APPSC Group-1 Mains 2023 Exam Postponed To June - Sakshi
Sakshi News home page

ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ వాయిదా

Published Tue, Mar 28 2023 3:16 PM | Last Updated on Tue, Mar 28 2023 3:41 PM

APPSC Group-1 Mains Postponed To June - Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీ గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. ఏప్రిల్ 23 నుంచి 29 వరకు జరగాల్సిన గ్రూప్-1 మెయిన్స్‌ను జూన్ మొదటి వారానికి వాయిదా వేసింది ఏపీపీఎస్సీ. జూన్ 3 నుంచి 9 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. 2022  సివిల్స్ ఫేజ్- 3 ఇంటర్వ్యూలు ఏప్రిల్ 24 నుంచి మే 18 వరకు ప్రకటించడంతో గ్రూప్ వన్ మెయిన్స్ వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ ఇంటర్వ్యూల షెడ్యూల్‌ను యూపీఎస్సీ సోమవారమే విడుదల చేసింది.

యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూలకి ఏపీ నుంచి దాదాపు 25 మంది గ్రూప్ వన్ అభ్యర్థులు హాజరవుతున్నారు. దీంతో ఈ ఇంటర్వ్యూల కారణంగా గ్రూప్‌-1 మెయిన్స్‌ని జూన్‌లో నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. సివిల్స్ ఇంటర్వ్యూలకి ఎంపికైన అభ్యర్థుల భవిష్యత్ ని దృష్టిలో ఉంచుకునే మెయిన్స్ వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ మెంబర్ సలాంబాబు పేర్కొన్నారు.
చదవండి: ‘ఓటుకు కోట్లు 2.0’ ప్రకంపనలు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement