UPSC - Civils
-
టాప్ పోస్ట్.. సిటీ హోస్ట్!
సివిల్ సర్వీసెస్ దేశంలోకెల్లా అత్యంత కఠినమైన పరీక్ష అంటారు. నిజమే మూడంచెలుగా ఉండే ఈ ప్రక్రియ కూడా చాలా కష్టతరంగా ఉంటుంది. ఒక్కో దశ దాటాలంటే తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. ప్రిపరేషన్ కూడా అంత సులువైన విషయం కాదు. అందుకే చాలా మంది ఇన్స్టిట్యూట్స్లో చేరి కోచింగ్ తీసుకుంటుంటారు. ఒకప్పుడు సివిల్స్ కోచింగ్ అంటే ఢిల్లీ వెళ్లాల్సిందే. అక్కడే నెలలు, సంవత్సరాల తరబడి కోచింగ్ తీసుకుని, ప్రిపరేషన్ అయితే కానీ అత్యున్నత ఉద్యోగాన్ని సాధించడం సులువు కాకపోయేది. కానీ కరోనా తర్వాత ఈ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. మన భాగ్యనగరం సివిల్స్ కోచింగ్‌కు హబ్‌గా మారిపోయింది. దీంతో ప్రిపేర్ అయ్యే వారు అశోక్‌నగర్‌కు క్యూ కడుతున్నారు. అంతేకాకుండా కోచింగ్ సెంటర్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఢిల్లీతో పోల్చుకుంటే అశోక్‌నగర్‌ను ఎందుకు ఎంచుకుంటున్నారు..? అనుకూల అంశాలేంటి.. నాణ్యతగల కోచింగ్ లభిస్తోందా..? వంటి అంశాలను తెలుసుకుందాం. సాధారణంగా ఢిల్లీలో వాతావరణం గురించి తెలిసిందే. చలికాలంలో అక్కడి వాతావరణ పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. తీవ్రమైన వాయు కాలుష్యంతో బయటకు వెళ్లేందుకు కూడా జంకుతుంటారు. పైగా అక్కడ జీవన వ్యయం కూడా ఇక్కడితో పోల్చుకుంటే రెండు, మూడు రెట్లు అధికంగా ఉంటుంది. భోజనం కూడా మనకు నచి్చనట్టు ఉండదు. నార్త్ ఇండియన్ వంటకాలు మన శరీర తత్వానికి సరిపడవు. ఆ ఫుడ్‌కు అలవాటు పడేందుకు కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఏడాది కాలంలో ఢిల్లీలో విద్యుత్ షాక్, వరదలతో సెల్లార్లోకి నీళ్లు రావడం వంటి కారణాలతో పలువురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. అప్పటి నుంచి చాలా మంది తల్లిదండ్రులు అదే కోచింగ్ హైదరాబాద్‌లో తీసుకోవచ్చనే ఆలోచనకు వస్తున్నారు. ఈ కారణాలన్నీ మన హైదరాబాద్‌కు పాజిటివిటీని తీసుకొచ్చాయి అనొచ్చు. ఆన్లైన్ క్లాసులతో.. కరోనా ముందు వరకూ ప్రిపరేషన్ అంటే దాదాపు ఢిల్లీకి వెళ్లాల్సిందే అనే ఆలోచన అభ్యర్థుల్లో ఉండేది. అయితే కరోనా తర్వాత ఆ పరిస్థితులు మారాయి. ఎక్కడి నుంచైనా టాప్ ఇన్స్టిట్యూట్ అనే వాటిల్లో కూడా ఇంట్లో ఉండే కోచింగ్ తీసుకునే వెసులుబాటు వచ్చింది. ఆ సమయంలో ఆన్లైన్లో కోచింగ్ తీసుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీంతో చాలా సంస్థలు ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం మొదలుపెట్టాయి. కరోనా అనంతరం విద్యార్థులు ఆన్లైన్ క్లాసుల కన్నా నేరుగా క్లాసులు వినేందుకు మొగ్గుచూపారు. దీంతో ఆన్లైన్ సంస్థలు కాస్త ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచి్చంది. దీంతో సంస్థలు ఏర్పాటు చేస్తేనే బెటర్ అని చాలా మంది నగరంలో సంస్థలు ఏర్పాటు చేశారు. అశోక్‌నగర్‌కు క్యూ.. ఇదే మంచి అవకాశమని ఇటు అభ్యర్థులు, అటు కోచింగ్ సంస్థల నిర్వాహకులూ భావించి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. అభ్యర్థులు భారీగా అశోక్‌నగర్‌కు రావడమే కాకుండా.. కోచింగ్ సంస్థలు కూడా ఈ బూమ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఎక్కువగా వెలుస్తున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులకే కాకుండా కోచింగ్ సంస్థల మధ్య కూడా భారీగా కాంపిటీషన్ పెరిగిందని చెప్పొచ్చు.వరుస నోటిఫికేషన్లతో.. రాష్ట్ర ప్రభుత్వం సర్కారు కొలువులకు నోటిఫికేషన్లు ఇవ్వడం, పరీక్షలు నిర్వహిస్తుండటంతో సివిల్స్ ప్రిపేర్ అయ్యే వారు కూడా రాష్ట్రస్థాయి పరీక్షల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూశారు. దీంతో నగరంలోని చాలా ఇన్స్టిట్యూషన్స్ సివిల్స్ కోచింగ్‌తో పాటు టీఎస్పీఎస్సీ పరీక్షలకు సంబంధించి కోచింగ్ ఇవ్వడం, టెస్ట్ సిరీస్‌లను రూపొందించడం వంటివి చేస్తున్నారు. వికేంద్రీకరణ జరుగుతోంది.. సివిల్స్ కోచింగ్ అంటే ఢిల్లీ వెళ్లాలనే భావన క్రమంగా తగ్గుతోంది. మెటీరియల్ కానీ, టెస్ట్ సిరీస్ కానీ ఢిల్లీలోనే దొరికేవి. కానీ ఇప్పుడు అక్కడి సంస్థలకు దీటుగా ఇక్కడ కూడా అన్నీ అందుబాటులోకి వచ్చాయి. నైపుణ్యం గల టీచర్లు కూడా ఉన్నారు. అక్కడి ప్రతికూల పరిస్థితుల వల్ల చాలా మంది హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నారు. సక్సెస్ శాతం కూడా ఢిల్లీకి సమానంగానే ఉంది. ఇక్కడ మన రాష్ట్రంతో పాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా విద్యార్థులు వస్తున్నారు. – బాల లత, సివిల్స్ మెంటార్అన్నీ ఇక్కడే అందుబాటులో.. టెస్ట్ సిరీస్ రాసేందుకు ఢిల్లీకే వెళ్లేవారు. కానీ క్వాలిటీతో టెస్ట్ సిరీస్‌లను ఇచ్చే సంస్థలు మన దగ్గర కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆప్షనల్స్‌కు కూడా మంచి మెటీరియల్ లభ్యం కాకపోయేవి. కానీ ఇప్పుడు అన్ని రకాల సోర్స్ మనకు దొరుకుతున్నాయి. సబ్జెక్ట్ పరంగా ప్రత్యేక కోచింగ్ తీసుకునే వెసులుబాటు వచ్చింది. – బొప్పని జగన్మోహన్, సివిల్స్ అభ్యర్థి -
పూజా ఖేద్కర్‌కు యూపీఎస్సీ షాక్.. అన్ని పరీక్షల నుంచి శాశ్వత డిబార్
న్యూఢిల్లీ: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ ప్రొవిజినల్ అభ్యర్ధిత్వాన్ని యూపీఎస్సీ కమిషన్ రద్దు చేసింది. అదే విధంగా భవిష్యత్తులోనూ కమిషన్ నిర్వహించే ఏ ఇతర పరీక్షలకు హాజరు అవ్వకుండా ఆమెపై నిషేధం విధించింది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(సీఎస్ఈ) నిబంధనలను ఉల్లంఘించినందుకు పూజా దోషిగా తేలినట్లు నిర్ధారించిన కమిషన్ ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు.కాగా పూజా ఖేద్కర్‌కు 18 జూలైగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆమెపై వచ్చిన అవినీతి ఆరోపణలపై జూలై 25 లోపు సమాధానం చెప్పాలని కోరింది. అయితే ఆమె ఆగస్టు 4 వరకు సమయం కావాలని కోరగా.. యూపీఎస్సీ జూలై 30 వరకు డెడ్‌లైన్ విధించింది. ఇదే చివరి అవకాశం అని కూడా స్పష్టం చేసింది. గడువులోగా స్పందన రాకపోతే చర్యలు తీసుకునే విషయంపై కూడా యూపీఎస్సీ ఆమెకు వెల్లడించింది. ఇక నిర్ణీత సమయంలో వివరణ ఇవ్వడంతో పూజా విఫలమవ్వడంతో ఆమె ప్రొవిజినల్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తున్నట్లు కమిషన్ పేర్కొంది.యూపీఎస్సీ పరీక్ష నిబంధనల్ని అతిక్రమిస్తూ అవకాశాలు వాడుకొని ఆమె నకిలీ పత్రాలతో పరీక్షను క్లియర్ చేసినట్లు గుర్తించామని గతంలో కమిషన్ పేర్కొంది. సివిల్ సర్వీసెస్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత పొందడం కోసం తప్పుడు పత్రాల సమర్పణ, అంగ వైకల్యం, మానసిక వైకల్యాల గురించి అబద్దాలు చెప్పడమే కాకుండా సాధారణ కేటగిరీలో అనుమతించిన ఆరు కంటే ఎక్కువ సార్లు పరీక్ష రాసినట్లు తెలిపింది. .తన పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫొటోగ్రాఫ్/సంతకం, ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, చిరునామాకు సంబంధించిన పత్రాలన్నీ మార్చడం ద్వారా మోసపూరిత ప్రయత్నాలకు పాల్పడినట్లు వివరించింది. పుణెలో అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న పూజా ఖేద్కర్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో మహారాష్ట్ర సర్కార్ ఆమెను మరో చోటుకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఆమె వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తుంది. యూపీఎస్సీలో తప్పుడు పత్రాలు సమర్పించడం, మెడికల్ టెస్టులకు హాజరు కాకపోవడం బయటపడింది. దీంతో పూజా ఐఏఎస్ ఎంపికను రద్దు చేస్తూ యూపీఎస్సీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఖేద్కర్ తండ్రి ప్రభుత్వ మాజీ అధికారి దిలీప్ ఖేద్కర్‌పై పలు అవినీతి ఆరోపణల కేసులు నమోదయ్యాయి. ఖేద్కర్ తల్లి మనోరమ కూడా భూ వివాదం కేసులో రైతలను తుపాకీతో బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలోవైరల్ అవ్వడంతో ఆమెను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. మరోవైపు ఫీసర్ పూజా ఖేద్కర్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. -
నేను యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే కచ్చితంగా సాధించేదాన్ని: టాప్ హీరోయిన్
'కాంతార' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ సప్తమి గౌడ. ఈ చిత్రంలో లీల పాత్రలో అద్భుతంగా నటించిన సప్తమి గౌడకు ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ద వ్యాక్సిన్ వార్, యువ, కాళి, కాంతార ప్రీక్వెల్ తదితర చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉన్న ఆమె హీరో నితిన్ సరసన 'తమ్ముడు'లో కూడా ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా కోసం ఆమె గుర్రపు స్వారీ కూడ నేర్చుకుంది. తాజాగా యూపీఎస్సీ ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఆమె పలు ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. బెంగళూరులో సివిల్ ఇంజనీరింగ్ చదవును పూర్తి చేసిన సప్తమి గౌడకు మొదట యూపీఎస్సీ సాధించి పోలీస్ శాఖలో రాణించాలని కోరిక ఉండేదట.. దీనికి ప్రధాన కారణం తన తండ్రి కర్ణాటక పోలీస్ శాఖలో ఉన్నతాధికారిగా ఉండటమేనని ఆమె చెప్పింది. 'మా నాన్న మాదిరి పోలీస్ విభాగంలో ఉండాలని నాకు ఆశ ఉండేది. దీంతో నా చిన్నతనం నుంచే చదువులోనూ, క్రీడల్లోనూ రాణించాను. చదువులో చాలా ముందు ఉండేదాన్ని. నేను యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే, గ్యారెంటీగా పాస్ అయ్యేదానిని.. కానీ, ఇప్పుడు అది సాధ్యం కాదు. దానికి చాలా ఫోకస్ కావాలి. అనుకోకుండా నటిని అయ్యాను.' అని ఆమె చెప్పింది. ఐదేళ్ల వయసులోనే సప్తమి గౌడ ఈత శిక్షణ పొందింది. 2006 నుంచి 2010 వరకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొన్న సప్తమి గౌడ ఎన్నో రజత, కాంస్య, బంగారు పతకాలను కైవసం చేసుకుంది. సప్తమి గౌడ 2020లో విడుదలైన దునియా సూరి 'పాప్‌కార్న్ మంకీ టైగర్'చిత్రంతో తన నటనను ప్రారంభించింది. దీనికిగాను 2021లో ఉత్తమ తొలి నటిగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డును గెలుచుకుంది. కాంతార చిత్రం తరువాత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా ఆమె సత్తా చాటుతుంది. -
కార్పొరేట్ జాబ్ వదిలేసి మరీ..సివిల్స్ ర్యాంక్ కొట్టిన యువతి స్టోరీ
సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో కార్పొరేట్ ఉద్యోగాన్ని విడిచి పెట్టేసింది. పట్టుదలతో చదివి ఊహించని ఫలితాన్ని సాధించింది. తాజా యూపీఎస్సీ ఫలితాల్లో టాప్-20లో ర్యాంకు సాధించింది. ఢిల్లీకి చెందిన 24 ఏళ్ల యువతి సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం రండి..! ప్రతిష్టాత్మక పరీక్ష సివిల్స్ పరీక్షలో విజయం సాధించాలంటే అంత ఈజీకాదు. దీనికి ఎంతో పట్టుదల కృషి కావాలి. అలా దీక్షగా చదివి తన ప్రత్యేకతను చాటుకుంది నోయిడా సెక్టార్ 82 లోని వివేక్ విహార్‌లో నివసించే వార్దా ఖాన్. మంగళవారం ప్రకటించిన తాజా యూపీఎస్సీ ఫలితాల్లో 18 వ ర్యాంక్ సాధించింది. తన తొలి ప్రిఫరెన్స్‌గా ఇండియన్ ఫారిన్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అని తెలిపింది. ప్రపంచంలోనే భారత దేశాన్ని మరింత ఉన్నత స్థానంలో ఉంచాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్దా ఖాన్ తెలిపింది. సివిల్స్‌లో మంచి తన టార్గెట్. కానీ టాప్ 20లో ఉంటానని అస్సలు ఊహించలేదంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది వార్దా ఖాన్. దీంతో తన ఫ్యామిలీ అంతా చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. వాస్తవానికి సివిల్స్‌కోసం 2021 నుండి సిద్ధమవుతున్నాననీ, రెండో ప్రయత్నంలో విజయం సాధించానని వెల్లడించింది. ఈ సందర్బంగా కుటుంబం, స్నేహితులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. #WATCH | Uttar Pradesh | Noida resident Wardah Khan secures 18th rank in UPSC 2023. She says, "I had never thought that I would make it to Top 20. I just wanted to make it to the list (of qualifiers). This is a huge moment for my family and me. This was my second attempt. I have… pic.twitter.com/2KoPdlDPmV — ANI (@ANI) April 16, 2024 నోయిడా సెక్టార్ 82లోని వివేక్ విహార్‌లో ఉండే వార్ధా ఖాన్ ఆమె తల్లిదండ్రులకు ఏకైక సంతానం. తండ్రి తొమ్మిదేళ్ల క్రితం చనిపోగా ప్రస్తుతం తల్లితో కలసి ఉంటోంది. ఢిల్లీలోని ఖల్సా కాలేజీ నుంచి బీకామ్ హానర్స్ పూర్తి చేసింది. చదువు తరువాత ఎనిమిది నెలల పాటు కార్పొరేట్ కంపెనీలో పనిచేసింది. అది సంతృప్తి నివ్వలేదు. పైగా సమాజానికి సేవ చేయాలనే ఆశయం. దీంతో కష్టపడి చదవి తమ కలను సాకారం చేసుకుంది. హిస్టరీ, జియోపాలిటిక్స్ సబ్జెక్టులు అంటే ఇష్టమని పేర్కొంది. అలాగే కాలేజీ రోజుల్లో ఎక్కువగా డిబేట్లలో, MUN లలో (మాక్ యునైటెడ్ నేషన్స్) పాల్గొనేదాన్ని ఆ సమయంలో సివిల్స్ సాధించాలనే ఆలోచన తనలో కలిగిందని చెప్పుకొచ్చింది. -
సివిల్స్‌లో తెలుగు తేజాలు
సాక్షి, హైదరాబాద్: సివిల్స్‌లో ర్యాంకు సాధించడం దేశంలో చాలామంది కల. ఇందులో ఈసారీ తెలుగు విద్యార్థులు సత్తా చాటి తమ లక్ష్యాన్ని అందుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన దోనూరు అనన్యరెడ్డి మూడో ర్యాంకు సాధించారు. వంద లోపు ర్యాంకుల్లో ముగ్గురు తెలుగువాళ్లే ఉన్నారు. నందాల సాయి కిరణ్ 27వ ర్యాంకు సాధిస్తే, కేఎన్ చందన జాహ్నవి 50, మెరుగు కౌశిక్ 82వ ర్యాంకు సాధించారు. మొత్తం ర్యాంకుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు 36 మంది ఉన్నారు. అలాగే, ఇతర కేంద్ర సర్వీసులకు 20 మందికిపైగా ఎంపికయ్యారు. మొత్తమ్మీద కేంద్ర సర్వీసులకు 56 మందికిపైగా తెలుగు తేజాలు ఎంపికవడం విశేషం. అఖిల భారత సర్వీసుల్లో పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్స్– 2023 కోసం గత ఏడాది మే 28న ప్రిలిమ్స్ నిర్వహించింది. ప్రిలిమినరీలో అర్హత పొందిన వారికి గత నవంబర్‌లో మెయిన్స్ పరీక్ష నిర్వహించగా, ఈ పరీక్ష ఫలితాలను డిసెంబర్ 8న వెల్లడించారు. మెయిన్స్‌లోనూ అర్హత పొందిన వారికి జనవరి 2, ఏప్రిల్ 9 మధ్య వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తంగా పొందిన మార్కుల ఆధారంగా ర్యాంకులను యూపీఎస్సీ మంగళవారం ప్రకటించింది. ఆలిండియా టాపర్‌గా లక్నోకు చెందిన ఆదిత్య శ్రీవాత్సవ నిలవగా, ఒడిశాకు చెందిన అనిమేష్ ప్రదాన్ రెండో స్థానంలో నిలిచారు. తెలంగాణకు చెందిన అనన్య రెడ్డి మూడో ర్యాంకు సాధించారు. 2022 సివిల్స్‌లోనూ తెలుగు విద్యార్థి ఉమాహారతి మూడో స్థానం పొందడం విశేషం. 1,016 మంది ఎంపిక సివిల్స్–2023 కోసం యూపీఎస్సీ 1,016 మందిని ఎంపిక చేసింది. ఇందులో జనరల్ కేటగిరీలో 347 మంది ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటా నుంచి 115, ఓబీసీ నుంచి 303, ఎస్సీల నుంచి 165, ఎస్టీ విభాగం నుంచి 86 మంది ఎంపికయ్యారు. పోస్టుల వారీగా చూస్తే ఐఏఎస్ సర్వీసులకు 180 మంది, ఐఎఫ్ఎస్కు 37 మంది, ఐపీఎస్‌కు 200 మంది ఎంపికయ్యారు. సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్–ఏ కేటగిరీకి 613 మంది, గ్రూప్ బీ సర్వీసెస్‌కు 113 మంది ఎంపికైనట్టు యూపీఎస్సీ వెల్లడించింది. అభ్యర్థులు పొందిన మార్కులను 15 రోజుల్లో తమ వెబ్సైట్లో ఉంచుతామని ప్రకటించింది. విజేతలకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు సివిల్స్ ఫలితాల్లో మెరిసిన తెలుగు రాష్ట్రాల విజేతలకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ, ఏపీ నుంచి ఈసారి 50 మందికి పైగా ఎంపికవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన పాలమూరుకు చెందిన దోనూరి అనన్య రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. మహేష్ భగవత్ కృషి ఫలించింది సివిల్స్ పరీక్షల్లో సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ భగవత్ గైడెన్స్ మంచి ఫలితాలను ఇచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా శిక్షణ పొందుతున్న వారితో ప్రత్యక్షంగా, ఇతర రాష్ట్రాల వారితో ఆన్లైన్ ద్వారా ఆయన ఇచ్చిన సూచనలతో 200 మందికి పైగా ర్యాంకులు సాధించారు. అందులో తెలంగాణ నుంచి అనన్య రెడ్డి సహా జాతీయ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణ పొందుతున్న వారు కూడా ఉన్నారు. సివిల్స్ ప్రిపేరయ్యే వారికి వ్యక్తిత్వ వికాసం, పరీక్ష సమయాల్లో ఒత్తిడి, సమయ పాలన, ఇంటర్వ్యూలో వ్యవహరించాల్సిన తీరు తదితర అంశాలపై మహేష్ భగవత్ సూచనలు చేశారు. -
TS: దినసరి కూలీ కుమారుడికి సివిల్స్‌లో ర్యాంకు..
సాక్షి, హైదరాబాద్: సివిల్స్ ఫలితాల్లో దినసరి కూలీ కుమారుడు సత్తా చాటాడని, అది కూడా ఎస్సీ స్టడీ సర్కిల్లో చదివి ఈ ఘనత సాధించాడని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ చౌడారపు శ్రీధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జనగాం జిల్లాకు చెందిన కొయ్యాడా ప్రభాకర్ కుమారుడు కొయ్యాడా ప్రణయ్ కుమార్ తొలిసారి సివిల్స్ పరీక్షకు హాజరై 885వ రాంకు సాధించినట్లు ఆయన వెల్లడించారు. ప్రణయ్ తండ్రి దినసరి కూలీకాగా అతని తల్లి గృహిణి. ప్రణయ్ మేడ్చల్ జిల్లా నాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదవగా గజ్వేల్ ప్రభుత్వ సోషల్ రెసిడెన్షియల్లో పాలిటెక్నిక్, జేఎన్టీయూలో బీటెక్ చేశాడు. ప్రణయ్‌కుమార్‌ను అభినందిస్తున్న ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీధర్ మధ్యాహ్న భోజన కార్మికురాలి కుమారుడికి.. 410వ ర్యాంకు రెబ్బెన (ఆసిఫాబాద్): సివిల్ ఫలితాల్లో మధ్యాహ్న భోజన కార్మికురాలి కుమారుడు డోంగ్రి రేవయ్య ఆలిండియా స్థాయిలో 410 ర్యాంకుతో మెరిశాడు. చదువుకు పేదరికం అడ్డురాదని నిరూపించాడు. కుమురంభీం జిల్లా రెబ్బెన మండలం తుంగెడ గ్రామానికి చెందిన డోంగ్రి విస్తారుబాయి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన కారి్మకురాలిగా పనిచేస్తోంది. 25 ఏళ్ల క్రితం భర్త మనోహర్ మృతి చెందడంతో కూలి పనులు చేసుకుంటూ ముగ్గురు పిల్లలను షోషించింది. పెద్ద కుమారుడు తిర్యాణి మండలంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. రెండో కుమారుడు రేవయ్య కన్నతల్లి కలను సాకారం చేస్తూ సివిల్స్‌లో సత్తా చాటాడు. ర్యాంకు సాధించిన రేవయ్యకు స్వీట్ తినిపిస్తున్న తల్లి విస్తారుబాయి, సోదరుడు 2021లో ఇంటర్వ్యూ వరకు వెళ్లి.. ఐఐటీ మద్రాస్‌లో బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన రేవయ్య కొన్నాళ్లు ఐఎన్‌జీసీలో ఉద్యోగం చేశాడు. సివిల్స్ లక్ష్యంతో ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు. 2021లో జరిగిన యూపీఎస్సీ పరీక్షల్లో ఇంటర్వ్యూ వరకు వెళ్లినా కేవలం రెండు మార్కులతో ర్యాంకు కోల్పోయాడు. ఈసారి మరింత పట్టుదలతో చదివి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. కాగజ్‌నగర్‌లో ప్రాథమిక విద్య, ఆసిఫాబాద్‌లో ఉన్నత విద్య పూర్తి చేసిన రేవయ్య.. హైదరాబాద్‌లోని సోషల్ వెల్ఫేర్ కళాశాలలో ఇంటర్లో 929 మార్కులు సాధించాడు. పేదలకు సేవ చేయడమే తన లక్ష్యమని, ప్రభుత్వ సేవలు పూర్తిస్థాయిలో ప్రజలకు అందించేందుకు కృషి చేస్తానని తెలిపాడు. శిక్షణ ఇస్తున్న మహేశ్ భగవత్ సివిల్స్ గురూ.. మహేశ్ భగవత్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సీఐడీ అదనపు డీజీ మహేశ్ భగవత్ ‘సివిల్స్ గురూ’గా మరోసారి తన మార్కు చాటారు. సివిల్స్–2022 తుది ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన అభ్యర్థుల్లో చాలా మంది ఆయన వద్దే ఇంటర్వ్యూ శిక్షణ పొందారు. తన వద్ద ఇంటర్వ్యూ శిక్షణ పొందిన వారిలో ఆల్ ఇండియా టాపర్లుగా దాదాపు 125 నుంచి 150 మంది నిలిచారని, ఇది తనకు ఎంతో సంతోషంగా ఉందని మహేశ్ భగవత్ ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. ఆలిండియా టాపర్, యూపీ యువతి ఇషితా కిశోర్‌కు తాను మెంటార్‌గా ఉండటం సంతృప్తినిచ్చిందన్నారు. తనతోపాటు మరికొందరు గత పదేళ్లుగా సివిల్స్ అభ్యర్థులకు మెంటార్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది టాప్–100 ర్యాంకుల్లో 14వ ర్యాంకర్ కృతికా గోయల్, 22వ ర్యాంకర్, తిరుపతివాసి పవన్ దత్తా, 25వ ర్యాంకర్ కశ్మిరా సంకే, 27వ ర్యాంకు సాధించిన యాదవ్ సూర్యభాన్, 35వ ర్యాంకర్, తెలంగాణకు చెందిన అజ్మీర సంకేత్ కుమార్, 38వ ర్యాంకర్ అనూప్‌దాస్, 54వ ర్యాంకర్, తెలంగాణకు చెందిన రిచా కులకరి్ణ, 74వ ర్యాంకర్ ఐషి జైన్, 76వ ర్యాంకు సాధించిన దబోల్కర్ వసంత్, 78వ ర్యాంకర్, తెలంగాణకు చెందిన ఉత్కర్ష కుమార్‌లు తన వద్ద ఇంటర్వ్యూ పొందినవారేనని మహేశ్ భగవత్ తెలిపారు. గత ఐదు నెలలుగా తాను ఇంటర్వూలకు శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. విజేతలు గర్వం పెరగకుండా చూసుకోవాలని, ర్యాంకులు రాని వారు నిరుత్సాహపడకుండా మరోసారి ప్రయత్నించాలని ఆయన సూచించారు. ఇది కూడా చదవండి: సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు -
కానిస్టేబుల్‌కు సివిల్స్‌లో 667 ర్యాంకు..
ఢిల్లీ: ఢిల్లీ పోలీసు శాఖలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రామ్‌భజన్ కుమార్ సివిల్స్‌లో 667వ ర్యాంకు సాధించి, అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఆయన వయసు 34 ఏళ్లు. ఎనిమిదో ప్రయత్నంలో ర్యాంకు సాధించడం గమనార్హం. ప్రస్తుతం సైబర్ సెల్ పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. సివిల్స్ ఫలితాలు వెలువడిన తర్వాత రామ్‌భజన్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సహచరులు, సీనియర్ అధికారులు ఆయనను అభినందించారు. ఓబీసీ కేటగిరీకి చెందిన రామ్‌భజన్‌కు తొమ్మిది సార్లు సివిల్స్ రాసేందుకు అనుమతి ఉంది. ఎట్టకేలకు ర్యాంకు సాధించడం ద్వారా తన కల నెరవేర్చుకున్నానని ఆయన చెప్పారు. ఒకవేళ ఈసారి విఫలమైనా తొమ్మిదోసారి పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఇప్పటిదాకా ఏడు ప్రయత్నాలు సఫలం కాకపోయినా నిరాశ పడలేదని అన్నారు. తన భార్య అందించిన అండదండలతో ముందుకు సాగానని వివరించారు. తాను రాజస్తాన్ నుంచి వచ్చానని, అక్కడ తన తండ్రి కూలీగా పనిచేస్తున్నాడని వెల్లడించారు. కష్టాల్లోనే పుట్టి పెరిగానని పేర్కొన్నారు. అంకితభావం, కఠోర శ్రమ, సహనంతో అనుకున్న లక్ష్యం సాధించడం సులువేనని సూచించారు. కానిస్టేబుల్‌గా పనిచేస్తూ 2019లో యూపీఎస్సీ పరీక్షలో ర్యాంకు సాధించిన ఫిరోజ్ ఆలం తనకు స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. రామ్‌భజన్ 2009లో పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా చేరారు. ఇది కూడా చదవండి: సివిల్స్‌లో నారీ భేరి -
సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు
సాక్షి, అమరావతి: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర సర్వీసుల్లో పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్స్–2022 పరీక్షల తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. జాతీయస్థాయిలో మూడో ర్యాంకుతో పాటు 50 వరకు ర్యాంకులు సాధించి రికార్డు సృష్టించారు. సివిల్స్–2022 తుది ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, తదితర సర్వీసుల పోస్టులకు సంబంధించి మొత్తం 933 మందిని ఎంపికి చేసినట్లు తెలిపింది. జనరల్ – 345, ఈడబ్ల్యూఎస్ – 99, ఓబీసీ – 263, ఎస్సీ – 154, ఎస్టీ – 72 మంది ఎంపికయ్యారు. వీరితో పాటు కన్సాలిడేటెడ్ రిజర్వు లిస్టులో ఆయా కేటగిరీల నుంచి 178 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ వెల్లడించింది. మొత్తంగా 1,022 మందిని ఆయా పోస్టులకు ఎంపిక చేసినట్లు తెలిపింది. వీరిలో ఐఏఎస్‌కు 180 మంది, ఐఎఫ్ఎస్కు 38 మంది, ఐపీఎస్‌కు 200 మందిని కేటాయించారు. ఇతర కేంద్ర సర్వీసెస్‌లకు సంబంధించి గ్రూప్–ఏ కేటగిరీలో 473 మంది, గ్రూప్–బి సర్వీసెస్‌లో 131 మంది ఎంపికైనట్టు యూపీఎస్సీ పేర్కొంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు అధిక ర్యాంకులు సివిల్స్ ఫలితాల్లో టాప్ ర్యాంకుల్లో తొలి 4 ర్యాంకులు అమ్మాయిలే కైవసం చేసుకున్నారు. ఆలిండియా ఫస్ట్ ర్యాంకును ఇషితా కిషోర్ సాధించగా గరిమ లోహియా, నూకల ఉమా హారతి, స్మృతి మిశ్రాలు వరుసగా రెండు, మూడు, నాలుగు ర్యాంకులు దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి దాదాపు 50 మందికి ర్యాంకులు వచ్చినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు 22, 33, 40, 200, 217, 222, 285, 384, 410, 460, 510, 558, 583, 593, 640, 759, 801, 827, 885 ర్యాంకులు సాధించి విజయకేతనం ఎగురవేశారు. జీవీఎస్ పవన్ దత్తా 22, తరుణ్ పట్నాయక్ 33, అజ్మీరా సంకేత్ 35, శ్రీసాయి ఆశ్రిత్ శాఖమూరి 40, హెచ్ఎస్ భావన 55, సాయి ప్రణవ్ 60, ఆవుల సాయికృష్ణకు 94వ ర్యాంకు దక్కాయి. వీరితోపాటు నిధిపాయ్ 110, అనుగు శివమారుతీరెడ్డి 132, రాళ్లపల్లి సంపత్‌కుమార్ 157, కమతం మహేశ్‌కుమార్ 200, రావుల జయసింహారెడ్డి 217, సాహిత్య 243, అంకుర్ కుమార్ 257, బొల్లం మహేశ్వర్‌రెడ్డి 270, చల్లా కళ్యాణి 285, పాలువాయి విష్ణువర్దన్‌రెడ్డి 292, సాయికృష్ణకు 293వ ర్యాంకు వచ్చాయి. 11.35 లక్షల మంది దరఖాస్తు సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు 11.35 లక్షల మంది దరఖాస్తు చేయగా వారిలో 5.73 లక్షల మంది (50.51 శాతం) మంది మాత్రమే గతేడాది జూన్ 5న జరిగిన ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారు. వారిలో 130,90 మంది మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించారు. వీరికి సెప్టెంబర్ 16 నుంచి 25 వరకు పరీక్షలు నిర్వహించారు. వీరిలో 2,529 మంది ఇంటర్వ్యూలకు అర్హత సాధించగా చివరకు 933 మంది ఎంపికయ్యారు. కాగా సివిల్స్‌కు తెలుగు రాష్ట్రాల నుంచి 80,707 మంది హాజరయ్యారు. వారిలో 500 మంది వరకు మెయిన్స్‌కు అర్హత సాధించారు. ఇంటర్వ్యూలకు 100 మంది వరకు ఎంపికవ్వగా వారిలో 50 మంది వరకు ర్యాంకులు సాధించగలిగారని ఆయా కోచింగ్ సంస్థల నిర్వాహకులు తెలిపారు. ర్యాంకుల వారీగా తెలుగు రాష్ట్రాల అభ్యర్ధులు 3 ఎన్. ఉమా హారతి 22 జీవీఎస్ పవన్ దత్తా 33 తరుణ్ పట్నాయక్ మాదల 40 సాయి ఆశ్రిత్ శాఖమూరి 54 రిచా కులకర్ణి 60 మలియె శ్రీ ప్రణవ్ 78 ఉత్కర్‡్షకుమార్ 87 అయాన్ జైన్ 94 ఆవుల సాయి కృష్ణ 110 నిధి పాయ్ 132 అనుగు శివమూర్తిరెడ్డి 157 రాళ్లపల్లి వసంతకుమార్ 189 షేక్ హబీబుల్లా 217 రావ్ల జయసింహారెడ్డి 243 కాసిరాజు పవన సాయి సాహిత్య 270 బొల్లం ఉమామహేశ్వరరెడ్డి 285 చల్లా కల్యాణి 292 పలువాయి విష్ణువర్థన్‌రెడ్డి 293 గ్రంధి సాయికృష్ణ 297 షివిన్ చౌదరి 311 వీరగంధం లక్ష్మీ సునీత 313 కె.ఎన్.చందన్ జాహ్నవి 346 ఎన్.చేతన్‌రెడ్డి 384 తెప్పలపల్లి సుశ్మిత 409 ఇషాన్ అగర్వాల్ 410 డొంగ్రె రేవయ్య 414 చంద్రశేఖర్ శంకల 426 సీహెచ్. శ్రవణ్‌కుమార్‌రెడ్డి 459 చాణక్య ఉదయగిరి 464 సి.సమీరారాజా 469 బొడ్డు హేమంత్ 480 గోపీకృష్ణ. బి 510 భువన ప్రణీత్ పప్పుల 548 దామెర్ల హిమవంశీ 558 రుత్విక్ సాయి కొట్టే 559 డి.మనోజ్ 583 యర్రంశెట్టి ఉషారమణి 630 ఎస్.దీప్తి చౌహాన్ 640 తుమ్మల సాయికృష్ణారెడ్డి 742 రామ్‌దేని సాయినాధ్ 759 జి.అక్షయ్ దీపక్ 805 మన్నం సుజిత్ సంపత్ 817 సాహిల్ మీనా 846 బెండుకూరి మౌర్యతేజ్ 866 నాగుల కృపాకర్ సీఎం వైఎస్ జగన్ అభినందనలు సివిల్స్ పరీక్షల్లో 200లోపు ర్యాంకులు సాధించిన తెలుగు రాష్ట్రాల ప్రతిభావంతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. 933 మందితో కూడిన తుది జాబితాలో చోటు దక్కించుకున్న తెలుగు అభ్యర్థులందరికీ సీఎం శుభాకాంక్షలు తెలియజేశారు. వారు కెరీర్లో ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. ర్యాంకర్ల అభిప్రాయాలు దత్తా.. సత్తా అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరుకు చెందిన డాక్టర్ పవన్ దత్తా సివిల్స్‌లో 22వ ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. దత్తా తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు. ఎంబీబీఎస్ చదివిన పవన్ దత్తా హైదరాబాద్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ సందర్భంగా పవన్ దత్తా మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు ఉన్నత ఆరోగ్య సేవలు, పేద విద్యార్థులకు సాంకేతిక సేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతానని తెలిపాడు. అంబికా జైన్‌కు 25వ ర్యాంక్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన లలిత్‌కుమార్ అంబికా జైన్ (25) సివిల్స్‌లో 69వ ర్యాంక్ సాధించారు. పట్టణానికి చెందిన జైన్ ఎలక్ట్రికల్ షాపు యజమాని లలిత్‌కుమార్, అనితల కుమార్తె అంబికా జైన్ అత్యుత్తమ ర్యాంకుతో మెరిసింది. అంబిక.. ఢిల్లీ సౌత్ ఏషియన్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో ఎంఏ చేశారు. గతేడాది మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌లో 128వ ర్యాంక్ సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. అయినా ఐఏఎస్ కావాలనే పట్టుదలతో ఈ ఏడాది మళ్లీ ప్రయత్నించి 69వ ర్యాంక్‌తో లక్ష్యాన్ని చేరుకున్నారు. 33వ ర్యాంకుతో మెరిసిన తరుణ్ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మోడల్ కాలనీకి చెందిన తరుణ్ పట్నాయక్ 33వ ర్యాంకుతో సత్తా చాటాడు. ఐఐటీ గౌహతిలో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన తరుణ్ సివిల్స్‌కు సొంతంగా సిద్ధమయ్యాడు. తరుణ్ తండ్రి రవికుమార్ ఎల్ఐసీ రూరల్ బ్రాంచ్‌లో క్లరికల్ స్టాఫ్‌గా పనిచేస్తుండగా తల్లి శారదా రాజ్యలక్ష్మి గృహిణి. తరుణ్ గౌహతి ఐఐటిలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. సివిల్స్‌కు సొంతంగానే ప్రిపేరయ్యారు. గతేడాది 99వ ర్యాంకు సాధించిన అతడు ఈసారి 33వ ర్యాంకుతో మెరిశాడు. ఐఏఎస్ కావాలన్నదే తన లక్ష్యమని తరుణ్ తెలిపాడు. వసంత్‌కు 157వ ర్యాంకు ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగొలనుకు చెందిన రాళ్లపల్లి వసంతకుమార్ 157వ ర్యాంకుతో మెరిశాడు. సివిల్స్ 2021 పరీక్షల్లో 170వ ర్యాంకు సాధించిన వసంతకుమార్ అప్పట్లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్నారు. ఐఏఎస్ సాధించాలన్న సంకల్పంతో మరోసారి ప్రయత్నం చేయగా 157వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. వసంత్ అన్న జగన్‌సాయి ప్రస్తుతం ఐఏఎస్‌కు ఎంపికై శిక్షణలో ఉన్నారు. వసంతకుమార్ తండ్రి రాళ్లపల్లి భీమేశ్వరరావు విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తల్లి అనసూయ గృహిణి. సిక్కోలు బిడ్డకు 285వ ర్యాంకు శ్రీకాకుళం జిల్లా రూరల్ మండల పరిధిలోని వప్పంగి గ్రామానికి చెందిన చల్లా కళ్యాణి 285వ ర్యాంకుతో సత్తా చాటింది. ఇప్పటికే గ్రూప్–1 పరీక్షల్లో విజయం సాధించిన ఆమె ప్రస్తుతం విశాఖపట్నంలోని ట్రెజరీ విభాగంలో శిక్షణ తీసుకుంటోంది. పల్నాడు యువకుడికి సివిల్స్‌లో 292వ ర్యాంక్ పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం శిరిగిరిపాడుకు చెందిన పాల్వాయి విష్ణువర్ధన్‌రెడ్డి 292వ ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. గోవాలోని బిట్స్ పిలానీలో బీటెక్ ఈఈఈ పూర్తిచేశాక ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్)– 2020లో 3వ ర్యాంక్ సాధించాడు. అయితే ఐఏఎస్ సాధించాలనే లక్ష్యంతో సివిల్స్‌కు సిద్ధమయ్యాడు. తన ఐదో ప్రయత్నంలో 292వ ర్యాంక్ సాధించి విజయకేతనం ఎగురవేశాడు. విష్ణువర్ధన్‌రెడ్డిని ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తదితరులు అభినందించారు. విష్ణువర్ధన్‌రెడ్డి తండ్రి నరసింహారెడ్డి విజయవాడలో ఒక ప్రైవేటు కోచింగ్ అకాడమీ డైరెక్టర్‌గా, తల్లి పద్మావతి ప్రభుత్వ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. లక్ష్మీ సుజితకు 311వ ర్యాంకు బాపట్ల జిల్లా మార్టూరుకు చెందిన వీరగంధం లక్ష్మీసుజిత 311వ ర్యాంకు సాధించి సత్తా చాటింది. ఆమె తండ్రి స్థానికంగా విద్యా సంస్థను నిర్వహిస్తున్నారు. ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివిన సుజిత సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్‌కు సిద్ధమైంది. కాగా ఐఏఎస్ సాధించడమే లక్ష్యంగా వచ్చే ఏడాది మళ్లీ సివిల్స్ రాస్తానని సుజిత తెలిపింది. ఐదో ప్రయత్నంలో విజయకేతనం పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చని నిరూపించింది.. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన బొల్లిపల్లి వినూత్న. ఆమె ఐదో ప్రయత్నంలో 462వ ర్యాంకు సాధించింది. వినూత్న తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన వినూత్న కాగ్నిజెంట్ కంపెనీలో పనిచేస్తూ ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకుంది. తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్, రెండో ప్రయత్నంలో మెయిన్స్, మూడో ప్రయత్నంలో ఇంటర్వ్యూలో విఫలమైంది. నాలుగో ప్రయత్నమూ నిరాశపరిచింది. అయితే పట్టు వదలకుండా ఐదోసారి విజయకేతనం ఎగురవేసింది. ఐఏఎస్ రాసే క్రమంలో గ్రూప్–1 రాసి ఇంటర్వ్యూకు ఎంపికయ్యానని.. అయితే దానికి హాజరుకానని వినూత్న వెల్లడించింది. తన లక్ష్యం ఐఏఎస్ అని స్పష్టం చేసింది. స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి కుమారుడికి 469 ర్యాంకు విశాఖ స్టీల్‌ప్లాంట్ ట్రాఫిక్ విభాగం ఉద్యోగి బొడ్డు సత్తిబాబు కుమారుడు హేమంత్ 469వ ర్యాంకు సాధించారు. బాంబే ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి సివిల్స్‌కు సిద్ధమయ్యారు. ఈ ర్యాంకు ద్వారా ఐఆర్ఎస్ వస్తుందని.. మళ్లీ సివిల్స్ రాసి ఐఏఎస్ సాధించడమే తన లక్ష్యమని హేమంత్ తెలిపారు. నవీన్ చక్రవర్తికి 550వ ర్యాంకు పల్నాడు జిల్లా తాళ్లచెరువు గ్రామానికి చెందిన రేపూడి నవీన్ చక్రవర్తి 550వ ర్యాంకు సాధించాడు. తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీ,లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన నవీన్ సివిల్స్‌పై ఆసక్తితో అటు మళ్లాడు. తొలి ప్రయత్నంలో విజయం సాధించలేకపోయిన ఆయన రెండో ప్రయత్నంలో విజయం సాధించాడు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్లలో ఏది వచ్చినా స్వీకరిస్తానని తెలిపాడు. కోనసీమ జిల్లా యువతికి 583వ ర్యాంక్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం ఈదరాడకు చెందిన యర్రంశెట్టి ఉమా శ్రీలక్ష్మీరమణి 583వ ర్యాంకుతో సత్తా చాటింది. నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ చదివిన ఆమె క్యాంపస్ సెలక్షన్స్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం సాధించింది. శ్రీలక్ష్మీరమణి తండ్రి యర్రంశెట్టి కాశీవిశ్వేశ్వరరావు కొబ్బరికాయల వ్యాపారి. కాగా యానాం మున్సిపల్ కమిషనర్ ద్విజ్ గోయల్ 71వ ర్యాంకు సాధించారు. గోయల్ సొంత పట్టణం ఉత్తరప్రదేశ్‌లోని మీరట్. సంతోష్‌కు 607వ ర్యాంకు శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం ఖండ్యాం గ్రామానికి చెందిన భవిరి సంతోష్‌కుమార్ 607వ ర్యాంకు సాధించారు. ఈయన స్వగ్రామం ఖండ్యాం అయినప్పటికీ మండలంలోని అలుదు గ్రామంలో తాతయ్య విశ్రాంత ఉపాధ్యాయుడు గతేడాది సివిల్స్‌లోనూ 607వ ర్యాంకే ఈసారి కూడా అదే ర్యాంక్ వచ్చింది. సంతోష్ తండ్రి రాజారావు విశ్రాంతి ఉపాధ్యాయుడు, తల్లి ఉమాకుమారి గృహిణి. విశాఖ ఆంధ్రా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్, హైదరాబాద్‌లోని రైల్వే కళాశాలలో డెర్మటాలజీలో పీజీ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని ప్రభుత్వ డెర్మటాలజిస్టుగా పనిచేస్తున్నాడు. సివిల్స్ సాధించాలని ఇప్పటికే ఐదుసార్లు పరీక్ష రాయగా ఆరో ప్రయత్నంలో 607వ ర్యాంకు సాధించారు. రవికిరణ్‌కు 694వ ర్యాంకు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెంకు చెందిన పుసులూరి రవికిరణ్ 694వ ర్యాంకు సాధించాడు. గతంలో ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ (ఐసీఎల్ఎస్)కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఢిల్లీలోని కేంద్ర కార్పొరేట్ ఎఫైర్స్ శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. ఐఏఎస్ సాధించడమే లక్ష్యంగా మరోసారి ప్రయత్నిస్తానని రవికిరణ్ తెలిపాడు. ఎన్టీఆర్ జిల్లా యువకుడికి 805వ ర్యాంక్ సివిల్స్ తుది ఫలితాల్లో ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన మన్నం సుజిత్ సంపత్‌కు 805వ ర్యాంక్ లభించింది. ఈ సందర్భంగా సుజిత్ మాట్లాడుతూ ఐఏఎస్ అవ్వాలన్నదే తన కోరికన్నారు. నాలుగేళ్ల శ్రమ ఫలితంగా మంచి ర్యాంక్ వచ్చిందని తెలిపారు. ఐఏఎస్ అయ్యేంతవరకు శ్రమిస్తూనే ఉంటానన్నారు. సుజిత్‌ను నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ తదితరులు అభినందనలు తెలిపారు. కడప కుర్రాడికి 866వ ర్యాంకు కడప ప్రకాష్‌నగర్‌కు చెందిన నాగుల కృపాకర్ 866వ ర్యాంకు సాధించాడు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో బీటెక్ ఈఈఈ పూర్తి చేశాక సివిల్స్‌కు సిద్ధమయ్యాడు. వరుసగా ఐదుసార్లు ప్రయత్నించినా విజయం సాధించలేకపోయాడు. అయినా నిరాశ చెందకుండా ఆరో ప్రయత్నంలో 866వ ర్యాంకు సాధించాడు. తనకు ఐపీఎస్ లేదా ఐఆర్ఎస్ వచ్చే అవకాశం ఉందని కృపాకర్ తెలిపాడు. రానున్న రోజుల్లో మరింత మంచి ర్యాంకు సాధించేందుకు ప్రిపరేషన్ కొనసాగిస్తానని తెలిపాడు. -
లండన్‌లో ఉద్యోగం వదిలేసి సివిల్స్ వైపు.. థర్డ్ అటెంప్ట్‌లో ఫస్ట్ ర్యాంక్
దేశ వ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్ పోస్టుల భర్తీకి నిర్వహించిన సివిల్ సర్వీసెస్ 2022 తుది ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. సివిల్స్ ఫలితాల్లో గ్రేటర్ నోయిడా ప్రాంతానికి చెందిన ఇషితా కిషోర్ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్‌తో మెరిశారు. గరిమ లోహియా, ఎన్ ఉమా హారతి. స్మృతి మిశ్రా వరుసగా రెండు, మూడు, నాలుగు ర్యాంకులు సాధించారు. గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా అమ్మాయిలే టాప్ ర్యాంకర్లుగా నిలిచారు. తొలి 25 ర్యాంకర్లలో 14 మంది మహిళలే ఉండటం విశేషం. కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకొని.. ఇషితా కిషోర్ ఎయిర్‌ఫోర్స్ బాల్ భారతి పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఇంటర్లో కామర్స్ విభాగంతో 97 శాతంతో ఉత్తీర్ణత సాధించింది. 2017లో ఢిల్లీ యూనివర్సిటీ శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ కళాశాల నుంచి ఎకనామిక్స్ హానర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. డిగ్రీ తరువాత లండన్‌లో ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనే సంస్థలో రిస్క్ అనలిస్ట్‌గా చేరారు. కానీ ఆ ఉద్యోగం సంతృప్తినివ్వలేదు. రెండేళ్ల తర్వాత యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌కు ప్రీపెర్ అయ్యేందుకు 2019లో తన ఉద్యోగాన్ని వదిలేసింది. చదవండి: ‘సివిల్స్’లో సత్తా చాటిన తెలుగు తేజాలు.. మూడో ప్రయత్నంలో ఫస్ట్ ర్యాంక్ సివిల్స్ మీద ఆసక్తితో చేసిన తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్ పరీక్షలో ఇషితా ఉత్తీర్ణత సాధించలేదు. అయినా నిరాశ పడకుండా రెండోసారి ప్రయత్నించారు. ఈసారి కూడా ప్రిలిమ్స్ దాటలేకపోయారు. గతేడాది మూడోసారి సివిల్స్ పరీక్ష రాశారు. అయితే ఈసారి ప్రిలిమ్స్ గట్టెక్కడంతో తనపై తనకు నమ్మకం పెరిగింది. దీంతో మరింత కష్టపడి చదివి మెయిన్స్, ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. సైనిక కుటుంబ నేపథ్యం 26 ఏళ్ల ఇషితా తండ్రి సంజయ్ కిషోర్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అధికారిగా పనిచేస్తున్నారు. సైనిక నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రావడంతో దేశానికి సేవ చేయాలనే ఆలోచన ఆమెలో బలంగా నాటుకుంది. ‘నా కుటుంబాన్ని చూసిన ప్రతిసారీ ఈ దేశం కోసం ఏదైనా చేయాలనే తపన నాలో ఎప్పుడూ ఉంటుంది. నేను పెరిగిన వాతావరణం అలాంటింది. అందుకే సివిల్స్ సర్వీసెస్‌లో చేరాను’ అని ఇషితా తెలిపారు.. కాగా ఇషితా తల్లి ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె సోదరుడు న్యాయవాది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌ను ఎంచుకున్న కిషోర్ ఉత్తర ప్రదేశ్ కేడర్‌ను తొలి ప్రాధాన్యతగా సెలెక్ట్ చేసుకుంది. ఇషితా జాతీయ స్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారిణి కూడా. ఆమె పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్‌ను తన ఆప్షనల్ సబ్జెక్ట్‌గా ఎంచుకొని సివిల్స్‌కు అర్హత సాధించారు. చదవండి: UPSC సివిల్ సర్వీసెస్ తుది ఫలితాల్లో విజేతలు వీళ్లే దేశానికి సేవ చేయాలని.. తన విజయంపై ఇషిత మాట్లాడుతూ.. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక కావడం చాలా పెద్ద విషయమని, మొదటి ర్యాంక్ సాధించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. దేశానికి సేవ చేయడానికి తనకు అవకాశం లభించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. దీని ద్వారా దేశానికి సేవ చేయాలన్న తన కల నిజమైందని పేర్కొన్నారు. మహిళా సాధికారికత, ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తానని చెప్పింది. యూపీఎస్సీ పరీక్షలో ఈసారి తప్పకుండా ఉత్తీర్ణత సాధిస్తానని నమ్మకం ఉంది కానీ ఏకంగా ఫస్ట్ ర్యాంక్ వస్తుందని ఊహించలేకపోయానని తెలిపింది. సివిల్స్ కొట్టేందుకు ఎంతో కష్టపడ్డానని, రోజుకు కనీసం 8 నుంచి 9 గంటలు చదువుకునేదాన్ని అని తెలిపింది. యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో సానుకూల మనస్తత్వం, ఆత్మవిశ్వాసం ఎంతో ముఖ్యమని పేర్కొంది. ఈ అత్యుత్తమ విజయం వెనక, తనను నిరంతరం ప్రోత్సహించిన తల్లిదండ్రులు, స్నేహితులు.. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది. #WATCH | Ishita Kishore, who has secured 1st rank in UPSC 2022 exam, says, "One has to be disciplined and sincere to be able to achieve this." pic.twitter.com/YKziDcuZJz — ANI (@ANI) May 23, 2023 మెరిసిన తెలుగు తేజం 2022 సివిల్స్ ఫలితాల్లో తెలుగు తేజం ఉమా హారతి మెరిశారు. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లాకు చెందిన ఉమా హారతి జాతీయస్థాయిలో మూడో ర్యాంక్ సాధించారు. ఉమా హారతి తండ్రి వెంకటేశ్వర్లు నారాయణపేట ఎస్పీగా పనిచేస్తున్నారు. తాను ఐదో ప్రయత్నంలో ఈ విజయం సాధించినట్లు తెలిపారు. కుటుంబ ప్రోత్సాహంతోనే ఉత్తమ్ ర్యాంకు సాధించానని వెల్లడించారు. విధుల్లో చేరిన తర్వాత విద్యా, వైద్యం, మహిళ సాధికారత కోసం కృషి చేస్తానని తెలిపారు సివిల్ సర్వీసెస్ 2022 తుది ఫలితాల్లో మొత్తం 933 మంది అభ్యర్థులను యూపీఎస్సీ ఎంపిక చేంది. . వీరిలో IAS సర్వీసెస్‌కు 180 మందిని ఎంపిక చేసింది. అలాగే IFSకు 38 మందిని, IPSకు 200 మంది ఉన్నారు. ఇక సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్-Aకు 473 మంది, గ్రూప్-Bకి 131 మందిని ఎంపిక చేసింది. గ్రూప్-B కలుపుకుంటే ఎంపిక అయిన అభ్యర్థుల సంఖ్య 1022 అయింది. ఇందులో జనరల్ కోటాలో 345 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 99, ఓబీసీ నుంచి 263, ఎస్సీ నుంచి 154, ఎస్టీ విభాగం నుంచి 72 మంది ఉన్నారు. -
సివిల్స్‌లో ఫెయిల్ అయిన చాట్ జీపీటీ
-
ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ వాయిదా
సాక్షి, విజయవాడ: ఏపీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. ఏప్రిల్ 23 నుంచి 29 వరకు జరగాల్సిన గ్రూప్-1 మెయిన్స్‌ను జూన్ మొదటి వారానికి వాయిదా వేసింది ఏపీపీఎస్సీ. జూన్ 3 నుంచి 9 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. 2022 సివిల్స్ ఫేజ్- 3 ఇంటర్వ్యూలు ఏప్రిల్ 24 నుంచి మే 18 వరకు ప్రకటించడంతో గ్రూప్ వన్ మెయిన్స్ వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ ఇంటర్వ్యూల షెడ్యూల్‌ను యూపీఎస్సీ సోమవారమే విడుదల చేసింది. యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూలకి ఏపీ నుంచి దాదాపు 25 మంది గ్రూప్ వన్ అభ్యర్థులు హాజరవుతున్నారు. దీంతో ఈ ఇంటర్వ్యూల కారణంగా గ్రూప్-1 మెయిన్స్‌ని జూన్‌లో నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. సివిల్స్ ఇంటర్వ్యూలకి ఎంపికైన అభ్యర్థుల భవిష్యత్ ని దృష్టిలో ఉంచుకునే మెయిన్స్ వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ మెంబర్ సలాంబాబు పేర్కొన్నారు. చదవండి: ‘ఓటుకు కోట్లు 2.0’ ప్రకంపనలు -
సివిల్స్‌లో ఐశ్వర్యకు నాలుగో ర్యాంకు... అయితే ఐశ్వర్య అమ్మాయి కాదు!
న్యూఢిల్లీ: సివిల్స్ నాలుగో ర్యాంకర్ ఐశ్వర్య వర్మ పేరు చాలామందిలో అయోమయానికి కారణమైంది. తొలి మూడు ర్యాంకులూ మహిళలే కైవసం చేసుకున్న నేపథ్యంలో, పేరు చూసి ఐశ్వర్య అంటే అమ్మాయేనని చాలామంది అనుకున్నారు. పలు పత్రికల్లోనూ, వెబ్సైట్లలోనూ కూడా అలాగే వచ్చింది. తొలి నాలుగు ర్యాంకులూ అమ్మాయిలే సాధించారంటూ అవన్నీ రాసుకొచ్చాయి. సివిల్స్ నాలుగో ర్యాంకర్ ఐశ్వర్య వర్మ (ఫైల్) మహిళా సాధికారత మరో మెట్టు పైకెక్కిందంటూ వాట్సాప్, ఫేస్బుక్, ట్వీటర్లలో పోస్టులు వెల్లువెత్తాయి. దాంతో ఐశ్వర్య మహిళ కాదంటూ ఆయన కుటుంబీకులు, స్నేహితులు స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది! సోషల్ మీడియాలో ఆయన ఫొటో పెట్టి మరీ విషయం వివరించారు. పత్రికలు, సైట్లు ఇలా గందరగోళపడ్డా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాత్రం ‘ఉజ్జయినికి చెందిన పురుష అభ్యర్థి ఐశ్వర్య వర్మ నాలుగో ర్యాంకు సాధించారు’ అంటూ స్పష్టంగా పేర్కొంటూ ప్రశంసించారు. ఐశ్వర్య వర్మ ఢిల్లీలో నాలుగేళ్ల పాటు కోచింగ్ తీసుకుని, నాలుగో ప్రయత్నంలో నాలుగో ర్యాంకు సాధించారు! చదవండి: రిటైర్మెంట్లో రికార్డు.. ఒకే రోజు 25 వేల మంది ఇంటిబాట! -
సివిల్స్ సర్విసెస్‌లో అమ్మాయిల హవా
-
స్పీకర్ కుమార్తె ఐఏఎస్‌గా అడ్డదారిలో ఎంపిక కాలే
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా ఐఏఎస్‌గా ఎంపికవడంపై వివాదం ఏర్పడింది. సోషల్ మీడియాలో ఈ విషయం చర్చ కొనసాగుతోంది. అంజలి తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని మెయిన్స్ పరీక్ష రాయకుండానే అడ్డదారిలో ఐఏఎస్‌కు ఎంపికైందని పుకార్లు వస్తున్నాయి. ఈ వివాదం రాజకీయ విమర్శలకు కూడా దారి తీస్తోంది. దొడ్డి దారిన తన కుమార్తెను ఐఏఎస్‌గా ఎంపికయ్యేలా స్పీకర్ ఓం బిర్లా చేశారని ఆరోపణలు వచ్చాయి. అయితే దీనిపై ఫ్యాక్ట్ చెక్ అనే సంస్థ అవన్నీ పుకార్లని స్పష్టం చేసింది. కావాల్సి వస్తే యూపీఎస్సీలో పరిశీలించవచ్చని ట్వీట్ చేసింది. ఇటీవల అంజలి బిర్లా ఐఏఎస్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. అయితే ఆమె తండ్రి పదవి ద్వారా ఐఏఎస్‌గా ఎంపికైందని వస్తున్న వార్తలపై ఫ్యాక్ట్ చెక్ సంస్థ నిశితంగా పరిశీలించింది. ఈ సందర్భంగా యూపీఎస్సీ వెబ్సైట్లో అంజలి వివరాలను పరిశీలించి నిర్ధారణ చేసుకున్నట్లు ఆ సంస్థ తెలిపింది. పరీక్ష రాయకుండానే ఐఏఎస్‌గా ఎంపికైందని వస్తున్న వార్తలు అవాస్తవమని ఏఎఫ్‌పీ కొట్టిపారేసింది. ఈ సందర్భంగా వెబ్సైట్లో అంజలి బిర్లాకు వచ్చిన మార్కులను కూడా షేర్ చేసింది. ఓం బిర్లా కుమార్తె పరీక్షలు రాసి ఇంటర్వ్యూ ఎదుర్కొని నిష్పక్షపాతంగా ఐఏఎస్‌గా ఎంపికైందని ఆ సంస్థ వివరించింది. అయితే ఎంపికైన తొలి రోజు నుంచే ఈ పుకార్లు రావడంతో అంజలి బిర్లా అప్పుడే సోషల్ మీడియా వేదికగా బదులిచ్చింది. ఈ పుకార్లను చూసి తనకు చాలా నవ్వొస్తుందని పేర్కొంది. అత్యంత నిష్పక్షపాతంగా సివిల్స్ పరీక్షలు జరుగుతాయని.. లక్షలాది మంది పరీక్షలు రాస్తే కేవలం 900 మంది ఎంపికవుతారని వివరించింది. అయితే తనను కాకపోయినా యూపీఎస్సీని గౌరవించాలని విజ్ఞప్తి చేసింది. తాను రెండేళ్ల పాటు కష్టపడ్డానని.. 8 మార్కుల తేడాతో మొదటి జాబితాలో తన పేరు రాలేదని ఈ సందర్భంగా అంజలి తెలిపింది. -
ప్రజల గుండెల్లో నిలిచిపోయే అధికారి కావాలి
సివిల్స్ ర్యాంక్ సాధించేందుకు ఎంతో కష్టపడ్డాడు. తనకు స్టడీ హాల్‌కు వెళ్లి చదవటం అంటే ఇష్టం. రోజు ఉదయం 8 గంటలకు వెళ్లి రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చేవాడు. ఇంటిలో కన్నా స్టడీ హాల్లోనే గత మూడు నాలుగేళ్లుగా గడిపాడు. తనకు చదువే ప్రపంచం, ఇతర విషయాలపై ఏమాత్రం దృష్టిపెట్టేవాడు కాదు. సాక్షి, అమరావతి బ్యూరో: సివిల్స్‌లో మంచి ర్యాంక్ సాధించి ఐఏఎస్ అవ్వటమే వాడి ఆశయం, అది నేడు సాకరమైంది... నిజాయతీ గల ఆధికారిగా ప్రజలకు మెరుగైన సేవలు అందించి వారి గుండెల్లో నిలిచిపోవాలన్నదే నా కల, భగవంతుడి దయ, తన పట్టుదలతో అది నెరవేరుతుందని బలంగా విశ్వసిస్తున్నాను...’ అంటూ మంగళవారం విడుదలైన ఇండియన్ సివిల్స్ 2019 ఫలితాల్లో ఆలిండియా 76వ ర్యాంక్ సాధించిన గుంటూరు నగరానికి చెందిన మల్లవరపు సూర్యతేజ తల్లి సంధ్యారాణి “సాక్షి’తో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఆమె మాటల్లో... సివిల్స్‌లో మంచి ర్యాంక్‌లో సాధించాలనే నా కుమారుడి కల నెరవేరింది. నాకు చాలా ఆనందంగా ఉంది. తన కలను సాకారం చేసుకోవటానికి ఎంతో కష్టపడ్డాడు. దానికి నేడు ప్రతిఫలం దక్కింది. వాళ్ల నాన్నగారు 2014లో ఆనారోగ్య కారణాల వల్ల మరణించారు. ఆ ప్రభావం తన లక్ష్యం పైన పడకుండా జాగ్రత్తపడ్డాను. సూర్యతేజ పాఠశాల విద్య గుంటూరు నగరంలోనే సాగింది. చదువే ప్రపంచం... సివిల్స్ ర్యాంక్ సాధించేందుకు ఎంతో కష్టపడ్డాడు. తనకు స్టడీ హాల్‌కు వెళ్లి చదవటం అంటే ఇష్టం. రోజు ఉదయం 8 గంటలకు వెళ్లి రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చేవాడు. ఇంటిలో కన్నా స్టడీ హాల్లోనే గత మూడు నాలుగేళ్లుగా గడిపాడు. తనకు చదువే ప్రపంచం, ఇతర విషయాలపై ఏమాత్రం దృష్టిపెట్టేవాడు కాదు. -
మాజీ సర్పంచ్ కొడుకు.. సివిల్స్ టాపర్
న్యూఢిల్లీ: ప్రదీప్ సింగ్ పేరు ప్రస్తుతం ట్విట్టర్లో తెగ ట్రెండ్ అవుతోంది. నేడు ప్రకటించిన యూపీఎస్సీ-2019 ఫలితాల్లో ప్రదీప్ సింగ్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించడంతో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 829 మంది అభ్యర్థులు ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక అయినట్లు యూపీఎస్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా వీరందరికి శుభాకాంక్షలు తెలిపారు. ‘సివిల్ సర్వీసెస్ పరీక్ష, 2019ని విజయవంతంగా క్లియర్ చేసిన వారందరికీ నా అభినందనలు! ప్రజా సేవకు సంబంధించి ఉత్తేజకరమైన, సంతృప్తికరమైన వృత్తి మీ కోసం వేచి ఉంది. నా శుభాకాంక్షలు!’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌తో పాటు ఇతర నాయకులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు అభినందనలు తెలిపారు. నేడు ప్రకటించిన ఫలితాల్లో ప్రదీప్ సింగ్ ఫస్ట్ ర్యాంక్ సాధించగా.. తరువాతి స్థానాల్లో జతిన్ కిషోర్, ప్రతిభా వర్మ ఉన్నారు. Congratulations to all the bright youngsters who have successfully cleared the Civil Services Examination, 2019! An exciting and satisfying career of public service awaits you. My best wishes! — Narendra Modi (@narendramodi) August 4, 2020 ఇక ఫస్ట్ ర్యాంక్ సాధించిన ప్రదీప్ సింగ్ హరియాణా సోనిపట్ జిల్లాకు చెందినవారు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘కల నిజమైతే ఎంత సంతోషంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఇది నాకు ఆనందకరమైన ఆశ్చర్యం. నేను ఐఏఎస్ కావాలని ప్రతిక్షణం పరితపించాను. సమాజంలోని అణగారిన వర్గాల కోసం పని చేస్తాను’ అని తెలిపారు. గత ఏడాది కూడా ప్రదీప్ సివిల్స్ క్లియర్ చేశారు. ప్రస్తుతం అతను హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఇండియన్ రెవన్యూ సర్వీస్ ఆఫీసర్‌గా శిక్షణ పొందుతున్నారు. సోనిపాట్ జిల్లాలోని తేవ్రీ గ్రామంలో నివసిస్తున్న ప్రదీప్ తండ్రి సుఖ్బీర్ సింగ్.. గతంలో గ్రామ సర్పంచ్‌గా పని చేశారు. -
‘గ్రేట్.. తొలి ప్రయత్నంలోనే సివిల్స్’
సాక్షి, కరీంనగర్: పట్టుదల, కృషి తోడుంటే ఎంతటి లక్ష్యాన్నయినా ఛేదించవచ్చని మరోసారి నిరూపితమైంది. ఏకాగ్రతతో చదివితే సివిల్స్ లాంటి అత్యున్నత స్థాయి పోటీ పరీక్షలకు కూడా ఎలాంటి కోచింగ్ అవసరం లేదని రుజువైంది. యూపీఎస్సీ నేడు విడుదల చేసిన 2019 సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ఆలిండియా 93 వ ర్యాంకు సాధించిన ఐశ్వర్య పలువురికి ఆదర్శంగా నిలిచారు. కరీంనగర్ ఎన్సీసీ తొమ్మిదో బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అజయ్ కుమార్ కూతురే ఐశ్వర్య. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా తొలి ప్రయత్నంలోనే ఆలిండియా 93వ ర్యాంకు సాధించడం పట్ల ఆమె తండ్రి హర్షం వ్యక్తం చేశారు. (చదవండి: ఐఏఎస్‌గా ఎన్నికైన ఐఆర్ఎస్ అధికారి) రాత పరీక్ష, ఇంటర్వ్యూ దేనికీ ఐశ్వర్య కోచింగ్ తీసుకోలేదని, దేశవ్యాప్తంగా ఆమె యువతకు ఆదర్శంగా నిలిచిందని అజయ్‌కుమార్ అన్నారు. చిన్న వయసులోనే సివిల్స్ సాధించిన వారి జాబితాలో ఐశర్య ఒకరని పేర్కొన్నారు. ఆమె విద్యాభ్యాసమంతా న్యూఢిల్లీలోనే సాగిందని అజయ్‌కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఐశ్వర్య ముంబైలో ఉన్నట్టు వెల్లడించారు. కాగా, ప్రతిష్టాత్మక ఇండియన్ సివిల్ సర్వీసెస్ 2019కి సంబంధించిన తుది ఫలితాలు యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 829 మంది అభ్యర్థులు సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైనట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఇందులో 304 జనరల్, 78 ఈబీసీ, 254 ఓబీసీ, 129 ఎస్సీ , 67 ఎస్టీ కేటగిరీకి చెందిన వారున్నారు. (2019 సివిల్ సర్వీసెస్ ఫలితాల విడుదల) -
2019 సివిల్ సర్వీసెస్ ఫలితాల విడుదల
సాక్షి, ఢిల్లీ : ప్రతిష్టాతకమైన ఇండియన్ సివిల్ సర్వీసెస్ 2019కి సంబంధించిన తుది ఫలితాలు మంగళవారం యూపీఎస్సీ విడుదల చేసింది. ఈ మేరకు 829 మంది అభ్యర్థులు ప్రతిష్టాకమైన సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక అయినట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఇందులో 304 జనరల్, 78 ఈబీసీ, 254 ఓబీసీ, ఎస్సీ 129, ఎస్టీ 67 మంది ఉన్నారు. కాగా సివిల్ సర్వీస్ ఫలితాల్లో ప్రదీప్ సింగ్ మొదటి ర్యాంక్, జతిన్ కిషోర్ రెండవ ర్యాంకు, ప్రతిభా వర్మ మూడవ ర్యాంక్ సాధించారు. కాగా అభ్యర్థులు తమ ఫలితాలను యూపీఎస్సీ వెబ్సైట్లో చూసుకోవచ్చు. సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో తెలంగాణ యువకుడు తన సత్తా చాటాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంబీరావుపేట మండలం భీమునిమల్లారెడ్డిపేటకు చెందిన మంద మకరంద్ ఆలిండియా 110 ర్యాంక్ సాధించాడు. ఈ ర్యాంక్‌తో మకరంద్‌కు ఐఏఎస్ వచ్చే అవకాశం ఉంది. కాగా మకరంద్ తల్లిదండ్రులిద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు. ప్రస్తుతం మకరంద్ కుటుంబం సిద్దిపేటలో నివాసం ఉంటుంది. -
సివిల్స్ పరీక్షలు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఇప్పటికే అన్ని పరీక్షలను రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలు వాయిదా వేశాయి. సీబీఎస్సీ కూడా పరీక్షలను రద్దు చేసింది. అయితే తాజాగా మే31న జరగవల్సిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2020ని కూడా వాయిదా వేస్తున్నట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు ఈ వారంలో విడుదల చేయాల్సి ఉండగా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. తదుపరి వివరాలను మే 20న తెలియజేస్తామని తెలిపింది. (యూపీఎస్సీ 2020 సన్నద్ధమవుదామిలా..) కరోనా మహమ్మారి కారణంగా యూపీఎస్సీ పరీక్షలను వాయిదా వేయలని సివిల్ సర్వీసస్‌కి తయారవుతున్న విద్యార్ధులు కోరగా దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ పరీక్షలను రీషెడ్యూల్ చేస్తామని, దీని గురించి విద్యార్థులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తే విద్యార్ధులు పరీక్షల కేంద్రాలకు చేరుకునేందుకు రవాణా విషయంలో ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుంది కనుక ఆ విషయం పై మరోసారి ఆలోచిస్తామన్నారు. అయితే గత 4-5 సంవత్సరాలతో పోలీస్తే ఈ ఏడాది సివిల్స్ సర్వీసెస్ ఎగ్జామ్ షెడ్యూల్ ముందుగానే ప్రారంభం అయ్యింది. ఇదిలా ఉండగా కరోనా కారణంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహిస్తోన్న అనేక పరీక్షలను ఇప్పటికే వాయిదా వేసిన విషయం తెలిసిందే. (ఉద్యోగ పరీక్షలపైనా కరోనా ప్రభావం) -
సివిల్స్‌రిజర్వ్ జాబితాలోని 53 మందికి సర్వీస్
సాక్షి, న్యూఢిల్లీ: సివిల్స్ ఫలితాల్లోని రిజర్వ్ జాబితా ప్రతిభా క్రమంలో మరో 53 మందిని అఖిల భారత సర్వీస్‌కు ఎంపిక చేస్తూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) తాజాగా నిర్ణయం తీసుకుంది. సివిల్స్–2018 పరీక్షా ఫలితాలను యూïపీఎస్సీ ఈ ఏడాది ఏప్రిల్ ఐదవ తేదీన ప్రకటించడం తెలిసిందే. అందులో 759 మంది అభ్యర్థులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్–ఏ, గ్రూప్–బీ పోస్టులకు ఎంపికయ్యారు. సివిల్ సర్వీస్ పరీక్షల నిబంధనల ప్రకారం రిజర్వ్ లిస్ట్ కూడా అందుబాటులో ఉంచుతారు. ఈ నేపథ్యంలో కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం (డీఓపీటీ) అవసరం కోసం యూపీఎస్సీ మరో 53 మందిని అఖిల భారత సర్వీసుకు సిఫారసు చేసింది. ఫలితాలను యూపీఎస్సీ వెబ్సైట్లో కూడా పొందుపరిచారు. ఈ 53 మందిలో పలువురు తెలుగు అభ్యర్థులు కూడా ఉన్నారు. -
ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయట!
న్యూఢిల్లీ : ప్రతేడాది లక్షల మంది దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులకు పోటీపడుతూ ఉంటారు. వీళ్లలో చాలా తక్కువ మందే ఈ పోస్టులకు ఎంపికయ్యేది. ఈ పోస్టులకు పెద్ద ఎత్తున్న అభ్యర్థుల నుంచి ఆసక్తి వస్తున్నప్పటికీ, చాలా తక్కువ మందే దీనికి అర్హత సాధిస్తున్నారు. ప్రస్తుతం 2,400 ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులు ఖాళీ ఉన్నట్టు తెలిసింది. దేశంలో మొత్తం మంజూరైన 6,553 ఐఏఎస్ పోస్టుల్లో 22.11 శాతం సీట్లు ఖాళీగా ఉన్నట్టు వెల్లడైంది. కేవలం ఇవి మాత్రమే కాక, 4,940 ఐపీఎస్ ఆఫీసర్ పోస్టుల్లో 19.64 శాతం సీట్లను ఇంకా భర్తిచేయాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ విషయాన్ని రాజ్యసభకు లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు. అంటే మొత్తంగా 2,400కు పైగా ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపారు. వీటిలో 1,449 ఐఏఎస్ పోస్టులు, 970 ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఖాళీగా ఉన్న ఈ పోస్టులను ప్రస్తుతం భర్తీ చేస్తున్నామని మంత్రి సమాధానమిచ్చారు. కాగ, ప్రతేడాది యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, వంటి ఇతర ముఖ్యమైన, హైలెవల్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పోస్టులను భర్తీ చేస్తూ ఉంటోంది. ఈ పోస్టులకు అర్హతలు.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పాసై ఉండాలి. అభ్యర్థుడు భారత పౌరుడే ఉండాలి నేపాల్, భూటాన్, టిబెట్ నుంచి వచ్చిన శరణార్థులు, భారతీయ సంతతి ఇమిగ్రేట్లు, తమ అర్హత పత్రం చూపించి సివిల్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి వయసు 21 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి. పరీక్ష ఎన్నిసార్లు రాయవచ్చు జనరల్ అభ్యర్థులు-4 సార్లు ఒబిసి అభ్యర్థులు-7సార్లు వికలాంగులు (జనరల్)- 7 సార్లు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, ఇతర కేటగిరీకి చెందిన వికలాంగులు ఎన్నిసార్లయినా రాయవచ్చు. -
సివిల్స్ మార్కులు.. ఫస్ట్ ర్యాంకర్‌కు 55.60 శాతమే!
సాక్షి, న్యూఢిల్లీ : తాజా సివిల్స్ ర్యాంకర్ల మార్కుల వివరాలను యూపీఎస్సీ ఆదివారం విడుదల చేసింది. 2017 సివిల్స్ ఫైనల్ ఫలితాలను గత నెల 27న ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో దూరిశెట్టి అనుదీప్ మొదటి ర్యాంకు సాధించారు. అతని మార్కుల శాతం 55.60. మొత్తం 2025 మార్కులకు అనుదీప్ 1126 మార్కులు సాధించారు. అందులో 950 రాత పరీక్షలో వస్తే, 176 మార్కులు ఇంటర్వ్యూలో వచ్చాయి. రాత పరీక్షకు 1750 మార్కులు కాగా.. ఇంటర్వ్యూకు 275 మార్కులకు ఉంటాయి. రెండో ర్యాంకర్ అను కుమారి 55.50 శాతం మార్కులు సాధించారు. ఆమె మొత్తం 1124 మార్కులు సాధించారు. ఆమెకు మొదటి ర్యాంకర్ అనుదీప్‌కు కేవలం రెండు మార్కులే తేడా. మూడో ర్యాంకర్ సచిన్ గుప్తా 55.40 శాతం మార్కులు సాధించారు. ఇతరుల మార్కులు, శాతాల కోసం యూపీఎస్సీ వెబ్సైట్లో చూడోచ్చు upsconline.nic.in. -
సివిల్స్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ ప్రణాళిక
కాంపిటీటివ్ గెడైన్స్ : యూపీఎస్సీ- సివిల్స్ 100 శాతం ఆత్మవిశ్వాసంతో సివిల్స్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ కొనసాగించాలి. పటిష్ట ప్రణాళికతో చదివితే తప్పకుండా ప్రిలిమ్స్‌లో విజయం సాధిస్తామనే నమ్మకం అవసరం. అదృష్టాన్ని నమ్ముకోకుండా, కేవలం కటాఫ్ మార్కులు తెచ్చుకుంటే సరిపోతుందని కాకుండా పూర్తిస్థాయిలో మంచి స్కోర్ సాధించేందుకు శ్రమించాలి. పేపర్ 1: 2015 సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్‌తో వచ్చిన మార్పులు కారణంగా ప్రిలిమ్స్‌లో విజయానికి జనరల్ స్టడీస్ పేపర్-1 కీలకంగా మారింది. ఈ పేపర్లో కనబర్చిన ప్రతిభ ఆధారంగా మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. పేపర్-2 అర్హత పేపర్ మాత్రమే. సిలబస్‌లోని సబ్జెక్టులకు సంబంధించి ప్రాథమిక అంశాలపై పట్టుసాధించడం ద్వారా ప్రిలిమ్స్‌ను తేలిగ్గా అధిగమించవచ్చు. తేదీలు, ఫ్యాక్ట్స్ జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ అంటే కేవలం ఫ్యాక్ట్స్, తేదీలు, పేర్లను గుర్తుంచుకోవడం కాదు. హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి వివిధ అంశాలను క్రమపద్ధతిలో అధ్యయనం చేస్తూ వెళ్తే ప్రిపరేషన్ సాఫీగా సాగిపోతుంది. మెయిన్స్ కోణంలో వివిధ అంశాలపై పరిజ్ఞానం, అభిరుచిని పరీక్షించేలా ప్రిలిమ్స్ ఉంటుంది. మెయిన్స్‌ను దృష్టిలో ఉంచుకొని, ప్రిలిమ్స్‌కు ప్రిపరేషన్ కొనసాగించాలి. దీనివల్ల రెండు పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు వీలవుతుంది. ప్రిలిమ్స్ పూర్తయ్యాక మెయిన్స్ సబ్జెక్టులను చదవడం కూడా తేలికవుతుంది. * ప్రిలిమ్స్‌లో ఒక ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్ల నుంచి కచ్చితమైన సమాధానాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటే, మెయిన్స్‌లో సరైన సమాధానాన్ని రాయాల్సి ఉంటుంది. ఈ రెండింటికీ అదే తేడా. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ కొనసాగించాలి. ఒక్క ఆప్షనల్ సబ్జెక్టు తప్పించి, మిగిలిన అన్ని సబ్జెక్టులు, అంశాలు ప్రిలిమ్స్, మెయిన్స్‌కు ఒకే విధంగా ఉంటాయి. * జనరల్ స్టడీస్‌కు దగ్గరగా ఉండే హిస్టరీ, జాగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, సోషియాలజీ వంటి సబ్జెక్టులను ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంపిక చేసుకుంటే మంచిది. * ప్రిలిమ్స్ (మల్టిపుల్ చాయిస్), మెయిన్స్ (డిస్క్రిప్టివ్), పర్సనాలిటీ టెస్ట్ (వెర్బల్ ప్రజెంటేషన్).. సివిల్స్‌లో ఈ మూడింటి రూపాలు వేరైనా.. వాటి మధ్య అంతర్గత సంబంధం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని, పరీక్షకు సిద్ధమవాలి. * ప్రిలిమ్స్‌లో సబ్జెక్టుల వారీగా ప్రశ్నలకు వెయిటేజీ లేదు. ఒక అంశం నుంచి కచ్చితంగా వచ్చే ప్రశ్నల సంఖ్యను చెప్పలేం. ఈ పరిస్థితిలో ప్రిలిమ్స్, మెయిన్స్‌కు ఉమ్మడిగా ఉన్న సబ్జెక్టుల ప్రిపరేషన్‌కు ఎక్కువ సమయం కేటాయించాలి. ఉమ్మడి అంశాలు: ఆధునిక భారతదేశ చరిత్ర, రాజనీతి శాస్త్రం, భారత ఆర్థిక వ్యవస్థ, భౌగోళిక శాస్త్రం, వర్తమాన అంశాలు. ఎన్ని అంశాలను చదివామనే దానికంటే, చదివిన అంశాలను ఎంత బాగా అధ్యయనం చేశామన్నది విజయానికి కీలకం. పేపర్-2 (సీశాట్): సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీశాట్) పేపర్‌ను అర్హత పేపర్‌గా మార్చడం వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు మేలు జరుగుతోంది. ఈ పేపర్లో 33 శాతం మార్కులను అర్హత మార్కులుగా నిర్దేశించారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్ స్కిల్ విభాగాన్ని తొలగించారు. ఈ మార్పుల వల్ల పేపర్-2 ప్రిపరేషన్ తేలికైంది. అయితే ఇది అర్హత పేపర్ కాబట్టి, నిర్లక్ష్యం చేయకూడదు. ఈ పేపర్లో విజయం సాధించాలంటే అభ్యర్థులు కనీస స్థాయిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీడింగ్ స్కిల్స్‌ను పెంపొందించుకోవాలి. * పేపర్-2 ప్రశ్నలకు సమాధానాలు రాసే విషయంలో వేగం, కచ్చితత్వం అవసరం. ప్రాక్టీస్ ద్వారా మాత్రమే ఈ నైపుణ్యాలు అలవడతాయి. దీనికోసం పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. వీలైనన్ని మాక్‌టెస్ట్‌లు రాయాలి. మ్యాగజైన్లలో ప్రచురించిన క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. రీడింగ్ కాంప్రెహెన్షన్ * సీశాట్‌లో రీడింగ్ కాంప్రెహెన్షన్ విభాగం చాలా చిన్నది. ప్యాసేజ్ను చదివే ముందు మొదట ఒకసారి ప్రశ్నలన్నింటినీ పరిశీలించాలి. దీనివల్ల ప్రశ్నలకు సరైన సమాధానాల ఎంపికకు అవసరమైన సమాచారాన్ని గుర్తించడం తేలికవుతుంది. రీడింగ్ కాంప్రెహెన్షన్ విభాగాన్ని విజయవంతంగా అధిగమించడానికి ఫ్రంట్‌లైన్, ఇండియా టుడే, వీక్ వంటి మ్యాగజైన్లను చదవాలి. ఇవి జనరల్ స్టడీస్‌కు కూడా ఉపయోగపడతాయి. * నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు పరీక్ష గురించి ఆందోళన చెందనవసరం లేదు. పరీక్షలో కేవలం బేసిక్ అంశాలపై పరిజ్ఞానాన్ని పరిశీలిస్తారు. అందువల్ల ప్రాక్టీస్ బాగా చేస్తే తేలిగ్గానే లాజికల్, అనలిటికల్ రీజనింగ్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు. ఈ విభాగాల ప్రిపరేషన్‌కు ఎం.కె.పాండే, ఆర్.ఎస్.అగర్వాల్ పుస్తకాలు ఉపయోగపడతాయి. * ప్రిలిమ్స్‌కు ఒకసారి చదవడం పూర్తిచేశాక, ప్రీవియస్ పేపర్లను తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి. వీలైనన్ని మాక్‌టెస్ట్‌లు రాయాలి. ప్రిపరేషన్‌కు ఇంటర్నెట్ బాగా ఉపయోగపడుతుంది. రిఫరెన్స్ * అనలిటికల్ రీజనింగ్: ఎం.కె.పాండే (లాజికల్, అనలిటికల్ రీజనింగ్) * ఆర్.ఎస్.అగర్వాల్ (వెర్బల్/లాజికల్ రీజనింగ్, ఆప్టిట్యూడ్, రీడింగ్ కాంప్రెహెన్షన్) * క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-అరుణ్‌శర్మ (టీఎంహెచ్) * అరిహంత్ పబ్లికేషన్స్ (సీశాట్) * పజిల్స్ టు పజిల్ యూ - శకుంతలా దేవి * అరిహంత్ పబ్లికేషన్స్ (సీశాట్) - శ్రీరాం శ్రీరంగం డెరైక్టర్, శ్రీరాం ఐఏఎస్, న్యూఢిల్లీ