ఐఏఎస్ అవ్వాలనేది చాలామంది యువత ప్రగాఢమైన కోరిక. కొందరు అట్టడుగు వర్గాల నుంచి వచ్చి అసామాన్య ప్రతిభతో ఐఏఎస్ అవ్వుతారు. ఆ క్రమంలో తొలి , రెండు ప్రయత్నాల్లో తడబడి.. చివరికి అనుకున్న లక్ష్యాన్ని సాధించినవారు ఉన్నారు. అలా ఇలా కాకుండా విదేశాల్లో లక్షల్లో జీతం సంపాదిస్తూ సెటిల్ అయ్యి..కూడా ఐఏస్ అవ్వాలనుకోవడం సాహసోపేతమైన నిర్ణయం.
అదికూడా విదేశాల్లోని లగ్జరీ వాతావరణానికి అలవాటు పడ్డవాళ్లు ఇక్కడకు వచ్చి సివిల్స్ ప్రిపేరవ్వడం అంటే అంతా పిచ్చా నీకు అంటారు. బానే ఉన్నావు కదా అనే అవమానకరమైన మాటలు వినిపిస్తాయి. అందులోనూ పెళ్లైన అమ్మాయికైతే ఏంటీ ఆలోచన అని తిట్టిపోస్తారు. కానీ ఈ అమ్మాయి వాటన్నింటిని పక్కన పెట్టి మరీ భర్త అండదండలతో సివిల్స్ ప్రిపేరయ్యింది. మరీ ఐఏఎస్ సాధించిందా అంటే..
హర్యానాకు దివ్య మిట్టల్ లండన్ ప్రతిష్టాత్మకమైన ఐఐటీలో బీటెక్ పూర్తి చేసింది. ఆ తర్వాత యునైటెడ్ కింగ్‌డమ్‌లోని జేపీ మోర్గాన్ ఫైనాన్షియల్ కంపెనీలో పనిచేసింది. హయిగా లక్షల్లో జీతం తీసుకుంటూ ధర్జాగా గడుపుతుండేది. పెళ్లి చేసుకుని భర్తతో కలిసి అక్కడే సెటిల్ అయ్యింది.
ఎందుకనో ఆ లైఫ్ ఆమె కస్సలు నచ్చలేదు. ఏదో తెలియని అసంతృప్తి దీంతో ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ సివిల్స్‌కి ఎందుకు ప్రిపేరవ్వకూడదు అనుకుంది. కఠినతరమైన ఈ పరీక్షను ఇలాంటి పరిస్థితిలో సాధించి గెలిస్తే ఆ కిక్కే వేరు అనుకుంది. అనుకున్నదే తడువుగా భర్తతో కలిసి స్వదేశానికి వచ్చేసి మరీ 2012లో యూపీఎస్సీ(UPSC)కి ప్రిపేరయ్యింది.
అయితే తొలి ప్రయత్నంలో అనుకున్నది సాధించలేకపోయింది. ఐపీఎస్‌తో సరిపెట్టకోవాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితిలో 2013 లో మళ్ళీ పరీక్ష రాసి 68 వ ర్యాంకు సాధించి ఐఏఎస్(IAS) కలను సాకారం చేసుకుంది. ప్రస్తుతం ఆమె మిర్జాపూర్, సంత్ కబీర్ నగర్ బస్తీ జిల్లాలో జిల్లా మేజిస్ట్రేట్‌గా పనిచేస్తోంది. అంతేగాదు ఓ ఇంటర్వ్యూలో ఐఏఎస్‌కి సిద్ధమయ్యే అభ్యర్థులు ఎల్లప్పడూ తమ లక్ష్యంపై దృష్టి సారించాలి. "చక్కటి ప్రణాళితో ఎలా చదవుకోవాలో ప్లాన్ చేసుకోవాలి. ప్రతి 15 నిమిషాలకోసారి విరామం తీసుకుంటే..రిఫ్రెష్‌గా మరింత బాగా చదవగలుగుతారని సలహాలిస్తోంది." దివ్య.
ఇలాంటి కాంపిటీటివ్ పరీక్షలకు సన్నద్ధమయ్యే ఏ అభ్యర్థి అయిన ఫోన్‌కి దూరంగా ఉంటే అన్నుకున్నది సాధించగలుగుతారని అంటోంది. ఇక్కడ దివ్య స్టోరీ కారణాలు చెప్పేవారికి చెంపపెట్టు. అనుకున్నది సాధించాలనుకునేవారు ముందు చూపుతో సాగిపోవాలే గానీ తప్పుచేస్తన్నానా..అనే అనుమానంతో ఊగిసలాడితే ఘన విజయాలను అందుకోలేరు, రికార్డులు సృష్టించలేరు అని ధీమాగా చెబుతోంది దివ్య. ఆమె గెలుపు ఎందరికో స్ఫూర్తిదాయకం.
(చదవండి: ప్రపంచంలోనే అత్యల్ప సంతోషకరమైన దేశాలివే..! భారత్ ఏ స్థానంలో ఉందంటే..)
Comments
Please login to add a commentAdd a comment