సివిల్స్ ప్రిలిమ్స్ తుదిదశ వ్యూహాలు.. | Civils with advanced strategies | Sakshi
Sakshi News home page

సివిల్స్ ప్రిలిమ్స్ తుదిదశ వ్యూహాలు..

Published Thu, Aug 6 2015 1:57 AM | Last Updated on Sun, Sep 3 2017 6:50 AM

Civils with advanced strategies

 ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉజ్వల భవిష్యత్తుకు దారిచూపే  సివిల్స్ ప్రిలిమ్స్ మరికొద్ది రోజుల్లో (ఆగస్టు 23) జరగనుంది. ఔత్సాహికులు ఇప్పటికే ప్రిపరేషన్ పూర్తిచేసుంటారు. అయితే పరీక్షను ఎదుర్కొనేందుకు అందుబాటులో ఉన్న ఈ కొద్ది రోజుల్లో చదివిన అంశాలను పునశ్చరణ చేసుకుంటే మంచి స్కోరింగ్‌కు అవకాశముంటుంది. ప్రిలిమ్స్‌లోని పేపర్-2ను అర్హత పరీక్షగా  మార్చడంతో పేపర్-1 జనరల్ స్టడీస్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ క్రమంలో జీఎస్‌లో అధిక మార్కులు సాధించేందుకు సబ్జెక్టు నిపుణులు అందిస్తున్న తుది దశ వ్యూహాలు...
 
 ఈ ఏడాది సివిల్స్ ప్రిలిమ్స్‌లోని రెండో పేపర్ (సీశాట్) అర్హత పరీక్ష కావడం వల్ల మెయిన్స్‌కు ఎంపిక సాధించడంలో పేపర్-1 జనరల్ స్టడీస్ కీలకంగా మారింది.ప్రశ్నలు గతంతో పోల్చితే కొంత కఠినంగా ఉండొచ్చని సబ్జెక్టు నిపుణులు చెబుతున్నారు. జనరల్ సైన్స్, ఎన్విరాన్‌మెంట్-బయోడైవర్సిటీ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సంబంధిత అంశాలపై ఎక్కువ ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రిపరేషన్ కొనసాగించాలంటున్నారు.
 
 పాలిటీ
 శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలకు సంబంధించిన అంశాలను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. వీటితో సంబంధమున్న సమకాలీన పరిణామాలపై అవగాహన పెంపొందించుకోవాలి.స్థానిక స్వపరిపాలనకు సంబంధించిన 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలపై అవగాహన ఉండటం ముఖ్యం. రాజ్యాంగ సవరణలు-సంబంధిత ప్రక్రియ గురించి తెలుసుకోవాలి. ఇటీవల కాలంలో జరిగిన రాజ్యాంగ సవరణలపై అవగాహన పెంపొందించుకోవాలి.గిరిజన ప్రాంతాలకు సంబంధించిన 5, 6 రాజ్యాంగ షెడ్యూళ్లులోని అంశాలు చాలా ముఖ్యమైనవి. వీటి నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.
 
 భూ సేకరణ, అవినీతిని నిరోధించడానికి సంబంధించిన సమకాలీన పరిణామాలను అధ్యయనం చేయాలి.
 అభ్యర్థులు ఈ అంశంపై దృష్టిసారించాలి.నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా (నీతి ఆయోగ్) అంశం ముఖ్యమైనది. దీని ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్, సభ్యులు తదితర వివరాలతో పాటు సంస్థ కార్యకలాపాలపై అవగాహన పెంపొందించుకోవాలి.ఉరిశిక్ష, క్షమాభిక్ష అంశాలు కూడా ముఖ్యమైనవి. వీటికి సంబంధించిన సమకాలీన పరిణామాల నుంచి ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.అఫ్గానిస్థాన్, మధ్య ఆసియా దేశాలతో భారత్ సంబంధాలు ఎలా ఉన్నాయనే దానిపై అవగాహన అవసరం.
 
 చైనా అభివృద్ధి వ్యూహమైన ‘వన్ బెల్ట్, వన్ రోడ్ (ఓబీఓఆర్)తో పాటు దీనికి సంబంధించిన సిల్క్ రోడ్ ఎకనమిక్ బెల్ట్ (ఎస్‌ఆర్‌ఈబీ), మారిటైమ్ సిల్క్ రోడ్ (ఎంఎస్‌ఆర్)ల గురించి తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలో భారత్-చైనా సంబంధాలను విశ్లేషణాత్మకంగా చదవాలి.భారత్, బంగ్లాదేశ్ సరిహద్దు సమస్యలు; ఇరాన్ ఆరు అగ్రరాజ్యాలతో కుదుర్చుకున్న అణుఒప్పందం, ఇస్లామిక్ స్టేట్ కార్యకలాపాలు ముఖ్య అంశాలు. 50 శాతం ప్రశ్నలు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల నుంచి వస్తాయి కాబట్టి ప్రిపరేషన్‌కు ఈ పుస్తకాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి.
 
 హిస్టరీ
 జనరల్ స్టడీస్ పేపర్-1లో హిస్టరీకి సంబంధించిన సిలబస్‌ను ‘భారతదేశ చరిత్ర-భారత జాతీయ ఉద్యమం’ అని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు భారత దేశ చరిత్రపై పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకోవాలి. భారత స్వాతంత్య్ర ఉద్యమం నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి కాబట్టి దానిపై పట్టు సాధించాలి. ఆధునిక భారతదేశ చరిత్రలో 1885 నుంచి 1947 వరకు ఉన్న చరిత్రను పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో ఉద్యమంలో కీలక ఘట్టాలు, వాటి ఫలితాలను విశ్లేషణాత్మకంగా చదవాలి. ఉదాహరణకు 1935 భారత ప్రభుత్వ చట్టం, అందులోని అంశాలు,వాటి ఫలితాలను అధ్యయనం చేయాలి.
 
 గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే హిస్టరీకి సంబంధించి గతంలో ఇచ్చిన ప్రశ్నలనే వేరే రూపంలో ఇస్తున్నట్లు గమనించవచ్చు. అందువల్ల అభ్యర్థులు తప్పనిసరిగా పాత ప్రశ్నపత్రాల్లోని ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. వాటితో సంబంధం ఉన్న అంశాలను వివిధ కోణాల్లో అధ్యయనం చేయాలి.భారతదేశ సంస్కృతి-వారసత్వం అంశం ముఖ్యమైనది. దీన్నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. మధ్యయుగ భారతదేశ చరిత్రకు అంతగా ప్రాధాన్యం ఉండటం లేదు.
 
 అయితే ఈసారి ఈ విభాగం నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రశ్నలు రావొచ్చు. అందువల్ల అభ్యర్థులు ఆయా కాలాల్లో సామాజిక, సాంస్కృతిక, మతపరమైన అంశాలను అధ్యయనం చేయాలి.భక్తి ఉద్యమం, సూఫీ ఉద్యమం, ఢిల్లీ సుల్తానులు, మొగల్ సామ్రాజ్యం తదితర అంశాలను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. అప్పుడే ప్రశ్న ఏ కోణంలో వచ్చినా సరైన సమాధానం గుర్తించేందుకు వీలవుతుంది.
 
 జాగ్రఫీ
 
 ప్రిలిమ్స్‌లో జాగ్రఫీకి సంబంధించి ప్రశ్నలు కోర్ అంశాలతో పాటు వాటితో సంబంధమున్న సమకాలీన అంశాల నుంచి కూడా వచ్చేందుకు అవకాశముంది. నేపాల్ భూకంపం నేపథ్యంలో ఈసారి భూకంపాలు-స్థితిగతులపై దృష్టిసారించాలి. రుతుపవనాలు-ముందస్తు అంచనాలు, పులుల అభయారణ్యాలు, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు తదితర అంశాలను మరోసారి పునశ్చరణ చేసుకోవాలి.2015-టైగర్ సెన్సస్ అంశాలను అధ్యయనం చేయాలి. గతంతో పోల్చితే పులుల సంఖ్యలో వచ్చిన మార్పులు, పులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, ప్రాంతాలను గుర్తుంచుకోవాలి. ఇటీవలి కాలంలో నదుల అనుసంధానం (River Linking) పై బాగా చర్చ జరుగుతోంది. ఎప్పటికప్పుడు ప్రత్యేక కమిటీ సమావేశమవుతోంది. నీరు, ఆహార భద్రతకు నదుల అనుసంధానం ముఖ్యమని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. అభ్యర్థులు నదుల అనుసంధానం స్థితిగతులు, రాష్ట్రాల మధ్య జలవివాదాలు తదితరాలపై దృష్టిసారించాలి.
 
 ప్రస్తుతం స్మార్ట్‌సిటీలపైనా పెద్ద ఎత్తున చర్చజరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం వీటికి అధిక ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో ఈ అంశం నుంచి కూడా ప్రశ్న వచ్చేందుకు అవకాశముంది.ప్రపంచ వ్యాప్తంగా (భారత్‌కు ప్రాధాన్యమిస్తూ...) ఐలాండ్ గ్యాస్ నిల్వలపై దృష్టిసారించాలి. యురేనియం నిక్షేపాలపైనా అవగాహన తప్పనిసరి.అమర్‌నాథ్ యాత్ర, కైలాష్ మానససరోవరం యాత్రా మార్గాలపై అవగాహన పెంపొందించుకోవాలి.
 
 సైన్స్ అండ్ టెక్నాలజీ
 సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి గత ఏడాది కాలంలో జరిగిన ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ స్థాయి అభివృద్ధి అంశాలపై దృష్టిసారించాలి.అంతరిక్ష రంగం; రక్షణ రంగం; సమాచార-సాంకేతిక రంగాలపై దృష్టిసారించాలి. భారత అంతరిక్ష కార్యక్రమంలో భాగమైన పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు, ప్రయోగించిన దేశీయ, విదేశీ ఉపగ్రహాలు, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ నిర్వహించిన ప్రయోగాలపై దృష్టిసారించాలి.శక్తి రంగం (ఉ్ఛటజడ ్ఛఛిౌ్టట) నుంచి కూడా ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. పర్యావరణం, జీవవైవిధ్యం(బయోడైవర్సిటీ), వాతావరణ మార్పులు అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. కాబట్టి వీటికి సంబంధించి ఇటీవలి కాలంలో జరిగిన పరిణామాలపై అవగాహన పెంపొందించుకోవాలి.
 
 ఆవరణ వ్యవస్థలు (ఉఛిౌ డట్ట్ఛఝట), అనుకూలనాలు (అఛ్చీఞ్ట్చ్టజీౌట), ఎకలాజికల్ ఇంటరాక్షన్స్, ఇంటర్ గవర్న్‌మెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) అసెస్‌మెంట్ రిపోర్ట్ 5, జీవవైవిధ్యం ఎదుర్కొంటున్న ప్రమాదాలు తదితర అంశాలను రివిజన్ చేయాలి. దేశంలోని ప్రధానమైన ఉఛ్ఛీఝజీఛి ఞ్ఛఛిజ్ఛీట, వాటి విస్తరణ, ప్రత్యేక లక్షణాలు ముఖ్యమైనవి. సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీలో మంగళ్‌యాన్, న్యూ హరైజన్స్, అగ్ని 5, తేలికపాటి యుద్ధ విమానాలు-దేశీయ సాంకేతికపరిజ్ఞానం అభివృద్ధి, మిషన్ ఇంధ్రధనస్సు, కాంబినేషన్ టీకా వంటి అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి.
 
 ఎకానమీ
 
 కానమీకి సంబంధించి జాతీయ ఆదాయం, పన్నుల వ్యవస్థ, బ్యాంకింగ్ రంగం, అంతర్జాతీయ వాణిజ్యం, వ్యవసాయ-పారిశ్రామిక-సేవా రంగాలు తదితర అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. 2011 జనాభా లెక్కలపై పట్టు అవసరం. ఆర్థికాభివృద్ధిపై అధిక జనాభా ప్రభావాన్ని అయనం చేయాలి.  పంచవర్ష ప్రణాళికలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పట్టణీకరణ వంటి అంశాలు కూడా ముఖ్యమైనవి. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, డబ్ల్యూటీవో తదితర అంతర్జాతీయ సంస్థలతో భారత్ సంబంధాలు, ఇటీవలి పరిణామాలపై ప్రశ్నలు రావొచ్చు.పన్నుల వ్యవస్థకు సంబంధించి జీఎస్‌టీ (వస్తు, సేవల పన్ను) ముఖ్యమైన అంశం. దీనిపై తప్పనిసరిగా అవగాహన పెంపొందించుకోవాలి.అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి ద్వైపాక్షిక, నియమావళి ఆధారిత బహుళ వాణిజ్య ఒప్పందాలను అధ్యయనం చేయాలి.
 
 ఎకానమీ మాదిరి ప్రశ్నలు
  1.    Tripartite Free Trade is a proposed African Free Trade Agreement between
     1) Common Market for Eastern and Southern Africa
     2) Southern African Development community
     3) East African Community
     (Select the correct answer using the codes given below)
     a) 1 only         b) 1 and 2
     c) 2 and 3     d) 1, 2 and 3
 2.    When the demand for money is infinitely interest elastic, the effectiveness of an expansionary monetary policy is?
     a) The highest     b) Moderate
     c) Very low    d) Nil
 3.    Which of the following has operationalized the overnight Liquid tansaction facility on its web based mutual fund service system platform on 22nd June 2015?
     a) New York Stock exchange
     b) London stock exchange
     c) National stock exchange
     d) Japan Exchange Group
 4.    Which one of the following pairs is not correctly matched in the Indian context?
     a) Cash reserve ratio: Monetary policy
     b) Non-performing assets: Profitability of commercial banks
     c) Market-determined rate of interest: Post office deposits
     d) Minimum support price: Agricultural cost and price commission
 5.    Global Economic Prospects (GEP) report is published by?
     a) IMF        b) World Bank
     c) World Trade Organization
     d) UNCTAD

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement