సివిల్స్‌రిజర్వ్‌ జాబితాలోని 53 మందికి సర్వీస్‌ | UPSC Releases New List Of Candidates To Fill Up Vacant Posts | Sakshi
Sakshi News home page

సివిల్స్‌రిజర్వ్‌ జాబితాలోని 53 మందికి సర్వీస్‌

Published Sat, Oct 12 2019 2:39 AM | Last Updated on Sat, Oct 12 2019 2:39 AM

UPSC Releases New List Of Candidates To Fill Up Vacant Posts - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సివిల్స్‌ ఫలితాల్లోని రిజర్వ్‌ జాబితా ప్రతిభా క్రమంలో మరో 53 మందిని అఖిల భారత సర్వీస్‌కు ఎంపిక చేస్తూ యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) తాజాగా నిర్ణయం తీసుకుంది. సివిల్స్‌–2018 పరీక్షా ఫలితాలను యూïపీఎస్సీ ఈ ఏడాది ఏప్రిల్‌ ఐదవ తేదీన ప్రకటించడం తెలిసిందే. అందులో 759 మంది అభ్యర్థులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, సెంట్రల్‌ సర్వీసెస్‌ గ్రూప్‌–ఏ, గ్రూప్‌–బీ  పోస్టులకు ఎంపికయ్యారు. సివిల్‌ సర్వీస్‌ పరీక్షల నిబంధనల ప్రకారం రిజర్వ్‌ లిస్ట్‌ కూడా అందుబాటులో ఉంచుతారు. ఈ నేపథ్యంలో కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం (డీఓపీటీ) అవసరం కోసం యూపీఎస్సీ మరో 53 మందిని అఖిల భారత సర్వీసుకు సిఫారసు చేసింది. ఫలితాలను యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో కూడా పొందుపరిచారు. ఈ 53 మందిలో పలువురు తెలుగు అభ్యర్థులు కూడా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement