14 ఏళ్లకే ఐఐటీ జేఈఈ లో ఉత్తీర్ణత
Published Fri, Jun 20 2014 1:15 PM | Last Updated on Sat, Sep 2 2017 9:07 AM
పాట్నా: పద్నాలుగు ఏళ్లకే బీహార్ కు చెందిన ఓ బాలుడు 2014 సంవత్సరపు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (ఐఐటీ జేఈఈ) పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. గురువారం విడుదలైన ఐఐటీ జేఈఈ ప్రవేశ పరీక్షలో 2587 ర్యాంక్ ను సాధించాడు.
బీహార్ రోహ్ తాస్ జిల్లాలోని ఓ వ్యవసాయ కుటుంబానికి చెందిన శివానంద్ ఇటీవల జరిగిన 12వ తరగతిలో 93.4 శాతంతో పాస్ అయ్యాడు. ఐఐటీ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధించిన శివానంద్.. ఫిజిక్స్ పరిశోధన చేయాలని ఉందని తెలిపారు.
చిన్నతనంలోనే ఓ ప్రత్యేకతను దక్కించుకున్నాడు. తొలి ప్రయత్నంలోనే ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం మాకు చాలా గర్వంగా ఉంది అని శివానంద్ తండ్రి కమలకాంత్ తివారీ అన్నారు.
ఐఐటీ-జేఈఈ పరీక్షకు 126,997 మంది దరఖాస్తు చేసుకోగా, 27,151 అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. గత సంవత్సరం బీహార్ లోని భోజ్ పూర్ జిల్లాకు చెందిన విద్యార్ధి సత్యం కుమార్ 13 ఏళ్లకే ఐఐటీ జేఈఈ ప్రవేశ పరీక్షలో 679 ర్యాంకును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement