ప్రతిష్టాత్మక ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించిన జేఈఈ మెయిన్స్‌లో తెలంగాణ టాప్ లేపింది. జాతీయ స్థాయి మొదటి ర్యాంకు మాత్రమేగాక.. టాప్–10లో ఐదు ర్యాంకులను తెలంగాణ విద్యార్థులే సాధించారు. జాతీయ స్థాయిలో వంద పర్సంటైల్ సాధించిన వారిలోనూ రాష్ట్ర విద్యార్థులు 11 మంది ఉన్నారు. ఏపీతో కలుపుకొంటే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 16 మంది వంద పర్సంటైల్ సాధించిన టాప్–43లో నిలిచారు. ఇక ఓపెన్ కేటగిరీలో మొదటి వంద ర్యాంకుల్లో 25కుపైగా, టాప్ వెయ్యి ర్యాంకుల్లో 200కుపైగా తెలంగాణ విద్యార్థులకు దక్కాయి. ఈసారి జేఈఈ పరీక్ష జాతీయ స్థాయిలో రెండు దఫాలుగా.. జనవరిలో ఒకసారి, ఏప్రిల్‌లో మరోసారి జరిగింది. కంప్యూటర్ ఆధారితంగా ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 11,62,398 మంది దరఖాస్తు చేసుకోగా.. 11,13,325 మంది హాజరయ్యారు. తుది ఫలితాలు, ర్యాంకులను ఎన్‌టీఏ శనివారం వెల్లడించింది.
టాపర్స్ వీరే..
జేఈఈ మెయిన్స్‌లో దేశవ్యాప్తంగా వంద శాతం పర్సంటైల్‌ను 43 మంది విద్యార్థులు సాధించగా.. అందులో 11 మంది తెలంగాణ విద్యార్థులే. మొత్తంగా టాప్ ర్యాంకు హైదరాబాద్‌కు చెందిన సింగరాజు వెంకట కౌండిన్యకు దక్కింది. టాప్–10 ర్యాంకుల్లో రాష్ట్రానికి చెందిన అల్లం సుజయ్ 6వ ర్యాంకు, వావిళ్ల చిద్విలాసరెడ్డి 7వ ర్యాంకు, బిక్కన అభినవ్ చౌదరి 8వ ర్యాంకు, అభినీత్ మంజేటి 10వ ర్యాంకు సాధించారు. ఇక గుత్తికొండ అభిరాం (17వ ర్యాంకు), భరద్వాజ (18వ ర్యాంకు), పాలూరి గణకౌశిక్‌రెడ్డి (20వ ర్యాంకు), రమేశ్ సూర్యతేజ (21వ ర్యాంకు), నందిపాటి సాయి దుర్గారెడ్డి (40వ ర్యాంకు), ఈవూరి మోహన శ్రీధర్‌రెడ్డి (41వ ర్యాంకు) తదితరులు వందశాతం పర్సంటైల్ సాధించిన టాప్–43 ర్యాంకర్లలో ఉన్నారు.
రేపట్నుంచి అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తులు
జేఈఈ అర్హత సాధించినవారు ఈ నెల 30 నుంచి అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్‌టీఏ ప్రకటించింది. ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేసుకుని, దాని ఆధారంగా వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. వివిధ కేటగిరీలకు కేటాయించిన కటాఫ్ మార్కుల ఆధారంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులైన వారి వివరాలను ర్యాంకు కార్డులో పొందుపరిచారు.
అడ్వాన్స్‌డ్‌కు కటాఫ్ ఇదీ..
దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్‌కు హాజరైనవారిలో 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్ పరీక్షకు ఎంపిక చేస్తారు. పరీక్షలో వచి్చన మార్కులను పరిగణనలోకి తీసుకుని వివిధ కేటగిరీల వారీగా కటాఫ్ నిర్ణయిస్తారు. గత ఏడాది కన్నా ఈసారి ఎక్కువ మంది పరీక్షకు హాజరయ్యారు. ఈసారి ఓపెన్ కేటగిరీలో 90 పర్సంటైల్‌తో కటాఫ్ నిర్ణయించారు.
కేటగిరీల వారీగా కటాఫ్ ఇదీ..
కేటగిరీ కటాఫ్ ఎంపికైన అభ్యర్థుల సంఖ్య
ఓపెన్ 90.788642 98,612
పీహెచ్ 0.0013527 2,685
ఈడబ్ల్యూఎస్ 75.6229025 25,057
ఓబీసీ 73.6114227 67,613
ఎస్సీ 51.9776027 37,536
ఎస్టీ 37.2348772 18,752
కృత్రిమ మేధపై పట్టు సాధించాలనుంది
జేఈఈ మెయిన్స్‌లో జాతీయస్థాయి టాపర్‌గా నిలవడం ఆనందంగా ఉంది. అడ్వాన్స్‌డ్‌లోనూ ఇదే పట్టుదలతో విజయం సాధిస్తా. ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో చేరాలనుంది. తర్వాత ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్‌లో పట్టు సాధించాలన్నది నా లక్ష్యం. ఆ దిశగా రోజుకు 18 గంటలు కష్టపడి చదువుతున్నాను. మా నాన్న శ్రీపణి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, అమ్మ రాజరాజేశ్వరి నా కోసం చాలా కష్టపడ్డారు. వారి నమ్మకాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తాను.
– సింగరాజు వెంకట కౌండిన్య, జేఈఈ టాపర్
Comments
Please login to add a commentAdd a comment