ర్యాంక్ సాధించిన సూర్యతేజకు కేక్ తినిపిస్తున్న తల్లి సంధ్యారాణి
సివిల్స్ ర్యాంక్ సాధించేందుకు ఎంతో కష్టపడ్డాడు. తనకు స్టడీ హాల్‌కు వెళ్లి చదవటం అంటే ఇష్టం. రోజు ఉదయం 8 గంటలకు వెళ్లి రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చేవాడు. ఇంటిలో కన్నా స్టడీ హాల్‌లోనే గత మూడు నాలుగేళ్లుగా గడిపాడు. తనకు చదువే ప్రపంచం, ఇతర విషయాలపై ఏమాత్రం దృష్టిపెట్టేవాడు కాదు.
సాక్షి, అమరావతి బ్యూరో: సివిల్స్‌లో మంచి ర్యాంక్ సాధించి ఐఏఎస్ అవ్వటమే వాడి ఆశయం, అది నేడు సాకరమైంది... నిజాయతీ గల ఆధికారిగా ప్రజలకు మెరుగైన సేవలు అందించి వారి గుండెల్లో నిలిచిపోవాలన్నదే నా కల, భగవంతుడి దయ, తన పట్టుదలతో అది నెరవేరుతుందని బలంగా విశ్వసిస్తున్నాను...’ అంటూ మంగళవారం విడుదలైన ఇండియన్ సివిల్స్ 2019 ఫలితాల్లో ఆలిండియా 76వ ర్యాంక్ సాధించిన గుంటూరు నగరానికి చెందిన మల్లవరపు సూర్యతేజ తల్లి సంధ్యారాణి “సాక్షి’తో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఆమె మాటల్లో... సివిల్స్‌లో మంచి ర్యాంక్‌లో సాధించాలనే నా కుమారుడి కల నెరవేరింది. నాకు చాలా ఆనందంగా ఉంది. తన కలను సాకారం చేసుకోవటానికి ఎంతో కష్టపడ్డాడు. దానికి నేడు ప్రతిఫలం దక్కింది. వాళ్ల నాన్నగారు 2014లో ఆనారోగ్య కారణాల వల్ల మరణించారు. ఆ ప్రభావం తన లక్ష్యం పైన పడకుండా జాగ్రత్తపడ్డాను. సూర్యతేజ పాఠశాల విద్య గుంటూరు నగరంలోనే సాగింది.
చదువే ప్రపంచం...
సివిల్స్ ర్యాంక్ సాధించేందుకు ఎంతో కష్టపడ్డాడు. తనకు స్టడీ హాల్‌కు వెళ్లి చదవటం అంటే ఇష్టం. రోజు ఉదయం 8 గంటలకు వెళ్లి రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చేవాడు. ఇంటిలో కన్నా స్టడీ హాల్‌లోనే గత మూడు నాలుగేళ్లుగా గడిపాడు. తనకు చదువే ప్రపంచం, ఇతర విషయాలపై ఏమాత్రం దృష్టిపెట్టేవాడు కాదు.
Comments
Please login to add a commentAdd a comment