IIT JEE
-
జేఈఈ, యూపీఎస్సీలలో ఏది కష్టం?.. ఆనంద్ మహీంద్రా ఏం చెప్పారంటే..
భారతదేశంలో అత్యంత కఠినమైన ఎగ్జామ్ ఏదంటే దాదాపు చాలామంది UPSC లేదా ఐఐటీ జేఈఈ అని చెబుతారు. అయితే ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఇటీవల తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ప్రపంచంలో అత్యంత కష్టమైన ఎగ్జామ్ ఏదనే దానికి సంబంధించి 'ది వరల్డ్ ర్యాంకింగ్' రూపొందించిన ఒక లిస్ట్ పోస్ట్ చేశారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన పోస్ట్‌లో అత్యంత కఠినమైన పరీక్షగా చైనా నిర్వహించే 'గావోకో పరీక్ష' (Gaokao Exam) అని తెలిసింది. ఆ తరువాత జాబితాలో వార్సుపైగా ఇండియాలో నిర్వహించే IIT JEE, UPSC ఎగ్జామ్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. గేట్ ఎగ్జామ్ కూడా దేశంలో నిర్వహించే కఠినమైన పరీక్షగా ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. బిజినెస్ మ్యాన్ ఆనంద్ మహీంద్రా 12th ఫెయిల్ సినిమా చూసిన తర్వాత జేఈఈ, యూపీఎస్సీలలో ఏది కఠినమైన పరీక్ష అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలను కోరారు. ఇందులో కొందరు యూపీఎస్సీ అని, మరి కొందరు జేఈఈ అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఒక ఐఐటీ గ్రాడ్యుయేట్ తాను UPSC పరీక్ష రాశానని, ఐఐటీ జేఈఈతో పోలిస్తే యూపీఎస్సీ చాలా కఠినమైందని వెల్లడించారు. ఇదీ చదవండి: రూ. 700లకు థార్ అడిగిన బుడ్డోడు.. ఫ్యాక్టరీలో హల్చల్ చేశాడు - వీడియో నెటిజన్లు చెప్పిన సమాధానాలను బట్టి చూస్తే తప్పకుండా ర్యాంకింగ్స్ అప్డేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ట్వీట్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. వేలమంది వీక్షించిన ఈ పోస్ట్.. లెక్కకు మించిన లైక్స్ పొందింది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. After seeing #12thFail I checked around and spoke to a number of young people about the relative difficulty of our entrance exams. One of them was a graduate of IIT who is involved in a business startup but who has also taken the UPSC exam. He stated EMPHATICALLY that UPSC is… https://t.co/NvGTIHWkrz — anand mahindra (@anandmahindra) February 4, 2024 -
జేఈఈ మెయిన్స్‌లో.. టాప్ లేపిన తెలంగాణ!
ప్రతిష్టాత్మక ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించిన జేఈఈ మెయిన్స్‌లో తెలంగాణ టాప్ లేపింది. జాతీయ స్థాయి మొదటి ర్యాంకు మాత్రమేగాక.. టాప్–10లో ఐదు ర్యాంకులను తెలంగాణ విద్యార్థులే సాధించారు. జాతీయ స్థాయిలో వంద పర్సంటైల్ సాధించిన వారిలోనూ రాష్ట్ర విద్యార్థులు 11 మంది ఉన్నారు. ఏపీతో కలుపుకొంటే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 16 మంది వంద పర్సంటైల్ సాధించిన టాప్–43లో నిలిచారు. ఇక ఓపెన్ కేటగిరీలో మొదటి వంద ర్యాంకుల్లో 25కుపైగా, టాప్ వెయ్యి ర్యాంకుల్లో 200కుపైగా తెలంగాణ విద్యార్థులకు దక్కాయి. ఈసారి జేఈఈ పరీక్ష జాతీయ స్థాయిలో రెండు దఫాలుగా.. జనవరిలో ఒకసారి, ఏప్రిల్‌లో మరోసారి జరిగింది. కంప్యూటర్ ఆధారితంగా ఆన్లైన్లో నిర్వహించిన ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 11,62,398 మంది దరఖాస్తు చేసుకోగా.. 11,13,325 మంది హాజరయ్యారు. తుది ఫలితాలు, ర్యాంకులను ఎన్టీఏ శనివారం వెల్లడించింది. టాపర్స్ వీరే.. జేఈఈ మెయిన్స్‌లో దేశవ్యాప్తంగా వంద శాతం పర్సంటైల్‌ను 43 మంది విద్యార్థులు సాధించగా.. అందులో 11 మంది తెలంగాణ విద్యార్థులే. మొత్తంగా టాప్ ర్యాంకు హైదరాబాద్‌కు చెందిన సింగరాజు వెంకట కౌండిన్యకు దక్కింది. టాప్–10 ర్యాంకుల్లో రాష్ట్రానికి చెందిన అల్లం సుజయ్ 6వ ర్యాంకు, వావిళ్ల చిద్విలాసరెడ్డి 7వ ర్యాంకు, బిక్కన అభినవ్ చౌదరి 8వ ర్యాంకు, అభినీత్ మంజేటి 10వ ర్యాంకు సాధించారు. ఇక గుత్తికొండ అభిరాం (17వ ర్యాంకు), భరద్వాజ (18వ ర్యాంకు), పాలూరి గణకౌశిక్రెడ్డి (20వ ర్యాంకు), రమేశ్ సూర్యతేజ (21వ ర్యాంకు), నందిపాటి సాయి దుర్గారెడ్డి (40వ ర్యాంకు), ఈవూరి మోహన శ్రీధర్‌రెడ్డి (41వ ర్యాంకు) తదితరులు వందశాతం పర్సంటైల్ సాధించిన టాప్–43 ర్యాంకర్లలో ఉన్నారు. రేపట్నుంచి అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తులు జేఈఈ అర్హత సాధించినవారు ఈ నెల 30 నుంచి అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్టీఏ ప్రకటించింది. ర్యాంకు కార్డు డౌన్లోడ్ చేసుకుని, దాని ఆధారంగా వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. వివిధ కేటగిరీలకు కేటాయించిన కటాఫ్ మార్కుల ఆధారంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులైన వారి వివరాలను ర్యాంకు కార్డులో పొందుపరిచారు. అడ్వాన్స్‌డ్‌కు కటాఫ్ ఇదీ.. దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్‌కు హాజరైనవారిలో 2.5 లక్షల మందిని అడ్వాన్స్డ్ పరీక్షకు ఎంపిక చేస్తారు. పరీక్షలో వచి్చన మార్కులను పరిగణనలోకి తీసుకుని వివిధ కేటగిరీల వారీగా కటాఫ్ నిర్ణయిస్తారు. గత ఏడాది కన్నా ఈసారి ఎక్కువ మంది పరీక్షకు హాజరయ్యారు. ఈసారి ఓపెన్ కేటగిరీలో 90 పర్సంటైల్‌తో కటాఫ్ నిర్ణయించారు. కేటగిరీల వారీగా కటాఫ్ ఇదీ.. కేటగిరీ కటాఫ్ ఎంపికైన అభ్యర్థుల సంఖ్య ఓపెన్ 90.788642 98,612 పీహెచ్ 0.0013527 2,685 ఈడబ్ల్యూఎస్ 75.6229025 25,057 ఓబీసీ 73.6114227 67,613 ఎస్సీ 51.9776027 37,536 ఎస్టీ 37.2348772 18,752 కృత్రిమ మేధపై పట్టు సాధించాలనుంది జేఈఈ మెయిన్స్‌లో జాతీయస్థాయి టాపర్‌గా నిలవడం ఆనందంగా ఉంది. అడ్వాన్స్‌డ్‌లోనూ ఇదే పట్టుదలతో విజయం సాధిస్తా. ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో చేరాలనుంది. తర్వాత ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్‌లో పట్టు సాధించాలన్నది నా లక్ష్యం. ఆ దిశగా రోజుకు 18 గంటలు కష్టపడి చదువుతున్నాను. మా నాన్న శ్రీపణి సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమ్మ రాజరాజేశ్వరి నా కోసం చాలా కష్టపడ్డారు. వారి నమ్మకాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తాను. – సింగరాజు వెంకట కౌండిన్య, జేఈఈ టాపర్ -
'జ్యోతి కుమారికి ఉచితంగా ఐఐటీ కోచింగ్'
పట్నా : లాక్డౌన్ నేపథ్యంలోనూ గాయపడిన తన తండ్రిని సొంతూరుకు చేర్చడం కోసం 1200 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించిన జ్యోతి కుమారి పట్ల సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ప్రముఖ మ్యాథమెటీషియన్, సూపర్ 30 వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ జ్యోతి కుమారికి ఉచితంగా ఐఐటీ-జేఈఈ కోచింగ్ అందిస్తామని ప్రకటించాడు. ''ఐదు రోజుల పాటు సైకిల్ తొక్కుతూ 1200 కిలోమీటర్ల ప్రయాణించడం అంటే ఒక సాహసమే. కానీ జ్యోతి కుమారి సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించింది. సూపర్ 30 తరపున మా తమ్ముడు జ్యోతి కుటుంబాన్ని కలిసి సహాయం అందించాడు. భవిష్యత్తులో ఐఐటీయన్ కావాలనుకుంటే జ్యోతికుమారికి మా సూపర్ 30 స్వాగతం పలుకుతుంది'' అంటూ ఆనంద్ కుమార్ ట్వీట్ చేశారు. (పల్లె విద్యార్థులకు ఆనంద్ కుమార్ పాఠాలు ) #Bihar daughter #jyotikumari has set an example by paddling all the way from #Delhi carrying her father on a bicycle, covering an unimaginable 1200 kms. Yesterday, my brother @Pranavsuper30 met her. If she would like to prepare for #IIT in future she is welcome to the #super30 pic.twitter.com/PMhsMvhDwn — Anand Kumar (@teacheranand) May 25, 2020 అంతకుముందు సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యోతికి సైక్లింగ్‌లో శిక్షణతో పాటు ఆమె చదువుకు కూడా సహాయం అందిస్తామని ప్రకటించింది. జ్యోతిని ధైర్యవంతురాలిగా ప్రశంసిస్తూ పలువురు మంత్రులు ఆమెకు సహాయం అందివ్వడానికి ముందుకు వచ్చారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి రాబ్రీ దేవి సైతం జ్యోతి చదువుకు, వివాహానికి అయ్యే మొత్తం ఖర్చు తానే భరిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆర్డేడీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన తండ్రికి ఉద్యోగం ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇక జ్యోతి సాహాసానికి ఇవాంకా ట్రంప్ సైతం ఫిదా అయ్యారు. ఆమె కథని ట్విట్టర్ వేదికగా పంచుకున్న ఇవాంకా ''అదో అందమైన సహనంతో కూడిన ప్రేమ. ఆమె చేసిన ఫీట్‌ని భారత ప్రజలతో పాటు సైక్లింగ్ ఫెడరేషన్ గుర్తించాయి'' అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. (జ్యోతి కుమారి నిజంగా అద్భుతం : ఇవాంక ) -
23న జేఈఈ మెయిన్ ర్యాంకుల ప్రకటన
ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్ల కేటాయింపునకు షెడ్యూల్ విడుదల 24 నుంచి ఆప్షన్లు.. 30న తొలివిడత సీట్ల కేటాయింపు వె బ్‌సైట్‌లో వివరాలను వెల్లడించిన ఐఐటీ గువాహటి సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను శనివారం ఐఐటీ గువాహటి ప్రకటించింది. ఈ నెల 23న జేఈఈ మెయిన్ ఆలిండియా ర్యాంకులను వెల్లడించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో 24 నుంచి కళాశాలలను, కోర్సులను ఎంచుకునేందుకు ఆప్షన్లు ఇచ్చే ప్రక్రియ ప్రారంభం కానుంది. 30న తొలిరౌండ్ సీట్ల కేటాయింపు జరగనుంది. తొలిరౌండ్ లో సీటు ఆమోదం కోసం 4 లేదా ఐదు రోజులు గడువు ఇస్తారు. ఆపై ఒకరోజు తర్వాత రెండోరౌండ్ సీట్ల కేటాయింపు జరగనుంది. మొత్తం నాలుగు రౌండ్లలో సీట్ల కేటాయింపునకు సంబంధించిన తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. మొత్తం 22 ఐఐటీలు, ఒక ఐఎస్ఎం, 31 ఎన్ఐటీలు, 18 ఐఐఐటీలు, మరో 18 కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యా సంస్థ ల్లో ప్రవేశానికి సంయుక్త కౌన్సెలింగ్‌ను నిర్వహించాలని జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ(జోసా) నిర్ణయించిందని ఐఐటీ గువాహటి వెల్లడించింది. షెడ్యూల్ ఇదీ.. జూన్ 23న: జేఈఈ మెయిన్ ఆలిండియా ర్యాంకుల ప్రకటన 24 నుంచి 28 వరకు: ఆప్షన్ల ప్రక్రియ 27న : సీట్ల కేటాయింపు నమూనా ప్రదర్శన 30న : తొలిరౌండ్ సీట్ల కేటాయింపు -
మురికివాడలో పుట్టి.. సత్తా చాటి..
ముంబై కవలల ఘనత ముంబై: మురికివాడల్లో పుట్టినా చదువులో మేటి అనిపించుకున్నారు ఈ ముంబై కవలలు. బస్ డ్రైవర్ కుమారులు ఇద్దరూ ఒకేసారి ప్రతిష్టాత్మక ఐఐటీ జేఈఈలో ఉత్తీర్ణత సాధించారు. గురువారం ప్రకటించిన ఐఐటీ అడ్వాన్స్డ్ పరీక్షలో ముంబైకి చెందిన బస్ డ్రైవర్ రామశంకర్ యాదవ్ కుమారులైన రామ్ ఓబీసీ కేటగిరీలో 267వ ర్యాంకు దక్కించుకోగా.. అతని కవల సోదరుడు శ్యామ్ అదే విభాగంలో 1,816వ ర్యాంకు సాధించాడు. ముంబైలోని భివండీ ప్రాంతంలోని ఓ మురికి వాడలో రామశంకర్ యాదవ్ కుటుంబం నివసిస్తోంది. తనకు వచ్చే రూ.8 వేల జీతంతోనే రామశంకర్ కుటుంబాన్ని పోషిస్తూ.. నలుగురు పిల్లలను చదివిస్తున్నాడు. అయితే రామ్, శ్యామ్ చదువులో చురుకైనవారు కావడంతో టెన్త్, 12వ తరగతి పరీక్షల్లో కోచింగ్ లేకుండానే మంచి మార్కులు సాధించారు. అయితే ఎఫ్ఐఐటీజేఈఈ పెట్టిన ఆప్టిట్యూడ్ పరీక్షలో పాస్ కావడంతో జేఈఈకి ఉచితంగా కోచింగ్ సంపాదించారు. అయితే, ఐఐటీ ప్రవేక్ష పరీక్ష పాస్ కావడంతో ఈ కుటుంబానికి కష్టాలు తీరిపోలేదు. ఇప్పుడు వీరిద్దరినీ ఐఐటీల్లో చేర్పించడం ఆ తండ్రికి తలకు మించిన భారంగా మారింది. ఐఐటీలో చేర్చాలంటే లక్షల్లో ఫీజులు చెల్లించాలి. అది కూడా ఇద్దరికీ ఒకేసారి కట్టాలి. తన కుమారులు కష్టపడి చదువుతారని, అయితే వారి భవిష్యత్తు ప్రణాళికలకు ఏ విధంగా సహాయపడాలో అర్థం కావడం లేదని, అన్ని త్వరలోనే సర్దుకుంటాయని రామశంకర్ ఆశాభావంతో ఉన్నాడు. అతి చిన్న వయసులోనే...! పాట్నా: బీహార్‌కు చెందిన శివానంద్ తివారీ 14 ఏళ్లకే ప్రతిష్టాత్మక ఐఐటీ జేఈఈ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి.. అతి చిన్న వయసులో ఈ ఘనత సాధించిన విద్యార్థిగా రికార్డు సృష్టించాడు. గురువారం విడుదల చేసిన ఐఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో తివారీ 2,587వ ర్యాంకు సాధించాడు. కోర్టు నుంచి అనుమతి తీసుకుని మరీ శివానంద్ తివారీ తొలిసారి పరీక్షకు హాజరుకావడమే కాక ఉత్తీర్ణత సాధించడం గమనార్హం. బీహార్‌లోని రోహ్తాస్ జిల్లా ధరమ్‌పుర శివానంద్ తివారీ స్వస్థలం. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన తివారీ ఇప్పుడు ఐఐటీ ప్రవేశ పరీక్షలో విజయం సాధించినా.. మొదటగా మత ప్రబోధకుడు కావాలనుకున్నాడు. 2011లో పాట్నా, ఢిల్లీలో బ్రాంచ్‌లున్న నారాయణ ఐఐటీ-పీఎంటీ అకాడమీ డెరైక్టర్ యూపీ సింగ్.. శివానంద్ తివారీ ప్రతిభను గుర్తించాడు. అతని తండ్రి కమల్‌కాంత్‌ను ఒప్పించి శివానంద్‌ను ఢిల్లీ తీసుకువెళ్లి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం మొదలు పెట్టారు. ఇదే క్రమంలో స్కూల్ స్టడీస్‌ను విజయవంతంగా పూర్తి చేసిన శివానంద్.. ఈ ఏడాది 93.4 శాతం మార్కులతో 12వ తరగతి పాస్ అయ్యాడు. దానితో పాటే ఐఐటీ శిక్షణ కూడా తీసుకున్నాడు. -
బస్సు డ్రైవర్ కవలలు.. ఐఐటీ కొట్టారు!!
ఐఐటీలో ర్యాంకు సాధించి, సీటు పొందడం అంటే చిన్న విషయం కాదు. కానీ ముంబైలోని ఓ బస్సు డ్రైవర్ రాం శంకర్ యాదవ్ కవల పిల్లలు ఇద్దరూ ఒకేసారి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో ర్యాంకులు కొట్టి ఆ తండ్రికి రెట్టింపు ఆనందాన్నిచ్చారు. రాం యాదవ్, శ్యాం యాదవ్ అనే ఈ ఇద్దరు కవల పిల్లలకు ఐఐటీలలో సీట్లు సాధించేంత ర్యాంకులు వచ్చాయి. రాం యాదవ్‌కు ఓబీసీ విభాగంలో 267వ ర్యాంకు రాగా, శ్యాం యాదవ్‌కు అదే విభాగంలో 1816వ ర్యాంకు వచ్చింది. తమ తల్లిదండ్రులకు తాము ఈ పరీక్షలో ఉత్తీర్ణులు అయినట్లు తెలుసు గానీ, వారికి దీని ప్రాధాన్యం అంతగా తెలియదని, తమ కవల సోదరులిద్దరికీ మాత్రం లక్ష్యాలు సాధించడంలో ఇది మొదటి అడుగని రాం యాదవ్ చెప్పాడు. తామిద్దరం కూడా పరిశోధన రంగంలోకే వెళ్లాలనుకుంటున్నట్లు తెలిపాడు. భివాండీ మురికివాడలో పుట్టి పెరిగిన ఈ డ్రైవర్ కుటుంబం.. తమ పిల్లలు కుటుంబ పోషణకు సరిపడ సంపాదిస్తే చాలని రాం శంకర్ యాదవ్ భావించాడు. ప్రస్తుతానికి వారి కుటుంబ ఆదాయం 8 వేల రూపాయలు. అయినా ఎలాగోలా వారిని ఇన్నేళ్ల పాటు చదివించాడు. ఎలాంటి కోచింగ్ లేకుండానే పదోతరగతి, ఇంటర్ పరీక్షలు పాసైన కవల సోదరులు.. జేఈఈకి మాత్రం ఫిట్జీలో కోచింగ్ తీసుకున్నారు. యాప్టిట్యూట్ టెస్టులో మంచి ప్రతిభ కనిపించడంతో ఈ కోచింగ్ కూడా ఉచితంగానే అందింది. ర్యాంకులు వచ్చాయని ఆ కుటుంబం సంబరపడుతున్నా.. ఇప్పుడు వాళ్లిద్దరికీ ఫీజులు కట్టడానికి డబ్బు ఎక్కడినుంచి తేవాలన్నది ఆ కుటుంబానికి పెద్ద సమస్యగా మారింది. ఐఐటీ అంటేనే భారీమొత్తంలో ఫీజులుంటాయి. పైపెచ్చు, ఒకేసారి ఇద్దరికీ కట్టాలి. నెలకు 8వేల రూపాయల జీతం మాత్రమే సంపాదించే ఆ బస్సు డ్రైవర్.. ఈ భారాన్ని ఎలా మోయాలో తెలియక సతమతం అవుతున్నాడు. -
14 ఏళ్లకే ఐఐటీ జేఈఈ లో ఉత్తీర్ణత
పాట్నా: పద్నాలుగు ఏళ్లకే బీహార్ కు చెందిన ఓ బాలుడు 2014 సంవత్సరపు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (ఐఐటీ జేఈఈ) పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. గురువారం విడుదలైన ఐఐటీ జేఈఈ ప్రవేశ పరీక్షలో 2587 ర్యాంక్ ను సాధించాడు. బీహార్ రోహ్ తాస్ జిల్లాలోని ఓ వ్యవసాయ కుటుంబానికి చెందిన శివానంద్ ఇటీవల జరిగిన 12వ తరగతిలో 93.4 శాతంతో పాస్ అయ్యాడు. ఐఐటీ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధించిన శివానంద్.. ఫిజిక్స్ పరిశోధన చేయాలని ఉందని తెలిపారు. చిన్నతనంలోనే ఓ ప్రత్యేకతను దక్కించుకున్నాడు. తొలి ప్రయత్నంలోనే ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం మాకు చాలా గర్వంగా ఉంది అని శివానంద్ తండ్రి కమలకాంత్ తివారీ అన్నారు. ఐఐటీ-జేఈఈ పరీక్షకు 126,997 మంది దరఖాస్తు చేసుకోగా, 27,151 అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. గత సంవత్సరం బీహార్ లోని భోజ్ పూర్ జిల్లాకు చెందిన విద్యార్ధి సత్యం కుమార్ 13 ఏళ్లకే ఐఐటీ జేఈఈ ప్రవేశ పరీక్షలో 679 ర్యాంకును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.