ఐఐటీల్లో విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు.. మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు చర్యలు
ఐఐటీ భువనేశ్వర్‌లో ఏటా హాలోవీన్ నైట్..
ఐఐటీహెచ్‌లో ప్రకృతి ఒడిలో సన్‌షైన్ ఉత్సవం
సాక్షి, హైదరాబాద్: ఒకచోట అర్ధరాత్రి ఆత్మల్లా విహారం. మరోచోట ఆమని ఒడిలో చిన్నారుల్లా కేరింతలు. భయపెడుతూ, భయపడుతూ, భయాన్ని అధిగమించే సన్నివేశం ఒకటి. బాల్యంలోకి తీసుకెళ్లి బడి ఒత్తిడిని తగ్గించే కార్యక్రమం మరొకటి. దేశంలోని ఉన్నత విద్యా సంస్థలైన ఐఐటీల్లో విద్యార్థులకు మానసిక ఒత్తిడి, భయాన్ని తగ్గించేందుకు అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఐఐటీ భువనేశ్వర్‌లో ఏటా నిర్వహించే హాలోవీన్ నైట్, ఐఐటీ హైదరాబాద్ నిర్వహించే సన్‌షైన్ కార్యక్రమాలు అద్భుత ఫలితాలు ఇస్తున్నాయి.
ఐఐటీలో ఆత్మల రాత్రి
అర్ధరాత్రి.. ఆత్మ మాదిరిగా వేషధారణ.. అక్కడక్కడ శవపేటికలు.. దెయ్యాల కొంపల్లా భవనాల అలంకరణ.. పుర్రెలతో డెకరేషన్.. మసక మసక చీకటితో కూడిన లైటింగ్.. ఐఐటీ భువనేశ్వర్‌లో ఏటా అక్టోబర్ చివరలో నిర్వహించే హాలోవీన్ నైట్ కార్యక్రమం దృశ్యాలివి. విద్యార్థులను తీవ్రమైన మానసిక ఒత్తిడి నుంచి బయటపడేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ విద్యాసంస్థలో నవంబర్ మూడో వారం నుంచి సెమిస్టర్ పరీక్షలు మొదలవుతాయి. ఈ పరీక్షల కోసం విద్యార్థులు రేయింబవళ్లు కష్టపడుతుంటారు. పుస్తకాలతో కుస్తీలు పడుతుంటారు. ల్యాప్‌టాప్‌లలో మునిగిపోతారు.
ఈ క్రమంలో అనేక మంది విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. కొందరైతే డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుంటారు. ప్రధానంగా మొదటి సంవత్సరం విద్యార్థుల్లో ఈ భయం ఎక్కువగా ఉంటుంది. దీన్ని అధిగమించేందుకు ఈ ఉన్నత విద్యా సంస్థ ఏటా ఇలా హాలోవీన్ నైట్ (పిశాచాల రాత్రి) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటుంది. విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని పెంచేందుకు ఇందులో సీఎస్‌టీ (కౌన్సిలింగ్ సర్వీస్ టీం) అనే ప్రత్యేక విభాగం పనిచేస్తోంది. ఇందులో విద్యార్థులతో పాటు పాఠాలు బోధించే ఫ్రొఫెసర్లు, వ్యక్తిత్వ వికాస నిపుణులు కూడా ఉంటారు.
ఐఐటీహెచ్‌లో మెంటల్ హెల్త్ మంత్
రాళ్లపై బోమ్మలు (స్టోన్ పెయింటింగ్).. మట్టితో వివిధ ఆకృతులు (క్లే థెరపీ).. ఇవన్నీ చూస్తుంటే ఏదో ప్లే స్కూల్‌లో చిన్నారులు చదువుకునే విధానంలా ఉంది కదా? కానీ, టెక్నాలజీ పరంగా దేశంలోనే అత్యున్న విద్యా సంస్థల్లో ఒకటైన హైదరాబాద్ ఐఐటీలో విద్యా
ర్థులు ఒత్తిడిని అధిగమించేందుకు అవలంభిస్తున్న మార్గాలివి. సన్‌షైన్ పేరుతో పనిచేస్తున్న ప్రత్యేక విభాగం ఏటా అక్టోబర్‌లో మెంటల్ హెల్త్ మంత్ నిర్వహిస్తోంది. విద్యార్థులు చదువుల ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
మ్యూజిక్ ఆర్ట్ థెరపీ, ఎమోస్నాప్.. హీల్ అవుట్ లౌడ్.. ఇలా ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది. ఈ సన్‌షైన్ విభాగంలో స్టూడెంట్ బడ్డీ, మెంటార్స్, కౌన్సిలర్లు, మానసిక వ్యక్తిత్వ నిపుణులు భాగస్వాములుగా ఉంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ యాప్‌నే అబివృద్ధి చేశారు. చాట్‌బాట్ రూపంలో ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒత్తిడిని జయించే మార్గాలను సలహాలను సూచనలు పొందేలా ఏర్పాట్లు చేశారు.
ఐఐటీహెచ్‌లో తొలి నేషనల్ వెల్‌బీయింగ్ కాంక్లేవ్ హైదరాబాద్ ఐఐటీ వేదికగా తొలి నేషనల్ వెల్‌బీయింగ్ కాంక్లేవ్ శనివారం ప్రారంభమైంది. దేశంలోని అన్ని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిబుల్‌ఐటీలు, ఇతర ప్రతిష్టాత్మక ఉన్నత విద్యా సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, ఫ్రొఫెసర్లు ఈ సదస్సుకు హాజరయ్యారు. విద్యార్థులు ఒత్తి డిని జయించేందుకు ఆయా విద్యా సంస్థలు అవలంభిస్తున్న మార్గాలను వివరించేందుకు ప్రత్యేకంగా స్టాల్‌లను ప్రదర్శించారు.
ఒత్తిడిని జయించేందుకు ఎంతో ఉపయోగం
విద్యార్థులు మానసిక ఒత్తి డితో బాధపడుతు న్నట్లు తమ దృష్టికి వస్తే వెంటనే ఆ విద్యార్థితో స్టూడెంట్ గైడ్ మాట్లాడుతారు. అవస రం మేరకు ఆ విద్యార్థి పరిస్థితిని వ్యక్తిత్వ వికాస నిపుణుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను అధిగమించేలా చేస్తున్నాము. ఇందుకోసం మా విద్యా సంస్థల్లో సీఎస్‌టీ (కౌన్సిలింగ్ సరీ్వస్ టీం) పనిచేస్తోంది. – మంగిపూడి శ్రావ్య, బీటెక్ మెట్‌లర్జీ, ఐఐటీ భువనేశ్వర్
Comments
Please login to add a commentAdd a comment