానం ఇవ్వలేదు. ఇలా 2, 3, 6, 16 ప్రశ్నలు 60 శాతానికిపైగా దూరంగా ఉన్నారు. కెమిస్ట్రీలో చాలావరకు జవాబు రాయడానికి ప్రయత్ని0చినట్టు తెలుస్తోంది. ఇలానే పేపర్–2లో గణితంలో 5వ ప్రశ్నకు అత్యధికంగా 71.11 శాతం మంది, ఫిజిక్స్‌లో 7వ ప్రశ్నకు 72.27 శాతం మంది జవాబు రాయలేదు. మొత్తంగా చూస్తే రెండు పేపర్లలో ఏ ఒక్క ప్రశ్నకు కూడా నూరు శాతం మంది జవాబు పెట్టకపోవడం గమనార్హం. -
ఏ కాలేజీలో ఏ ర్యాంకు వరకు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వైద్య విద్య కళాశాలల్లో 2023–24 సంవత్సరంలో సీట్లు దక్కించుకున్న కటాఫ్ ర్యాంకు వివరాలను కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (కేఎన్ఆర్యూహెచ్ఎస్) ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 54 మెడికల్ కాలేజీలుండగా... ఇందులో 8,715 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లోని సీట్లన్నీ ఆల్ ఇండియా కోటాలో 15 శాతం, మిగిలిన సీట్లు కన్వినర్ కోటాలో భర్తీ చేస్తుండగా... ప్రైవేటు కాలేజీల్లోని సీట్లలో 50 శాతం కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. మిగిలిన సీట్లలో బీ కేటగిరీ సీట్లు పోను ఎన్ఆర్ఐ, మేనేజ్మెంట్ కేటగిరీల్లో యాజమాన్యాలకు భర్తీ అవకాశాన్ని కల్పిస్తారు. 2023–24 విద్యా సంవత్సరంలో మాప్‌అప్ కౌన్సెలింగ్ ముగిసే నాటికి కాలేజీల వారీగా, కేటగిరీ వారీగా సీటు దక్కించుకున్న చివరి ర్యాంకు వివరాలతో కూడిన జాబితాను కేఎన్ఆర్యూహెచ్ఎస్ శనివారం విడుదల చేసింది. ఈ జాబితాను వర్సిటీ వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చింది. కేఎన్ఆర్ యూహెచ్ఎస్ విడుదల చేసిన చివరి ర్యాంకుల జాబితా కేవలం 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కౌన్సెలింగ్‌లోనివి మాత్రమే. రాష్ట్రంలో కొత్తగా 8 వైద్య కళాశాలలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కొత్తగా 4 వందల సీట్లు పెరిగే అవకాశం ఉంది. దీంతో గతేడాది కంటే ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి కూడా సీట్లు దక్కే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. స్థానికతపై తెగని పంచాయితీ... యూజీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ దేశవ్యాప్తంగా ప్రారంభమైనప్పటికీ రాష్ట్రంలో మాత్రం ఇప్పటికీ జాడలేదు. ఆల్ ఇండియా కోటా సీట్ల కౌన్సెలింగ్ ప్రక్రియ ఇప్పటికే తొలిరౌండ్ పూర్తి కాగా... రెండో రౌండ్ దరఖాస్తు, ఆప్షన్ల నమోదు ప్రక్రియ సైతం ముగిసింది. నేడో, రేపో రెండోరౌండ్ సీట్ల కేటాయింపు సైతం పూర్తి కానుంది. సాధారణంగా ఆలిండియా కోటా సీట్ల భర్తీ తొలి రౌండ్ పూర్తయిన వెంటనే రాష్ట్ర స్థాయిలో మొదటి రౌండ్ సీట్ల కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలయ్యేది.కానీ రాష్ట్రంలో విద్యార్థుల స్థానికత ఖరారుపై నెలకొన్న వివాదంతో కౌన్సెలింగ్ ప్రక్రియ చిక్కుల్లో పడింది. ఇప్పటికే హైకోర్టు తీర్పు వెల్లడించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్న విద్యార్థులు రాష్ట్రస్థాయిలో మంచి కాలేజీలో సీటు కోసం ఎదురు చూస్తున్నారు. కానీ రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్ ప్రారంభం కాకపోవడంతో ఎలాంటి కాలేజీలో సీటు వస్తుంది? ఎక్కడ చేరితే మేలు? అనే అంశంపై విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఈసారి 77,848 మంది నీట్ యూజీ పరీక్షకు హాజరు కాగా... 47,356 మంది అర్హత సాధించారు. పరీక్ష రాసిన వారిలో అత్యధికులు అర్హత సాధించడం ఇదే తొలిసారి. ఏపీకి 10 శాతం కోటా సీట్ల కేటాయింపును రద్దు చేయడంతో రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లలో నేషనల్ కోటా మినహా మిగిలిన కన్వీనర్ కోటా సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే దక్కనున్నాయి. -
NIRF: ఈ విధానం లోపభూయిష్టం..
2024 సంవత్సరానికిగాను దేశీయ విద్యా సంస్థలకు అందించే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులు విడుదలయ్యాయో లేదో, వాటి ఆధారంగా సామాజిక మాధ్యమాల్లో ప్రైవేటు విద్యాసంస్థల ప్రచార హోరు ఆకాశాన్ని తాకుతోంది. ఈ ర్యాంకులను ఒకసారి పరిశీలిస్తే, 2024లో మొదటి 100 ర్యాంకులు పొందిన విద్యా సంస్థలు 7 రాష్ట్రాల్లోనే విస్తరించి ఉన్నాయి. ఆ రాష్ట్రాలు తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్, పశ్చిమ బెంగాల్‌లు. టాప్ 30 ర్యాంక్‌లు పొందిన విద్యా సంస్థలలో 8 డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీలు, 10 ఐఐటీలు ఉన్నాయి.ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులు నిర్ణయించే ముఖ్యమైన పారామితులు తప్పుగా రూపొందించబడ్డాయి అనిపిస్తోందనీ, ర్యాంకింగ్‌ని నిర్ణయించడానికి వీటిని మరింత తెలివిగా సమీక్షించడం, నిర్వచించడం చాలా ముఖ్యమని విద్యావేత్త్తలు అభిప్రాయ పడుతున్నారు. విద్యాసంస్థలను మూల్యాంకనం చేయడానికి 16 పారామితులను పరిగణనలోకి తీసుకున్నారు. వీటిలో కొన్ని అసంబద్ధంగా ఉన్నాయని మేధావులు పేర్కొంటున్నారు. వాటిలో మొదటిది ‘సమాజలో గుర్తింపు లేదా కీర్తి’ అనేది. దీన్ని ‘సర్వే’ ద్వారా నిర్ణయిస్తారు. కాని, దాని వివరాలు బయటికి తెలియవు. బిట్స్ పిలానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్), ధన్‌బాద్; వరంగల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి కొన్ని పాత ప్రఖ్యాత ఇన్స్టిట్యూట్ల కంటే కొత్తగా ఏర్పాటైన కొన్ని ప్రైవేట్ సంస్థలు త్వరగా పేరు తెచ్చుకోవడానికి అవి సొంతంగా ప్రచారం చేసుకోవడమే కారణం. ప్రభుత్వ సంస్థలు ఇటువంటి ప్రచారం చేసుకోకపోవడం గమనార్హం.పరిశోధన ఫలితాల ప్రచురణల నాణ్యత – వాటి సంఖ్య ముఖ్యమైన పారామితులలో ఒకటి. ఈ విషయంలో చాలా ప్రైవేట్ యూనివర్సిటీలు తమ ర్యాంకింగ్స్‌ను గణనీయంగా పెంచుకున్నాయి. ఫ్యాకల్టీ నాణ్యత, అనుభవం అనేది విద్యార్థుల దృక్కోణం నుండి చాలా ముఖ్యమైన పారామితులలో ఒకటి. అయితే, ఎన్ఐఆర్ఎఫ్ నిర్వచనం ప్రకారం, సవిత ఇన్స్టిట్యూట్ భారతదేశంలో అత్యుత్తమ ఫ్యాకల్టీ నాణ్యతను కలిగి ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (11వ ర్యాంక్), ఐఐటీ మద్రాస్ (55వ ర్యాంక్) వంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లు ఈ విషయంలో వెనుకబడిపోయాయి. అందుకే ఈ పారామితిని ఎన్ఐ ఆర్ఎఫ్ సరిగ్గా నిర్వచించిందా అని మేధావులు ప్రశ్నిస్తున్నారు.అలాగే విద్యార్థి సంఖ్యాబలం కూడా యూని వర్శిటీల ర్యాంకులు పెరగడానికి ఒక కారణం. విద్యా ర్థులను చేర్చుకునే విషయంలో ప్రైవేటు విద్యా సంస్థలకు ఎటువంటి నిబంధనలు లేవు. కాని, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు అనేక నిబంధనలు అడ్డు వస్తున్నాయి. అందుకే ప్రభుత్వ విశ్వ విద్యాలయాల కంటే ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు మంచి ర్యాంకులు సొంతం చేసుకున్నాయి. తమిళనాడు వంటి ప్రాంతాలలోని సంస్థలు తమ చివరి సంవత్సరం విద్యార్థులను ఒకటి లేదా రెండు సెమిస్టర్ల ఇంటర్న్‌షిప్‌ల కోసం విదేశీ సంస్థలకు పంపడం ఒక సాధారణ అభ్యాసం– ఇది గ్లోబల్ ఎక్స్ పోజర్‌ను పెంచే చొరవ. సీబీసీఎస్ విధానాన్ని వీఐటీ అనుసరించి తమ విద్యార్థులను విదేశాలకు పంప డాన్ని చూసి తమిళనాడు లోని ఇతర సంస్థలు కూడా సీబీసీఎస్ విధానాన్ని త్వరగా అనుసరించి సామూహిక వృద్ధి స్ఫూర్తిని నేర్చుకున్నాయి. అందు వల్ల ఎన్ఐఆర్ఎఫ్ టాప్ 100లో ఎక్కువ సంస్థలు తమిళనాడుకు చెందినవి కావడంలో ఆశ్చర్యం లేదు.పారామితులను తప్పుగా నిర్వచించడమే కాకుండా, విశ్వవిద్యాలయాలు సమర్పించిన డేటా కచ్చితత్వాన్ని సరిగా నిర్ధారించకపోవడం వల్ల ప్రైవేట్ సంస్థలు మంచి ర్యాంకులు సొంతం చేసుకుంటున్నాయనేది ఒక అభియోగం. 410 మందితో ఇండియా రీసెర్చ్ వాచ్ నిర్వహించిన ఒక సర్వేలో, చాలా మంది (39 శాతం) ఎన్‌ఐఆర్‌ఎఫ్‌కు సమర్పించిన డేటా తప్పు అని భావించారు.పైన పేర్కొన్నవే కాక అనేక ఇతర కారణాల వల్ల ప్రైవేట్ విద్యా సంస్థలు మంచి ర్యాంకులు సాధించగా... ప్రభుత్వ సంస్థలు ఎంత నాణ్యమై నవైనా తగిన ర్యాంకులను సాధించలేక పోయాయి.– ప్రొ. ఈదర శ్రీనివాస రెడ్డి, వ్యాసకర్త, కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ -
రాష్ట్రానికి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 31 ఉన్నత విద్యా సంస్థలు జాతీయ స్థాయిలో సత్తా చాటాయి. ఉన్నత సదుపాయాలు, ఇతర వనరులతో అత్యుత్తమ ప్రమాణాలు సాధించే సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అందించే నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్)–2024లో ఉత్తర ర్యాంకులను సాధించాయి. ఆయా విభాగాల్లో గరిష్టంగా 100 సంస్థలకు వాటి ప్రమాణాలు అనుసరించి ర్యాంకులకు ఎంపిక చేసింది. పది అంశాల ప్రాతిపదికగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యా సంస్థలకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులిస్తోంది. అలాగే, అన్ని విభాగాల్లో స్వయం సమృద్ధి సాధించిన సంస్థలకు ఓవరాల్ కేటగిరీలో ర్యాంకులు ఇచ్చి0ది.గతేడాది కంటే పెరిగిన ర్యాంకులు.. రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థలు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో గణనీయమైన పురోగతిని సాధించాయి. గతేడాది 25 సంస్థలకు ర్యాంకులు దక్కితే.. ఈ ఏడాది ఆ సంఖ్య 31 సంస్థలకు పెరిగింది. ఓవరాల్ ర్యాంకుల్లో ఈ ఏడాది మూడు సంస్థలు చోటు దక్కించుకున్నాయి. » కేఎల్‌యూ 55.47 స్కోరుతో 40వ ర్యాంకు, ఆంధ్ర వర్సిటీ 54.97 స్కోరుతో 41వ ర్యాంకు, 47.43 స్కోరుతో ఏఎన్‌యూకి 97వ ర్యాంకు వచ్చింది. తిరుపతి ఎస్వీ యూనివర్శిటీకి 87వ ర్యాంకు దక్కింది. » వర్సిటీల విభాగంలో ఐదు సంస్థలు.. కేఎల్‌యూ, ఆంధ్ర వర్సిటీ, ఏఎన్‌యూ, విజ్ఞాన్, శ్రీవెంకటేశ్వర వర్సిటీలు ర్యాంకులు పొందాయి. » ఇంజనీరింగ్ కాలేజీ విభాగంలోనూ కేఎల్‌యూ, ఐఐటీ తిరుపతి, ఏఎన్‌యూ, విజ్ఞాన్ వర్సిటీలకు, మేనేజ్మెంట్ విభాగంలో ఐఐఎం–విశాఖపట్నం, కేఎల్‌యూ, క్రియా వర్సిటీ–శ్రీసిటీ సంస్థలు ర్యాంకులను కైవసం చేసుకున్నాయి. » ఫార్మసీ విభాగంలో గతేడాది తొమ్మిది సంస్థలకు ర్యాంకులు వస్తే ఈ ఏడాది ఆరు సంస్థలకు పరిమితమయ్యాయి. ఈ విభాగంలో ఎస్వీ వర్శిటీకి 60వ ర్యాంకు వచ్చి0ది. ఏయూ 34వ ర్యాంకు సాధించింది. » ఇక ఈ ఏడాది కొత్తగా బీఆర్ అంబేడ్కర్ కాలేజ్ ఆఫ్ లా, గీతం, దామోదర సంజీవయ్య జాతీయ లా వర్సిటీకి జాతీయ ర్యాంకులొచ్చాయి. » ఆర్కిటెక్చర్–ప్లానింగ్ విభాగంలో స్పా విజయవాడ, గీతం సంస్థలకు, అగ్రికల్చర్ విభాగంలో ఎన్జీరంగా, శ్రీ వేంకటేశ్వర (ఎస్వీ) వెటర్నరీ వర్సిటీలకు ర్యాంకులు పొందాయి. ఎస్వీ వెటర్నరీ వర్సిటీ 33వ ర్యాంకు సాధించింది.ఏయూకు ఐదు విభాగాల్లో ర్యాంకులు.. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో విశాఖలోని ఆంధ్ర వర్సిటీకి ఐదు విభాగాల్లో ఉత్తమ ర్యాంకులు దక్కాయి. » ఓవరాల్ విభాగంలో 41వ స్థానంలో నిలిచి మెరుగైన ప్రదర్శన కనబర్చింది. » దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా చేర్చిన స్టేట్ పబ్లిక్ వర్సిటీల్లో విభాగంలోనూ జాతీయ స్థాయిలో 65.96 స్కోరుతో 7వ ర్యాంకు పొందింది. » వర్సిటీ కేటగిరీలో 43వ ర్యాంకు, ఇంజనీరింగ్ కేటగిరీలో 90వ ర్యాంకు, ఫార్మసీ విభాగంలో 34వ ర్యాంకులు వచ్చాయి. » న్యాయ కళాశాల 16వ ర్యాంకు సొంతం చేసుకుంది. » ఇక స్టేట్ పబ్లిక్ వర్సిటీ విభాగంలో ఏయూతో పాటు ఏఎన్‌యూకు 20వ ర్యాంకు, శ్రీవెంకటేశ్వర వర్సిటీకి 39వ ర్యాంకు దక్కాయి. 51–100 మధ్య ర్యాంకుల్లో ఆచార్య ఎన్జీరంగా, జేఎన్టీయూ–అనంతపురం, శ్రీపద్మావతి వర్సిటీ, యోగి వేమన వర్సిటీలు నిలిచాయి. -
‘నీట్’ టాపర్లలోంచి మనోళ్లు ఔట్!
సాక్షి, హైదరాబాద్: జాతీయ అర్హత, ప్రవేశపరీక్ష (నీట్–యూజీ 2024)కు సంబంధించి తాజాగా విడుదలైన రెండోసారి సవరించిన (రీరివైజ్డ్) ఫలితాలు తెలంగాణ విద్యార్థులకు కాస్త నిరాశ మిగిల్చాయి. తొలిసారి ఫలితాల్లో జాతీయ స్థాయిలో టాప్–100 ర్యాంకుల్లో నిలిచిన మన విద్యార్థులు.. తాజా ఫలితాల్లో మాత్రం ఆ జాబితాలోనే లేరు. గత ఫలితాల్లో జాతీయ స్థాయిలో 77వ ర్యాంకుతో రాష్ట్ర టాపర్‌గా నిలిచిన అనురాన్ ఘోష్ తాజా ఫలితాల్లో ఏకంగా 137వ ర్యాంకుకు పరిమితమయ్యాడు.అలాగే ఎస్టీ కేటగిరీలో ఆలిండియా టాప్ ర్యాంకర్ తెలంగాణకు చెందిన గుగులోత్ వెంకట నృపేష్ సవరించిన ఫలితాల్లోనూ టాపర్‌గానే ఉన్నారు. కానీ అతని జాతీయ ర్యాంకు అప్పుడు 167 ఉండగా తాజా ఫలితాల్లో 219కు పడిపోయింది. అలాగే ఎస్టీ జాతీయ రెండో ర్యాంకర్‌గా నిలిచిన లావుడ్య శ్రీరామ్ నాయక్ ఇప్పుడు నాలుగో ర్యాంకుకు పరిమితమయ్యాడు. నీట్–యూజీ ఎంట్రన్స్‌లో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో సుప్రీంకోర్టు ఆదేశంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సుమారు 1,500 మందికి మళ్లీ ‘నీట్’నిర్వహించి సవరించిన ఫలితాలను కూడా ప్రకటించింది.కానీ ఫిజిక్స్ విభాగంలో అడిగిన ఓ ప్రశ్నకు గతంలో రెండు ఆప్షన్లను సరైన సమాధానంగా పరిగణించిన ఎన్టీఏ ఆ మేరకు రెండు రకాల సమాధానాలు ఇచ్చిన విద్యార్థులందరికీ ఐదు మార్కులు ఇచి్చంది. అయితే దీనిపై తాజాగా సుప్రీంకోర్టు నియమిత నిపుణుల బృందం ఆ రెండింటిలో ఒక దాన్నే సరైన సమాధానంగా గుర్తించడంతో ఆ ప్రశ్నకు రెండో సమాధానాన్ని ఎంచుకున్న విద్యార్థులకు 5 మార్కుల కోత పెట్టింది. దీంతో విద్యార్థుల ర్యాంకుల్లో తేడా వచి్చంది. తెలంగాణ నుంచి మొదటిసారి విడుదల చేసిన ఫలితాల్లో 47,371 మంది అర్హత సాధించగా తాజాగా సవరించిన ఫలితాల్లో 47,356 మంది అర్హత సాధించారు. త్వరలో రాష్ట్రస్థాయి ర్యాంకులు... ఆలిండియా ర్యాంకులు ప్రకటించిన ఎన్టీఏ... త్వరలో రాష్ట్రాలవారీగా అభ్యర్థుల జాబితాను రూపొందించనుంది. ముందుగా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కోసం ఆలిండియా ర్యాంక్ ఆధారంగా మెరిట్ జాబితాను తయారు చేయనుంది. తగ్గిన కటాఫ్ మార్కు... సవరించిన ఫలితాల్లో కటాఫ్ మార్కు తగ్గింది. జనరల్ కేటగిరీ/ఈడబ్ల్యూఎస్ కింద తొలిసారి ఫలితాల్లో కటాఫ్ 164గా ఉండగా ఇప్పుడు 162కు తగ్గింది. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ పీహెచ్, ఎస్సీ అండ్ పీహెచ్‌ల అర్హత మార్కులు కూడా 129 నుంచి 127కు తగ్గాయి. అన్ రిజర్వ్డ్/ఈడబ్ల్యూఎస్ అండ్ పీహెచ్‌ల అర్హత మార్కు సైతం 146 నుంచి 144కు తగ్గింది. ఎస్టీ అండ్ పీహెచ్‌లోనూ 129 నుంచి 127కు తగ్గింది. గతేడాది రాష్ట్రంలో 459 మార్కులు వచ్చిన వారికి జనరల్ కేటగిరీలో కనీ్వనర్ కోటాలో సీటు రాగా ఈసారి 500 మార్కులు దాటిన వారికి కూడా కనీ్వనర్ కోటాలో సీటు వచ్చే అవకాశం ఉంది. -
విచారణ జరిపించాలి..
డాక్టర్ కావాలని ఎంతో కష్టపడి చదివి ‘నీట్’ పరీక్షకు హాజరైన లక్షలాది విద్యార్థుల ఆశలపై ఆ పరీక్షల ఫలితాలు నీళ్లు చల్లాయి. ఎన్నడూ లేనివిధంగా 67 మందికి 720 మార్కులకు 720 రావడం, అలా వచ్చినవారిలో పలువురు ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్ష రాయడం విద్యార్థులనే కాక, వారి తల్లి తండ్రులనూ నిరుత్తరులను చేసింది.దీనికి తోడు నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వందలాదిమందికి పరీక్షానిర్వహణ సంస్థ ఎన్టీఏ గ్రేస్ మార్కులను ఇవ్వడం కూడా విమర్శలకు దారితీసింది. ప్రజల ఆందోళనల నేపథ్యంలో చివరికి గ్రేస్ మార్కులను ఎన్టీఏ ఉపసంహరించుకుంది. కాని, పరీక్షల నిర్వహణలో మాత్రం ఎటువంటి అవకతవకలూ జరగలేదని అనడమే విడ్డూరంగా ఉంది.ప్రతిసారీ విద్యార్థులతో ‘పరీక్షా పే’ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని... కీలకమైన నీట్ పరీక్షపై ఆరోపణలు, అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ మాట్లాడకపోవడం విద్యార్థుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి అర్థమవుతుంది. నీట్ పరీక్ష మాత్రమే కాక దేశంలోని ఎన్నో పోటీ పరీక్షలను ఎన్టీఏ నిర్వహిస్తోంది. తాజాగా బయటపడ్డ వివాదస్పద అంశాల కారణంగా దానిపై విద్యార్థులు నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చింది.ప్రతిసారీ ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులకు ఎక్కువగా ర్యాంక్‌లు రావడం, దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు తక్కువ ర్యాంకులు రావడంపై దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు అనేక అనుమానాలు కల్గుతున్నాయి.ఈ మొత్తం వ్యవహారంపై కేంద్రం సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించి అవకతవకలు ఉన్నవని తేలితే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అక్రమంగా లబ్ధిపొందిన వారిపైనా చర్యలు తీసుకోవాలి. నీట్లో జరిగిన అక్రమాల కారణంగా కష్టపడి చదివిన విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి. – గడ్డం శ్యామ్, పీడీఎస్‌యూ తెలంగాణ ఉపాధ్యక్షుడు -
సినీతారలకు ర్యాంకులు.. టాప్ టెన్‌లో అంతా వాళ్లే.. టాలీవుడ్ నుంచి ఎవరంటే!
సినీ ఇండస్ట్రీలో ఎక్కువ క్రేజ్ ఉన్న సెలబ్రిటీల జాబితాను ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ వెల్లడించింది. గత పదేళ్లుగా వారికి లభించిన క్రేజ్ ఆధారంగా ఈ లిస్ట్‌ను రూపొందించారు. అయితే ఈ లిస్ట్‌లో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె మొదటిస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో షారుక్ ఖాన్, ఐశ్వర్యరాయ్, ఆలియా భట్, ఇర్ఫాన్ నిలిచారు. టాప్ టెన్‌లో ఆందరూ బాలీవుడ్ తారలే నిలవడం విశేషం. దేశవ్యాప్తంగా అత్యంత ఆదరణ ఉన్న మొదటి 100 మంది సినీతారల జాబితాను ఐఎండీబీ ప్రకటించింది.దక్షిణాది తారల విషయానికొస్తే ఈ జాబితాలో సమంత 13వ స్థానం దక్కించుకుంది. సౌత్ నుంచి టాప్ 15లోపు నిలిచిన స్టార్ సమంత కావడం విశేషం. ఆ తర్వాత తమన్నా 16, నయనతార 18 స్థానాల్లో నిలిచారు. టాలీవుడ్ హీరోల విషయానికొస్తే ప్రభాస్ 29, రామ్ చరణ్ 31, అల్లు అర్జున్ 47, జూనియర్ ఎన్టీఆర్ 67 స్థానాల్లో ఉన్నారు. టాప్ 100 మోస్ట్ వ్యూడ్ ఇండియన్ స్టార్స్ పేరుతో 2014 నుంచి 2024 వరకు ఎక్కువ ప్రజాదరణ పొందిన తారల జాబితాను ఐఎండీబీ ఇవాళ విడుదల చేసింది. టాప్-100 సినీ తారల జాబితాలో హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు ఉన్నారు.Presenting the Top 100 Most Viewed Indian Stars of the Last Decade on IMDb, globally! 📣✨Do you spot your favourites?The Top 100 Most Viewed Indian Stars of the Last Decade on IMDb list is based on the IMDb weekly rankings from January 2014 through April 2024. These… pic.twitter.com/4h8IEEwMAZ— IMDb India (@IMDb_in) May 29, 2024 -
అత్యంత చెత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024, నవంబర్ 5న జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ నేత జో బైడెన్ మధ్యేనే ఈ అధ్యక్ష ఎన్నికల్లో ప్రధానంగా పోటీ కనిపిస్తోంది. ఇదిలావుండగా అమెరికాను ఇప్పటి వరకూ ఏలిన మొత్తం 45 మంది అధ్యక్షులలో డొనాల్డ్ ట్రంప్ అత్యంత చెత్త అధ్యక్షునిగా అభివర్ణిస్తూ ఒక సర్వే ఫలితాలు వెలువడ్డాయి. ఈ జాబితాలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 14వ స్థానంలో నిలిచారు. అంతర్యుద్ధాన్ని ఆపడంలో లేదా ఆ పరిస్థితి నుండి బయటపడేయడంలో విఫలమైన వారి కంటే కూడా డొనాల్డ్ ట్రంప్ వెనుకబడి ఉన్నారు. ఈ సర్వేను నిర్వహించిన రాజకీయ విశ్లేషకులు జస్టిన్ వాన్, బ్రాండన్ రోటింగ్హాస్ మాట్లాడుతూ బైడెన్ సాధించిన విజయాలలో.. ట్రంప్ నుండి అధ్యక్ష పదవిని కాపాడటమే ప్రధానమైనదని పేర్కొన్నారు. యూనివర్శిటీ ఆఫ్ కోస్టల్ కరోలినాకు చెందిన వాన్, హ్యూస్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన రోటింగ్హాస్ తదితర 154 మంది రాజకీయ విశ్లేషకులు ఈ సర్వే నిర్వహించారు. వీరు అమెరికన్ పొలిటికల్ సైన్స్ అసోసియేషన్‌తో సత్సంబంధాలు కలిగివున్నారు. అమెరికాలోని ఉత్తమ అధ్యక్షునిగా అబ్రహం లింకన్ నిలిచారు. ఆయన దేశంలో బానిసత్వాన్ని నిర్మూలించడంతోపాటు అంతర్యుద్ధం సమయంలో దేశాన్ని సమర్థవంతంగా నడిపించాడని విశ్లేషకులు పేర్కొన్నారు. మరో ఉత్తమ అధ్యక్షునిగా ఫ్రాంక్లిన్ డెలానో రూజ్వెల్ట్ నిలిచారు. ఆర్థిక మాంద్యం, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికాకు సరైన మార్గనిర్దేశం చేశాడని విశ్లేషకులు తెలిపారు. -
ఎక్కువ ఫీజులు కట్టేస్తే మార్కులు వచ్చేయవు..ఆ స్కిల్..
సుబ్బారావు, సుమిత్రలకు ఆనంద్, అంజలి పిల్లలు. ఆనంద్ చిన్నప్పటి నుంచీ బాగా చదువుకునేవాడు. కానీ అంజలి ఎంత చదివినా మార్కులు వచ్చేవి కావు. దాంతో పేరెంట్స్ ఆమె గురించి ఆందోళన పడుతుండేవారు. బెటర్ స్కూల్, బెటర్ మెటీరియల్స్, బెస్ట్ ట్యూషన్ ్స పెట్టించినా ఫలితం లేకపోయింది. పదో తరగతి ఎలాగోలా గట్టెక్కింది. లక్షల ఫీజు కట్టి హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్ కాలేజీలో చేర్పించారు. మొదటిసారి పేరెంట్స్‌కి, ఊరికి దూరంగా హాస్టల్లో ఉండటం వల్ల దిగులుగా ఉండేది. దానికి తోడు మార్కులు సరిగా రాకపోవడంతో క్లాసులో అందరిముందూ అవమానంగా మాట్లాడేవారు. దాంతో మరింత కుంగిపోయింది. ఈ మధ్యకాలంలో పేరెంట్స్ ఫోన్ చేస్తే.. ఇంటికి వచ్చేస్తానంటూ ఏడుస్తోంది. ఎలాగోలా రెండేళ్లు సర్దుకోమ్మా అని ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. ఏం చేయాలో అర్థంకాక, లెక్చరర్ సలహా మేరకు కౌన్సెలింగ్‌కి తీసుకువచ్చారు. అంజలితో మాట్లాడుతున్నప్పుడు చాలా చురుకైన పిల్ల అని అర్థమైంది. బాగా బొమ్మలు వేస్తుంది, పాటలు పాడుతుంది, నాట్యం చేస్తుంది. మార్కులు మాత్రం రావు. దాంతో ‘పనికిమాలిన కళలన్నీ బానే ఉన్నాయి, చదువు మాత్రం రాదు’ అంటూ విమర్శలు. ‘నేను అందరికంటే ఎక్కువసేపు చదువుతా సర్, అయినా గుర్తుండవు. ఏం చేయాలో అర్థం కావడంలేదు’ అని బాధపడుతూ చెప్పింది అంజలి. తెలివితేటలున్నా వాటిని మార్కులుగా మార్చుకునేందుకు అవసరమైన స్టడీస్కిల్స్ లేకపోవడమే ఆమె సమస్యని అర్థమైంది. స్టడీస్కిల్స్ లేకపోతే కష్టం, నష్టం.. స్టడీస్కిల్స్ లేని విద్యార్థులు ఏకాగ్రతతో వినలేరు, చదవలేరు. చదివినా గుర్తుండదు. దాంతో వాయిదా వేస్తుంటారు. సిలబస్ పేరుకుపోతుంది. ఫలితంగా పరీక్షల ముందు ఒత్తిడి పెరుగుతుంది. పరీక్షలంటే భయం ఏర్పడుతుంది. భయం, ఆందోళన, ఒత్తిడి కలగలిసి పెర్ఫార్మెన్స్ ని దెబ్బతీస్తాయి. మార్కులు తక్కువ వస్తాయి. దాంతో ‘ఎంత చదివినా ఇంతే, నా మొహానికి మార్కులు రావు’ అనే భావన స్థిరపడిపోతుంది. ఆ నెగెటివ్ సైకిల్లో పడ్డారంటే నిరాశ, నిస్పృహలతో చదువు అటకెక్కుతుంది. విజయానికి పునాది అకడమిక్స్‌లో విజయం సాధించాలంటే స్టడీస్కిల్స్ పునాదిగా పనిచేస్తాయి. క్లాసులో చెప్పింది శ్రద్ధగా వినడం, అర్థం చేసుకోవడం, నోట్స్ రాసుకోవడం, చదవడం, గుర్తు చేసుకోవడం.. ఇవన్నీ స్టడీస్కిల్స్ కిందకు వస్తాయి. ఇవి సహజంగా వస్తాయని, ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదని చాలామంది పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ భావిస్తుంటారు. కానీ ఇవన్నీ ‘స్కిల్స్’.. అంటే ప్రయత్నంతో నేర్చుకోవాల్సినవని గుర్తించాలి. స్కిల్స్ కూడా నేర్చుకోవచ్చు.. స్టడీస్కిల్స్ పుట్టుకతో రావు. కాలక్రమేణా కొందరికి సహజంగా రావచ్చు. అలాంటివారికే మార్కులు, ర్యాంకులు వస్తాయి. అలాగని మిగతావారు నిరాశ పడాల్సిన అవసరంలేదు. కాస్తంత ప్రయత్నం చేస్తే ఎవరైనా స్టడీస్కిల్స్ నేర్చుకోవచ్చు. కోరుకున్న మార్కులు, ర్యాంకులు సాధించవచ్చు. అందుకోసం కొన్ని టిప్స్.. స్టడీస్కిల్స్లో అతి ముఖ్యమైనది ఎఫెక్టివ్ లిజనింగ్. క్లాసులో శ్రద్ధగా వింటే.. మీరు 70శాతం సబ్జెక్ట్ నేర్చుకున్నట్లే. అందుకే శ్రద్ధగా వినడం ప్రాక్టీస్ చేయండి. నేర్చుకోవడం మీ మెంటల్ స్టేటస్‌పై ఆధారపడి ఉంటుంది. బాగా విశ్రాంతి తీసుకున్న మనసు మెరుగ్గా పని చేస్తుంది. అందువల్ల తగినంత నిద్ర, సమతుల ఆహారం, సరిపడా శారీరక శ్రమ ఉండేలా చూసుకోండి. శరీరం యాక్టివ్‌గా ఉంటే మైండ్ కూడా యాక్టివ్ అవుతుంది. ఎఫెక్టివ్ స్టడీ అనేది ఎఫెక్టివ్ ప్లానింగ్‌తో మొదలవుతుంది. మీరు నేర్చుకోవాల్సిన అంశాలను చిన్న చిన్న భాగాలుగా విభజించి స్టడీ షెడ్యూల్‌ను రూపొందించుకోవాలి. ప్రతి అంశానికి సరిపడా సమయం కేటాయించాలి. ఫోకస్ కొనసాగించడానికి మధ్య మధ్యలో గ్యాప్ తీసుకోవాలి. చదవడమంటే పుస్తకం ముందేసుకుని కూర్చోవడం కాదు. అందులోని కాన్సెప్ట్స్‌ని అర్థం చేసుకోవడం, ప్రాసెసింగ్ చేయడం, ఇంకొకరికి బోధించడం. ఇలా చేయడం ద్వారా మీ అవగాహన, జ్ఞాపకశక్తి బలోపేతమవుతాయి. క్లాసులో చెప్పిన ప్రతి అక్షరం నోట్సులో రాసుకునే అలవాటును వదిలేయండి. బదులుగా ముఖ్య అంశాలను మాత్రమే నోట్ చేసుకునే సెలక్టివ్ నోట్ టేకింగ్ ప్రాక్టీస్ చేయండి. కంటెంట్ సారాంశాన్ని గ్రహించి కీలక అంశాలను మీ సొంత మాటల్లో రాసుకోండి. ఆడియో, వీడియో, ఫ్లాష్ కార్డ్‌లు ఉపయోగించండి. సులువుగా నేర్చుకోగలుగుతారు. పరీక్షల్లో ఇచ్చిన టైమ్‌లో సమాధానాలు రాయడం అత్యంత ముఖ్యమైన విషయం. అందువల్ల పోమోడోరో టెక్నిక్ వంటి వాటిని ఉపయోగించి ఫోకస్డ్గా చదవడం, రాయడం నేర్చుకోండి. ఏ విషయంలోనైనా మీకు సమస్య ఎదురైతే పేరెంట్స్, టీచర్స్, ఫ్రెండ్స్ సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి. (చదవండి: హలో బ్రదర్ సినిమా మాదిరి కవల సిస్టర్స్ !..ఊహాతీతమైన ఓ మిస్టరీ గాథ) -
సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ లిస్ట్‌లో నెంబర్ వన్ ప్లేస్!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే సినిమాలకు విరామం ప్రకటించిన భామ.. ప్రస్తుతం ఆధ్యాత్మిక చింతనపై దృష్టి సారించింది. ఇటీవల కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్ నిర్వహించిన యోగా శిబిరంలో సామాన్యురాలిగా కనిపించింది. అయితే మయోసైటిస్ నుంచి నుంచి పూర్తిగా కోలుకోవడానికే త్వరలోనే అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఆల్ ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్ల జాబితాలో ఏకంగా మొదటిస్థానంలో నిలిచింది. (ఇది చదవండి: బాలీవుడ్లోనే కాదు, సౌత్‌లో కూడా.. కాంప్రమైజ్ అడిగారు: సీరియల్ నటి) బాలీవుడ్ తారలను వెనక్కి నెట్టి సమంత అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో సమంత ఏకంగా ఎనిమిదోసారి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో పాటు సమంత అద్భుత నటనతో ప్రేక్షకాదరణ పొందింది. ఆర్మాక్స్ సంస్థ స్టార్స్ ఆఫ్ ఇండియా లవ్స్ పేరిట రిలీజ్ చేసిన జాబితాలో జూన్ 2023కు కానూ అత్యంత ఆదరణ కలిగిన హీరోయిన్గా సమంత స్థానం దక్కించుకుంది. కాగా.. ఇటీవలే విజయ్ దేవరకొండ సరసన నటించిన ఖుషీ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో పాటు బాలీవుడ్ వరుణ్ ధావన్‌తో కలిసి సిటాడెల్లో కనిపించనుంది. (ఇది చదవండి: ఆ విషయంలో తప్పు నాదే.. బేబీ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!) -
సివిల్స్‌లో కేయూ ప్రొఫెసర్ మంద అశోక్ కుమార్ కూతురుకు 646 ర్యాంక్
కాకతీయ యూనివర్సిటీ అర్థశాస్త్ర ఆచార్యులు మంద అశోక్ కుమార్ కూతురు మంద అపూర్వ సివిల్స్ ఫలితాలలో 646 ర్యాంకు సాధించారు. మంద అపూర్వ ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం ఎంటెక్ చేస్తున్నారు. హనుమకొండ ఎక్సైజ్ కాలనీలో నివసిస్తున్న అపూర్వ తల్లి మంద రజనీ దేవి ప్రభుత్వ టీచర్ గా భీమదేవరపల్లి మండలం మాణిక్య పూర్లో పనిచేస్తున్నారు. మందా అపూర్వకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు పెద్దన్నయ్య అరుణ్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా, చిన్న అన్నయ్య అభినవ్ పూణేలో ఫార్మసీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇక, మంద అపూర్వ సివిల్స్‌లో ర్యాంక్ సాధించడంపై పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. -
టెన్త్ ఫలితాల్లో అదరగొట్టిన గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు
-
జేఈఈ మెయిన్స్‌లో.. టాప్ లేపిన తెలంగాణ!
ప్రతిష్టాత్మక ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించిన జేఈఈ మెయిన్స్‌లో తెలంగాణ టాప్ లేపింది. జాతీయ స్థాయి మొదటి ర్యాంకు మాత్రమేగాక.. టాప్–10లో ఐదు ర్యాంకులను తెలంగాణ విద్యార్థులే సాధించారు. జాతీయ స్థాయిలో వంద పర్సంటైల్ సాధించిన వారిలోనూ రాష్ట్ర విద్యార్థులు 11 మంది ఉన్నారు. ఏపీతో కలుపుకొంటే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 16 మంది వంద పర్సంటైల్ సాధించిన టాప్–43లో నిలిచారు. ఇక ఓపెన్ కేటగిరీలో మొదటి వంద ర్యాంకుల్లో 25కుపైగా, టాప్ వెయ్యి ర్యాంకుల్లో 200కుపైగా తెలంగాణ విద్యార్థులకు దక్కాయి. ఈసారి జేఈఈ పరీక్ష జాతీయ స్థాయిలో రెండు దఫాలుగా.. జనవరిలో ఒకసారి, ఏప్రిల్‌లో మరోసారి జరిగింది. కంప్యూటర్ ఆధారితంగా ఆన్లైన్లో నిర్వహించిన ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 11,62,398 మంది దరఖాస్తు చేసుకోగా.. 11,13,325 మంది హాజరయ్యారు. తుది ఫలితాలు, ర్యాంకులను ఎన్టీఏ శనివారం వెల్లడించింది. టాపర్స్ వీరే.. జేఈఈ మెయిన్స్‌లో దేశవ్యాప్తంగా వంద శాతం పర్సంటైల్‌ను 43 మంది విద్యార్థులు సాధించగా.. అందులో 11 మంది తెలంగాణ విద్యార్థులే. మొత్తంగా టాప్ ర్యాంకు హైదరాబాద్‌కు చెందిన సింగరాజు వెంకట కౌండిన్యకు దక్కింది. టాప్–10 ర్యాంకుల్లో రాష్ట్రానికి చెందిన అల్లం సుజయ్ 6వ ర్యాంకు, వావిళ్ల చిద్విలాసరెడ్డి 7వ ర్యాంకు, బిక్కన అభినవ్ చౌదరి 8వ ర్యాంకు, అభినీత్ మంజేటి 10వ ర్యాంకు సాధించారు. ఇక గుత్తికొండ అభిరాం (17వ ర్యాంకు), భరద్వాజ (18వ ర్యాంకు), పాలూరి గణకౌశిక్రెడ్డి (20వ ర్యాంకు), రమేశ్ సూర్యతేజ (21వ ర్యాంకు), నందిపాటి సాయి దుర్గారెడ్డి (40వ ర్యాంకు), ఈవూరి మోహన శ్రీధర్‌రెడ్డి (41వ ర్యాంకు) తదితరులు వందశాతం పర్సంటైల్ సాధించిన టాప్–43 ర్యాంకర్లలో ఉన్నారు. రేపట్నుంచి అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తులు జేఈఈ అర్హత సాధించినవారు ఈ నెల 30 నుంచి అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్టీఏ ప్రకటించింది. ర్యాంకు కార్డు డౌన్లోడ్ చేసుకుని, దాని ఆధారంగా వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. వివిధ కేటగిరీలకు కేటాయించిన కటాఫ్ మార్కుల ఆధారంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులైన వారి వివరాలను ర్యాంకు కార్డులో పొందుపరిచారు. అడ్వాన్స్‌డ్‌కు కటాఫ్ ఇదీ.. దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్‌కు హాజరైనవారిలో 2.5 లక్షల మందిని అడ్వాన్స్డ్ పరీక్షకు ఎంపిక చేస్తారు. పరీక్షలో వచి్చన మార్కులను పరిగణనలోకి తీసుకుని వివిధ కేటగిరీల వారీగా కటాఫ్ నిర్ణయిస్తారు. గత ఏడాది కన్నా ఈసారి ఎక్కువ మంది పరీక్షకు హాజరయ్యారు. ఈసారి ఓపెన్ కేటగిరీలో 90 పర్సంటైల్‌తో కటాఫ్ నిర్ణయించారు. కేటగిరీల వారీగా కటాఫ్ ఇదీ.. కేటగిరీ కటాఫ్ ఎంపికైన అభ్యర్థుల సంఖ్య ఓపెన్ 90.788642 98,612 పీహెచ్ 0.0013527 2,685 ఈడబ్ల్యూఎస్ 75.6229025 25,057 ఓబీసీ 73.6114227 67,613 ఎస్సీ 51.9776027 37,536 ఎస్టీ 37.2348772 18,752 కృత్రిమ మేధపై పట్టు సాధించాలనుంది జేఈఈ మెయిన్స్‌లో జాతీయస్థాయి టాపర్‌గా నిలవడం ఆనందంగా ఉంది. అడ్వాన్స్‌డ్‌లోనూ ఇదే పట్టుదలతో విజయం సాధిస్తా. ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో చేరాలనుంది. తర్వాత ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్‌లో పట్టు సాధించాలన్నది నా లక్ష్యం. ఆ దిశగా రోజుకు 18 గంటలు కష్టపడి చదువుతున్నాను. మా నాన్న శ్రీపణి సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమ్మ రాజరాజేశ్వరి నా కోసం చాలా కష్టపడ్డారు. వారి నమ్మకాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తాను. – సింగరాజు వెంకట కౌండిన్య, జేఈఈ టాపర్ -
ర్యాంకు లక్ష వచ్చినా తెలంగాణలో సీటు.. నీట్ నిపుణుల విశ్లేషణ ఇదే
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించిన కసరత్తు ప్రారంభించినట్లు కాళోజీ విశ్వవిద్యాలయం తెలిపింది. నీట్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో అందులో అర్హత సాధించిన రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల వివరాల డేటా రాగానే అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేస్తామని పేర్కొంది. వారంలో నీట్ రాష్ట్ర స్థాయి ర్యాంకుల ప్రకటన వెలువడుతుందని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. కాగా నీట్ ర్యాంకులపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్రంలో చాలామంది జాతీయ స్థాయిలో తమ ర్యాంకులను చూసి ఆందోళన చెందుతున్నారని, కానీ రాష్ట్ర స్థాయిలో చూస్తే ర్యాంకులు తక్కువగానే ఉంటాయని నీట్ నిపుణులు చెబుతున్నారు. చదవండి: ‘నిమ్స్ డైరెక్టర్‌కు అపోలోలో చికిత్సా?’ వారి అంచనా ప్రకారం జాతీయ స్థాయిలో 40 వేల లోపు ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు, రాష్ట్ర స్థాయిలో 1500 నుంచి 2 వేల లోపు ర్యాంకులే వచ్చే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. అటువంటి వారికి కన్వీనర్ కోటాలోనే సీట్లు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. అలాగే జాతీయ స్థాయిలో లక్ష వరకు ర్యాంకులు వచ్చిన వారికి మన దగ్గర ప్రైవేటు కాలేజీల్లో ఎంబీబీఎస్ సీటు వస్తుందని చెబుతున్నారు. రాష్ట్రస్థాయి ర్యాంకుల ప్రకటన అనంతరం త్వరలో మొదటి విడత కౌన్సిలింగ్‌కు నోటిఫికేషన్ జారీచేస్తామని కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి. తరగతుల ప్రారంభానికి సంబంధించి ఇంకా షెడ్యూల్ రాలేదని వివరించాయి. కొత్తగా 6 ప్రభుత్వ కాలేజీలు.. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ కాలేజీల్లో మొత్తం 5,965 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. ప్రస్తుతం 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,765 సీట్లు ఉండగా, 23 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, మైనారిటీ కాలేజీల్లో 3,600 సీట్లు ఉన్నాయి. ఇందులో ఇటీవల మూడు ప్రైవేటు కాలేజీలకు సంబంధించి అడ్మిషన్లు రద్దు చేసిన నేపథ్యంలో వాటిల్లోని 450 ఎంబీబీఎస్ సీట్లను తీసేస్తే 3,150 సీట్లు ఉంటాయి. అయితే ఎంఎన్ఆర్ కాలేజీకి దాదాపు అనుమతి వచ్చినట్లేనని కాళోజీ వర్గాలు అంటున్నాయి. కాబట్టి అవి 150 కలిపితే 3,300 సీట్లు అవుతాయి. మరోవైపు ఈసారి ప్రభుత్వం రాష్ట్రంలో 8 మెడికల్ కాలేజీలను ప్రారంభించాలని నిర్ణయించింది. అందులో జగిత్యాల, సంగారెడ్డి, నాగర్ కర్నూలు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి మెడికల్ కాలేజీలకు ఇప్పటికే అనుమతులు వచ్చాయి. దీంతో వాటిల్లో 900 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఇలా మొత్తం 16 ప్రభుత్వ కళాశాలల్లో 2,665 సీట్లు ఉండనున్నాయి. ఇక రామగుండం, మంచిర్యాల కాలేజీలకు కూడా అనుమతులు వస్తే వాటి ద్వారా మరో 300 సీట్లు పెరుగుతాయని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు వెల్లడించాయి. నీట్ యూజీ-2022 ఫలితాల కోసం క్లిక్ చేయండి -
ఇంజనీరింగ్, ఫార్మసీల్లో.. ఏపీకి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పలు ఉన్నత విద్యాసంస్థలు ఈ విద్యా సంవత్సరంలో కూడా ‘నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్’ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకులను సొంతం చేసుకున్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ విభాగాల్లో గతంలో కన్నా ఈసారి ఎక్కువ సంస్థలు ర్యాంకుల సాధనలో ముందంజలో ఉన్నాయి. పది అంశాలను ప్రామాణికంగా తీసుకుని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ దేశంలోని ఉన్నత విద్యాసంస్థలకు ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులను ఏటా ప్రకటిస్తోంది. ఈ రెండు విభాగాల్లో ఏపీకి చెందిన సంస్థలు గతంలో కన్నా ఎక్కువగా ఎంపికయ్యాయి. చదవండి: సీఎం జగన్ రుణం తీర్చుకోలేనిది: పాలిటెక్నిక్ అధ్యాపకులు మరోవైపు.. ఓవరాల్ విభాగంలో స్కోరు సాధించిన ఆంధ్రా యూనివర్సిటీ టాప్ 100లో చోటు సంపాదించింది. ఆంధ్రా యూనివర్సిటీ (విశాఖపట్నం) 47.97 స్కోరు పాయింట్లతో 71వ ర్యాంకు సాధించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం ఈ ఎన్ఐఆర్ఎఫ్–2022 ర్యాంకులను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఈ ర్యాంకుల కోసం 1,875 సంస్థలు పోటీపడ్డాయి. యూనివర్సిటీల విభాగంలో ఏపీలోని 5 సంస్థలకు ఈ ర్యాంకులు దక్కాయి. ఆంధ్రా యూనివర్సిటీ 50.52 స్కోరుతో 36వ ర్యాంకు, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ (తిరుపతి)æ 45.07 స్కోరుతో 67వ ర్యాంకును సొంతం చేసుకున్నాయి. కాలేజీల విభాగంలో విజయవాడలోని ఆంధ్ర లయోలా కాలేజీ ఒక్కటే నిలిచి 94వ స్థానాన్ని దక్కించుకుంది. ‘ఇంజనీరింగ్’ విభాగంలో పెరిగిన ర్యాంకులు ఇంజనీరింగ్ కాలేజీల విభాగంలో ఈసారి రాష్ట్రానికి ఎక్కువ ర్యాంకులు దక్కాయి. గత ఏడాది ఏపీలోని ఆరు సంస్థలు చోటు సంపాదించుకోగా ఈసారి ఆ సంఖ్య పదికి పెరిగింది. ప్రభుత్వ సంస్థలైన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) తిరుపతి 48.16 స్కోరుతో 56వ ర్యాంకు, ఏయూ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ (విశాఖపట్నం) 42.76 స్కోరుతో 77వ ర్యాంకు, జేఎన్టీయూ కాకినాడ 37.79 స్కోరుతో 129వ ర్యాంకు సాధించాయి. మేనేజ్మెంటు విభాగంలో విశాఖపట్నంలోని జాతీయ విద్యాసంస్థ అయిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంటు సంస్థ 33వ ర్యాంకులో నిలిచింది. ఫార్మసీ విభాగంలో రాష్ట్రానికి తొమ్మిది ర్యాంకులు దక్కాయి. ప్రభుత్వ సంస్థలైన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్సు (గుంటూరు)కు 51వ ర్యాంకు, తిరుపతిలోని శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయానికి 66, శ్రీ వేంకటేశ్వర వర్సిటీకి 89వ ర్యాంకు లభించాయి. ఇక ఆర్కిటెక్చర్ విభాగంలో విజయవాడలోని జాతీయ విద్యాసంస్థ అయిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (స్పా–ఎస్పీఏ) 7వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ ఐఐటీ అదుర్స్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో తెలంగాణలోని హైదరాబాద్ ఐఐటీ సహా రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు ర్యాంకులు సాధించాయి. అన్ని విభాగాలకు కలిపి (ఓవరాల్) ఇచ్చిన ర్యాంకుల్లో ఐఐటీ (హెచ్) 14వ ర్యాంకును (గతేడాది 16వ ర్యాంకు) సొంతం చేసుకుంది. ఈ సంస్థకు 62.86 జాతీయ స్కోర్ లభించింది. ఇంజనీరింగ్ కాలేజీల విభాగంలో ఐఐటీ (హెచ్) టాప్–10లో నిలిచి 9వ ర్యాంకు పొందింది. అలాగే పరిశోధన విభాగంలో 12వ ర్యాంకు సాధించింది. యూనివర్సిటీల వారీగా చూస్తే జాతీయ స్థాయిలో 10వ ర్యాంకు సాధించిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.. ఓవరాల్ విభాగంలో 20వ ర్యాంకును, రీసెర్చ్ విభాగంలో 27వ ర్యాంకును సాధించింది. మరోవైపు వర్సిటీల ర్యాంకుల్లో ఉస్మానియా యూనివర్సిటీ 22వ ర్యాంకు పొందింది. -
స్టార్టప్ ర్యాంకులు: కమింగ్ సూన్
సాక్షి, న్యూఢిల్లీ: స్టార్టప్ వ్యవస్థకు దన్నుగా నిబంధనల వాతావరణాన్ని సులభతరం చేసే బాటలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ర్యాంకింగ్స్ విడుదల చేయనుంది. ఈ ఏడాది 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం స్టార్టప్ ఎకో సిస్టమ్‌లో రాష్ట్రాలవారీగా సోమవారం(4న) ర్యాంకులను ప్రకటించ నుంది. ఇది మూడో ఎడిషన్ కాగా.. అంతక్రితం 2020 సెప్టెంబర్‌లో ర్యాంకులను ప్రకటించింది. గుజరాత్ టాప్ ర్యాంకులో నిలిచిన సంగతి తెలిసిందే. వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్.. స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు అండగా నిలిచిన రాష్ట్రాలు, ప్రాంతాలవారీగా ర్యాంకులను విడుదల చేయనున్నారు. పోటీ, సహకార సమాఖ్య విధానాల ద్వారా దేశీ విజన్‌ను ప్రోత్సహించేందుకు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) ర్యాంకింగ్‌ను చేపట్టింది. స్టార్టప్‌ల వృద్ధికి అనుగుణంగా సరళతర నియంత్రణల అమలుతోపాటు వ్యవస్థ పటిష్టతకు మద్దతుగా నిలిచిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో తొలుత 2018లో ర్యాంకింగ్ విధానానికి తెరతీసింది. -
సులభతర వాణిజ్యంలో తెలంగాణకు అగ్రస్థానం
సాక్షి, హైదరాబాద్: సులభతర వాణిజ్య విధానం (ఈవోడీబీ) ర్యాంకుల్లో 2020కి సంబంధించి తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర పరిశ్రమలకు శాఖకు అనుబంధంగా ఉండే పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం(డీపీఐ ఐటీ) ఏటా ప్రకటించే సులభతర వాణిజ్యం ర్యాంకులను గురువారం వెల్లడించింది. గతంలో ఉన్న ర్యాంకుల విధా నానికి స్వస్తి పలుకుతూ ఈ ఏడాది రాష్ట్రాలను టాప్ అఛీవర్స్, అఛీవర్స్, అస్పైరర్స్, ఎమర్జింగ్ ఇకో సిస్టమ్స్ అనే 4 కేటగిరీ లుగా విభజించింది. అయితే టాప్ అఛీవర్స్ జాబితాలో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హరి యాణా, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలు ఉన్నాయి. బిజినెస్ రిఫారŠమ్స్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా 301 అంశాల్లో సంస్కరణలు చేపట్టాలని డీపీఐఐటీ ఆదే శించింది. అం దులో భాగంగా తెలంగాణ 301 అంశాల్లోనూ సంస్క రణలు చేపట్టి నూటికి నూరు శాతం మార్కులు సాధించింది. అయితే గతంలో ర్యాంకుల ప్రకట నలో ఎదురైన అస్పష్టతను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది కేటగిరీ లుగా వెల్లడించింది. 301 సంస్కరణల్లో కొన్ని రాష్ట్రాలకు ఒకటి, రెండు అంశాల్లోనూ అగ్రస్థానం దక్కిం దని, తెలంగాణ మాత్రం అనేక నిబంధనల్లో అగ్రస్థానం దక్కించు కుందని పరిశ్రమల శాఖ వర్గాలు వెల్లడించాయి. 2015లో ఈవోడీబీ ర్యాంకుల విధానం ప్రారంభంకాగా తొలిసారి 13వ స్థానంలో నిలిచిన తెలంగాణ 2017లో రెండు, 2019లో మూడోస్థానంలో నిలిచింది. కాగా, ఈవోడీబీ ర్యాంకింగ్‌లో తెలంగాణకు టాప్ అఛీవర్స్ జాబితాలో చోటుదక్కడంపై పరిశ్రమల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో సులభతర వాణిజ్యంతో ప్రశాంత వాణిజ్యం కూడా సాధ్యమని ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ టాప్.. వరుసగా రెండవ ఏడాది పూర్తిగా సంస్కరణల ప్రయో జనాలు పొందిన వ్యాపారవేత్తల నుంచి తీసుకున్న అభిప్రాయాల ఆధారంగా ఈవోడీబీ ర్యాంకుల్లో ఏపీ అగ్రస్థానాన్ని సాధించింది. దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిశ్రమలకు అందిస్తున్న తోడ్పాటుకు ప్రపంచస్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. సర్వేలో 92 శాతం మార్కులు దాటిన ఏడు రాష్ట్రాలను టాప్ అచీవర్స్‌గా ప్రకటించగా, ఇందులో ఆంధ్రప్రదేశ్ 97.89%తో మొదటిస్థానంలో నిలిచింది. -
మహిళా సీఈవోలకు జీతం పెరిగింది కానీ..
న్యూయార్క్: ఎస్అండ్పీ 500 కంపెనీలను నడిపించే మహిళా సారథులకు (సీఈవోలు) 2021లో వేతన ప్యాకేజీలు గణనీయంగా పెరిగాయని ఈక్విలర్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఆర్థిక వ్యవస్థ రికవరీ అవడానికితోడు, స్టాక్ ధరలు, లాభాలు పెరగడం ఇందుకు అనుకూలించినట్టు తెలిపింది. మహిళా సీఈవోలకు మధ్యస్థ వేతన చెల్లింపులు 26 శాతం వృద్ధితో 16 మిలియన్ డాలర్లకు (రూ.123 కోట్లు) చేరుకున్నట్టు చెప్పింది. ఇప్పటికీ కార్పొరేట్ ర్యాంకులు, వేతన చెల్లింపుల్లో స్త్రీ, పురుషల మధ్య వ్యత్యాసం ఉందని.. లింగ వైవిధ్యం కోసం మరింత కృషి చేయాల్సి ఉందని ఈ నివేదిక పేర్కొంది. ‘‘మహిళా సీఈవోల వేతనం పెరగడం మంచిది. కానీ, ఇంకా ఎంతో చేయాల్సింది ఉంది. అయితే, ఎక్కువ ఆర్జన పొందుతున్న మహిళా సీఈవోలవైపు చూడడం కాకుండా.. వేతన అంతరాన్ని సునిశితంగా చూడాల్సి ఉంది’’అని కార్న్ ఫెర్నీ సీఈవో జేన్ స్టెవెన్సన్ పేర్కొన్నారు. ఎస్అండ్పీ 500 కంపెనీల్లో.. 340 సీఈవోలను ఈ సర్వే కోసం పరిగణనలోకి తీసుకున్నారు. ఎస్అండ్పీ 500 కంపెనీల లాభాలు 50 శాతం పెరిగాయి. సూచీలు 27 శాతం వరకు లాభపడ్డాయి. ఈ పనితీరుతోనే ఎక్కువ మంది సీఈవోల పారితోషికం ముడిపెట్టి ఉండడం వల్ల.. ఏళ్ల పాటు మోస్తరు వృద్ధికే పరిమితమైన వేతన ప్యాకేజీలు ఒక్కసారిగా పెరగడానికి దోహదపడింది. మహిళా సీఈవోలకు ప్యాకేజీ పెంపు 26.4 శాతంగా ఉండి 15.8 మిలియన్ డాలర్లకు చేరుకోగా.. ఇదే కాలంలో పురుష సీఈవోలకు పెంపు 17.7 శాతంగా ఉండి 14.4 మిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. -
ఏపీ నీట్ ర్యాంక్‌లు విడుదల
సాక్షి, అమరావతి: వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయస్థాయి అర్హత పరీక్ష నీట్ యూజీ–2021 రాష్ట్రస్థాయి ర్యాంకులను ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం మంగళవారం విడుదల చేసింది. విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్లో జాబితాను ఉంచింది. ఇది సమాచారం నిమిత్తమేనని, కౌన్సెలింగ్‌కు అభ్యర్థులు దరఖాస్తు చేసిన తర్వాతే మెరిట్ జాబితా విడుదల చేస్తామని వీసీ డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. విశ్వవిద్యాలయం పరిధిలోని వైద్య కళాశాలల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు మొదట రిజిస్ట్రేషన్ ప్రక్రియకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేసి కౌన్సెలింగ్ చేపడతారు. ఈ ప్రక్రియ జరగడానికి మరో రెండు వారాలు పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 11 మందికి 100లోపు ర్యాంక్‌లు రాష్ట్రం నుంచి నీట్‌కు హాజరైన వారిలో 39,388 మంది అర్హత సాధించారు. రాష్ట్రంలో తొలి వందలోపు ఆల్ ఇండియా ర్యాంక్‌లను 11 మంది సాధించారు. వీరిలో ఎనిమిది మంది జనరల్ అభ్యర్థులు, ముగ్గురు ఓబీసీ కేటగిరీకి చెందిన వారు ఉన్నారు. ఆలిండియా ర్యాంకులు 100లోపు సాధించిన వారు.. విద్యార్థి ర్యాంకు చందం విష్ణు వివేక్ 13 గొర్రిపాటి రుషిల్ 15 పి. వెంకట కౌశిక్ రెడ్డి 27 కేతంరెడ్డి గోíపీచంద్ రెడ్డి 36 టి. సత్యకేశవ్ 41 పరుచూరి వెంకటసాయి అమిత్ 47 పి. కార్తీక్ 53 ఎస్. వెంకటకల్పజ్ 58 కె. చైతన్య కృష్ణ 71 పి. సాకేత్ 84 వి. నిఖిత 89 కటాఫ్ మార్కులు ఇలా.. జనరల్ కేటగిరీ 138 జనరల్ పీడబ్ల్యూడీ కేటగిరీ 122 బీసీ, ఎస్సీ, ఎస్టీ (పీడబ్ల్యూడీతో కలిపి) 108 -
ఎఫ్‌డీఐల రాకలో 62 శాతం వృద్ధి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి నాలుగు నెలల్లో దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) రాకలో 62 శాతం వృద్ధి నమోదైనట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలంలో 16.92 బిలియన్ డాలర్ల మేర ఎఫ్‌డీఐలు రాగా, ఈ ఏడాది 27.37 బిలియన్ డాలర్ల మేర వచ్చాయి. ఎఫ్‌డీఐ ఈక్విటీల రాక 112 శాతం పెరిగింది. గత ఏడాది ఇదే కాలానికి 9.61 బిలియన్ డాలర్లు రాగా, ఈ ఏడాది 20.42 బిలియన్ డాలర్ల మేర వచ్చాయి. ఎఫ్‌డీఐ ఈక్విటీల రాకలో ఆటోమొబైల్ పరిశ్రమ 23 శాతంతో అగ్రస్థానంలో నిలవగా, కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ పరిశ్రమ 18 శాతంతో ద్వితీయ స్థానంలో నిలిచింది. సేవారంగం 10 శాతంతో తృతీయ స్థానంలో నిలిచింది. ఆటోమొబైల్ పరిశ్రమలోకి వచ్చిన మొత్తం ఎఫ్‌డీఐ ఈక్విటీలో 87 శాతం కర్ణాటక నుంచే నమోదైంది. తొలి నాలుగు నెలల్లో మొత్తం ఎఫ్‌డీఐ ఈక్విటీల్లో కర్ణాటకకు 45 శాతం, మహారాష్ట్రకు 23 శాతం, ఢిల్లీకి 12 శాతం వచ్చాయి. ఎఫ్‌డీఐ ఈక్విటీల రాకలో టాప్–10 రాష్ట్రాలు.. మహారాష్ట్ర (27 శాతం), గుజరాత్ (25), కర్ణాటక (20), ఢిల్లీ (11), తమిళనాడు (4), హరియాణా (3), జార్ఖండ్ (3), తెలంగాణ (2), పంజాబ్ (1), పశ్చిమ బెంగాల్ (1శాతం)తో తొలి పది స్థానాల్లో ఉన్నాయి. 8వ స్థానంలో నిలిచిన తెలంగాణకు తొలి మూడు నెలల్లో రూ. 4,226 కోట్ల మేర ఎఫ్‌డీఐలు వచ్చాయి. 2019 అక్టోబర్ నుంచి 2021 జూన్ మధ్య మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు, హర్యానా, జార్ఖండ్, తెలంగాణ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, యూపీ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ ఎఫ్‌డీఐల రాకలో తొలి 15 స్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌కు ఈ కాలంలో రూ. 2,577 కోట్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సమకూరాయి. తెలంగాణకు రూ. 17,709 కోట్ల మేర ఎఫ్‌డీఐలు వచ్చాయి. చదవండి: చలో ఆఫీస్..! .. డెలాయిట్ సర్వేలో ఆసక్తికర అంశాల వెల్లడి -
సుస్థిర ఆర్థికాభివృద్ధి: టాప్-5 రాష్ట్రాల జాబితాలో ఏపీ
సాక్షి, న్యూఢిల్లీ, సాక్షి, అమరావతి: సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) సూచీలో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన పురోగతి సాధించి టాప్ –5 రాష్ట్రాల జాబితాలో నిలిచింది. 2018లో కేవలం 64 పాయింట్లను మాత్రమే సాధించిన ఏపీ తాజాగా 72 స్కోర్ పాయింట్లను పొందడం, అగ్రశ్రేణి కోవలో నిలవడం, పలు అంశాల్లో టాప్ స్కోర్లను దక్కించుకోవడం రాష్ట్రం సత్తాను, అభివృద్ధి పథంలో పరుగులను రుజువు చేస్తోంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో 75 శాతం స్కోర్‌తో కేరళ మొదటి స్థానంలో నిలవగా 74 శాతం స్కోర్‌తో హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. 72 శాతం స్కోర్‌తో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. మూడో విడత ఎస్డీజీ సూచీ నివేదికను నీతిఆయోగ్ గురువారం ఢిల్లీలో ఆవిష్కరించింది. ఆంధ్రప్రదేశ్‌లో పేదరిక నిర్మూలన, అసమానతలు తొలగింపు, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, సామాజిక భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నవరత్నాలు’ ఇతోధికంగా దోహదం చేస్తున్నాయని నీతి అయోగ్ ప్రశంసించింది. ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీ; డాష్ బోర్డ్ 2020–21 ః దశాబ్ద కాలపు కార్యాచరణలో భాగస్వామ్యాలు’ పేరుతో సూచీని నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ రాజీవ్‌కుమార్ ఆవిష్కరించారు. నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకేపాల్, సీఈవో అమితాబ్ కాంత్, సలహాదారు సంయుక్త సమద్దార్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. పేదరికం, ఆకలి లేని రాష్ట్రంగా.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు నవరత్నాల పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. నవరత్నాలు పేదరిక నిర్మూలనతో పాటు ఆహార భద్రతకు ఎంతో దోహదం చేస్తున్నాయని నీతి అయోగ్ ప్రశంసించింది. పేదరికం, ఆకలి లేని రాష్ట్రంగా అవతరించే దిశగా ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అడుగులు వేస్తోందని నివేదికలో పేర్కొంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మొదటిదైన పేదరిక నిర్మూలనలో ఆంధప్రదేశ్ 81 శాతం స్కోర్ సాధించి అగ్రగామి ఐదు రాష్ట్రాల సరసన నిలిచింది. ఆరోగ్యం, సంక్షేమంలో రాష్ట్రం 77 శాతం స్కోర్ సాధించింది. అగ్రవర్ణ పేదలకు కూడా సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం కల్పిస్తూ అసమానతలను రూపుమాపుతున్నారని నీతి అయోగ్ ప్రశంసించింది. పురుషులతో సమానంగా అవకాశాలు కల్పిస్తూ లింగ సమానత్వంలో రాష్ట్రం 58 శాతం స్కోర్‌తో అగ్రగామి ఐదు రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. అసమానతలు రూపుమాపడంలో 74 శాతం స్కోర్‌తో దూసుకెళ్తోంది. ఏపీలో 2020లో వృద్ధి కనిపించిన ఇండికేటర్లు ఆకలి లేని స్థాయి లక్ష్యంలోని ‘వ్యవసాయ రంగంలో స్థూల అదనపు విలువ’లో పెరుగుదల నమోదు చేసుకుంది. ఆరోగ్యం, సంక్షేమం ఇండికేటర్లో ప్రసూతి మరణాలు, శిశు మరణాల రేటు తగ్గుదల, హెచ్ఐవీ కేసుల సంఖ్య తగ్గుదల నమోదైంది. ప్రతి పది వేల జనాభాకు వైద్య సిబ్బంది పెరుగుదలలో వృద్ధి కనిపించింది. లింగ సమానత్వం కేటగిరీలో మహిళలపై నేరాల సంఖ్య ఇండికేటర్లో తగ్గుదల నమోదైంది. పురుషులతో సమానంగా మహిళలకు వేతనాలు ఇవ్వడం పెరిగింది. పరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం పరిధిలో గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత నీటి సరఫరా పెరిగింది. హత్యలు, వివిధ రకాల కేసుల సంఖ్య తగ్గింది. సరసమైన ధరకు నాణ్యమైన విద్యుత్‌లో అగ్రగామి.. 2019 డిసెంబరు 30న ఆవిష్కరించిన ఎస్డీజీ సూచీలో ఆంధ్రప్రదేశ్ 67 పాయింట్ల స్కోరుతో 3వ స్థానంలో నిలిచింది. అంతకుముందు ఏడాది 2018 మొదటి ఎస్డీజీ సూచీలో 64 పాయింట్ల స్కోరుతో నాలుగో స్థానంలో ఉంది. తాజాగా మూడో విడత సూచీలో చౌక, సురక్షిత ఇంధన శక్తిలో వందకు వంద పాయింట్లు సాధించి టాప్‌లో నిలవడం గమనార్హం. సరసమైన ధరకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో అగ్రగామిగా నిలిచింది. అత్యున్నత ప్రమాణాలతో విద్య.. నాణ్యమైన వైద్యం అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యుత్తమంగా పనిచేస్తోందని నీతి అయోగ్ వెల్లడించింది. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు ద్వారా పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించి కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దారు. ఆరోగ్యశ్రీతోపాటు ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేయడం, వైద్య సిబ్బందిని భారీ ఎత్తున నియమించడం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని.. కరోనాను సమర్థంగా ఎదుర్కోవడమే అందుకు తార్కాణమని పేర్కొంది. శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తూ.. సుపరిపాలన ద్వారా ప్రజలకు సామాజిక భద్రత చేకూర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన పనితీరు కనబర్చుతోందని విశ్లేషించింది. 2030 నాటికి సుస్థిరాభివృద్ది లక్ష్యాల సాధన వైపుగా ఏపీ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోందని పేర్కొంది. చదవండి: దేశ చరిత్రలోనే ప్రథమం.. కొత్త చరిత్రకు సీఎం జగన్ శ్రీకారం సీఎం జగన్‌కు ప్రవాసాంధ్రుల కృతజ్ఞతలు -
రాష్ట్రస్థాయి నీట్ ర్యాంకులు విడుదల
సాక్షి, హైదరాబాద్: నీట్ రాష్ట్రస్థాయి ర్యాంకులు విడుదలయ్యాయి. నీట్లో అర్హత సాధించిన మొదటి 50 స్థానాల్లో నిలిచిన వారి పేర్లను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం విడుదల చేసింది. రెండు వారాల కింద జాతీయస్థాయిలో నీట్ ర్యాంకులు విడుదల చేసిన విషయం తెలిసిందే. జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన తుమ్మల స్నికిత రాష్ట్రంలో మొదటి స్థానం లో నిలిచింది. రాష్ట్ర ర్యాంకుల్లో మొదటి 10 స్థానాల్లో ముగ్గురు బాలికలు ఉండగా, మొదటి 50 స్థానాల్లో 29 మంది బాలురు ఉన్నారు. బాలికలు మాత్రం 21 మంది ఉన్నారు. రేపే నోటిఫికేషన్..: సాధారణంగా రాష్ట్ర స్థాయి ప్రాథమిక ర్యాంకులు వెల్లడించిన అనంతరం దరఖాస్తులు ఆహా్వనించి, అందులో నుంచి తుది ర్యాంకులు ప్రకటిస్తారు. ఈసారి ఇప్పటికే నీట్ నిర్వహణలో జాప్యం వల్ల వేగంగా ప్రవేశాలు నిర్వహించాల్సి వస్తోంది. దీంతో ర్యాంకులతో పాటు ప్రవేశ ప్రకటన కూడా ఒకేసారి వెలువరించనున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. వచ్చే నెల 1న ఆన్లైన్లో ఎంబీబీఎస్, బీడీఎస్ మెడికల్ ప్రవేశాలకు ప్రకటన నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఈసారి ఆన్లైన్లోనే సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టే అవకాశముంది. ఒకవేళ నేరుగా సరి్టఫికెట్లు పరిశీలించాల్సి వస్తే పెద్ద సంఖ్యలో కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రక్రియకు సుమారు 10 రోజులు పట్టే అవకాశం ఉండటంతో వచ్చే నెల 20న తొలి విడత మెడికల్ సీట్లు కేటాయించనున్నారు. -
ఐఐటీ–మద్రాస్ నెంబర్ 1
సాక్షి, న్యూఢిల్లీః 2020 సంవత్సరానికి గాను ఉన్నత విద్యా సంస్థలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంహెచ్ఆర్డీ) ర్యాంకులను ప్రకటించింది. ఇండియా ర్యాంకింగ్స్–2020ను ఆ శాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ నిశాంక్ గురువారం ఇక్కడ విడుదల చేశారు. మొత్తం పది కేటగిరీల్లో ఈ ర్యాంకులను ప్రకటించారు. దేశంలో ఉన్నత విద్యా సంస్థలకు ర్యాంకులు ప్రకటించడం ఇది వరుసగా ఐదోసారి. కొత్తగా ఈసారి ర్యాంకుల కేటగిరీల్లో దంత వైద్య విభాగం కూడా చేర్చారు. ఓవరాల్‌గా, అలాగే ఇంజినీరింగ్ విభాగంలో ఐఐటీ–మద్రాస్ తొలి స్థానంలో నిలిచింది. ఈ కేటగిరీలో ఐఐటీ–హైదరాబాద్‌కు ఎనిమిదో స్థానం దక్కింది. యూనివర్శిటీల విభాగంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు తొలిస్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ ఆరోస్థానంలో నిలిచింది. మేనేజ్మెంట్ కేటగిరీలో ఐఐఎం–అహ్మదాబద్, వైద్య విభాగంలో ఎయిమ్స్ తొలిస్థానంలో నిలిచాయి. కళాశాలల విభాగంలో మిరండా కాలే జ్ వరసగా మూడో ఏడాది తొలిస్థానంలో నిలిచింది. లా విభాగంలో హైదరాబాద్ నల్సార్ మూడో ర్యాంకు సాధించగా, ఫార్మసీ కేటగిరీలో హైదరాబాద్ నైపర్ ఐదో స్థానంలో నిలిచింది. (అత్యధిక కేసులున్నా అదుపులోనే వైరస్!) కార్యక్రమంలో కేంద్ర మంత్రి రమేష్ పొఖ్రియాల్ మాట్లాడుతూ ర్యాంకులు ప్రకటించడం వల్ల విద్యార్థులకు విద్యా సంస్థల ఎంపిక సులువవుతుందని అభిప్రాయపడ్డారు. అలాగే ఉన్నత విద్యా సంస్థల మధ్య పోటీతత్వం పెరుగుతుందని వివరించారు. టీచింగ్, లెర్నింగ్ అండ్ రీసోర్సెస్(టీఎల్ఆర్), రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్(ఆర్పీ), గ్రాడ్యుయేషన్ ఔట్‌కమ్స్(జీవో), ఔట్రీచ్ అండ్ ఇంక్లూజివిటీ(ఓఐ), పర్సెప్షన్(పీఆర్) వంటి పారామీటర్ల ఆధారంగా మార్కులు కేటాయించి ర్యాంకులు ప్రకటించారు. మొత్తం 3771 విద్యా సంస్థలు ఓవరాల్ ర్యాంకుల కోసం ప్రతిపాదనలు పంపాయి. అలాగే కేటగిరీ వారీగా కూడా ప్రతిపాదనలు పంపాయి. 294 విశ్వవిద్యాలయాలు, 1071 ఇంజినీరింగ్ ఇనిస్టిట్యూషన్స్, 630 మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూషన్స్, 334 ఫార్మసీ ఇనిస్టిట్యూషన్స్, 97 న్యాయ విద్యా సంస్తలు, 118 వైద్య విద్య సంస్థలు, 48 ఆర్కిటెక్చర్ సంస్థలు, 1,659 డిగ్రీ కళాశాలలు ర్యాంకుల కోసం ప్రతిపాదనలు పంపాయి. 100 ఓవరాల్ ర్యాంకులు, ఇంజినీరింగ్ విభాగంలో 200 ర్యాంకులు, యూనివర్శిటీలు, కళాశాలల విభాగంలో 100 చొప్పున, మేనేజ్మెంట్, ఫార్మసీ విభాగాల్లో 75 చొప్పున, వైద్య విద్యలో 40 ర్యాంకులు, ఆర్కిటెక్చర్, న్యాయ విద్యలో 20 ర్యాంకులు, దంత వైద్య విద్యలో 30 ర్యాంకులు ప్రకటించారు. (అందుబాటు ధరలో కరోనా టెస్టింగ్ కిట్) టాప్–10 ఇండియా ర్యాంకులు (ఓవరాల్ కేటగిరీ) ఇనిస్టిట్యూట్ పేరు ర్యాంకు ఐఐటీ–మద్రాస్ 1 ఐఐఎస్సీ–బెంగళూరు 2 ఐఐటీ–ఢిల్లీ 3 ఐఐటీ–బాంబే 4 ఐఐటీ–ఖరగ్‌పూర్ 5 ఐఐటీ–కాన్పూర్ 6 ఐఐటీ–గౌహతి 7 జేఎన్‌యూ–ఢిల్లీ 8 ఐఐటీ–రూర్కీ 9 బనారస్ హిందూ వర్శిటీ 10 యూనివర్శిటీ కేటగిరీలో టాప్–10 ర్యాంకులు ఇనిస్టిట్యూట్ ర్యాంకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్–బెంగళూరు 1 జేఎన్‌యూ, న్యూఢిల్లీ 2 బనారస్ హిందూ యూనివర్శిటీ, వారణాసి 3 అమృత విశ్వ విద్యాపీఠం, కోయంబత్తూరు 4 జాదవ్‌పూర్ యూనివర్శిటీ, కోల్‌కతా 5 యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ 6 కలకత్తా యూనివర్శిటీ, కోల్‌కతా 7 మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, మణిపాల్ 8 సావిత్రిబాయి ఫూలే పూణే యూనివర్శిటీ, పూణే 9 జామియామిలియాఇస్లామియా, న్యూఢిల్లీ 10 ఇంజినీరింగ్ కేటగిరీ ఇనిస్టిట్యూట్ ర్యాంకు ఐఐటీ–మద్రాస్ 1 ఐఐటీ–ఢిల్లీ 2 ఐఐటీ–బాంబే 3 ఐఐటీ–కాన్పూర్ 4 ఐఐటీ–ఖరగ్‌పూర్ 5 ఐఐటీ–రూర్కీ 6 ఐఐటీ–గౌహతి 7 ఐఐటీ–హైదరాబాద్ 8 ఐఐటీ–తిరుచిరాపల్లి 9 ఐఐటీ–ఇండోర్ 10 మేనేజ్మెంట్ కేటగిరీ ఇనిస్టిట్యూట్ ర్యాంకు ఐఐఎం–అహ్మదాబాద్ 1 ఐఐఎం–బెంగళూరు 2 ఐఐఎం–కలకత్తా 3 ఐఐఎం–లక్నో 4 ఐఐటీ–ఖరగ్‌పూర్ 5 ఐఐఎం–కోజికోడ్ 6 ఐఐఎం–ఇండోర్ 7 ఐఐటీ–ఢిల్లీ 8 ఎక్స్ఎల్ఆర్ఐ 9 మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్(గురుగ్రామ్) 10 కళాశాలల కేటగిరీ ఇనిస్టిట్యూట్ ర్యాంకు మిరండా హౌజ్ 1 లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ విమెన్, ఢిల్లీ 2 హిందూ కాలేజ్, ఢిల్లీ 3 సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్, ఢిల్లీ 4 ప్రెసిడెన్సీ కాలేజ్, చెన్నై 5 లయోలా కాలేజ్, చెన్నై 6 సెయింట్ జేవియర్స్ కాలేజ్, కోల్‌కతా 7 రామకృష్ణ మిషన్ విద్యామందిర, హౌరా 8 హన్స్‌రాజ్ కాలేజ్, ఢిల్లీ 9 పీఎస్జీఆర్ కృష్ణమ్మల్ ఫర్ విమెన్, కోయంబత్తూర్ 10 ఫార్మసీ కేటగిరీ ఇనిస్టిట్యూట్ ర్యాంకు జామియా హమ్దర్ద్, న్యూఢిల్లీ 1 పంజాబ్ యూనివర్శిటీ, చంఢీగఢ్ 2 నైపర్, మోహలీ 3 ఐసీటీ, ముంబై 4 నైపర్, హైదరాబాద్ 5 బిట్స్, పిలానీ 6 మణిపాల్ కాలేజ్ ఆఫ్ ఫార్మా సైన్సైస్, ఉడిపి 7 నైపర్, అహ్మదాబాద్ 8 జేఎస్ఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఊటీ 9 జేఎస్ఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, మైసూర్ 10 మెడికల్ కేటగిరీ ఇనిస్టిట్యూట్ ర్యాంకు ఎయిమ్స్, న్యూఢిల్లీ 1 పీజీఐఎంఈఆర్, చంఢీగఢ్ 2 క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, వెల్లూర్ 3 ఆర్కిటెక్చర్ కేటగిరీ ఇనిస్టిట్యూట్ ర్యాంకు ఐఐటీ, ఖరగ్‌పూర్ 1 ఐఐటీ, రూర్కీ 2 ఎన్ఐటీ, కాలికట్ 3 న్యాయ విద్య కేటగిరీ ఇనిస్టిట్యూట్ ర్యాంకు నేషనల్ లా స్కూల్, బెంగళూరు 1 నేషనల్ లా యూనివర్శిటీ, న్యూఢిల్లీ 2 నల్సార్ యూనివర్శిటీ ఆఫ్ లా, హైదరాబాద్ 3 దంత విద్య కేటగిరీ ఇనిస్టిట్యూట్ ర్యాంకు మౌలానా ఆజాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, ఢిల్లీ 1 మణిపాల్ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, ఉడిపి 2 డాక్టర్ డీవై పాటిల్ విద్యాపీఠం, పూణే 3 -
ప్రపంచ లగ్జరీ మార్కెట్లో ఢిల్లీకి 9వ స్థానం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నివాస మార్కెట్లో మన దేశం నుంచి మూడు నగరాలు చోటు దక్కించుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ 9వ స్థానంలో నిలవగా.. బెంగళూరు 20, ముంబై 28వ స్థానంలో నిలిచాయి. గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ‘ప్రైమ్ గ్లోబల్ సిటీ ఇండెక్స్’ స్థానిక మార్కెట్లో రియల్టీ ధరల ఆధారంగా ర్యాంక్‌లను కేటాయిస్తుంది. 2019 రెండో త్రైమాసికం నివేదిక ప్రకారం లగ్జరీ రెసిడెన్షియల్ మార్కెట్లో మొదటి స్థానంలో రష్యా రాజధాని మాస్కో నిలిచింది. గత ఏడాది కాలంలో ఇక్కడ గృహాల ధరలు 11.1 శాతం వృద్ధి చెందాయి. ‘‘మన దేశంలో ప్రభుత్వ విధాన నిర్ణయాలు అఫర్డబుల్, మధ్య స్థాయి గృహాల అభివృద్ధికే పరిమితమయ్యాయి. దీంతో లగ్జరీ ప్రాపర్టీలు సంఘటిత కంపెనీలు, నిధులు సమృద్ధిగా ఉన్న కంపెనీలు మాత్రమే చేస్తున్నాయి’’ అని నైట్‌ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశీర్ బైజాల్ వ్యాఖ్యానించారు. -
‘అస్సలు ఊహించలేదు’
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికై ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జేఈఈ పరీక్ష ఫలితాలను ఐఐటీ రూర్కీ విడుదల చేసింది. ఫోన్ నంబర్ రిజిస్టర్ చేసుకున్నఅభ్యర్థులందరికి ఎస్ఎంఎస్ ద్వారా ఫలితాలు పంపనున్నట్లు వెల్లడించింది. శుక్రవారం విడుదలైన ఈ ఫలితాల్లో మహారాష్ట్ర విద్యార్థి ఆలిండియా టాపర్‌గా నిలిచాడు. బల్లార్పూర్కి చెందిన కార్తికేయ గుప్తా 372 మార్కులకు గానూ 346 మార్కులు సాధించి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక అలహాబాద్‌కి చెందిన హిమాన్షు సింగ్ రెండో స్థానంలో నిలవగా.. ఢిల్లీకి చెందిన ఈర్చిత్ బుబ్నా మూడో ర్యాంకు సాధించాడు. అస్సలు ఊహించలేదు.. ప్రతిష్టాత్మక పరీక్షలో టాపర్‌గా నిలవడం పట్ల కార్తికేయ హర్షం వ్యక్తం చేశాడు. ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్‌లో సీట్ లభిస్తుందని అనుకున్నాను గానీ.. ఏకంగా మొదటి ర్యాంకు వస్తుందని ఊహించలేదన్నాడు. రోజుకు 6 నుంచి 7 గంటలు పరీక్ష కోసం సన్నద్ధమైనట్లు తెలిపాడు. సబ్జెక్టు నేర్చుకోవడాన్ని పూర్తిగా ఆస్వాదించినపుడే ఉత్తమైన ఫలితాలు పొందగలమన్నాడు. చదువుకునే సమయంలో సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉన్నానని పేర్కొన్నాడు. తన ప్రిపరేషన్లో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు చంద్రేశ్ గుప్తా, పూనం కీలక పాత్ర పోషించారని వెల్లడించాడు. వారి సహకారంతోనే ఇంటర్మీడియట్లో 93.7 శాతం మార్కులు సాధించానని పేర్కొన్నాడు. కాగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మే 19న జరగాల్సిన జేఈఈ పరీక్షను.. మే 27న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ పరీక్ష ఫలితాలను jeeadv.ac.in. తెలుసుకోవచ్చు. -
ర్యాంకు ఘనం.. నైపుణ్యం శూన్యం !
గుంటూరు నగరంలోని కొరిటెపాడుకు చెందిన నరేష్ పదవ తరగతి చదువుతున్నాడు. చదువులో ముందుండే నరేష్‌కి బయట జరిగే విషయాలపై అవగాహన శూన్యం. తనకు ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను కూడా ఎదుర్కోలేక బేలగా తయారవుతాడు.. విషయం గ్రహించిన తల్లిదండ్రులు ఇటీవల మానసిక నిపుణుల వద్దకు తీసుకు వచ్చారు. అతనికి కౌన్సెలింగ్ చేయగా, తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నట్లు నిర్ధారించారు. లబ్బీపేట(విజయవాడ తూర్పు): నేటి విద్యా విధానం కేవలం మార్కులు, ర్యాంకులు సాధించడమే లక్ష్యంగా కొనసాగుతోంది. విద్యార్థుల్లో నైతిక విలువలు, సమస్య సాధన, ఇంటెలిజెన్స్ వృద్ధి చెందకపోవడంతో జీవితంలో సక్సెస్కాలేక చతికిల పడుతున్నారు. నేటి కాలంలో సక్సెస్ సాధించాలంటే సిలబస్‌తో పాటు, నైపుణ్యం ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవలి కాలంలో వర్క్‌షాపులు, సదస్సులు నిర్వహిస్తూ వివరిస్తున్నారు. విలువలతో కూడిన బోధన అవసరం గురువు బోధన చేస్తే సోధించి సాధించే మనస్తత్వాన్ని అలవర్చుకున్నప్పుడే విద్యార్థి పరిపూర్ణవంతుడుగా ఎదుగుతాడు. పరిశోధనాత్మకంగా ఆలోచిస్తూ దేనినైనా సాధించాలనే గుణాలను కలిగి వుంటారు. కానీ నేడు విద్యార్థులతో సిలబస్‌నే బట్టీ పట్టిస్తూ ర్యాంకులు.. మార్కులు సాధించేలా తయారు చేస్తున్నారు. వారిలో ఎలాంటి స్కిల్స్ పెంపొందించకపోవడంతో కేవలం జిరాక్స్ మిషన్లు వలే మారుతున్నారనేది విద్యావేత్తలు, నిపుణులు ఆవేదన. విలువలతో కూడిన విద్యాబోధన ద్వారానే సంపూర్ణమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఎదుగుతాడని, సృజనాత్మకతను పెంపొందించుకుంటారని నిపుణులు చెపుతున్నారు. జీవితంలో విజయం సాధించలేక.. నేటి విద్యార్థుల్లో కమ్యునికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్స్కిల్స్, మోరల్ వాల్యూస్ పెంపొందడం లేదని చెబుతున్నారు. దీంతో సిలబస్‌ను బట్టీపట్టి ఐఐటీలో ర్యాంకు సాధించిన విద్యార్థి సైతం, అక్కడ రాణించలేక విఫలం అవుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. అందుకు అవసరమైన స్కిల్స్ స్కూల్స్ స్థాయినుంచి పెంపొందించాల్సిన అవసరం ఉంది. పాఠశాలలో విద్యార్థి పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసం పెంపొందించేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెపుతున్నారు. ఇంజినీరింగు పూర్తి చేసిన విద్యార్థులు పరిశ్రమలకు అవసరమైన స్కిల్స్ లేక ఉద్యోగావకాశాలు పొందలేక పోతున్నట్లు పారిశ్రామిక వర్గాలు చెపుతున్నాయి. మానవ సంబంధాలు కోల్పోతున్న వైనం.. విలువలనేవి నేర్చుకుంటే వచ్చేవి కావు. గురువులు, తల్లిదండ్రుల ద్వారా సమాజ స్థితిగతులను తెలుసుకుని విలువలను పెంపొందించుకోవాలి. ప్రస్తుతం తల్లిదండ్రులు బిజీ లైఫ్‌తో పిల్లలతో గడిపే సమయం లేక పోవడం, స్కూల్స్ సిలబస్‌కే పరిమితం కావడంతో నైతిక విలువలు దెబ్బతింటున్నాయి. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడంలో మోరల్ వాల్యూస్, సోషల్ రిలేషన్స్ ఎంతో కీలకమని నిపుణులు చెపుతున్నారు. ఇదే విషయమై ఇటీవల కాలంలో పలు వర్క్‌షాపులు నిర్వహిస్తున్నారు. సమస్యలను పరిష్కరించుకోలేక.. నిత్యం పర్యవేక్షణతో కూడిన చదువులతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న చిన్నారులు చిన్న సమస్య ఎదురైన పరిష్కరించుకోలేక పోతున్నారు. దీంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారిలో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెంపొందిస్తే, ఒత్తిడిని అధిగమిస్తారనేది నిపుణుల వాదన.. జీవితంలో ఎదురయ్యే సమస్యలను సాధించడానికి కావాల్సిన మానసిక శక్తిని విద్యార్థుల్లో వృద్ధి చేయాల్సిన బాధ్యత స్కూల్స్‌పై ఉంది. విజయవాడ నగరంలోని గవర్నర్‌పేటకు చెందిన రమేష్ చదువులో చురుగ్గా ఉంటాడు. ఎప్పుడూ ఫస్ట్ ర్యాంకులే వస్తాయి. కానీ నలుగురితో కలిసి మాట్లాడలేక పోవడం, మానవ సంబంధాలపై అంతగా ఆసక్తి చూపకపోవడం.. ఒంటరితనంలో ఆనందం వెదుక్కోవడం అతనిలో కనిపిస్తున్న లక్షణాలు.. ఆఖరికి బంధువులను ఏమని పిలవాలో కూడా తెలియని పరిస్థితికి దిగజారిపోయాడు.. దీంతో తల్లిదండ్రులు మానసిక వైద్యులను ఆశ్రయించారు. ఇలాంటి చిన్నారులను ఇటీవల కాలంలో మానసిక వైద్యుల వద్దకు తీసుకొస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. స్కిల్స్ పెంపొందించాలి నేటి విద్యార్థులు ర్యాంకులు, మార్కులు సాధిస్తున్నారే కానీ, జీవితంలో సక్సెస్ కాలేక పోతున్నారు. అందుకు వారికి అవసరమైన స్కిల్స్ పెంపొందించక పోవడమే కారణం. ప్రతి విద్యార్థిలో నైతిక విలువలు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, సోషల్ రిలేషన్స్ పెరిగేలా చూడాల్సిన బాధ్యత స్కూల్స్‌పై వుంది. ఒక విద్యార్థిలో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించి పరిపూర్ణ వంతుగా తీర్చిదిద్దినప్పుడే జీవితంలో సక్సెస్‌గా రాణించగలుగుతాడు. – డాక్టర్ గర్రే శంకర్రావు,మానసిక విశ్లేషకులు -
ర్యాంకుల గిరిపుత్రుడు
జన్నారం (ఖానాపూర్): ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు పరీక్షల్లో ర్యాంకులు పొంది పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడు ఈ గిరిపుత్రుడు. నీట్లో ఎస్టీ కేటగిరీలో జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు సాధించిన ఇతను ఇప్పుడు జిప్మర్లో ఎస్టీ కేటగిరీలో ఆల్ ఇండియా మొదటి ర్యాంకు ౖకైవసం చేసుకుని తన సత్తా చాటాడు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ధర్మారం రూప్‌నాయక్ తండాకు చెందిన లావుడ్యా హరిరాం, హారిక దంపతుల కుమారుడు హర్షవర్దన్. శుక్రవారం విడుదలైన జిప్మర్ ‡(జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్టు గ్రాడ్యుయేషన్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) ప్రవేశ పరీక్షలో ఎస్టీ కేటగిరీలో ఆల్ ఇండియా మొదటి ర్యాంకు సాధించాడు. చురుకైన విద్యార్థి హర్షవర్దన్ మొదటి నుంచి చదువులో చురుకైన విద్యార్థి. పదో తరగతిలో 10 జీపీఏ, ఇంటర్ బైపీసీలో 986 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంకు సాధిం చాడు. ఇటీవల కేవీపీవై (కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన) 2018 పరీక్షలో అఖిల భారత స్థాయి లో 35వ ర్యాంకు సాధించాడు. హర్షవర్దన్ అక్క హరిప్రియ జైపూర్ నిట్ (జాతీయ విజ్ఞాన సంస్థ)లో ఈసీఈ బ్రాంచిలో ఇంజనీరింగ్ కోర్సు చేస్తూ ఎయిర్‌పోర్టు అథారిటీలో ఇంటర్న్‌షిప్ చేస్తోంది. తండ్రి స్ఫూర్తితో క్రీడల్లోనూ.. హర్షవర్దన్ క్రీడల్లోనూ మంచి ప్రావీణ్యం కనబరుస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. తండ్రి లావుడ్యా హరిరాం గురుకుల కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్. ప్రస్తుతం ఆయన పీహెచ్డీ చేస్తున్నారు. తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. మారుమూల గ్రామంలో పుట్టి ఉన్నత చదువుల్లో ప్రతిభ కనబరుస్తున్న సరస్వతీ పుత్రుడు హర్షవర్దన్ ఇటీవలే ఎయిమ్స్ ఎంట్రన్స్ కూడా రాశాడు. అందులోనూ మంచి ర్యాంకు సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. -
నీట్లో మనోళ్ల సత్తా
సాక్షి, హైదరాబాద్, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వైద్యవిద్య డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ‘జాతీయ అర్హత ప్రవేశపరీక్ష (నీట్)’ ఫలితాలలో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో తెలంగాణ విద్యార్థి రోహన్ పురోహిత్ 690 మార్కులతో రెండో ర్యాంకు, వరుణ్ ముప్పిడి 685 మార్కులతో 6వ ర్యాంకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంకడాల అనిరు«ధ్‌బాబు 680 మార్కు లతో 8వ ర్యాంకు సాధించారు. టాప్–50లో తెలంగాణ విద్యార్థులు ముగ్గురు, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఐదుగురికి చోటు లభించడం గమ నార్హం. మొత్తంగా జాతీయ స్థాయిలో బిహార్ విద్యార్థిని కల్పనాకుమారి 691 మార్కులతో ఒకటో ర్యాంకు సాధించింది. ఢిల్లీకి చెందిన హిమాన్షు శర్మ 690 మార్కులతో రెండో స్థానంలో, ఢిల్లీకే చెందిన ఆరోశ్ ధమిజ, రాజస్థాన్‌కు చెందిన ప్రిన్స్ చౌదరిలు 686 మార్కులతో మూడో ర్యాంకు సాధించారు. తెలంగాణ, ఏపీ నుంచి 66,044 మంది.. జాతీయ స్థాయిలో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ డిగ్రీ కోర్సుల ప్రవేశాల కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) మే 6న నీట్ పరీక్షను నిర్వహించింది. దేశవ్యాప్తంగా 13.36 లక్షల మంది నీట్‌కు దరఖాస్తు చేసుకోగా.. 12,69,922 మంది పరీక్ష రాశారు. ఇందులో 7,14,562 మంది ఉత్తీర్ణత సాధించారు. పాసైన వారిలో 3,12,399 మంది బాలురు, 4,02,162 మంది బాలికలు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. ఉత్తీర్ణుల్లో తెలుగు రాష్ట్రాల వారు 66,044 మంది ఉన్నారు. జూలైలో నోటిఫికేషన్ నీట్ ర్యాంకుల ఆధారంగా ఆయా రాష్ట్రాల్లోని ఆరోగ్య విశ్వవిద్యాలయాలు ప్రత్యేక మెరిట్ జాబితాలను రూపొందించుకుని.. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ సీట్లను భర్తీ చేసుకుంటాయి. ఈ మేరకు రాష్ట్రంలో జూలైలో వైద్య విద్య డిగ్రీ కోర్సుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది. 2018–19 విద్యా సంవత్సరానికిగాను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో కలిపి 3,500 ఎంబీబీఎస్, 1,140 బీడీఎస్ సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి ఎనిమిది ప్రభుత్వ కాలేజీల్లో 1,250 సీట్లు, 16 ప్రైవేటు, మైనారిటీ కాలేజీల్లో కలిపి 2,250 సీట్లు ఉన్నాయి. ఇక ఏకైక ప్రభుత్వ బీడీఎస్ కాలేజీలో వంద సీట్లు, 12 ప్రైవేటు కాలేజీల్లో కలిపి 1,040 సీట్లు ఉన్నాయి. భారత వైద్య విద్యా మండలి (ఎంసీఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ సీట్ల భర్తీ ప్రక్రియ జరగనుంది. నీట్ రాసిన, ఉత్తీర్ణులైన వారి వివరాలు.. రాష్ట్రం హాజరు ఉత్తీర్ణత తెలంగాణ 44,877 30,912 ఆంధ్రప్రదేశ్ 49,253 35,732 దేశవ్యాప్తంగా 12,69,922 7,14,562 ‘నీట్’ఫలితం ఆపాలన్న పిటిషన్ తిరస్కరణ ‘నీట్’ప్రశ్నపత్రాలు లీకయ్యాయని.. అందువల్ల ఫలితాలను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. కొన్ని కేంద్రాల్లో ప్రశ్నపత్రాల కొరత ఏర్పడిందని, అందువల్ల పేపర్లు లీకైనట్టు స్పష్టమవుతోందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. అయితే ప్రశ్నపత్రాల పంపిణీలో తొలుత కొంత గందరగోళం నెలకొందని, వెంటనే దానిని పరిష్కరించామని.. పేపర్లు లీక్ కాలేదని సీబీఎస్ఈ న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ఇక మే 6న పరీక్ష జరిగితే.. ఇప్పుడెందుకు పిటిషన్ దాఖలు చేశారని పిటిషనర్లను కోర్టు నిలదీసింది. ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది. గరిష్ట వయోపరిమితిపై కేంద్రానికి నోటీసులు ‘నీట్’రాసే జనరల్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిని 25 ఏళ్లుగా నిర్ణయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 170 మంది విద్యార్థులు దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై జస్టిస్ ఆదర్శ్ గోయల్, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. కేంద్రంతోపాటు, సీబీఎస్ఈ, కేరళ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ.. విచారణను జూలై 10కి వాయిదా వేసింది. కార్డియాలజిస్టు అవుతా.. ‘‘మా నాన్న కార్డియాలజిస్ట్. అమ్మ డెర్మటాలజిస్ట్. వారిద్దరూ డాక్టర్లే కావడంతో చిన్నప్పటి నుంచే నాకు కూడా డాక్టర్ కావాలనేది కోరిక. తల్లిదండ్రులు చూపిన మార్గం, అధ్యాపకుల ప్రోత్సాహంతో ఆలిండియా రెండో ర్యాంకు సాధించగలిగా. నేను కూడా కార్డియాలజిస్ట్ కావాలనుకుంటున్నా..’’ – రోహన్ పురోహిత్, 2వ ర్యాంకు న్యూరోసర్జన్ కావాలని ఉంది ‘‘చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనేది కోరిక. జాతీయ స్థాయిలో ఆరో ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉంది. నాన్న శ్రీనివాసరెడ్డి బిజినెస్‌మన్, అమ్మ ఆర్తిరెడ్డి ఎకనామిస్ట్. వారు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధించా. ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చేస్తా. భవిష్యత్తులో మంచి న్యూరోసర్జన్ కావాలనేది నా ఆశయం..’’ – వరుణ్ ముప్పిడి, 6వ ర్యాంకు మంచి వైద్యుడిగా పేరు తెచ్చుకుంటా.. ‘‘మాది ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కోసమాల. అమ్మ రమాదేవి, నాన్న తేజేశ్వర్ ఇద్దరూ ఉపాధ్యాయులే. వారి ప్రోత్సాహంతోనే జాతీయ స్థాయిలో ఎనిమిదో ర్యాంకు సాధించగలిగాను. భవిష్యత్తులో మంచి డాక్టర్‌గా పేరుపొందాలనేది నా లక్ష్యం..’’ – ఎ.అనిరుధ్‌బాబు, 8వ ర్యాంకు -
‘నారాయణ-చైతన్య’ మధ్య ర్యాంకుల గొడవ
-
‘చైతన్య-నారాయణ’ మధ్య ర్యాంకుల వార్
సాక్షి, హైదరాబాద్ : ర్యాంకుల వ్యవహారంలో కార్పోరేట్ కాలేజీలు శ్రీ చైతన్య, నారాయణ యాజమాన్యాల మధ్య వార్ వేడెక్కింది. తమ ర్యాంకులను నారాయణకు వచ్చినట్టు చెప్పుకుంటున్నారని చైతన్య కాలేజీల చైర్మన్ బీవీ రావు ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ఎంసెట్‌లో తమకు టాప్ ర్యాంకు వస్తే నారాయణకు వచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణ, శ్రీ చైతన్య కలిసి స్టార్ట్ చేసిన శార్వాణి గ్రూప్ పనిచేయడం లేదని, ప్రస్తుతం ఈ రెండు వేర్వేరని స్పష్టం చేశారు. ఇక నుంచి చైనా( చైతన్య-నారాయణ) బ్యాచ్‌లు ఉండవన్నారు. శ్రీ చైతన్య స్కూల్లో చదువుకున్న విద్యార్థులను నారాయణ.. తమ విద్యార్థులుగా చెప్పుకుంటుందని మండిపడ్డారు. జేఈఈలోని టాప్ 5 ర్యాంకులు తమ విద్యార్థులవేనని, కానీ నారాయణ ర్యాంకుల విషయంలో తప్పుడు ప్రకటనలు చేస్తోందన్నారు. అవసరమైతే దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్, జేఈఈ, ఎంసెట్ ఫలితాల్లో ఇరు కాలేజీలు ఒకే ర్యాంకులు వచ్చాయని ప్రకటనలివ్వడంపై సోషల్ మీడియాలో విమర్శలొస్తున్నాయి. -
నైపుణ్య పరీక్ష
అచ్చంపేట రూరల్ : పాఠశాలల్లో విద్యార్థుల నైపుణ్యాన్ని తెలుసుకోవడానికి పరీక్షలు నిర్వహించి, మార్కుల ప్రకారం ర్యాంకులు కేటాయించడం తెలిసిందే. ప్రభుత్వం నూతనంగా అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు మూడు నెలలకోసారి పరీక్షలు నిర్వహించి వారిలోని నైపుణ్య అభివృద్ధిని తెలుసుకోనున్నారు. వెనకబడిన చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ప్రగతి పత్రాలను అందజేశారు. పాఠశాల స్థాయి మాదిరిగా చిన్నారులకు అంగన్వాడీ స్థాయిలోనే ప్రొగ్రెస్ రిపోర్టును చిన్నారుల తల్లిదండ్రులకు అందజేయనున్నారు. మూడు నెలలకోసారి.... ప్రతి అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు ప్రతి మూడు నెలలకోసారి నైపుణ్య పరీక్షలు నిర్వహించి కొత్తగా రూపొందించిన పుస్తకాల్లో నమోదు చేయనున్నారు. అచ్చంపేట ఐసీడీఎస్ పరిధిలో అచ్చంపేట, అమ్రాబాద్, పదర మండలాల సెక్టార్లు ఉన్నాయి. మూడు మండలాల పరిధిలో 138 పెద్ద అంగన్వాడీ కేంద్రాలు, 57 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. కేంద్రాలలో 5633 మంది చిన్నారులు ఉన్నారు. 2017 జూలై నుంచి.. 2017 జూలై నుంచి చిన్నారులకు ప్రతిభ ఆధారంగా స్టార్లను కేటాయిస్తున్నారు. మూడు నుంచి ఐదేళ్ల వయస్సు పిల్లలకు నీలిరంగు పుస్తకాలు ముద్రించారు. మూడు నుంచి నాలుగేళ్ల వయస్సు చిన్నారులకు వ్యక్తిగత, శారీరక మేథో వికాసం నేర్చుకునేలా, నాలుగు నుంచి ఐదేళ్ల వయస్సుచిన్నారులకు పై పరీక్షలతో పాటు బడికి సంసిద్ధత పరీక్షలు నిర్వహించారు. జూలై, డిసెంబర్లో పరీక్షలు నిర్వహించి చిన్నారుల ప్రగతిని వారి తల్లులకు అందజేశారు. అలాగే ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతిభ ఆధారంగా స్టార్ల కేటాయింపు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ఆట పాటలతో అక్షరాలు నేర్పిస్తున్నాం. చిన్నారుల ప్రతిభ ఆధారంగా స్టార్లను కేటాయిస్తున్నాం. ప్రగతి పత్రం ఆధారంగా చిన్నారుల ప్రతిభ వారి తల్లులకు చెబుతున్నాం. వెనకబడిన చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం. – విజయలక్ష్మి, అంగన్వాడీ టీచర్, అచ్చంపేట -
పదిలమైన ఫలితాల కోసం...
బాలికల్లో డ్రాపవుట్స్‌ను తగ్గించేందుకు ఆవిర్భవించిన కస్తూర్బా పాఠశాల విద్యార్థులు ఇప్పుడు ఆంగ్లమాధ్యమానికి అప్‌గ్రేడ్ అయ్యారు. ఐదేళ్లుగా ఎలాగోలా వంటబట్టించుకున్నా...పబ్లిక్ పరీక్షలు తొలిసారిగా రాస్తున్నారు. శతశాతం ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో రకరకాలుగా ప్రణాళికలు రూపొందించిన అధికారులు వాటిని పక్కాగా అమలుచేస్తున్నారు. విజయనగరం అర్బన్: కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న పదోతరగతి విద్యార్థినులు మెరుగైన వార్షిక ఫలితాలు సాధన కోసం సర్వశిక్షాభియాన్(ఎస్ఎస్ఏ) యంత్రాంగం కుస్తీ పడుతోంది. ఆంగ్లమాధ్యమం ప్రారంభించిన తరువాత ఈ ఏడాదే తొలిసారిగా పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. దీనివల్ల ఫలి తాల్లో ఏమాత్రం తేడా రాకుండా ఉండాలనే లక్ష్యంతో ఎస్ఎస్ఏ అధికారులు ప్రత్యేక శ్రద్ధచూపుతున్నారు. జిల్లాలోని 33 కేజీబీవీల్లో విద్యార్థుల సామర్థ్యాలపై ఇప్పటికే అంచనావేసి ప్రత్యేక తర్ఫీదులను ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించారు. ఏడాదిలో ఇంతవరకు జరిగిన వివిధ రకాల పరీక్షల్లో ప్రదర్శించిన సామర్థ్యాలకు అనుగుణంగా తరగతిలో విద్యార్థులను విభజించి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇటీవల సబ్జెక్ట్‌లోని రెండేసి చాప్టర్ల వారీగా టెస్ట్‌లు పెట్టారు. వీటి ఫలితాలను ప్రామాణికంగా తీసుకొని విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేశారు. ఒక్కో కేజీబీవీలలో 5 నుంచి 6 శాతం వంతున జిల్లా వ్యాప్తంగా 360 మంది వెనుకబడిన విద్యార్థులున్నట్టు గుర్తించారు. వీరందరినీ పాస్ చేయించేం దుకు శ్రద్ధ చూపుతున్నారు. ఎస్ఎస్ఏ పీఓ నుంచి సెక్టోరియల్ అధికారి వరకు ఒక్కో అధికారి ఒక్కో కేజీబీవీని దత్తత తీసుకొని అక్కడి వెనుకబడిన విద్యార్థినుల ఉత్తర్ణత బాధ్యతను తీసుకున్నారు. రోజూ నిర్వహించే ఉద్యోగ విధులతోపాటు అదనంగా ఈ బాధ్యత నిర్వర్తించాలి. సబ్జెక్ట్ వారిగా మాదిరీ ప్రశ్నపత్రాలను తయారు చేసి వాటి ద్వారా వెనుకబడినవారికి తర్ఫీదు ఇస్తున్నారు. టాప్ ఫైవ్ విద్యార్థులను ఒక చోటకు చేర్చి 10/10 సాధన కోసం శిక్షణ ఇస్తున్నారు. పరీక్షకు హాజరుకానున్న 1,139 మంది విద్యార్థినులు వచ్చేనెల 15 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు కేజీబీ వీల నుంచి 1,045 మంది విద్యార్థినులు హాజరవుతున్నారు. కేజీబీవీల పరిధిలోని ఉపాధ్యాయులు రూపొం దించిన ప్రత్యేక ప్రశ్నావళితో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. గతేడాది సాధించిన 92.3 శాతం ఉత్తీర్ణత కంటే మెరుగైన ఫలితాలకోసం ప్రణాళికలు రూపొం దిస్తున్నారు. విద్యార్థినుల్లో పరీక్షపై భయం పోగొట్టే ప్రక్రియలో భాగంగా పాఠశాల స్థాయిలో మానసికోల్లా స కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ‘అమ్మ ఒడి’ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలలకు పిలిపించి వారిని గౌరవించే కార్యక్రమం విద్యాలయం స్థాయిలో చేపట్టారు. ఇలాంటి వాటి ద్వారా వారిలో పరీక్షలంటే భయం పోతుందని ఎస్ఎస్ఏ అధికారులు అంటున్నారు. ఉత్తీర్ణతా శాతంపెంపునకు ప్రణాళికలు కేజీబీవీల్లో పదో తరగతి ఉత్తీర్ణతా శాతాన్ని గతేడాది కంటే మెరుగుపరచడానికి క్షేత్రస్థాయిలో ప్రణాళికలు రూపొందించాం. గతేడాది 92 శాతం ఉత్తీర్ణత సాధించాం, ఈ ఏడాది సీసీఈ విధానం అమలులో ఉండడంతో ఏమాత్రం తగ్గకుండా శతశాతం ఫలితాలకు కృషి చేస్తున్నాం. ప్రస్తుతం జరుగుతున్న గ్రాండ్ ఫైనల్, ఈ నెల 24 నుంచి జరిగే ప్రీ ఫైనల్ పరీక్షల తరువాత పాఠశాల స్థాయిలో విద్యార్థుల సామర్ధ్యం తెలుస్తుంది. తద్వారా బోధనపై శ్రద్ధపెడతాం. ఇంగ్లిష్ మాధ్యమంపైభయాన్ని పోగొట్టాం నాలుగేళ్లక్రితం ఆరోతరగతిలో ఇంగ్లిష్ మాధ్యమం మొదలైంది. తొలి బ్యాచ్ పదోతరగతి పరీక్షలు ఈ ఏడాది రాస్తున్నారు. వీరికి తొలి రోజుల్లో ఇంగ్లిష్ మాధ్యమమంటే భయం ఉం డేది. దీనిని పోగొట్టడానికి ఏడా ది బోధనలో అధిక ప్రాధాన్యమిచ్చాం. దీనివల్ల ఫలితా లను మెరుగవుతాయన్న నమ్మకం ఉంది. – బలగ జ్యోతి, స్పెషల్ ఆఫీసర్, కేజీబీవీ, గంట్యాడ ఫలితాలకోసం ప్రత్యేక కార్యాచరణ కేజీబీవీల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక కార్యచరణను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. ఉదయం 8.30 నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభమవుతుండగా సాయంత్రం 5.30 గంటల వరకు చివరి తరగతిని నిర్వహిస్తారు. పదో తరగతి బోధించే ఉపాధ్యాయులకు వరుస సెలవులు మంజూరు చేయరు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శ్రద్ధతో పాఠాల పునశ్చరణ చేస్తున్నారు. సిలబస్ పూర్తయిన చోట సబ్జెక్టుల వారీగా వినిధరూపాల్లో ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టాలని నిర్ణయించారు. ఏ ప్రశ్నలు వచ్చే అవకాశముంది. వాటిని ఎలా రాయాలి తెలుసుకోవాలనే దానిపై శ్రద్ధ తీసుకుంటున్నారు. -
స్వచ్ఛత.. ఉత్తిదే!
వనపర్తి టౌన్ : మున్సిపాలిటీలో ప్రజాసమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా అమల్లోకి వచ్చిన స్వచ్ఛత యాప్ వినియోగంలో వనపర్తి మున్సిపాలిటీ అట్టడుగు స్థానంలో ఉంది. పట్టుమని పది సమస్యలను కూడా పరిష్కరించలేని అధికారుల నిర్లక్ష్యం కొట్టిచ్చినట్లు కనిపిస్తోంది. స్థానిక మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల ఫొటోలు తీసి ఫిర్యాదుచేస్తే వాటిని రాష్ట్ర, జాతీయస్థాయి అధికారులు పరిశీలించేలా యాప్‌ను రూపొందించారు. వనపర్తి మున్సిపాలిటీలో 26వార్డులు ఉండగా, లక్ష జనాభా ఉంది. గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ 31వరకు దేశంలోని పురపాలక, నగర పాలక సంఘాల పరిధిలో ఆండ్రాయిడ్ యాప్‌తో పట్టణప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించిన తీరును పరిశీలించి స్వచ్ఛభారత్ మిషన్ ఆధ్వర్యంలో ఇటీవల ర్యాంకులు ప్రకటించారు. జాతీయస్థాయిలో అత్యధికంగా సమస్యలు పరిష్కరించిన మున్సిపాలిటీలకు ప్రకటించిన ర్యాంకుల్లో వనపర్తికి అట్టడుగుస్థానం దక్కింది. వనపర్తితో పాటు గద్వాల, నారాయణపేట, మహబూబ్‌నగర్‌కు స్థానం దక్కలేదు. కొన్నేళ్లుగా స్వచ్ఛత యాప్ అమలులో ఉంది. దీనిపై ప్రజల్లో అంతగా అవగాహన లేకపోవడంతో తాము ఎదుర్కొంటున్న సమస్యలను అప్లోడ్ చేయడంపై పెద్దగా ఆసక్తిచూపలేదు. సమస్యల నమోదు ఆండ్రాయిడ్ పరిజ్ఞానం కలిగి ఫోన్ ద్వారా ప్లే స్టోర్‌లోకి వెళ్లి స్వచ్ఛత యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆయా సమస్యల పరిష్కారంలో మున్సిపాలిటీ అధికారుల తీరుపై తమ అభిప్రాయాలను పోస్ట్చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఆయా మున్సిపాలిటీలకు ర్యాంకులు కేటాయించే సమయంలో ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు సమస్యలు అనేకం రోజురోజుకూ మున్సిపాలిటీ విస్తరిస్తోంది. ప్రజలు తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. డ్రెయినేజీ అస్తవ్యస్తంగా మారడంతో సమస్యను పరిష్కరించమని వనపర్తి పట్టణంలోని రాంనగర్ కాలనీవాసులు కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్నారు. యాప్ సేవలు ఉన్నాయనే విషయం తమకు ఇంతవరకు తెలియదని పట్టణవాసులు పెదవి విరుస్తున్నారు. ఇక మీదట పక్కాగా.. స్వచ్ఛత యాప్‌లో ముందుకు పోలేకపోయినం. ఆ కార్యక్రమం ముగిసింది స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ర్యాంకు సాధించేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాం. ఇందులో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. – వెంకటయ్య, వనపర్తి కమిషనర్ -
సివిల్స్‌లో మనోళ్లు మెరిశారు..!
నలుగురికి మంచి ర్యాంకులు ఐఆర్ఎస్కు ఎంపిక వైవీయూ: బుధవారం రాత్రి విడుదల చేసిన సివిల్ సర్వీస్ (మెయిన్స్) ఫలితాల్లో జిల్లావాసులు నలుగురు మంచి ర్యాంకులు సాధించారు. కడప నగరం బాలాజీనగర్‌కు చెందిన గడికోట బాలకృష్ణారెడ్డి (ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం), రాజేశ్వరి దంపతుల కుమారుడైన గడికోట పవన్‌కుమార్‌రెడ్డి సివిల్స్ ఫలితాల్లో ఆలిండియా 353వ ర్యాంకు సాధించి ఐఆర్ఎస్కు ఎంపికయ్యారు. గతంలో ఐఎఫ్ఎస్లో 26వ ర్యాంకు సాధించిన ఆయన ప్రస్తుతం అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో అటవీశాఖలో డీఎఫ్ఓగా పనిచేస్తున్నారు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం రామాపురంలో, హైస్కూల్ విద్య కడప నగరంలోని నాగార్జున హైస్కూల్లో, ఇంటర్మీడియట్ చిత్తూరు వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో చదివారు. అనంతరం ఇంజినీరింగ్‌లో మంచి ర్యాంకు సాధించి కడప నగరంలోని కేఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తిచేశారు. ముంబై ఐఐటీలో ఎంటెక్ పూర్తిచేశారు. అనంతరం సివిల్ పరీక్షలపై దృష్టిసారించిన ఆయన ఐఎఫ్ఎస్లో 26వ ర్యాంకు, తాజాగా విడుదలైన సివిల్స్ మెయిన్స్ ఫలితాల్లో 353వ ర్యాంకు సాధించారు. పవన్‌కుమార్‌రెడ్డి ఢిల్లీలోని వాజీరాం కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందారు. మెరిసిన మేరువ సునీల్‌కుమార్‌రెడ్డి.. కడప నగరం అక్కాయపల్లెకు చెందిన ఎం.ఎస్. వెంకటరెడ్డి (ఆంధ్రప్రగతి గ్రామీణబ్యాంకు మేనేజర్, పెండ్లిమర్రి), నిర్మల దంపతుల కుమారుడైన మేరువ సునీల్‌కుమార్‌రెడ్డి సివిల్స్ ఫలితాల్లో 354వ ర్యాంకు సాధించారు. అనంతపురం జిల్లా గుత్తిలో పదోతరగతి పూర్తిచేసిన సునీల్ ఇంటర్మీడియట్ విజయవాడ శ్రీచైతన్యలో చదివారు. అనంతరం బీటెక్‌ను పశ్చి మబెంగాల్లోని దుర్గాపూర్ నిట్‌లో పూర్తిచేశారు. అనంతరం రిలయన్స్ జియోలో ఒక ఏడాదిపాటు ఇంజినీర్‌గా సేవలందించారు. ఇటీవలే ఐఎఫ్ ఎస్‌కు ఎంపికయ్యారు. ఐఏఎస్‌ను సాధించడమే తన లక్ష్యమని తెలిపార -
నెరవేరిన ‘ఆకాంక్ష’
- కిరాణ కొట్టు యజమాని కొడుకు సివిల్స్ విజేత – వి. సాయి వంశీవర్థన్కు 220 ర్యాంకు – రెండో ప్రయత్నంలో విజయం – జార్ఖండ్‌లో మావోల కిడ్నాప్‌నకు గురైన వంశీవర్థన్ – పంజాబ్ క్యాడర్ ఐఏఎస్ లక్రా స్ఫూర్తితో సివిల్స్ – పేదరిక నిర్మూలన కోసం ఆకాంక్ష పేరుతో స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు కర్నూలు (సిటీ) : కృషి, పట్టుదల ఉంటే అత్యున్నత లక్ష్యాలను సాధించవచ్చని ఓ కిరాణ కొట్టు యజమాని కుమారుడు నిరూపించారు. ప్రతిభకు పేదరికం అడ్డు కాదని అతను చాటిచెప్పారు. 2016 సివిల్స్ ఫలితాల్లో అతను ఏకంగా 220వ ర్యాంకు సాధించి తన ‘ఆకాంక్ష’ను నెరవేర్చుకున్నారు. కొలిమిగుండ్ల మండలం తిమ్మనాయనిపేటకు చెందిన వి.సుధాకర్, వి.లక్ష్మిదేవి దంపతుల కుమారుడు వి.సాయివంశీవర్దన్..సివిల్స్‌లో మెరిశారు. చదువులో మొదటి నుంచి ముందంజలో ఉండటంతో అతనని.. తల్లిదండ్రులు కష్టపడి చదివించారు. ప్రాథమిక విద్య వైఎస్ఆర్ జిల్లా జమ్ములమడుగు నుంచి మొదలైంది. ఇక్కడ 1 నుంచి 7వ తరగతి వరకు సెయింట్ మేరీస్ స్కూలు, 8 నుంచి 10వ తరగతి వరకు అనంతపురం జిల్లా తాడిపత్రిలోని శ్రీవాణి స్కూలులో చదివారు. ఇంటర్మీడియట్ నెల్లూరు నారాయణ కళాశాలలో ఎంపీసీ గ్రూపు చదివి 950 మార్కులు సాధించారు. 2010లో చిత్తూరు జిల్లాలోని విద్యానికేతన్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 2010లో సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయగా ర్యాంక్ రాలేదు. అనంతరం టాటా కన్సల్టెన్సీ సర్వీసులో 2010–12 వరకు ఉద్యోగం చేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నిర్వహించిన ఫెలోషిప్‌కు ఎంపికై.. రెండు సంవత్సరాల పాటు జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిడి జిల్లాలో పని చేశారు. ఈ సమయంలో పరాస్నాథ్ కొండల్లో పర్యటిస్తుండగా.. నలుగురు మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. అయితే 48 గంటల తర్వాత తిరిగి అతన్ని వదిలేశారు. జార్ఖండ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతంలో పర్యటిస్తున్న సమయంలో పంజాబ్ రాష్ట్ర కేడర్‌కు చెందిన ఐఏఎస్ లక్రాను స్ఫూర్తిగా తీసుకొని.. 2015 నుంచి సివిల్స్‌కోసం ఢిల్లీలోని వాదిరామ్ ఇన్సిట్యూట్‌లో శిక్షణ పొందారు. 2016 నోటిఫికేషన్ విడుదల కావడంతో సోషియాలజీ ఆప్షన్ పరీక్ష రాసి 220 ర్యాంకు సాధించారు. అనాథలను ఆదుకునేందుకు ఆకాంక్ష .. టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో స్నేహితులతో కలిసి పేద విద్యార్థులను, అనాథ పిల్లలను ఆదుకునేందుకు ఆకాంక్ష పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ కోసం పని చేస్తున్న సమయంలోనే పేదరికం నిర్మూలించాలంటే ఐఏఎస్ సాధించి సమాజానికి తమవంతుగా సేవ చేయాలని నిర్ణయించుకున్నట్లు సాయి వంశీవర్థన్ తెలిపారు. అక్క సౌజన్య, బావ ప్రసాద్‌లు తనకు ఆర్థికంగా సాయం చేశారని చెప్పారు. స్నేహితులు రమేష్, రాజేష్...సలహాలు సూచలు ఇచ్చేవారని తెలిపారు. ముత్యాల రాజు స్ఫూర్తి - సివిల్స్ 905 ర్యాంకర్ రవికాంత్ మనోగతం నంద్యాల: ఆంధ్రప్రదేశ్‌కే చెందిన 2007 బ్యాచ్ సివిల్స్ టాపర్ ముత్యాల రాజు తనకు స్ఫూర్తి అని సివిల్స్ ర్యాంకర్ గోవిందపల్లె రవికాంత్ అన్నారు. బుధవారం ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో 905 ర్యాంక్ రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ ర్యాంక్‌కు ఐపీఎస్, ఐఆర్ఎస్ వచ్చే అవకాశం ఉందని, మళ్లీ సివిల్స్ రాసి ఐఏఎస్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. రోజూ 10 గంటలు చదివానని, మధ్యలో రిలాక్స్ కోసం ధ్యానం చేసేవాడినన్నారు. అమ్మ కృపమ్మ, నాన్న రాజు ఆశీస్సులతోనే తాను ఈ ఘనత సాధించానన్నారు. కుటుంబ నేపథ్యం రవికాంత్ తండ్రి రాజు రిటైర్డ్ కానిస్టేబుల్, తల్లి కృపమ్మ హెల్త్ సూపర్వైజర్. స్థానిక జ్ఞానాపురంలోని వైఎస్ ప్రభుదాస్‌రెడ్డి రోడ్డులో నివాసం ఉంటున్నారు. రవికాంత్ ఎన్జీఓ కాలనీలోని గుడ్‌షప్పర్డ్ స్కూల్లో 10వ తరగతి వరకు, హైదరాబాద్‌లోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్, వరంగల్‌లోని ఎన్ఐటీలో ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. తర్వాత సివిల్స్‌లో ర్యాంకు సాధించడానికి ఏడాది పాటు హైదరాబాద్‌లోని రెండు కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందారు. అనంతరం నెల్లూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో ఏడాది ఉద్యోగం చేసి మళ్లీ సివిల్స్ రాయడానికి రాజీనామా చేశారు. గత ఏడాది సివిల్స్‌లో ప్రిలిమినరీ, మెయిన్స్‌లో ప్రతిభ చూపినా ఇంటర్య్వూలో ఫెయిల్ అయ్యారు. దీంతో ఆయన మరింత పట్టుదలగా చదివి ప్రస్తుతం 905 ర్యాంకును సాధించారు. -
గ్రామీణ అభ్యర్థుల హవా!
- కానిస్టేబుల్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు - జిల్లా టాపర్‌గా నాన్‌లోకల్ అభ్యర్థి - డి.హాసన్, ఎం.శ్రీనివాసులుకు 2, 3 ర్యాంకులు - పేదింటికి చెందిన మహేష్‌కు 9వ ర్యాంకు కర్నూలు సిటీ: పోలీసు కానిస్టేబుల్ ఫలితాల్లో గ్రామీణ ప్రాంత అభ్యర్థులు సత్తా చాటారు. శుక్రవారం విడుదల చేసిన ఫలితాల్లో ఈ విషయం రుజువైంది. జిల్లాలో 180 సివిల్, 35 ఏఆర్ కానిస్టేబుల్ పోస్టుల ఖాళీలకు గతేడాది నవంబరు 8న ప్రిలీమనరీ, ఈ ఏడాది జనవరి 17వ తేదిన మెయిన్స్ పరీక్షలు జరిగాయి. కడప జిల్లాకు చెందిన డి.శ్రీధర్‌రెడ్డి 154 మార్కులతో నాన్‌లోకల్ కేటగిరీలో జిల్లా టాపర్‌గా నిలిచారు. ఆ తర్వాత డి.హాసన్ బాషా 152 మార్కులతో ద్వితీయ ర్యాంకు, 151 మార్కులతో ఎం.శ్రీనివాసులు మూడో ర్యాంకు సాధించారు. బుడగ జంగాల వర్గానికి చెందిన మహేష్ 9వ ర్యాంకు సాధించారు. కూలీ పనికి పోతేగానీ పూట గడవని స్థితిలోని కుటుంబం, మట్టిని నమ్ముకున్న ఓ రైతు ఇంట పుట్టిన బిడ్డలు పోలీసు కానిస్టేబుల్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి ఉత్తమ ర్యాంకులు సాధించారు. - పాములపాడు మండలం ఎర్రగూడురుకు చెందిన బుడగ జంగం సామాజిక వర్గానికి చెందిన ఎం.గంగన్న, ఎం.జానమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, కూతురు. గంగన్న వివాహం కాకముందు ఊరూరా తిరుగుతూ సంచార జీవితం గడిపే వారు. జానమ్మను పెళ్లి చేసుకున్న తర్వాత ఎర్రగూడురులో స్థిరపడ్డారు. కూలి పనులు చేసుకుంటూ పిల్లలను చదివించేవారు. అయితే తల్లిదండ్రుల కష్టాన్ని చూసిన పెద్ద కుమారుడు మధు, కూతురు సుజాత తమ్ముళ్ల చదువు కోసం వారు మధ్యలోనే చదువు మానేశారు. రెండో కుమారుడు ఎం.మహేష్ ప్రస్తుతం కానిస్టేబుల్ పరీక్ష ఫలితాల్లో జిల్లా స్థాయి 9వ ర్యాంకు సాధించారు. చివరి కొడుకు రాఘవేంద్ర సైతం ఇటీవలే ఆర్మీ ఉద్యోగం సాధించి బెంగళూరులో విధులు నిర్వహిస్తున్నారు. - వెలుగోడు మండలం వెల్పనూరుకు చెందిన మాచర్ల వెంకటరమణ, ఎం.నాగలక్ష్మమ్మ దంపతులు వ్యవసాయం చేస్తుంటారు. నాలుగెకరాలు భూమి ఉంది. వీరికి ఇద్దరు కూమారులు. పెద్దవాడు ఎం.శ్రీనివాసులు 151 మార్కులు సాధించి జిల్లాలో మూడో ర్యాంకర్‌గా నిలిచారు. ప్రాథమిక చదువంతా వేల్పనూరులో సాగింది. నంద్యాల వెంకటేశ్వర జూనియర్ కాలేజీలో ఇంటర్, కడప కె.ఎస్.ఆర్.ఎమ్ ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ పూర్తి చేశారు. మొదటి ప్రయత్నంలోనే కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. హోంగార్డు నుంచి కానిసేబుల్ పోస్టుకు ఎంపిక.. పోలీసు శాఖలో హోంగార్డుగా సేవలు అందిస్తున్న వారు సైతం కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. దేవనకొండ మండలం పూల్లాపురం గ్రామానికి చెందిన డి.రామకృష్ణారెడ్డి 2012 నుంచి హోంగార్డుగా పని చేస్తున్నారు. ఇంటర్, డిగ్రీ ఓపెన్ స్కూల్ విధానంలో పూర్తి చేశారు. హోంగార్డుగా పని చేస్తూ కానిస్టేబుల్ పోస్టులకు ఎస్.వి.ఆర్ కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకున్నాడు. సి.బెళగల్‌కు చెందిన హరిప్రసాద్, పి.ఆంజనేయులు, ఈ.రామన్‌గౌడు తదితరులు కూడా హోంగార్డులుగా పని చేస్తూ సివిల్ కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. -
ఎంసెట్ మెరికలు
ఇంజనీరింగ్‌లో బాలురు.. అగ్రికల్చర్లో బాలికలు - ఇంజీనిరింగ్లో వివేకానందకు జిల్లా మొదటి ర్యాంకు - అగ్రికల్చర్లో వందనకు జిల్లా ప్రథమ స్థానం - రాష్ట్ర స్థాయి ర్యాంకులు దక్కించుకున్న జిల్లా విద్యార్థులు - ఇంటర్ మార్కుల వెయిటేజీతో ర్యాంకుల ప్రకటన కర్నూలు(సిటీ): ఎంసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో బాలురు, బాలికలు సమానంగా రాణించారు. గత నెల 24, 25, 26 తేదీల్లో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు.. 28న అగ్రికల్చర్ అండ్ మెడికల్ ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. ఇంజనీరింగ్ 8,856 మంది విద్యార్థులు, అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షకు 4,655 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొట్టమొదటి సారిగా ఆన్లైన్ విధానంలో జిల్లాలోని 12 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఇంటర్ మార్కులు 25 శాతం వెయిటేజ్ కింద తీసుకుని ఎంసెట్ ర్యాంకులను ప్రకటించారు. శుక్రవారం ఫలితాలు వెలువడ్డాయి. జిల్లాలో ఇంజనీరింగ్ విభాగంలో పాసం డేగల వివేకానంద(ర్యాంకు 358–హాల్ టిక్కెట్ నం.5910851156) జిల్లా మొదటి ర్యాంకును సాధించారు. తొగర్చేటి రమా ప్రత్యూష(ర్యాంకు 361) జిల్లా రెండవ ర్యాంకు, టి.దేవకి భట్(ర్యాంకు 366) తృతీయ ర్యాంకు దక్కించుకున్నారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో ఎస్.వందన (ర్యాంకు 140) జిల్లా మొదటి ర్యాంకు, షేక్ మసీరా తరణ్ణుం(ర్యాంకు 221) జిల్లా రెండవ ర్యాంకు, పి.వినూష (ర్యాంకు 248) తృతీయ ర్యాంకు సాధించారు. ఎంసెట్ ప్రవేశ పరీక్షల్లో ఇంజనీరింగ్‌లో బాలురు, అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో బాలికలు రాణించారు. జిల్లాకు చెందిన విద్యార్థులకు రాష్ట్రస్థాయి ర్యాంకులు జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించారు. డోన్‌కు చెందిన గోపన్నగారి సాయితరుణ్ రెడ్డి అనే విద్యార్థి కూడా విజయవాడలో చదువుతూ కృష్ణా జిల్లాలో పరీక్షలు రాసి రాష్ట్రస్థాయిలో 31వ ర్యాంకు సాధించారు. కర్నూలు నగరానికి చెందిన ఎం.సుమయ్య మొహిషిన్ అనే విద్యార్థి విజయవాడలో చదువుతూ కృష్ణా జిల్లాలో పరీక్షలు రాసి రాష్ట్రస్థాయిలో 64వ ర్యాంకును కైవసం చేసుకున్నారు. జిల్లా టాప్–10 ర్యాంకులు ఇంజనీరింగ్‌లో... పి.డి.వివేకానంద(జిల్లా ఫస్ట్ ర్యాంకు), తొగర్చేటి రమా ప్రత్యూష(జిల్లా రెండో ర్యాంకు), టి.దేవకి భట్ (జిల్లా మూడో ర్యాంకు), కంబాల కిరణ్‌కుమార్(జిల్లా నాలుగో ర్యాంకు), లగిశెట్టి వెంకట వైష్ణవ్(జిల్లా ఐదో ర్యాంకు), సి.సాయి దినేష్(జిల్లా ఆరో ర్యాంకు), సి.ఎం.అభిరామ్ రెడ్డి(జిల్లా ఏడో ర్యాంకు), కొండ ప్రణీత్‌రెడ్డి (జిల్లా ఎనిమిదో ర్యాంకు), ఎస్.రేవంత్ (జిల్లా తొమ్మిదో ర్యాంకు), ఐ.వి.నాగార్జునరెడ్డి (జిల్లా పదో ర్యాంకు). మెడికల్ అండ్ అగ్రికల్చర్లో.. ఎస్.వందన(జిల్లా ఫస్ట్ ర్యాంకు), షేక్ మసీరా తరుణ్ణం(జిల్లా రెండో ర్యాంకు), పి.వినూష(జిల్లా మూడో ర్యాంకు), బి.పూజ(జిల్లా నాలుగో ర్యాంకు), జి.శ్రీనిజ(జిల్లా ఐదో ర్యాంకు), కె.రేవంత్ కుమార్ రెడ్డి(జిల్లా ఆరో ర్యాంకు), జి.భానుశ్రీ(జిల్లా ఏడో ర్యాంకు), బి.శిరీష(జిల్లా ఎనిమిదో ర్యాంకు), బి.వెంకటేష్(జిల్లా తొమ్మిదో ర్యాంకు), జి.భావన(జిల్లా పదో ర్యాంకు). -
బాబుగారి బండారం
-
ర్యాంకుల వ్యవస్థలో మార్పులుండవు
న్యూఢిల్లీ: సాయుధ దళాల (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్) సిబ్బంది ర్యాంకుల వ్యవస్థలో మార్పులేమీ ఉండవని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎవరి ర్యాంకునూ తగ్గించడం, మార్పులు చేయడం లేదని తెలిపింది. సాయుధ దళాల ప్రధాన కార్యాలయాల్లో అదే హోదాలో పనిచేస్తున్న రక్షణేతర రంగ ఉద్యోగులకు ఇచ్చిన ర్యాంకులనే, ప్రస్తుతం ఉన్న వాటినే కొనసాగిస్తామని రక్షణ శాఖ తెలిపింది. మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమంది. మంత్రిత్వ శాఖ ఇలా ప్రకటించినా, సాయుధ దళాలు మాత్రం ఈ విషయంలో రక్షణ శాఖ ఇచ్చిన ఒక సర్క్యులర్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. -
పడిపోయిన ర్యాంకులు
-
అప్పుడు వందల్లో.. ఇప్పుడు వేలల్లో..
* ఎంసెట్ 2 లీకేజీ ఆరోపణలు ఎదుర్కొన్న విద్యార్థులకు చుక్కెదురు * లీకేజీని బయటపెట్టిన వ్యక్తి కూతురికి మెరుగైన ర్యాంకు సాక్షి,హైదరాబాద్/భూపాలపల్లి/పరకాల: ఎంసెట్-2 పేపర్ లీకేజీకి పాల్పడి మంచి ర్యాంకులు సాధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు విద్యార్థులకు ఎంసెట్-3లో చుక్కెదురైంది. వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన ఇద్దరు విద్యార్థినులు ఎంసెట్ -2లో 704, 295 ర్యాంకులు రాగా, తాజాగా ఎంసెట్-3లో ఏకంగా 15 వేలు, 9 వేల పై చిలుకు ర్యాంకులకు పడిపోయారు. వీరికి ఎంసెట్-1లో కూడా 20 వేలు, 9 వేల పై చిలుకు ర్యాంకులు రావడం గమనార్హం! ఇక ఎంసెట్-2లో 800 లోపు, 900 లోపు ర్యాంకులతో రాణించిన మరో ఇద్దరు విద్యార్థులకు ప్రస్తుతం 13 వేలు, 24 వేల పై చిలుకు ర్యాంకులు వచ్చాయి. వీరికి ఎంసెట్-1లో 17 వేల పై ర్యాంకులు వచ్చాయి. నిజానికి ఎంసెట్-3లో వీరికి అసాధారణ ర్యాంకులు రావడాన్ని అనుమానించి తోటి విద్యార్థినులుతమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఎంసెట్ పేపర్-2 లీకేజీ జరిగిందని ఆరోపించారు. ఎంసెట్-2 లీకేజీ వ్యవహారాన్ని బహిర్గతం చేసిన వరంగల్ జిల్లా పరకాల పట్టణానికి చెందిన గుండెబోరుున రవి కుమార్తె ప్రజ్ఞ ర్యాంకు ఈసారి కాస్త మెరుగైంది. ఆమెకు ఎంసెట్-2లో 3,823వ ర్యాంకు రాగా తాజాగా ఎంసెట్-3లో 3,200 ర్యాంకు వచ్చింది. ఎంసెట్-2 సందర్భంగా తన కుమార్తెతో కోచింగ్ తీసుకున్న విద్యార్థులు వారం ముందు మాయమై, చివరికి ర్యాంకులు తెచ్చుకోవడంతో అనుమానించిన రవి.. తెలంగాణ, ఏపీల్లో ఎంసెట్ ర్యాంకులు, మార్కుల ఆధారాలు సేకరించారు. ఎంసెట్-2లో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. లీకేజీ నిజమేనని తేలడంతో జూలై 29వ తేదీన ఎంసెట్-2ను రద్దు చేసింది. -
ఎంసెట్-3లో 13 తప్పులు!
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-3 ప్రశ్నపత్రంలో మొత్తంగా 13 తప్పులు దొర్లాయి. ఏడు ప్రశ్నలకు జవాబులే లేకుండగా.. సిలబస్‌లో లేని ఒక ప్రశ్న వచ్చింది. ఈ ఎనిమిదింటినీ తొలగించిన ఎంసెట్ కమిటీ.. వాటికి సంబంధించి విద్యార్థులందరికీ 8 మార్కుల చొప్పున కలిపింది. ఇక మరో ఐదు ప్రశ్నలకు సంబంధించి ఒకటికి మించి సరైన ఆప్షన్లు రాగా.. వాటిలో దేనిని ఎంచుకున్నా మార్కులు వేసింది. మొత్తంగా వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని గురువారం ఫలితాలు విడుదల చేసింది. ఫలితాల విడుదల అనంతరం ఎంసెట్-3 చైర్మన్, జేఎన్టీయూహెచ్ వైస్ చాన్స్‌లర్ వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడారు. 8 ప్రశ్నలను తొలగించి, విద్యార్థులందరికి మార్కులు కలిపినట్లు వెల్లడించారు. జవాబుల్లేని 8 ప్రశ్నలు తొలగించి 152 మార్కులనే పరిగణనలోకి తీసుకున్నా.. వాటికి సంబంధించి అందరు విద్యార్థులకు 8 మార్కులు కలిపినా తేడా ఏమీ ఉండదని.. ప్రతిభావంతులెవరికీ అన్యాయం జరగదని పేర్కొన్నారు. ఇక మరో నాలుగు ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్లలో రెండు సరైనవి ఉండగా, మరొక ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్లలో మూడు సరైన సమాధానాలు ఉన్నాయని... వాటిల్లో సరైన సమాధానాలు వేటిని ఎంచుకున్నా మార్కులిచ్చామని వివరించారు. తక్కువ సమయంలో పరీక్షను పక్కాగా నిర్వహించి, ఫలితాలను వెల్లడించినట్లు తెలిపారు. అయితే జవాబుల్లేని, సిలబస్‌లో లేని ప్రశ్నలకు విద్యార్థులందరికీ మార్కులు ఇవ్వడం వల్ల... ప్రతిభ లేనివారు ఏం రాయకపోయినా 8 మార్కులు కలిశాయని, ప్రతిభావంతులకు పరోక్షంగా నష్టం జరిగినట్లేనని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. క్షుణ్నంగా పరిశీలన: ఈనెల 11న నిర్వహించిన ఎంసెట్-3 పరీక్ష ప్రాథమిక కీని అదే రోజు రాత్రి వెబ్‌ైసైట్‌లో అందుబాటులో ఉంచి... 14వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరించారు. దాదాపు 20 ప్రశ్నలపై 700 వరకు అభ్యంతరాలు వచ్చాయి. వాటన్నింటిని ఐఐటీ, ఐఐఎస్సీ, హైదరాబాద్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లతో ఏర్పాటైన నిపుణుల కమిటీ పరిశీలించి, సిఫార్సులు చేసింది. ఈ మేరకు ఎంసెట్ కమిటీ ఫైనల్ కీని ఖరారు చేసి.. మార్కులు కేటాయించింది. ఎంసెట్ స్కోర్‌కు 75 శాతం వెయిటేజీ, ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి తుది ర్యాంకులను ఖరారు చేసినట్లు ఎంసెట్ కన్వీనర్, జేఎన్టీయూ రిజిస్ట్రార్ యాదయ్య తెలిపారు. తొలగించిన ప్రశ్నలు (సెట్ ‘ఎ’ పేపర్ ప్రకారం) ఏడు ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్లలో సరైన జవాబు లేనందున వాటిని తొలగించగా, మరో ప్రశ్న సిలబస్‌లో లేకపోవడంతో దానిని తొలగించి.. వాటికి విద్యార్థులందరికి మార్కులు కేటాయించారు. తొలగించిన ప్రశ్నల నంబర్లు 36, 44, 90, 107, 114, 116, 133, 152. * 11వ ప్రశ్నకు ఇచ్చిన నాలుగు ఆప్షన్లలో 2, 3, 4 ఆప్షన్లు మూడూ సరైనవే. వాటిలో ఏది ఎంచుకున్నా మార్కులు ఇచ్చారు. * 26వ ప్రశ్నకు ఇచ్చిన నాలుగు ఆప్షన్లలో 2, 3 ఆప్షన్లు.. 38వ ప్రశ్నకు 1, 3 ఆప్షన్లు, 105వ ప్రశ్నకు 3, 4 ఆప్షన్లు, 121వ ప్రశ్నకు 1, 4 ఆప్షన్లు సరైనవే వచ్చాయి. ఈ ప్రశ్నల్లో సరైన ఆప్షన్ దేనిని ఎంచుకున్నా మార్కులు ఇచ్చారు. -
మెడిసిన్‌లో మెదక్‌కు ర్యాంకుల పంట
మెదక్/పాపన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం మూడు సార్లు ఎంసెట్ పరీక్షలు నిర్వహించినప్పటికీ ఆ విద్యార్థులు ఆత్మస్థైయిర్యం కోల్పోకుండా మెట్టు మెట్టు పైకెక్కుతూ ర్యాంకుల పంట పండించారు. మెదక్ పట్టణానికి చెందిన తొడుపునూరి పల్లవి గురువారం వెలువడిన ఎంసెట్ (మెడిసిన్)3లో రాష్ట్రస్థాయిలో 246వ ర్యాంకు సాధించింది. పట్టణానికి చెందిన సురేష్-మధురాణి దంపతుల రెండవ కూతురైన పల్లవి హైదరాబాద్‌లోని శ్రీచైతన్యలో టెన్త్, ఇంటర్ చదివింది. ఇంటర్లో 979/1000 సాధించింది. కాగా మొదటి ఎంసెట్-1లో 786వ ర్యాంకు, ఎంసెట్-2లో 997ర్యాంకు, ఎంసెట్-3లో 246వ ర్యాంకును పల్లవి సాధించింది. ఈ సందర్భంగా పల్లవిని కుటుంబ సభ్యులతోపాటు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తొడుపునూరి చంద్రపాల్, ద్వారకా చారిటబుల్ ట్రస్టు చైర్మన్ మ్యాడం బాలకృష్ణ అభినందించారు. ఈ సందర్భంగా పల్లవి మాట్లాడుతూ న్యూరాలజిస్ట్ కోర్సు చదివి రోగులకు సేవచేస్తానని తెలిపింది. పాపన్నపేట మండలంలో... పాపన్నపేట మండలం కొడుపాక గ్రామానికి చెందిన సారికశర్మ ఎంసెట్‌లో 798వ ర్యాంకు సాధించింది. ఏడుపాయల దుర్గమ్మ ఆలయంలో పూజారిగా పనిచేసే శంకరశర్మ కూతురు సారికశర్మ టెన్త్ మెదక్ సిద్ధార్థ్ పాఠశాలలో, ఇంటర్ హైదరాబాద్‌లోని శ్రీచైతన్యలో పూర్తిచేసింది. గురువారం విడుదల చేసిన ఎంసెట్ ఫలితాల్లో సారిక 798ర్యాంకు సాధించింది. అలాగే మండలంలోని పొడ్చన్‌పల్లి గ్రామానికి చెందిన మన్యం స్నేహ 1429వ ర్యాంకు సాధించింది. -
ఎంసెట్-3 ఫలితాల విడుదల
తెలంగాణ మెడికల్ ఎంసెట్-3 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన పాపిరెడ్డి గురువారం మధ్యాహ్నం ఎంసెట్ ర్యాంకులను విడుదల చేశారు. విద్యార్థులు తమ ర్యాంకులను tseamcet.in, sakshieducation.com వెబ్సైట్లలో పొందవచ్చు. కాగా ప్రాథమిక కీపై బుధవారం సాయంత్రం వరకు అభ్యంతరాలు స్వీకరించిన ఎంసెట్ కమిటీ వాటిని పరిశీలించి రాత్రి ఫైనల్ కీ విడుదల చేయాలని భావించినా సాధ్యం కాలేదు. అభ్యంతరాలు ఎక్కువ మొత్తంలో రావడంతో ఫైనల్ కీని విడుదల చేయలేదు. ఈ నెల 15న ఎంసెట్ ర్యాంకులతో పాటు ఫైనల్ కీని విడుదల చేయాలని నిర్ణయించింది. ఉన్నత విద్యామండలి కన్వీనర పాపిరెడ్డి మాట్లాడుతూ పరీక్ష రాసిన ప్రతి విద్యార్థికి ఎనిమిది మార్కులు కలుపుతామన్నారు. ఎనిమిది ప్రశ్నలకు సంబంధించి ఏడింటికి సమాధానం లేదని, ఓ ప్రశ్న సిలబస్‌లో లేదన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థుల వివరాలు మొదటి ర్యాంకు : రేగళ్ల మానస 152 మార్కులు (కృష్ణాజిల్లా) రెండో ర్యాంకు: హారిక 151 (సికింద్రాబాద్) మూడో ర్యాంకు : తేజశ్విని 151 (అనంతపురం) నాలుగో ర్యాంకు : జీషన్ అహ్మద్ 151 (హైదరాబాద్) ఐదో ర్యాంకు: ఇమ్రాన్ ఖాన్ 151 (హైదరాబాద్) ఆరో ర్యాంకు : శ్రీకాంతేశ్వర్ రెడ్డి 151 (సికింద్రాబాద్) ఏడో ర్యాంకు : మిట్టపల్లి అలేఖ్య 150 (ఖమ్మం) ఎనిమిదో ర్యాంకు: నుజత్ ఫాతిమా 150 (ఆదిలాబాద్) తొమ్మిదో ర్యాంకు: కావ్య బులుసు (150) (హైదరాబాద్) పదో ర్యాంకు: వెంపటి రూపేష్ (150) (నల్లగొండ) -
అపూర్వ కలయిక!
గాంధీ ఆస్పత్రి: సుమారు ఐదు దశాబ్దాల క్రితం వారంతా వైద్య విద్యార్థులు. వైద్యవిద్య పూర్తయిన తర్వాత వృత్తిరీత్యా దేశ విదేశాల్లో స్థిరపడ్డారు. ఇన్నాళ్లకు మళ్లీ కలుసుకున్నారు. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. సికింద్రాబాద్ గాంధీ వైద్య కళాశాల ప్రాంగణంలోని అలుమ్నీ భవనంలో బుధవారం 62 వసంతాల వేడుకల్లో వీరంతా కలిశారు. ఆప్యాయ పలకరింపులు... ఆత్మీయ ఆలింగనాలతో సందడి చేశారు. ర్యాంకులు సాధించేందుకు కష్టపడి చదివిన రాత్రులు... సరదాగా చూసిన సినిమాలు... అల్లరి పనులున్ చిలిపి చేష్టలను గుర్తు చేసుకొని... జోకులు వేసుకుంటూ ఒకరినొకరు ఆట పట్టించుకున్నారు. సెల్ఫీలు, ఫోటోలు దిగి జ్ఞాపకాలను పదిలపరుచుకున్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన డీఎంఈ డాక్టర్ రమణి అలుమ్నీ భవనంలోని మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ మెడికల్ కాలేజీ అలుమ్నీ అసోసియేషన్ ద్వారా అనేక సామాజిక సేవ, వైద్య, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినట్లు అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి, డాక్టర్ జి.లింగమూర్తి తెలిపారు. -
ఎంసెట్ ర్యాంకులను జల్లెడ పడుతున్న సీఐడీ
-
ఆ ర్యాంకుల్లో మతలబు ఏంటి?
ఎంసెట్–2 లీకేజీపై సీఐడీ ముమ్మర దర్యాప్తు 60 మంది విద్యార్థుల ర్యాంకుల పరిశీలన విద్యార్థుల స్టేట్మెంట్ను రికార్డు చేయాలని నిర్ణయం అదుపులో ఇద్దరు బ్రోకర్లు, జాడలేని మరో వ్యక్తి బ్రోకర్లు, విద్యార్థులను కలిపి విచారించే యోచన సాక్షి, హైదరాబాద్: ఎంసెట్–2 పేపర్ లీకేజీపై దర్యాప్తును సీఐడీ ముమ్మరం చేసింది. ప్రాథమిక విచారణలో వెలుగు చూసిన అంశాలపై లోతుగా ఆరా తీస్తోంది. జేఎన్టీయూ ఇచ్చిన 60 మంది విద్యార్థుల ర్యాంకుల జాబితాను పూర్తిగా పరిశీలించింది. వారి నుంచి సేకరించే వివరాలను అధికారికంగా నమోదు చేసుకునేందుకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు వివిధ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులను విచారించేందుకు సీఐడీ ప్రత్యేక బృందాలు వరంగల్, భూపాలపల్లి, పరకాల, ఖమ్మం, కరీంనగర్ ప్రాంతాలకు వెళ్లాయి. వారు చెప్పే విషయాలన్నింటినీ అధికారులు పక్కాగా రికార్డ్ చేస్తున్నారు. మరోవైపు బ్రోకర్లుగా చెలామణి అయిన వారిలో ఇప్పటి వరకు ఇద్దరిని పట్టుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన వెంకట్రావ్, ఖమ్మంకు చెందిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీఐడీ ప్రత్యేక బృందాలు రహస్య ప్రదేశంలో విచారిస్తున్నాయి. అలాగే కీలకంగా వ్యవహరించినట్లు భావిస్తున్న మరో బ్రోకర్ రమేశ్ తప్పించుకొని తిరుగుతున్నాడు. అతడిని పట్టుకునేందుకు మరొక బృందం ప్రత్యేకంగా పని చేస్తోంది. విద్యార్థులను, బ్రోకర్లను విడివిడిగా విచారించిన తర్వాత మళ్లీ కలిపి విచారించాలని కూడా సీఐడీ భావిస్తోంది. విద్యార్థుల ట్రాక్ రికార్డు పరిశీలన ఎంసెట్–2లో అనూహ్యంగా ర్యాంకులు సాధించిన 60 మంది విద్యార్థుల ట్రాక్ రికార్డును సీఐడీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఎంసెట్–1లో తక్కువ మార్కులు వచ్చి ఎంసెట్–2లో అనూహ్యంగా మార్కులు పెరగడానికి గల కారణాలపై అధ్యయనం చేస్తోంది. కాలేజీల్లో జరిగిన పరీక్షల్లో వారు చూపిన ప్రతిభనూ పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కొంత మంది విద్యార్థులకు సంబంధించి తలెత్తుతున్న సందేహాలను నివృత్తి చేసుకుంటూ బాధ్యుల్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అనుమానిత ర్యాంకులు గల వారు ఎంసెట్–2లో ఇంచుమించు ఒకే విధంగా మార్కులు స్కోర్ చేశారు. వీరికి ఇంటర్ మార్కుల ఆధారంగా మాత్రమే ర్యాంకుల్లో తేడా వచ్చింది. అందరూ 130 నుంచి 140కి మధ్యలోనే మార్కులు సాధించారు. అదెలా సాధ్యమైందనే అంశంపై సీఐడీ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. సీఐడీ అదుపులో ఫ్యాకల్టీ సిబ్బంది ప్రశ్నపత్రాల తయారీ విధానంపై సీఐడీ ప్రధానంగా దృష్టి సారించింది. దళారులు ప్రముఖ విద్యాసంస్థల్లో కోచింగ్ తీసుకునే కొంత మందిని మాత్రమే ఎంపిక చేసుకొని పదేపదే ‘మెడికల్ సీటు గ్యారెంటీ’ అని చెప్పడంలో గల ధీమాపై ఆరా తీస్తోంది. అంతేకాదు కొంతమంది ఫ్యాకల్టీలతో బ్రోకర్లు ఎందుకు సంభాషించారనే అంశంపై వివరాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు కొంత మంది ఫ్యాకల్టీ సిబ్బందిని మంగళవారం రహస్య ప్రాంతంలో విచారించినట్లు సమాచారం. -
జేఈఈ మెయిన్ ర్యాంకుల వెల్లడి
హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్ఐటీ విద్యాసంస్థల్లో ప్రవేశానికి గాను జేఈఈ మెయిన్ ర్యాంకులను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) గురువారం రాత్రి ప్రకటించింది. ఢిల్లీకి చెందిన దీపాన్షు జిందాల్ టాపర్‌గా నిలవగా ప్రత్యూష్ మైని 2, రాజేశ్ బన్సాల్ 3వ ర్యాంకులు సాధించారు. ఇక రాత పరీక్షలో దేశంలోనే అత్యధికంగా 345 మార్కులు సాధించిన తాళ్లూరి సాయితేజకు జేఈఈ మెయిన్‌లో 6వ ర్యాంకు లభించింది. ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆయనకు ఐదో ర్యాంకు రావడం తెలిసిందే. రాత పరీక్షలో 335 మార్కు లు సాధించిన గుంటూరుకు చెందిన ఎం.ప్రశాంత్‌రెడ్డికి 5వ ర్యాంకు వచ్చింది. మొత్తం 22 ఐఐటీలు, ఒక ఐఎస్ఎం, 31 ఎన్ఐటీలు, 18 ఐఐఐటీలు, మరో 18 కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యా సంస్థ ల్లో ప్రవేశానికి సంయుక్త కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్న విషయం తెలిసిందే. -
రేపు జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకుల వెల్లడి
- 20వ తేదీ నుంచి ప్రవేశాల కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాల కోసం గత నెల 22న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఆలిండియా ర్యాంకులు ఆదివారం (ఈ నెల 12న) విడుదల కానున్నాయి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను గౌహతి ఐఐటీ పూర్తి చేసింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దేశవ్యాప్తంగా 1.98 లక్షల మందిని అర్హులుగా ప్రకటించగా.. 1.56 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ, ఏపీల నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించిన 28,951 మందిలో (ఏపీ 14,703, తెలంగాణ 14,248) దాదాపు 21 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో దాదాపు 19 వేల మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్ష ఫలితాలు, ఆలిండియా ర్యాంకులను 12న విడుదల చేయనుంది. అలాగే ఆర్కిటెక్చర్ కోర్సులో ప్రవేశాల కోసం ఈనెల 15న ప్రత్యేక పరీక్ష నిర్వహించనున్నారు. ఈనెల 20 నుంచి ఐఐటీల్లో ప్రవేశాల ప్రక్రియను చేపట్టనున్నారు. ఆర్కిటెక్చర్ పరీక్ష, ఐఐటీ ప్రవేశాల షెడ్యూల్ - ఈ నెల 12, 13 తేదీల్లో ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు (ఏఏటీ) కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ - 15న ఉదయం 9 నుంచి మధాహ్నం 12 వరకు ఏఏటీ పరీక్ష - 19న ఏఏటీ ఫలితాలు ప్రకటన - 20వ తేదీ నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు ఐఐటీల్లో ప్రవేశాల ప్రక్రియ -
ప్రపంచంలోనే సుష్మాస్వరాజ్ ది ప్రథమ స్థానం!
ట్విట్టర్ ఫాలోయర్స్ అధికంగా ఉన్న ప్రపంచంలోని టాప్ టెన్ నాయకుల జాబితాలో ఇద్దరు భారతీయులు నిలువగా... అందులో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ మొదటి స్థానంలో ఉన్నారు. ట్విట్టర్ ఫాలోయర్స్ అధికంగా ఉన్న ఏకైక మహిళా నాయకురాలుగా సుష్మా మొదటి ర్యాంకును సంపాదించగా... ప్రధాని మోదీ మూడో స్థానంలో ఉన్నారు. సోషల్ నెట్వర్క్ సైట్ ట్విట్టర్ లో దాదాపు 20 మిలియన్ లమంది ఫాలోయర్స్ ఉన్న మహిళా నాయకురాలుగా సుష్మాస్వరాజ్ గుర్తింపు పొందారు. ఎక్కువ మంది ఫాలోయర్స్ కలిగిన ట్విట్టర్ టాప్ టెన్ మహిళా నాయకుల జాబితాలో సుష్మా మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత 5 మిలియన్లమంది ఫాలోయర్స్ కలిగిన పురుష నాయకుడుగా ప్రధాని నరేంద్ర మోదీ మూడో స్థానాన్ని పొందినట్లు ఓ అధ్యయనం ద్వారా వెల్లడైంది. ఇకపోతే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బారాక్ ఒబామా 75 మిలియన్ లమంది ఫాలోయర్స్ తో ప్రథమ స్థానంలో నిలువగా, 29 మిలియన్ల ట్విట్టర్ అనుచరులున్న పోప్ ఫ్రాన్సిస్ రెండో స్థానాన్ని సంపాదించారు. అలాగే భారతీయ నాయకుల్లో రెండో స్థానాన్ని పొందిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ స్థాయిలో అత్యధిక ట్విట్లర్ అనుచరులు ఉన్న నాయకుడిగా నాలుగో స్థానంలో ఉన్నారు. పీఎంఓ ఇండియా ఖాతాతో నరేంద్రమోదీ మొత్తం 11మిలియన్ల మంది అనుచరులను కలిగి ఉన్నారు. అలాగే జోర్దాన్ క్వీన్ రైనా.. 4.7 మిలియన్లమంది ఫాలోయర్స్ తో ప్రపంచంలో రెండో మహిళా నాయకురాలుగా నిలిచారు. -
ఆ విషయంలో భారత్ కు 11వ స్థానం!
పూనెః సముద్ర జలాలను శుభ్రపరిచే విషయంలో భారత్ 11వ స్థానంలో ఉన్నట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్థాలను సముద్ర జలాలనుంచి వెలికి తీసి, తీరాలను శుభ్రపరిచే ఓషన్ క్లీన్ ఆప్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రపంచంలోని 130 దేశాల జాబితాలో ఇండియా పదకొండవ స్థానానికి పరిమితమైంది. ఓషన్ కన్జర్వెన్సీ దినోత్సవం సందర్భంగా 2015 సెప్టెంబర్ 26న చేపట్టిన ఓషన్ క్లీన్ ఆప్ కార్యక్రమంలో సముద్ర జలాలనుంచి తొలగించిన చెత్త బరువు ఆధారంగా ఇటీవల నైరోబి ర్యాంకులను వెల్లడించింది. ప్రపంచంలోని 130 దేశాల జాబితాలో భారత దేశం 11వ స్థానంలో ఉన్నట్లు తెలిపింది. అంతర్జాతీయ తీర శుభ్రత కార్యక్రమంలో భాగంగా మొత్తం 8 లక్షల మంది వాలంటీర్లు కలసి సుమారు 80 లక్షల కేజీల వ్యర్థాలను సముద్రం నుంచి వెలికి తీసినట్లు నైరోబి తెలిపింది. ఆయా నగరాల్లోని ఇండియన్ మారిటైం ఫౌండేషన్ సమన్వయంతో భారత దేశంలోని ముంబై, పూనే, గోవా, ఒరిస్సా, హిమాచల్ ప్రదేశ్, కోటా, సహా పశ్చిమ మరియు ఉత్తర భారత దేశంలోని సమారు 250 మైళ్ళ తీరాన్ని10,800 వాలంటీర్లు శుభ్రం చేసినట్లు తెలిపింది. ఒక్క తీరాలను శుభ్రం చేయడమే కాక, నదులనుంచి సముద్రాల్లోకి వచ్చే అనేక వ్యర్థాలను క్లీన్ అప్ ఇండియా కార్యక్రమంలో భాగంగా చేపట్టామని, అందుకు విద్యార్థులు, కార్పొరేటర్లు, ప్రధాన బ్యాంకులు మద్దతునిచ్చాయని ఇండియా క్లీన్ అప్ కార్యక్రమానికి కో ఆర్డినేట్ గా వ్యవహరించిన కమోడోర్ పవన్ మల్హోత్రా తెలిపారు. -
ర్యాంకులు ఉల్టా పల్టా!
* తెలంగాణ, ఏపీ ఎంసెట్‌లో టాప్ ర్యాంకులు తారుమారు * ఇక్కడ ఫస్ట్ ర్యాంకర్‌కు ఏపీలో ఏడో ర్యాంకు * ఏపీలో ఫస్ట్ ర్యాంకర్‌కు తెలంగాణలో పదో ర్యాంకు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ ఎంసెట్ లో టాప్ ర్యాంకులు తారుమారయ్యాయి! ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్‌లో ఫస్ట్ ర్యాంకు సాధించిన విద్యార్థికి తెలంగాణ ఎంసెట్‌లో పదో ర్యాంకు లభించగా.. తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్‌లో ఒకటో ర్యాంకు సాధించిన విద్యార్థికి ఏపీలో 7వ ర్యాంకు వచ్చింది. అగ్రికల్చర్ అండ్ మెడికల్(ఎంబీబీఎస్, బీడీఎస్ మినహా) ఎంసెట్‌లోనూ ఇదే పరిస్థితి. తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో ఒకటో ర్యాంకు సాధించిన విద్యార్థికి ఏపీలో 100వ ర్యాంకు లభించింది. ఇదే విభాగంలో తెలంగాణ ఎంసెట్‌లో పదో ర్యాంకు సాధించి న విద్యార్థికి ఏపీలో 193వ ర్యాంకు వచ్చింది. ఇటీవల ఏపీ ఎంసెట్ ఫలితాలను ప్రకటించగా.. గురువారం తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వెల్లడయ్యాయి. తెలంగాణ ఎంసెట్ రాసిన అనేక మంది విద్యార్థులు ఏపీ ఎంసెట్ కూడా రాశారు. ఏపీ ఎంసెట్ రాసిన వారిలో చాలామంది తెలంగాణ ఎంసెట్‌కు హాజరయ్యారు. రెండుచోట్లా తొలి పది స్థానాల్లో నిలిచినవారికి తెలంగాణలో వచ్చిన ర్యాంకు ఏపీలో రాలేదు.. ఏపీలో వచ్చిన ర్యాంకు తెలంగాణలో రాలేదు. వీరివే కాదు ఇలా అనేక మంది విద్యార్థుల ర్యాంకులు మారిపోయాయి. మెడికల్ టాపర్ల మనోగతం గ్రామాల్లో సేవ చేస్తా: ప్రదీప్ గాలివీడు: ఏపీలోని వైఎస్సార్ జిల్లాకు చెందిన బొజ్జల ప్రదీప్ కుమార్ రెడ్డి తెలంగాణ మెడికల్‌లో తొలి ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. రాయచోటి నియోజకవర్గం గాలివీడుకు చెందిన బొజ్జల నారాయణరెడ్డి, అంజనమ్మ దంపతుల కుమారుడైన ప్రదీప్ ఇంటర్లో ఏపీలో రెండో ర్యాంకు సాధించాడు. ఇటీవలి ఏపీ ఎంసెట్ మెడికల్ ఫలితాల్లో 100వ ర్యాంకు సాధించాడు. తండ్రి టీచర్ కాగా తల్లి గృహిణి. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. కార్డియాలజిస్టుగా గ్రామాల్లో పేదలకు సేవ చేయడమే నా లక్ష్యం’’ అని ప్రదీప్ ‘సాక్షి’కి తెలిపాడు. ఎయిమ్స్‌లో సీటే లక్ష్యం..: అర్బాజ్ కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన మహ్మద్ అర్బాజ్ తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో మెడికల్ విభాగంలో మూడో ర్యాంకు సాధించాడు. ఏపీ ఎంసెట్‌లో 48వ ర్యాంకు సాధించిన అర్బాజ్, ఢిల్లీ ఎయిమ్స్‌లో సీటు సాధించడమే తన లక్ష్యమని తెలిపాడు. ఇంటర్‌లోనూ ప్రతిభావంతురాలు హైదరాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు చెందిన ఉప్పల ప్రణతి మెడికల్ విభాగంలో రాష్ట్రంలో నాలుగో ర్యాంకు సాధించింది. పదో తరగతి, ఇంటర్‌లోనూ ఆమె అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. తల్లి హేమలత గృహిణి కాగా తండ్రి హైటెక్ సిటిలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. పదో తరగతిలో 9.8 గ్రేడ్ తెలంగాణ ఎంసెట్ మెడికల్ విభాగంలో ఐదో ర్యాంకు సాధించిన యజ్ఞప్రియ ఇటీవలి ఏపీ ఎంసెట్‌లో మూడో ర్యాంక్ సాధించింది. వీరిది మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట. తండ్రి సత్యనారాయణరెడ్డి హైదరాబాద్‌లో సాగునీటి శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. యజ్ఞప్రియ పదో తరగతిలో 9.8 గ్రేడ్ మార్కులు, ఇంటర్లో 975 మార్కులు సాధించింది. మంచి డాక్టర్నవుతా: జలీలి హైదరాబాద్ పాతబస్తీ నూర్‌ఖాన్‌బజార్‌కు చెందిన జీషాన్ అహ్మద్ జలీలి ఎంసెట్ మెడికల్‌లో 6వ ర్యాంక్ సాధించాడు. మంచి వైద్యునిగా ఎదుగుతానని అతను చెప్పాడు. జీషాన్ తండ్రి డాక్టర్ ఖలీం అహ్మద్ జలీలి నిజాం కాలేజీలో ఫిజిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాగా తల్లి అంజుమ్ ఫాతిమా యాకత్పురా ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్. జీషాన్ అక్క మరియా డాక్టర్. సోదరుడు హరూన్ అమెరికాలో ఎంఎస్ చదువుతున్నాడు. -
హెచ్‌సీయూ
ర్యాంకింగ్‌లో మేటి.. విశ్వవిద్యాలయాలకు అంతర్జాతీయంగా ఇస్తున్న ర్యాంకుల్లో భారత్‌కు తగిన గుర్తింపు లభించటంలేదు. ఈ క్రమంలో దేశంలోని అన్ని కళాశాలలకు మానవవనరుల మంత్రిత్వ శాఖ ర్యాంకింగ్స్‌ను ఇస్తూ, పోటీతత్వ వాతావరణాన్ని ఏర్పరిచింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ సహకారంతో నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్స్ ఫ్రేంవర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ఈ ర్యాంకులు రూపొందించింది. ఈ ర్యాంకింగ్స్‌లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కు నాలుగో స్థానం దక్కింది. యూనివర్సిటీ : ప్రొఫైల్ వినూత్న కోర్సులెన్నో.. ప్రస్తుత జాబ్ మార్కెట్ అవసరాలకనుగుణంగా ఎన్నో కొత్త కోర్సులకు హెచ్‌సీయూ రూపకల్పన చేసింది. ఈ క్రమలో ఎంఎస్సీలో ఐదేళ్ల కెమికల్ సెన్సైస్, సిస్టమ్స్ బయాలజీ, ఆప్టోమెట్రీ అండ్ విజన్ సెన్సైస్, హెల్త్ సైకాలజీ, ఎర్త సెన్సైస్ వంటి కోర్సులకు అంకురార్పణ చేసింది. ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ/బైపీసీ ఉత్తీర్ణులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సోషల్ సెన్సైస్‌లో కూడా ఆంత్రోపాలజీ, సోషియాలజీ వంటి ఐదేళ్ల ఎంఏ కోర్సులున్నాయి. రెండేళ్ల ఎంఎస్సీలో సాధారణ సబ్జెక్టులతోపాటు ఓషన్ అండ్ అట్మాస్ఫియరిక్ సెన్సైస్ వంటి విభిన్న కోర్సును ఆఫర్ చేస్తోంది. సౌకర్యాల్లో ఉత్తమం పరిశోధనలు, టీచింగ్, లైబ్రరీ.. వంటి అన్ని సదుపాయాలు విద్యార్థులకు ఎంతో అనుకూలం. 13 యునీక్ స్కూళ్లలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో ఎంటెక్ చేసిన విద్యార్థులకు జాబ్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. 90 నుంచి 95 శాతం మంది విద్యార్థులకు విదేశాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. బయోటెక్నాలజీ, మెడికల్ సెన్సైస్ వంటి విభాగాల్లో పరిశోధనలు పెరుగుతున్నాయి. మా దగ్గర పేటెంట్స్ కౌంట్ కూడా ఎక్కువగానే ఉంటోంది. విద్యార్థులకు ఇతర దేశాల్లో పరిశోధనలు చేసుకునేందుకు ఆర్థిక ప్రోత్సాహం కూడా అందిస్తున్నాం. అత్యాధునిక, డిజిటలైజేషన్‌తో ఉన్న లైబ్రరీ యూనివర్సిటీ సొంతం. దీనికోసం ఏటా రూ.1.65 కోట్లు ఖర్చుపెడుతున్నాం. లేబొరేటరీల్లో అత్యుత్తమమైన పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఇక టీచింగ్‌లో అడ్వాన్స్డ్ టీచింగ్ మెథడ్స్ అయిన ఆడియో విజువల్ మెథడ్స్‌తోపాటు ఇంటరాక్షన్ సెషన్స్, ఎక్స్పరిమెంట్స్ వంటి వాటిని ఉపయోగిస్తాం. తద్వారా విద్యార్థులకు నాణ్యమైన బోధన అందిస్తున్నాం. - ప్రొఫెసర్ జె.మనోహర్‌రావు,ఎకనామిక్స్ విభాగం, హెచ్‌సీయూ. -
మంత్రి ర్యాంకు మారింది కదా!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా మంత్రి అచ్చెన్న పనితీరు ఆధారంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో తాజాగా ర్యాంకులు ప్రకటించారు. ఎమ్మెల్యే హోదాలో ఆయనకు రాష్ర్టవ్యాప్తంగా 33వ ర్యాంకు వచ్చింది. మంత్రి స్థానంలో ఏడో ర్యాంకు, జిల్లా స్థాయిలో మూడో ర్యాంకు తెచ్చుకున్నారని అధిష్టానమే ప్రకటించింది. అయితే జిల్లాలోని ఆయన అభిమానులు డే అండ్ నైట్ కూడలిలో ఇటీవల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పనితీరులో నెం.1 మంత్రి వర్యులుగా గుర్తింపు పొందిన మన ప్రజానేత అంటూ ప్రదర్శన ఏర్పాటు చేశారు. భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అందరి దృష్టిని ఆకర్షించేలా పెట్టారు. అయితే మంత్రి ర్యాంకు మారింది. ఆయన ర్యాంకు నెంబర్ 1 నుంచి 7కు దిగిపోయింది. అయినా ఫ్లెక్సీని అలాగే వదిలేశారు. మరో విశేషమేమిటంటే తమ అధినేత ప్రకటించిన ర్యాంకులు ఆయా వ్యక్తుల పనితీరుకు కొలమానమేమీ కాదని సాక్ష్యాత్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే కళా వెంకటరావు మంగళవారం విశాఖలో సెలవిచ్చారు. సీఎం ఇచ్చిన ర్యాంకుల్ని పట్టించుకోనక్కర్లేదని పార్టీ నేతలే స్పష్టం చేస్తుంటే అలాంటప్పుడు తమ నేత నెంబర్-1 అంటూ తమ్ముళ్లు గొప్పలు చెప్పుకోవడం ఏంటంటూ దారంట పోయేవాళ్లు ఫ్లెక్సీని చూసి నవ్వుకొంటున్నారు. గతంలో పలు మీడియా సమావేశాల్లోనూ తెలుగు తమ్ముళ్లు స్థానిక నేతలకు వచ్చిన ర్యాంకుల్ని బయటపెడుతూ గొప్పలకు పోవడాన్ని అంతా గుర్తుచేసుకొంటున్నారు. -
సీఏ-ఐపీసీసీ ఫలితాల్లో శ్రీమేధకు ర్యాంకుల పంట
గుంటూరు ఎడ్యుకేషన్ : ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) సోమవారం విడుదల చేసిన చార్టర్డ్ అకౌంటెంట్ ఇంటిగ్రేటెడ్ కాంపిటెన్సీ ప్రొఫెషనల్ కోర్స్ (సీఏ-ఐపీసీసీ) ఫలితాల్లో శ్రీమేధ సీఏ విద్యాసంస్థల విద్యార్థులు జాతీయస్థాయిలో ర్యాంకులు కైవసం చేసుకున్నారని సంస్థ డెరైక్టర్ అన్నా నందకిషోర్ తెలిపారు. బ్రాడీపేట 6వ లైనులోని సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఏ-ఐపీసీసీ ఫలితాల్లో కమతం విజయలక్ష్మి 700 మార్కులకు గాను 463 మార్కులతో జాతీయస్థాయిలో 40వ ర్యాంకు కైవసం చేసుకుందని చెప్పారు. మరో విద్యార్థి ఆర్.రఘునాథ్ 459 మార్కులతో 44వ ర్యాంకు సాధించారని వివరించారు. కొండా చందన 442, గునుపూరు శివసాయి 423, తుమ్మల సాయి భాస్కర్ 416, వల్లంరెడ్డి రమ్యారెడ్డి 410 మార్కులతో అత్యధిక ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఐపీసీసీలో తప్పిన విద్యార్థులకు ఈనెల 4 నుంచి సబ్జెక్టుల వారీగా కోచింగ్‌తో పాటు రెగ్యులర్ పరీక్షల షెడ్యూల్‌తో తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. 40వ ర్యాంకర్ కమతం విజయలక్ష్మి మాట్లాడుతూ ఐపీసీసీలో ర్యాంకు సాధించిన తన సోదరి వైష్ణవిని స్ఫూర్తిగా తీసుకుని సీఏ కోర్సును ఎంపిక చేసుకున్నానని వివరించారు. -
బట్టి విక్రమార్కులు
పరీక్షలకు ఇంకా టైముంది గానీ, సిలిబస్‌ను పూర్తిచేయడానికి మాత్రం ఇది తగినంత సమయం కాదనే విద్యార్థుల మనోగతం. మార్చి, సెప్టెంబర్ బడుద్ధాయి బ్యాచ్ సంగతి వదిలేద్దాం. పరీక్షలంటే వాళ్లకు ఏమాత్రం లక్ష్యం ఉండదు. ఒక్క ఊపులోనే పరీక్షలు గట్టెక్కేయాలనే పట్టుదల ఉన్న బుద్ధిమంతుల గురించి ఆలోచిద్దాం. వాళ్లందరికీ ఇది రివిజన్ సీజన్. అనగా పునశ్చరణ రుతువు. స్కూళ్లల్లో, కాలేజీల్లో పాఠాలు సరిగా చెప్పినా, చెప్పకపోయినా సిలబస్‌ను పూర్తిగా చదివి తీరాల్సిందేననే ఆత్మజ్ఞానం ఇలాంటి విద్యార్థులకు ఎక్కువగానే ఉంటుంది. స్కూళ్లు, కాలేజీలలో చెప్పే పాఠాలతో పరీక్షల్లో ర్యాంకులు వస్తాయో లేదోననే అనుమానంతో వాళ్ల తల్లిదండ్రులు కూడా వాళ్లను కోచింగ్ సెంటర్లకు పంపిస్తారు. ఇక కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల బతకనేర్పరితనం గురించి చెప్పనే అక్కర్లేదు. ఎప్పుడో చదవబోయే కోర్సుల కోసం బొడ్డూడని దశ నుంచే కోచింగ్ మొదలుపెడతారు. వీరికి జతగా ఇంకొందరు ఘనాపాటీలు ఉంటారు. విద్యార్థుల కష్టాలను తీర్చే ఆపద్బాంధవుల్లా ప్రతి సబ్జెక్టుకూ ‘మేడీజీ’ పేరిట మేడ్డిఫికల్ట్ గైడ్లు ఎడాపెడా అచ్చోసి పడేస్తారు. టెక్స్ట్ పుస్తకాలు, గైడ్లు, కోచింగులకు తల్లిదండ్రులు ఎటూ అప్పుల పాలవుతారు. తమ పిల్లలకు కోరుకున్న కోర్సుల్లో చేరడానికి తగిన ర్యాంకులు వస్తే సరేసరి... ఆనందబాష్పాలు రాలుస్తారు. చదువుల భారం మోయలేక చతికలబడి, ర్యాంకుల్లో వెనుకబడ్డారో తల్లిదండ్రులు డిప్రెషనల్‌లో పడిపోయి, ఆ డిప్రెషన్‌ను పిల్లల నెత్తికి సరఫరా చేస్తారు. తల్లిదండ్రుల్లోని ఇలాంటి ధోరణి కారణంగానే ఒక్కోసారి ఆత్మహత్యల వంటి అనర్థాలు తలెత్తుతూ ఉంటాయి. విజన్ ఉండాలి గురూ! ఇలాంటి అనర్థాలను అరికట్టాలంటే, పూర్తిగా టీచింగులు, కోచింగులనే నమ్ముకోరాదు. విజన్ గల విద్యార్థులకు ఈ విషయం ముందే తెలుసు. అందుకే వాళ్లకు రివిజన్ ప్రాధాన్యం కూడా తెలుసు. వాళ్లంతా బుద్ధిమంతులు కదా! ఎప్పటి పాఠాలను అప్పుడే చదివేసుకుంటారు. చదివేసుకున్నంత మాత్రాన పూర్తిగా వంటబట్టేస్తే అవి పాఠాలెలా అవుతాయి? అవి వంటబట్టాలంటే పునశ్చరణ తప్పదు. పరీక్షలకు ఎంత ముందుగా రివిజన్ ప్రారంభిస్తే అంత మంచిది. రివిజన్‌లోనూ రకరకాల పద్ధతులు ఉన్నాయి. అన్ని పద్ధతులూ అందరికీ సరిపడవు. ఎవరికి సరిపడే పద్ధతిని వారు ఎంచుకోవాల్సిందే. ఒకరిని చూసి మరొకరు రివిజన్ పద్ధతిని కాపీ కొడితే ఫలితాల్లో తేడా వచ్చే ప్రమాదం లేకపోలేదు. విద్యార్థుల్లో కొందరు ఉంటారు... వాళ్లు ‘బట్టి’విక్ర‘మార్కులు’. సబ్జెక్టును ఎంతగా బట్టీ పడితే అంతగా మార్కులు కొట్టేయవచ్చని వారి ప్రగాఢ విశ్వాసం. ఇలాంటి వాళ్లు సబ్జెక్టును వీలైనంతగా నెమరు వేసుకుంటూనే ఉంటారు. ఒక్కోసారి వాళ్ల అంచనా సత్ఫలితాలనే ఇస్తూ ఉంటుంది. అయితే, అది వారి అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ప్రశ్నల్లో కాస్త తేడా వచ్చినా, ఇలాంటి ‘బట్టి’విక్ర‘మార్కులు’ బోల్తాపడతారు. ఫలితాలు వచ్చాక భోరుమంటారు. ఇంకొందరు ఉంటారు... వీళ్లు క్షీరనీర న్యాయాన్ని పాటిస్తారు. సబ్జెక్టులోని సారాంశాన్ని క్షుణ్ణంగా గ్రహిస్తారు. చదువుల సరస్సులో వీళ్లు రాయంచల్లాంటి వాళ్లు. వీళ్లు ర్యాంకులను నమ్ముకోవడం కాదు, ర్యాంకులే వీళ్లను నమ్ముకుంటాయి. యాంటీ రివిజనిస్టులు విద్యార్థుల్లో సినిమాలు, షికార్లు, క్రికెట్ మ్యాచ్‌లు... వంటి నానా కళాపోషణ కార్యక్రమాల్లో తెగ బిజీగా ఏడాదంతా కులాసాగా, ధిలాసాగా గడిపేసే వాళ్లూ ఉంటారు. ఇలాంటి వాళ్లు తల్లిదండ్రులకే కాదు, పాఠాలు చెప్పే టీచర్లకూ తగని తలనొప్పిగా ఉంటారు. వీళ్లకు చదువంటేనే పెద్దగా గిట్టదు. మొక్కుబడిగా నాలుగు ముక్కలు చదివినా, రివిజన్ అంటే అస్సలు గిట్టదు. అర్ధరాత్రి వరకు మెలకువగా ఉంటూ, గుంపులు గుంపులుగా ఒకచోట గుమిగూడి పుస్తకాలతో కుస్తీ పడుతూ గ్రూప్ స్టడీస్ చేసేవాళ్లపై ఇలాంటి వాళ్లు సెటైర్లు వేస్తుంటారు. రివిజన్ చేసే సాటి క్లాస్‌మేట్స్‌ను ‘రివిజనిస్టులు’ అని పేరుపెట్టి ఆటపట్టిస్తుంటారు. ఇలాంటి యాంటీ రివిజనిస్టులు కూడా పరీక్షల్లో గట్టెక్కడానికి నానా మార్గాలను అన్వేషిస్తూనే ఉంటారు. వాళ్ల దృష్టిలో రివిజన్ కంటే విజన్ ముఖ్యం. విజన్ ఉన్నవాళ్ల విజయాన్ని ఎవరూ ఆపలేరనేది వారి ప్రగాఢ విశ్వాసం. ఇలాంటి వాళ్లు పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు రావచ్చు అనేదానిపై కొంత కసరత్తు చేస్తారు. అలాగని, సమాధానాలు చదువుతారని అనుకోవద్దు. వాళ్లెప్పుడూ అలాంటి అఘాయిత్యాలకు పాల్పడరు. పరీక్షల్లో రాగలవని గుర్తించిన ప్రశ్నలకు సమాధానాలను ఇంచక్కా స్లిప్పులుగా తయారు చేస్తారు. వాటిని ఇన్విజిలేటర్ల కళ్లు గప్పి పరీక్ష హాల్లోకి రవాణా చేసే మార్గాలను పకడ్బందీగా ముందే ఏర్పాటు చేసుకుంటారు. అదృష్టం కలిసొస్తే అప్పుడప్పుడు ఇలాంటి వాళ్లు కూడా పరీక్షల్లో పాసైపోతూ ఉంటారు. పెద్దలకూ ఉండాలి... నేర్చుకున్న పాఠాల పునశ్చరణ పిల్లలకేనా? విజన్, రివిజన్ పెద్దలకూ ఉండాలి. పాఠాలనే కాదు, గుణపాఠాలనూ క్రమం తప్పకుండా నెమరు వేసుకోవాలి. లేకపోతే బతుకు పరీక్షలో ఫెయిల్ కాక తప్పదు. చదువంటే బడిలో చెప్పే పాఠాలేనా? ఇళ్లల్లోని పెద్దలు స్వానుభవంతో చెప్పే సుద్దులు కూడా బతుకు పాఠాలే! వాళ్లేదో చాదస్తం కొద్దీ అలా చెబుతుంటార్లే అనుకొని నిర్లక్ష్యం చేస్తే, ఎప్పుడో ఒకప్పుడు ఎదురుదెబ్బలు తినక తప్పదు. ఎవరో కవి చెప్పినట్లు బతుకు పూల బాట కాదు. అందులో ముళ్లుంటాయి, రాళ్లుంటాయి. ఎక్కడికక్కడ ఎగుడుదిగుళ్లు ఉండనే ఉంటాయి. ఎగుడుదిగుళ్ల బతుకుబాటలో నడవడం అంత తేలిక కాదు. అడుగడుగు ఆచి తూచి వేయాల్సిందే! అలాంటి బాటలో వడివడిగా నడిచే చాకచక్యాన్ని అలవరచుకున్న వాళ్లే జీవిత గమ్యాలను చేరుకోగలరు. అలాంటి వాళ్లే విశ్రాంత జీవితంలో ‘జీవితమే సఫలము’ అని తృప్తిగా పాడుకోగలరు. విశ్రాంత జీవితం ప్రశాంతంగా గడపాలంటే, ఒంట్లో జవసత్వాలు ఉన్నప్పుడే మనిషికి తనదైన విజన్ కావాలి. జీవన గమనంలో నేర్చుకున్న ప్రతి పాఠాన్నీ రివిజన్ చేసుకునే నిబద్ధత కావాలి. విజన్‌ను, రివిజన్‌ను నమ్ముకున్న వాళ్లు జీవనసంధ్యలో లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును సాధించినట్లే! - పన్యాల జగన్నాథదాసు -
టీడీపీలో ర్యాంకుల చిచ్చు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ప్రభుత్వ పథకాల అమలు, వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేసిన శాసనసభ్యులకు అధిష్టానం ప్రకటించిన ర్యాంకులు జిల్లా టీడీపీలో చిచ్చు రేపుతున్నాయి. మంచి ర్యాంకులు తెచ్చుకున్నవాళ్లు సంబరాల్లో మునిగిపోతుంటే పెద్ద ర్యాంకులొచ్చిన వాళ్లు మాత్రం పెదవి విరుస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని గోల ఇప్పుడెందుకంటూ విసుక్కుంటున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై అధిష్టానం ఓ సర్వే చేయించింది. అది ఎప్పుడు జరిగింది, ఎవరు చేశారు, శాస్త్రీయత ఏంటనే విషయంలో స్పష్టత లేనప్పటికీ రుణమాఫీ, ఇసుక రీచ్‌ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రప్పించడం, ఆరోగ్య సేవల అంశాల్ని ఆధారంగా చేసుకుని ర్యాంకులిచ్చారనే చెబుతున్నారు. మూడు రోజుల నుంచీ ఎక్కడ చూసినా ఈ ర్యాంకుల గోలే. ఈ నెల ఒకటో తేదీన విజయవాడలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, ఎమ్మెల్సీల్లో కష్టపడినవారికి చంద్రబాబు అభినందనలు తెలియజేశారు. పనితీరు బాగున్నవాళ్లను ప్రశంసిస్తూనే బాగాలేనివాళ్లను సుతిమెత్తగా మందలించారు. అంతేగాదు... వ్యక్తిగతంగా లేఖలు పంపించారు. ఈ లేఖలే ఇప్పుడు తమ్ముళ్ల మధ్య అభిప్రాయభేదాలకు కారణమయ్యాయి. ఎవరు గొప్ప నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్యేల పనితీరుకు కొలమానంగానే ర్యాంకులు ప్రకటించారని చెబుతున్నారు. అయితే పలాస నియోజకవర్గంలో అసలు ఇసుక రీచ్‌లే లేవు. కానీ ఎమ్మెల్యే శివాజీకి ‘ఏడు’పుగొట్టు ర్యాంకు ప్రకటించారని ప్రచారం జరుగుతోంది. కొత్తగా విప్ పదవిలోకి వచ్చిన కూన రవికుమార్‌కు ఎనిమిదోర్యాంకంట. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలున్న పాలకొండ, పాతపట్నం, రాజాం నియోజకవర్గాల్లో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిలకే ర్యాంకులు ప్రకటించారు. ప్రతిభాభారతి ఐదులోపు ర్యాంకు తెచ్చుకోలేకపోయారు. శ్రీకాకుళం, టెక్కలి, నియోజకవర్గాలకు ఒకటి నుంచి మూడు ర్యాంకులు ప్రకటించారని మిగతా వాటిలో మాత్రం గందరగోళం నెలకొందంటున్నారు. సీనియర్లయిన కళా వెంకటరావు, గౌతు శివాజీలకు ఐదు తరువాతి ర్యాంకులిస్తే వాళ్లు అసలు పనిచేయనట్టేనా అని తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. అదే విధంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలున్నచోట దేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలకు ర్యాంకులివ్వడం వెనుక పారదర్శకత కరువైందని, ఇలా అయితే ఎమ్మెల్యేలను అగౌరవపర్చినట్టేనంటున్నారు. అదే విధంగా మంత్రులకు ఈ ర్యాంకుల ప్రస్తావన చెప్పలేదని అలాంటప్పుడు జిల్లా మంత్రి అచ్చెన్నాయుడుకు రెండో ర్యాంకు ఎలా సాధ్యం అంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు లేనిచోట నియోజకవర్గ ఇన్చార్జికి ఐదులోపు ర్యాంకులివ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముందు పార్టీ మారి నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న శతృచర్లకు సిటింగ్ ఎమ్మెల్యేల కంటే కాస్త ఎక్కువ గౌరవించారని గుర్రుమంటున్నారు. ఇలా అయితే భవిష్యత్తులో ఎవరూ పనిచేయలేమని తెగేసి చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా ఇప్పటివరకూ ఏ ఎమ్మెల్యేకు ఏ ర్యాంకు అన్న విషయం జిల్లా పార్టీ కార్యాలయానికి సైతం తెలియకపోవడం విశేషం. -
ప్రోగ్రెస్ రిపోర్ట
- జిల్లాలో కాగిత ఫస్ట్ - నందిగామ లాస్ట్ - మూడో స్థానంలో నిలిచిన గద్దె రామ్మోహన్ - ఆరో స్థానంతో సరిపెట్టుకున్న బొండా ఉమా సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమ ఎమ్మెల్యేలకు ర్యాంకులు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించారు. జిల్లాలోని 16 నియోజకవర్గాల్లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలకు, పార్టీ ఇన్చార్జులకు ఈ సందర్భంగా ఈ ర్యాంకులను సీల్డ్ కవర్లో అందజేశారు. నగరంలోని ఎ-కన్వెన్షన్ సెంటర్లో టీడీపీ రాష్ట్ర సమావేశం శనివారం జరిగింది. సమావేశం ముగింపు సమయంలో చంద్రబాబు ఆదేశాలతో అందరికీ సీల్డు కవర్లు అందాయి. దీంతో ఎమ్మెల్యేలందరిలో ఒక్కసారిగా ఆసక్తి, ఉత్కంఠ రేకెత్తాయి. ఇంతలోనే వారి ఆలోచనలకు తెరదించుతూ.. ‘నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా సర్వే నిర్వహించి ర్యాంకులు ఇచ్చాం. మీకు వచ్చిన ర్యాంకులు చూసుకోండి’ అని బదులిచ్చి సమావేశం ముగిం చారు. దీంతో తమకు ఏ ర్యాంకు కేటాయించారా అని చాలామంది ఆసక్తిగా చూసుకున్నారు. టాప్ ర్యాంకులు ఇవే.. జిల్లాలో పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలకు, ఐదుగురు టీడీపీ ఇన్చార్జిలకు ముఖ్యమంత్రి ర్యాం కులు ఇచ్చారు. జన్మభూమి, నియోజకవర్గాల్లో ప్రభుత్వ పథకాల అమలు, ప్రజలతో ఎమ్మెల్యే మమేకం అవుతున్న తీరు, నిత్యం ప్రజలతో కొనసాగిస్తున్న సంబంధాలు తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుని అంశాలవారీగా, వ్యక్తిగతంగా ఈ ర్యాంకులు ఇచ్చినట్లు తెలిసింది. ఈ ర్యాంకుల్లో జిల్లాలో మొదటిస్థానంలో పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్, రెండోస్థానంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, మూడో స్థానంలో ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామోహ్మన్, నాలుగో స్థానంలో మైలవరం ఎమ్మెల్యే, రాష్ట్రమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఐదో స్థానంలో పామర్రు నియోజకవర్గ ఇన్చార్జి వర్ల రామయ్య, ఆరో స్థానంలో సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఉన్నారు. చివరి రెండు స్థానాలైన 15, 16 స్థానాల్లో తిరువూరు ఇన్చార్జి స్వామిదాసు, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఉన్నారు. 12వ స్థానంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, 13వ స్థానంలో పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఉన్నట్లు సమాచారం. విజయవాడ పార్లమెంట్ స్థానానికి మొదటి ర్యాంక్ దక్కినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దిశానిర్దేశం టీడీపీ రాష్ట్ర సమావేశం నగరంలోని ఎ-కన్వెన్షన్ సెంటర్లో శనివారం జరిగింది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఉదయం 10 గంటలకు మొదలైన సమావేశం సాయంత్రం 5.30 గంటల వరకు సాగింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే అంశం, కేంద్రం అనుసరిస్తున్న తీరుపై సుదీర్ఘ చర్చ జరిగింది. నదులను అనుసంధానం చేయటం, పట్టిసీమ ప్రాజెక్ట్, పోలవరం, రైల్వే జోన్ల అభివృద్ధి, రాజధాని నిర్మాణం తదితర అంశాలపై చర్చ సాగింది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై నిర్వహించిన సర్వే ఆధారంగా చంద్రబాబు ప్రసంగించారు. ప్రధానంగా ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. ఇలా అనేక అంశాలపై చర్చ సాగింది. అంశాలవారీగా ప్రభుత్వ పథకాల్లోని లోపాలు, ఇతర అంశాలపైనా ఈ సందర్భంగా చర్చించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ శ్రేణులను కలుపుకొని పనిచేయాలని, నామినేట్ పదవుల భర్తీకి వెంటనే జాబితాలు సిద్ధంచేసి పంపాలని ఆదేశించారు. జిల్లాకు సంబంధించి అంశాలపై ప్రత్యేకంగా ఎలాంటి చర్చా జరగలేదని సమాచారం. వర్ల రామయ్య జన్మదినం కావటంతో వేదికపైనే సీఎం చంద్రబాబు కేక్ కట్ చేయించి నేతలతో కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
మసిపూసి మారేడుకాయ
* రహస్యంగా ప్రైవేటు మెడికల్ ర్యాంకుల ప్రకటన * వెబ్సైట్లో ర్యాంకులు పెట్టి చేతులు దులుపుకున్న యాజమాన్యాలు * ఇంటర్ వెయిటేజీ మార్కులతో కలిపి వెల్లడి * సగం మంది ర్యాంకులు ప్రకటించని వైనం * ఖమ్మంకు చెందిన కొండా అన్వితకు మొదటి ర్యాంకు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రైవేటు వైద్య, దంత కళాశాలల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక వైద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎం-సెట్) ర్యాంకులను శుక్రవారం ప్రకటించారు. ర్యాంకుల వివరాలను ప్రభుత్వానికి తెలపడం కానీ... అధికారికంగా ప్రకటించడంగానీ చేయలేదు. అత్యంత రహస్యంగా వెబ్సైట్లో పెట్టి ప్రైవేటు యాజమాన్యాలు తమ ధిక్కారాన్ని ప్రదర్శించాయి. ఏ ప్రమాణాలను ఆధారం చేసుకొని ర్యాంకులను వెల్లడిస్తున్నారో ప్రకటించలేదు. కనీసం మీడియాకు ప్రకటన కూడా జారీచేయలేదు. కేవలం విద్యార్థుల పేర్లను, ర్యాంకులను వెల్లడించి ఊరుకున్నారు. ఇంతగోప్యత పాటించడం వెనుక అక్రమాలకు తెరలేపారన్న విమర్శలు వెల్లువెత్తాయి. అన్నీ సందేహాలే! ప్రైవేటు యాజమాన్యాల ప్రత్యేక ఎం-సెట్ నోటిఫికేషన్ మొదలు... ర్యాంకుల ప్రకటన వరకూ ఎక్కడా పారదర్శకత లేదు. కనీసం వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి కూడా చెప్పకుండానే నోటిఫికేషన్, మార్కులను, ర్యాంకులను విడుదల చేశారు. అంతేకాదు దరఖాస్తు సమయంలో వెయిటేజీ కోసం ఇంటర్ మార్కులను, హాల్‌టికెట్ నెంబర్‌ను అడగలేదు. ప్రభుత్వం నుంచి చీవాట్లు పడ్డాక ఇంటర్ వెయిటేజీ ఉంటుందని పేర్కొన్నారు. ఇంటర్ మార్కులను అప్లోడ్ చేయాలన్న విషయాన్ని కూడా అందరికీ చెప్పకుండా తమకు కావాల్సిన వారికి మాత్రమే అప్లోడ్ చేయమని సమాచారమిచ్చారని తెలిసింది. ఇలా తాము అమ్మేసుకున్న సీట్ల విద్యార్థులకు తగినట్లుగా ర్యాంకులను ప్రకటించారా అన్న విమర్శలు వస్తున్నాయి. పరీక్షకు 5,130 మంది హాజరైతే... 2,266 మంది ర్యాంకులే ప్రకటించారు. ఇంత తక్కువ మంది ర్యాంకులు ప్రకటించడం వెనుక మతలబేంటి? ఇంటర్ వెయిటేజీ కలిపాక దాదాపు సగం మందే అర్హత సాధించారా? లేకుంటే అంతమందే ఇంటర్ మార్కులను అప్లోడ్ చేశారా? ఇవన్నీ సందేహాలే. ర్యాంకుల ప్రకటనకు ఎంత కట్ ఆఫ్ మార్కును తీసుకున్నారనేది కూడా తెలియదు. మొదటి ర్యాంకర్ ఖమ్మంకు చెందిన అన్విత ప్రవేశ పరీక్ష మార్కులను 75 శాతంగా, ఇంటర్ మార్కులను 25 శాతంగా లెక్కించి ర్యాంకులను వెల్లడించారు. ఈ ర్యాంకులను కేవలం ఇంటర్ మార్కుల శాతాన్ని www.tgmedico.com లో అప్లోడ్ చేసిన వారికే కేటాయించారు. అప్లోడ్ చేయని వారికి ర్యాంకులను కేటాయించలేదు. ప్రవేశ పరీక్ష, ఇంటర్ వెయిటేజీని కలిపి లెక్కిస్తే ఖమ్మంకు చెందిన కొండా అన్విత మొదటి స్థానంలో నిలిచింది. ఆమె ఎం-సెట్లో 147 మార్కులు సాధించింది. రెండో ర్యాంకును హైదరాబాద్‌కు చెందిన ఊటుకూరి తేజ సాధించాడు. మూడో ర్యాంకును వడ్ల క్రిష్ణయ్య శాలిని, నాలుగో ర్యాంకును దాసరి సుష్మారెడ్డి, ఐదో ర్యాంకును శశాంక్ పరిమి, ఆరో ర్యాంకును కొరళ్ల మహతిరెడ్డి, ఏడో ర్యాంకును శ్రుతి, ఎనిమిదో ర్యాంకును మేఘన, తొమ్మిదో ర్యాంకును కావ్య, పదో ర్యాంకును త్రిభూనేశ్వరి సాధించారు. మొదటి పది ర్యాంకుల్లో 8 ర్యాంకులు అమ్మాయిలకు, రెండు ర్యాంకులు అబ్బాయిలకు వచ్చాయి. -
జేఈఈ మెయిన్ ర్యాంకుల ప్రకటన వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంకుల ప్రకటన వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఈనెల 24న ర్యాంకులను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ప్రకటించాల్సి ఉన్నప్పటికీ వాటిని వాయిదా వేసింది. ఈనె 25వ తేదీ వరకు వివిధ రాష్ట్రాల ఇంటర్మీడియట్, 12వ తరగతి బోర్డులు విద్యార్థులు ఇంటర్మీడియట్/12వ తరగతి ఫలితాల సమాచారాన్ని (డాటా) అందజేయాలని బుధవారం ప్రకటన జారీ చేసింది. 25వ తేదీలోగా ఫలితాల సమాచారం ఇవ్వని బోర్డులకు చెందిన విద్యార్థులకు ర్యాంకులు ఇవ్వడం కుదరదని, ఇందుకు తాము బాధ్యులం కాబోమని స్పష్టం చేసింది. తాజా ప్రకటన నేపథ్యంలో అల్ ఇండియా ర్యాంకులు ఈనెల 26 లేదా 27న వెల్లడించే అవకాశం ఉంది. -
ఈ కాలమ్ మీదే : చర్చా వేదిక
ర్యాంకులు ముఖ్యం కాదు... నేను గత ఇరవై సంవత్సరాలుగా స్కూల్ నడుపుతున్నాను. ఎందరో తల్లిదండ్రులు వారి ఆలోచనలను నాతో పంచుకుంటూ ఉంటారు. బాధాకరమైన విషయం ఏమిటంటే, అందరూ మాట్లాడేది మార్కులు, ర్యాంకుల గురించే. ‘పిల్లలు పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటున్నారా?’ ‘జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకునే విధంగా ఎదుగుతున్నారా?’ ‘తోటివారితో కలిసి మెలసి ఉంటున్నారా?’ ‘ఆడా, మగా సమానమనే భావాన్ని కలిగి ఉన్నారా?’ ... ఇలాంటి వాటి గురించి ఎవరూ అడగడం లేదు. ర్యాంకుల కంటే జీవితాన్ని గెలవగలిగేలా తయారుచేసేదే నిజమైన విద్య. అప్పుడే ఆత్యన్యూనత అనేది దూరంగా పారిపోతుంది. నిజమైన జ్ఞానంతో మనిషి ప్రకాశిస్తూ లోకకళ్యాణానికి దోహదం చేయగలుగుతాడు. తల్లిదండ్రులు ఆ దిశగా ఆలోచించాలని కోరుకుంటున్నాను. - కాసర లక్ష్మిసరోజారెడ్డి, జంగారెడ్డి గూడెం, పశ్చిమగోదావరి. అది ప్రయివేట్ విషయం ఎలా అవుతుంది?! నూజివీడు నుంచి ఒక పాఠకుడు ‘అయ్యో పాపం... తులసీ’ అనే హెడ్డింగ్‌తో రాసిన ఉత్తరాన్ని చదివిన తరువాత చాలా బాధ కలిగింది. ‘చెట్లను కాపాడండి... అవి మనల్ని కాపాడుతాయి’ అనే మాటను మరిచిపోతున్నారు. ‘చెట్లను కాపాడడం వల్ల మనకు వచ్చే లాభం ఏమిటి? కొట్టేస్తే అనేక లాభాలు ఉన్నాయిగానీ..’’ అని తాత్కాలిక లాభాల గురించి స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నారు తప్ప వేరే రకంగా ఆలోచించడం లేదు. ఇంట్లో ఫర్నీచర్ చేయించుకోవడానికి మా ఇంటి పక్కాయన కూలీలను నియమించి చెట్టును కొట్టేయిస్తున్నాడు. ‘‘అదేంటయ్యా... ఆ చెట్టు ఏం పాపం చేసింది?’’ అన్నాను కాస్త కోపంగా. ‘‘ఫర్నీచర్ చేయించుకోవాలి’’ అని తాపీగా ఒక్క ముక్కలో చెప్పాడు. ‘‘ఫర్నీచర్ కోసం చెట్టు కొట్టేయడం తప్పు కదా!’’ అన్నాను. ‘‘తప్పు ఒప్పుల గురించి మాట్లాడడానికి నువ్వెవరు? ఇది మా సొంత విషయం’’ అని నాతో తగాదా పడ్డాడు ఆ పుణ్యాత్ముడు. నేను షాక్ అయ్యాను! చెట్లను నరకడం అనేది ప్రయివేట్ విషయమా?! కఠిన చట్టాలు లేకపోవడం వల్ల, ఉన్న చట్టాలు కూడా చప్పగా ఉండడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. దేవుడి కోసం వందలు, వేలు ఖర్చు చేయనక్కర్లేదు. మన బాధ్యతను మనం సక్రమంగా నిర్వహిస్తే చాలు... దేవుడే న్యాయం చేస్తాడు. నిజానికి చెట్లు అనేవి మనకు కనిపించే ప్రత్యక్షదైవాల్లాంటివి. నిలవ నీడను ఇచ్చే చెట్ల పట్ల అమానుషంగా ప్రవర్తించడం ఏ రకంగానూ సమంజసం కాదు. క్రూరమైన జంతువులు కూడా ఇలాంటి క్రూరమైన పనులు చేయవు. - జి.ప్రభాకర్, కనపర్తి, వరంగల్ జిల్లా. చెట్లను నిర్లక్ష్యం చేస్తే... గత వారం ప్రచురించిన ‘అయ్యో పాపం తులసీ’ ఉత్తరం, ‘పీకే’ సినిమాపై వచ్చిన ఉత్తరాలు చదివాక ఇది రాయాలనిపించింది. నిజానికి రెండిటికీ సంబంధం ఉంది. భక్తి అనేది వాణిజ్యపరం కావడాన్ని గురించి ‘పీకే’ సినిమాలో ప్రశ్నించారు. బయట పరిస్థితి కూడా అలా ఉందనే విషయం ‘అయ్యో పాపం తులసీ’ ఉత్తరం చెప్పకనే చెప్పింది. ‘దేవుడిని మొక్కుకుంటే చాలు... ఇక మిగతా విషయాలను గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అనే భావన పెరిగిపోతుంది. ఇతరులతో మర్యాదగా వ్యవహరించడం, పర్యావరణ స్పృహ కలిగి ఉండడం, నైతిక విలువలతో ప్రవర్తించడం... ఇవి కూడా భక్తిశ్రద్ధలతో చూడాల్సిన విషయాలు. ‘దేవుడు అన్నిచోట్ల ఉంటాడు’ అంటుంటారు. మనం మనసు పెట్టి చూడాలేగానీ... చెట్టులో కూడా దైవం ఉంది. చెట్టును నిర్లక్ష్యం చేస్తే దైవాన్ని నిర్లక్ష్యం చేసినట్లే కదా!! - ఆర్.శ్యాంసుందర్, శ్రీకాకుళం పైపై చర్యల వల్ల ప్రయోజనం ఉండదు ‘స్వచ్ఛభారత్’ మంచి కార్యక్రమమేగానీ ‘నామ్‌కే స్వచ్ఛభారత్’గా మారింది. ఒకరోజు శుభ్రం చేయడం, ఫొటోలకు పోజులు ఇవ్వడం వల్ల ‘స్వచ్ఛభారత్’ రాదు. పై పై చర్యల వల్ల ప్రయోజనం ఉండదు. సమస్య మూలాన్ని గుర్తించి దాన్ని నిర్మూలించడం వల్లే ఫలితం ఉంటుంది. - సొల్లేటి కొండల్రావు, పామూరు, ప్రకాశం జిల్లా. చిత్తశుద్ధి లేని చెత్తశుద్ధి ఏల? స్వచ్ఛభారత్ కార్యక్రమం ‘ఫొటో సెషన్’ కార్యక్రమంగా మారిందా? అనిపిస్తుంది. ఒక పని చేస్తే చిత్తశుద్ధితో చేయాలి. లేదంటే చేయకూడదు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో చాలామంది మొక్కుబడిగా పాల్గొంటున్నారు. స్వచ్ఛభారత్ అనేది ప్రభుత్వ కార్యక్రమం కాదు... అది మన కార్యక్రమం అనుకున్నరోజు ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. చెత్తశుద్ధి చేయడానికే ఎక్కడెక్కడికో వెళ్లనక్కర్లేదు. ఎవరి ఇంటి దగ్గర వాళ్లు, ఎవరు ఆఫీసు దగ్గర వాళ్లు, ఎవరి కాలేజీల దగ్గర వాళ్లు చెత్తను శుభ్రం చేస్తే మంచిది. ప్రచారానికి వెచ్చించే డబ్బును శుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చే గ్రామాలు, వీధులకు ప్రోత్సాహక బహుమతిగా ఇస్తే మంచిది. - సి.ప్రతాప్, మధిర పాఠకులకు ఆహ్వానం ‘ఈ కాలమ్ మీదే’ అనే ఈ చర్చావేదికలో పాల్గొనండి. చర్చనీయాంశం మీ ఇష్టం. ఏ సామాజిక అంశాన్నయినా, ఆలోచననైనా మీరు చర్చకు పెట్టొచ్చు. మీ వాదనను వినిపించవచ్చు. దానిపై మిగతా పాఠకులనూ చర్చకు ఆహ్వానిస్తుంది సాక్షి ఫ్యామిలీ. వీటిని ప్రతి సోమవారం ప్రచురిస్తుంది. వెంటనే రాసి పంపండి. మీ చర్చనీయాంశం పంపవలసిన చిరునామా: ‘ఈ కాలమ్ మీదే’ సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 ఇ-మెయిల్: sakshireaders@gmail.com -
అమ్మకానికి పదవులు
నామినేటెడ్ కోసం తమ్ముళ్ల ఆరాటం చక్రం తిప్పుతున్న పుత్రరత్నాలు పోస్టుకో రేటు..భారీగా వసూళ్లు సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్షంలో ఉండగా పదేళ్లపాటు పార్టీ జెండా మోసి..గడిచిన ఎన్నికల్లో పార్టీ విజయం కోసం రేయింబవళ్లు శ్రమించిన సీనియర్లకు సంక్రాంతిలోగా నామినేటెడ్ పదవులు కట్టబెట్టాలని టీడీపీ అధినాయకత్వం భావించింది. కానీ ఎన్నికల్లో చేసిన ఖర్చులో కాసింతైయినా ఈ పదవుల కేటాయింపు ద్వారా భర్తీ చేసుకోవాలని ఆలోచనతో జిల్లా నాయకత్వం చేస్తున్న జాప్యం పట్ల పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరీ ముఖ్యం గా జిల్లా పార్టీలో చక్రం తిప్పుతున్న ప్రభుత్వ ‘పెద్దల’ కుటుంబ సభ్యులు ఈ పదవుల పందేరానికి కలెక్షన్ ఏజెంట్లుగా అవతారమెత్తి అందినకాడకి దండుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. అధినేతే స్వయంగా ఆదేశించడంతో సంక్రాంతిలోగానే నామినేటెడ్ పదవుల పందారం కొలిక్కివస్తుందని పార్టీ శ్రేణులు కళ్లల్లో ఒత్తులేసుకుని నిరీక్షించారు. కానీ జిల్లా ప్రజా ప్రతినిధులు వారి ఆశలపై నీళ్లు చల్లారు. ఎడముఖం..పెడముఖంగా ఉన్న ప్రభుత్వ పెద్దలిద్దరూ ఎవరికి వారు జాబితాలు సిద్ధం చేశారు. సొంత నియోజకవర్గాలకు పరిమితం కాకుండా తమ వెంట తిరిగే ఎమ్మెల్యేల నియోజకవర్గాల పరిధిలోని పదవులకు కూడా తమ పెత్తనమే సాగేలా చక్రం తిప్పారు. దీంతో ఆశావహులంతా తమ ప్రజాప్రతినిధుల ద్వారా వీర్ని ప్రసన్నం చేసుకునేందుకు మూడు నెలలుగా చెప్పులరిగేలా తిరిగారు. తీరా సమయం వచ్చేసరికి మా అబ్బాయిని కలవండి..మా ఆవిడిని కలవండంటూ వారికి సంకేతాలివ్వడంతో చేసేది లేక వార్ని కూడా కలుస్తూ ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. యువనేతలైతే ఏకంగా హుండీలు పెట్టేసి పదవికింత అని వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు పార్టీలోనే బలంగా వినిపిస్తున్నాయి. సింహాచలం దేవస్థానం ట్రస్టీ పదవుల నుంచి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్ష పదవుల వరకు పోస్టుకో రేటు చొప్పున వసూలు చేస్తున్నట్టుగా పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక్క భీమిలి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం ఏకంగా రూ.15 లక్షల వరకు చేతులుమారినట్టుగా పార్టీలో చర్చసాగుతోంది. ఇదే రీతిలో మిగిలిన మార్కెట్ కమిటీ అధ్యక్ష పదవుల ద్వారా తమ గళ్లాపెట్టె నింపుకునేందుకు ఈ ప్రభుత్వ పెద్దల కుటుంబ సభ్యులు వసూళ్లకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. పోటీ ఎక్కువగా ఉన్న పదవులకైతే ఏకంగా వేలం పాటలు సైతం పెట్టినట్టుగా వినికిడి. ఈ విధంగా దాదాపు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులన్నింటికి రూ.10లక్షల నుంచి రూ.15 లక్షల వరకు చేతులు మారినట్టుగా పార్టీలోనే అంతర్గతంగా చర్చ జరుగుతోంది. సింహాచలం దేవస్థానం మినహా ఇతర పేరొందిన దేవస్థానాల పాలక మండళ్ల విషయంలో ఇదే రీతిలో కలెక్షన్స్ సాగిస్తున్నట్టుగా చెబుతున్నారు. రాష్ర్టస్థాయి పదవుల భర్తీ కోసం పార్టీ యువనేత రాజధానిలో హుండీపెడితే ఆయన్ని ఆదర్శంగా తీసుకుని జిల్లా స్థాయి పదవుల పందారం కోసం ఇక్కడి యువనేతలు స్థానికంగా హుండీలు పెట్టి వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఇలాగైతే పదేళ్ల పాటు పార్టీ కోసం రెక్కలు ముక్కలు చేసుకుని అప్పుల పాలై పోయిన మాబోటి వాళ్ల పరిస్థితి ఏమిటని పార్టీ సీనియర్ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు నామినేటెడ్ పదవులు మీవే అంటూ ఊరించిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని వారు మండిపడుతున్నారు. ఎన్నికల ముందు తమతో పాటు వలస వచ్చిన..ఎన్నికలనంతరం తమతో అంటకాగే వారికి పదవులు కట్టెబెట్టేందుకు వీరు సిద్ధమవుతుండడం పట్ల పార్టీ సీనియర్లు అగ్గిమీదగుగ్గిలమవుతున్నారు. -
ప్రముఖ ఎన్ఐటీలు.. కటాఫ్ ర్యాంకులు
మరికొద్ది రోజుల్లో జేఈఈ మెయిన్ ర్యాంకులు వెల్లడి కానున్నాయి. జూలై 1 నుంచి జేఈఈ మెయిన్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా 30 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లు; కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)లు; ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (ఐఐఐటీఎం); ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ (ఐఐఐటీడీఎం)లు, ఇతర సంస్థల్లో వివిధ కోర్సుల్లో దాదాపు 40,000 సీట్లున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎన్ఐటీల్లో .. బీటెక్‌లో టాప్ బ్రాంచ్‌ల్లో గతేడాది క్లోజింగ్ ర్యాంకుల వివరాలు తెలుసుకుందాం.. EEE ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రోజుకో కొత్త ఎలక్ట్రానిక్ ఉత్పత్తి, ఎలక్ట్రికల్ ఉపకరణాలు మార్కెట్లో వచ్చిపడుతున్న తరుణంలో రెండు రకాల అవకాశాల వేదికలను (ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్) అందుకునేందుకు దోహదం చేస్తుంది ఈఈఈ. స్థూలంగా డిజైన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ డివెసైస్ అండ్ సర్క్యూట్స్, అనాలసిస్ అండ్ ఆపరేషన్ ఆఫ్ పవర్ సిస్టమ్, పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్ అండ్ డిజైన్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రోమ్యాగ్నటిక్ ఫీల్డ్స్, కంప్యూటర్ ఎయిడెడ్ పవర్ సిస్టమ్ అనాలసిస్, యుటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెటీరియల్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ వంటి కోర్ సబ్జెక్టులపై విద్యార్థులకు శిక్షణనిస్తారు. అవకాశాలు: మనదేశంలో విద్యుత్ కొరతను అధిగమించడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. కొత్త విద్యుత్ ప్లాంట్ నిర్మాణాలను భారీ స్థాయిలో చేపడుతున్నాయి. వీటితోపాటు హైడ్రో ఎలక్ట్రిసిటీ రంగం, నేచురల్ గ్యాస్ పాంట్లు, పవర్ కార్పొరేషన్లు, అణు విద్యుత్ కర్మాగారాలు, రైల్వేలు, విద్యుత్ ఉపకరణ ఉత్పత్తుల సంస్థలు, ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో ఈఈఈ ఉత్తీర్ణులకు అపార అవకాశాలు ఉన్నాయి. గతేడాది కటాఫ్స్: కోర్ బ్రాంచ్‌ల్లో ఒకటి కావడం.. భవిష్యత్ అవకాశాల నేపథ్యంలో ఈ కోర్సుకు విపరీతమైన డిమాండ్ ఉంది. గతేడాది ఎన్ఐటీ వరంగల్‌లో హోమ్ స్టేట్ కోటాలో జనరల్ కేటగిరిలో సీటు లభించిన చివరి ర్యాంకు 3601. అదర్స్టేట్ కోటాలో కూడా చాలా తక్కువ ర్యాంకుకే (4131) సీట్లు భర్తీ అవడం గమనార్హం. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు ఎక్కువగా చేరే ఎన్ఐటీ తిరుచిరాపల్లి (తమిళనాడు), సూరత్కల్ (కర్ణాటక), కాలికట్ (కేరళ)లలో కూడా వరుసగా సీట్లు లభించిన చివరి ర్యాంకులు.. 3067, 3723, 6460. వీటిని బట్టి చూస్తేనే తెలుస్తోంది ఈఈఈకి ఎంత డిమాండ్ ఉందో! ECE ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వివిధ ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అందించే బ్రాంచ్ ఈసీఈ. పరిధి విస్తృతంగా ఉండే ఈసీఈ ద్వారా ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, టెలికాం, సెమీకండక్టర్ డిజైన్ తదితర రంగాల గురించిన పరిజ్ఞానం సొంతం చేసుకోవచ్చు. ఈసీఈలో అనలాగ్ ట్రాన్స్మిషన్, డిజిటల్ ట్రాన్స్మిషన్, వాయిస్ అండ్ డాటా, బేసిక్ ఎలక్ట్రానిక్స్, సాలిడ్ స్టేట్ డివెసైస్, మైక్రో ప్రాసెసర్స్, డిజిటల్ అండ్ అనలాగ్ కమ్యూనికేషన్, అనలాగ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, శాటిలైట్ కమ్యూనికేషన్, మైక్రోవేవ్ ఇంజనీరింగ్, ఆంటెన్నా అండ్ వేవ్ ప్రొగ్రెషన్ తదితర అంశాలను అధ్యయనం చేస్తారు. దాంతోపాటు ఎలక్ట్రానిక్ పరికరాలు, సర్క్యూట్స్, ప్రసార ఉపకరణాలైన ట్రాన్స్‌మీటర్, రిసీవర్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, మైక్రోవేవ్స్, ఫైబర్ వంటి వాటి తయారీలో ఈసీఈ విభాగం కీలకపాత్ర పోషిస్తుంది. ఉద్యోగావకాశాలు: ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లోనూ, వాటి అనుబంధ సంస్థలు, కార్పొరేషన్లలోనూ ఉద్యోగావకాశాలు విస్తృతం. యూపీఎస్సీ ఏటా నిర్వహించే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్) ఎగ్జామినేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో చేరొచ్చు. టీచింగ్ రంగంలోనూ ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారతీయ రైల్వేలు, అణు విద్యుత్ కంపెనీలు, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డెరైక్టరేట్ ఆఫ్ జనరల్ పోస్ట్స్ అండ్ టెలిగ్రాఫ్స్ డిపార్ట్మెంట్స్.. మొదలైనవాటిలో ఉద్యోగాలు పొందొచ్చు. గతేడాది ర్యాంకుల విశ్లేషణ: కోర్ బ్రాంచ్‌ల్లో ఒకటి కావడం, ఉన్నత విద్య, ఉద్యోగావ కాశాల విషయంలో ఎలాంటి ఢోకా లేకపోవడంతో ప్రధాన ర్యాంకర్లలో ఎక్కువ శాతం ఈసీఈనే ఎంచుకుంటున్నారు. గతేడాది సీట్లు లభించిన చివరి ర్యాంకులను గమనిస్తే ఈ విషయం అవగతమవుతోంది. ఎన్ఐటీ వరంగల్‌లో హోమ్ స్టేట్ కోటాలో జనరల్ కేటగిరీ విద్యార్థికి సీటు లభించిన చివరి ర్యాంకు.. 2543. కాగా ఇతర రాష్ట్ర కోటాలో సీటు కూడా 3364కే భర్తీ అయింది. ఇక దక్షిణ భారత ఎన్ఐటీలు.. తిరుచిరాపల్లిలో 2076, సూరత్కల్లో 2456, కాలికట్లో 4966 ర్యాంకుకే సీట్లన్నీ నిండాయి. CIVILసివిల్ ఇంజనీరింగ్ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తున్నాయి. మనదేశంలో రియల్ ఎస్టేట్ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. పెరుగుతున్న జనాభా, మానవ అవసరాలకనుగుణంగా ఇళ్లు, రహదారులు, మురుగునీటి కాలువలు, భూ అంతర్గత రహదారులు , ఫ్లై ఓవర్లు నిర్మాణంతోపాటు నదులపై ప్రాజెక్టులు చేపడుతున్నారు. భారీ విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నాయి. వీటన్నింటి నిర్మాణంలో తప్పనిసరిగా సివిల్ ఇంజనీర్ల సేవలు అవసరం. ఈ క్రమంలో సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు హాట్ ఫేవరెట్ బ్రాంచ్‌గా నిలుస్తోంది. ఉద్యోగావకాశాలు: సివిల్ ఇంజనీర్లకు అటు ప్రభుత్వ రంగంలోనూ, ఇటు ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రహదారులు- భవనాల శాఖ, నీటిపారుదల శాఖ, పంచాయతీరాజ్ విభాగం, గ్రామీణ నీటి సరఫరా విభాగం, కాలుష్య నియంత్రణ మండలి, వివిధ పరిశోధన సంస్థలు, భారతీయ రైల్వేలు, జాతీయ రహదారుల విభాగం, జాతీయ విపత్తు నిర్వహణ విభాగం, ఎల్ అండ్ టీ, డీఎల్ఎఫ్ వంటి సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఇవే కాకుండా ప్రతి ఏటా యూపీఎస్సీ నిర్వహించే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ద్వారా కేంద్ర ప్రభుత్వ కొలువుల్లో పాగా వేయొచ్చు. గతేడాది కటాఫ్ ర్యాంకులు: గతేడాది ఎన్ఐటీ-వరంగల్‌లో హోమ్ స్టేట్ కోటాలో జనరల్ కేటగిరీలో 4954 వరకు, అదర్ స్టేట్ కోటాలో 7483 ర్యాంకు వరకు సీట్లు లభించాయి. ఇక ఎన్ఐటీ-తిరుచిరాపల్లి, ఎన్ఐటీ-సూరత్కల్, ఎన్ఐటీ-కాలికట్లలో సీట్లు భర్తీ అయిన చివరి ర్యాంకులు 6814, 7411, 11206. MECHANICALమెకానికల్ ఇంజనీరింగ్ ఒక ప్రొడక్ట్ డిజైన్‌లో, తయారీలో మెకానికల్ ఇంజనీర్లది కీలక పాత్ర. ఇది కేవలం యంత్ర పరికరాలకే కాకుండా.. ఎయిర్ కండీషన్లు, గ్యాస్ టర్బైన్లు వంటి ఎలక్ట్రికల్ పరికరాలకు విస్తరించింది. ప్రొడక్ట్స్, కాంపొనెంట్స్, సిస్టమ్స్.. ఇలా అనేక యంత్ర పరికరాల తయారీలో ప్రతి దశలోనూ మెకానికల్ ఇంజనీర్ల ప్రతిభ ఎంతో అవసరం. మెకానికల్ ఇంజినీరింగ్ పరిధి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఎయిరోప్లేన్ నుంచి ఎయిర్ కండీషనర్ దాకా.. రాకెట్ నుంచి రోబోల తయారీ వరకూ.. స్టీలు పరిశ్రమలలో, కార్ల డిజైన్‌లో.. ఇలా అనేక విభాగాల్లో మెకానికల్ ఇంజనీరింగ్ పాత్ర కీలకం..! వచ్చే 5-10 ఏళ్లలో భారత్‌లో ఆటోమొబైల్స్, పవర్, ఏరోస్పేస్ పరిశ్రమ గణనీయ వృద్ధిని నమోదు చేసుకోనుంది. గెయిల్, ఎన్టీపీసీ, డీఆర్డీవో వంటి ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు టాటా మోటార్స్, మారుతి సుజుకీ, హోండా, తదితర సంస్థల్లో ఉపాధికి కొదవ లేదు. గతేడాది కటాఫ్ ర్యాంకులు: గతేడాది ఎన్ఐటీ వరంగల్‌లో హోమ్ స్టేట్ కోటాలో జనరల్ కేటగిరీలో సీటు లభించిన చివరి ర్యాంకు 3780 కాగా.. అదర్ స్టేట్ కోటాలో చివరి ర్యాంకు 3530. ఇక ఎన్ఐటీ - తిరుచిరాపల్లి, ఎన్ఐటీ - సూరత్కల్, ఎన్ఐటీ - కాలికట్లలో సీట్లు లభించిన చివరి ర్యాంకులు వరుసగా.. 2818, 3178, 6203. CHEMICAL కెమికల్ ఇంజనీరింగ్ పరిశ్రమల విస్తరణ శరవేగంగా జరుగుతున్న ప్రస్తుత తరుణంలో కెమికల్ ఇంజనీర్ల అవసరం బాగా పెరుగుతోంది. మరోవైపు ముడివనరుల కొరత పెరుగుదలతో సహజ వనరుల స్థానంలో సింథటిక్ వనరుల సృష్టికి కెమికల్ ఇంజనీర్ల అవసరం ఎంతైనా ఉంది. కెమికల్ ఇంజనీర్‌గా ఒక పరిశ్రమలో అనేక క్లిష్టతరమైన బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. సంబంధిత పరిశ్రమకు అవసరమైన పరిశోధన, అభివృద్ధి, డిజైన్, అమలు, నిర్వహణ పనులు కెమికల్ ఇంజనీర్ విధిలో భాగాలే. నిజానికి కెమికల్ ఇంజనీరు ఒక పరిశ్రమలో అనేక ఇంజనీరింగ్ శాఖలను.. అంటే కెమిస్ట్, ఇండస్ట్రియల్ ఇంజనీర్, మెటీరియల్స్ ఇంజనీర్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ల సమ్మిళిత పాత్రను నిర్వహించాలి. ఉద్యోగావకాశాలు: ఉత్పాదక రంగం విస్తృతంగా అభివృద్ధి చెందుతోంది. పెట్రోలియం, పెట్రోకెమికల్స్ నుంచి ఆహార పరిశ్రమల వరకు కెమికల్ ఇంజనీర్ల పాత్ర కీలకం. మెటీరియల్స్, స్పెషాలిటీ కెమికల్స్, ప్లాస్టిక్స్, పవర్ ప్రొడక్షన్, ఎన్విరాన్మెంటల్ కంట్రోల్, వేస్ట్ మేనేజ్మెంట్, బయోటెక్నాలజీ, లేబొరేటరీలు, ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు, ఎరువులు-రసాయనాల కర్మాగారాల్లో వివిధ హోదాల్లో అవకాశాలుంటాయి. గతేడాది కటాఫ్ ర్యాంకులు: కెమికల్ ఇంజనీరింగ్‌లో గతేడాది ఎన్ఐటీ వరంగల్‌లో హోమ్ స్టేట్ కోటాలో జనరల్ కేటగిరీలో 8061 వరకు, ఇతర రాష్ట్ర కోటాలో 10,500 ర్యాంకు వరకు సీట్లు లభించాయి. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ప్రాధాన్యమిస్తున్న ఎన్ఐటీ-తిరుచిరాపల్లి, ఎన్ఐటీ-సూరత్కల్, ఎన్ఐటీ-కాలికట్లలో సీట్లు లభించిన చివరి ర్యాంకులు వరుసగా.. 8174, 8369, 14,463. CSE కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నేడు కంప్యూటర్ ప్రవేశించని రంగమే లేదంటే అతిశయోక్తి కాదు. దైనందిన వ్యవహారాల నుంచి వ్యాపార అవసరాల వరకు మానవ జీవితంలో కంప్యూటర్ పెనవేసుకుపోయింది. ఏ స్థాయిలో అంటే ఆన్లైన్లోనే బస్, రైలు, విమాన, సినిమా టికెట్ల బుకింగ్ నుంచి ఆన్లైన్ చాటింగ్ వరకు పెరిగిపోయింది. ఇక కంపెనీలు, పరిశ్రమల అవసరాలు చెప్పాల్సిన పనే లేదు. దాంతో ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో అవకాశాలు విస్తృతమయ్యాయి. కంప్యూటర్ సిస్టమ్స్ డిజైన్, నిర్మాణం, నిర్వహణ కంప్యూటర్ ఇంజనీర్ల పని. డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్ కంప్యూటర్లు, సర్వర్లతోపాటు మొబైల్ ఫోన్లలో వినియోగించే వివిధ అప్లికేషన్స్ రూపకల్పన, వివిధ పరిశ్రమల్లో ఉపయోగించే అప్లికేషన్స్, ఇంటిగ్రేటెడ్ మైక్రోచిప్స్‌ను కంప్యూటర్ ఇంజనీర్లు రూపొందిస్తారు. కంప్యూటర్ ఇంజనీర్లు సాఫ్ట్‌వేర్‌తోపాటు హార్డ్‌వేర్ విభాగాల్లోనూ విధులు నిర్వహించాల్సి ఉంటుంది. జాబ్ ప్రొఫైల్స్: టెక్నికల్ రైటర్, సాఫ్ట్వేర్ డిజైనర్, మల్టీమీడియా ప్రోగ్రామర్, అప్లికేషన్ ప్రోగ్రామర్, టెక్నికల్ ఆర్కిటెక్ట్, సిస్టమ్స్ ప్రోగ్రామర్, సిస్టమ్స్ అనలిస్ట్, గేమ్ డిజైనర్, కంప్యూటర్ ఇంజనీర్, సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్, డేటా నెట్వర్క్ డిజైనర్, సెక్యూరిటీ అనలిస్ట్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, వెబ్సైట్ డెవలపర్/డిజైనర్. గతేడాది కటాఫ్ ర్యాంకుల విశ్లేషణ: అన్ని కోర్ బ్రాంచ్‌ల కంటే సీఎస్ఈని విద్యార్థుల ఫేవరెట్ బ్రాంచ్ అని చెప్పొచ్చు. ఇందుకు గతేడాది కటాఫ్ ర్యాంకులే నిదర్శనం. గతేడాది ఎన్ఐటీ- వరంగల్‌లో హోమ్ స్టేట్ కోటాలో జనరల్ కేటగిరీలో కేవలం 2411, అదర్ స్టేట్ కోటాలో 1921 ర్యాంకుకే సీట్లన్నీ నిండాయి. మిగిలిన ప్రధాన ఎన్ఐటీల్లోనూ ఇదే పరిస్థితి. ఎన్ఐటీ-తిరుచిరాపల్లిలో 1344 ర్యాంకు వరకు, ఎన్ఐటీ-సూరత్కల్లో 1785 ర్యాంకు వరకు, ఎన్ఐటీ- కాలికట్లో 4552 వరకు సీట్లు లభించాయి. జేఈఈ మెయిన్ కౌన్సెలింగ్ ముఖ్య తేదీలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఛాయిస్ ఫిల్లింగ్: జూలై 1 నుంచి జూలై 9 వరకు ఛాయిస్ లాకింగ్: జూలై 6 నుంచి జూలై 9 వరకు మొదటి రౌండ్ సీట్ ఎలాట్మెంట్: జూలై 11 ఫీజు చెల్లింపు: జూలై 11 నుంచి జూలై 14 వరకు రెండో రౌండ్ సీట్ ఎలాట్మెంట్: జూలై 16 ఫీజు చెల్లింపు: జూలై 16 నుంచి జూలై 19 వరకు మూడో రౌండ్ సీట్ ఎలాట్మెంట్: జూలై 21 ఫీజు చెల్లింపు: జూలై 21 నుంచి జూలై 23 వరకు సీటు సరెండర్ (1, 2, 3 రౌండల్లో లభించిన సీటు నచ్చకపోతే): జూలై 21 నుంచి జూలై 23 వరకు మొదటి మూడు రౌండ్లలో సీటు లభించినవారు కేటాయించిన ఇన్స్టిట్యూట్లలో రిపోర్టింగ్: జూలై 21 నుంచి జూలై 24 వరకు నాలుగో రౌండ్ సీట్ ఎలాట్మెంట్: జూలై 26 నాలుగో రౌండ్లో సీటు లభించినవారు కేటాయించిన ఇన్స్టిట్యూట్లో రిపోర్టింగ్: జూలై 26 నుంచి జూలై 29 ఇంటర్నల్ స్లైడింగ్: జూలై 31 స్పాట్ రౌండ్ (జీఎఫ్‌టీఐ, ఎస్ఎఫ్టీఐ) ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఆన్లైన్ ఛాయిస్ ఫిల్లింగ్, ఆన్లైన్ ఫీజు చెల్లింపు, ఆన్లైన్ ఛాయిస్ లాకింగ్: జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు స్పాట్ రౌండ్ సీట్ ఎలాట్మెంట్: ఆగస్టు 4 కౌన్సెలింగ్ ముగింపు: ఆగస్టు 7 వెబ్సైట్: www.ccab.nic.in జేఈఈ మెయిన్ ర్యాంకుతో ప్రవేశం కల్పించే ఎన్ఐటీలు 1. ఎన్ఐటీ- అగర్తలా 2. మోతీలాల్ నెహ్రూ ఎన్ఐటీ - అలహాబాద్ 3. ఎన్ఐటీ - అరుణాచల్ ప్రదేశ్ 4. మౌలానా ఆజాద్ ఎన్ఐటీ - భోపాల్ 5. ఎన్ఐటీ - కాలికట్ 6. ఎన్ఐటీ - ఢిల్లీ 7. ఎన్ఐటీ - దుర్గాపూర్ 8. ఎన్ఐటీ - గోవా 9. ఎన్ఐటీ - హమీర్పూర్ 10. మాలవీయ ఎన్ఐటీ - జైపూర్ 11. బీఆర్ అంబేద్కర్ ఎన్ఐటీ - జలంధర్ 12. ఎన్ఐటీ - జంషెడ్పూర్ 13. ఎన్ఐటీ - కురుక్షేత్ర 14. ఎన్ఐటీ - మణిపూర్ 15. ఎన్ఐటీ - మేఘాలయా 16. ఎన్ఐటీ- మిజోరాం 17. ఎన్ఐటీ - నాగాలాండ్ 18. విశ్వేశ్వరాయ ఎన్ఐటీ - నాగ్‌పూర్ 19. ఎన్ఐటీ - పాట్నా 20. ఎన్ఐటీ - పుదుచ్చేరి 21. ఎన్ఐటీ - రాయ్‌పూర్ 22. ఎన్ఐటీ - రూర్కెలా 23. ఎన్ఐటీ - సిక్కిం 24. ఎన్ఐటీ - సిల్చార్ 25. ఎన్ఐటీ - శ్రీనగర్ 26. సర్దార్ వల్లభాయ్ ఎన్ఐటీ - సూరత్ 27. ఎన్ఐటీ - సూరత్కల్ 28. ఎన్ఐటీ - తిరుచిరాపల్లి 29. ఎన్ఐటీ - ఉత్తరాఖండ్ 30. ఎన్ఐటీ - వరంగల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ, ఐఐఐటీఎం అండ్ ఐఐఐటీడీఎం)లు 1.అటల్ బిహారి వాజ్పాయ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ - గ్వాలియర్ 2.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ - కాంచీపురం 3.రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - అమేథి 4.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - గువహటి 5.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - అలహాబాద్ 6.పండిట్ ద్వారకా ప్రసాద్ మిశ్రా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ - జబల్పూర్ 7. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - కోటా, రాజస్థాన్ 8. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - శ్రీ సిటీ, సత్యవేడు, ఆంధ్రప్రదేశ్ 9. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - వడోదరా 10. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఉనా, హిమాచల్‌ప్రదేశ్ 11. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కల్యాణి, పశ్చిమ బెంగాల్ 12. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - త్రిపుర 13. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సోనేపట్, హర్యానా -
ఎడ్‌సెట్‌లో ర్యాంకుల పంట
నగర విద్యార్థుల హవా వరుసగా 3, 4, 5 ర్యాంకులు ఏయూ క్యాంపస్ : రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్‌సెట్2014లో నగరానికి చెందిన విద్యార్థులు ప్రతిభ చూపారు. గురువారం సా యంత్రం ఏయూ ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరంలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. గణితం విభాగంలో ఆర్ఆర్ వెంకటాపురానికి చెందిన వై.లక్ష్మీ అనసూయ 104 మార్కులతో తృతీయ స్థానంలో నిలి చారు. బయాలాజికల్ సెన్సైస్స్లో బుచ్చిరాజుపాలేనికి చెందిన బి.పవనకీర్తి 105 మార్కులతో నాల్గవ స్థానాన్ని, పెదబొడ్డేపల్లికి చెందిన సీహెచ్.గౌతమ్ 104 మార్కులతో ఐదవ ర్యాంక్‌ను కైవ సం చేసుకున్నారు. విశాఖ జిల్లా పరిధిలో మొ త్తం 5,791 మంది దరఖాస్తు చేయగా 4,965 మంది పరీక్షకు హాజరై 4,911 మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో 98.91 శాతం విద్యార్థు లు అర్హత సాధించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై ఫలితాల సీడీని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ సిం హాచల దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకం గా మెడికల్, ఇంజినీరింగ్ తరహా విద్యాసంస్థలను నిర్వహించే ఆలోచన ఉందన్నారు. టీటీడీ తరహాలో విద్యారంగాన్ని సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో ప్రారంభిస్తామన్నారు. ఏయూకు సెంట్రల్ హోదా కల్పనపై చర్చ జరుగుతుందని, త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా విభజించి 11 జాతీయ విద్యా సంస్థలను మూడు ప్రాంతాలకు సమానంగా అందిస్తామన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఎల్.వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ విశాఖ ప్రాంతానికి, ముఖ్యంగా ఏయూ పూర్వ విద్యార్థిగా మంత్రి గంటాపై వర్సిటీ ఎన్నో ఆశలు పెట్టుకుందన్నారు. వర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నామన్నారు. వర్సిటీ వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్.రాజు అధ్యక్షత వహించారు. వీసీ మాట్లాడుతూ ఎడ్‌సెట్, ఐసెట్ వంటి ప్రతిష్టాత్మకమైన పరీక్షలను ఏయూ సమర్థవంతంగా నిర్వహిస్తుందన్నారు. ప్రభుత్వం అందించే ఎటువంటి బాధ్యతనైనా నిర్వహించడానికి తా ము సిద్ధంగా ఉన్నామన్నారు. ఎడ్‌సెట్ కన్వీనర్ ఆచార్య నిమ్మా వెంకటరావు పరీక్ష నిర్వహణ తీరును వివరించారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ కె.రామ్మోహనరావు, ప్రిన్సిపాళ్లు సీహెచ్.వి.రామచంద్రమూర్తి, ఆర్.సత్యరాజు, డీన్ టి.కోటేశ్వరరావు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ కె.సామ్రాజ్యలక్ష్మి, ఆచార్య జి.నాగేశ్వరరావు, వి.వల్లీకుమారి, కె.రాంజీ, రాఘవరావు, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. చదివించి రాశానంతే... గోపాలపట్నం : చదివింది రాశానంతే... పదవర్యాంకు లోపు వస్తుందని ఆశిస్తే మూడవ ర్యాంకు వచ్చిందని బీఈడీ(మేథ్స్)లో మూడో ర్యాంకు సాధించిన వై.లక్ష్మీఅనసూయ సంతోషం వ్యక్తం చేసింది. తన తండ్రి వై.ఎల్.ఎన్.శర్మ రిటైర్డు ఉపాధ్యాయునిగా సేవలందించారని, తానూ ఉపాధ్యాయ వృత్తిలో రాణించాలనుకుంటున్నట్టు చెప్పింది. భవిష్యత్తులో లెక్చరర్ని కావాలని ఆశాభావం వ్యక్తం చేసింది. -
ఐఐటీల్లో బీటెక్..బెస్ట్ బ్రాంచ్‌లు.. బెటర్ క్యాంపస్‌లు
జేఈఈ-అడ్వాన్స్డ్ ర్యాంకులు మరో రెండు రోజుల్లో వెల్లడి కానున్నాయి. ఐఐటీల్లో ప్రవేశానికి హాజరైన లక్షన్నర మంది అభ్యర్థుల భవితవ్యం తెలియనుంది. ఆన్లైన్ ఛాయిస్ ఫిల్లింగ్‌కు సమయం (జూన్ 20 నుంచి 24 వరకు) సమీపించింది. అందుబాటులోని సీట్ల సంఖ్యతో పోల్చితే తుది విజేతలుగా నిలిచేది కొందరే. ఆ కొందరిలోనూ ఎన్నో సందేహాలు. ఏ ఐఐటీలో చేరితే మంచిది? ఏ బ్రాంచ్‌కు ఏ ఐఐటీ బెస్ట్? తదితర సందేహాలు తలెత్తడం సహజం. ఈ నేపథ్యంలో.. గతేడాది (2013లో) ఇన్స్టిట్యూట్లు, బ్రాంచ్‌ల వారీగా క్లోజింగ్ ర్యాంకుల వివరాలు తెలుసుకుంటే కొంతమేర అవగాహన పొందొచ్చు. వివరాలు.. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బీటెక్ కోర్సులో జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకర్లలో అత్యధికుల ఫస్ట్ ఆప్షన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. గత కొన్నేళ్లుగా టాప్ ర్యాంకర్ల ఛాయిస్‌గా సీఎస్ఈ బ్రాంచ్ నిలుస్తోంది. గతేడాది జనరల్ సహా అన్ని కేటగిరీల ర్యాంకర్లలో టాప్-10లోపు విద్యార్థులు సీఎస్‌ఈకే మొగ్గు చూపారు. ఇక ఇన్స్టిట్యూట్ పరంగా సీఎస్ఈ బ్రాంచ్‌కు టాపర్ల బెస్ట్ క్యాంపస్‌గా నిలుస్తోంది ఐఐటీ-బాంబే. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, ఆర్ అండ్ డీ ఒప్పందాలు, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నిరంతరం సిలబస్‌లో మార్పులు, చేర్పులు, పూర్వ విద్యార్థుల విజయాలు వంటివి ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొనొచ్చు. బీటెక్ కోర్సులో చేరే విద్యార్థి తాను ఎంచుకున్న బ్రాంచ్‌కు సంబంధించి కోర్సు ముగిసే సమయానికి అంటే నాలుగేళ్ల తర్వాత భవిష్యత్తు అవకాశాలను అంచనా వేసి ఎంపిక చేసుకోవాలి. ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో భవిష్యత్తు అవకాశాల పరంగా ఆందోళన అనవసరం. కంప్యూటర్, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌ల రూపకల్పన, వాటి అనువర్తన చేయడం, పనిచేసే రంగాన్ని బట్టి తదనుగుణమైన సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్స్, అప్లికేషన్స్ రూపొందించడం వంటివి కంప్యూటర్ సైన్స్ నిపుణులు చేస్తారు. ప్రస్తుతం ప్రతి రంగంలో కంప్యూటరీకరణ చోటు చేసుకుంటున్న నేపథ్యంలో.. అవకాశాలు కోకొల్లలు. ఈ విభాగంలో అన్ని ఐఐటీల్లో అందుబాటులో ఉన్న మొత్తం సీట్ల సంఖ్య 923. ఎలక్ట్రికల్.. ఎవర్గ్రీన్ ఆధునికీకరణ, మౌలికసదుపాయాల కల్పన, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంపు దిశగా తీసుకుంటున్న చర్యల కారణంగా.. కోర్ సెక్టార్లో క్రేజీ బ్రాంచ్‌గా నిలుస్తోంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఎన్నో రకాల విద్యుత్ ఉత్పత్తి మార్గాలు ప్రధానంగా అణు విద్యుత్ ఉత్పత్తి, సౌర విద్యుత్ ఉత్పత్తి, జల విద్యుత్ ఉత్పత్తిలో ఎలక్ట్రికల్ ఇంజనీర్లదే కీలక పాత్ర. కేవలం విద్యుత్ ఉత్పత్తికే పరిమితం కాకుండా.. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తయారీలోనూ ఎలక్ట్రికల్ ఇంజనీర్ల ప్రమేయం ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవకాశాల పరంగానూ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎవర్గ్రీన్ బ్రాంచ్ అని పేర్కొనొచ్చు. అందుకే జేఈఈ అడ్వాన్స్డ్ టాపర్లలో రెండో ఛాయిస్‌గా ఈ బ్రాంచ్ నిలుస్తోంది. గత ఏడాది ఏడో ర్యాంకు అభ్యర్థి ఐఐటీ-బాంబేలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌ను ఎంచుకోవడమే ఇందుకు నిదర్శనంగా పేర్కొనొచ్చు. అదేవిధంగా ఇతర ఐఐటీల్లోనూ ఓపెనింగ్ ర్యాంకుల పరంగా తొలి వందలోపు ర్యాంకర్ల ఛాయిస్‌గా నిలిచింది ఎలక్ట్రికల్. ఇన్స్టిట్యూట్ పరంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌కు కూడా ఐఐటీ-బాంబేనే క్రేజీ క్యాంపస్. క్లోజింగ్ ర్యాంకులే ఇందుకు నిదర్శనం. మొత్తం ఐఐటీలు, ఐఎస్ఎం-ధన్బాద్లో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య 1070. మెకానికల్ ఇంజనీరింగ్ ఐఐటీల్లో ఓపెనింగ్, క్లోజింగ్ ర్యాంకుల ఆధారంగా గత నాలుగైదేళ్ల గణాంకాలను విశ్లేషిస్తే.. ర్యాంకర్ల మూడో ముఖ్య ఛాయిస్‌గా నిలుస్తున్న బ్రాంచ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఈ బ్రాంచ్ విషయంలోనూ ఐఐటీ-బాంబేకే ర్యాంకర్ల ప్రాధాన్యం. గతేడాది ఈ క్యాంపస్‌లో ఓబీసీ మినహాయించి అన్ని కేటగిరీల్లోనూ 50లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులతో ఓపెనింగ్ ర్యాంకులు మొదలవగా.. క్లోజింగ్ ర్యాంకుల విషయంలోనూ ఐదొందల లోపు ర్యాంకులతో సీట్లు భర్తీ అయ్యాయి. దేశంలో ఉత్పత్తి రంగం, ఆర్ అండ్ డీ కార్యకలాపాల విస్తరణ, ఆటోమొబైల్-మెకానికల్ రంగాల వృద్ధి తదితర కారణాలతో ఉద్యోగావకాశాలు ఎక్కువ ఉండటంతో విద్యార్థు లు ఈ బ్రాంచ్‌ను ఎంచుకుంటున్నారు. మొత్తం అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య 1125. కెమికల్ ఇంజనీరింగ్ పదకొండు ఐఐటీలు, ఐఎస్ఎం-ధన్‌బాద్‌లలో 800 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్న కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ పట్ల కూడా టాప్ ర్యాంకర్స్ ఆసక్తి చూపుతున్నారు. గత రెండేళ్లుగా ఆయా ఐఐటీల్లోని ఓపెనింగ్ ర్యాంకుల కోణంలో పరిశీలిస్తే.. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ బ్రాంచ్‌ల తర్వాత స్థానంలో నిలుస్తున్న బ్రాంచ్ ఇది. పారిశ్రామిక అభివృద్ధి, వివిధ ఉత్పత్తుల తయారీ, అందులో కెమికల్ ఇంజనీర్ల ప్రమేయం తప్పనిసరైన నేపథ్యంలో అవకాశాల విషయంలోనూ ఢోకాలేని బ్రాంచ్.. కెమికల్ ఇంజనీరింగ్. ఫార్మాస్యూటికల్ సంస్థలు, డ్రగ్ ఫార్ములేషన్ విభాగాలు, ఇతర రసాయన పరిశోధన సంస్థల్లో కెమికల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులకు అవకాశాలు ఖాయం. ఐఐటీల వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఈ కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులు కంపెనీల దృష్టిలో హాట్‌కేక్‌లుగా నిలుస్తున్నారు. సగటున రూ. 20లక్షలకుపైగా వార్షిక వేతనం ఖరారవుతోంది. సివిల్ ఇంజనీరింగ్ ఎన్నో ఏళ్లుగా ఐఐటీ బీటెక్ ఔత్సాహిక విద్యార్థులు ఆసక్తి చూపుతున్న మరో కోర్ బ్రాంచ్.. సివిల్ ఇంజనీరింగ్. పన్నెండు ఐఐటీలు, ఐఎస్ఎం-ధన్బాద్లో అందుబాటులో ఉన్న 891 సీట్ల కోసం పోటీ తీవ్ర స్థాయిలో ఉంది. ఐఐటీ-బాంబేలో గతేడాది ఓపెన్ కేటగిరీలో 400 ర్యాంకుకు తొలి సీటు లభించగా.. ఇదే విభాగంలో క్లోజింగ్ ర్యాంకు 1688గా నమోదవడమే ఇందుకు నిదర్శనం. రిజర్వ్డ్ కేటగిరీల్లో ఇంతకంటే తక్కువ ర్యాంకులో ఓపెనింగ్, క్లోజింగ్ ర్యాంకులు ఉండటం గమనార్హం. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తుండటం, జాతీయ రహదారుల విస్తరణ, ఇతర ప్రాజెక్టుల నిర్మాణం తదితర కారణాలతో సివిల్ ఇంజనీరింగ్ ఆకర్షణీయ బ్రాంచ్‌గా నిలుస్తోంది. అంతేకాకుండా సమీప భవిష్యత్తులో మరిన్ని అవకాశాలకు కేరాఫ్‌గా నిలవనుంది. ప్రధానంగా 12వ ప్రణాళిక కాలంలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక కేటాయింపులు చేయడంతో పలు పథకాలు అమలు కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కోర్సులో చేరి.. నాలుగేళ్ల తర్వాత సర్టిఫికెట్ అందుకునే వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, వేతనాల విషయంలో ఎలాంటి ఢోకా లేదు. ప్రైవేటు సెక్టార్‌తోపాటు, వివిధ ప్రభుత్వ రంగ కంపెనీల్లోనూ సివిల్ ఇంజనీర్లకు అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఇంజనీరింగ్ ఫిజిక్స్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌ల సమ్మేళనంగా ఉండే ఇంజనీరింగ్ ఫిజిక్స్ బ్రాంచ్‌పై కూడా ర్యాంకర్లలో ఆసక్తి నెలకొంది. కేవలం ఆరు ఐఐటీ క్యాంపస్‌లు(బాంబే, హైదరాబాద్, గువహటి, చెన్నై, ఢిల్లీ, వారణాసి) మాత్రమే ఈ కోర్సును అందిస్తున్నాయి. మొత్తం 198 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అత్యధికంగా ఢిల్లీ ఐఐటీలో 63 సీట్లు ఉండగా.. అత్యల్పంగా హైదరాబాద్ ఐఐటీలో 10 సీట్లు లభిస్తున్నాయి. ఐఐటీ-వారణాసిలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సు అందుబాటులో ఉంది. భౌతిక శాస్త్ర సిద్ధాంతాలు, సూత్రాలు, భావనలు.. అదే విధంగా మ్యాథమెటికల్ న్యూమరిక్స్ ఆధారంగా ఇంజనీరింగ్ ఉత్పత్తుల ప్రక్రియకు సంబంధించి శిక్షణ కల్పించే ఈ కోర్సు సైన్స్ ఔత్సాహిక విద్యార్థులకు బాగా కలిసొస్తుంది. ఇంజనీరింగ్‌లో ఆర్ అండ్ డీ దిశగా లక్ష్యాలు ఏర్పరచుకున్న వారికి బాగా సరితూగే కోర్సు ఇంజనీరింగ్ ఫిజిక్స్ అని నిపుణుల అభిప్రాయం. కోర్సు పూర్తి చేసుకున్న వారికి ఇస్రో, బార్క్, డీఆర్డీఓ వంటి పరిశోధన సంస్థల్లో ఉపాధి గ్యారంటీ. ఆసక్తి ఉంటేనే కెమికల్ ఇంజనీరింగ్ ఐఐటీల్లో ఏ బ్రాంచ్‌లో సీటు వచ్చినా బంగారు భవిష్యత్తు ఖాయం అనేది నిస్సందేహం. అయితే కొన్ని కోర్ బ్రాంచ్‌ల విషయంలో విద్యార్థుల ఆసక్తి మీదే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా అధికశాతం ఓర్పు, నేర్పుతో ప్రయోగశాలల్లో నిరంతర పరిశోధనల్లో గడపాల్సిన కెమికల్ ఇంజనీరింగ్‌లో ఇది ఎంతో ముఖ్యం. కాబట్టి జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదలయ్యాక విద్యార్థులు ఆన్లైన్ ఛాయిస్ ఫిల్లింగ్ సమయంలో కోర్సు, క్యాంపస్ విషయంలో ఆచితూచి వ్యవహరించి ప్రాధమ్యాలు పేర్కొనాలి. ప్రస్తుతం ఐఐటీల్లో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు సగటున రూ. 15 నుంచి రూ. 20 లక్షల వరకు వార్షిక వేతనంతో క్యాంపస్ రిక్రూట్మెంట్లు లభిస్తున్నాయి. అయితే కెమికల్ ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థులు బీటెక్ సర్టిఫికెట్‌తోనే పరిమితం కాకుండా భవిష్యత్తులో మరిన్ని సమున్నత స్థానాలు సొంతం చేసుకోవాలి. - ప్రొఫెసర్॥వి.ఆర్. పెద్దిరెడ్డి, డీన్ (కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్), ఐఐటీ-భువనేశ్వర్ కొత్త ఐఐటీల్లో ముందంజలో హైదరాబాద్ కేంద్ర ప్రభుత్వం 2008లో ఏర్పాటు చేసిన కొత్త ఐఐటీల్లో.. ఇతర ఇన్స్టిట్యూట్లతో పోల్చితే ఐఐటీ-హైదరాబాద్ అకడెమిక్స్, రీసెర్చ్ అన్ని కోణాల్లో శరవేగంగా ముందుకు దూసుకుపోతోంది. పాత ఐఐటీలతో పోటీ పడుతోంది. అకడెమిక్స్ కోణంలో ఇంజనీరింగ్ ఫిజిక్స్ వంటి ప్యూర్ కోర్ బ్రాంచ్‌లను సైతం ప్రారంభించింది. అటు రీసెర్చ్ పరంగానూ పలు అంతర్జాతీయ ఇన్స్టిట్యూట్లు, పరిశ్రమలతో ఒప్పందాల ద్వారా స్పాన్సర్డ్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాం. అయితే ఐఐటీ ప్రవేశాల్లో ప్రత్యేకంగా స్థానిక కోటా అమలులో లేనందున ఇక్కడి విద్యార్థులు.. ఈ ఇన్స్టిట్యూట్లో గతంలో లభించిన ర్యాంకుల ఆధారంగా ప్రాధమ్యాలను పేర్కొనడం మంచిది. ఒకసారి ఐఐటీలో అడుగుపెట్టిన విద్యార్థులు.. నిరంతర అభ్యసనం, అన్వేషణలతో ముందుకు కదిలితేనే మంచి భవిష్యత్తు లభిస్తుంది. - ప్రొఫెసర్ ఫయాజ్ అహ్మద్ ఖాన్, డీన్, అకడెమిక్స్, ఐఐటీ-హైదరాబాద్ ఎన్నటికీ వన్నె తగ్గని కోర్ బ్రాంచ్‌లు ఐఐటీ అడ్వాన్స్డ్ ఫలితాల్లో విజయం సాధించిన విద్యార్థులు ముందుగా గుర్తించాల్సింది కోర్ బ్రాంచ్‌ల ప్రాధాన్యం. నేటి పోటీ ప్రపంచంలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఎన్నో కొత్త బ్రాంచ్‌లు రూపొందుతున్నప్పటికీ.. వాటికి మూలం కోర్ బ్రాంచ్‌ల నుంచే మొదలవుతుంది. కాబట్టి విద్యార్థులు.. ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ తదితర కోర్ బ్రాంచ్‌లవైపు మొగ్గు చూపితే భవిష్యత్తులో.. వారి ఆసక్తికి అనుగుణంగా అనుబంధ స్పెషలైజేషన్లలో పీజీ, పీహెచ్‌డీలు చేసే అవకాశాలు ఉన్నాయి. పదివేల లోపులోనే ఉండే సీట్ల ఎంపిక క్రమంలో.. ఆన్లైన్ ఛాయిస్ ఫిల్లింగ్‌లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అభ్యర్థులు తమకు నచ్చిన ఇన్స్టిట్యూట్, బ్రాంచ్‌లకు గతంలోని చివరి ర్యాంకులను పరిశీలించి వాటిని తమ ప్రస్తుత ర్యాంకుతో బేరీజు వేసుకుని ఆన్లైన్ ఛాయిస్ ఫిల్లింగ్‌కు ఉపక్రమించాలి. ప్రాధమ్యాల ఎంపిక విషయంలో ఎలాంటి పరిమితులు లేనందున దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. - ప్రొఫెసర్॥అశోక్ ఝున్‌ఝున్‌వాలా ప్రొఫెసర్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (ఐఐటీ-మద్రాస్), ఐఐఐటీ-హైదరాబాద్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు. విభిన్న దృక్పథంతో అడుగు పెట్టాలి ఐఐటీల్లో ప్రవేశించాలనుకునే విద్యార్థులు ఇప్పటి నుంచే తమ ఆలోచన దృక్పథాన్ని మార్చుకోవాలి. ఇప్పటి వరకు స్పూన్ ఫీడింగ్ ద్వారా అకడెమిక్స్ను ఔపోసన పట్టిన విద్యార్థులు.. ఐఐటీల్లో చేరాక స్వీయ అభ్యసనం, రెగ్యులర్ నాలెడ్జ్ అప్డేషన్ చేసుకుంటూ ముందుకు సాగితేనే సంబంధిత బ్రాంచ్‌పై పట్టు లభిస్తుంది. అంతేకాకుండా విభిన్న సంస్కృతుల నుంచి వచ్చే సహచర విద్యార్థులతో, అదే విధంగా ఫ్యాకల్టీ సభ్యులతో మమేకమయ్యేలా తమను తాము తీర్చిదిద్దుకోవాలి. ఐఐటీల్లో నియమ నిబంధనలు.. తొలినాళ్లలో తాజా విద్యార్థులను కొంత ఆందోళనకు గురి చేస్తాయి. కానీ వాటికి భయపడకూడదు. తాము ఐఐటీలో చేరిన లక్ష్యాన్ని నిరంతరం స్ఫురించుకుంటే ఎన్ని సవాళ్లు ఎదురైనా ఇట్టే అధిగమించి.. అద్భుత ఫలితాలు సాధించొచ్చు. - ప్రొఫెసర్॥వి. రాజ్‌కుమార్, వైస్ చాన్స్‌లర్-ఆర్జీయూకేటీ (మాజీ డీన్ అకడెమిక్ అఫైర్స్- ఐఐటీ ఖరగ్‌పూర్) బ్రాంచ్ ఏదైనా.. బాంబేకే ప్రాధాన్యం గత కొన్నేళ్లుగా ఐఐటీ ర్యాంకర్లలో అధికశాతం విద్యార్థులు ఆసక్తి చూపుతున్న ఇన్స్టిట్యూట్ ఐఐటీ-బాంబే. బీటెక్‌లో ఏ బ్రాంచ్ అయినప్పటికీ మెజారిటీ విద్యార్థుల ఓటు బాంబేకే ఉంటోంది. ఇందుకు ఎన్నో కారణాలు. ఇక్కడ పాటిస్తున్న అకడెమిక్ ప్రమాణాలు, నిరంతర ఆర్ అండ్ డీ, గ్రాడ్యుయేట్ స్థాయి నుంచే రీసెర్చ్ ఓరియెంటేషన్ బోధన, పలు అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాల ద్వారా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందడమే ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొనొచ్చు. అంతేకాకుండా ఇక్కడ చేరే ప్రతిభావంతులైన విద్యార్థులకు పూర్వ విద్యార్థుల నుంచి ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా లభిస్తున్నాయి. ఈ క్రమంలో ఐఐటీ బాంబే హెరిటేజ్ ఫౌండేషన్ పేరుతో ఎన్నో రకాల స్కాలర్షిప్లను అందిస్తున్నారు. ఇలా.. ఆర్థిక ప్రోత్సాహకాలు.. అకడెమిక్స్‌లో నాణ్యతలే ఐఐటీ-బాంబేపై మెజారిటీ విద్యార్థుల ఆసక్తికి కారణం. - ప్రొఫెసర్॥కె.వి. కృష్ణారావు, సివిల్ ఇంజనీరింగ్, ఐఐటీ-ముంబై -
సివిల్స్ మెరుపులు
సత్తెనపల్లి/గుంటూరు రూరల్: గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు గురువారం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో ర్యాంకులు సాధించారు. వివరాలిలా ఉన్నాయి. గుంటూరు నగరం లక్ష్మీపురానికి చెందిన మదాల వెంటక దుర్గా ప్రణీత్ 476 ర్యాంక్ సాధించి ఐఆర్ఎస్కు ఎంపికకాగా.. సత్తెనపల్లికి చెందిన గంటి ప్రదీప్ 794 ర్యాంకు సాధించారు. ఐఏఎస్ సాధించడమే తమ లక్ష్యంగా విజేతలు పేర్కొన్నారు. హెడ్‌కానిస్టేబుల్ కొడుకు ఐఆర్ఎస్కు.. గుంటూరు రూరల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న మాదల నాగేశ్వరరావు కుమారుడు మాదల వెంటక దుర్గా ప్రణీత్ 476 వ ర్యాంకుతో ఐఆర్ఏస్ సాధించాడు. తల్లి మాదల లక్ష్మీసుజాత. ప్రత్తిపాడు నియోజకవర్గం, వట్టిచెరుకూరు మండలం, లేమల్లెపాడు గ్రామానికి చెందిన వారు ఉద్యోగ భాధ్యతలతో గుంటూరులోని లక్ష్మీపురంలో నివాసం ఉంటున్నారు. పెద్దకుమారుడు మాదల వెంటక దుర్గాప్రణీత్ కాగా, రెండో కుమారుడు మాదల కౌసిక్ ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్నాడు. పణీత్ 2006లో వికాస్ పబ్లిక్ స్కూల్లో పదో తర గతి పూర్తి చేసుకున్నాడు. ఇంటర్ చైతన్య కళాశాలలో 2008లో పూర్తి చేశాడు. ఇంజనీరింగ్‌లో సీఈసీ విభాగంలో ఆర్వీఆర్అండ్ జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో 89 శాతం సాధించి 2012లో ఉత్తీర్ణుడయ్యాడు. 2012 జూన్ నెలలో కోచింగ్ కోసం ఢిల్లీవెళ్లి 2013 నవంబర్ వరకు శిక్షణ పూర్తి చేసుకున్నాడు. గురువారం వెలువడిన ఫలితాలలో ఐఆర్ఏస్ సాధించాడు. భవిష్యత్తులో ఎలాగైన ఐఏఏస్ సాధించడమే లక్ష్యమని చెబుతున్నారు. ఇంకా ఏమన్నాడంటే... ‘చిన్నతనం నుంచీ ఐఏఏస్ సాధించాలన్నదే నా ముఖ్య ధ్యేయం పెట్టుకున్నాను. కుటుంబ సభ్యుల సహకారం, తల్లి దండ్రుల దీవెనలే తోడుగా చదువు కొనసాగించాను. ఇంజినీరింగ్ పూర్తయ్యాక ఢీల్లీలో శిక్షణ పొందాను. రోజుకు ఆరు గంటలకు పైగా ప్రతి ఆంశంపై దృష్టి సారించడంతో పాటు న్యూస్ పేపర్, కరెంట్ అఫైర్స్, ఇంటర్నెట్ వంటి వాటిపై శ్రధ్ద చూపించాను. ఈ రోజు వచ్చిన ఫలితాల్లో ఐఏఏస్ సాధించి ఉంటే బాగుండేది అని అనిపించింది. అయితే తిరిగి మరలా ఐఏఏస్ సాధించగలగను అనే నమ్మకం తన తల్లి దండ్రులు ఇచ్చారు.’ అన్నాడు సత్తెనపల్లి కుర్రోడి విజయం సత్తెనపల్లికి చెందిన గుంటి ప్రదీప్ 2013 డిసెంబర్లో జాతీయ స్థాయిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రవేశ పరీక్ష రాశాడు. గురువారం ఫలితాలు రావడంతో జాతీయ స్థాయిలో 794వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. ప్రదీప్ గతంలో హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో గల ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్లో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా ఎంపికయ్యాడు. కాని ఉద్యోగానికి వెళ్లలేదు. ఆ తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లోని కార్డ్ ఆఫీసులో ఆడిటర్‌గా ఉద్యోగం లభించింది. అంతేగాక బీటెక్ పూర్తి చేసిన ప్రదీప్ సాఫ్ట్‌వేర్‌గా వచ్చినప్పటికీ వెళ్లకుండా సివిల్ సర్వీసెస్‌లో అవకాశాలు మెండుగా ఉండడంతో ఇటువైపు దృష్టి సారించి విజయం సాధించాడు. కుటుంబ నేపధ్యం : ప్రదీప్‌ది నాదెండ్ల మండలం సంక్రాంతిపాడు. తల్లిదండ్రులు వృత్తిరీత్యా ప్రధానోపాధ్యాయులు కావడంతో సత్తెనపల్లిలో స్థిరపడ్డారు. ప్రస్తుతం ప్రదీప్ తండ్రి సత్తెనపల్లిలోని ఎంపీయూపీ హ్యారిస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పని చేస్తున్నారు. తల్లి బి.హెలెన్ సెకెండ్గ్రేడ్ ఉపాధ్యాయురాలిగా సత్తెనపల్లిలోని ఎంపీపీఎస్(ఎస్ఏవీఎన్)లో పని చేస్తున్నారు. సోదరుడు ప్రణీత్ అసిస్టెంట్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్‌గా ఇటీవల ఉద్యోగం సాధించాడు. సోదరి మమత హైదరాబాద్‌లోని ఏపిటోన్స్కు ఇటీవల నియమితురాలైంది. ప్రదీప్ ఇంటర్మీడియట్ గుంటూరు నలంద కళాశాలలో, బీటెక్ గుంటూరు ఆర్వీఆర్లో చదివారు. ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందనీ, ముందు నుంచి ప్రణాళికాయుతంగా చదవడం వల్లే విజయం సాధించాననీ చెప్పాడు. స్పష్టమైన అవగాహనతో ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాశాననీ, ఈ విభాగంలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయనీ పేర్కొన్నాడు. సివిల్స్ సాధించాలనేది తన లక్ష్యమని అందుకోసం ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. -
యువమైత్రికి ఆహ్వానం!
అదో మల్టీనేషనల్ కంపెనీ. కంపెనీ డెరైక్టర్, జనరల్ మేనేజర్ వంటి పెద్దవాళ్లు ఇంటర్వ్యూ చేస్తున్నారు. వారి ఎదురుగా ఉన్న రాజేశ్ ఎందుకో ఇంటర్వ్యూ చేస్తున్న వారి వైపు సూటిగా చూడలేకపోతున్నాడు. చాలా నెర్వస్‌గా ఉన్నాడు. ఎట్టకేలకు ఇంటర్వ్యూ పూర్తయిందనిపించి బయటకొచ్చాడు. ఎందుకిలా అయిందనే ప్రశ్న మెదడును తొలిచేస్తోంది. ఇంతవరకు ఒక్కచోట కూడా ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. ఇంటికి వస్తూనే మనిషి డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఇంట్లో వారు ఏది అడిగే ప్రయత్నం చేసినా చిరాకు పడుతున్నాడు. తనకు ఉద్యోగం రాలేదనే బాధతో కుమిలిపోతున్నాడు. అతడి తల్లి సుధకు ఏమీ అర్థం కాలేదు. ఒక్కొక్కటిగా రాజేశ్ చిన్నప్పటి సంఘటనలు కళ్ల ముందు తిరగసాగాయి. రాజేశ్ ఎల్కేజీ నుంచి బిటెక్ వరకు క్లాసు టాపరే. స్కూల్లో, కాలేజీలో టీచర్లు అతడిని ఇష్టపడేవారు. ఇలాంటి పిల్లాడికి ఉద్యోగం రాకపోవడమేంటని ఆలోచిస్తూనే ఉంది. ఏం చేయాలో తెలియని అయోమయం. ఇది ఒక్క రాజేశ్ ఇంట్లోనే కాదు. రాష్ట్రంలో అనేక కుటుంబాల్లో ఇదే పరిస్థితి. నేటి ప్రపంచంలో ఎంత చక్కగా చదివి మంచి మార్కులతో పాసయినా... ఆ విషయాన్ని తమకు తామే ప్రజెంట్ చేసుకోవాలి. ఉద్యోగం కోసం జరిగే ఇంటర్వ్యూలో అభ్యర్థులు... ఎదుటివారు ఇంప్రెస్ అయ్యేలా తమను తాము చక్కగా ఆవిష్కరించుకోవాలి. రాష్ట్రంలో మారుమూల గ్రామాల నుంచి వచ్చిన యువత చాలా మంది మంచి మార్కులతో ర్యాంకులు తెచ్చుకుంటున్నారు. కానీ తమను తాము ప్రెజెంట్ చేసుకోవడం తెలియక మంచి మంచి ఉద్యోగాలను అందిపుచ్చుకోలేక పోతూ, తీవ్రనిరాశకు లోనవుతున్న ఇలా ఎందరినో చూసిన తర్వాత వీరందరికీ ఏదో చేయాలని ఆలోచించింది సాక్షి. యువత కాలేజ్ నుంచి బయటకు వచ్చి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నంలో కొంత గ్యాప్ ఏర్పడుతుంది. ఆ ఖాళీని పూర్తి చేసి యువత భవిష్యత్తు కోసం చక్కటి బాట వేయడానికి పూనుకుంది. ఆ ప్రయత్నమే యువమైత్రి కార్యక్రమం. సాక్షి మీడియా సంస్థ మహిళల కోసం వినూత్నమైన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వారికి వినోదం, విజ్ఞానంతోపాటు నిపుణుల చేత వారికి అవసరమైన సలహాలు సూచనలు ఇప్పిస్తోంది. ఇప్పుడు ఈ చైతన్యవంతమైన కార్యక్రమాలను యువత కోసం విస్తరిస్తోంది. యువమైత్రి ఏం చేస్తోందంటే..! చదువుకుని పట్టా పుచ్చుకుని, ఉద్యోగాలను ఎలా అందిపుచ్చుకోవాలో తెలియక ఆందోళనలో ఉన్న యువతకు మేలు చేయాలన్నదే ఈ ప్రయత్నం. ఇంటర్వ్యూలో... నేను ఇలా చదువుకున్నాను... ఇవన్నీ నేర్చుకున్నాను... నేను మీకు కావల్సిన ఫలానా పనులన్నీ చక్కగా చేయగలను... అని ధైర్యంగా చెప్పలేకపోతున్న వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాం. ఇందుకు వ్యక్తిత్వ వికాస నిపుణులతో సూచనలు ఇప్పిస్తాం. ఇంటర్వ్యూకి ఎలాంటి దుస్తులు వేసుకుని వెళ్లాలో మీకు చెప్పేవాళ్లు లేకపోతే ఆ బాధ్యత మేము తీసుకుంటాం. ఇలాంటి ఎన్నో విషయాలను మీకు నేర్పించడానికి ముందుకొచ్చింది మీ సాక్షి. 8 -25 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. రెండు గంటలపాటు జరిగే ఈ వర్క్‌షాప్‌లో పాల్గొని మిమ్మల్ని మీరు చక్కగా ఆవిష్కరించుకోవడం ఎలాగో నేర్చుకోండి. మీకు నచ్చిన మంచి ఉద్యోగాన్ని సాధించి భవిష్యత్తుకు బాటలు వేసుకోండి. - సాక్షి యాజమాన్యం యువమైత్రి సదస్సు ఎప్పుడు : 20-5-2014 ఎక్కడ : సెమినార్ హాల్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, నాంపల్లి ఎన్ని గంటల నుంచి: మధ్యాహ్నం 2 గం॥నుంచి (90 ని॥ సాక్షి యువమైత్రికి సలహాలిచ్చే నిపుణులు డాక్టర్ జి. ఎల్. కె. దుర్గ (ప్రిన్సిపాల్, ఆంధ్రమహిళాసభ కాలేజ్) ఇలా రిజిస్టర్ చేసుకోవాలి : 96666-78130 నంబరుకు ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోండి. గమనిక : అదే రోజు ఉదయం... సాక్షి నిర్వహిస్తున్న మైత్రి మహిళ కార్యక్రమంలో భాగంగా మహిళలకు న్యాయసలహాలు, ఆరోగ్య సమస్యలపై అవగాహన కోసం సంబంధిత రంగాలకు చెందిన నిపుణులు కౌన్సెలింగ్ ఇస్తారు. మైత్రి మహిళ కార్యక్రమంలో సూచనలిచ్చే నిపుణులు డాక్టర్ ప్రీతీరెడ్డి (గైనకాలజిస్టు), డాక్టర్ దమయంతి (పోషకాహార నిపుణులు), డాక్టర్ కిన్నెరామూర్తి (న్యాయసలహాలు) -
ప్రణాళికతో చదివితే సీఏ సులభమే
=సీఏ విద్యపై శ్రీమేధ‘వి’లో అవగాహన సదస్సు =పెద్ద ఎత్తున తరలివచ్చిన విద్యార్థులు తిరుచానూరు, న్యూస్‌లైన్ : సరైన ప్రణాళిక, కృషి ఉంటే సీఏలో సులభంగా ఉత్తీర్ణత సాధించవచ్చని శ్రీమేధ‘వి’ సీఏ కళాశాల విద్యా సంస్థల జిల్లా డెరైక్టర్ కె.షరీఫ్ పేర్కొన్నారు. సాక్షి ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతి ఎయిర్ బైపాస్‌రోడ్డులోని శ్రీమేధ‘వి’ సీఏ కళాశాలలో సీఏ-సీపీటీ, సీఏ-ఐపీసీసీ కోర్సులపై ఉచిత అవగాహన సదస్సు నిర్వహించారు. షరీఫ్ మాట్లాడుతూ సీఏ కోర్సు చేయడం చాలా కష్టమని ఒకప్పుడు అనుకునేవారని పేర్కొన్నారు. శ్రీమేధ‘వి’తో సులభమంగా మారిందన్నారు. రాయలసీమ విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని గత విద్యా సంవత్సరంలో తిరుపతి, ఈ విద్యా సంవత్సరంలో మదనపల్లెలో శ్రీమేధ‘వి’ సంస్థను స్థాపించినట్లు పేర్కొన్నారు. తిరుపతిలో స్థాపించిన మొదటి ఏడాదిలోనే జూనియర్ ఎంఈసీలో టాప్ టెన్‌లో 6 ర్యాంకులు సాధించడం తమ విద్యా బోధనకు నిదర్శనమన్నారు. జులైలో వెలువడిన సీపీటీ ఫలితా ల్లో తమ విద్యా సంస్థల విద్యార్థి కే.శరత్ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారని పేర్కొన్నారు. డిసెంబర్ 15న జరిగిన సీపీటీ పరీక్షలోని ఒకట్రెండు ప్రశ్నలు మినహా మిగిలిన అన్నింటికీ శ్రీమేధ‘వి’ రూపొందించిన మెటీరియల్స్ నుంచి వచ్చినవేనని తెలిపారు. సుదీర్ఘ అనుభవం కలిగిన సీఏ క్వాలిఫైడ్ అధ్యాపకులతో విజయవాడకు దీటుగా శిక్షణ ఇవ్వడం తిరుపతి శ్రీమేధ‘వి’ ప్రత్యేకతని వివరించారు. డెరైక్టర్ కె.అస్రఫ్ మాట్లాడుతూ సమాజంలో వస్తు సేవల వినియోగం ఉన్నంత కాలం, ఆర్థిక లావాదేవీలు జరిగినంత కాలం సీఏల అవసరం ఉంటుందన్నారు. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు సీఏ-సీపీటీ ప్రవేశ పరీక్షలు రాయకుండా నేరుగా సీఏ-ఐపీసీసీలో అడ్మిషన్ పొందవచ్చన్నారు. ప్రస్తుతం సీఏ-ఐపీసీసీ తరగతులు ప్రారంభమయ్యాయన్నారు. ఐపీసీసీలో చేరే విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌ను అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రిన్సిపాల్ బి.ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ సీఏ చేయాలన్న దృఢ సంకల్పం, ఆత్మ విశ్వాసం ఉంటే తప్పకుండా సాధించవచ్చన్నారు. ఇతర కోర్సులతో పోలిస్తే అతి తక్కువ ఖర్చుతో సీఏ పూర్తి చేయవచ్చన్నారు. అలాగే వంద శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశం ఉంటుందని వివరించారు. ప్రతి ఒక్కరిపైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని శిక్షణ ఇవ్వడం శ్రీమేధ‘వి’ సొంతమన్నారు. సీఏ కోర్సుపై ఉన్న సందేహాలను నివృత్తి చేసుకునేందుకు, ఇతర వివరాలకు 9581722223, 95818 22223 నంబర్లలో సంప్రదించాలని శ్రీమేధ‘వి’ విద్యాసంస్థల జిల్లా డెరైక్టర్లు కె.షరీఫ్, కె.అస్రఫ్ కోరారు. ఈ సదస్సుకు జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. శ్రీమేధ‘వి’ బాలుర క్యాంపస్ ప్రిన్సిపాల్ కామేశ్వరరావు, సీపీటీ అధ్యాపకులు కిరణ్, ఢిల్లీబాబు, సందీప్, ఏవో మురళీకృష్ణ, మేనేజర్ జనార్దన్, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. క్రమం తప్పకుండా చదవాలి సీఏ కోర్సులో చేరడం గొప్పకాదు. ఇతర కోర్సుల్లా పరీక్షలకు ముందు ఒక నెల చదివితే కుదరదు. క్రమం తప్పకుండా తరగతులకు హాజరవ్వాలి. అధ్యాపకులు చెప్పిన పాఠ్యాంశాలను శ్రద్ధగా వినాలి. విన్నదాన్ని అవగాహన చేసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకోవాలి. అలా చేస్తే సీఏ కోర్సును సులువుగా పూర్తి చేయొచ్చు. -ఎం.వెంకటాచలం, ఫ్యాకల్టీ, లా, ఎథిక్స్, కమ్యూనికేషన్ బేసిక్స్ ముఖ్యం సీపీటీకి సిద్ధమయ్యే విద్యార్థులకు అకౌంట్స్, ఎకనామిక్స్, లా, మ్యాథమెటిక్స్‌లోని బేసిక్స్ క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. ఇంటర్ ఎంఈసీ, సీఈసీలోని కామర్స్, సీపీటీలో అకౌంట్స్ బేసిక్ తెలిసి ఉంటే ఫైనల్ వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లొచ్చు. అకౌంట్స్ అనే పునాదిపైనే సీఏ ఆధారపడి ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. - సి.అశోక్‌కుమార్, ఫ్యాకల్టీ, అకౌంట్స్ సబ్జెక్టుపై అవగాహన అవసరం సబ్జెక్టుపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అందుకు అధ్యాపకులు చెప్పిన విషయాలను నిరంతరం మననం చేసుకుంటూ ఉండాలి. ప్రతి రోజూ క్రమం తప్పకుండా చదవాలి. చదివిన అంశాన్ని అవగాహన చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఎంతో కష్టమనుకున్న సీఏ కోర్సును సులువుగా పూర్తి చేయొచ్చు. - వి.అరుణ్‌కుమార్, ఫ్యాకల్టీ, కాస్ట్ అకౌంట్స్ ఉపయోగకరంగా ఉంది తిరుపతి శ్రీమేధ‘వి’లో సాక్షి ఆధ్వర్యంలో సీఏ-సీపీటీ, ఐపీసీసీ కోర్సులపై అవగాహన సదస్సు జరుగుతుందని కొందరు చెప్పడంతో కడప నుంచి వచ్చాను. సీఏ చేయాలంటే చేపట్టాల్సిన అంశాలు, పరీక్షలకు ఎలా సిద్ధమవ్వాలనే అంశాలను ఫ్యాకల్టీలు వివరించడం నాలాంటి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంది. -ఎస్.అన్వర్, విద్యార్థి, కడప పక్కా ప్రణాళిక అవసరం సీఏ-సీపీటీ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే పక్కా ప్రణాళిక ఎంతో అవసరం. సాధారణ డిగ్రీ పరీక్షలకు చదివినట్లు చదివితే కుదరదు. విద్యార్థులు క్రమం తప్పకుండా చదువుతూ పరీక్షకు సిద్ధమవ్వాల్సి ఉంటుంది. ఈ సూత్రం ఒక సీపీటీకే కాదు, సీఏ పూర్తయ్యేంత వరకు అమలు చేయాలి. ప్రతి సబ్జెక్టునూ చాలెంజ్‌గా తీసుకుని పూర్తి స్థాయిలో అవగాహన కలిగించుకుని చదవాలి. కోర్సు పూర్తి చేసిన వారికి బంగారు భవిత ఉంటుందనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. - ఏ.సురేష్, ఫ్యాకల్టీ, ఆడిటింగ్ వంద శాతం ఉపాధి దేశంలో సీఏల కొరత తీవ్రంగా ఉంది. ఇతర కోర్సులతో పోలిస్తే సీఏ చేసిన వారికి వంద శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయి. సీఏ ఎంచుకున్న విద్యార్థులు ఏరోజుకారోజు నేర్చుకున్న అంశాలను షార్ట్ నోట్స్ రూపంలో తయారు చేసుకోవాలి. వాటిని సీఏ పరీక్షకు నెల ముందు రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. -సీహెచ్.నాగేందర్, ఫ్యాకల్టీ, కాస్టింగ్, ఎఫ్ఎం, సీపీటీ అకౌంట్స్ నమ్మకం కలిగింది ఈ ఏడాది జూన్‌లో జరిగిన సీపీటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాను. తర్వాత ఐపీసీసీకి సిద్ధమవుతున్నా. ఐపీసీసీకి ఎలా సిద్ధమవ్వాలనే విషయం నాకు తెలియలేదు. శ్రీమేధ‘వి’లో జరిగిన అవగాహన సదస్సులో చాలా విషయాలు తెలుసుకున్నాను. నేను కూడా సీఏ పూర్తి చేయగలనన్న నమ్మకం కుదిరింది. - వై.డమరక్నాథ్రెడ్డి, విద్యార్థి, చిన్నగొట్టిగల్లు సీఏ చేయాలనుకుంటున్నా ఇంటర్లో ఎంపీసీ పూర్తి చేశాను. మా అమ్మానాన్నల కోరిక మేరకు డిగ్రీలో బీకాం తీసుకున్నాను. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఇప్పుడు సీఏ చేయాలనుకుంటున్నా. సీఏ చేయలేమోనని కొంత భయమేసింది. అవగాహన సదస్సుకు వచ్చిన తర్వాత సీఏ చేయాలన్న తన ఆకాంక్ష మరింత బలపడింది. - కె.లావణ్య, విద్యార్థిని, తిరుపతి సీఏ చేయడమే లక్ష్యం సీఏ చేయడమే నా లక్ష్యం. డిసెంబరు 15వ తేదీన జరిగిన సీఏ-సీపీటీకి ఇంటి వద్ద నుంచే సిద్ధమవుతుండడంతో నేను చదివిన విక్రమ్ విద్యాసంస్థ అధ్యాపకులు విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు. వారి అందించిన సహకారం, అవగాహన సదస్సులో తెలుసుకున్న విషయాలతో నా ఆకాంక్ష నెరవేరుతుందనే ధైర్యం వచ్చింది. - పి.హేమలత, విద్యార్థిని, శ్రీకాళహస్తి