పదిలో అత్తెసరు మార్కులు, ప్రిలిమ్స్‌ పదిసార్లు ఫెయిల్‌.. అయినా..! | This IAS Officer Scored Average Marks In 10th, But Cracked UPSC Exam | Sakshi
Sakshi News home page

పదిలో అత్తెసరు మార్కులు, ప్రిలిమ్స్‌ పదిసార్లు ఫెయిల్‌.. అయినా..!

Published Thu, Feb 27 2025 2:53 PM | Last Updated on Thu, Feb 27 2025 5:56 PM

This IAS Officer Scored Average Marks In 10th, But Cracked UPSC Exam

ఒక సాధారణ విధ్యార్థి ఐఏఎస్‌కి ప్రిపేర్‌ అవ్వుతున్నాడంటే అందరూ ఎందుకురా అని ఈజీగా హేళన చేస్తారు. ఎందుకంటే డిగ్రీ వరకు ఏదో పాస్‌ మార్కులు సంపాదించుకున్నవాడు ప్రతిష్టాత్మకమైన సివిల్స్‌ ఎగ్జామ్‌కి ప్రిపేరవ్వడం అంటే అంత ఈజీ కాదు. చిన్న చిన్న కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌కి ప్రిపరైతే బెటర్‌ కదా అని అంతా సలహలిచ్చేస్తారు. కానీ అతడు మాత్రం కష్టతరమైన సివిల్స్‌ ఎగ్జామ్‌నే ఎంచుకున్నాడు. అయితే అతడు అందులో సక్సస్‌ అయ్యాడా అంటే..

బిహార్‌కి చెందిన అవనీష్‌ శరణ్‌ ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించాడు. అతడు చదువులో అంత మెరిట్‌ విద్యార్థి కాదు. పదోతరగతిలో జస్ట్‌ 44.7% అత్తెసరు మార్కులతో పాసయ్యాడు. ఇక ఇంటర్‌, గ్రాడ్యుయేషన్‌లలో కూడా జస్ట్‌ కొద్దిపాటి ఫస్ట్‌ క్లాస్‌ మార్కులతో పాసయ్యాడంతే. 

తాను సాధారణ విద్యార్థినే అని తెలిసి కూడా యూపీఎస్సీ లాంటి పెద్ద లక్ష్యాన్ని చేధించాలని పెట్టుకోవడం విశేషం. ఏ మాత్రం తన వల్ల అవుతుందా..? అనే అనుమానానికి తావివ్వకుండా ప్రయత్నించేందుకు సిద్ధమయ్యాడు. పోనీ అలా అని విజయం అంత ఈజీగా వరించిందా అంటే లేదు. అయితే ఇక్కడ అవనీష్‌ జస్ట్‌ రాష్ట్రంలో నిర్వహించే కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌లో ఎదుర్కొన్న ఫెయిల్యూర్స్‌ చూస్తే నోట మాటరాదు. 

ఒకటి, రెండు.. మూడు సార్లు కాదు ఏకంగా పదిసార్లు రాష్ట్రంలో నిర్వహించే గ్రూప్స్‌ ప్రిలిమ్స్‌లో పెయిల్‌ అయ్యాడు. అయినా సరే ఏద తెలియని మొండి పట్టుదల, ఎలాగైన సాధించాలన్న కసి.. అతడిని  సివిల్స్‌కి ప్రిపేరయ్యేలా పురిగొల్పింది. ఆ పట్టుదలే అతడిని అందర్నీ షాక్‌కి గురిచేసేలా అద్వితీయమైన విజయాన్ని అందుకునేలా చేశాయి. 

స్టేట్‌ కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌లో నెగ్గుకురాలేని వ్యక్తి ఏకంగా యూపీఎస్సీ సివిల్స్‌లో ఆల్‌ ఇండియా 77వ ర్యాంకు సాధించగలిగాడు. అతడు రెండో ప్రయత్నంలో ఈ ఘన విజయాన్ని అందుకున్నాడు. తొలి ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లి నిష్క్రమించాడు. అలా అతను 2009లో ఐఏస్‌ అయ్యి.. సామాన్య విద్యార్థి కూడా అద్భుతమైన సక్సస్‌ని అందుకోగలడని ప్రూవ్‌ చేశాడు. 

ప్రస్తుతం అవనీష్‌ చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్‌ జిల్లాలో ఐఏఎస్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మన సామర్థ్యం తక్కువే అని అయినా..ఓటమిని అంత తేలిగ్గా అంగీకరించిన తెగువ ఉంటే..సామాన్యుడు సైతం అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసుకోగలా సత్తాని సొంతం చేసుకోగలడు అని నిరూపించాడు. ఎందరికో కనువిప్పు కలిగించేలా స్ఫూర్తిగా నిలిచాడు.

(చదవండి: అమెరికా నుంచి భారత్‌కి అందుకే వచ్చేశా! సీఈవో హార్ట్‌ టచింగ్‌ రీజన్‌)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement